29, మార్చి 2024, శుక్రవారం

పద్యాలని

 ఈ క్రింది పద్యాలని చూడండి


కం.

కలిపెడిది ఆవకాయట

కలిపించెడి వారు మామ గారట మరి నే

కలిపిన రుచికరమగు నట

కలుపగ వేరొండు గాయ కలుపగ నేలా

----------------------------------------

కం.

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

------------------------------------------------

కం.

ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

-------------------------------------------------

కం.

చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగు వాడు కాడోయ్!

---------------------------------------------

కం.

శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

-----------------------------------------------

కం.

ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!

--------------------------------------------

కం.

బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

------------------------------------------------

ఆవకాయ అవతరణ:


కం.

చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్

-----------------------------------------------------

ఆవకాయ ఇష్టం లేదని ఎవరైనా అంటే వానిని ఒక కవి ఏకంగా శపించేస్తున్నాడు చూడండి


కం.

ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!

--------------------------------------------------

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:


కం.

చెక్కందురు డిప్పందురు

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్

డొక్కందురుగ మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

-----------------------------------------

మరొక మంచి గేయ కవితని చూడండి.


ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది

మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది

మెంతికాయ మోజు పెంచేస్తుంది

తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది

కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది

బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది

పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది

పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది

------------------------------------------

చింతకాయ చింతించినా చూడరు

ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు

గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు

కొరివికారం కొరకొర చూసినా చలించరు

టమాటా టక్కుటమారాలు చేసినా పడరు

నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా

అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు

వంకాయ బండపచ్చడి బాధపడినా


నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా

దోసావకాయ దోరగా నవ్వినా

నారింజకారం కవ్వించినా 

కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా

పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా

క్యాబేజి పచ్చడి ఘుమఘుమలాడినా

కొబ్బరిపచ్చడి కూతపెట్టి పిలిచినా

బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా

కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా

వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా

వడగళ్ల జడివానలు కురుస్తున్నా

చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా

అన్ని ఋతువుల అమృతమనుచు

మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే

----------------------------------------------

అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ

ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా

కంటికింపుకాదు నోటికి రుచికాదు

మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

ఇంతటి మహత్తరమైన ఆవకాయని, ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలి పెట్ట గలమా! నిస్సందేహంగా వదలలేం.

-------------------------------------------------

పదార్థాలని తినేప్పుడు అందరూ ఆవకాయని నంజుకుని తిని ఆవకాయ రుచిని ఆస్వాదించండి. చక్కటి వరి బియ్యం అన్నంలో ఆవకాయని కలిపి కమ్మని ఆవు నేయితో నిజమైన ఆవకాయ రుచిని ఆస్వాదించండి.

Read and enjoy

 Doctor : Your Liver is enlarged

Patient : Does that mean it has space for more whisky ?

(This is called "Positive Thinking" 😄😄)


Lady to her dietician :- What l am worried about is my height and not my weight.

Doc :- How come???

Lady :- According to my weight, my height should be 7.8 feet... 😜

(Now this is called "Positive Attitude" 👍)


A Man wrote to the bank. "My Cheque was returned with remark 'Insufficient funds'. I want to know whether it refers to mine or the Bank".

(This is self confidence in its peak 😂😂)


A cockroach's last words to a man who wanted to kill it : "Go ahead and kill me, you coward. You're just jealous because I can scare your wife and you cannot..!!!!" 😅😅😅


Son : Why is 1st April celebrated as Fools Day?

Father : Because after paying all the taxes up to 31st March, we Start working for the government again from 1st April ...... 😅😂

*Best answer ever*


"Wife ask - why in all marriages girl sits on left side and boy on right side?

"Husband reply - According to profit and loss statement a/c all income is on right side and expenses are on left side".....


😄Happy March ending.😄😜

Panchaag


 

Joke






 

ఆహర విరుద్ధాలు -

 ఆహర విరుద్ధాలు -


 మనం భుజించే ఆహరం వరసగా 


 1.రసం .


 2.రక్తం .

 

 3.మాంసం .


 4.మేధస్సు (కొవ్వు ) .


 5. ఎముక .


 6. మజ్జా .


 7. వీర్యము. (ఆర్థవము ).


అనే 7 ధాతువులు గా రూపాంతరం చెందుతుంది. ఆహారం మనిషి నిత్య నూతనం గా శక్తివంతం గా ఉండేవిధంగా తోడ్పడుతుంది. ఇదే రెండు విరుద్ధ భావాలు గల ఆహారం తీసుకున్నప్పుడు అవి విషతుల్యం అయ్యి తీవ్రమయిన అనారోగ్యాన్ని కలిగించవచ్చు .ఒక్కోసారి విషమై మనిషి మరణానికి కారణం కావొచ్చు.


 * చేపలు తిన్న వెంటనే పాలు , పెరుగు తాగరాదు.ఎందుకంటే చలువ చేసే స్వభావం గల పాలు , వేడి చేసే స్వభావం గల చేపలు కలిపి తినడం వలన పరస్పర విరుద్ద స్వభావాలు గల ఆహారాల వలన రక్తం లొ దొషం ఏర్పడి చర్మ వ్యాధులు కలగజేస్తుంది.


 * మాంసం తేనే గానీ , నువ్వులుగాని బెల్లం గానీ , పాలు గానీ , మినుములు గానీ , ముల్లంగి గానీ , మొలకెత్తిన ధాన్యాలు గానీ కలిపి వాడ కూడదు . ఒకవేళ పొరపాటున గానీ , గ్రహపాటున గానీ తింటే ఆ వ్యక్తికీ చెముడు, దృష్టి మాంద్యము, వణుకు, మొదలయిన వ్యాధులు కాలక్రమేణ రావడం జరుగుతుంది.


 * ఆవ నూనే లొ వేయించిన పావురం మాంసం గానీ , తేనే , నెయ్యి సమంగా కలిపి ఎట్టి పరిస్థితులో భుజింప గూడదు . ఈ విరుద్ద ఆహరం వలన రక్తము చెడి ధమనుల యందు గ్రంధులు ఏర్పడతాయి. అపస్మారము , కణతలు యందు పోటు సంభవిస్తుంది.


 * వెల్లుల్లి, మునగ, తులసి మొదలయిన పదార్దాలు తినిన వెంటనే పాలు తాగకూడదు. అలా తాగితే కుష్టు వ్యాధి సంభవిస్తుంది.


 * నిమ్మ పండును తేనే , నెయ్యి కలిపి గానీ మినపపప్పు బెల్లం నెయ్యి లొ కలిపి గానీ ఉపయోగించ కూడదు . అలా ఉపయోగించడం వలన నపుసకత్వం ఏర్పడుతుంది .


 * మామిడి , దానిమ్మ,, నిమ్మ , అరటి, పుల్ల దబ్బకాయ , రేగిపండ్లు, నేరేడు, వెలగ, చింతపండు , అక్రోటు, పనస, కొబ్బరి కాయ , ఉసిరి ఇటువంటి యే పుల్లటి పదార్ధం అయినా పచ్చిగా ఉన్నప్పుడు గానీ , ఎండిన పిమ్మట గానీ పాలతో కలిపి ఉపయొగించ కూడదు .


 * పెసలు మినుములు , అనుములు, ఉలవలు, కొర్రలు, వరిగలు.ఈ పదార్ధాలను కుడా పాలతో కలిపి భుజించకుడదు .అలా భుజిస్తే శరీరం లొ వాతము విపరీతం గా ప్రకోపించి వాత వ్యాదులుని కలిగిస్తుంది.


 * బచ్చలి కూరలో నువ్వుల పిండి కలిపి తింటె వెంటనే అతిసార వ్యాది కలుగుతుంది.


 * కొంగ మాంసం , పంది మాంసం కలిపితింటే తిన్న వెంటనే ప్రాణాంతక విషం అవుతుంది.


 * ఉష్ణ శరీర స్వభావం కలవారు తమ శరీరం లొ ఉష్ణం అదికం గా ఉన్నప్పుడు తేనెను వేడి చేసి గాని వేడి వస్తువులతో కానీ తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లతుంది.


 * తేనే , నెయ్యి సమాన భాగాలుగా కలిపి ఎప్పుడు భుజించకుడదు . తెనే లొ సగబాగం నెయ్యి కానీ , నెయ్యి లొ సగబాగం తేనే కానీ కలిపి మాత్రమే తీసుకొవాలి . లేకపొతే రెండు అమృతాలు కలిసి " "అమృతం అమృతేన విషం " అన్నట్లుగా విరుద్దమై ప్రాణాలు తీస్తాయి.


 * తేనే ను కొంచం గోరువెచ్చని నీటితో తప్ప భాగా వేడిగా ఉన్న నీటితో కలిపి సేవిస్తే అది విష తుల్యం అవుతుంది.


       ఈ విధంగా మనం తినే ఆహర పదార్దాలలోనే , ఒక దానితో ఒకటి పడని పదార్దాలు చాలా ఉన్నాయి వాటిని మన మహర్షులు పరిశోధించి విరుద్ద గుణాలు గల ఆహార పదార్దాలు వాడవద్దు అని తమ తమ గ్రంథాలలో విపులం గా పేర్కొన్నారు.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం -‌ చతుర్థి - విశాఖ -‌‌ భృగు వాసరే* *(29-03-2024)* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

బృహష్పతి వాసరః గురువారం రాశి ఫలితాలు

 28-03-2024

బృహష్పతి వాసరః గురువారం 

రాశి ఫలితాలు

********

మేషం

అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

---------------------------------------

వృషభం

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

---------------------------------------

మిధునం

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు.

---------------------------------------

కర్కాటకం

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ధన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

సింహం

అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది.

---------------------------------------

కన్య

ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.

---------------------------------------

తుల

విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాల పరిష్కారదిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

వృశ్చికం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.

--------------------------------------

ధనస్సు

బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మకరం

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

కుంభం

నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

మీనం

ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

---------------------------------------

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2023(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

⚜ శ్రీ చొక్కనాధస్వామి గుడి

 🕉 మన గుడి : నెం 269


⚜ కర్నాటక  : బెంగళూరు


⚜ శ్రీ చొక్కనాధస్వామి గుడి



💠 కాస్మిక్ లేదా ప్రాణిక్ లేదా లైఫ్ ఎనర్జీ అనేది మన చర్యలన్నింటికీ ఆధారం.

పరిస్థితులు మరియు విధులకు మన ప్రతిచర్యలు అన్నీ దీనిపై ఆధారపడి ఉంటాయి. 

మన నిద్రలో, మనం పూర్తి నిశ్శబ్దంలో ఉన్నప్పుడు మరియు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శరీరం కొంత మొత్తంలో విశ్వ శక్తిని పొందుతుందని మీకు తెలుసా?  

జ్ఞానాన్ని పొందేందుకు, క్రమబద్ధమైన సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఈ ప్రాణిక శక్తి అవసరం.   ఈ జీవశక్తిని మనం ఎంతగా పొందితే అంతగా మన స్పృహను విస్తరించుకోగలుగుతాము.


💠 కొన్నిసార్లు మన స్వంత పెరట్లోని రత్నాలను కనుగొనడంలో విఫలమవుతాము. 

అటువంటి ప్రాణిక శక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ 

అందించే అపురూపమైన అలయమే బెంగళూరు డోములూర్ ప్రాంతంలో ఉన్న చొక్కనాధస్వామి గుడి.


💠 బెంగళూరు నగరంలోని డోమ్లూర్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం చొక్కనాథస్వామి లేదా చొక్కా పెరుమాళ్ అని పిలువబడే విష్ణువుకు అంకితం చేయబడింది.  

చోళ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో గర్భగుడిలో భూదేవి మరియు శ్రీదేవి సమేతంగా చొక్కనాథస్వామిగా పూజించబడ్డాడు.


💠 ఇది చోళ రాజుల కాలంలో తలైకాదుకు చెందిన తిరిపురాంతకన్ మరియు అతని భార్య చెట్టిచి పార్పతిచే నిర్మించబడిన బెంగుళూరులోని పురాతన దేవాలయంగా పరిగణించబడుతుంది.  

చొక్కనాథ అనేది శివునికి మరొక పేరు కానీ ఈ ఆలయంలో చొక్కా అంటే తెలుగులో అందమైనదని.

అందువల్ల, చొక్కనాథుడు విష్ణువును అందమైన భగవంతుడిగా సూచించడానికి ఉపయోగిస్తారు. 


💠 ఈ ఆలయంలో అనేక కన్నడ మరియు తమిళ శాసనాలు ఉన్నాయి, ఈ శాసనాల ఆధారంగా ఆలయం కనీసం 1200CE నాటిది.

ఆలయ శాసనాల ప్రకారం, ఆలయం ఉన్న డోమ్లూర్ ప్రాంతాన్ని పూర్వం తొంబలూర్ మరియు దేశిమాణిక్క పట్టణం అని పిలిచేవారు.


💠 పూర్వం ఒక మహర్షి చేసిన తపస్సు ఫలితంగా తూర్పు ముఖంగా ఉన్న చొక్కనాథ స్వామి ఆలయం నిర్మించబడింది. 

ఋషికి  విష్ణువు సూచనల ప్రకారం, ప్రజలు తమ చివరి క్షణాలలో భగవంతుని నామస్మరణను మరచిపోకూడదు, ఇది వాస్తవానికి దేవుని పాదాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.

ఇక్కడికి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వివాహం, ఆరోగ్యం, పిల్లలు, విద్య, శ్రేయస్సు మరియు ఉద్యోగ సమస్యల కోసం ప్రార్థిస్తారు.


💠ఈ ఆలయంలో గర్భగుడిలోని విగ్రహం ఎత్తులో ప్రతిష్టించబడి, అది విశ్వశక్తిని స్వీకరించి ఎనిమిది దిక్కులకూ ప్రసరిస్తుంది.  ఉత్తరాయణం మరియు దక్షిణాయణంలో కొన్ని రోజులలో సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు ప్రధాన దేవతపై పడేలా విగ్రహాన్ని ఉంచడం జరుగుతుంది.


💠 బెంగుళూరులో ప్రాణిక్ ఎనర్జీ పాయింట్స్‌తో అన్ని దిశలలో హీలింగ్ ఎనర్జీని ప్రసరింపజేసే మొదటి ఆలయం ఇది. 

చతురస్రం లోపల నిలబడి, మందిరానికి అభిముఖంగా ఉండి, ఈ పాయింట్ల వద్ద విశ్వశక్తిని అనుభవించడానికి మరియు ప్రయోజనం పొందడానికి కనీసం 2 నిమిషాలు ప్రార్థించాలని నమ్ముతారు.  

10 సంవత్సరాల క్రితం రిటైర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ పాయింట్లను కనుగొన్నారు.  


💠 ఆలయంలోని విష్ణువు, శ్రీదేవి మరియు భూదేవి దేవతలను నేపాల్‌లోని గండకీ నది నుండి తీసుకువచ్చిన శాలిగ్రామ శిలాల నుండి చెక్కారు.  

గర్భగుడి మరియు రెండు అర్ధమంటపాలను పక్కన పెడితే, దేవాలయంలోని ప్రతి ఇతర భాగం శతాబ్దాలుగా అనేక సార్లు పునర్నిర్మించబడింది మరియు అందువల్ల ఇప్పుడు చోళ నిర్మాణ శైలికి చాలా తక్కువ సారూప్యత ఉంది.  ఆలయ సముదాయంలోని ఇప్పుడు మూసివున్న భూగర్భ గదులు విలువైన వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగించబడ్డాయి.


💠 ఒక స్తంభంపై, భక్తులు విష్ణువు యొక్క దశావతారాలు (10 రూపాలు) అందంగా చెక్కబడి ఉండటాన్ని చూడవచ్చు. 


💠 12మంది ఆళ్వార్లలో ఒకరైన ఆండాళ్ రచించిన తిరుప్పావై ప్రతి సంవత్సరం ధనుర్మాస సమయంలో ఇక్కడ శ్రద్ధగా పాడతారు.  రామనవమి సందర్భంగా అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు పల్లకీ ఉత్సవాన్ని జరుపుకుంటారు.


💠 చొక్కనాథస్వామి ఆలయం దాని ప్రాణిక్ ఎనర్జీ పాయింట్లకు విస్తృతంగా ప్రసిద్ధి చెందింది.  రెండు ప్రాణిక్ ఎనర్జీ పాయింట్లు ఆలయం లోపల ఉండగా వాటిలో 12 ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

ప్రాంగణంలోని మచ్చలు తెల్లటి చతురస్రాలతో గుర్తించబడ్డాయి, ఇందులో భక్తుడు గుడి వైపు నిలబడి దేవుడిని ప్రార్థించాలి.

మనం నిద్రపోతున్నప్పుడు మనం పూర్తి నిశ్శబ్దం మరియు శాంతితో ఉన్నందున విశ్వశక్తి ప్రవాహాన్ని అందుకుంటాము.


💠 ఈ ప్రాణిక శక్తి మనకు జ్ఞానాన్ని పొందడంలో మరియు మన జీవితంలో క్రమశిక్షణను తీసుకురావడంలో సహాయపడుతుంది.  

ఈ ఆలయం సరిగ్గా అదే అందిస్తుంది.  

విగ్రహాల ముందు, మీకు కాస్మిక్ ఎనర్జీ పాయింట్లు ఉన్నాయి, అవి ధ్యాన బిందువు.  విగ్రహం అటువంటి దిశలో ఎత్తబడి ఉంటుంది, అది గరిష్ట మొత్తంలో సానుకూల ప్రాణిక్ శక్తిని ప్రసరిస్తుంది.

అంతర్యామి

 🔱 అంతర్యామి 🔱


# ప్రేమే దైవం 


🍁ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది.


వేదవాఙ్మయం అంతా ప్రేమనే ప్రబోధిస్తుంది. సకల జీవుల ఐక్యతకు ప్రేమే మూలమని పురాణాలు కూడా చెబుతున్నాయి. శ్రీరాముడు సర్వులనూ ప్రేమించాడు. వారితో అనుబంధం పెంచుకున్నాడు. పశుపక్ష్యాదులనూ ప్రేమించాడు. అలాగే శ్రీకృష్ణుడు నమ్మినవారందరినీ ఆదుకున్నాడు. గోవులనూ ప్రేమతో కాపాడి గోపాలుడయ్యాడు. ప్రేమ భగవత్ స్వరూపం. ఆ ప్రేమ ఆధ్యాత్మిక జీవన ప్రస్థానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. నిస్వార్ధ సేవకు దారి చూపుతుంది. పరస్పర సహకారానికి పునాది వేస్తుంది. మనుషుల మధ్య సఖ్యతకు రెండక్షరాల ప్రేమ వారధిగా నిలుస్తుంది


🍁నిజానికి మనిషిని మనిషిగా చూసేదే అసలైన ప్రేమ ప్రేమ నిండిన ఒక మాట గాయపడిన హృదయానికి సాంత్వన కలిగిస్తుంది. నిరాశ నిండిన మనసులో ఆశలు రేకెత్తిస్తుంది. ఆర్థిక సంబంధాలు, కులమతాలు, బాహ్యసౌందర్యం, ఆడంబరాలు... ఇలా దేనితోనూ సంబంధం లేకుండా. ఇచ్చిపుచ్చుకొనేదే నిజమైన ప్రేమ. అందుకే ప్రేమను పొందడం కాదు, ఆ ప్రేమను ఇతరులకు పంచాలి.


🍁స్వచ్ఛమైన ప్రేమంటే ఎదుటివ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు వ్యక్తీకరించేది కాదు. ఆ వ్యక్తి కష్టాల్లో, బాధలలో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వగలగాలి. అదే మనిషికి కొండంత ఓదార్పున వి ఇస్తుంది. అందువల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా: అండగా ఉండేవారే స్వచ్చమైన ప్రేమను అందించే నిజాయతీపరులు. వారే అసలైన ప్రేమికులు. మనిషి ఆనందంగా, సజావుగా మనుగడ సాగించాలకున్నప్పుడు అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదు. మూగజీవుల పట్ల దయతో వ్యవహరించాలి. వాటికి ఆహారం పెట్టి. వాటి దాహార్తిని తీర్చాలి. అప్పుడే మనల్ని ప్రేమించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.


🍁పసిపాపలోని వెల్లివిరిసిన అమాయకమైన ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ప్రేమను మనం ఎదుటివారిపై చూపించగలిగితే ఈ మాయా మోహా జగత్తులో అజాతశత్రువులుగా మనగలుగుతాం. ప్రేమ జీవననావకు ఓ చక్కని చుక్కాని కాగలదు అంటారు పెద్దలు.


🍁ప్రేమ ఆధ్యాత్మికతలో ఓ అత్యున్నత స్థితి. ఈ స్థితిని పొందినవారు తమకు అపకారం చేసినవారికి కూడా ఉపకారం చేసే విశాల హృదయం కలిగి ఉంటారు. వారికి ఈ ప్రపంచంలో అందరిపట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి. ప్రేమకు మరో రూపం దయాగుణం. బాధలలో ఉన్నవారిని కారుణ్యంతో ఆదుకుంటే అది వారి వేదనను దూరం చేస్తుందని బుద్ధుడు తన ం శిష్యురాలైన ఆమ్రపాలికి ఉపదేశిస్తాడు. ప్రేమంటే ఓ ప్రవాహం. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. చెట్టు తన కొమ్మలను నరికే వ్యక్తికైనా చల్లని నీడను ఇచ్చినట్లుగా, ఏదీ ఆశించకుండా పువ్వు పరిమళాలు అందించినట్లుగా మనిషి కూడా దూషణ, భూషణ, తిరస్కారాలు లెక్కచేయకుండా అందరికీ ప్రేమను పంచాలి. సర్వజీవుల్లోనూ దేవుడున్నాడనే సత్యాన్ని గ్రహించాలి. తన ప్రేమను తోటి జీవులకు,

మనుషులకు మాత్రమే పరిమితం చేయకుండా

పశుపక్ష్యాదులకూ ప్రేమను అందించాలి. ప్రేమే దైవి

దైవమే ప్రేమ అని విశ్వసించాలి.🙏


-✍️ జై శ్రీ రామ్

కంచెర్ల వెంకట రమణ 


⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️

శ్రీ రామ జయ రామ జయజయ రామ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీ గరుడ పురాణము

 శ్రీ గరుడ పురాణము (132)


జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు, ముహూర్తాల వర్ణన


ముందుగా నక్షత్రాల కుండే దేవతల పేర్లను తెలుసుకుందాం.


కృత్తిక - అగ్ని

రోహిణి - బ్రహ్మ

మృగశిర - చంద్రుడు

ఆర్ధ్ర - రుద్రుడు

పునర్వసు - ఆదిత్య

పుష్య - తిష్యుడు

ఆశ్లేష - సర్పుడు

మఘ - పితృగణాలు

పూర్వఫల్గుని - భగుడు

ఉత్తరఫల్గుని - అర్యముడు

హస్త - సవిత

చిత్ర - త్వష్ట

స్వాతి - వాయువు

విశాఖ - ఇంద్రాగ్నులు

అనురాధ - మిత్రుడు

జ్యేష్ఠ - ఇంద్రుడు

మూల - నిరృతి

పూర్వాషాఢ - శివుడు

ఉత్తరాషాఢ - విశ్వేదేవులు

అభిజిత్ - బ్రహ్మ

శ్రావణ - విష్ణు

ధనిష్ఠ - వసువులు

శతభిష - వరుణుడు

పూర్వాభాద్ర - అజపాదుడు

ఉత్తరాభాద్ర - అహిర్బుధ్ని

రేవతి - పూష

అశ్వని - అశ్వనీకుమారులు

భరణి - యమధర్మరాజు

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*29-03-2024 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి వాహన వ్యాపారస్తులకు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది.

---------------------------------------

వృషభం


స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఉంటాయి ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి.

---------------------------------------

కర్కాటకం


ఆకస్మిక ధన లాభం. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి.

---------------------------------------

సింహం


ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు. వృత్తి వ్యాపారాలలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.

---------------------------------------

కన్య


చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

తుల


సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపార విస్తరణలో పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

---------------------------------------

వృశ్చికం


బంధు మిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో విభేదాలు కలుగుతాయి. 

---------------------------------------

ధనస్సు


దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహమున సోదరుల వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------

మకరం


బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తికావు. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు విఫలమవుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కుంభం


చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి లభిస్తుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

సాక్షియగుచున్నాడు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో|| 

*ఆత్మైవ హ్యాత్మనో బన్ధుః*

*ఆత్మైవ రిపురాత్మనఃl*

*ఆత్మైవ హ్యాత్మనః సాక్షీ*

*కృతస్యాపకృతస్య చll*


                      ~మహాభారతమ్


తా|| "మంచిపని చేసినా, చెడ్డపని చేసినా మానవుడు తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తనకు తానే సాక్షియగుచున్నాడు.

( *కావున శుభములుకోరు మానవుడు సత్కర్మలనే ఆచరించాలి* )

అప్పిచ్చు వాడు

 🤔🤔🤔👏👏👏👍👍👍🤣🤣🤣


అప్పిచ్చు వాడు వైద్యుడు!

కాఫీ కప్పిచ్చు వాడు సర్వరుడు!

తిని టిప్పిచ్చు వాడు కస్టమరుడు!

కరీం బీడీకి నిప్పిచ్చు వాడు నిజమగు మిత్రుడు!

బాకీ తీర్చక తిప్పిచ్చువాడు బతక నేర్చినవాడు!

వండి పెళ్ళామును మెప్పిచ్చు వాడు అసలు మొగుడు!

మామిడికాయ పప్పులో ఇంగువ గుప్పిచ్చు వాడు గొప్ప వంటగాడు! 

ముప్పూటా స్విగ్గీ తెప్పిచ్చువాడు భార్యా బాధితుడు!

ఇంట్లో ఉండీ లేడని చెప్పిచ్చువాడు దేశ ముదురుడు!

పాటకు లిప్పిచ్చు వాడు కథానాయకుడు!                       

పోస్టులందు హాస్యము చొప్పిచ్చువాడు మేటి రాతగాడు!

ప్రేయసి మనసు నొప్పిచ్చువాడు ఆధునిక ప్రియుడు!

ప్రియురాలిని ఒప్పిచ్చువాడు పాత కాలపు ప్రేమికుడు!

అపద తప్పిచ్చు వాడు భగవంతుడు!

కాలము తీరినంత పైకి రప్పిచ్చు వాడు యమకింకరుడు, 

కదరా సుమతీ! 😳


*(వెంకటాద్రి ఆధునిక తవికావళి)*

*సేకరణ: మన ఆత్మీయ సభ్యులు శ్రీ జె. శశిమోహన్ గారి పోస్టు.*

అద్భుతమైన జీవితాన్ని

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹. *పాఠశాల పేరు: *LIFE*

*(మనందరి జీవితం)*

😁😆🤣😁😆🤣😁


 తరగతి: *40వ తరగతి*

  *(విద్యార్థులందరూ 40 ఏళ్లు పైబడిన వారే)*


 *కోపం* - ప్రెజెంట్ సార్

 *EGO* - ప్రెజెంట్ సార్

 *ఈర్ష*- ప్రజెంట్ సార్

 *ద్వేషం*-ప్రజెంట్ సార్

 *పోరాటం* - ప్రెజెంట్ సార్

 *అసూయ* - ప్రెజెంట్ సార్

 *రిగ్రెట్* - ప్రెజెంట్ సార్

 *ఆందోళన* - ప్రెజెంట్ సార్

 *విసుగు* - ప్రెజెంట్ సార్

 *కోరికలు* - ప్రెజెంట్ సార్

 *కోరికలు చంపబడ్డాయి* - ప్రెజెంట్ సార్

 *నిరాశ* - ప్రెజెంట్ సార్

 *చికాకు* - ప్రెజెంట్ సార్

 *నెలవారీ EMI* - ప్రస్తుతం సార్

 *ఆఫీస్ టెన్షన్* - ప్రెజెంట్ సార్

 *ఫ్యూచర్ టెన్షన్* - ప్రెజెంట్ సార్

 *సమస్య* - ప్రెజెంట్ సార్

 *హర్డిల్స్* - ప్రెజెంట్ సార్

 *వర్రీస్* - ప్రెజెంట్ సార్

 *సమస్యలు* - ప్రెజెంట్ సార్

 *అనిశ్చితాలు* - ప్రెజెంట్ సార్

 *విమర్శ* - ప్రెజెంట్ సార్

 *అత్యాశ* - ప్రెజెంట్ సార్

 *అహంకారం* - ప్రెజెంట్ సార్

 *హాఫ్ నాలెడ్జ్* - ప్రెజెంట్ సార్

 *సంతోషం* -

 ??? ( నిశ్శబ్దం)

 *సంతోషం* -

 ???

 *సంతోషం* - గైర్హాజరు సార్

 *మనశ్శాంతి* - గైర్హాజరు సార్

 *కంటెంట్‌మెంట్* - గైర్హాజరు సార్

 *పూర్తి జ్ఞానం* - గైర్హాజరు సార్

 *విస్డమ్* -

 దారిలో సార్

 *ప్రేమ* - నిద్రపోతున్నాను సార్

 *ఆశ* - వదిలేస్తున్నాను సార్

 *హుషారు*- రావడం లేదు సార్

 *ఉత్సాహం*- ఉండడం లేదు సార్ 

 *ఓర్పు* - పోయింది సార్

 *ఉదారత* - పోగొట్టుకున్నాను సార్

 *నిజాయితీ* - లాస్ట్ సర్

 *కృతజ్ఞత* - లేదు సర్

 *నమ్మకం* - పోయింది సర్

 *విధేయత* - లాస్ట్ సర్


 ప్రతికూల గుణాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి & సానుకూలమైనవి ఎందుకు లేవు?


 *క్లాస్ టీచర్:* - "ఎందుకంటే జీవితం యొక్క ఉద్దేశ్యం ఎప్పటికీ ఉండదు. అది నిర్ణయించబడిన వెంటనే, మార్గంలో ముళ్ళు గులాబీల రేకులుగా మారుతాయి."


 జీవితం జీవించడం చాలా సులభం, కానీ చాలామంది సాదాసీదాగా ఉండటాన్ని కష్టతరం చేస్తారు.


 " *టేక్* *ఇట్* *ఈజీ* *మేక్* *ఇట్* *ఈజీ*. .

*సేకరణ:- శ్రీ కె.వి. రమణ మూర్తి గారి పోస్ట్.*

 *అద్భుతమైన జీవితాన్ని గడపండి.😁😂😂😂

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 110*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 34*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*హోమ విధి - అగ్ని కార్య కథనము - 4*


పిమ్మట అర్ఘ్యజలముతో ఈ రేఖలను కడిగి యోనిముద్ర చూపవలెను. అగ్నిని ఆత్మరూపముగా భావించుచు యోనియుక్త మగు కుంమునందు స్థాపింపవలెను. పిమ్మట దర్బ-సృకో-స్రువాదులతో కూడ పాత్రాసాదనము చేయవలెను. బాహుప్రమాణము గల పరిధులు, ఇధ్మవ్రశ్చనము, ప్రణీతాపాత్రము, ప్రోక్షణీపాత్రము, ఆట స్థాలి, ఆజ్యము, రెండు రెండు ప్రస్థముల బియ్యము; లధోముఖములగా నున్న సృకస్రువములు. ప్రణీతయుందును, ప్రోక్షణియందును పూర్వాగ్రముగ కుశ లుంచవలెను. 


ప్రణీతను నీటితో నింపి, భగవద్థ్యానము చేపి, దానిని అగ్నికి పశ్చిమమున, తన ఎదుట, సమకూర్చిన ద్రవ్యముల మధ్య ఉంచవలెను. ప్రేక్షణిని నీటితో నింపి పూజానంతరము కుడి వైపున ఉంచవలెను. చరువును అగ్నిపై ఉంచి ఉడికించవలెను. అగ్నికి దక్షీణమున బ్రహ్మను స్థాపింపవలెను. అగ్నికుండమునకు లేదా వేదికి, నాలుగు ప్రక్కల, పూర్వాది దిక్కులందు బర్హిస్సు పరిచి పరిధులను ఉంచవలెను. 


పిమ్మట గర్భాధానాది సంస్కారముల ద్వారా అగ్నికి వైష్ణవీకరణము చేయవలెను, గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము మొదలు సమావర్తనము వరకు నున్న సంస్కారములు చేసి ఒక్కొక్క కర్మకు ఎనిమిదేసి ఆహుతుల నివ్వవలెను. స్రువతో కూడిన సృక్కుతో పూర్ణాహుతి ఇవ్వవలెను.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

శతరుద్రీయము-24*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శతరుద్రీయము-24*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ద్వితీయానువాకము - 6వ యజుస్సు*


*నమకనామాని : ఓం క్షేత్రాణాంపతయే నమః*


*నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః !*


సంసారమునకు మూలకారకుడును మరియు దానికి అంతమును కలుగజేయు వానికి నమస్కారము, జగత్తును రక్షించు ప్రభువునకు నమస్కారము.

 

*వివరణ :*

*భవస్యహేతి: 🔱*


*1. భవము అనగా ప్రేయోమార్గము* (సంసారము)♪. తిరిగి తిరిగి మనలను ఇక్కడకు ఈడ్చేటువంటి శక్తి♪. దానిని తొలగించువాడు ఈశ్వరుడు♪. 


భాగవతంలో ఒకచోట *“తం భ్రంశయామి సంపద్భ్యో యస్య చేచ్ఛా మ్యనుగ్రహమ్”* అని చెబుతారు♪. అనగా ఎవరు తన అనుగ్రహాన్ని కోరతారో వారి సంపదలను భ్రంశము చేయడం ద్వారా వారిని ముక్తి మార్గంవైపు నడిపిస్తాను అని♪.


హేతి అంటే ఆశ అని మనం ఇదివరకు తిరిగి గుర్తుతెచ్చుకుంటే ఇక్కడ ఆయన శ్రేయోమార్గమునకు లక్ష్యముగా మారి ప్రేయోమార్గమందలి మన బంధనాలను ఛేదించుతాడు♪.


మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు!

మామేవైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే!!

                     -భగవద్గీత 18-65 


మనస్సు నాలో ఉంచు! నా భక్తుడివి కా! నన్ను ఆరాధించు! నాకు నమస్కరించు. నన్నే పొందుతావు. ఇది సత్యం. నీవు నాకు ప్రియుడివి. నీకు ప్రతిజ్ఞచేసి చెబుతున్నాను♪.


నమస్కారమునకు భగవానుడు ఎంత విలువనిచ్చాడో మనకు పై శ్లోకంలోని మొదటి పాదం చెబుతుంది♪. భగవద్గీత మొత్తంలో *“మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు”* అన్న పాదం మొత్తమూ రెండుసార్లు పునరుక్తి అయింది♪. 

                            -- (9-34, 18-65).


ఇచ్చట అర్జునునితో తనకు నమస్కరించమన్నట్లుగా (నమస్కురు) పరమాత్మ ఉపదేశించారు♪. పైగా సత్యమన్నట్లుగా నొక్కి పలికారు♪. 


ఇక్కడ సాధకుడు చేస్తున్నది అదే. *"భవస్య హేత్యై నమః”* అనగా “స్వామీ! నిస్సహాయతకు లోనయి ఈ సంసార వృక్షమందు చిక్కుపడి వున్నాను, నీకు నమస్కరించుచున్నాను” అని అర్థం♪.


*2. జగతాం పతయే నమః : 🔱*


జగత్తు అనగా నిరంతరం కదిలేది (గచ్ఛతి) అని స్థావరజంగమాత్మకమైనది అని అర్థములు వస్తాయి♪. సంసారము అనేది ప్రపంచము వున్నప్పుడే సాధ్యమవుతుంది. ఆ సంసారమును ఛేదించు అస్త్రముగా ఆయన వున్నాడు♪. ఇది ఈ మనుష్య లోకమునకు సంబంధించిన విషయము♪. 


కానీ, మనం పురాణాలు చదువుతూ వుంటే దేవతలకు కూడా కష్టములు వస్తాయన్నట్లుగానూ వారిని రక్షించువాడు ఈశ్వరుడే అన్నట్లుగానూ మనకు అర్థమవుతుంది♪. కాబట్టి ఇక్కడ తననూ, దేవతలనుగూడా రక్షించు స్వామిగా సాధకుడు ప్రార్థన చేస్తున్నాడు♪.


(రేపు....... 7 వ యజుస్సు                              


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

యోగవాసిష్ఠ రత్నాకరము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *హరి ఓం*

 *ఓం శ్రీ మహాగణాధిపతయే నమః* 

*ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః* 

*ఓం నమో వసిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః*

 

. *🌹యోగవాసిష్ఠ రత్నాకరము🌹* 

*వైరాగ్య ప్రకరణము - 1వ అధ్యాయము* 

. *🌹రాఘవ వైరాగ్య వర్ణనము🌹*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

. *శ్రీ వాల్మీకి రువాచ :-*

0023 


*1-59*

*ఆర్ద్రాంత్ర తంత్రీ గహనో వికారీ పరిపాతవాన్‌* 

*దేహః స్ఫురతి సంసారే పోఽ పి దుఃఖాయ కేవలమ్‌* 


తడిసిన ప్రేగులు, నాడులచే భయంకరమైనదియు, అనేక వికారములతో గూడినదియు, క్షణభంగురము నగు దేహ మెయ్యది యీ ప్రపంచమున స్ఫురించుచున్నదో, అదియు కేవలము దుఃఖము కొరకే యగును.


*1-60*

*తాత సంతరణౌర్థేన గృహీతాయాం పునః పునః* *నావిదేహలతాయాం చ కస్య స్వాదాత్మభావనా*


మునీంద్రా! సంసారమను సముద్రమును దాటుటకై మరల మరల గ్రహింపబడినటువంటి ఈ దేహమను నౌకయం దెవనికి ఆత్మ భావన యుండగలదు? (దేహము ఆత్మ (తాను) కాదనుట). 


*1-61*

*మాంసస్నాయ్వస్థివలితే శరీరపటహేఽ దృఢే* *మార్జారవదహం తాత తిష్ఠామ్యత్ర గతధ్వనౌ* 


మాహాత్మా! చినిగి, డొల్లపడి, ధ్వనింపని డోలునందున్న పిల్లివలె - నేను మాంసము, 

నరములు,ఎముకలచే నిర్మింపబడిన అదృఢ శరీరమునందున్నాను. ఇద్దానినుండి బయటపడు ఉపాయవాక్యమును వినే వీలు కలుగుటలేదు.


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 71-72*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।*

*నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 71 ।।*


*భావము:* 

ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి, అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.

 

. 🍂🍃🍂🍃


*ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।*

*స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ।। 72 ।।*

 

*భావము:* 

ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి, జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది, ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వాదం

 వేద ఆశీర్వాదం.