29, మార్చి 2024, శుక్రవారం

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 110*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 34*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*హోమ విధి - అగ్ని కార్య కథనము - 4*


పిమ్మట అర్ఘ్యజలముతో ఈ రేఖలను కడిగి యోనిముద్ర చూపవలెను. అగ్నిని ఆత్మరూపముగా భావించుచు యోనియుక్త మగు కుంమునందు స్థాపింపవలెను. పిమ్మట దర్బ-సృకో-స్రువాదులతో కూడ పాత్రాసాదనము చేయవలెను. బాహుప్రమాణము గల పరిధులు, ఇధ్మవ్రశ్చనము, ప్రణీతాపాత్రము, ప్రోక్షణీపాత్రము, ఆట స్థాలి, ఆజ్యము, రెండు రెండు ప్రస్థముల బియ్యము; లధోముఖములగా నున్న సృకస్రువములు. ప్రణీతయుందును, ప్రోక్షణియందును పూర్వాగ్రముగ కుశ లుంచవలెను. 


ప్రణీతను నీటితో నింపి, భగవద్థ్యానము చేపి, దానిని అగ్నికి పశ్చిమమున, తన ఎదుట, సమకూర్చిన ద్రవ్యముల మధ్య ఉంచవలెను. ప్రేక్షణిని నీటితో నింపి పూజానంతరము కుడి వైపున ఉంచవలెను. చరువును అగ్నిపై ఉంచి ఉడికించవలెను. అగ్నికి దక్షీణమున బ్రహ్మను స్థాపింపవలెను. అగ్నికుండమునకు లేదా వేదికి, నాలుగు ప్రక్కల, పూర్వాది దిక్కులందు బర్హిస్సు పరిచి పరిధులను ఉంచవలెను. 


పిమ్మట గర్భాధానాది సంస్కారముల ద్వారా అగ్నికి వైష్ణవీకరణము చేయవలెను, గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము మొదలు సమావర్తనము వరకు నున్న సంస్కారములు చేసి ఒక్కొక్క కర్మకు ఎనిమిదేసి ఆహుతుల నివ్వవలెను. స్రువతో కూడిన సృక్కుతో పూర్ణాహుతి ఇవ్వవలెను.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: