29, మార్చి 2024, శుక్రవారం

శతరుద్రీయము-24*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శతరుద్రీయము-24*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ద్వితీయానువాకము - 6వ యజుస్సు*


*నమకనామాని : ఓం క్షేత్రాణాంపతయే నమః*


*నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః !*


సంసారమునకు మూలకారకుడును మరియు దానికి అంతమును కలుగజేయు వానికి నమస్కారము, జగత్తును రక్షించు ప్రభువునకు నమస్కారము.

 

*వివరణ :*

*భవస్యహేతి: 🔱*


*1. భవము అనగా ప్రేయోమార్గము* (సంసారము)♪. తిరిగి తిరిగి మనలను ఇక్కడకు ఈడ్చేటువంటి శక్తి♪. దానిని తొలగించువాడు ఈశ్వరుడు♪. 


భాగవతంలో ఒకచోట *“తం భ్రంశయామి సంపద్భ్యో యస్య చేచ్ఛా మ్యనుగ్రహమ్”* అని చెబుతారు♪. అనగా ఎవరు తన అనుగ్రహాన్ని కోరతారో వారి సంపదలను భ్రంశము చేయడం ద్వారా వారిని ముక్తి మార్గంవైపు నడిపిస్తాను అని♪.


హేతి అంటే ఆశ అని మనం ఇదివరకు తిరిగి గుర్తుతెచ్చుకుంటే ఇక్కడ ఆయన శ్రేయోమార్గమునకు లక్ష్యముగా మారి ప్రేయోమార్గమందలి మన బంధనాలను ఛేదించుతాడు♪.


మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు!

మామేవైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే!!

                     -భగవద్గీత 18-65 


మనస్సు నాలో ఉంచు! నా భక్తుడివి కా! నన్ను ఆరాధించు! నాకు నమస్కరించు. నన్నే పొందుతావు. ఇది సత్యం. నీవు నాకు ప్రియుడివి. నీకు ప్రతిజ్ఞచేసి చెబుతున్నాను♪.


నమస్కారమునకు భగవానుడు ఎంత విలువనిచ్చాడో మనకు పై శ్లోకంలోని మొదటి పాదం చెబుతుంది♪. భగవద్గీత మొత్తంలో *“మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు”* అన్న పాదం మొత్తమూ రెండుసార్లు పునరుక్తి అయింది♪. 

                            -- (9-34, 18-65).


ఇచ్చట అర్జునునితో తనకు నమస్కరించమన్నట్లుగా (నమస్కురు) పరమాత్మ ఉపదేశించారు♪. పైగా సత్యమన్నట్లుగా నొక్కి పలికారు♪. 


ఇక్కడ సాధకుడు చేస్తున్నది అదే. *"భవస్య హేత్యై నమః”* అనగా “స్వామీ! నిస్సహాయతకు లోనయి ఈ సంసార వృక్షమందు చిక్కుపడి వున్నాను, నీకు నమస్కరించుచున్నాను” అని అర్థం♪.


*2. జగతాం పతయే నమః : 🔱*


జగత్తు అనగా నిరంతరం కదిలేది (గచ్ఛతి) అని స్థావరజంగమాత్మకమైనది అని అర్థములు వస్తాయి♪. సంసారము అనేది ప్రపంచము వున్నప్పుడే సాధ్యమవుతుంది. ఆ సంసారమును ఛేదించు అస్త్రముగా ఆయన వున్నాడు♪. ఇది ఈ మనుష్య లోకమునకు సంబంధించిన విషయము♪. 


కానీ, మనం పురాణాలు చదువుతూ వుంటే దేవతలకు కూడా కష్టములు వస్తాయన్నట్లుగానూ వారిని రక్షించువాడు ఈశ్వరుడే అన్నట్లుగానూ మనకు అర్థమవుతుంది♪. కాబట్టి ఇక్కడ తననూ, దేవతలనుగూడా రక్షించు స్వామిగా సాధకుడు ప్రార్థన చేస్తున్నాడు♪.


(రేపు....... 7 వ యజుస్సు                              


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: