🍁ఒకరోజు బుద్ధుడి శిష్య బృందం లోని ఒక శిస్యుడు బిక్షటనకు వెళ్లొచ్చి ఎంతో జిజ్ఞాసతో బుద్ధుడి ని ఇలా ప్రశ్నిస్తాడు 🔥
🌷 *ఎంతో నిరుత్సాహంతో* గురువు గారు ప్రపంచం లోని జనులందరు దుఃఖం లో ఉండి ఏడుస్తున్నారు కదా మరి వారిపై ఆ భగవంతునికి కరుణ రావడం లేదు ఎందుకు
తమకు ఈ విషయం తెలిసినా తమరు
ఇంత ప్రశాంతంగా ఎలా ఉండ గలుగుతున్నారు అని ప్రశ్నిస్తాడు🍁
*🌺దానికి బుద్దుడు ఇలా సమాధాన మిస్తాడు* ఎవరన్నారు బాధలో ఉన్న వారిపై ఆ పరమాత్ముడు కరుణ చుపట్లేదని ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారు అని నువ్వు అంటున్నావో వారిపై ఆ పరమాత్ముడు అనంతమైన ప్రేమను కరుణను ఎల్లవేళలా
చూపిస్తూనే ఉన్నాడు ఆ పరమాత్ము డే కనుక కరుణను
చూపక పోతే ఈ భూమి మీద ఎవరు ఉండేవారు కాదు🌸
🍁అప్పుడు శిష్యుడు అది ఎలాగో కొంచం వివరించ గలరా అని ఎంతో కుతూహలం తో అడుగుతాడు🍁
*🌹అప్పుడు బుద్దుడు ఇలా అంటాడు*
ఈ సకల సృష్టి అంతకుడా కర్మ సిద్ధాంతం తో సాగుతోంది
ఈ సిద్ధాంతం ప్రకారం తప్పు తెలిసి చేసిన తెలియక చేసిన
దాని పర్యవసానం కొంతైనా
అనుభవించక తప్పదు
ఈ కష్టాలను అనుభవిస్తున్న వారందరు కూడ తెలియని
అజ్ఞానంతో కొని తెచ్చు కున్నవే
ఈ విషయం తెలిసే ఆ పరమాత్మ వారిపై అనంతమైన కరుణ వర్షాన్ని కురిపిస్తున్నాడు
మనిషి కి వచ్చిన కష్టాలను తట్టుకొని ఉండాలంటే మనిషి శరీరం తట్టుకొని ఉండలేదు ఆ వచ్చిన కష్టం తో హృదయం బద్దలై పోతుంది
అందుకే ఆ పరమాత్ముడు మనిషికి దుఃఖం అనే ప్రక్రియను ఇచ్చి ఆ ప్రక్రియ ద్వారా కన్నీటిని బయటకు తెప్పించి హృదయాన్ని తేలిక పరుస్తున్నాడు
ఎప్పుడైతే హృదయం తేలిక పడుతుందో అప్పుడు గడిచిన కాలాన్ని మరిచి పోయి మళ్లీ
ముందుకు సాగిపో గలుగుతా డు అని ఆ శిష్యునికి
*బుద్దుడు ఆ పరమాత్మ కరుణను* వివరించాడు
🍁🌹🌸🌺🌷💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి