27, అక్టోబర్ 2020, మంగళవారం

ధర్మం నాలుగోపాదం

 🌷ధర్మం నాలుగోపాదం!🌷

    🪔🪔🪔🪔🪔🪔🪔


   రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని,  ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.

 

    రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని!  ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను.  కాఫీ  ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ  రెండువందల రూపాయల నోట్లే!

      'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.

 

     'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు.  అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.  

         అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు.  పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది.

 

     చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.

 

   "అదిగో. ఆ  తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని,  తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది.

    ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు. 

    "సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టే లోగా రైలు కదిలిపోతే... అప్పుడో?" నా చర్యని సమర్ధించుకుంటూ అన్నాను.

   "వాడికేం నష్టం ఉండదు.  మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా, చివరికి లాభాల్లోనే ఉంటాడు!" మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది.

    "అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి. 

    పాపం.. ట్రైయిన్ బయలుదేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!"

     అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు.

  "వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు  తగిలితే చాలు, ఆ రోజు గడిచిపోతుంది!" అంటూ చురచురా చూసింది. 

   నేనేం మాట్లాడలేదు.


       "అయినా వాడు మీలా సుభాషితాలు చదవలేదు లేండి!" అంటూ, ఆవిడ చుట్టూ చూసి ఇంకేం మాట్లాడ లేదు.  అప్పటికే అక్కడ అందరి చూపులూ మావేపే ఉన్నాయి.

      రైలు బాగా స్పీడ్ అందుకుంది.  అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది.   డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది. 

      మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే  నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో,  చాలా సార్లు నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను.

     మనుషుల్లో మంచితనం చూడాలి.  వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం!

        మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి, అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్  గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలాసార్లు ఓడిపోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడలలేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది.

 

        "పోనీలెద్దూ, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మీద్దెలు కట్టెస్తారా?" అ‌ని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను.

    ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు.

     నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలుపెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్ని  చూస్తూ కూర్చున్నాను.

        అప్పటికే తోటి ప్రయాణీకులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు. కొందరు నన్నో వెర్రివాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తున్నారు.* *'ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగుతుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేకపోలేదు.

    రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను.

 


🌷"సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?"  ఆ మాట వినేసరికి ఇటు చూసాను.  జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు. 

   ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు. అతను మధ్యవయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది.

         "అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలుదేరి పోయింది! కాని నీ దగ్గర మేం కాఫీ తీసుకోలేదే!"  

   నిజాయితీగా అన్నాను.*

        "అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?"* *మరొకసారి అదే ప్రశ్న అడిగాడు.

         "అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!"

       "అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయకూడదు కదా, అందుకే మరోసారి అడిగాను!"  అంటూ, జేబులో నుంచి డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు. 

"నువ్వూ..."

"వాళ్ళబ్బాయినండీ!'

      ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయినట్టుంది..

     "రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి.‌ తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది.  అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు పోన్లో చెపుతారండి.  

      వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో  స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి.* *అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా నాన్న!"

    ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది.

     నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది.

"చదువుకుంటున్నావా?" అడిగాను.

"టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా నాన్నకు సాయం చేస్తాడండి, మధ్యాహ్నం నేనుంటానండి!"

ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది.

"ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?"  అంటూ అడిగాను.

నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను.

     "తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండువందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు.  నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు.  చాలా సంతోషం!" అతడ్ని అభినందిస్తూ అన్నాను.

       "పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను. అప్పట్లో  నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు, పుస్తకాల్లో కూడా అలాంటివే  ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను.  అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందుల్లేకుండా నడుపుతున్నాయి!"

      ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది.  అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను.

   " అయితే ఒక్క విషయం బాబూ!" అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి.."చెప్పండి!" అంటూ మళ్ళీ అతని మాటలమీద దృష్టి సారించాను.

      "మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటివేవీ లేవు!  అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను. అంతే బాబూ!" అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి, మరోసారి అభినందించి,  అబ్బాయి బుజం తట్టెను.

 

  ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు. 

 

         ‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!

*****

         🙏🪔ధర్మో రక్షతి రక్షితః🪔🙏


శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆విజయవాడ🏹7799797799

పక్షితీర్థం


 *🌹పక్షితీర్థం తమిళనాడు కు చెందిన ఒక పుణ్యక్షేత్రం🌹*



 

🕉️🔔🕉️🔔🕉️🔔




 పక్షితీర్థం చెంగల్పట్టు నందు కలదు. ఇక్కడ గల కొండపైకి ప్రతి రోజు రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళుతుంటాయి.


కృత యుగములో ఒకసారి సర్వ సంగ పరిత్యాగులైన ఎనిమిది మంది మహామునులకు ప్రపంచ భోగములను అనుభవించవలెననే కోరిక కలిగింది. ఇక్కడ వెలసిన కొండపై తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. వారు నిజము చెప్పడానికి తటపటాయిస్తూ మాకు మీ సేవయే కావాల న్నారు. కానీ శివుడు వారి మనసులందు కోరిక గమనించి ఎనిమిది మందినీ ఎనిమిది పక్షులై జన్మించ మన్నాడు. ఒక్కొక్క యుగము నందు ఇద్దరు రెండు పక్షాల చొప్పున ప్రతి రోజూ గంగా స్నానము ఆచరించి తన ప్రసాదాన్ని తినిపోతూ ఉండమన్నాడు.ఆ తరువాత జన్మమున మోక్షం పొందగలరని చెప్పి అదృశ్యం అయ్యాడు.


అలా శంకరునిచే ఆజ్ఞాపించబడిన పక్షులే కృతయుగంలో పూష విధాతల పేరుగల పక్షులయ్యాయి. త్రేతాయుగమున జటాయువు, సంపాతి అనే పక్షులుగా ద్వాపర యుగమున శంభుగుప్త, మహా గుప్తులనే పక్షులయ్యాయి. కలియుగమున శంబర శంబరాదులనే పక్షులై ప్రతి దినము గంగాస్నానము చేసి ఈ కొండపైకి వచ్చి పోతుంటారని స్థల పురాణం చెబుతుంది. 


యాత్రికులు ఉదయాన్నే పక్షితీర్థంలో స్నానం చేసి కొండ ఎక్కి స్వామికి పండ్లు, పూలు, కర్పూరం మొదలైనవి సమర్పిస్తారు. దేవాలయ పరివారం ఈ విరాళాలను స్వీకరించి చక్కెర పొంగలి, నేయి పాత్రలను స్వామికి సమర్పించి పూజా కార్యక్రమాలను నెరవేరుస్తారు. తరువాత పూజారులు ఒక పక్క, భక్తులు ఒక పక్క కూర్చుని ఉంటే ఆకాశ మార్గాన రెండు పక్షులు వచ్చి చక్కెర పొంగలి తిని నేతిని తాగేసి పోతుంటాయి. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు.


పైన చెప్పుకున్న పక్షులు కాశీ, రామేశ్వరం యాత్ర చేస్తూ, మధ్యలో పూజారి ఇచ్చిన పరమాన్నం రుచిచూసిన ప్రాంతంలో ఆగుతాయని అక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతం "పక్షితీర్థం"గా ప్రసిద్ధిగాంచింది. 


ఈ పక్షితీర్థం చెన్నయ్ నగరానికి దక్షిణంగా చెంగల్పట్టు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వెళ్లే దారిలో ఉంటుంది. నిజానికి ఈ ఊరి అసలుపేరు "తిరుక్కుర కుండ్రం". ఇక్కడ ఒక పెద్ద దేవాలయం ఉంటుందన్న విషయమే చాలా మందికి తెలియదు. ఈ ఆలయం ప్రాంగణంలోపల పెద్ద పుష్కరిణి కూడా ఉంటుంది. 


ఈ ఆలయంలోని స్వామి పేరు "భక్తవత్సలేశ్వరుడు", అమ్మవారి పేరు "త్రిపురసుందరి". ఈ ఆలయంలోని శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. పక్షితీర్థం సందర్శించే యాత్రికులు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా చూసి తరించాల్సిందే. అదలా ఉంచితే... మహాబలిపురం సందర్శించేవారుగానీ, చెంగల్పట్టు నుంచి నేరుగా వచ్చేవారుగానీ ఉదయం 11 గంటలలోపు ఈ పక్షితీర్థానికి చేరుకోవాల్సి ఉంటుంది. 


పక్షితీర్థం ఊరి మధ్యలో ఉన్న మెయిన్‌రోడ్డును ఆనుకుని ఒక కొండ ఉంటుంది. ఈ కొండమీదకే పక్షులు వస్తుంటాయి. సుమారు 500 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను వేదగిరి అని పిలుస్తుంటారు. కొండమీద వేదగిరీశ్వరాలయం అనే పేరుతో ఒక శివాలయం ఉంటుంది. కాగా.. ఇక్కడి అమ్మవారిని చుక్కాలమ్మగా స్థానికులు కొలుస్తుంటారు. 


వేదగిరిపైన వేదగిరీశ్వరాలయం మినహా మరేమీ ఉండదు. ఈ ఆలయాన్ని పదిగంటల తరువాత తెరుస్తారు. ఇక్కడి స్వామివారికి, అమ్మవారికి నిత్యపూజలు అయిన తరువాతే అర్చకుడు ప్రసాదాన్ని బిందె నిండా నింపుకుని గుడికి ఆనుకుని ఉండే దడికి అవతల కూర్చుని, పై నుంచి వచ్చే రెండు పక్షులకూ ప్రసాదాన్ని ఇచ్చే దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, భక్తులు దడికి అవతల నిలబడి తదేకంగా చూస్తూంటారు. పక్షులు ప్రసాదాన్ని తిని వెళ్తున్న దృశ్యాన్ని కళ్లారా చూసిన వారు దేవుడి మహిమవల్లనే ఇలా జరుగుతోందంటూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో కీర్తిస్తారు.


🙏🙏🙏

అదృష్టవంతుడివో

 🕴🏻నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...??🕴🏻*_


        _**మనలో చాలా మంది నేను దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే "మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం". మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం..*_


_*(1) ఈ రోజు పొద్దున్నే నువ్వు "ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే ".. దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడివన్నమాట.*_


_*(2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే...ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.*_


_*(3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే..300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.*_


_*(4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని,  ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే...ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.*_


_*(5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే...ప్రపంచంలో  8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*_


_*(6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి,  వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే.. ఈ ప్రపంచపు 15 శాతం మంది "అనాధ కుటుంబాలలో "నువ్వు ఒకడివి కాదన్నమాట. "జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు". అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ "నువ్వూ అలాంటి వాడివే " కాకూడదు కదా !*_


_*(7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.*_


_*(8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*_


_*(9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.*_


        _**ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో "తృప్తికి మించిన సంపద " మరొకటి లేనేలేదు.*_


        _**ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ..ఉన్నంతలో మీరు.. మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను...*_


       _**అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా బ్రతుకుదాం !!!*_


       _**మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం......*_

మన తల్లిదండ్రులు ఇంత మంచి జన్మనిచ్చారు అంటే మన అంత అదృష్టవంతులు ఈ భుమి మీద మరెవరు ఉండరు


     _**సర్వే జనా సుఖినోభవంతు.*_🙏

అభిషేకము


ఈ వీడియో చూడడం మిస్ కావొద్దు, ఎందుకంటే.  శ్రీ మహాలక్ష్మీదేవికి  శ్రీ సూక్తం అభిషేకము నిర్వహించడాన్ని ఎంతో చక్కగా వీడియో తీసి మనకు పంపినారు. ఇంతకంటే బాగా ఎక్కడ చూడలేము. 🙏  శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారు చక్కటి చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉన్నారు.🙏 ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీమహాలక్ష్మి దేవ్యై నమః...🙏🙏🙏💐👆🙏🙏🙏
 



ప్రేమ లెక్కలు చూడదు*

 *ప్రేమ లెక్కలు చూడదు* 


ఒక సన్యాసి దేశ సంచారం చేస్తూ చేస్తూ, దారిలో ఒక గ్రామానికి వెళ్లారు. ప్రయాణపు బడలిక తీర్చుకోటానికి, ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. ఆయన కంటికి ఎదురుగా ఒక వ్యక్తి పాలు అమ్ముతూ కనిపిస్తే, అతని వంక చూస్తున్నారు. అతని దగ్గరకు పాల కోసం వచ్చేవారికి చక్కగా కొలత ప్రకారం కొలిచి పాలు పోస్తున్నాడు, ఆ వ్యాపారి. ఇంతలో ఆ వ్యాపారి దగ్గరకు ఒక పదేళ్ల పిల్లవాడు ఒక పాత్రను తీసుకుని వచ్చాడు. ఆ పాల వ్యాపారి వెంటనే ఆ పిల్లవాడి దగ్గర ఉన్న పాత్రను తీసుకుని, తన పెద్ద పాత్రలో ముంచి, నిండుగా పాలను, ఏ కొలత లేకుండా ఇచ్చాడు. 


ఆ దృశ్యం ఈ సన్యాసిని ఆకర్షించింది, అర్ధం చేసుకోలేని అయోమయంలో పడేసింది. కారణం ఏమిటో తెలుసుకోవడానికి, ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లి, తన మనసు లోని అనుమానాన్ని అడిగారు. అందుకు ఆ వ్యాపారి, "అతను నా బిడ్డ. మా ఇద్దరి మధ్య కొలతలు, లెక్కలు ఏముంటాయి, ఒక్క ప్రేమ తప్ప!" అని సమాధానమిచ్చాడు. 


ఆ మాటలు విని ఆ సన్యాసి తృప్తిగా తిరిగి మర్రి చెట్టు కిందకు చేరుకున్నాడు. పరమాత్ముని నామ స్మరణ చేసుకోడానికి, తన జోలె నుంచి పూసల మాలను బయటకు తీసుకుని, నామ స్మరణ ప్రారంభించారు. తన వేలు ప్రతి పూసను కిందకు నెట్టుతున్నప్పుడు, తన మనసు ఎన్నిసార్లు స్మరణ చేసానో లెక్కించడాన్ని గమనించారు. వెంటనే ఆయనకు తన భక్తి మీద తనకే నవ్వు వచ్చింది." 


పరమాత్మ నా తండ్రి! ఆయనను ప్రేమతో గుర్తుతెచ్చుకోవాలే కానీ, పూసల లెక్కలతో కాదు కదా! ఈ పూసల లెక్కల్లో నా మనసు కూడా ఈ పూసల మరియు వేళ్ల మధ్య తిరుగుతున్నదే కానీ, పరమాత్ముని భక్తిలో నిమగ్నము కావడం లేదు." అనుకొని, ఆ సత్యాన్ని తెలియజేసిన, ఆ పాల వ్యాపారికి మనసులో నమస్కరించారు. 


ఈ శరీర స్పృహ ఉన్నంత వరకు, మన ధ్యాస ఈ నవ ద్వారములలోనే చిక్కుకుని ఉంటుంది. సద్గురువు ఆదేశానుసారము నామ సాధన చేసినట్లైతే, ధ్యాస, పారమార్ధికంగా ప్రగతిని సాధించగలదు. ఇంద్రియాల చంచలత్వమును నిరోధించగలిగే సాధన మనకు సద్గురువు ద్వారా మాత్రమే లభిస్తుంది. అయితే, మనలో ముందుగా ప్రారంభమైన బాహ్య భక్తి, నెమ్మది నెమ్మదిగా మనసులో పరమాత్ముని దర్శనమునకై తీవ్రమైన అనురాగాన్ని కలిగించి, సద్గురు సాంగత్య అన్వేషణకు దోహదపడుతుంది. దీన దయాళుడైన పరమాత్మ, తన కోసం పరితపిస్తున్న జీవిని తప్పకుండా సద్గురు సాంగత్యమునకు చేరుస్తారు. తద్వారా సద్గురువు ఉపదేశించిన నామ సాధన, శబ్దాభ్యాసము ద్వారా తన మూలమైన పరమాత్మునిలో లీనమౌతుంది.

కుంకుమ పూజ


 అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి🙏


అమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు, 

పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది 

మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది

స్ట్రీలు చేస్తే ! వారిలో..

అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది


అవును ఆడవారు కుంకుమ పూజ చేస్తూ 

లలితా సహస్త్రనామం పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది..


ఏమిటి నిదర్శనం అంటారా, 

వశిన్యాది దేవతలకు లలితా రహస్య సహస్త్రనామం 

చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో 'పలికేది మీరైన మీలో ఉండి పలికించేది నేనే" ని 

చెప్పారు కదా.. 

అలాంటి లలితా పారాయణం చేస్తు కుంకుమ పూజ చేస్తున్న స్ట్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో 

వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది...


అంత కన్నా ఏమీ వరం కావాలి 

అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్ని నశించి పోతాయి

నీ దేహం మనసు పవిత్రం అవుతుంది, 

మళ్ళీ ఏదైనా పాప కర్మలు చేసి  మురికిని 

అంటించుకుంటున్నారు కానీ..

సదా సత్ ప్రవర్తనతో ఉంటే దేవీ ఉపాసన చేసే 

ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపాలే...


ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే అయితే 

ప్రవర్తన కర్మను అనుసరించి, 

పాజిటివ్ ఎనర్జీ ,నెగటివ్ ఎనర్జీ develop అవుతుంది, అంటే దేవతగా ఉండాలన్నా, 

దయ్యంగా ఉండాలి అన్నా వారి వారి ప్రవర్తన వల్ల 

ఆ రూపం వారిలో మేలుకుంటుంది...


ఎంత ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయించినా 

నలుగురు ఆడవారి చేత కుంకుమ పూజ చేయించనిదే అక్కడ జరిగిన అమ్మవారి పూజకు 

ఫలితం ఉండదు 

ఎంత మందిని ఒక్క చోట చేర్చి కుంకుమ పూజ చేయిస్తే 

ఆ కార్యానికి అంత శుభం కలుగుతుంది.🙏


అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏

[27/10, 8:17 pm] +91 93913 24915: 🌸 *పరమాత్మ ను చేరే సులభ మార్గాలు.* 🌸


*పరమాత్మ సకల జీవరాసులలో అంతర్యామి గా కొలువైఉన్మాడు అన్నది శాశ్వత సత్యం. అది మనకి ఎరుక లేకపోతే అది మన అజ్ఞానం. ఆ పరమాత్మ ని చేరాలంటే నాలుగు విషయాలలో ఎరుక తో ఉండి మనము ఆచరించాలి.*


*అవి*:


🌷 *1) సంతోషం:-*


*మనతో ఉన్నత స్థితిలో ఉన్నవారి పట్ల మనం ఈర్ష అసూయలతో ఉంటాం, కానీ మనము సంతోషం తో ఉండాలి అటువంటి సందర్భంలో.*


🌷 *2) కరుణ:*


*మన చుట్టూ ఉన్నవారు కష్టాలతో ఉంటే మనకి చెప్పారాని ఆనందము. కానీ ఇలాంటి సందర్భములొ కావాల్సింది కరుణ.*


🌷 *3) స్నేహము:*


*మనతో సమానముగా ఉన్నవారి పట్ల మనకు పోటీ తత్వం ఉంటుంది. కానీ దీని బదులు స్నేహం ఉండాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం.*


🌷 *4) ఉపేక్ష:*


*మన చూట్టూ ఉన్నవారు పాపాలు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నవారు అయితే మనము వారి వెంటపడి వారిని మార్చే ప్రయత్నం లో నిరంతర జ్ఞాన బోధ చేస్తాం. కానీ పాపం వారు వినిపించుకునే దశలో ఉండరు. కానీ ఇలాంటి వారి పట్ల మనకి కావాల్సినది ఉపేక్ష. ఎందుకంటే సమయమే వారిలో మార్పు తెస్తుంది. మన ఇతిహాసాలు ఈ సత్యం నే చెప్తాయి.*


*చూశారా సంతోషము, స్నేహము, కరుణ, ఉపేక్ష అన్నవి నిజముగా పరమాత్మ దగ్గరకు మనని చేరుస్తాయి.*

[27/10, 8:17 pm] +91 93913 24915: 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹


*మాయ*

*********




 

                 *భక్తుడు :*

  స్వామి! మాయ అంటే ఏమిటి ?


                  *మహర్షి :*

    ఆశ్రమానికి వచ్చే భక్తులను గురించి చెపుతూ ...... ముందుగా ఇక్కడ ఏదో తెలుసుకుందామని వచ్చి ఒక మూల వినయంగా ఒదిగి కూర్చుంటారు. రెండు మూడు రోజులు అయిన తరువాత కొంచెం ముందుకు జరుగుతారు. ఆ తరువాత ఆశ్రమ నిర్వహణలో తప్పులు లెక్కపెడతారు. ఆశ్రమం మీద అధికారం కూడా చెలాయిస్తారు.


     ఇట్లా చేస్తే బాగుంటుందని, అట్లా చేస్తే బాగుంటుందని సలహాలు చెబుతారు. దీనితో ఇంతకు ముందు ఆశ్రమాన్ని నడుపుతున్న వారికి, ఇప్పుడు ఇక్కడ ఉన్నవారికి కలహం ఏర్పడుతుంది. అది చివరకు యుద్ధంగా మారుతుంది.


     ఎదో ఒక విధంగా నన్ను కూడా తమ పక్షం రమ్మని పిలుస్తారు. చివరికి నా నెత్తి మీద కూడా కూర్చోవటానికి ప్రయత్నిస్తారు.


     ఈ కలహప్రియత్వంతో అహంకారంతో తాము వచ్చిన పని మరచిపోతారు. ఇట్లా ఎందరో వచ్చారు. వెళ్ళి పోయారు కూడా. *"వచ్చిన పనిని మరచిపోవటమే మాయ."*


*అంటే మనం కూడా మానవజన్మ ఎందుకు పొందినాము అనే విషయం మరిచిపోయి మళ్లీ మళ్లీ అనేక రకాలైన జన్మలు పొందుతున్నాము. అదే మాయ.

[27/10, 8:17 pm] +91 93913 24915: "

 *నేను ఎవరు ???* 


🍁🍁🍁🍁



 నేను ఎవడను?"


అనే ప్రశ్నకు సరైన సమాధానం , ప్రశ్న అనంతరం కలిగే స్తబ్దతే.

అదే సమర్దవంతమైన సమాధానం .

నేను ఎవడను? అనేది ప్రశ్న కాదు .

అది సమాధానపడవలసిన సమాధానం .


"నేను ఎవరు  అంటే అనే వాడు ఆగిపోవడం".


"నేను ఎవరు అంటే అనంతమైన అంతర్వాహినీ గంభీరత్వమును అలుముకోవడం".


"నేను ఎవరు అంటే అన్ని ప్రశ్నలకు సమాధానమే కాదు మరుప్రశ్నకు తావు లేని, తోవ లేని తనంతో 'ఉండిపోవడం'.


"నేను ఎవరు అంటే వెంబడించడం కాదు 

వెంబడించే, వెతుకులాడే తనమును అర్దం చేసుకోవడం".


"నేను ఎవరు అంటే కనులు తెరిచి ఉండగానే బాహ్యమంతా ఉనికిని కోల్పోవడం".


"నేను ఎవరు అంటే స్పందన లేని తనంతో తులతూగడము".


"నేను ఎవరు అంటే ఉదాశీనంగా ఊరకనే ఉండటమనే స్ముృతి కూడా పలకరించకపోవడం".


"నేను ఎవరు అంటే అనేవాడు తన ఉనికిని కోల్పోవడం" .


"నేను ఎవరు అంటే జ్ఞప్తి - మరుపు లేని తనంలో స్తంభించిపోవడం".


ఇక "నేను" కు ఎవరు, ఏమిటి అనే ప్రశ్నలు కలగవు.

 

దానికి ఎట్టి స్పందన కలగదు.


" నేను " ఉంటుంది .

అది ఏమీ అనదు, అనుకోదు.



" నేను" (ఉనికి)కి  స్పందన లేదు .

" నేను " నుండి వచ్చే స్పందనను మనము 'నేను' (మనస్సు) అని అంటున్నాము .


అనేది నేను అని అనుకుంటున్నాము మన అనుభవము కూడా అదే చెబుతుంది.

ఆ అనుభవము వ్యక్తిగతము. 

వ్యక్తిగతమైన అనుభవము కదులుతుంది, చెరుగుతుంది .

నీలో వ్యక్తిగతమైన అనుభవమునకు ఆవల స్పందన లేని ప్రమాణం

ప్రతిస్పందిచడం తెలియని తనము

కదలదు, చెక్కుచెదరదు .

కనుక నీ మూలమైన మూలంలో స్పందన లేని ఉనికిలో అనంత పారవస్యంలో ఎడతెరుపులేని మహా నిశ్చింతలో నీ సమస్త స్పందనలనూ మమేకము చేయి .


ఆ శుద్ద ఉనికితో తదేకంగా మమేకమవ్వు.

మమేకమవ్వడమంటే ఉనికిగా ఉండటమే.

ఉండటమే ఉనికి.


మనం ఉన్నాను అన్న ధోరణిని అలవర్చుకోవాలని చూస్తున్నాము.

అలవాట్లు నీ పరాయిస్దితిలో కూడా అగచాట్లునే తీసుకువస్తాయి.


నీ నుండి వచ్చే ప్రతీ స్పందనకు ఒక నూతనతను సమర్దిస్తూ స్ధిరపరచాలను కుంటున్నావు.

ఇది కోరిక లేదా ఆసక్తి యొక్క బాహ్య రూపములు.

నీ మూలములో నీవు మాత్రమే ఉన్నావు.

ఇది ప్రశ్నలకు అందేది కాదు.

అలాగని  దీనికి సరైన సమాధానమూ లేదు.

నిన్ను నీవు ప్రశ్నించడమంటే నీలో నూతనతను వెతకడమే అవుతుంది.


అది కూడా నిన్ను నీవు విభాగం చేసుకోవడమే.

నిన్ను నీవు స్మరించగానే విభాగమైపోతావు.

నీవు నీవుగా ఉండటమే శ్రేష్టమైనది.  



🍁🍁🍁🍁

[27/10, 8:17 pm] +91 93913 24915: అరుణాచల శివ 🙏


🍁🍁🍁🍁🍁🍁🍁


సద్దర్శనము - సద్విద్య'  (ఉన్నది నలుబది)

  

- భగవాన్ శ్రీ రమణ మహర్షి


శ్లోకం : 29


 సత్యా స్థితి ర్నాహ ముదేతి యత్ర

 తచ్చోదయస్థాన గవేషణేన l

 వినా న నశ్యేద్యది త న్న నశ్యేత్

 స్మాత్మైక్యరూపా కథ మస్తు నిష్ఠా ll 


తాత్పర్యము:


'అహం'బుద్ధి ఉదయించని స్థితియే సత్యమైన స్థితి.  ఆ 'అహము' జన్మములమును అన్వేషింపకుండా నశింపదు. 'అహము' నశించని యెడల జీవ-పరమాత్మైక్య రూపమైన ఆత్మనిష్ఠ సిద్ధింపదు.


అహంభావము తన మూలమును తెలుసుకొనవలసిన అవసరమున్నదని బలీయముగా భావించినపుడు తదన్వేషణలో అది లయమును పొందును.  అహంభావనాశము జీవ-పరమాత్మైక్య సాక్షాత్కారముగా పరిణమించును.  అదే పరమమైన 'ఆత్మనిష్ఠ' అనబడును.


ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏


🍁🍁🍁🍁🍁🍁🍁

[27/10, 8:17 pm] +91 93913 24915: 🌷ధర్మం నాలుగోపాదం!🌷

    🪔🪔🪔🪔🪔🪔🪔


   రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని,  ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.

 

    రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని!  ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను.  కాఫీ  ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ  రెండువందల రూపాయల నోట్లే!

      'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.

 

     'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు.  అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.  

         అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు.  పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది.

 

     చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.

 

   "అదిగో. ఆ  తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని,  తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది.

    ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు. 

    "సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టే లోగా రైలు కదిలిపోతే... అప్పుడో?" నా చర్యని సమర్ధించుకుంటూ అన్నాను.

   "వాడికేం నష్టం ఉండదు.  మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా, చివరికి లాభాల్లోనే ఉంటాడు!" మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది.

    "అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి. 

    పాపం.. ట్రైయిన్ బయలుదేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!"

     అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు.

  "వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు  తగిలితే చాలు, ఆ రోజు గడిచిపోతుంది!" అంటూ చురచురా చూసింది. 

   నేనేం మాట్లాడలేదు.


       "అయినా వాడు మీలా సుభాషితాలు చదవలేదు లేండి!" అంటూ, ఆవిడ చుట్టూ చూసి ఇంకేం మాట్లాడ లేదు.  అప్పటికే అక్కడ అందరి చూపులూ మావేపే ఉన్నాయి.

      రైలు బాగా స్పీడ్ అందుకుంది.  అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది.   డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది. 

      మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే  నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో,  చాలా సార్లు నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను.

     మనుషుల్లో మంచితనం చూడాలి.  వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం!

        మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి, అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్  గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలాసార్లు ఓడిపోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడలలేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది.

 

        "పోనీలెద్దూ, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మీద్దెలు కట్టెస్తారా?" అ‌ని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను.

    ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు.

     నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలుపెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్ని  చూస్తూ కూర్చున్నాను.

        అప్పటికే తోటి ప్రయాణీకులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు. కొందరు నన్నో వెర్రివాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తున్నారు.* *'ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగుతుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేకపోలేదు.

    రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను.

 


🌷"సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?"  ఆ మాట వినేసరికి ఇటు చూసాను.  జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు. 

   ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు. అతను మధ్యవయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది.

         "అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలుదేరి పోయింది! కాని నీ దగ్గర మేం కాఫీ తీసుకోలేదే!"  

   నిజాయితీగా అన్నాను.*

        "అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?"* *మరొకసారి అదే ప్రశ్న అడిగాడు.

         "అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!"

       "అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయకూడదు కదా, అందుకే మరోసారి అడిగాను!"  అంటూ, జేబులో నుంచి డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు. 

"నువ్వూ..."

"వాళ్ళబ్బాయినండీ!'

      ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయినట్టుంది..

     "రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి.‌ తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది.  అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు పోన్లో చెపుతారండి.  

      వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో  స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి.* *అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా నాన్న!"

    ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది.

     నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది.

"చదువుకుంటున్నావా?" అడిగాను.

"టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా నాన్నకు సాయం చేస్తాడండి, మధ్యాహ్నం నేనుంటానండి!"

ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది.

"ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?"  అంటూ అడిగాను.

నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను.

     "తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండువందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు.  నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు.  చాలా సంతోషం!" అతడ్ని అభినందిస్తూ అన్నాను.

       "పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను. అప్పట్లో  నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు, పుస్తకాల్లో కూడా అలాంటివే  ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను.  అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందుల్లేకుండా నడుపుతున్నాయి!"

      ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది.  అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను.

   " అయితే ఒక్క విషయం బాబూ!" అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి.."చెప్పండి!" అంటూ మళ్ళీ అతని మాటలమీద దృష్టి సారించాను.

      "మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటివేవీ లేవు!  అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను. అంతే బాబూ!" అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి, మరోసారి అభినందించి,  అబ్బాయి బుజం తట్టెను.

 

  ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు. 

 

         ‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!

*****

         🙏🪔ధర్మో రక్షతి రక్షితః🪔🙏


శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆

బహిష్కరించు అవయవాల

 మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ  - 


      మానవ శరీరం ఒక సజీవమైన యంత్రం శరీరము నందు ఎలాంటి అన్యపదార్ధము చేరినను దానిని బయటకి బహిష్కరింప చేయుటకు శరీరము పనిచేస్తుంది . ఉదాహరణకు కాలుకు ముల్లుగాని , కొయ్యగాని గుచ్చుకొని విరిగిన దానిని శరీరము నుంచి బయటకి పంపుటకు చీముపట్టి ఆ తరువాత సులభముగా బయటకి వచ్చును. ఇదే విధముగా శరీరంలోని అంతరావయవములలో ఏదేని మలపదార్దము ( అన్య పదార్థము లేదా రోగ పదార్థము ) చేరినచో అది బయటకి పంపుటకు శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు పనిచేయును . ఇప్పుడు వాటి గురించి మీకు వివరిస్తాను .  అవి 


     *  ప్రేవులు . 

     *  మూత్రపిండములు . 

     *  ఉపిరితిత్తులు . 

     *  చర్మము . 


  *  ప్రేవులు  - 


        మల పదార్థము మొదట ప్రేవులలో నిలువచేరి వివిధ వ్యాధులను కలుగచేస్తుంది . అందువలనే      " సర్వరోగా మలాశయః " అన్నారు. ఈ మల పదార్థం మలబద్ధక సమస్య వలన బయటకి వెళ్లక ప్రేవులలో నిలువ ఉండి అచ్చట కొంతకాలానికి మురిగిపోయి విషవాయువులు తయారైయ్యి రక్తములో కలిసి ప్రవహించి ఇతర అంతర అవయవములకు అవరోధము కలిగించి రోగములను కలుగచేయును . 


                మలబద్ధకం వలన మొదట అజీర్ణము చేయును . అజీర్ణము వలన విరేచనములు ఆ తరువాత బంక విరేచనాలు , రక్తవిరేచనాలు , అమీబియాసిస్ , అసిడిటీ , అల్సర్ ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చును. ఇవన్నియు జీర్ణకోశ సంబంధ వ్యాదులు. ఈ వ్యాధులన్నింటికి మలబద్ధకమే కారణం . ఈ సమస్య ప్రారంభములోనే జాగ్రత్తవహించని యెడల దీర్ఘకాలిక వ్యాధిగా మారి తరువాత తీవ్ర సమస్యలు తెచ్చును . 


          ఈ మలబద్ధక సమస్యకు ఎన్నో రకాల సులభయోగాలు నేను రచించిన గ్రంథాలలో ఇవ్వడం జరిగింది. 


     తరవాతి పోస్టునందు మిగిలిన వాటి గురించి మరింత వివరముగా ఇవ్వడం జరుగును. 


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

పోయిన *ధనం

 *పునర్విత్తం పునర్మిత్రం* 

*పునర్భార్య పునర్మహి*

*ఏతత్సర్వంపునర్లభ్యం*

*న శరీరం పునఃపునః ।।*


* పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది. 


 *దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.      

         

* *భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.


**** *భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది. 


పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు! 


కాని *మానవ శరీరం* మాత్రం మళ్లీ మళ్లీ రాదు.


అందుకే *శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.


 కేవలం *శరీరం* ఉంటేనే ధార్మికపనులు చేయవచ్చు.


 *శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.


 *శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.

ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.



 కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.


జంతువులకు *శరీరం* ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.


పైగా ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.


*బుద్ధి , ఆలోచన , మాట్లాడే శక్తి , కావలసినది సంపాదించుకొని జ్ఞానం*తగిన అవయవ నిర్మాణం*

ఉండేది ఒక్క మనుష్యులకే.


 వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.

 కనుక మనం అందరూ శరీరాన్ని కాపాడుకోవాలి.


*అతిగా తిన్నా*, 

*అతిగా ఆలోచించినా*,

 *అతిగా సుఖం కలిగించినా*,

 *అతిగా దుఃఖం కలిగించినా*                    

*ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం"* *కాస్త పుటుక్కుమంటుంది*. 


ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు. 


కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.    

                                   

*దీనికి*

 

*సత్యం,* 

*ధర్మం*,

 *శాంతి*,

 *ప్రేమ,*

 *అహింసలను*


 *పాటించడమే "మహా ఔషధంగా" పనికి వస్తుంది.*


*విస్తరాకు*


విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము ,

 బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,


తినిన మరుక్షణం ఆ విస్తరి ఆకును మడిచి , దూరంగా పడేసి వస్తాము. ఎంగిలి ఆకును కూడా ముట్టుకోము.


*మనిషి జీవితం కూడ అంతే*

 *'ఊపిరి"* *పోగానే ఊరిబయట పారేసి వస్తారు*,


విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది* ,


విస్తరి ఆకు కు ఉన్న ముందు ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !


*"" సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి""*     *జారవిడుచుకోకూడదూ* 


మల్లీ ,

ఇంకొకసారి,

 ఎప్పుడో చేయవచ్చు

 అనుకొని వాయిదా వేయకండి, 

ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే, కుండ ఎప్పుడైనా పగలవచ్చు అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.


*ఎంత సంపాదించి ఏమి లాభం ?*


*ఒక్క పైసా కూడా తీసుక పోగలమా?*


*మన చేత*

 *ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి* 

*మంచి జరిగితే,* 

*మన మానవ జన్మ సార్థకమయినట్లే ........*.

పరమశివుని లీలా

 Sri Siva Maha Puranam -- 2 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


పరమశివుని లీలా మూర్తులలో పదమూడవ మూర్తి హరిహరమూర్తి. అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీమహావిష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకొని శరీరంలో సగభాగమును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు. 'నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది' అని పార్వతీ దేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే, శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రము. ఈ శివాష్టోత్తర శత నామ స్తోత్రమును ఆధారము చేసుకొని పార్వతీ దేవి శంకరుని శరీరంలో అర్థ భాగమును పొందింది. అది పదునాల్గవ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోష వేళలో చదవడం ఇహమునందు సమస్తమయిన కోరికలను తీరుస్తుంది. పరలోక సుఖమును, భగవంతుని అనుగ్రహమును మనయందు ప్రసరింపజేస్తుంది. 

‘శివో మహేశ్వరః’ అని పిలుస్తారు. ‘మహేశ్వరః’ అనబడే నామము చిత్రమయిన నామము. మంత్రపుష్పం చెప్పినప్పుడు 

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్!

బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం!!

అని చెపుతాము. సర్వమంగళములకు కారణం అయినవాడు, సర్వ జగన్నిమాయకుడు, సృష్టిస్థితిలయలు చేసేవాడు తానొక్కడే అయివుండి, కాని సృష్టి చేసినప్పుడు ఒకడిగా, స్థితి కారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనపడుతూ ఆయన అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు. ఆయనే మూడుగా కనపడే ఒక్కడు. అందుకే పోతనగారు భాగవతంలో ఒకచోట ఒకమాట అంటారు – 

 ఆ||  మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు,

    మూఁడు కాలములకు మూలమగుచు 

    భేద మగుచుఁ దుది కభేదమై యొప్పారు,

    బ్రహ్మమనఁగ నీవే ఫాలనయనా!  (భాగ- 8 – 227)   

మనము సృష్టి స్థితిలయ అని మూడు మాటలు వాడుతుంటాము. మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది. రుద్రుడు లేదా శివుడు అనేసరికి ఆయన సంహారకర్త, లయకారుడు, ఆయన సంహరిస్తాడు అని అనుకుంటారు. అన్నివేళలా లయము అనే శబ్దమునకు అర్థం కేవలం చంపివేయడం కాదు. పరమశివుడు చాలా ఉదారుడై ఉంటాడు. మనకు లయమునందు ‘స్వల్పకాలిక లయం’ అని ఒకమాట ఉన్నది. గాఢనిద్ర పట్టినట్లయితే ఆ నిద్రలో దుఃఖం తెలియదు. హాయిగా నిద్ర పట్టింది అంటాడు. ఆ హాయి అనేది ఏమిటి? మనస్సు లేకపోవడమే హాయి. గాఢ నిద్రలో ఉన్న స్థితిలో మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఉంటుంది. ఆ స్థితిలో బాహ్యమునకు సంబంధించిన ఎరుక అంతా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందమును పొందుతాడు. ఇలా ఆనందమును పొందిన స్వరూపము ఏదైతే ఉన్నదో ఆ ఆనందమే పరమశివుడు. పొందిన ఆ నిద్రను స్వల్పకాలిక లయం అని పిలుస్తారు. తెల్లవారి నిద్రలేవగానే మనస్సు మేల్కొనడం అనగా ఆత్మనుంచి విడివడుతుంది. యథార్థమునకు సృష్టి స్థితి లయ అనేవాటిని ఇక్కడే దర్శనం చెయ్యాలి. అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది. తెలివిరాగానే మనం చేయవలసిన పనులకు సంబంధించి ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన అనేది మనస్సు స్వరూపం. ఆత్మగా ఉండి మొదటి ఆలోచనను చూసినట్లయితే దాని ఆలోచనలను చూడడం  అలవాటు అవుతుంది. ఇదే సృష్టి. చతుర్ముఖ బ్రహ్మ దర్శనం. బ్రహ్మకి పూజలేదు. సంకల్పదర్శనం చేత మాత్రమే  బ్రహ్మదర్శనం చేస్తారు. సృష్టి ప్రారంభం అయింది. అనగా మనస్సు బయటకు వచ్చింది. ఇప్పుడు  స్థితి కావాలి. స్థితి అంటే నిర్వహణ శక్తి. మనస్సు కొన్ని సంకల్పములను చేస్తుంది. వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి. ఇలా చేయాలంటే సమర్థత కావాలి. ఇది నిర్వహణ సమర్థత. అటువంటి శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు. అటువంటి శక్తిని స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు. పురుషుడిగా చెప్తే శ్రీమహావిష్ణువు. తప్పకుండా ప్రాతఃకాలమునందు విష్ణునామం చెప్పాలి. విష్ణుశక్తి మీయందు ప్రసరిస్తే సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది. విష్ణుపూజతో, విష్ణు నామంతో రోజు ప్రారంభం కావాలి. తరువాత అభిషేకం చేసుకోవచ్చు, శివార్చన చేసుకోవచ్చు. కానీ విష్ణునామంతో ప్రార్థించాలి. భగవంతుడు ఒక్కడే. కానీ  ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపములను పొందాడు. రాత్రి నిద్రపోయే ముందు 11 మార్లు శివనామం జపించి విశ్రాంతి స్థానమునకు శరీరమును చేర్చాలి. ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలికలయం. శివనామము చెప్పి నిద్రపోతే ‘నిద్రాసమాధి స్థితి’ – అది సమాధి స్థితి అవుతుంది. తొలి తలంపు ఏది వస్తుందో దానిని ఈశ్వరుని వైపు తిప్పడం మనస్సుకు ప్రయత్నపూర్వకంగా అలవాటు చెయ్యాలి. అపుడు కాలమునందు ఒకరోజు అనబడే విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు. ఇది మహేశ్వరార్చనము. 

ఈ మహేశ్వరార్చన చేత  మహేశ్వరుడుగా మారడము జరుగుతుంది. ఎలా? మొట్టమొదట ఆలోచన బయటకు వస్తూనే మనస్సుకి ఒక అలవాటు ఉండాలి.   మనస్సుకు తర్ఫీదు ఇవ్వడం రావాలి. నిద్రలేవగానే అది మొదటి సంకల్పం ఏమి చెప్పాలంటే – సాధారణంగా ఎడమవైపు నిద్ర పొమ్మని శాస్త్రం చెపుతోంది.  నిద్రలేవగానే  దృష్టి ప్రసారం తిన్నగా ఆరాధించే దేవతా స్వరూపము మీద పడాలి. అలా లేవగానే దేవతా స్వరూపమును చూడడం మొదటిగా మనస్సుకు అలవాటు చేయాలి. అంతేకానీ, టైం అయిపోతోందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు. నిద్రలేవగానే  తలను తిప్పి కళ్ళు విప్పితే మొట్టమొదటి దృష్టి పరమేశ్వర మూర్తి మీద పడడం చేత పరావర్తనం చెంది ఆ పార్వతీ పరమేశ్వరులు లేక లక్ష్మీ నారాయణుల దర్శనం జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టేముందు మనస్సునందు మరల ‘సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే’ అని శ్లోకం చెప్పి క్రిందకి దిగగానే గురువుగారూ- మీరు నాకు ఉపదేశం చేశారు – మీరు చెప్పిన బుద్ధితో ఈరోజు నారోజు గడుచుగాక’ అని నేలమీద పడి  గురువుగారి పాదములను ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి, వారి పాదములకు శిరస్సు తాటించి పైకి లేవాలి. ఇది అలవాటు అయితే తెలియకుండా  మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవుతుంది. ఇపుడు ఈ ఆలోచనను  దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదీ స్థితికారకత్వం. 

లలితాసహస్రంలో అమ్మవారికి 'భావనామాత్ర సంతుష్టాయై నమః' అని ఒక నామం ఉన్నది.  భావన చేత ఆవిడ సంతుష్టురాలవుతుంది.  మనస్సులో మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనందిస్తుంది. లోపల ఉన్న శక్తి అంతా ఆవిడే! ఇక్కడవున్న ప్రకృతి వికారమయిన శరీరము ఆవిడ. ఇది ఆయనను కోరుతోంది. దీనిని దానితో కలపాలని ఆవిడ తెరపైకెత్తుతుంది. ఇది మాయ అన్న యవనికను ఒకరోజున పైకి ఎత్తేస్తుంది. దానితో కలిస్తే  అది జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసిన మహేశ్వర స్వరూపము. అంతేకాని - మహేశ్వర స్వరూపమనగా ఏదో దేవతలందరి చేత పూజించబడేవాడని అనుకోకూడదు. అలా అనుకోవడం దోషం కాకపోవచ్చు. కాని అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది. కాని ఇది నిత్యజీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ. ఇలా దర్శనం చేస్తూ వెడుతున్నట్లయితే  లయ పరమశివుడు. నిద్రలేవగానే మిమ్మల్ని ఎవరయినా 'మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు' అని అడిగినట్లయితే అపుడు మీరు ధైర్యంగా 'నేను ఇప్పటివరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి వున్నాను - అదీ నా నిద్ర' అని చెప్పగలగాలి. ఎందుచేత? నేను  నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను. నేను లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శనమే నా  మేల్కొనుట. నా  పూజామందిర ప్రవేశము స్థితికర్త ప్రార్థన. నా నిన్నటిరోజు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల సమాహారము. అది మహేశ్వర స్వరూపముగా నాచేత ఉపాసన చేయబడిన కాలము. కనుక నేను మహేశ్వరోపాసన చేత మరొక మాహేశ్వరుడను అయ్యానని చెప్పగలరు. ఇది జీవితమునందు రావలసిన ప్రక్రియ. ఇలా చెయ్యగా చెయ్యగా భ్రమరకీటక న్యాయంలో ఒకనాడు ఆ స్వరూపమును పొందుతారు. ఇలా కాకుండా వేరొక రకమయిన ఆలోచనతో వ్యగ్రతతో జీవితం వెళ్ళిందంటే అసలు ఆత్మలోంచి విడివడడంలో కృతజ్ఞతా భావం కలగదు. 

మహేశ్వర శబ్దం గురించి –

తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమం చ దైవతం’ దేవతలు అందరూ కూడా ఎవరికీ ప్రార్థన చేసి నమస్కరిస్తారో, సర్వ జగత్తును ఎవరు నియమించి, పోషించి రక్షిస్తున్నాడో, ఎవడు దీనిని నిలబెడుతున్నాడో, ఎవడు దీనిని తనలోకి తీసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు. వాడు సర్వ జగన్నియామకుడు. వాడు పరబ్రహ్మమయి ఉన్నాడు. ఇటువంటి పరబ్రహ్మము ఎక్కడ దర్శనం అవుతుంది? దానిని చూడగలమా? అంటే దీనికి శాస్త్రం సమాధానం చెప్పింది. మహేశ్వర దర్శనం చేయడానికి ముందుగా మీకు మహేశ్వర దర్శనం చేయాలన్న తాపత్రయం కలగాలని చెప్పింది. ఒక్కొక్కరు చాలా పెద్ద చదువులు చదువుకుంటారు. అలా చదువుకోవడం గొప్ప కాదు. అలా చదువుకున్న చదువును నిరంతరం ఎవరయితే అనుష్ఠానంలోనికి తెచ్చుకుంటారో వారు గొప్పవారు. అటువంటి వారు మహాపురుషులు అవుతారు. చదివిన విషయమును ఆచరణలో పెట్టడానికి శ్రద్ధ కావాలి. చెప్పడము  కాదు అనుష్ఠానం లో ఉండాలి. ఈశ్వరుడు సర్వసాక్షి. ఆయన చూస్తున్నాడనే బెరుకు ఉన్నట్లయితే, ఒకడు చూసి మెచ్చుకోవాలని పనులు చేయరు. అ పనులు చేయడం విధిగా భావించి పనులను చేస్తారు. శివ పురాణమును ఒక కథగా వినే ప్రయత్నం  చేయకూడదు. అలా చేస్తే అది జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకువెళ్ళదు. శివపురాణం మన నిత్యజీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. ఈశ్వరుడిని చూడాలనే తాపత్రయం, సృష్ఠి, స్థితి, లయానుసంధానం నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది. ఆయన –

సర్వజ్ఞాతా తృప్తి రనాది బోధః స్వతంత్రతా నిత్యమలుప్త శక్తిః 

అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞాత షడాహురంగాని మహేశ్వరస్య’ అని శాస్త్రము అన్నది. 

కొన్ని విషయములను కన్ను చూసినా మనస్సు వాటిని పట్టుకోదు. మనం ఒకచోట కూర్చుని కంటితో అన్నిటినీ చూస్తున్నా అలా చూస్తున్నవాటిలో కొన్నిటిని మాత్రమే గుర్తు పెట్టుకోగలము. కానీ ఈశ్వరుడు అలా కాదు. మహేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయగతమయిన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు. 

 మనస్సును ఈశ్వరుని పాదముల మీద పెట్టగలిగితే ఈశ్వరుడు వెంటపడి పరుగెడతాడు. మనస్సు అక్కడ పెట్టడానికి చేస్తున్న పరిశ్రమకు ‘పూజ’ అని పేరు. అలా భగవంతునియందు మనస్సును కేంద్రీకరించి పూజ చేయడం అలవాటు చేసుకోవాలి. అది అలవాటు అయితే  ఏ ప్రదేశంలో ఉన్నా పూజ చేసుకోగలుగుతారు. పరమేశ్వరుడు హృదయగతాభిప్రాయమును పట్టగలిగినవాడు. దీనికే సర్వజ్ఞత అంటారు. సర్వజ్ఞత, స్వతంత్రత అనేవి రెండూ ఈశ్వరుడితో ముడిపడి ఉంటాయి. ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్న ప్రాణుల హృదయాంతర్గత భాగములను తాను చూస్తాడు. చూసి ఆ భావముల పరిపుష్టి చేత మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు. పైకి చూస్తే ఈవిషయము ఒక్కనాటికీ దొరకదు.

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

*

                                                                                                                                                                         *భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏


*రోజుకో పద్యం: 1932 (౧౯౩౨)*


*10.1-925-*


*క. వడిగొని బలరిపు పనుపున*

*నుడుగక జడి గురిసె నే డహోరాత్రము; ల*

*య్యెడ గోపజనులు బ్రతికిరి*

*జడిఁ దడియక కొండగొడుగు చాటున నధిపా!* 🌺



*_భావము:  బలాసురుని శత్రువగు దేవేంద్రుని యొక్క ఆజ్ఞచే ఏడు రోజుల పాటు ఎడతెగకుండా కురిసిన జడివానకు ఏ మాత్రము తడక, జడిసిపోకుండా, ఆ గోపాలకులందరు ఆ కొండ అనే గొడుగు  మాటున (క్రింద) ఆశ్రయము పొంది రక్షింప బడ్డారు._*  🙏



*_Meaning: The incessant rain continued for seven nights and days at the instance of Indra, the enemy of Demon Balasura. But being protected by the benevolent Krishna, the Yadava folk remained safe and secure underneath the Goverdhana hill._*  🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

 K Sudhakar Adv Br: *వందేమాతరం*

                                                                                                                           *భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1933 (౧౯౩౩)*


*10.1-926-వ.*

*10.1-927-*


*క. "ఉడిగెను వానయు గాలియు*

*వడిచెడి నదులెల్లఁ బొలుప వఱద లిగిరెఁ; గొం*

*డడుగున నుండక వెడలుఁడు*

*కొడుకులుఁ గోడండ్రు సతులు గోవులు మీరున్. "* 🌺



*_భావము: ఈ విధముగా ఏడు  రోజుల పాటు రాత్రింబగళ్ళు  శ్రీకృష్ణుడు ఆ గోవర్ధన  పర్వతమును అలాగే ఎత్తి పట్టుకుని ఉన్నాడని, ఆ గోపాలకులకు ఎటువంటి హాని కలగలేదని తెలుసుకున్న పర్వతభేది యగు ఇంద్రుడు కృష్ణుని మహిమాన్వితమైన లీలను గ్రహించాడు. ఆశ్చర్యచకితుడై, ఇంత ప్రయత్నము చేసినా వ్యర్థమై పోయిందని సంవర్థక  మేఘములను మరలించుకుపోయాడు. ఒక్క సారిగా ఆకాశము, సూర్యమండలము  ధగద్ధగాయమానముగా ప్రకాశించింది. ఇది గమనించిన  గోవర్ధనధారి శ్రీకృష్ణుడు గోపాలకులతో ఇలా అన్నాడు:  "వాన వెలిసింది, గాలి తీవ్రత కూడా తగ్గి నదులలో వరద క్షీణించి సామాన్య పరిస్థితులు  నెలకొన్నాయి. మీరు మీ కొడుకులు, కోడళ్ళు, పిల్లలతో సహా ఈ కొండ క్రింది నుండి బయటకు వచ్చెయ్యండి"._* 🙏



*_Meaning: Indra learnt that Sri Krishna protected the Yadavas and the cows by lifting and holding the Goverdhana mountain high, providing them safe shelter. Having realised the greatness and superhuman power of Sri Krishna and  consequent failure of his well-conceived plan, Indra beat a retreat along with the Samvartaka clouds as Sri Krishna thwarted all his efforts and the yadavas remained unaffected in spite of terrific hailstorm and deluge. With this retreat, the sky and the space shone sparkling bright and with radiance. Observing the change, Sri Krishna told his people: "The rain stopped, the force of the gale too reduced and the flooding in the rivers too abated whereby the situation has returned to normalcy. You please come out from the shade of this mountain with your kith and kin"._*   🙏                



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*

                                                                                                                                   *భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1935 (౧౯౩౫)*


*10.1-930-వ.*

*10.1-931-*


*సీ. "కన్నులు దెఱవని కడుచిన్ని పాపఁడై;*

*దానవిఁ జనుఁబాలు ద్రాగి చంపె;*

*మూడవ నెలనాఁడు ముద్దుల బాలుఁడై;*

*కోపించి శకటంబుఁ గూలఁ దన్నె;*

*నేఁడాది కుఱ్ఱఁడై యెగసి తృణావర్తు;*

*మెడఁ బట్టుకొని కూల్చి మృతునిఁ జేసెఁ;*

*దల్లి వెన్నలకునై తను ఱోలఁ గట్టినఁ;*

*గొమరుఁడై మద్దులు గూల నీడ్చెఁ;*


*తే. బసుల క్రేపులఁ గాచుచు బకునిఁ జీరె;*

*వెలఁగతో వత్యదైత్యుని వ్రేసి గెడపె;*

*సబలుఁడై ఖరదైత్యుని సంహరించె;*

*నితఁడు కేవల మనుజుఁడే యెంచిచూడ!* 🌺



*_భావము: శ్రీకృష్ణలీలలను కనులారా దర్శించిన ఆ గోపాలకులు నందునితో ఇలా అన్నారు: "పూర్తిగా కళ్ళు తెరవని పసిపాపవలెనున్నప్పుడే  చనుబాలు త్రాగేసి పూతన అనే రాక్షసిని సంహరించాడు;  ముద్దుల శిశువుగా ఉన్న మూడవ నెలలోనే బండిని (శకటాసురుని) కాలితో తన్ని చంపేశాడు; ఏడాది వయస్సులో నున్నప్పుడు ఆకాశములో కెగిరి తృణావర్తుడనే రాక్షసుణ్ణి మెడ  పట్టుకొని చావగొట్టాడు; పిల్లాడుగా ఉన్నప్పుడే వెన్న దొంగిలిస్తున్నాడు అని తల్లి యశోద రోటికి కట్టేస్తే, ఆ రోటిని లాక్కెళ్లి మద్దిచెట్లను కూలదోశాడు; ఆవులను, దూడలను కాస్తూ బకాసురుణ్ణి  చీల్చివేశాడు. వత్సాసురుడనే  దైత్యుణ్ణి వెలగచెట్టుకేసి బాది చంపాడు. బలరామునితో  కలిసి ధేనుకాసురుని ప్రాణాలు తీశాడు. అసలు యితడు మానవ మాత్రుడా? ఏ విధముగా ఆలోచించినా సామాన్య మానవుడనిపించటంలేదు"._* 🙏



*_Meaning: Having direct experience of Sri Krishna's mystic superhuman deeds, the yadava folk were telling Nanda: "Even before He could open His eyes as a one month baby, Sri Krishna drank the poisonous milk from the breasts of Putana and killed her; when He was in His third month, He kicked and destroyed the demon Sakatasura who came in the shape of cart; when He was of 1 year old, He flew into the sky and held the neck of demon Trinavarta and strangulated him. As a young child of 2 years, when He ate butter, His mother Yashoda Devi tied Him to rolling mortar and He pulled it away and knocked down 2 huge maddi (Arjuna) trees. Tending cows and calves, He split Bakasura and killed him.  At the same age, He thrashed  demon Vatsasura against Kapittha (Velaga: wood-apple) tree and finished him. Together with Balarama, He destroyed the wicked demon Dhenukasura.  Is He a human? Looking at the above events and the supreme deeds of Sri Krishna, we are absolutely sure that He is not a normal boy"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*

                                                                                                                                                        *భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1934 (౧౯౩౪)*


*10.1-928-వ.*

*10.1-929-*


*క. వల్లవకాంతలు దన కథ*

*లెల్లను బాడంగ నీరజేక్షణుఁ డంతన్*

*వల్లవబలసంయుతుఁడై*

*యల్లన గోష్ఠంబుఁ జేరె నవనీనాథా!* 🌺

  


*_భావము: ఓ రాజా ! శ్రీకృష్ణుడు అలా చెప్పగా వినిన గోపాలకులందరు తమ తమ బండ్లు, పశువులు  మొదలైనవన్నిటినీ తీసుకొని ఆ కొండ క్రింది నుండి బయటకు వచ్చేశారు. ఆ పై జగద్రక్షకుడగు శ్రీకృష్ణుడు ఆ గోవర్ధనగిరికి తిరిగి ఇంతకు ముందున్న విధము గానే అదే స్థలములో నిలబెట్టాడు. అప్పుడు ఆ గోపాలకులందరు కృష్ణుని కౌగలించుకొని తగిన రీతిని  గౌరవించి, ఆశీర్వదించారు. ఆ గోపికలు కూడా అక్షతలు వేసి పెరుగన్నపు ముద్దలు పెట్టి దీవించారు. నందుడు, యశోదాదేవి, రోహిణీదేవి, బలరాముడు శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొని,  శుభప్రదమైన వాక్యములు పలికారు. సిద్ధులు, సాధ్యులు,  గంధర్వ శ్రేష్ఠులు పుష్పవర్షము కురిపించారు. దేవతలు శంఖనాదములు, భేరీవాద్యములు మ్రోగించారు.  తుంబురుడు మొదలైన  గంధర్వులు పాటలు పాడారు.  అప్పుడు గోప స్త్రీలు ఆయన లీలలను పాటలుగా పాడుతూ ఉండగా, పద్మనేత్రుడు శ్రీకృష్ణుడు గోపకులు,  బలరామునితో కూడినవాడై  మెల్లమెల్లగా బృందావనము చేరాడు._*  🙏



*_Meaning: O king Parikshit! Listening to the happy news broken by Sri Krishna, the entire yadava folk took their carts, guided their cattle and came out from the bottom of the mountain. Seeing all evacuating the secure space underneath the umbrella like mountain, Krishna replaced it at the original location. All the inhabitants of the village fondly embraced Sri Krishna and blessed him. The women of the village too blessed him and fed him with morsels of curd rice. Nanda, Yashoda, Rohini and Balarama took him into their arms and spoke pleasant words. From the sky - Siddhas, Saadhyas, Gandharvas and chaaranas rained flowers on him. Celestial beings blew their conches and played trumpets. Tumbura and other divine singers sang songs eulogizing the great deeds of Sri Krishna. As the women folk too sang songs narrating Sri Krishna's courageous and noble deeds, Lotus-eyed Sri Krishna reached Brindavan along with Balarama and other cowherds._*  🙏🏻



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏 


*రోజుకో పద్యం: 1936 (౧౯౩౬)*


*10.1-932-*


*క. తెంపరి యై రామునిచేఁ*

*జంపించెఁ బ్రలంబు; మ్రింగెఁ జటుల దవాగ్నిన్;* 

*సొంపు చెడఁ ద్రొక్కి కాళియుఁ*

*ద్రుంపక కాళింది వెడలఁ దోలెన్ లీలన్.* 🌺



*_భావము: ఆ గోపాలకులు శ్రీకృష్ణుని లీలా విశేషములను ఇలా చెప్తున్నారు: "సాహసవంతుడగు బలరామునిచే ప్రలంబాసురుని సంహరింప జేసెను. తీవ్రమైన కార్చిచ్చును త్రాగేశాడు. సర్పములకు రాజగు కాళీయుని చంపకుండా విలాసముగా గర్వభంగమయేటట్లు కాళ్లతో అణగ త్రొక్కి యమునానదిలోని కాళిందీమడుగు నుంచి తరిమేశాడు._* 🙏



*_Meaning: The yadava folk were narrating the glorious deeds of Sri Krishna further: "He got Pralambasura killed by Balarama. He did not kill Kaleeya, the king of serpents, but suppressed the serpent's ego and haughtiness by pounding, trampling and elegantly dancing on his hoods; ultimately drove the vicious serpent away from Kalindi pond of river Yamuna"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1937 (౧౯౩౭)*


*10.1-933-*


*క. ఏడేండ్ల బాలుఁ డెక్కడ?* 

*క్రీడం గరి తమ్మి యెత్తు క్రియ నందఱముం*

*జూడ గిరి యెత్తు టెక్కడ?* 

*వేడుక నొక కేల నేడు వెఱఁగౌఁ గాదే.* 🌺



*_భావము: వారి సంభ్రమాశ్చర్యములను ఇంకా ఇలా వివరిస్తున్నారు: "ఏడేళ్ల వయసు కల బాలుడేమిటి? ఏనుగు తామరపువ్వును ఎత్తినంత సులువుగా అందరమూ చూస్తుండగానే ఆ కొండను పైకెత్తటమేమిటి? అది కూడా ఒంటిచేత్తో అలవోకగా ఎత్తేశాడు, ఎంత అద్భుతమైన విషయమో కదా!"_* 🙏



*_Meaning: "The cowherds were not able to suppress their excitement and discuss Sri Krishna's SuperHuman deeds: "After all, Sri Krishna is just a seven year old boy and how strange, unusual and mysterious that he could lift the huge mountain with ease and held it in a single hand. Certainly its a great wonder"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1939 (౧౯౩౯)*


*10.1-935-వ.*

*10.1-936-*


*మ. హరి కేలన్ గిరి యెత్తి వర్షజలఖిన్నాభీర గోరాజికిన్*

*శరణంబైనఁ ద్రిలోక రాజ్యమదముం జాలించి నిర్గర్వుఁడై*

*సురభిం గూడి బలారివచ్చి కనియెన్ సొంపేది దుష్టప్రజే*

*శ్వరదుర్మాన నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు శ్రీకృష్ణునిన్.*🌺



*_భావము: గోపాలకులందరు ఏక కంఠముతో పలికిన వాక్యములను విని నందుడు తనకు ఇంతకు పూర్వమే గర్గ మహాముని తెలియజెప్పిన విశేషములను గుర్తుచేసుకొని వారితో,  "మీ ఆలోచనలు సవ్యము, ఈ విషయములో అనుమానమే లేదు. ఇంతకు పూర్వమే గర్గ మహర్షి ఈ బాలుడు సకల లోక రక్షకుడగు శ్రీమహావిష్ణువు యొక్క అంశతో జన్మించిన వాడు, అని చెప్పారు". గోపాలకులందరు ఆశ్చర్యచకితులై ఈ బాల కృష్ణుడు అనంతుడగు భగవంతుడే యని పూజించారు. అంతట ఆ శ్రీ కృష్ణుడు ఒంటి చేతితో గోవర్ధనపర్వతమును ఎత్తి ఘోరమైన వర్షముచే బాధపడుతున్న గోపాలకులను, గో సమూహములను రక్షించిన విషయమును ఇంద్రుడు  గ్రహించి, ముల్లోకములకు తానే  అధిపతిని అనే గర్వము వదలుకొని, ఐశ్వర్యాతిశయమును త్యజించి   కామధేనువుతో సహా వచ్చి,  దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకై అవతార స్వీకారం చేసిన కరుణాసముద్రుడగు శ్రీకృష్ణ భగవానుని దర్శనము చేసుకున్నాడు._*  🙏



*_Meaning: Listening to the unanimous expression of all the cowherds, Nanda recollected the revelations about the birth of Sri Krishna  and told his people: "Yes, what you felt is correct. There is no doubt about this child being the Almighty Himself. Sage Garga told me earlier that this child is an incarnation (avatar) of SriMahaVishnu".  With these words, all the yadavas performed pooja to this child Sri Krishna. Meanwhile Indra learnt that the Almighty in the form of a small child Sri Krishna, protected all the inhabitants of Brindavan from the fury of rain created by him. Setting aside his pride and ego, he came down from heaven along with Kamadhenu, had Darshan of the Almighty and paid his obeisance to Sri Krishna, who took birth to protect the virtuous and punish the wicked and cruel demons"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏 


*రోజుకో పద్యం: 1940 (౧౯౪౦)*


*10.1-937-*


*క. కని యింద్రుఁడు పూజించెను*

*దినకరనిభ నిజకిరీట దీధితిచేతన్*

*ముని హృదలంకరణంబులు*

*సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్.*🌺



*_భావము: ఇంద్రుడు సూర్యప్రభాకాంతులతో సరిపోలిన కిరీటముతో కూడిన తన శిరస్సును మహర్షుల హృదయరంజకమై, సద్భక్తులను ఉధ్ధరించెడి నందసుతుడు, శ్రీకృష్ణుని పాదపద్మములకానించి పూజించెను._* 🙏



*_Meaning: With his well embellished and sparkling crown on his head, Indra touched the Lotus feet of Sri Krishna, son of Nanda, the creator of happiness to all the sages and protector of the virtuous and worshipped Him with diligence and devotion._*     🙏


*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: అందరికీ

*విజయ దశమి శుభాకాంక్షలు*! 🙏🏻

*వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1938 (౧౯౩౮)*


*10.1-934-*


*క.  ఓ! నంద! గోపవల్లభ!* 

*నీ నందనుఁ డాచరించు నేర్పరితనముల్*

*మానవులకు శక్యంబులె?*

*మానవమాత్రుండె? నీ కుమారుఁడు తండ్రీ!"* 🌺



*_భావము: ఆ గోపకులు నందునితో ఇలా అంటున్నారు: "ఓ నంద రాజా! నీ కొడుకు చేసే సమర్థవంతమైన, అలౌకికమైన పనులు చూస్తుంటే , ఇవి సామాన్య మానవులకు సాధ్యమౌతాయా? అసలు నీ కుమారుడు మామూలు మనిషేనా?"_* 🙏



*_Meaning: The assembled Yadava folk were telling Nanda: ”O king Nanda! It is unimaginable and inconceivable that any normal child can perform such superhuman efforts and actions as those of your son Sri Krishna. We have a sincere and serious doubt whether this boy is really a simple and ordinary mortal"._*  🙏

 


*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

పూర్వాభద్ర నక్షత్రము - ఫలితాలు

 పూర్వాభద్ర నక్షత్రము  - ఫలితాలు


నక్షత్రములలో పూర్వాభద్ర 25వ నక్షత్రము. పూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు. అధిదేవత అజైకపాదుడు. మానవ గణము. జంతువు సింహము. రాశ్యాధిపతులు శని, గురువులు.


పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము  

పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము మేషరాశిలో ఉంటుంది. మేషరాశి అధిపతి కుజుడు. పూర్వాభాద్ర నక్షత్రము అధిపతి గురువు. ఈ జాతకుల మీద కుజ, గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. కుజ ప్రభావం కారణంగా ఆవేశం ఉన్నా దాని మీద నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి ధైర్యసాహసాలు అధికం. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. ఈ జాతకులకు భూ సంబంధిత, సైనికపరమైన, సాహసాలు ప్రదర్శించగలిగిన రక్షణ శాఖ అగ్నిమాపకం, ఆటవిక సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శిక్షకులు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, రక్తవర్ణ సంబంధ ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. వీరికి వ్యవసాయం కూడా కలిసి వస్తుంది. 


ఈ జాతకులకు 14 సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. ఈ కారణం వల్ల మొదటి నుంచి విద్యభ్యాసంలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. సంపాదన కంటే ఖర్చులు అధికం. 33 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 50 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలువుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.


పూర్వాభాద్ర నక్షత్ర రెండవ పాదము

వృషభరాశి అధిపతి శుక్రుడు. పూర్వాభాద్ర నక్షత్ర అధిపతి గురువు. కనుక ఈ జాతకుల మీద శుక్ర గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవ గణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు, మత బోధకులు, మత గురువులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలం. పసుపు వర్ణ, శ్వేత వర్ణ సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జల సంబంధిత, పర్యాటక సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం. 


ఈ జాతకులకు పది సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. కనుక ఆరంభం నుంచి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యభ్యాసంలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరిగే అవకాశం. 29 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 46 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ  కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.


పూర్వాభాద్ర నక్షత్రము మూడవ పాదము

పూర్వాభాద్ర  నక్షత్ర 3వ పాదము మిధునరాశిలో ఉంటుంది. మిధునరాశి అధిపతి బుధుడు. పూర్వాభాద్ర నక్షత్ర అధిపతి గురువు. వీరి మీద బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాధ్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. భూ సంబంధిత, విద్యా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం. 


ఈ జాతకులకు ఆరు సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. ఆరు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం. 25 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో జీవితం సాఫీగా సాగిపోతుంది. 42 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.


పూర్వాభాద్ర నక్షత్ర నాలుగవ పాదము

పూర్వాభాద్ర నక్షత్ర 4 వ పాదము కటకరాశిలో ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్ర అధిపతి గురువు. కటకరాశి అధిపతి చంద్రుడు. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. వీరికి ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, శ్వేతవర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. ఔషధ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 


ఈ జాతకులకు రెండు సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం. 21 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కాలంలో ఉన్నత విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. జీవితం సాఫీగా సాగిపోతుంది. 38 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలమవుతాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ  కారణంగా మళ్లీ సుఖ జీవనం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.


పూర్వాభద్ర నక్షత్రము - ఫలితాలు


ఈ నక్షత్ర జాతకులు సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. వీరికి ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలం. దేశవిదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అందివస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం ఉంటుంది. వీరికి గురువుల, మేధావుల సహకారం ఉంటుంది. ఇతర రంగాల గురించి కూడా మంచి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. 


స్నేహాలు, విరోధాలు వెంటవెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం మొదలవుతుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు.  వైవాహిక జీవితం సాధారణము. బాల్యం సాఫీగా, తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.

*చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

గురువుల సంబంధ 55 పుస్తకాలు(

 *గురువుల సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*  

------------------------------------------------


55  పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/guruvulu-pdf


               (OR)


వేదవ్యాస మహర్షి జీవిత చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-1


గురు విజ్ఞాన సర్వస్వము www.freegurukul.org/g/Guruvulu-2


వసిష్ఠ మహర్షి www.freegurukul.org/g/Guruvulu-3


గురువులు ఋషులు www.freegurukul.org/g/Guruvulu-4


మన దేవతలు - ఋషులు -1 www.freegurukul.org/g/Guruvulu-5


మహర్షుల చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-6


ఉద్దాలక మహర్షి www.freegurukul.org/g/Guruvulu-7


కణ్వ మహర్షి www.freegurukul.org/g/Guruvulu-8


జ్ఞానదేవుడు www.freegurukul.org/g/Guruvulu-9


ఆచార్యుల చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-10


నవయోగులు www.freegurukul.org/g/Guruvulu-11


మహా యోగులు www.freegurukul.org/g/Guruvulu-12


ముగ్గురు గురువుల గురుచరిత్ర www.freegurukul.org/g/Guruvulu-13


బాబాలు,స్వామీజీలు, గురుమహరాజ్ లు www.freegurukul.org/g/Guruvulu-14


ద్రోణాచార్యులు www.freegurukul.org/g/Guruvulu-15


ఒక యోగి ఆత్మ కథ www.freegurukul.org/g/Guruvulu-16


అక్కల్కోట నివాసి శ్రీ స్వామి సమర్ధ www.freegurukul.org/g/Guruvulu-17


కృష్ణాజీ జీవితం www.freegurukul.org/g/Guruvulu-18


గణపతి ముని చరిత్ర సంగ్రహము www.freegurukul.org/g/Guruvulu-19


జగద్గురు విలాసం www.freegurukul.org/g/Guruvulu-20


రామానుజ జీయరు స్వామి చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-21


దివ్య మాత www.freegurukul.org/g/Guruvulu-22


నడిచే దేవుడు(చంద్రశేఖర పరమాచార్యులు) www.freegurukul.org/g/Guruvulu-23


విద్యాప్రకాశానందగిరి స్వాముల జీవిత చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-24


మహా తపస్వి-భగవాన్ శ్రీ వశిష్ట గణపతిముని చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-25


భగవాన్ మహావీరుడు www.freegurukul.org/g/Guruvulu-26


శ్రీరాఘవేంద్ర స్వామి చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-27


శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము www.freegurukul.org/g/Guruvulu-28


హరనాథ భాగవతము www.freegurukul.org/g/Guruvulu-29


అవతార్ మెహెర్ బాబా జీవిత చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-30


ఆంధ్ర యోగులు-7 www.freegurukul.org/g/Guruvulu-31


సద్గురు మలయాళస్వామి www.freegurukul.org/g/Guruvulu-32


చ్యవన మహర్షి www.freegurukul.org/g/Guruvulu-33


మన మహోన్నత వారసత్వం www.freegurukul.org/g/Guruvulu-34


గురు తత్త్వము www.freegurukul.org/g/Guruvulu-35


గురు పూజా విధానం www.freegurukul.org/g/Guruvulu-36


జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య www.freegurukul.org/g/Guruvulu-37


శంకరాచార్య చరిత్రము www.freegurukul.org/g/Guruvulu-38


ఆదిశంకరాచార్య దివ్యచరితామృతము www.freegurukul.org/g/Guruvulu-39


బాలల శ్రీరామకృష్ణ www.freegurukul.org/g/Guruvulu-40


ధీర నరేంద్రుడు www.freegurukul.org/g/Guruvulu-41


షిరిడి సాయిబాబా సచ్చరిత్రము www.freegurukul.org/g/Guruvulu-42


హేమాడ్ పంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-43


షిర్డీ సాయి లీలామృతము www.freegurukul.org/g/Guruvulu-44


సాయిబాబా చరిత్రము-నిత్య పారాయణ గ్రంధము www.freegurukul.org/g/Guruvulu-45


షిర్డీ సాయి బాబా జీవిత సంగ్రహము www.freegurukul.org/g/Guruvulu-46


గురు గోవింద్ సింగ్ www.freegurukul.org/g/Guruvulu-47


భగవాన్ రమణ మహర్షి www.freegurukul.org/g/Guruvulu-48


గురునానక్ www.freegurukul.org/g/Guruvulu-49


శ్రీదత్త గురుచరిత్ర www.freegurukul.org/g/Guruvulu-50


గురుమూర్తి నృసింహ సరస్వతి చరితము www.freegurukul.org/g/Guruvulu-51


గురులీల www.freegurukul.org/g/Guruvulu-52


నవనాధ చరిత్ర-నిత్య పారాయణ www.freegurukul.org/g/Guruvulu-53


బొమ్మల యోగి వేమన www.freegurukul.org/g/Guruvulu-54


వేమన www.freegurukul.org/g/Guruvulu-55


గురువుల గురించి తెలుసుకోవడానికి  కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

హిందూ ధర్మం - 29

 **దశిక రాము**


హిందూ ధర్మం - 29


కాంతి అంతరిక్షంలో ఒక వస్తువును చేరుటకు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణిస్తుందో, అదే విధంగా మనసును నుంచి ఉద్భవించిన ఆలోచనా తరంగాలు కూడా ఆ ఫ్రిక్వెన్సీకి చెందిన వేరే మనసును చేరే వరకు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణిస్తాయి. ఈ ప్రకృతి అంతా మంచి, చెడు ఆలోచనా తరంగాలతో నిండి పోయి ఉంది. మనసు కూడా రేడియో వంటిది. రేడియోని ఒక నిర్డేశిత ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసినప్పుడు అది ఏ విధంగానైతే గాలి ఉన్నా ఆ ఫ్రీక్వెన్సి తరంగాలనే గ్రహిస్తుందో, అదే విధంగా మనసు కూడా ప్రకృతిలో స్థిరమైన ఉన్న ఆయా ఆలోచనా తరంగాలను గ్రహిస్తుంది. దాని అనుసరించే వ్యక్తి యొక్క ప్రవర్తన ఉంటుంది.


ప్రతి ఒక్కరి మనసు నుంచి ఉద్భవించిన ఆలోచన వేరే వస్తువును చేరే వరకు ప్రయాణిస్తూనే ఉంటుంది. మనసు ఎప్పుడు ప్రకృతిలో ఉన్న ఈ ఆలోచన తరంగాలను గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక వేళ ఎవరైనా ఒక వ్యక్తి, చెడు ఆలోచన చేస్తే చాలు, అతని మనసును అతను ఆ ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసి పెడుతున్నాడన్నమాట. అటువంటి ఆలోచన కలిగిన మరుక్షణమే అంతా వ్యాపించి ఉన్న చెడు ఆలోచనా తరంగాలు అతడిని చుట్టుముట్టి అతని మనసులోకి చొచ్చుకుపోవడానికి పోరాటం చేస్తాయి. అందుకే చెడ్డవ్యక్తి రోజు రోజుకు మరింత దుర్మార్గుడిగా మారిపోతాడు. అతని చర్యలు మరింత శక్తివంతం అవుతాయి. పెద్ద వినాశకారిగా తయారవుతాడు. అదే తరహాలో మంచివ్యక్తి జీవితం కూడా ఉంటుంది. అతని మనసు ఎప్పుడూ మంచి ఆలోచనా తరంగాలను గ్రహించడానికే సిద్ధంగా ఉంటుంది, కనుక అతను మరింత మంచివాడిగా మారుతాడు.


రెండవ విషయం మనం చెడుగా ఆలోచిస్తే, మన ఆలోచనలు కూడా ప్రకృతిలో కొన్ని వందల ఏళ్ళవరకు నిలిచిపోతాయి. వేరే వ్యక్తి అటువంటి ఆలోచనలు చేసినప్పుడు వాడి మనసు ఆవహించి, వాడిని తప్పు దారి పట్టిస్తాయి. అంటే మనం చెడు, అసభ్య, అశ్లీల, ఆత్మనూన్యత భావంతో, బాధతో, విచారంతో చేసే ప్రతి ఆలోచనలు కొన్ని వందల మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, మనం మనకు హానీ చేసుకోవడమే కాక లోకానికి పెద్ద అపకారం చేస్తున్నాం. మనం మంచి ఆలోచనలు చేస్తే, మంచి యొక్క శక్తి సమాజంలో పెరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం మన ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. అందుకే ధర్మం మీ మనసును నిగ్రహించండి, చెడుగా ఆలోచించకండి, అంటూ, దమాన్ని అలవాటు చేసుకోమంటుంది.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

శ్రీమహావిష్ణు సహస్రనామ వైభవము-34*

 **దశిక రాము**


🕉🏵️ *శ్రీమహావిష్ణు సహస్రనామ వైభవము-34* 🏵️🕉


       ❄ *శ్లోకం 28*❄


*వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః|*

*వర్థనో వర్ధమానశ్చ వివిక్త శ్ర్శుతిసాగరః||*


256. వృషాహీ --- అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు; ఇతనిని పందే మొదటి రోజు సకల శ్రేయస్సులకు ప్రారంభ దినములాగా ధర్మరూపముగా నుండును; ధర్మ స్వరూపుడై ప్రకాశించువాడు; తన భక్తులను ధర్మపరాయణులుగా చేసి పగటివలె వెలిగించువాడు; వృషాహ యజ్ఞమునకు దేవత; అగ్నివలె తేజోమయుడు, అన్ని తేజములకు ఆధారమైనవాడు. (దినమే సుదినము, సీతారామ స్మరణే పావనము, అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాముల జూచిన ఆ దినమే సుదినము)

257. వృషభః --- భక్తులపై కామితార్ధములు వర్షించు కరుణామూర్తి; అమృతమును వర్షించి సంసార తాపమును ఉపశమింపజేయువాడు; ధర్మమూర్తియై వెలుగొందువాడు.

258. విష్ణుః --- (2, 259, 663 నామములు) అంతటను వ్యాప్తిని పొంది భక్తులను ఎల్లెడల బ్రోచువాడు; కొండలంత వరములు గూపెడి కోనేటి రాయడు.

259. వృషపర్వా --- తనను చేరుకొనుటకై ధర్మము అను మెట్లదారిని ప్రసాదించినవాడు.

260. వృషోదరః --- ధర్మమును ఉదరమున ధరించినవాడు; ప్రళయ (వర్ష) కాళమున సమస్తమును ఉదరమున భద్రపరచువాడు; యజ్ఞయాగాదులలో అర్పించిన ఉపచారములను గ్రహించు ఉదరము కలిగినవాడు; ధర్మ నిర్వర్తకులగు బ్రహ్మాదులు ఆయన ఉదరమునుండి జన్మించిరి; ఉదరమున అగ్నిని ధరించినవాడు; భక్తులను కడుపులో పెట్టుకొని కాచువాడు.

261. వర్ధనః --- వర్ధిల్ల జేయువాడు;వృద్ధి పరంపరలు కలిగించువాడు; ఆశ్రితుల శ్రేయస్సును వృద్ధినొందించువాడు.

262. వర్ధమానః --- వర్ధిల్ల జేయుటయే గాక, అన్ని రూపములు తానై స్వయముగా వృద్ధి పొందువాడు.

263. వివిక్తః --- విలక్షణమైనవాడు, ప్రత్యేకమైనవాడు; లోకోత్తర చరిత్రుడగుటచే ఏకాంతి అయినవాడు; వేరెవరితోను, వేనితోను పోలిక గాని, బంధము గాని లేని నిర్లిప్తుడు.

264. శ్రుతిసాగరః --- వేదములకు సాగరము వంటివాడు; వేదములకు మూలము, వేద జ్ఞానమునకు పరమార్ధము ఆయనే.


శ్లో. వృషాహీ వృషభో విష్ణుర్వృష పర్వా వృషోదరః


వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతి సాగరః !!28!!


(నామాలు 256 ... 264)


59. పనులు చూపుచుండు, ఫలితాలనందించు


సకల శుబములిచ్చు, సర్వ వ్యాపి


ధర్మ పర్వములతొ దరిజేర్చు జనులను


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : వృషాహీ ... కర్మలను నియంత్రిస్తూ, ఫలితాలు నిర్దేశించువాడు, వృషభ ... శుభాలిచ్చువాడు, విష్ణు ... సర్వ వ్యాపి, వృష పర్వ ... ధర్మ సోపానాలు.


భావము : కర్మలను నియంత్రిస్తూ ఫలితాలు నిర్దేశించువాడు(మరొక భాష్యం ప్రకారం వృష అంటే ధర్ము అహ అంటే దినము గనుక ధర్మబద్ధమైన దినముల ద్వారా సేవింపబడువాడు), నిష్కల్మష హృదయాతో కొలిచే భక్తులకు సర్వ శుభాలనిచ్చేవాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, భక్తులు తనను చేరడానికి బ్రహ్మ చర్యము,గృహస్థాశ్రమం,వాన ప్రస్థం, చివరగా సన్న్యాసము అను నాలుగు ధశల సోపానాలు సమకూర్చినవాడు అయన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


60. ఉదర మందె సృష్టి, యుద్ధరించు జనుల


వర్ధమానుడతడె, వదలకుండ


మాయ రూప మదయె, మరి వేదముల నిథి


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : వృషోదర ... వర్షించు ఉదరము, వర్ధన ... వృద్ధిచేయువాడు, వర్ధమాన ... ప్రపంచం రూపంలో వృద్ది పొందువాడు, వివిక్త ... మాయారూపి, శృతి సాగర ... వేదములకు నిథి.


భావము : మేఘాల మాదిరి ప్రళయ కాలమందు సృష్టి నంతటినీ తనలోకి తీసుకుని తిరిగి సమయం రాగానే వర్షించేవాడు(మరొక భాష్యం ప్రకారం వృషా అంటే ధర్మాలు గనుక ధర్మాలను తన కడుపులో పెట్టుకుని కాపాడేవాడు అనీ అనుకోవచ్చు), తనను త్రికరణ శుద్ధిగా విశ్వసించి కొలిచేవారిని సర్వవిదాలా వృద్ధిలోకి తెచ్చేవాడు(మోక్షమూ అందించేవాడు), మాయా రూపుడై ఉండువాడు, వేదాలకు నిథి( సాగరమంటే జలనిథే అయినే కేవలమూ జలంతోనే కాదాగ, కరుణా సముద్రుడు అనే భావంలో తీసుకుంటే శృతి సాగరుడు గనుక వేదాలకు నిలయం అనుకోవచ్చు) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }


*-ఓం నమో నారాయణాయ*


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

హిందూ ధర్మం** 69

 **దశిక రాము**


**హిందూ ధర్మం** 69


 (రాజర్షి విశ్వామిత్రుడు)


వశిష్టునితో దేవతలు, మునులు పలికిన మాటలు విన్న విశ్వామిత్రుడు గట్టిగా ఊపిరి వదులుతూ తనలో తాను ఈ విధంగా అనుకున్నారు.


దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం

ఏకేన బ్రహ్మదండెన సర్వ అస్త్రాణి హంతిమే


బ్రహ్మతేజస్సు ముందు క్షత్రియ బలం ఎందుకు పనిరాదు. ఒక బ్రహ్మదండం చేత నా అస్త్రాలన్నిటిని ఎదురుకున్నాడు. ఇదంతా చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. బ్రహ్మతేజస్సును ఎదురుకోవడానికి నేను కూడా ఇంద్రియాలను, మనసును నిగ్రహించి, బ్రహ్మర్షిని అవుతాను. అప్పుడు వశిష్టునితో పోరాడతాను అనుకున్నారు.


(ఎంతో గొప్ప క్షత్రియుడు అయినా, కోపంతో మతి తప్పి బలహీనులైన మునులపై, ఆశ్రమంపై, ఆయుధం పట్టని వశిష్టునిపై పోరాటం చేసి, తన ధర్మాన్ని దిక్కరించాడు. సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమైతే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మోక్షం అడగకుండా, వశిష్టమహర్షి మీద కోపంతో అస్త్రశాస్త్రం అడిగాడు. పొందిన వరాన్ని సద్వినియోగం చేసుకుని, రాజుగా అస్త్రాలను సరైన పద్ధతిలో ఉపయోగించి ప్రజలను రక్షించాల్సి ఉండగా, అవి వశిష్టమహర్షిపై ప్రయోగించారు. అన్ని అస్త్రాలను వశిష్టమహర్షి నిర్వీర్యం చేసిన తర్వాతైనా బుద్ధి తెచ్చుకుని క్షమాపణ వేడుకున్నారా అంటే అదీ లేదు. ఇంకా శక్తివంతుడినై మహర్షిని ఓడించాలనే పంతానికి పోతున్నాడు. తను కోరింది తనకు దక్కలేదన్న కోపం ఎటువంటి పరిస్థితికి దారి తీసింది. కానీ ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. వశిష్టమహర్షి వంటి మహాపురుషుని దర్శనం కారణంగా నేను కూడా బ్రహ్మర్షి స్థానాన్ని పొందాలనే తపన విశ్వామిత్రునిలో కలిగింది. ఇది మహాపురుషుల యొక్క శక్తి. అందుకే ఎప్పుడైన ఒక మహాపురుషుని దర్శనం చేసుకునే అవకాశం వస్తే, తప్పక వెళ్ళాలి. వారిని దర్శించడం చేతనే, జీవితంలో మంచి మార్పు వస్తుంది.)


జరిగిన సంఘటన బాధపడుతూ విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేయడానికి తన రాణితో కలిసి దక్షిణదిక్కుకు వెళ్ళారు. కందమూలాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశారు. ఈ సమయంలో విశ్వామిత్రుడికి హవిస్పంద, మధుస్పంద, ధృఢనేత్ర, మహారథులనే సత్యధర్మ పరాయణులైన నలుగురు పుత్రులు జన్మించారు. సరిగ్గా వేయి సంవస్తరాలు పూర్తయ్యేసరికి లోకాలకు పితామహుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై 'ఓ విశ్వామిత్రా! నీవు తపస్సు చేత రాజర్షి లోకాన్ని పొందావు. అందువల్ల మేము నిన్ను రాజర్షిగా గుర్తిస్తున్నాము' అన్నారు.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


114 - విరాటపర్వం.


జుగుప్సాకరమైన కీచకుని మృత కళేబరంచూసి, బంధు మిత్రులు అమితంగా విలపించారు. కీచకుని నూట అయిదుగురు సోదరులు, ఉపకీచకులు అనేవారు కూడా ఆ బంధుగణంలో వున్నారు. వారు దుఃఖిస్తూనే, తదుపరి చెయ్యవలసిన కర్మకాండకు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగా ఆసమయంలో, ఒక స్థంభం చాటునుండి యీ తతంగమంతా చూస్తున్న సైరంధ్రి వారి కంటబడింది. 


తన అన్నగారి మరణానికి కారణమైన సైరంధ్రిని చూసి కోపం ఆపుకోలేకపోయారు. అయితే అన్నగారు వలచి, ఆమె పొందుకోరి , ఆమె భర్తల చేతిలో అసువులు బాసిన సంగతి గుర్తుకువచ్చి, కనీసం మృతి చెందిన తరువాత అయినా తమ అగ్రజుని ఆత్మకు శాంతి కలగాలని, ఆమెనుకూడా కీచకుని మృతదేహంతో కలిపి, దహనం చెయ్యడానికి సంకల్పించారు, ఉపకీచకులు. 


ఆహా ! అంతులేనివి కదా యీకష్టాలు. అయోనిజకు అడుగడుగునా ఆపదలు. ఒక ఆపద గట్టెక్కిందనుకుంటే, యింకొకటి పొంచిచూస్తూనే వున్నది. ఆలోచన వచ్చినదే తడవుగా విరాటరాజు అనుమతి తీసుకుని, ద్రౌపదిని కూడా సజీవంగా మృత్యు శకటంపై యెక్కించి, అంతిమయాత్ర జరుపుతున్నారు, కీచకుని దేహానికి.


ద్రౌపది మళ్ళీ భర్తలపైనే ఆశలు పెట్టుకుని, వారి సంకేతనామాలైన జయ, జయంతి, విజయ, జయత్సేన, జయద్బల అనేపేర్లతో వారిని యెలుగెత్తి, తన గంధర్వ భర్తలను పిలుస్తున్నట్లు పిలుస్తూ రోదిస్తున్నది, ఆశకటం పైనుండి. ఆమె ఆర్తనాదం, మొదటగా భీముడే విన్నాడు. ఏమి జరుగుతున్నదో, తెలుసుకుని, హుటాహుటిన తన వేషం మార్చుకుని, పెరటిగుమ్మం ద్వారా, ఆ శకటం కంటే వేగంగా శ్మశానవాటికకు చేరుకొని, పొడవైన తాటిచెట్టును ఒకదానిని పెకలించి భుజాలపై పెట్టుకుని, మృత్యుపాశం పట్టుకున్న యమధర్మరాజులాగా ఉపకీచకుల రాకకై నిరీక్షిస్తున్నాడు.  


మృత్యుశకటం ప్రక్కన నడుస్తూ, ఉపకీచకులు రానేవచ్చారు. వారిని చూస్తూనే, ఆకలి గొన్న చిరుత, లేళ్ల సమూహం పైకి దూకినట్లు, ఆతాటిచెట్టుతో పెడబొబ్బలు పెడుతూ వారిపై లంఘించాడు, భీమసేనుడు. భీముని ఆకారం, అతడు పెడుతున్న కేకలకు, మీదకు యెగసివస్తున్న తీరుకు, యీ పరిణామము యేమాత్రం ఊహించని, ఉప కీచకులు, భయంతో, తలా ఒకదిక్కుకు పారిపోయారు. తోడుగా వచ్చిన వూరి ప్రజలు కూడా, ఈ వింతగంధర్వుని చూసి, వెనుకకు మరలి వేగంగా నగరిలోనికి వెళ్లిపోయారు.  


ఎప్పుడైతే ఉపకీచకులు భయం ప్రదర్శించి, వెనుకకు తగ్గారో, యిక ఆలశ్యం చెయ్యకుండా, నూట అయిదుగురిని, వెంబడించి, వేటాడి, యేమి జరుగుతున్నదో వారు తెలుసుకునే లోపే అందరినీ యమపురికి, వారి అన్నకు తోడుగా పంపాడు. బాధతో, అవమానంతో రోదిస్తున్న ద్రౌపదిని బంధవిముక్తురాలను చేసి, ఓదార్చి, ' ద్రౌపదీ ! నిష్కారణంగా, నిన్ను బాధించే యిలాంటివారు యెవరైనా యీవిధంగా నే నాచేతిలో చంపబడతారు. ఇది భీమశాసనం. దీనికి తిరుగులేదు. నీకు నేటితో కష్టాలు తొలగిపోయాయని నేను భావిస్తున్నాను. నిర్భయంగా నగరంలోకి వెళ్లి, నీ గంధర్వభర్తల చేతిలో ఉపకీచకులందరూ వధింప బడ్డారని గర్వంగా ప్రకటించు. ' అని ఆమెను పంపించాడు.  


జరిగిన విషయమంతా విరాటరాజుకు, మంత్రులు, ద్రౌపది నగరం లోనికి ప్రవేశించే ముందే తెలియజేశారు. సైరంధ్రిని దేశ బహిష్కరణ చెయ్యమని సలహా యిచ్చారు. విరాటరాజు తొందరపడకుండా, సుధేష్ణ మందిరానికి వెళ్లి, ఆమెతో విషయం చర్చించి, సైరంధ్రిని సాగనంపే బాధ్యత ఆమెపై వుంచాడు. 


అక్కడ ద్రౌపది, భీముడు చెప్పిన ధైర్యవచనాలతో, నిర్భయంగా తన స్నానం ముగించుకుని, బట్టలను శుభ్రం చేసుకుని, యేమీ జరుగనట్లే, విరాటనగరం లోనికి ప్రవేశిస్తున్నది . అయితే నగరవాసులు, ఆమెను ఒక అపశకునంగా, దుష్టశక్తిగా, భావిస్తూ, భయంగా అటూ యిటూ పరుగులు తీస్తూ, ఆమెను చూడకుండా వుండడానికి, కనులు మూసుకుని మరీ పరుగెడుతున్నారు.  


ద్రౌపది యివేమీ పట్టించుకోకుండా, పాకశాలమీదుగా వస్తూ, ' నాకు బంధవిముక్తి కలిగించిన గంధర్వరాజాయ నమోనమ: ' అని భీమసేనునికి కృతజ్ఞతగా అభివాదం చేసింది. ' దేవీ ! నీ ఆజ్ఞకువశులై నీ భర్తలు యేమిచేయడానికైనా సిద్ధంగా వున్నారు. ఇక స్వేచ్ఛగా నీపనులు చూసుకో ! ' అని వుత్సాహంగా సమాధానం యిచ్చాడు భీముడు.  


భీముని మాటలకు ఆనందిస్తూ, నర్తనశాల మీదుగా ఆమె నగరంలోనికి వస్తున్నది. బృహన్నల వేషంలో వున్న అర్జునుడు, తన శిష్యురాండ్రతో చేస్తున్న నాట్య విన్యాసాలు ఆపి, బయటకు వచ్చి ఆమెను ఆదరంగా చూశాడు. ఆయన శిష్యురాండ్రు, ' సైరంధ్రీ ! నీవలన విరాటనగర నారీజనానికి భద్రత యేర్పడింది. ఆ కీచకుడు నీభర్తల చేతిలో చచ్చాడు. ' అని ఆమెను మెచ్చుకున్నారు.  


ఊరుకున్నవాడు వూరుకోకుండా, బృహన్నల " సైరంధ్రీ ! అసలు యేమి జరిగిందో వివరంగా చెప్పు. నాకు వినాలని కుతూహలంగా వున్నది. ' అన్నాడు. అంతే ! ద్రౌపదిలోని బాధ మళ్ళీ విజృంభించింది. ' బృహన్నలా ! నాట్యకత్తెల నడుమ నర్తనశాలలో వుండే నీకు, సైరంధ్రి బాధలతో పనేమిటి ? జరిగినది విని యేమి ఆనందిద్దామని అనుకుంటున్నావు ? నా బాధ నీకు ఆనందించే కథలాగా కనబడుతున్నదా ? ' అని బాధగా ప్రశ్నించింది. 


దానికి అర్జునుడు అంతే వేదనతో, ' సైరంధ్రీ ! నీ బాధ నాకు అర్ధమైంది. ఏ అల్ప ప్రాణితో కూడా తూగలేని, యీ నపుంసకత్వ రూపం లో వుండి, నేను నీ గురించి తెలుసుకుని, యేమి సహాయం చెయ్యగలను. ఈ నపుంసకరూపం లో నేను పడుతున్న వేదన యెవరితో చెప్పుకోను. ఒకరి బాధలు యింకొకరికి అర్ధం కావు అనే విషయం నీ మాటలద్వారా నాకు సుస్పష్టం అయ్యింది. ' అని శిష్యురాండ్ర ముందు బయట పడకుండా, తనబాధను ఆమెకు తెలియజేశాడు.


ఆ తరువాత, ద్రౌపది, నాట్యగత్తెలు తోడురాగా, సుధేష్ణాదేవి మందిరం సమీపించింది.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

🙏🙏🙏

సేకరణ

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -8


.ధృవుండు తపంబు చేయుట 


(హరిని) స్వధర్మాయత్తమైన ఏకాగ్రచిత్తంలో నిలిపి ఆరాధించు. ఆ మహాత్ముని కంటె నీ దుఃఖాన్నితొలగింప గలిగినవాడు మరొకడు లేడు.” అన్నది సునీతి. పరమార్థసిద్ధికి కారణాలైన తల్లి మాటలను ధ్రువుడు విని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చి పట్టణం నుండి బయలుదేరాడు. ఆ సమయంలో నారదమహర్షి ఆ వృత్తాంతాన్ని తెలుసుకొని ధ్రువుని దగ్గరకు వచ్చి, అతని కోరికను తెలుసుకొని, పాపాలన్నిటినీ పారద్రోలే తన చల్లని చేతితో అతని శిరస్సును స్పృశించాడు. ‘గౌరవహానిని సహింపని క్షత్రియుల తేజస్సు అద్భుతమైనది కదా! పసివాడై కూడ పినతల్లి పలికిన దుర్వాక్కులను మనస్సులో ఉంచుకొని నగరంనుండి వెళ్ళిపోతున్నాడు’ అని మనస్సులో ఆశ్చర్యపడి “నాయనా! సకల సంపదలు కలిగిన గృహాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావు? బంధువులు చేసిన అవమానంచేత బాధపడుతున్నట్లున్నావు” అని పలుకగా ధ్రువుడు ఇలా అన్నాడు “సవతితల్లి మాటల వల్ల అయిన గాయాన్ని భగవద్ధ్యానం అనే ఔషధంతో నయం చేసుకొంటాను”. ధ్రువుని మాటలు విన్న నారదుడు ఇలా అన్నాడు.నాయనా! విను. ఎల్లప్పుడు ఆటలందు ఆసక్తిని చూపవలసిన ఈ పసివయస్సులో గౌరవాగౌరవాలను పట్టించుకొనవలసిన పని లేదు. 

కనుక మంచి చెడులను నిర్ణయించే వివేకం నీకు ఉన్నా విచారించకు. మానవులు తమ పూర్వకర్మలను బట్టి కలిగే సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. కనుక తెలివి గల మానవుడు తనకు కలిగే సుఖదుఃఖాలను దైవసంకల్పం వల్ల కలిగినవని భావించి, వానితోనే తృప్తిపడతాడు. కాదు, నీవు నీ తల్లి చెప్పిన యోగమార్గాన్ని అనుసరించి భగవంతుని దయను పొందుతాను అన్నట్లయితే...పుణ్యాత్మా! యోగీంద్రులు పెక్కు జన్మలలో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించి కూడ ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆ హరిని ఆరాధించడం నీకు చాల కష్టం. కాబట్టి వ్యర్థమైన ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. మోక్షాన్ని కోరుకున్నట్లయితే ముసలితనంలో దానికోసం ప్రయత్నించు. దైవవశాన సుఖదుఃఖాలలో ఏది కలిగినా మనస్సులో సంతోషించేవాడు విజ్ఞాని అనిపించుకుంటాడు. ఇంకా గుణవంతుని చూసి సంతోషిస్తూ, గుణహీనుని చూసి జాలిపడుతూ, తనతో సమానుడైనవానితో స్నేహం చేస్తూ ప్రవర్తించేవాని దరికి తాపత్రయాలు చేరవు” అన్న నారదుని మాటలు విన్న ధ్రువుడు ఇలా అన్నాడు. “పుణ్యాత్మా! సుఖదుఃఖాల వల్ల తెలివి కోల్పోయిన వారికి శాంతి లభించదని అన్నావు. శత్రువులకు భయం కలిగించే క్షాత్రధర్మాన్ని నేను అవలంబించాను. కనుక నాకు వినయం ఎక్కడిది? సురుచి పలికిన దుర్భాషలు అనే బాణాలచేత బ్రద్దలైన నా హృదయంలో శాంతికి తావు లేదు. కాబట్టి ముల్లోకాలలోను శ్రేష్ఠమైనది, ఇతరు లెవ్వరూ పొందనిది అయిన స్థానాన్ని నేను పొందాలని ఆశపడుతున్నాను. అందుకు నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు. నీవు బ్రహ్మ ఊరువునుండి జన్మించి, నేర్పుతో వీణను మ్రోగిస్తూ, లోకాలకు మేలును కూర్చే నిమిత్తం సూర్యభగవానిని వలె సంచరించే మహానుభావుడివి” అని చెప్పగా (నారదుడు) విని...నారదు డిలా అన్నాడు “పుణ్యాత్మా! నాయనా! విను. నిన్ను మోక్షమార్గాన్ని పొందడానికి ప్రేరేపించినవాడు పురుషోత్తముడైన వాసుదేవుడే. కనుక...నీవు ఆ మహాత్ముని ఏకాగ్రమైన చిత్తంతో సేవించు.ధర్మార్థకామమోక్షాలు అనబడే నాలుగు పురుషార్థాలను శ్రేయస్సును పొందాలి అని అనుకునే మానవునికి హరి పాదపద్మాలు తప్ప మరొక ఉపకరణము లేదు.అందుచేత సుగుణనిధీ! యమునానది ఒడ్డున హరికి నివాసస్థానమూ, పవిత్రమూ, పుణ్యప్రదమూ అయిన మధువనానికి వెళ్ళు. అక్కడ నీకు మేలు కలుగుతుంది. శుభాలను కలిగించే ఆ యమునానది నీటిలో స్నానం చేసి, నిశ్చలమైన బుద్ధితో నారాయణునికి నమస్కరించు. యమ నియమాలను అవలంబించు. ఇంకా పసివాడవు కనుక వేదాలను పఠించే అర్హత నీకు లేకున్నా దర్భలతోను, జింకచర్మంతోను స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని, పూరకము రేచకము కుంభకము అనే ఈ మూడు విధాలైన ప్రాణాయామాలతో ప్రాణేంద్రియ మనోమలాలను పొగొట్టుకొని, చాంచల్య దోషాలను తొలగించుకొని, స్థిరమైన మనస్సుతో (హరిని ధ్యానించు).శ్రీహరి ఆశ్రితుల యెడ అపారమైన కృపారసం చూపేవాడు. సుప్రసన్నమైన ముఖం, చల్లని చూపులు, అందమైన ముక్కు, సొగసైన కనుబొమలు, చిక్కని చెక్కిళ్ళు కలిగిన చక్కనివాడు. ఇంద్రనీల మణులవలె ప్రకాశించే మేను కల పడుచువాడు. ఎఱ్ఱని నేత్రాలు, పెదవులు కలవాడు. దయాసముద్రుడు. పురుషార్థాలను ప్రసాదించేవాడు. నమస్కరించే వారికి ఆశ్రయ మిచ్చేవాడు. శుభాలను కలిగించేవాడు. శ్రీవత్సం అనే అందమైన పుట్టుమచ్చ కలవాడు. సర్వలోక రక్షకుడు. సర్వమూ చూచేవాడు. ఉత్తమ లక్షణాలు కలిగిన పురుషోత్తముడు. పుణ్యస్వరూపుడు. నీలమేఘశ్యాముడు. అవ్యయుడు.

ఇంకా. . . .ఆ శ్రీహరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతూ ఉంటాడు. ఆయన ఆశ్రితులను పోషించేవాడు. అతని కటిప్రదేశం అందమైన మొలత్రాడుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలను ధరిస్తాడు. కౌస్తుభం అనే మణికాంతులతో అందమైన కంఠమాలను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖ చక్ర గదా పద్మాలను నాలుగు చేతులలో ధరించి ఉంటాడు. ఆయన లోకప్రసిద్ధుడు. కమ్మని సువాసన గల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆయన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుంటాడు. మేలిమి బంగారు అందెలు ఆయన కాళ్ళకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. దర్శించవలసినవాడు. ఆ శ్రీహరి ఆశ్రితుల మనస్సులకు, కన్నులకు ఆనందాన్ని కలిగించేవాడు. భక్తుల హృదయ పద్మాలలో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు. సాటిలేని శాంత స్వభావుడు. మహానుభావుడు.అటువంటి పురుషోత్తముని పూజించు. హృదయంలో కుదురుకున్నవాడూ, అనురాగమయ వీక్షణాలు వెదజల్లేవాడూ, వరాలను ఇచ్చేవాడూ అయిన నారాయణుని అచంచలమైన మనస్సుతో ధ్యానించు. అప్పుడు ఆ పురుషోత్తముని దివ్యమంగళ విగ్రహం మనస్సులో సాక్షాత్కరించి స్థిరంగా నిలిచిపోతుంది. ఏ మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుందో, ఓంకారంతో కూడి, పన్నెండు అక్షరాలు కలిగి, దేశకాల విభాగాలను తెలుసుకొని జపించవలసిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ఆ వాసుదేవ మంత్రాన్ని 

జపించాలి. గరికపోచలవలె శ్యామలవర్ణం కల వాసుదేవుణ్ణి గరికపోచలతో, అందమైన పద్మాలవంటి కన్నులు కలిగినవానిని పద్మాలతో, తులసిదండలు ధరించేవానిని తులసీదళాలతో, మాలిన్యం లేని శీలం కలవానిని పూలమాలలతో, పక్షివాహనుని పత్రాలతో, లోకాలకు ఆదిమూలుడైన మహానుభావుని వనమూలికలతో, పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవానిని నారబట్టలతో సేవించాలి. భగవంతుణ్ణి మృణ్మయ, శిలామయ, దారుమయ ప్రతిమలలో కాని, నిర్మల జలాలలో కాని, పవిత్ర స్థలాలలో కాని ఆరాధించాలి. 

“ఓం నమో భగవతే వాసుదేవాయః” అనే ద్వాదశాక్షరీ మంత్రోపాసన విధానం నారదమునీశ్వరుడు పంచాబ్దముల ధృవునికి ఉపదేశిస్తున్నాడు. అతి శక్తివంతమైన తిరుగులేని మహా మంత్రపూరిత ఘట్టమిది.మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియై, సదాచార సంపన్నుడై, శ్రీహరి కళ్యాణగుణాలను వర్ణిస్తూ కందమూలాలను మితంగా స్వీకరిస్తూ ఉండాలి.పురుషోత్తముడైన పుండరీకాక్షుడు తన మాయామహిమతో ఇచ్ఛానుసారంగా పెక్కు అవతారాలను ధరించి చేసిన లీలావిశేషాలను మనస్సులో భావించాలి. ఆత్మార్పణ బుద్ధితో చేసే పూజలను ద్వాదశాక్షర మంత్రంతో వాసుదేవునకు సమర్పించాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించేవారు విష్ణుమాయలో చిక్కుకొనరు. వారికి భగవంతుడు ధర్మార్థకామమోక్షాలు అనే పురుషార్థాలలో కోరిన దానిని అనుగ్రహిస్తాడు. విరక్తితో ముక్తిని కోరువాడు, ఎడతెగని భక్తిభావంతో సేవిస్తూ ఉంటాడు” అని నారదుడు ఉపదేశించగా ధ్రువుడు అతనికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి, మహర్షులు నివసించేది, కోరిన కోరికలను ప్రసాదించేది, భగవంతుని పాదపద్మాలచేత అలంకరింపబడింది అయిన మధువనానికి బయలుదేరాడు.నారదుడు ఉత్తానపాదుని దగ్గరకు వెళ్ళి, ఆ రాజు చేసిన నానావిధాలైన పూజలను అందుకొని, ఆనందంతో ఉన్నతాసనంపై కూర్చున్నవాడై ఆ రాజు వంక చూచి...ఇలా అన్నాడు. రాజా! నీ వదనసరోజం వాడి ఉన్నది. నీ మనస్సులోని విచారానికి కారణం ఏమిటి?” అని ప్రశ్నించిన నారదునితో ఉత్తానపాదుడు ఇలా అన్నాడు. మునీంద్రా! నా ప్రియపుత్రుడు ధ్రువుడు ఐదేండ్లవాడు. మంచి తెలివితేటలు గలవాడు; పాపం ఎరుగనివాడు; అతనిని నేను దయమాలి అవమానించాను. అందుకు వాడు అలిగి తల్లితో పాటు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి భయంకరమైన అడవిలో ప్రవేశించి మార్గాయాసంతోను, ఆకలి బాధతోను ముఖపద్మం వాడిపోయిన నా కుమారుణ్ణి, ఏపాపం ఎరుగని పసివాణ్ణి తోడేళ్ళు, సర్పాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూరజంతువులు పొట్టన బెట్టుకున్నాయేమో అనే భయంతో, బాధతో లోలోపల కుమిలిపోతున్నాను. మహానుభావా! ఇలా జరిగినందుకు నేను దుఃఖిస్తున్నాను. అటివంటి ఉత్తముడైన బాలుణ్ణి నా ఒడిలో కూర్చోనివ్వక అవమానించాను. మునీంద్రా! నా చిన్న భార్య సురుచి మీది వలపుతో ఈ దుర్మార్గపు పని చేశాను.”ఉత్తానపాదుని మాటలు విని నారదుడు ఇలా అన్నాడు “రాజా! దేవతల కిరీటాల రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కల శ్రీహరి చేత రక్షింపబడే నీ కుమారుడు సమస్త లోకాలు ప్రస్తుతించే కీర్తి సంపదతో ప్రసిద్ధికెక్కిన చరిత్ర కలవాడు. అతనికోసం దుఃఖించడ మెందుకు?రాజా! ఉత్తానపాదా! లోకపావనుడైన నీ పుత్రుని ప్రభావం నీకు తెలియదు కాని. మహాత్ముడైన నీ కుమారుడు తన పుణ్యంతో తులసీదళదాముడైన నారాయణుని సేవించి లోకపాలకులు సైతం పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. అంతేకాక...పుణ్యాత్మా! నీ కుమారుడు నీ కీర్తిని కల్పాంతం వరకు సుస్థిరంగా ఉండేటట్లు చేస్తాడు. అతడు సుగుణ రత్నాకరుడు. అచిరకాలంలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ పుత్రుని కోసం నీవు దుఃఖించవద్దు.”

అని నారదుడు చెప్పిన మాటలను రాజు తన మనస్సులో విశ్వసించి, ప్రియపుత్రుని తలచుకొంటూ రాజ్యపాలన పట్ల పూర్తిగా నిరాదరం చూపసాగాడు.

🙏🙏🙏

సేకరణ