అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి🙏
అమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు,
పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది
మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది
స్ట్రీలు చేస్తే ! వారిలో..
అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది
అవును ఆడవారు కుంకుమ పూజ చేస్తూ
లలితా సహస్త్రనామం పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది..
ఏమిటి నిదర్శనం అంటారా,
వశిన్యాది దేవతలకు లలితా రహస్య సహస్త్రనామం
చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో 'పలికేది మీరైన మీలో ఉండి పలికించేది నేనే" ని
చెప్పారు కదా..
అలాంటి లలితా పారాయణం చేస్తు కుంకుమ పూజ చేస్తున్న స్ట్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో
వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది...
అంత కన్నా ఏమీ వరం కావాలి
అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్ని నశించి పోతాయి
నీ దేహం మనసు పవిత్రం అవుతుంది,
మళ్ళీ ఏదైనా పాప కర్మలు చేసి మురికిని
అంటించుకుంటున్నారు కానీ..
సదా సత్ ప్రవర్తనతో ఉంటే దేవీ ఉపాసన చేసే
ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపాలే...
ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే అయితే
ప్రవర్తన కర్మను అనుసరించి,
పాజిటివ్ ఎనర్జీ ,నెగటివ్ ఎనర్జీ develop అవుతుంది, అంటే దేవతగా ఉండాలన్నా,
దయ్యంగా ఉండాలి అన్నా వారి వారి ప్రవర్తన వల్ల
ఆ రూపం వారిలో మేలుకుంటుంది...
ఎంత ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయించినా
నలుగురు ఆడవారి చేత కుంకుమ పూజ చేయించనిదే అక్కడ జరిగిన అమ్మవారి పూజకు
ఫలితం ఉండదు
ఎంత మందిని ఒక్క చోట చేర్చి కుంకుమ పూజ చేయిస్తే
ఆ కార్యానికి అంత శుభం కలుగుతుంది.🙏
అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏
[27/10, 8:17 pm] +91 93913 24915: 🌸 *పరమాత్మ ను చేరే సులభ మార్గాలు.* 🌸
*పరమాత్మ సకల జీవరాసులలో అంతర్యామి గా కొలువైఉన్మాడు అన్నది శాశ్వత సత్యం. అది మనకి ఎరుక లేకపోతే అది మన అజ్ఞానం. ఆ పరమాత్మ ని చేరాలంటే నాలుగు విషయాలలో ఎరుక తో ఉండి మనము ఆచరించాలి.*
*అవి*:
🌷 *1) సంతోషం:-*
*మనతో ఉన్నత స్థితిలో ఉన్నవారి పట్ల మనం ఈర్ష అసూయలతో ఉంటాం, కానీ మనము సంతోషం తో ఉండాలి అటువంటి సందర్భంలో.*
🌷 *2) కరుణ:*
*మన చుట్టూ ఉన్నవారు కష్టాలతో ఉంటే మనకి చెప్పారాని ఆనందము. కానీ ఇలాంటి సందర్భములొ కావాల్సింది కరుణ.*
🌷 *3) స్నేహము:*
*మనతో సమానముగా ఉన్నవారి పట్ల మనకు పోటీ తత్వం ఉంటుంది. కానీ దీని బదులు స్నేహం ఉండాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం.*
🌷 *4) ఉపేక్ష:*
*మన చూట్టూ ఉన్నవారు పాపాలు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నవారు అయితే మనము వారి వెంటపడి వారిని మార్చే ప్రయత్నం లో నిరంతర జ్ఞాన బోధ చేస్తాం. కానీ పాపం వారు వినిపించుకునే దశలో ఉండరు. కానీ ఇలాంటి వారి పట్ల మనకి కావాల్సినది ఉపేక్ష. ఎందుకంటే సమయమే వారిలో మార్పు తెస్తుంది. మన ఇతిహాసాలు ఈ సత్యం నే చెప్తాయి.*
*చూశారా సంతోషము, స్నేహము, కరుణ, ఉపేక్ష అన్నవి నిజముగా పరమాత్మ దగ్గరకు మనని చేరుస్తాయి.*
[27/10, 8:17 pm] +91 93913 24915: 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
*మాయ*
*********
*భక్తుడు :*
స్వామి! మాయ అంటే ఏమిటి ?
*మహర్షి :*
ఆశ్రమానికి వచ్చే భక్తులను గురించి చెపుతూ ...... ముందుగా ఇక్కడ ఏదో తెలుసుకుందామని వచ్చి ఒక మూల వినయంగా ఒదిగి కూర్చుంటారు. రెండు మూడు రోజులు అయిన తరువాత కొంచెం ముందుకు జరుగుతారు. ఆ తరువాత ఆశ్రమ నిర్వహణలో తప్పులు లెక్కపెడతారు. ఆశ్రమం మీద అధికారం కూడా చెలాయిస్తారు.
ఇట్లా చేస్తే బాగుంటుందని, అట్లా చేస్తే బాగుంటుందని సలహాలు చెబుతారు. దీనితో ఇంతకు ముందు ఆశ్రమాన్ని నడుపుతున్న వారికి, ఇప్పుడు ఇక్కడ ఉన్నవారికి కలహం ఏర్పడుతుంది. అది చివరకు యుద్ధంగా మారుతుంది.
ఎదో ఒక విధంగా నన్ను కూడా తమ పక్షం రమ్మని పిలుస్తారు. చివరికి నా నెత్తి మీద కూడా కూర్చోవటానికి ప్రయత్నిస్తారు.
ఈ కలహప్రియత్వంతో అహంకారంతో తాము వచ్చిన పని మరచిపోతారు. ఇట్లా ఎందరో వచ్చారు. వెళ్ళి పోయారు కూడా. *"వచ్చిన పనిని మరచిపోవటమే మాయ."*
*అంటే మనం కూడా మానవజన్మ ఎందుకు పొందినాము అనే విషయం మరిచిపోయి మళ్లీ మళ్లీ అనేక రకాలైన జన్మలు పొందుతున్నాము. అదే మాయ.
[27/10, 8:17 pm] +91 93913 24915: "
*నేను ఎవరు ???*
🍁🍁🍁🍁
నేను ఎవడను?"
అనే ప్రశ్నకు సరైన సమాధానం , ప్రశ్న అనంతరం కలిగే స్తబ్దతే.
అదే సమర్దవంతమైన సమాధానం .
నేను ఎవడను? అనేది ప్రశ్న కాదు .
అది సమాధానపడవలసిన సమాధానం .
"నేను ఎవరు అంటే అనే వాడు ఆగిపోవడం".
"నేను ఎవరు అంటే అనంతమైన అంతర్వాహినీ గంభీరత్వమును అలుముకోవడం".
"నేను ఎవరు అంటే అన్ని ప్రశ్నలకు సమాధానమే కాదు మరుప్రశ్నకు తావు లేని, తోవ లేని తనంతో 'ఉండిపోవడం'.
"నేను ఎవరు అంటే వెంబడించడం కాదు
వెంబడించే, వెతుకులాడే తనమును అర్దం చేసుకోవడం".
"నేను ఎవరు అంటే కనులు తెరిచి ఉండగానే బాహ్యమంతా ఉనికిని కోల్పోవడం".
"నేను ఎవరు అంటే స్పందన లేని తనంతో తులతూగడము".
"నేను ఎవరు అంటే ఉదాశీనంగా ఊరకనే ఉండటమనే స్ముృతి కూడా పలకరించకపోవడం".
"నేను ఎవరు అంటే అనేవాడు తన ఉనికిని కోల్పోవడం" .
"నేను ఎవరు అంటే జ్ఞప్తి - మరుపు లేని తనంలో స్తంభించిపోవడం".
ఇక "నేను" కు ఎవరు, ఏమిటి అనే ప్రశ్నలు కలగవు.
దానికి ఎట్టి స్పందన కలగదు.
" నేను " ఉంటుంది .
అది ఏమీ అనదు, అనుకోదు.
" నేను" (ఉనికి)కి స్పందన లేదు .
" నేను " నుండి వచ్చే స్పందనను మనము 'నేను' (మనస్సు) అని అంటున్నాము .
అనేది నేను అని అనుకుంటున్నాము మన అనుభవము కూడా అదే చెబుతుంది.
ఆ అనుభవము వ్యక్తిగతము.
వ్యక్తిగతమైన అనుభవము కదులుతుంది, చెరుగుతుంది .
నీలో వ్యక్తిగతమైన అనుభవమునకు ఆవల స్పందన లేని ప్రమాణం
ప్రతిస్పందిచడం తెలియని తనము
కదలదు, చెక్కుచెదరదు .
కనుక నీ మూలమైన మూలంలో స్పందన లేని ఉనికిలో అనంత పారవస్యంలో ఎడతెరుపులేని మహా నిశ్చింతలో నీ సమస్త స్పందనలనూ మమేకము చేయి .
ఆ శుద్ద ఉనికితో తదేకంగా మమేకమవ్వు.
మమేకమవ్వడమంటే ఉనికిగా ఉండటమే.
ఉండటమే ఉనికి.
మనం ఉన్నాను అన్న ధోరణిని అలవర్చుకోవాలని చూస్తున్నాము.
అలవాట్లు నీ పరాయిస్దితిలో కూడా అగచాట్లునే తీసుకువస్తాయి.
నీ నుండి వచ్చే ప్రతీ స్పందనకు ఒక నూతనతను సమర్దిస్తూ స్ధిరపరచాలను కుంటున్నావు.
ఇది కోరిక లేదా ఆసక్తి యొక్క బాహ్య రూపములు.
నీ మూలములో నీవు మాత్రమే ఉన్నావు.
ఇది ప్రశ్నలకు అందేది కాదు.
అలాగని దీనికి సరైన సమాధానమూ లేదు.
నిన్ను నీవు ప్రశ్నించడమంటే నీలో నూతనతను వెతకడమే అవుతుంది.
అది కూడా నిన్ను నీవు విభాగం చేసుకోవడమే.
నిన్ను నీవు స్మరించగానే విభాగమైపోతావు.
నీవు నీవుగా ఉండటమే శ్రేష్టమైనది.
🍁🍁🍁🍁
[27/10, 8:17 pm] +91 93913 24915: అరుణాచల శివ 🙏
🍁🍁🍁🍁🍁🍁🍁
సద్దర్శనము - సద్విద్య' (ఉన్నది నలుబది)
- భగవాన్ శ్రీ రమణ మహర్షి
శ్లోకం : 29
సత్యా స్థితి ర్నాహ ముదేతి యత్ర
తచ్చోదయస్థాన గవేషణేన l
వినా న నశ్యేద్యది త న్న నశ్యేత్
స్మాత్మైక్యరూపా కథ మస్తు నిష్ఠా ll
తాత్పర్యము:
'అహం'బుద్ధి ఉదయించని స్థితియే సత్యమైన స్థితి. ఆ 'అహము' జన్మములమును అన్వేషింపకుండా నశింపదు. 'అహము' నశించని యెడల జీవ-పరమాత్మైక్య రూపమైన ఆత్మనిష్ఠ సిద్ధింపదు.
అహంభావము తన మూలమును తెలుసుకొనవలసిన అవసరమున్నదని బలీయముగా భావించినపుడు తదన్వేషణలో అది లయమును పొందును. అహంభావనాశము జీవ-పరమాత్మైక్య సాక్షాత్కారముగా పరిణమించును. అదే పరమమైన 'ఆత్మనిష్ఠ' అనబడును.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏
🍁🍁🍁🍁🍁🍁🍁
[27/10, 8:17 pm] +91 93913 24915: 🌷ధర్మం నాలుగోపాదం!🌷
🪔🪔🪔🪔🪔🪔🪔
రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.
రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే!
'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.
'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.
అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు. పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది.
చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.
"అదిగో. ఆ తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని, తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది.
ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు.
"సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టే లోగా రైలు కదిలిపోతే... అప్పుడో?" నా చర్యని సమర్ధించుకుంటూ అన్నాను.
"వాడికేం నష్టం ఉండదు. మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా, చివరికి లాభాల్లోనే ఉంటాడు!" మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది.
"అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి.
పాపం.. ట్రైయిన్ బయలుదేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!"
అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు.
"వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు తగిలితే చాలు, ఆ రోజు గడిచిపోతుంది!" అంటూ చురచురా చూసింది.
నేనేం మాట్లాడలేదు.
"అయినా వాడు మీలా సుభాషితాలు చదవలేదు లేండి!" అంటూ, ఆవిడ చుట్టూ చూసి ఇంకేం మాట్లాడ లేదు. అప్పటికే అక్కడ అందరి చూపులూ మావేపే ఉన్నాయి.
రైలు బాగా స్పీడ్ అందుకుంది. అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది. డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది.
మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో, చాలా సార్లు నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను.
మనుషుల్లో మంచితనం చూడాలి. వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం!
మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి, అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలాసార్లు ఓడిపోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడలలేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది.
"పోనీలెద్దూ, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మీద్దెలు కట్టెస్తారా?" అని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను.
ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు.
నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలుపెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్ని చూస్తూ కూర్చున్నాను.
అప్పటికే తోటి ప్రయాణీకులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు. కొందరు నన్నో వెర్రివాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తున్నారు.* *'ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగుతుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేకపోలేదు.
రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను.
🌷"సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?" ఆ మాట వినేసరికి ఇటు చూసాను. జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు.
ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు. అతను మధ్యవయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది.
"అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలుదేరి పోయింది! కాని నీ దగ్గర మేం కాఫీ తీసుకోలేదే!"
నిజాయితీగా అన్నాను.*
"అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?"* *మరొకసారి అదే ప్రశ్న అడిగాడు.
"అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!"
"అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయకూడదు కదా, అందుకే మరోసారి అడిగాను!" అంటూ, జేబులో నుంచి డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు.
"నువ్వూ..."
"వాళ్ళబ్బాయినండీ!'
ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయినట్టుంది..
"రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది. అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు పోన్లో చెపుతారండి.
వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి.* *అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా నాన్న!"
ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది.
నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది.
"చదువుకుంటున్నావా?" అడిగాను.
"టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా నాన్నకు సాయం చేస్తాడండి, మధ్యాహ్నం నేనుంటానండి!"
ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది.
"ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?" అంటూ అడిగాను.
నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను.
"తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండువందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు. చాలా సంతోషం!" అతడ్ని అభినందిస్తూ అన్నాను.
"పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను. అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు, పుస్తకాల్లో కూడా అలాంటివే ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను. అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందుల్లేకుండా నడుపుతున్నాయి!"
ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది. అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను.
" అయితే ఒక్క విషయం బాబూ!" అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి.."చెప్పండి!" అంటూ మళ్ళీ అతని మాటలమీద దృష్టి సారించాను.
"మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటివేవీ లేవు! అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను. అంతే బాబూ!" అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి, మరోసారి అభినందించి, అబ్బాయి బుజం తట్టెను.
ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు.
‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!
*****
🙏🪔ధర్మో రక్షతి రక్షితః🪔🙏
శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి