27, అక్టోబర్ 2020, మంగళవారం

ఆచార్య సద్భోదన*

 *ఆచార్య సద్భోదన*


కార్యఫలాసక్తిని నిరుత్సాహంతోనో, అడ్డంకులు ఏర్పడినవనో విడిచి పెట్టరాదు. ఫలాపేక్ష బంధాన్ని కలిగిస్తుంది. కాబట్టి విడిచిపెట్టాలి.


"నిష్కామ కర్మయోగి కర్మ ఫలితాన్ని విడిచిపెట్టినందున చిత్త శుద్ధి కలిగి శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. అలా కాకుండా ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు ఆశచే ప్రేరితుడైనందున బద్ధుడవుతున్నాడు."

-భగవద్గీత.


అన్ని పరిస్థితుల్లోనూ సమత్వాన్ని కలిగి ఉండగలగడమే జీవిత రహస్యాల్లో ముఖ్యమైనది. జీవితం ఎప్పుడూ సమంగా ఉండదు. ఎన్నో ఎత్తు పల్లాలతో కూడి ఉంటుంది. 


అయితే జ్ఞానులు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చలించక నిబ్బరంగా ఉంటారు. లెక్కలు కట్టిగానీ, భౌతికతను ఉపయోగించి గానీ ఈ స్థితిని స్వంతం చేసుకోలేం.


మనస్సుకి అంతర్గత దృష్టిని అలవరచినప్పుడే అంతరంగంలోని ఆ ప్రశాంతత లభ్యమవుతుంది.


మన వాక్కు, మనఃక్రియలన్నీ భగవంతునికే సమర్పించాలి. మన ఉనికికి మూలకారణం ఆయనే అని గ్రహించాలి. మనం చేసే ప్రతి పని భక్తితో చేసి ప్రేమ, విశ్వాసంతో దైవం వైపు తిరిగి ఉండాలి. 


ఆయన పరంధామమే మనకు తృప్తిని, విశ్రాంతిని కలిగిస్తుంది. ఆయన నుండి మాత్రమే మన ఊపిరిని, శక్తిని గ్రహించ గలుగుతున్నామని గుర్తుంచుకోవాలి.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: