"#భజ_గోవిందం" శ్లోకాలకు తెలుగు అర్ధము...
#భజ_గోవిందం భజనను జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య రచించినారు. భజనగా పాడినప్పటికీ, వేదంతం యొక్క సారాంశం ఇది కలిగి ఉంది... మనుష్యుని ఆత్మ పరిశీలన గా ఆలోచింపచేస్తుంది...
నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను ? ఈ జీవితం ఏమిటి ? నేను సంపద, కుటుంబం కలిగి ఉన్నాను కానీ శాంతి ఏది ? సత్యం ఏమిటి? జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఆ విధంగా వ్యక్తి జాగృతం దిశగా అంతఃదృష్టిని కలిగిస్తుంది.
ఒక వృద్ద బ్రాహ్మణుడు సంస్కృత వ్యాకరణం లో పాండిత్యానికై ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నట్లు శ్రీ శంకరాచార్యుల వారు కాశీ లో ఉన్నప్పుడు గమనించారు.. ఆ సందర్భంగా సమాజానుద్దేశించి భక్తి మార్గాన్ని ప్రోత్సహించే 33 శ్లోకాల ఈ భజనను అందించారు....
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుక్రింకరణే || 1 ||
మూర్ఖుడా ధనార్జన ఆశను వదులు, మనస్సున గోవిందా గోవిందా అని భజన చెయ్యి.., ఓ అవివేకి... మరణకాలం లో వ్యాకరణ సూత్రాలు ఏమీ కాపాడవు.
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణామ్ |
యల్లభసే నిజ కర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తమ్ || 2 ||
మూర్ఖుడా! ధనార్జన ఆశను వదులు, మనస్సును ఆలోచనలనూ వాస్తవం లో నిలుపు.., ఇప్పటికే గతంలో చేసిన చర్యల ద్వారా ఏమి లభిస్తుంటే దానితోనే సంతృప్తి చెందు.
నారీ స్తనభర నాభీదేశం
దృష్ట్వా మా గా మోహావేశమ్ |
ఏతన్మాంస వసాది వికారం
మనసి విచింతయా వారం వారమ్ || 3 ||
కోరికలు మరియు నారీ సొగసుల కామం వల్ల మాయలో పడి మునిగిపోకు... ఇవన్నీ మాంసం ముద్ద పైన మెరుగులు మాత్రమే. ఇలా మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవటం మరువకు.
నళినీ దళగత జలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలమ్ |
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్ || 4 ||
తామరాకు పైన వానచినుకులు పడి దొర్లినట్లుగా మనిషియొక్క జీవితం అనిశ్చితం.. ప్రపంచం అహం, రోగ, శోకాలకు గురౌతూనే ఉంటుంది అని తెలుసుకో !
యావద్-విత్తోపార్జన సక్తః
తావన్-నిజపరివారో రక్తః |
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే || 5 ||
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంది సంపాదించినత కాలం అందరూ అతనితో ఎలా మెలుగుతారో చూడండి... అదే అతని వృద్ధాప్యంతో వణికే దశలో అతని సంరక్షణ కాదు కదా... కనీసం ఒక మాటైనా ఎవ్వరూ మాట్లాడటానికి ఇష్టపడరు
యావత్-పవనో నివసతి దేహే
తావత్-పృచ్ఛతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్ కాయే || 6 ||
ఒక మనిషి యోగక్షేమాలు అతను బ్రతికున్నపుడు అతని కుటుంబ సభ్యులు విచారిస్తారు. కానీ అతను మృతి చెందిన తర్వాత అతని భార్య కూడా మృత శరీరం చూచి భయపడి దూరంగా వెళ్తుంది.
బాల స్తావత్ క్రీడాసక్తః
తరుణ స్తావత్ తరుణీసక్తః |
వృద్ధ స్తావత్-చింతామగ్నః
పరమే బ్రహ్మణి కోఽపి న లగ్నః || 7 ||
బాల్యం ఆటలతో జారిపోతుంది. యవ్వనం కామ వాంఛలతో జారిపోతుంది. వృద్దాప్యం అనేక ఆలోచనలతో జారిపోతుంది. కానీ పరబ్రహ్మంలో జారిపోవాలని కోరేవారు చాలా అరుదు.
కా తే కాంతా కస్తే పుత్రః
సంసారోఽయమతీవ విచిత్రః |
కస్య త్వం వా కుత ఆయాతః
తత్వం చింతయ తదిహ భ్రాతః || 8 ||
నీ భార్య ఎవరు ? నీ పుత్రుడెవ్వడు ? ఈ విచిత్ర ప్రపంచము... నీవు ఎవ్వడవు ? నీవు ఎక్కడ నుండి వచ్చావు ? సోదరా ! ఈ సత్యాలని ఆలోచించు.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || 9 ||
మంచి వ్యక్తుల సత్సంగం నుండి బంధ విముక్తి కలుగుతుంది. బంధ విముక్తిచే మాయ నుండి స్వేచ్ఛ, తద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ఆత్మ సంతృప్తి వల్ల జీవన్ముక్తి పొందవచ్చు.
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్త్వే కః సంసారః || 10 ||
యవ్వనం లేనప్పుడు కామం ఎందుకు ? నీరు లేని చెరువు వల్ల ఉపయోగమేమి ? ధనం పోయినపుడు భందువులెక్కడ ? సత్యం తెలిసాక ప్రపంచమెక్కడ ?
మా కురు ధనజన యౌవన గర్వం
హరతి నిమేషాత్-కాలః సర్వమ్ |
మాయామయమిదమ్-అఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా || 11 ||
నీకున్న సిరి సంపదలు, స్నేహితులు, యవ్వనం గురించి గొప్పలు చెప్పకు... అవి క్షణకాలంలో కనుమరుగు కాగలవు... మాయ యొక్క ఈ ప్రపంచమనే బ్రాంతి నుండి నిన్ను నీవు విడిపించుకో. శాశ్వతమైన సత్యాన్ని గుర్తించు.
దిన యామిన్యౌ సాయం ప్రాతః
శిశిర వసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః || 12 ||
పగలు రాత్రి, ఉదయం సాయంత్రం, శిశిరం వసంతం వస్తుంటాయి పోతుంటాయి... కాలం జీవితమనే కెరటాలతో ఆడుతుంటుంది. కానీ కోరికలనే తుఫాను ఎప్పటికీ పోదు.
కా తే కాంతా ధన గత చింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జన సంగతిరేకా
భవతి భవార్ణవ తరణే నౌకా || 14 ||
ఓ వెఱ్ఱి మనిషీ ! ఎందుకు ఆలా ధన వ్యామోహన ఆలోచనలలో మునిగిపోతావు ? నీకు మార్గనిర్దేశం చేసేవారు ఎవ్వరూ లేరా ? సంసార సాగరం నుండి నిన్ను వెంటనే కాపాడే నావ ముల్లోకాల్లోకెల్లా ఒక్కటే ఉంది....,అదే సత్సంగం.
జటిలో ముండీ లుంజిత కేశః
కాషాయాన్బర బహుకృత వేషః |
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః
ఉదర నిమిత్తం బహుకృత వేషః || 15 ||
కొందరు వత్తైన జుట్టు ఉందురు..., కొందరు గుండుతో ఉందురు.., కొందరు వెంట్రుకలు టెంపబడి ఉందురు... కొందరు కాషాయ వస్త్రాలలో, మరికొందరు రంగురంగుల వస్త్రాలలో ఉందురు - అంతా కేవలం జీవనానికే.. సత్యం వారి ముందు వెల్లడించినా, మూర్ఖులు చూడరు.
అంగం గలితం పలితం ముండం
దశన విహీనం జాతం తుండమ్ |
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశా పిండమ్ || 16 ||
సత్తువ ముసలివాని శరీరం వదిలిపోయింది, తల బట్టబుర్ర అయ్యింది, పళ్ళు పోయి బోసినోరు వచ్చింది, ఊతకర్రపై వాలినా అతని కోరికలు మాత్రం బలంగానే ఉన్నాయి
అగ్రే వహ్నిః పృష్ఠే భానుః
రాత్రౌ చుబుక సమర్పిత జానుః |
కరతల భిక్షస్-తరుతల వాసః
తదపి న ముంచత్యాశా పాశః || 17 ||
తన శరీరం వేడెక్కేలా ముందు నిప్పు మరియు వెనుక సూర్యుడుతో కూర్చుని ఉన్న మనిషి అక్కడ ఉన్నాడు. రాత్రి చలి నుంచి తప్పించుకోవటానికి వణకుతాడు. అతను తన చేతి చిప్పలోని భిక్షం తిని చెట్టుకింద పడుకుంటాడు. ఇంకా మానసికంగా, అతను కోరికల చేతిలో ఒక దౌర్భాగ్య తోలుబొమ్మ.
కురుతే గంగా సాగర గమనం
వ్రత పరిపాలనమ్-అథవా దానమ్ |
జ్ఞాన విహీనః సర్వమతేన
భజతి న ముక్తిం జన్మ శతేన || 18 ||
ఒకడు గంగకు పోయినా ఉపవాసాలున్నా, దానధర్మాలు చేసినా, జ్ఞానం లేకుంటే వేయి జన్మలైనా ముక్తి లేదు.
సురమందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమ్-అజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగత్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః || 19 ||
గుడిలోనో, చెట్టుకిందో నివసించు, జింక చర్మం ధరించు, నేలపై నిదురించు. బంధాలు వదలివేయి. సుఖాలు త్యజించు. అటువంటి వైరాగ్యం పొందాక ఆత్మసంతుష్టి పొందాక ఎవరైనా విఫలురవుతారా ?
యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ || 20 ||
యోగంలోనో, భోగంలోనో ఆనందించవచ్చు. ఇష్టములో, అయిష్టములో ఉండవచ్చు. కానీ, ఎవరి మనస్సు క్రమంగా బ్రహ్మము నందు రమించునో వారే నిజమైన ఆనందం పొందుదురు, మరెవరూ కాదు.
భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికా పీతా |
సకృదపి యేన మురారీ సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా || 21 ||
భగవద్గీత నుండి కొద్దిగా చదవండి, ఒక్క చుక్క గంగాజలం త్రాగండి, కానీ మురారిని ఒక్కసారైనా పూజించండి. అప్పుడు యమునితో ఏ వాదన ఉండదు.
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనమ్ |
ఇహ సంసారే బహు దుస్తారే
కృపయాఽపారే పాహి మురారే || 22 ||
మరల మరల పుట్టుక, మరల మరల గిట్టుక, మరల మరల తల్లి గర్భంలో శయనం. హద్దులే లేని ఈ సంసార సాగరాన్ని దాటటం నిజాంగా ఎంత కష్టం. ఓ మురారి ! నీ కృపచే నన్ను రక్షించుము!!
రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగీ యోగ నియోజిత చిత్తః
రమతే బాలోన్మత్తవదేవ || 23 ||
రోడ్డుపక్కన గుడ్డ ముక్కలు దొరికినంత కాలము ఒక సన్యాసికి బట్టలకు కొరత లేదు. సత్గుణాలు, దుర్గుణాల నుండి తాను విముక్తి పొందినవాడై సంచరిస్తాడు. భగవంతుని సమాజంలో నివసించేవాడు నిజమైన ఆనందాన్ని, పవిత్రతని, కల్మషలేమిని ఒక చిన్న బాలుని వలే అనుభవిస్తూ ఉంటాడు
కస్త్వం కోఽహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః |
ఇతి పరిభావయ నిజ సంసారం
సర్వం త్యక్త్వా స్వప్న విచారమ్ || 24 ||
నీవు ఎవరు ? నేను ఎవ్వరు ? నేను ఎక్కడ నుండి వచ్చాను ? నా తల్లి ఎవరు ? నా తండ్రి ఎవరు ? ఆవిధంగా చూస్తే ప్రతీదీ సారం లేనిదే మరి ఈ సోమరి ప్రపంచం వదిలివేయండి..
త్వయి మయి సర్వత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్-యది విష్ణుత్వమ్ || 25 ||
నాలో, నీలో, మరి అందరిలో, అన్నిటిలో విష్ణువే కొలువై ఉన్నాడు. నీ కోపతాపాలు, అసహనం అర్ధంలేనివి. విష్ణువు ని పొందాలంటే సమభావం ఎప్పుడూ ఉండాలి.
శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహ సంధౌ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్-సృజ భేదాజ్ఞానమ్ || 26 ||
స్నేహితుడు, శత్రువు, పిల్లలు మరియు బంధువులతో ప్రేమించడానికో, పోరాడడానికో మీ ప్రయత్నాలను వ్యర్థపర్చవద్దు. అందరిలో నిన్నే దర్శించు. ద్వంద భావన (నేను-వారు) పూర్తిగా వదిలివేయి.
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాఽఽత్మానం పశ్యతి సోఽహమ్ |
ఆత్మజ్ఞ్నాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరక నిగూఢాః || 27 ||
లైంగిక వాంఛ, కోపం, దూరాలను విడిచిపెట్టండి. మీ నిజమైన స్వభావం మీద ఆలోచించండి. స్వీయ పరిశీలన లేక గ్రుడ్డిగా వ్యవహరించే వారే మూర్ఖులు. నరకంలో ఎప్పటికీ బాధలు పడతారు..
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమ్-అజస్రమ్ |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తమ్ || 28 ||
రోజూ భగవద్గిత వల్లించండి. విష్ణు నామాన్ని హృదయంలో ధ్యానించండి. అయన వేలాది మహిమలు పాడండి. మంచితనం మరియు పవిత్రత యొక్క ఆనందం పొందండి. మీ సంపదను పేదవారికి, ఆర్తులకు దానం చెయ్యండి.
సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణమ్ || 29 ||
ఎవరు సుఖ వ్యామోహాలకు బానిసలో వారు వారి శరీరాన్ని వ్యాధులకు ఆహారంగా వదులుతారు. మృత్యువు అన్నిటినీ హరించినా , మనిషి తన పాపపు మార్గాన్ని వదలడు.
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తి తతః సుఖ లేశః సత్యమ్ |
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః || 30 ||
సంపద సంక్షేమం కాదు, నిజంగా అందులో ఏ సంతోషం లేదు. అన్ని సమయాల్లో ప్రతిబింబిస్తుంది. ఒక ధనవంతుడు తన స్వంత కుమారునికి కూడా భయపడతాడు. ఎక్కడైనా సంపద తీరింతే.
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేక విచారమ్ |
జాప్యసమేత సమాధి విధానం
కుర్వ వధానం మహద్-అవధానమ్ || 31 ||
ప్రాణాయామం చెయ్యండి. బాహ్య ప్రేరణలతో ప్రభావితం కాకండి. శాశ్వత అశాశ్వత తారతమ్యాలు గుర్తించండి. భగవన్నామ స్మరణ చెయ్యండి మనస్సుకు ప్రశాంతత ఇవ్వండి. ఇదంతా ఏంతో జాగ్రత్తగా చెయ్యండి.
గురు చరణాంభుజ నిర్భరభక్తః
సంసారాద్-అచిరాద్-భవ ముక్తః |
సేందియ మానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ || 32 ||
ఓ గురుచరణ పద్మముల భక్తుడా! నీవు త్వరలోనే ఈ సంసారం నుండి ముక్తిని పొందుతావు. నీహృదయంలో నివసించు భగవంతుని అవలోకనం చెయ్యటానికి క్రమబద్దిత జ్ఞానేంద్రియాలు నియంత్రిత మన్నస్సు తో రా.
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే |
నామ స్మరణధన్యు పాయః
నహి పశ్యామో భవద్ గీతరణో || 33 ||
గోవిందా గోవిందా అని భజన చెయ్యి. ఓ మూర్ఖుడా ! భగవన్నామ స్మరణ కాకుండా మరే దారి లేదు ఈ జీవిత సాగరాన్ని దాటటానికి...
సర్వేజనా సుఖినోభవంతు..
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి