27, అక్టోబర్ 2020, మంగళవారం

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

*

                                                                                                                                                                         *భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏


*రోజుకో పద్యం: 1932 (౧౯౩౨)*


*10.1-925-*


*క. వడిగొని బలరిపు పనుపున*

*నుడుగక జడి గురిసె నే డహోరాత్రము; ల*

*య్యెడ గోపజనులు బ్రతికిరి*

*జడిఁ దడియక కొండగొడుగు చాటున నధిపా!* 🌺



*_భావము:  బలాసురుని శత్రువగు దేవేంద్రుని యొక్క ఆజ్ఞచే ఏడు రోజుల పాటు ఎడతెగకుండా కురిసిన జడివానకు ఏ మాత్రము తడక, జడిసిపోకుండా, ఆ గోపాలకులందరు ఆ కొండ అనే గొడుగు  మాటున (క్రింద) ఆశ్రయము పొంది రక్షింప బడ్డారు._*  🙏



*_Meaning: The incessant rain continued for seven nights and days at the instance of Indra, the enemy of Demon Balasura. But being protected by the benevolent Krishna, the Yadava folk remained safe and secure underneath the Goverdhana hill._*  🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

 K Sudhakar Adv Br: *వందేమాతరం*

                                                                                                                           *భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1933 (౧౯౩౩)*


*10.1-926-వ.*

*10.1-927-*


*క. "ఉడిగెను వానయు గాలియు*

*వడిచెడి నదులెల్లఁ బొలుప వఱద లిగిరెఁ; గొం*

*డడుగున నుండక వెడలుఁడు*

*కొడుకులుఁ గోడండ్రు సతులు గోవులు మీరున్. "* 🌺



*_భావము: ఈ విధముగా ఏడు  రోజుల పాటు రాత్రింబగళ్ళు  శ్రీకృష్ణుడు ఆ గోవర్ధన  పర్వతమును అలాగే ఎత్తి పట్టుకుని ఉన్నాడని, ఆ గోపాలకులకు ఎటువంటి హాని కలగలేదని తెలుసుకున్న పర్వతభేది యగు ఇంద్రుడు కృష్ణుని మహిమాన్వితమైన లీలను గ్రహించాడు. ఆశ్చర్యచకితుడై, ఇంత ప్రయత్నము చేసినా వ్యర్థమై పోయిందని సంవర్థక  మేఘములను మరలించుకుపోయాడు. ఒక్క సారిగా ఆకాశము, సూర్యమండలము  ధగద్ధగాయమానముగా ప్రకాశించింది. ఇది గమనించిన  గోవర్ధనధారి శ్రీకృష్ణుడు గోపాలకులతో ఇలా అన్నాడు:  "వాన వెలిసింది, గాలి తీవ్రత కూడా తగ్గి నదులలో వరద క్షీణించి సామాన్య పరిస్థితులు  నెలకొన్నాయి. మీరు మీ కొడుకులు, కోడళ్ళు, పిల్లలతో సహా ఈ కొండ క్రింది నుండి బయటకు వచ్చెయ్యండి"._* 🙏



*_Meaning: Indra learnt that Sri Krishna protected the Yadavas and the cows by lifting and holding the Goverdhana mountain high, providing them safe shelter. Having realised the greatness and superhuman power of Sri Krishna and  consequent failure of his well-conceived plan, Indra beat a retreat along with the Samvartaka clouds as Sri Krishna thwarted all his efforts and the yadavas remained unaffected in spite of terrific hailstorm and deluge. With this retreat, the sky and the space shone sparkling bright and with radiance. Observing the change, Sri Krishna told his people: "The rain stopped, the force of the gale too reduced and the flooding in the rivers too abated whereby the situation has returned to normalcy. You please come out from the shade of this mountain with your kith and kin"._*   🙏                



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*

                                                                                                                                   *భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1935 (౧౯౩౫)*


*10.1-930-వ.*

*10.1-931-*


*సీ. "కన్నులు దెఱవని కడుచిన్ని పాపఁడై;*

*దానవిఁ జనుఁబాలు ద్రాగి చంపె;*

*మూడవ నెలనాఁడు ముద్దుల బాలుఁడై;*

*కోపించి శకటంబుఁ గూలఁ దన్నె;*

*నేఁడాది కుఱ్ఱఁడై యెగసి తృణావర్తు;*

*మెడఁ బట్టుకొని కూల్చి మృతునిఁ జేసెఁ;*

*దల్లి వెన్నలకునై తను ఱోలఁ గట్టినఁ;*

*గొమరుఁడై మద్దులు గూల నీడ్చెఁ;*


*తే. బసుల క్రేపులఁ గాచుచు బకునిఁ జీరె;*

*వెలఁగతో వత్యదైత్యుని వ్రేసి గెడపె;*

*సబలుఁడై ఖరదైత్యుని సంహరించె;*

*నితఁడు కేవల మనుజుఁడే యెంచిచూడ!* 🌺



*_భావము: శ్రీకృష్ణలీలలను కనులారా దర్శించిన ఆ గోపాలకులు నందునితో ఇలా అన్నారు: "పూర్తిగా కళ్ళు తెరవని పసిపాపవలెనున్నప్పుడే  చనుబాలు త్రాగేసి పూతన అనే రాక్షసిని సంహరించాడు;  ముద్దుల శిశువుగా ఉన్న మూడవ నెలలోనే బండిని (శకటాసురుని) కాలితో తన్ని చంపేశాడు; ఏడాది వయస్సులో నున్నప్పుడు ఆకాశములో కెగిరి తృణావర్తుడనే రాక్షసుణ్ణి మెడ  పట్టుకొని చావగొట్టాడు; పిల్లాడుగా ఉన్నప్పుడే వెన్న దొంగిలిస్తున్నాడు అని తల్లి యశోద రోటికి కట్టేస్తే, ఆ రోటిని లాక్కెళ్లి మద్దిచెట్లను కూలదోశాడు; ఆవులను, దూడలను కాస్తూ బకాసురుణ్ణి  చీల్చివేశాడు. వత్సాసురుడనే  దైత్యుణ్ణి వెలగచెట్టుకేసి బాది చంపాడు. బలరామునితో  కలిసి ధేనుకాసురుని ప్రాణాలు తీశాడు. అసలు యితడు మానవ మాత్రుడా? ఏ విధముగా ఆలోచించినా సామాన్య మానవుడనిపించటంలేదు"._* 🙏



*_Meaning: Having direct experience of Sri Krishna's mystic superhuman deeds, the yadava folk were telling Nanda: "Even before He could open His eyes as a one month baby, Sri Krishna drank the poisonous milk from the breasts of Putana and killed her; when He was in His third month, He kicked and destroyed the demon Sakatasura who came in the shape of cart; when He was of 1 year old, He flew into the sky and held the neck of demon Trinavarta and strangulated him. As a young child of 2 years, when He ate butter, His mother Yashoda Devi tied Him to rolling mortar and He pulled it away and knocked down 2 huge maddi (Arjuna) trees. Tending cows and calves, He split Bakasura and killed him.  At the same age, He thrashed  demon Vatsasura against Kapittha (Velaga: wood-apple) tree and finished him. Together with Balarama, He destroyed the wicked demon Dhenukasura.  Is He a human? Looking at the above events and the supreme deeds of Sri Krishna, we are absolutely sure that He is not a normal boy"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*

                                                                                                                                                        *భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1934 (౧౯౩౪)*


*10.1-928-వ.*

*10.1-929-*


*క. వల్లవకాంతలు దన కథ*

*లెల్లను బాడంగ నీరజేక్షణుఁ డంతన్*

*వల్లవబలసంయుతుఁడై*

*యల్లన గోష్ఠంబుఁ జేరె నవనీనాథా!* 🌺

  


*_భావము: ఓ రాజా ! శ్రీకృష్ణుడు అలా చెప్పగా వినిన గోపాలకులందరు తమ తమ బండ్లు, పశువులు  మొదలైనవన్నిటినీ తీసుకొని ఆ కొండ క్రింది నుండి బయటకు వచ్చేశారు. ఆ పై జగద్రక్షకుడగు శ్రీకృష్ణుడు ఆ గోవర్ధనగిరికి తిరిగి ఇంతకు ముందున్న విధము గానే అదే స్థలములో నిలబెట్టాడు. అప్పుడు ఆ గోపాలకులందరు కృష్ణుని కౌగలించుకొని తగిన రీతిని  గౌరవించి, ఆశీర్వదించారు. ఆ గోపికలు కూడా అక్షతలు వేసి పెరుగన్నపు ముద్దలు పెట్టి దీవించారు. నందుడు, యశోదాదేవి, రోహిణీదేవి, బలరాముడు శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొని,  శుభప్రదమైన వాక్యములు పలికారు. సిద్ధులు, సాధ్యులు,  గంధర్వ శ్రేష్ఠులు పుష్పవర్షము కురిపించారు. దేవతలు శంఖనాదములు, భేరీవాద్యములు మ్రోగించారు.  తుంబురుడు మొదలైన  గంధర్వులు పాటలు పాడారు.  అప్పుడు గోప స్త్రీలు ఆయన లీలలను పాటలుగా పాడుతూ ఉండగా, పద్మనేత్రుడు శ్రీకృష్ణుడు గోపకులు,  బలరామునితో కూడినవాడై  మెల్లమెల్లగా బృందావనము చేరాడు._*  🙏



*_Meaning: O king Parikshit! Listening to the happy news broken by Sri Krishna, the entire yadava folk took their carts, guided their cattle and came out from the bottom of the mountain. Seeing all evacuating the secure space underneath the umbrella like mountain, Krishna replaced it at the original location. All the inhabitants of the village fondly embraced Sri Krishna and blessed him. The women of the village too blessed him and fed him with morsels of curd rice. Nanda, Yashoda, Rohini and Balarama took him into their arms and spoke pleasant words. From the sky - Siddhas, Saadhyas, Gandharvas and chaaranas rained flowers on him. Celestial beings blew their conches and played trumpets. Tumbura and other divine singers sang songs eulogizing the great deeds of Sri Krishna. As the women folk too sang songs narrating Sri Krishna's courageous and noble deeds, Lotus-eyed Sri Krishna reached Brindavan along with Balarama and other cowherds._*  🙏🏻



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏 


*రోజుకో పద్యం: 1936 (౧౯౩౬)*


*10.1-932-*


*క. తెంపరి యై రామునిచేఁ*

*జంపించెఁ బ్రలంబు; మ్రింగెఁ జటుల దవాగ్నిన్;* 

*సొంపు చెడఁ ద్రొక్కి కాళియుఁ*

*ద్రుంపక కాళింది వెడలఁ దోలెన్ లీలన్.* 🌺



*_భావము: ఆ గోపాలకులు శ్రీకృష్ణుని లీలా విశేషములను ఇలా చెప్తున్నారు: "సాహసవంతుడగు బలరామునిచే ప్రలంబాసురుని సంహరింప జేసెను. తీవ్రమైన కార్చిచ్చును త్రాగేశాడు. సర్పములకు రాజగు కాళీయుని చంపకుండా విలాసముగా గర్వభంగమయేటట్లు కాళ్లతో అణగ త్రొక్కి యమునానదిలోని కాళిందీమడుగు నుంచి తరిమేశాడు._* 🙏



*_Meaning: The yadava folk were narrating the glorious deeds of Sri Krishna further: "He got Pralambasura killed by Balarama. He did not kill Kaleeya, the king of serpents, but suppressed the serpent's ego and haughtiness by pounding, trampling and elegantly dancing on his hoods; ultimately drove the vicious serpent away from Kalindi pond of river Yamuna"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1937 (౧౯౩౭)*


*10.1-933-*


*క. ఏడేండ్ల బాలుఁ డెక్కడ?* 

*క్రీడం గరి తమ్మి యెత్తు క్రియ నందఱముం*

*జూడ గిరి యెత్తు టెక్కడ?* 

*వేడుక నొక కేల నేడు వెఱఁగౌఁ గాదే.* 🌺



*_భావము: వారి సంభ్రమాశ్చర్యములను ఇంకా ఇలా వివరిస్తున్నారు: "ఏడేళ్ల వయసు కల బాలుడేమిటి? ఏనుగు తామరపువ్వును ఎత్తినంత సులువుగా అందరమూ చూస్తుండగానే ఆ కొండను పైకెత్తటమేమిటి? అది కూడా ఒంటిచేత్తో అలవోకగా ఎత్తేశాడు, ఎంత అద్భుతమైన విషయమో కదా!"_* 🙏



*_Meaning: "The cowherds were not able to suppress their excitement and discuss Sri Krishna's SuperHuman deeds: "After all, Sri Krishna is just a seven year old boy and how strange, unusual and mysterious that he could lift the huge mountain with ease and held it in a single hand. Certainly its a great wonder"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1939 (౧౯౩౯)*


*10.1-935-వ.*

*10.1-936-*


*మ. హరి కేలన్ గిరి యెత్తి వర్షజలఖిన్నాభీర గోరాజికిన్*

*శరణంబైనఁ ద్రిలోక రాజ్యమదముం జాలించి నిర్గర్వుఁడై*

*సురభిం గూడి బలారివచ్చి కనియెన్ సొంపేది దుష్టప్రజే*

*శ్వరదుర్మాన నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు శ్రీకృష్ణునిన్.*🌺



*_భావము: గోపాలకులందరు ఏక కంఠముతో పలికిన వాక్యములను విని నందుడు తనకు ఇంతకు పూర్వమే గర్గ మహాముని తెలియజెప్పిన విశేషములను గుర్తుచేసుకొని వారితో,  "మీ ఆలోచనలు సవ్యము, ఈ విషయములో అనుమానమే లేదు. ఇంతకు పూర్వమే గర్గ మహర్షి ఈ బాలుడు సకల లోక రక్షకుడగు శ్రీమహావిష్ణువు యొక్క అంశతో జన్మించిన వాడు, అని చెప్పారు". గోపాలకులందరు ఆశ్చర్యచకితులై ఈ బాల కృష్ణుడు అనంతుడగు భగవంతుడే యని పూజించారు. అంతట ఆ శ్రీ కృష్ణుడు ఒంటి చేతితో గోవర్ధనపర్వతమును ఎత్తి ఘోరమైన వర్షముచే బాధపడుతున్న గోపాలకులను, గో సమూహములను రక్షించిన విషయమును ఇంద్రుడు  గ్రహించి, ముల్లోకములకు తానే  అధిపతిని అనే గర్వము వదలుకొని, ఐశ్వర్యాతిశయమును త్యజించి   కామధేనువుతో సహా వచ్చి,  దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకై అవతార స్వీకారం చేసిన కరుణాసముద్రుడగు శ్రీకృష్ణ భగవానుని దర్శనము చేసుకున్నాడు._*  🙏



*_Meaning: Listening to the unanimous expression of all the cowherds, Nanda recollected the revelations about the birth of Sri Krishna  and told his people: "Yes, what you felt is correct. There is no doubt about this child being the Almighty Himself. Sage Garga told me earlier that this child is an incarnation (avatar) of SriMahaVishnu".  With these words, all the yadavas performed pooja to this child Sri Krishna. Meanwhile Indra learnt that the Almighty in the form of a small child Sri Krishna, protected all the inhabitants of Brindavan from the fury of rain created by him. Setting aside his pride and ego, he came down from heaven along with Kamadhenu, had Darshan of the Almighty and paid his obeisance to Sri Krishna, who took birth to protect the virtuous and punish the wicked and cruel demons"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: *వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏 


*రోజుకో పద్యం: 1940 (౧౯౪౦)*


*10.1-937-*


*క. కని యింద్రుఁడు పూజించెను*

*దినకరనిభ నిజకిరీట దీధితిచేతన్*

*ముని హృదలంకరణంబులు*

*సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్.*🌺



*_భావము: ఇంద్రుడు సూర్యప్రభాకాంతులతో సరిపోలిన కిరీటముతో కూడిన తన శిరస్సును మహర్షుల హృదయరంజకమై, సద్భక్తులను ఉధ్ధరించెడి నందసుతుడు, శ్రీకృష్ణుని పాదపద్మములకానించి పూజించెను._* 🙏



*_Meaning: With his well embellished and sparkling crown on his head, Indra touched the Lotus feet of Sri Krishna, son of Nanda, the creator of happiness to all the sages and protector of the virtuous and worshipped Him with diligence and devotion._*     🙏


*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

[27/10, 5:55 am] K Sudhakar Adv Br: అందరికీ

*విజయ దశమి శుభాకాంక్షలు*! 🙏🏻

*వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1938 (౧౯౩౮)*


*10.1-934-*


*క.  ఓ! నంద! గోపవల్లభ!* 

*నీ నందనుఁ డాచరించు నేర్పరితనముల్*

*మానవులకు శక్యంబులె?*

*మానవమాత్రుండె? నీ కుమారుఁడు తండ్రీ!"* 🌺



*_భావము: ఆ గోపకులు నందునితో ఇలా అంటున్నారు: "ఓ నంద రాజా! నీ కొడుకు చేసే సమర్థవంతమైన, అలౌకికమైన పనులు చూస్తుంటే , ఇవి సామాన్య మానవులకు సాధ్యమౌతాయా? అసలు నీ కుమారుడు మామూలు మనిషేనా?"_* 🙏



*_Meaning: The assembled Yadava folk were telling Nanda: ”O king Nanda! It is unimaginable and inconceivable that any normal child can perform such superhuman efforts and actions as those of your son Sri Krishna. We have a sincere and serious doubt whether this boy is really a simple and ordinary mortal"._*  🙏

 


*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454).*

కామెంట్‌లు లేవు: