27, అక్టోబర్ 2020, మంగళవారం

హనుమoతుడు

 *🚩హనుమoతుడు వాయుపుత్రుడు, శివ అంశ రెండూ ఒకేసారి ఎలా అయ్యాడు?🚩*


హనుమoతుడు వాయుపుత్రుడు, శివ అంశ రెండూ ఒకేసారి ఎలా అయ్యాడు? సామి


పూర్వకాలం లో పుంజికస్తల అనే అప్సరస ఒకసారి భూలోకానికి వచ్చి తిరుగుతుండగా ఒక కోతి ధ్యానమగ్నమై ఉండగా చూసి అతని తపస్సు కు భంగం కలిగే విధంగా ప్రవర్తించినది(పెద్దగా నవ్వుతూ అతని మీద రాళ్ళు వేసినది). అప్పుడు తపస్సు నుండి లేచిన ఆ తపస్వి ఆమెను మరు జన్మలో వానరo గా పుట్టమని శపించాడు. ఆమె చేసిన తప్పును గ్రహించి శాపవిమోచనం చెప్పమనగా ఇది దైవకార్య నిమిత్తమై ఆ పరమాత్మ తనతో ఈ విధమైన శాపాన్ని ఆమెకు వచ్చేలా చేసాడు అని, ఆమె వానరం గా ఉన్నపుడు అతివీరభయంకరమైన బలం కలిగిన పుత్రుడిని శివ అంశగా పొందుతావు అని ఉరడిoచాడు.


ఈ విషాదం తో స్వర్గానికి చేరిన ఆమెను తనను సంతోషింప చేయవలసినది అని ఇంద్రుడు కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు కనుక ఆమెను భూలోకం లో జన్మించమని శపించాడు.


🔱   శివానందా రూపం శివం శివం  🔱


ఆమె కుంజ అనే ఒక వానర యోదునికి కుమార్తె గా జన్మించింది. ఆమెకు అంజన అని పేరు పెట్టారు. కొంతకాలం తర్వాత ఆమెను కేసరి వివాహం చేసుకున్నాడు. ఒకనాడు కేసరి దక్షిణ సముద్రం ఒడ్డున తపస్సు లో ఉండగా వారి ఇంటికి అగస్త్య మహర్షి వచ్చారు. అప్పుడు అంజన ఆ  మహర్షికి సర్వ ఉపచారములు చేసింది. ఆమె అతిధి సత్కారానికి సంతోషించిన అగస్త్యుడు ఆమెను వరం కోరుకోమన్నాడు. అప్పుడు అంజన తనకు అతి బలవంతుడైన, బుధివంతుడైన పుత్రుడు, సర్వ లోకముల కు శాంతి  చేకూర్చే వాడు కావలి అని కోరుకుంది. అగస్త్యుడు మహాముని కనుక తధాస్తు అని దీవించి, ఆమెకు సాక్షాత్తు ఆ మహాదేవుని అంశతో పుత్రుడు కలుగబోతున్నాడు కనుక ఆమెను అందుకు సిధం చేయాలి అని తలచి ఆమెను వృషభాద్రి పై అకాశగంగ ప్రక్కన ధ్యానం చేయవలసినది గా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు అగస్త్యుడు చెప్పిన విధం గానే అక్కడ ధ్యానం చెస్తూ ఉంది.


ఒకరోజు ధ్యానం చేస్తున్న ఆమెను చూసి వాయుదేవుడు ఆమెను చేరాడు. ఆ సంఘటనకు ఆమె ధ్యానభంగం అయినది. అప్పుడు ఆమె  "ఎవడురా దుర్మార్గుడు! నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నాడు" అని కోపించింది. అప్పుడు వాయువు అన్నాడు "అంజనా! బ్రహ్మగారు మా సర్వ దేవతల తేజస్సులను వానర స్త్రీలందు ప్రవేశపెట్టి వానారాలని సృస్టించామన్నాడు. అందువాల్ల  నేను నీ పాతివ్రత్యాన్ని భంగం కలగకుండా గొప్ప పరాక్రమం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానం గా దూకగల వాడు, ఎగరగలవాడైన పుత్రుడు కేవలం నిన్ను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపు నందు జన్మిస్తాడు" అన్నాడు.

అలాగే తీర్ధయాత్రలు చెస్తూ ఉన్న కేసరి గోకర్ణం మీదుగా వెళుతున్నపుడు అక్కడ శంబసదనుడు అనే రక్షసుడి గురించి, అతను పెడుతున్న భాదలగురించి అక్కడి ఋషుల,మునుల ద్వారా విని అతనిని ఎదుర్కొన్నాడు. భీకరమైన యుధం తర్వాత అతనిని మట్టుపెట్టాడు. అతని విజయాన్ని చుసిన ఋషులు మునులు అతనికి ఒక ప్రయోజకుడిన పుత్రుడు, లోకంలో ఏ విధమైన అవినీతిని ఒప్పుకోనివాడు జన్మించాలి అని దీవించి, కేసరికి మహాదేవుని యొక్క అతి శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాని కేసరి జపిస్తూ ఉండుటవల్ల అతని శరీరం దివ్య కాంతిని పొందింది.

కేసరి తీర్ధయాత్రల నుండి ఇంటికి వచ్చే సమయానికి అంజన వృషబాద్రి నుండి ఇంటికి వచ్చి ఉంది. వీరిద్దరికీ కలిగిన వరముల ప్రభావం వల్ల అంజని కొంతకాలానికి గర్భవతి అయింది. అప్పుడు ఆమెకు అతి బలవంతుడు, శివ అంశ, వాయుపుత్రుడు ఐన హనుమంతుడు జన్మించాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: