10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీమద్భాగవతము

 *10.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2257(౨౨౫౭)*


*10.1-1372-వ.*

*10.1-1373-*


*ఉ. "వల్లవబాలురన్ నగరి వాకిటికిన్ వెడలంగఁ ద్రొబ్బుఁ; డీ*

*గొల్లల ముట్టికోల్ గొనుఁడు; క్రూరుని నందునిఁ గట్టు; డుర్వికిం*

*దెల్లముగాఁగ నేడు వసుదేవునిఁ జంపుఁడు; తండ్రి గాఁడు వీఁ*

*డెల్లవిధంబులం; బరుల కిష్టుఁడు కావకుఁ డుగ్రసేనునిన్."* 🌺



*_భావము: జరుగుతున్న సంఘటనలను గమనించి, పరిస్థితి చెయ్యి దాటిపోతోందని, కంసుడు ఇక ఆలస్యం చెయ్యరాదనుకొని, సభాసదులను వారిస్తూ, తన మంత్రులను ఇలా ఆదేశించాడు: "ఈ గొల్లపిల్లలను నగరం బయటికి తోసిపారెయ్యండి, ఈ గొల్ల పెద్దలను ఎదుర్కొనండి; క్రూరుడైన నందుని కట్టిపడేయండి; ఈ భూమి జనులందరికి హెచ్చరికగా వసుదేవుని సంహరించండి; ఈ ఉగ్రసేనుడు నా తండ్రి కానేకాడు, నా శత్రువులకే ప్రియమైనవాడు కనుక రక్షించనక్కర్లేదు."_* 🙏



*_Meaning: Observing the events, Kamsa thought that the situation is going out of hand, reassured his subjects and was instructing his ministers for quick action: "Push out these boys from the city; Attack these people from Brindavan; Get hold of this cruel Nanda and arrest him; as a matter of warning to all, kill Vasudeva; Dont try to save Ugrasena, who isn't my father anymore, as he is more closer to my enemies."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

వినాయకచవితి. సందర్భంగా

 వినాయకచవితి. సందర్భంగా ఒక విన్నపం

*మనము తెలిసి తెలిసి కొన్ని క్షమించరాని తప్పులు మనం చేస్తున్నాము. ప్రతీ వినాయక చవితికి ఇదే తంతు జరుగుతుంది. ఏంటంటే అసలు వినాయకుణ్ణి మనం మండపాలల్లో ఎందుకు ప్రతిష్టిస్తున్నాము ? అందులో అంతరార్థం ఏంటి ? ఈ విషయం లో చాలా మంది తప్పుదోవ పడుతున్నారు.*


*వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందండి . వినాయక సహస్ర నామాలలో వెయ్యి రకాలు చెప్పబడాయి . అలాంటి వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారుచేయించుకుని ఇలా ఎందుకు పూజిస్తున్నారు. '' ఫిధ గణపతి,*  

*గబ్బర్ సింగ్ 2 గణపతి, బాహుబలి 2 గణపతి, స్పైడర్ మాన్ గణపతి బుల్లెట్ గణపతి ...ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ఎందుకు ఇంతటి* *దుర్మార్గపు కృత్యాలు ..? కాలని లోని పెద్దలు, మత పెద్దలు, యువకుల తల్లి తండ్రులు , నాయకులు ఇలాంటివి చూసి కూడా ఎందుకు నోరు మెదపడం లేదు....? ఎందుకు* *ప్రోత్సహిస్తున్నారు ..?*

*మన ఇంట్లో మన కుటుంబీకులు ఎవరైనా చనిపోయిన వారుంటే వారి ఫోటోలు ఇలా తయారు చేసి పెడుతున్నారా...?*


*మన బుద్ధి రాను రాను వక్రీకరించడం వల్లనే దేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు మనకంటే ఇతర మతాల వారు చాలా ఉత్తమం అనిపిస్తుంది. వాళ్ళు ఇలా మనలాగా వాళ్ళ దేవుణ్ణి కించపరిచినట్టు ప్రవర్తించరు.*


*ముఖ్యంగా ఈ విషయంలో యువత తప్పు దారి పడుతుంది. ఇక నవరాత్రులు చివరి రోజు మాత్రం చాలా హంగామా చేస్తారు. తాగడం , ఎగరడం - దూకడం లాంటి కృత్యాలు చేసి మన హిందూ సంస్కృతీ పరువు మనమే తీస్తున్నాము. ఊరేగింపులో బూతు పాటలు. భారీగా ఖర్చు , భయకరమైన సౌండ్ సిస్టం , ఇలా ప్రతీది తపెఎ, అసలు అంత ఖర్చు ఎందుకు పెడ్తున్నారు . మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞానం ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి.*


*మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకండి. వీలైతే భజనలు చేయండి లేదా ఏమీ చేయకుండా ఉండండి.* *బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఇలా అడగడం. మీకు శక్తి లేకపోతే పెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు వద్దు. అవన్నీ మూర్ఖపు పనులు. దయచేసి మానండి.*

*మోరీల పైన మండపాలు, రోడ్డు మీద మండపాలు, ఒక్క కాలనిలో 100 మండపాలు. విపరీత పోటీ రాజకీయం... అన్నీ వికృత చేష్టలే .* 


*చాలా జాగ్రత్తగా గమనించండి....1 మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు , 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ ఒక కాలనిలో ఒకే మండపం అయితే ఐక్యమత్యo పెరిగినట్లు .*


*దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి. సంస్కృతిని కాపాడే బాధ్యత మనలో లేకపోతే మనం బతికున్న శవాలమే...* *ఆలోచించండి.*


*ధర్మో రక్షతి రక్షితః 👏*

వినాయకుడి పేర్లే

       వినాయకుడి పేర్లే !

....................................................

చాలా వరకు సిసలు తెలుగు పేర్లే, ఒకసారి చదవండి, సిద్ది కలుగుతుంది.

....................................................

(1) ఎలుకరౌతు (2) అఖువాహనుడు (3) విఘ్నేశ్వరుడు (4) ఏకదంష్ట్రడు (5) ఏనుగుమొకమయ్య (6) ఏనుగు మోముసామి (7) ఒంటికొమ్ముదేవర (8) ఒంటికొమ్ము వేలుపు (8) కంటంకడు (9) కరివదనుడు (10) కొక్కుతేజిరౌతు (11) కొమ్ములుగలవేలుపు (12) గజాననుడు (13) గజాస్యుడు (14) గణపతి (15) గణేశుడు (16) గరు:త్మంతుడు (17) గుజ్జువేలుపు (18) ద్విదేహుడు (19) ద్విధాతువు(20) ద్విపాస్యుడు (21) ద్విమాత్రకుడు (22) ద్వేమాతురుడు (23) పగటిపంటిదొర (24) పరశుధరుడు (25) పర్శుపాణి


 (26) పాపజన్నిగట్టు (27) పార్వతీనందనుడు (28) పీళ్ళారి (29) పుష్టికాంతుడు (30) పృథ్వీగర్‌భుడు (31) బొజ్జదేవర (32) భవాత్మజుడు (33) మూషికవాహనుడు (34) మూషికరథుడు (35) వక్రతుండుడు (36) విఘ్ననాయకుడు (37) విఘ్నరాజు (38) విఘ్నహారి(39) బె(వె) నకయ్య (40) శాంకరి(41) శూర్పకర్ణుడు (42) సదాదానుడు (43) సిందూరవదనుడు (44) సుముఖుడు (45) హరిహయడు (46) హస్తిమల్లుడు (47) హేరంబుడు (48) హేరకుడు.(49) బుద్ధుడు (50) హేరకుడు.


(51) అద్వైతవాది (52) అర్హంతుడు (53) జినుడు (54) తథాగతుడు (55) తీర్థకరుడు (56) దశబలుడు (57) దశార్హుడు (58) ధర్మరాజు (59) బ్రహ్మధ్వజుడు (60) భగవంతుడు (61) భవాంతకృత్తు (62) మారజిత్తు (63) ముని, మైత్రేయుడు (64) రాగాశని (66) లోకజిత్తు (67) శాస్త (68) శ్రీఘనుడు (69) షడబిజ్ఞుడు ((70) సుమంతభద్రుడు (71) సర్వజ్ఞుడు (72) సుగతుడు (73) హేరకుడు.


( సేకరణ)

..................................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

మహా గణపతి సహస్రనామ స్తోత్రమ్

 మహా గణపతి సహస్రనామ స్తోత్రమ్


మునిరువాచ

కథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ |

శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ‖ 1 ‖


బ్రహ్మోవాచ

దేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే |

అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల ‖ 2 ‖


మనసా స వినిర్ధార్య దదృశే విఘ్నకారణమ్ |

మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి ‖ 3 ‖


విఘ్నప్రశమనోపాయమపృచ్ఛదపరిశ్రమమ్ |

సంతుష్టః పూజయా శంభోర్మహాగణపతిః స్వయమ్ ‖ 4 ‖


సర్వవిఘ్నప్రశమనం సర్వకామఫలప్రదమ్ |

తతస్తస్మై స్వయం నామ్నాం సహస్రమిదమబ్రవీత్ ‖ 5 ‖


అస్య శ్రీమహాగణపతిసహస్రనామస్తోత్రమాలామంత్రస్య |

గణేశ ఋషిః, మహాగణపతిర్దేవతా, నానావిధానిచ్ఛందాంసి |

హుమితి బీజమ్, తుంగమితి శక్తిః, స్వాహాశక్తిరితి కీలకమ్ |

సకలవిఘ్నవినాశనద్వారా శ్రీమహాగణపతిప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |


అథ కరన్యాసః

గణేశ్వరో గణక్రీడ ఇత్యంగుష్ఠాభ్యాం నమః |

కుమారగురురీశాన ఇతి తర్జనీభ్యాం నమః ‖

బ్రహ్మాండకుంభశ్చిద్వ్యోమేతి మధ్యమాభ్యాం నమః |

రక్తో రక్తాంబరధర ఇత్యనామికాభ్యాం నమః

సర్వసద్గురుసంసేవ్య ఇతి కనిష్ఠికాభ్యాం నమః |

లుప్తవిఘ్నః స్వభక్తానామితి కరతలకరపృష్ఠాభ్యాం నమః ‖


అథ అంగన్యాసః

ఛందశ్ఛందోద్భవ ఇతి హృదయాయ నమః |

నిష్కలో నిర్మల ఇతి శిరసే స్వాహా |

సృష్టిస్థితిలయక్రీడ ఇతి శిఖాయై వషట్ |

జ్ఞానం విజ్ఞానమానంద ఇతి కవచాయ హుమ్ |

అష్టాంగయోగఫలభృదితి నేత్రత్రయాయ వౌషట్ |

అనంతశక్తిసహిత ఇత్యస్త్రాయ ఫట్ |

భూర్భువః స్వరోమ్ ఇతి దిగ్బంధః |


అథ ధ్యానమ్

గజవదనమచింత్యం తీక్ష్ణదంష్ట్రం త్రినేత్రం

బృహదుదరమశేషం భూతిరాజం పురాణమ్ |

అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం

పశుపతిసుతమీశం విఘ్నరాజం నమామి ‖


శ్రీగణపతిరువాచ

ఓం గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః |

ఏకదంతో వక్రతుండో గజవక్త్రో మహోదరః ‖ 1 ‖


లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాశనః |

సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్నరాజో గజాననః ‖ 2 ‖


భీమః ప్రమోద ఆమోదః సురానందో మదోత్కటః |

హేరంబః శంబరః శంభుర్లంబకర్ణో మహాబలః ‖ 3 ‖


నందనో లంపటో భీమో మేఘనాదో గణంజయః |

వినాయకో విరూపాక్షో వీరః శూరవరప్రదః ‖ 4 ‖


మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః |

రుద్రప్రియో గణాధ్యక్ష ఉమాపుత్రోఽఘనాశనః ‖ 5 ‖


కుమారగురురీశానపుత్రో మూషకవాహనః |

సిద్ధిప్రియః సిద్ధిపతిః సిద్ధః సిద్ధివినాయకః ‖ 6 ‖


అవిఘ్నస్తుంబురుః సింహవాహనో మోహినీప్రియః |

కటంకటో రాజపుత్రః శాకలః సంమితోమితః ‖ 7 ‖


కూష్మాండసామసంభూతిర్దుర్జయో ధూర్జయో జయః |

భూపతిర్భువనపతిర్భూతానాం పతిరవ్యయః ‖ 8 ‖


విశ్వకర్తా విశ్వముఖో విశ్వరూపో నిధిర్గుణః |

కవిః కవీనామృషభో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః ‖ 9 ‖


జ్యేష్ఠరాజో నిధిపతిర్నిధిప్రియపతిప్రియః |

హిరణ్మయపురాంతఃస్థః సూర్యమండలమధ్యగః ‖ 10 ‖


కరాహతిధ్వస్తసింధుసలిలః పూషదంతభిత్ |

ఉమాంకకేలికుతుకీ ముక్తిదః కులపావనః ‖ 11 ‖


కిరీటీ కుండలీ హారీ వనమాలీ మనోమయః |

వైముఖ్యహతదైత్యశ్రీః పాదాహతిజితక్షితిః ‖ 12 ‖


సద్యోజాతః స్వర్ణముంజమేఖలీ దుర్నిమిత్తహృత్ |

దుఃస్వప్నహృత్ప్రసహనో గుణీ నాదప్రతిష్ఠితః ‖ 13 ‖


సురూపః సర్వనేత్రాధివాసో వీరాసనాశ్రయః |

పీతాంబరః ఖండరదః ఖండవైశాఖసంస్థితః ‖ 14 ‖


చిత్రాంగః శ్యామదశనో భాలచంద్రో హవిర్భుజః |

యోగాధిపస్తారకస్థః పురుషో గజకర్ణకః ‖ 15 ‖


గణాధిరాజో విజయః స్థిరో గజపతిధ్వజీ |

దేవదేవః స్మరః ప్రాణదీపకో వాయుకీలకః ‖ 16 ‖


విపశ్చిద్వరదో నాదో నాదభిన్నమహాచలః |

వరాహరదనో మృత్యుంజయో వ్యాఘ్రాజినాంబరః ‖ 17 ‖


ఇచ్ఛాశక్తిభవో దేవత్రాతా దైత్యవిమర్దనః |

శంభువక్త్రోద్భవః శంభుకోపహా శంభుహాస్యభూః ‖ 18 ‖


శంభుతేజాః శివాశోకహారీ గౌరీసుఖావహః |

ఉమాంగమలజో గౌరీతేజోభూః స్వర్ధునీభవః ‖ 19 ‖


యజ్ఞకాయో మహానాదో గిరివర్ష్మా శుభాననః |

సర్వాత్మా సర్వదేవాత్మా బ్రహ్మమూర్ధా కకుప్శ్రుతిః ‖ 20 ‖


బ్రహ్మాండకుంభశ్చిద్వ్యోమభాలఃసత్యశిరోరుహః |

జగజ్జన్మలయోన్మేషనిమేషోఽగ్న్యర్కసోమదృక్ ‖ 21 ‖


గిరీంద్రైకరదో ధర్మాధర్మోష్ఠః సామబృంహితః |

గ్రహర్క్షదశనో వాణీజిహ్వో వాసవనాసికః ‖ 22 ‖


భ్రూమధ్యసంస్థితకరో బ్రహ్మవిద్యామదోదకః |

కులాచలాంసః సోమార్కఘంటో రుద్రశిరోధరః ‖ 23 ‖


నదీనదభుజః సర్పాంగులీకస్తారకానఖః |

వ్యోమనాభిః శ్రీహృదయో మేరుపృష్ఠోఽర్ణవోదరః ‖ 24 ‖


కుక్షిస్థయక్షగంధర్వరక్షఃకిన్నరమానుషః |

పృథ్వీకటిః సృష్టిలింగః శైలోరుర్దస్రజానుకః ‖ 25 ‖


పాతాలజంఘో మునిపాత్కాలాంగుష్ఠస్త్రయీతనుః |

జ్యోతిర్మండలలాంగూలో హృదయాలాననిశ్చలః ‖ 26 ‖


హృత్పద్మకర్ణికాశాలీ వియత్కేలిసరోవరః |

సద్భక్తధ్యాననిగడః పూజావారినివారితః ‖ 27 ‖


ప్రతాపీ కాశ్యపో మంతా గణకో విష్టపీ బలీ |

యశస్వీ ధార్మికో జేతా ప్రథమః ప్రమథేశ్వరః ‖ 28 ‖


చింతామణిర్ద్వీపపతిః కల్పద్రుమవనాలయః |

రత్నమండపమధ్యస్థో రత్నసింహాసనాశ్రయః ‖ 29 ‖


తీవ్రాశిరోద్ధృతపదో జ్వాలినీమౌలిలాలితః |

నందానందితపీఠశ్రీర్భోగదో భూషితాసనః ‖ 30 ‖


సకామదాయినీపీఠః స్ఫురదుగ్రాసనాశ్రయః |

తేజోవతీశిరోరత్నం సత్యానిత్యావతంసితః ‖ 31 ‖


సవిఘ్ననాశినీపీఠః సర్వశక్త్యంబుజాలయః |

లిపిపద్మాసనాధారో వహ్నిధామత్రయాలయః ‖ 32 ‖


ఉన్నతప్రపదో గూఢగుల్ఫః సంవృతపార్ష్ణికః |

పీనజంఘః శ్లిష్టజానుః స్థూలోరుః ప్రోన్నమత్కటిః ‖ 33 ‖


నిమ్ననాభిః స్థూలకుక్షిః పీనవక్షా బృహద్భుజః |

పీనస్కంధః కంబుకంఠో లంబోష్ఠో లంబనాసికః ‖ 34 ‖


భగ్నవామరదస్తుంగసవ్యదంతో మహాహనుః |

హ్రస్వనేత్రత్రయః శూర్పకర్ణో నిబిడమస్తకః ‖ 35 ‖


స్తబకాకారకుంభాగ్రో రత్నమౌలిర్నిరంకుశః |

సర్పహారకటీసూత్రః సర్పయజ్ఞోపవీతవాన్ ‖ 36 ‖


సర్పకోటీరకటకః సర్పగ్రైవేయకాంగదః |

సర్పకక్షోదరాబంధః సర్పరాజోత్తరచ్ఛదః ‖ 37 ‖


రక్తో రక్తాంబరధరో రక్తమాలావిభూషణః |

రక్తేక్షనో రక్తకరో రక్తతాల్వోష్ఠపల్లవః ‖ 38 ‖


శ్వేతః శ్వేతాంబరధరః శ్వేతమాలావిభూషణః |

శ్వేతాతపత్రరుచిరః శ్వేతచామరవీజితః ‖ 39 ‖


సర్వావయవసంపూర్ణః సర్వలక్షణలక్షితః |

సర్వాభరణశోభాఢ్యః సర్వశోభాసమన్వితః ‖ 40 ‖


సర్వమంగలమాంగల్యః సర్వకారణకారణమ్ |

సర్వదేవవరః శారంగీ బీజపూరీ గదాధరః ‖ 41 ‖


శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః |

కిరీటీ కుండలీ హారీ వనమాలీ శుభాంగదః ‖ 42 ‖


ఇక్షుచాపధరః శూలీ చక్రపాణిః సరోజభృత్ |

పాశీ ధృతోత్పలః శాలిమంజరీభృత్స్వదంతభృత్ ‖ 43 ‖


కల్పవల్లీధరో విశ్వాభయదైకకరో వశీ |

అక్షమాలాధరో జ్ఞానముద్రావాన్ ముద్గరాయుధః ‖ 44 ‖


పూర్ణపాత్రీ కంబుధరో విధృతాంకుశమూలకః |

కరస్థామ్రఫలశ్చూతకలికాభృత్కుఠారవాన్ ‖ 45 ‖


పుష్కరస్థస్వర్ణఘటీపూర్ణరత్నాభివర్షకః |

భారతీసుందరీనాథో వినాయకరతిప్రియః ‖ 46 ‖


మహాలక్ష్మీప్రియతమః సిద్ధలక్ష్మీమనోరమః |

రమారమేశపూర్వాంగో దక్షిణోమామహేశ్వరః ‖ 47 ‖


మహీవరాహవామాంగో రతికందర్పపశ్చిమః |

ఆమోదమోదజననః సప్రమోదప్రమోదనః ‖ 48 ‖


సంవర్ధితమహావృద్ధిరృద్ధిసిద్ధిప్రవర్ధనః |

దంతసౌముఖ్యసుముఖః కాంతికందలితాశ్రయః ‖ 49 ‖


మదనావత్యాశ్రితాంఘ్రిః కృతవైముఖ్యదుర్ముఖః |

విఘ్నసంపల్లవః పద్మః సర్వోన్నతమదద్రవః ‖ 50 ‖


విఘ్నకృన్నిమ్నచరణో ద్రావిణీశక్తిసత్కృతః |

తీవ్రాప్రసన్ననయనో జ్వాలినీపాలితైకదృక్ ‖ 51 ‖


మోహినీమోహనో భోగదాయినీకాంతిమండనః |

కామినీకాంతవక్త్రశ్రీరధిష్ఠితవసుంధరః ‖ 52 ‖


వసుధారామదోన్నాదో మహాశంఖనిధిప్రియః |

నమద్వసుమతీమాలీ మహాపద్మనిధిః ప్రభుః ‖ 53 ‖


సర్వసద్గురుసంసేవ్యః శోచిష్కేశహృదాశ్రయః |

ఈశానమూర్ధా దేవేంద్రశిఖః పవననందనః ‖ 54 ‖


ప్రత్యుగ్రనయనో దివ్యో దివ్యాస్త్రశతపర్వధృక్ |

ఐరావతాదిసర్వాశావారణో వారణప్రియః ‖ 55 ‖


వజ్రాద్యస్త్రపరీవారో గణచండసమాశ్రయః |

జయాజయపరికరో విజయావిజయావహః ‖ 56 ‖


అజయార్చితపాదాబ్జో నిత్యానందవనస్థితః |

విలాసినీకృతోల్లాసః శౌండీ సౌందర్యమండితః ‖ 57 ‖


అనంతానంతసుఖదః సుమంగలసుమంగలః |

జ్ఞానాశ్రయః క్రియాధార ఇచ్ఛాశక్తినిషేవితః ‖ 58 ‖


సుభగాసంశ్రితపదో లలితాలలితాశ్రయః |

కామినీపాలనః కామకామినీకేలిలాలితః ‖ 59 ‖


సరస్వత్యాశ్రయో గౌరీనందనః శ్రీనికేతనః |

గురుగుప్తపదో వాచాసిద్ధో వాగీశ్వరీపతిః ‖ 60 ‖


నలినీకాముకో వామారామో జ్యేష్ఠామనోరమః |

రౌద్రీముద్రితపాదాబ్జో హుంబీజస్తుంగశక్తికః ‖ 61 ‖


విశ్వాదిజననత్రాణః స్వాహాశక్తిః సకీలకః |

అమృతాబ్ధికృతావాసో మదఘూర్ణితలోచనః ‖ 62 ‖


ఉచ్ఛిష్టోచ్ఛిష్టగణకో గణేశో గణనాయకః |

సార్వకాలికసంసిద్ధిర్నిత్యసేవ్యో దిగంబరః ‖ 63 ‖


అనపాయోఽనంతదృష్టిరప్రమేయోఽజరామరః |

అనావిలోఽప్రతిహతిరచ్యుతోఽమృతమక్షరః ‖ 64 ‖


అప్రతర్క్యోఽక్షయోఽజయ్యోఽనాధారోఽనామయోమలః |

అమేయసిద్ధిరద్వైతమఘోరోఽగ్నిసమాననః ‖ 65 ‖


అనాకారోఽబ్ధిభూమ్యగ్నిబలఘ్నోఽవ్యక్తలక్షణః |

ఆధారపీఠమాధార ఆధారాధేయవర్జితః ‖ 66 ‖


ఆఖుకేతన ఆశాపూరక ఆఖుమహారథః |

ఇక్షుసాగరమధ్యస్థ ఇక్షుభక్షణలాలసః ‖ 67 ‖


ఇక్షుచాపాతిరేకశ్రీరిక్షుచాపనిషేవితః |

ఇంద్రగోపసమానశ్రీరింద్రనీలసమద్యుతిః ‖ 68 ‖


ఇందీవరదలశ్యామ ఇందుమండలమండితః |

ఇధ్మప్రియ ఇడాభాగ ఇడావానిందిరాప్రియః ‖ 69 ‖


ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసీ ఇతికర్తవ్యతేప్సితః |

ఈశానమౌలిరీశాన ఈశానప్రియ ఈతిహా ‖ 70 ‖


ఈషణాత్రయకల్పాంత ఈహామాత్రవివర్జితః |

ఉపేంద్ర ఉడుభృన్మౌలిరుడునాథకరప్రియః ‖ 71 ‖


ఉన్నతానన ఉత్తుంగ ఉదారస్త్రిదశాగ్రణీః |

ఊర్జస్వానూష్మలమద ఊహాపోహదురాసదః ‖ 72 ‖


ఋగ్యజుఃసామనయన ఋద్ధిసిద్ధిసమర్పకః |

ఋజుచిత్తైకసులభో ఋణత్రయవిమోచనః ‖ 73 ‖


లుప్తవిఘ్నః స్వభక్తానాం లుప్తశక్తిః సురద్విషామ్ |

లుప్తశ్రీర్విముఖార్చానాం లూతావిస్ఫోటనాశనః ‖ 74 ‖


ఏకారపీఠమధ్యస్థ ఏకపాదకృతాసనః |

ఏజితాఖిలదైత్యశ్రీరేధితాఖిలసంశ్రయః ‖ 75 ‖


ఐశ్వర్యనిధిరైశ్వర్యమైహికాముష్మికప్రదః |

ఐరంమదసమోన్మేష ఐరావతసమాననః ‖ 76 ‖


ఓంకారవాచ్య ఓంకార ఓజస్వానోషధీపతిః |

ఔదార్యనిధిరౌద్ధత్యధైర్య ఔన్నత్యనిఃసమః ‖ 77 ‖


అంకుశః సురనాగానామంకుశాకారసంస్థితః |

అః సమస్తవిసర్గాంతపదేషు పరికీర్తితః ‖ 78 ‖


కమండలుధరః కల్పః కపర్దీ కలభాననః |

కర్మసాక్షీ కర్మకర్తా కర్మాకర్మఫలప్రదః ‖ 79 ‖


కదంబగోలకాకారః కూష్మాండగణనాయకః |

కారుణ్యదేహః కపిలః కథకః కటిసూత్రభృత్ ‖ 80 ‖


ఖర్వః ఖడ్గప్రియః ఖడ్గః ఖాంతాంతఃస్థః ఖనిర్మలః |

ఖల్వాటశృంగనిలయః ఖట్వాంగీ ఖదురాసదః ‖ 81 ‖


గుణాఢ్యో గహనో గద్యో గద్యపద్యసుధార్ణవః |

గద్యగానప్రియో గర్జో గీతగీర్వాణపూర్వజః ‖ 82 ‖


గుహ్యాచారరతో గుహ్యో గుహ్యాగమనిరూపితః |

గుహాశయో గుడాబ్ధిస్థో గురుగమ్యో గురుర్గురుః ‖ 83 ‖


ఘంటాఘర్ఘరికామాలీ ఘటకుంభో ఘటోదరః |

ఙకారవాచ్యో ఙాకారో ఙకారాకారశుండభృత్ ‖ 84 ‖


చండశ్చండేశ్వరశ్చండీ చండేశశ్చండవిక్రమః |

చరాచరపితా చింతామణిశ్చర్వణలాలసః ‖ 85 ‖


ఛందశ్ఛందోద్భవశ్ఛందో దుర్లక్ష్యశ్ఛందవిగ్రహః |

జగద్యోనిర్జగత్సాక్షీ జగదీశో జగన్మయః ‖ 86 ‖


జప్యో జపపరో జాప్యో జిహ్వాసింహాసనప్రభుః |

స్రవద్గండోల్లసద్ధానఝంకారిభ్రమరాకులః ‖ 87 ‖


టంకారస్ఫారసంరావష్టంకారమణినూపురః |

ఠద్వయీపల్లవాంతస్థసర్వమంత్రేషు సిద్ధిదః ‖ 88 ‖


డిండిముండో డాకినీశో డామరో డిండిమప్రియః |

ఢక్కానినాదముదితో ఢౌంకో ఢుంఢివినాయకః ‖ 89 ‖


తత్త్వానాం ప్రకృతిస్తత్త్వం తత్త్వంపదనిరూపితః |

తారకాంతరసంస్థానస్తారకస్తారకాంతకః ‖ 90 ‖


స్థాణుః స్థాణుప్రియః స్థాతా స్థావరం జంగమం జగత్ |

దక్షయజ్ఞప్రమథనో దాతా దానం దమో దయా ‖ 91 ‖


దయావాందివ్యవిభవో దండభృద్దండనాయకః |

దంతప్రభిన్నాభ్రమాలో దైత్యవారణదారణః ‖ 92 ‖


దంష్ట్రాలగ్నద్వీపఘటో దేవార్థనృగజాకృతిః |

ధనం ధనపతేర్బంధుర్ధనదో ధరణీధరః ‖ 93 ‖


ధ్యానైకప్రకటో ధ్యేయో ధ్యానం ధ్యానపరాయణః |

ధ్వనిప్రకృతిచీత్కారో బ్రహ్మాండావలిమేఖలః ‖ 94 ‖


నంద్యో నందిప్రియో నాదో నాదమధ్యప్రతిష్ఠితః |

నిష్కలో నిర్మలో నిత్యో నిత్యానిత్యో నిరామయః ‖ 95 ‖


పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పదమ్ ‖ 96 ‖


పరాత్పరః పశుపతిః పశుపాశవిమోచనః |

పూర్ణానందః పరానందః పురాణపురుషోత్తమః ‖ 97 ‖


పద్మప్రసన్నవదనః ప్రణతాజ్ఞాననాశనః |

ప్రమాణప్రత్యయాతీతః ప్రణతార్తినివారణః ‖ 98 ‖


ఫణిహస్తః ఫణిపతిః ఫూత్కారః ఫణితప్రియః |

బాణార్చితాంఘ్రియుగలో బాలకేలికుతూహలీ |

బ్రహ్మ బ్రహ్మార్చితపదో బ్రహ్మచారీ బృహస్పతిః ‖ 99 ‖


బృహత్తమో బ్రహ్మపరో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః |

బృహన్నాదాగ్ర్యచీత్కారో బ్రహ్మాండావలిమేఖలః ‖ 100 ‖


భ్రూక్షేపదత్తలక్ష్మీకో భర్గో భద్రో భయాపహః |

భగవాన్ భక్తిసులభో భూతిదో భూతిభూషణః ‖ 101 ‖


భవ్యో భూతాలయో భోగదాతా భ్రూమధ్యగోచరః |

మంత్రో మంత్రపతిర్మంత్రీ మదమత్తో మనో మయః ‖ 102 ‖


మేఖలాహీశ్వరో మందగతిర్మందనిభేక్షణః |

మహాబలో మహావీర్యో మహాప్రాణో మహామనాః ‖ 103 ‖


యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞగోప్తా యజ్ఞఫలప్రదః |

యశస్కరో యోగగమ్యో యాజ్ఞికో యాజకప్రియః ‖ 104 ‖


రసో రసప్రియో రస్యో రంజకో రావణార్చితః |

రాజ్యరక్షాకరో రత్నగర్భో రాజ్యసుఖప్రదః ‖ 105 ‖


లక్షో లక్షపతిర్లక్ష్యో లయస్థో లడ్డుకప్రియః |

లాసప్రియో లాస్యపరో లాభకృల్లోకవిశ్రుతః ‖ 106 ‖


వరేణ్యో వహ్నివదనో వంద్యో వేదాంతగోచరః |

వికర్తా విశ్వతశ్చక్షుర్విధాతా విశ్వతోముఖః ‖ 107 ‖


వామదేవో విశ్వనేతా వజ్రివజ్రనివారణః |

వివస్వద్బంధనో విశ్వాధారో విశ్వేశ్వరో విభుః ‖ 108 ‖


శబ్దబ్రహ్మ శమప్రాప్యః శంభుశక్తిగణేశ్వరః |

శాస్తా శిఖాగ్రనిలయః శరణ్యః శంబరేశ్వరః ‖ 109 ‖


షడృతుకుసుమస్రగ్వీ షడాధారః షడక్షరః |

సంసారవైద్యః సర్వజ్ఞః సర్వభేషజభేషజమ్ ‖ 110 ‖


సృష్టిస్థితిలయక్రీడః సురకుంజరభేదకః |

సిందూరితమహాకుంభః సదసద్భక్తిదాయకః ‖ 111 ‖


సాక్షీ సముద్రమథనః స్వయంవేద్యః స్వదక్షిణః |

స్వతంత్రః సత్యసంకల్పః సామగానరతః సుఖీ ‖ 112 ‖


హంసో హస్తిపిశాచీశో హవనం హవ్యకవ్యభుక్ |

హవ్యం హుతప్రియో హృష్టో హృల్లేఖామంత్రమధ్యగః ‖ 113 ‖


క్షేత్రాధిపః క్షమాభర్తా క్షమాక్షమపరాయణః |

క్షిప్రక్షేమకరః క్షేమానందః క్షోణీసురద్రుమః ‖ 114 ‖


ధర్మప్రదోఽర్థదః కామదాతా సౌభాగ్యవర్ధనః |

విద్యాప్రదో విభవదో భుక్తిముక్తిఫలప్రదః ‖ 115 ‖


ఆభిరూప్యకరో వీరశ్రీప్రదో విజయప్రదః |

సర్వవశ్యకరో గర్భదోషహా పుత్రపౌత్రదః ‖ 116 ‖


మేధాదః కీర్తిదః శోకహారీ దౌర్భాగ్యనాశనః |

ప్రతివాదిముఖస్తంభో రుష్టచిత్తప్రసాదనః ‖ 117 ‖


పరాభిచారశమనో దుఃఖహా బంధమోక్షదః |

లవస్త్రుటిః కలా కాష్ఠా నిమేషస్తత్పరక్షణః ‖ 118 ‖


ఘటీ ముహూర్తః ప్రహరో దివా నక్తమహర్నిశమ్ |

పక్షో మాసర్త్వయనాబ్దయుగం కల్పో మహాలయః ‖ 119 ‖


రాశిస్తారా తిథిర్యోగో వారః కరణమంశకమ్ |

లగ్నం హోరా కాలచక్రం మేరుః సప్తర్షయో ధ్రువః ‖ 120 ‖


రాహుర్మందః కవిర్జీవో బుధో భౌమః శశీ రవిః |

కాలః సృష్టిః స్థితిర్విశ్వం స్థావరం జంగమం జగత్ ‖ 121 ‖


భూరాపోఽగ్నిర్మరుద్వ్యోమాహంకృతిః ప్రకృతిః పుమాన్ |

బ్రహ్మా విష్ణుః శివో రుద్ర ఈశః శక్తిః సదాశివః ‖ 122 ‖


త్రిదశాః పితరః సిద్ధా యక్షా రక్షాంసి కిన్నరాః |

సిద్ధవిద్యాధరా భూతా మనుష్యాః పశవః ఖగాః ‖ 123 ‖


సముద్రాః సరితః శైలా భూతం భవ్యం భవోద్భవః |

సాంఖ్యం పాతంజలం యోగం పురాణాని శ్రుతిః స్మృతిః ‖ 124 ‖


వేదాంగాని సదాచారో మీమాంసా న్యాయవిస్తరః |

ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వం కావ్యనాటకమ్ ‖ 125 ‖


వైఖానసం భాగవతం మానుషం పాంచరాత్రకమ్ |

శైవం పాశుపతం కాలాముఖంభైరవశాసనమ్ ‖ 126 ‖


శాక్తం వైనాయకం సౌరం జైనమార్హతసంహితా |

సదసద్వ్యక్తమవ్యక్తం సచేతనమచేతనమ్ ‖ 127 ‖


బంధో మోక్షః సుఖం భోగో యోగః సత్యమణుర్మహాన్ |

స్వస్తి హుంఫట్ స్వధా స్వాహా శ్రౌషట్ వౌషట్ వషణ్ నమః 128 ‖


జ్ఞానం విజ్ఞానమానందో బోధః సంవిత్సమోఽసమః |

ఏక ఏకాక్షరాధార ఏకాక్షరపరాయణః ‖ 129 ‖


ఏకాగ్రధీరేకవీర ఏకోఽనేకస్వరూపధృక్ |

ద్విరూపో ద్విభుజో ద్వ్యక్షో ద్విరదో ద్వీపరక్షకః ‖ 130 ‖


ద్వైమాతురో ద్వివదనో ద్వంద్వహీనో ద్వయాతిగః |

త్రిధామా త్రికరస్త్రేతా త్రివర్గఫలదాయకః ‖ 131 ‖


త్రిగుణాత్మా త్రిలోకాదిస్త్రిశక్తీశస్త్రిలోచనః |

చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకః ‖ 132 ‖


చతుర్బాహుశ్చతుర్దంతశ్చతురాత్మా చతుర్భుజః |

చతుర్విధోపాయమయశ్చతుర్వర్ణాశ్రమాశ్రయః 133 ‖


చతుర్థీపూజనప్రీతశ్చతుర్థీతిథిసంభవః ‖

పంచాక్షరాత్మా పంచాత్మా పంచాస్యః పంచకృత్తమః ‖ 134 ‖


పంచాధారః పంచవర్ణః పంచాక్షరపరాయణః |

పంచతాలః పంచకరః పంచప్రణవమాతృకః ‖ 135 ‖


పంచబ్రహ్మమయస్ఫూర్తిః పంచావరణవారితః |

పంచభక్షప్రియః పంచబాణః పంచశిఖాత్మకః ‖ 136 ‖


షట్కోణపీఠః షట్చక్రధామా షడ్గ్రంథిభేదకః |

షడంగధ్వాంతవిధ్వంసీ షడంగులమహాహ్రదః ‖ 137 ‖


షణ్ముఖః షణ్ముఖభ్రాతా షట్శక్తిపరివారితః |

షడ్వైరివర్గవిధ్వంసీ షడూర్మిభయభంజనః ‖ 138 ‖


షట్తర్కదూరః షట్కర్మా షడ్గుణః షడ్రసాశ్రయః |

సప్తపాతాలచరణః సప్తద్వీపోరుమండలః ‖ 139 ‖


సప్తస్వర్లోకముకుటః సప్తసప్తివరప్రదః |

సప్తాంగరాజ్యసుఖదః సప్తర్షిగణవందితః ‖ 140 ‖


సప్తచ్ఛందోనిధిః సప్తహోత్రః సప్తస్వరాశ్రయః |

సప్తాబ్ధికేలికాసారః సప్తమాతృనిషేవితః ‖ 141 ‖


సప్తచ్ఛందో మోదమదః సప్తచ్ఛందో మఖప్రభుః |

అష్టమూర్తిర్ధ్యేయమూర్తిరష్టప్రకృతికారణమ్ ‖ 142 ‖


అష్టాంగయోగఫలభృదష్టపత్రాంబుజాసనః |

అష్టశక్తిసమానశ్రీరష్టైశ్వర్యప్రవర్ధనః ‖ 143 ‖


అష్టపీఠోపపీఠశ్రీరష్టమాతృసమావృతః |

అష్టభైరవసేవ్యోఽష్టవసువంద్యోఽష్టమూర్తిభృత్ ‖ 144 ‖


అష్టచక్రస్ఫురన్మూర్తిరష్టద్రవ్యహవిఃప్రియః |

అష్టశ్రీరష్టసామశ్రీరష్టైశ్వర్యప్రదాయకః |

నవనాగాసనాధ్యాసీ నవనిధ్యనుశాసితః ‖ 145 ‖


నవద్వారపురావృత్తో నవద్వారనికేతనః |

నవనాథమహానాథో నవనాగవిభూషితః ‖ 146 ‖


నవనారాయణస్తుల్యో నవదుర్గానిషేవితః |

నవరత్నవిచిత్రాంగో నవశక్తిశిరోద్ధృతః ‖ 147 ‖


దశాత్మకో దశభుజో దశదిక్పతివందితః |

దశాధ్యాయో దశప్రాణో దశేంద్రియనియామకః ‖ 148 ‖


దశాక్షరమహామంత్రో దశాశావ్యాపివిగ్రహః |

ఏకాదశమహారుద్రైఃస్తుతశ్చైకాదశాక్షరః ‖ 149 ‖


ద్వాదశద్విదశాష్టాదిదోర్దండాస్త్రనికేతనః |

త్రయోదశభిదాభిన్నో విశ్వేదేవాధిదైవతమ్ ‖ 150 ‖


చతుర్దశేంద్రవరదశ్చతుర్దశమనుప్రభుః |

చతుర్దశాద్యవిద్యాఢ్యశ్చతుర్దశజగత్పతిః ‖ 151 ‖


సామపంచదశః పంచదశీశీతాంశునిర్మలః |

తిథిపంచదశాకారస్తిథ్యా పంచదశార్చితః ‖ 152 ‖


షోడశాధారనిలయః షోడశస్వరమాతృకః |

షోడశాంతపదావాసః షోడశేందుకలాత్మకః ‖ 153 ‖


కలాసప్తదశీ సప్తదశసప్తదశాక్షరః |

అష్టాదశద్వీపపతిరష్టాదశపురాణకృత్ ‖ 154 ‖


అష్టాదశౌషధీసృష్టిరష్టాదశవిధిః స్మృతః |

అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదః ‖ 155 ‖


అష్టాదశాన్నసంపత్తిరష్టాదశవిజాతికృత్ |

ఏకవింశః పుమానేకవింశత్యంగులిపల్లవః ‖ 156 ‖


చతుర్వింశతితత్త్వాత్మా పంచవింశాఖ్యపూరుషః |

సప్తవింశతితారేశః సప్తవింశతియోగకృత్ ‖ 157 ‖


ద్వాత్రింశద్భైరవాధీశశ్చతుస్త్రింశన్మహాహ్రదః |

షట్త్రింశత్తత్త్వసంభూతిరష్టత్రింశత్కలాత్మకః ‖ 158 ‖


పంచాశద్విష్ణుశక్తీశః పంచాశన్మాతృకాలయః |

ద్విపంచాశద్వపుఃశ్రేణీత్రిషష్ట్యక్షరసంశ్రయః |

పంచాశదక్షరశ్రేణీపంచాశద్రుద్రవిగ్రహః ‖ 159 ‖


చతుఃషష్టిమహాసిద్ధియోగినీవృందవందితః |

నమదేకోనపంచాశన్మరుద్వర్గనిరర్గలః ‖ 160 ‖


చతుఃషష్ట్యర్థనిర్ణేతా చతుఃషష్టికలానిధిః |

అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవవందితః ‖ 161 ‖


చతుర్నవతిమంత్రాత్మా షణ్ణవత్యధికప్రభుః |

శతానందః శతధృతిః శతపత్రాయతేక్షణః ‖ 162 ‖


శతానీకః శతమఖః శతధారావరాయుధః |

సహస్రపత్రనిలయః సహస్రఫణిభూషణః ‖ 163 ‖


సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ |

సహస్రనామసంస్తుత్యః సహస్రాక్షబలాపహః ‖ 164 ‖


దశసాహస్రఫణిభృత్ఫణిరాజకృతాసనః |

అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రపాఠితః ‖ 165 ‖


లక్షాధారః ప్రియాధారో లక్షాధారమనోమయః |

చతుర్లక్షజపప్రీతశ్చతుర్లక్షప్రకాశకః ‖ 166 ‖


చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితః |

కోటిసూర్యప్రతీకాశః కోటిచంద్రాంశునిర్మలః ‖ 167 ‖


శివోద్భవాద్యష్టకోటివైనాయకధురంధరః |

సప్తకోటిమహామంత్రమంత్రితావయవద్యుతిః ‖ 168 ‖


త్రయస్త్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకః |

అనంతదేవతాసేవ్యో హ్యనంతశుభదాయకః ‖ 169 ‖


అనంతనామానంతశ్రీరనంతోఽనంతసౌఖ్యదః |

అనంతశక్తిసహితో హ్యనంతమునిసంస్తుతః ‖ 170 ‖


ఇతి వైనాయకం నామ్నాం సహస్రమిదమీరితమ్ |

ఇదం బ్రాహ్మే ముహూర్తే యః పఠతి ప్రత్యహం నరః ‖ 171 ‖


కరస్థం తస్య సకలమైహికాముష్మికం సుఖమ్ |

ఆయురారోగ్యమైశ్వర్యం ధైర్యం శౌర్యం బలం యశః ‖ 172 ‖


మేధా ప్రజ్ఞా ధృతిః కాంతిః సౌభాగ్యమభిరూపతా |

సత్యం దయా క్షమా శాంతిర్దాక్షిణ్యం ధర్మశీలతా ‖ 173 ‖


జగత్సంవననం విశ్వసంవాదో వేదపాటవమ్ |

సభాపాండిత్యమౌదార్యం గాంభీర్యం బ్రహ్మవర్చసమ్ ‖ 174 ‖


ఓజస్తేజః కులం శీలం ప్రతాపో వీర్యమార్యతా |

జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం స్థైర్యం విశ్వాసతా తథా ‖ 175 ‖


ధనధాన్యాదివృద్ధిశ్చ సకృదస్య జపాద్భవేత్ |

వశ్యం చతుర్విధం విశ్వం జపాదస్య ప్రజాయతే ‖ 176 ‖


రాజ్ఞో రాజకలత్రస్య రాజపుత్రస్య మంత్రిణః |

జప్యతే యస్య వశ్యార్థే స దాసస్తస్య జాయతే ‖ 177 ‖


ధర్మార్థకామమోక్షాణామనాయాసేన సాధనమ్ |

శాకినీడాకినీరక్షోయక్షగ్రహభయాపహమ్ ‖ 178 ‖


సామ్రాజ్యసుఖదం సర్వసపత్నమదమర్దనమ్ |

సమస్తకలహధ్వంసి దగ్ధబీజప్రరోహణమ్ ‖ 179 ‖


దుఃస్వప్నశమనం క్రుద్ధస్వామిచిత్తప్రసాదనమ్ |

షడ్వర్గాష్టమహాసిద్ధిత్రికాలజ్ఞానకారణమ్ ‖ 180 ‖


పరకృత్యప్రశమనం పరచక్రప్రమర్దనమ్ |

సంగ్రామమార్గే సవేషామిదమేకం జయావహమ్ ‖ 181 ‖


సర్వవంధ్యత్వదోషఘ్నం గర్భరక్షైకకారణమ్ |

పఠ్యతే ప్రత్యహం యత్ర స్తోత్రం గణపతేరిదమ్ ‖ 182 ‖


దేశే తత్ర న దుర్భిక్షమీతయో దురితాని చ |

న తద్గేహం జహాతి శ్రీర్యత్రాయం జప్యతే స్తవః ‖ 183 ‖


క్షయకుష్ఠప్రమేహార్శభగందరవిషూచికాః |

గుల్మం ప్లీహానమశమానమతిసారం మహోదరమ్ ‖ 184 ‖


కాసం శ్వాసముదావర్తం శూలం శోఫామయోదరమ్ |

శిరోరోగం వమిం హిక్కాం గండమాలామరోచకమ్ ‖ 185 ‖


వాతపిత్తకఫద్వంద్వత్రిదోషజనితజ్వరమ్ |

ఆగంతువిషమం శీతముష్ణం చైకాహికాదికమ్ ‖ 186 ‖


ఇత్యాద్యుక్తమనుక్తం వా రోగదోషాదిసంభవమ్ |

సర్వం ప్రశమయత్యాశు స్తోత్రస్యాస్య సకృజ్జపః ‖ 187 ‖


ప్రాప్యతేఽస్య జపాత్సిద్ధిః స్త్రీశూద్రైః పతితైరపి |

సహస్రనామమంత్రోఽయం జపితవ్యః శుభాప్తయే ‖ 188 ‖


మహాగణపతేః స్తోత్రం సకామః ప్రజపన్నిదమ్ |

ఇచ్ఛయా సకలాన్ భోగానుపభుజ్యేహ పార్థివాన్ ‖ 189 ‖


మనోరథఫలైర్దివ్యైర్వ్యోమయానైర్మనోరమైః |

చంద్రేంద్రభాస్కరోపేంద్రబ్రహ్మశర్వాదిసద్మసు ‖ 190 ‖


కామరూపః కామగతిః కామదః కామదేశ్వరః |

భుక్త్వా యథేప్సితాన్భోగానభీష్టైః సహ బంధుభిః ‖ 191 ‖


గణేశానుచరో భూత్వా గణో గణపతిప్రియః |

నందీశ్వరాదిసానందైర్నందితః సకలైర్గణైః ‖ 192 ‖


శివాభ్యాం కృపయా పుత్రనిర్విశేషం చ లాలితః |

శివభక్తః పూర్ణకామో గణేశ్వరవరాత్పునః ‖ 193 ‖


జాతిస్మరో ధర్మపరః సార్వభౌమోఽభిజాయతే |

నిష్కామస్తు జపన్నిత్యం భక్త్యా విఘ్నేశతత్పరః ‖ 194 ‖


యోగసిద్ధిం పరాం ప్రాప్య జ్ఞానవైరాగ్యసంయుతః |

నిరంతరే నిరాబాధే పరమానందసంజ్ఞితే ‖ 195 ‖


విశ్వోత్తీర్ణే పరే పూర్ణే పునరావృత్తివర్జితే |

లీనో వైనాయకే ధామ్ని రమతే నిత్యనిర్వృతే ‖ 196 ‖


యో నామభిర్హుతైర్దత్తైః పూజయేదర్చయే^^ఏన్నరః |

రాజానో వశ్యతాం యాంతి రిపవో యాంతి దాసతామ్ ‖ 197 ‖


తస్య సిధ్యంతి మంత్రాణాం దుర్లభాశ్చేష్టసిద్ధయః |

మూలమంత్రాదపి స్తోత్రమిదం ప్రియతమం మమ ‖ 198 ‖


నభస్యే మాసి శుక్లాయాం చతుర్థ్యాం మమ జన్మని |

దూర్వాభిర్నామభిః పూజాం తర్పణం విధివచ్చరేత్ ‖ 199 ‖


అష్టద్రవ్యైర్విశేషేణ కుర్యాద్భక్తిసుసంయుతః |

తస్యేప్సితం ధనం ధాన్యమైశ్వర్యం విజయో యశః ‖ 200 ‖


భవిష్యతి న సందేహః పుత్రపౌత్రాదికం సుఖమ్ |

ఇదం ప్రజపితం స్తోత్రం పఠితం శ్రావితం శ్రుతమ్ ‖ 201 ‖


వ్యాకృతం చర్చితం ధ్యాతం విమృష్టమభివందితమ్ |

ఇహాముత్ర చ విశ్వేషాం విశ్వైశ్వర్యప్రదాయకమ్ ‖ 202 ‖


స్వచ్ఛందచారిణాప్యేష యేన సంధార్యతే స్తవః |

స రక్ష్యతే శివోద్భూతైర్గణైరధ్యష్టకోటిభిః ‖ 203 ‖


లిఖితం పుస్తకస్తోత్రం మంత్రభూతం ప్రపూజయేత్ |

తత్ర సర్వోత్తమా లక్ష్మీః సన్నిధత్తే నిరంతరమ్ ‖ 204 ‖


దానైరశేషైరఖిలైర్వ్రతైశ్చ తీర్థైరశేషైరఖిలైర్మఖైశ్చ |

న తత్ఫలం విందతి యద్గణేశసహస్రనామస్మరణేన సద్యః ‖ 205 ‖


ఏతన్నామ్నాం సహస్రం పఠతి దినమణౌ ప్రత్యహంప్రోజ్జిహానే

సాయం మధ్యందినే వా త్రిషవణమథవా సంతతం వా జనో యః |

స స్యాదైశ్వర్యధుర్యః ప్రభవతి వచసాం కీర్తిముచ్చైస్తనోతి

దారిద్ర్యం హంతి విశ్వం వశయతి సుచిరం వర్ధతే పుత్రపౌత్రైః ‖ 206 ‖


అకించనోప్యేకచిత్తో నియతో నియతాసనః |

ప్రజపంశ్చతురో మాసాన్ గణేశార్చనతత్పరః ‖ 207 ‖


దరిద్రతాం సమున్మూల్య సప్తజన్మానుగామపి |

లభతే మహతీం లక్ష్మీమిత్యాజ్ఞా పారమేశ్వరీ ‖ 208 ‖


ఆయుష్యం వీతరోగం కులమతివిమలం సంపదశ్చార్తినాశః

కీర్తిర్నిత్యావదాతా భవతి ఖలు నవా కాంతిరవ్యాజభవ్యా |

పుత్రాః సంతః కలత్రం గుణవదభిమతం యద్యదన్యచ్చ తత్త -

న్నిత్యం యః స్తోత్రమేతత్ పఠతి గణపతేస్తస్య హస్తే సమస్తమ్ ‖ 209 ‖


గణంజయో గణపతిర్హేరంబో ధరణీధరః |

మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః ‖ 210 ‖


అమోఘసిద్ధిరమృతమంత్రశ్చింతామణిర్నిధిః |

సుమంగలో బీజమాశాపూరకో వరదః కలః ‖ 211 ‖


కాశ్యపో నందనో వాచాసిద్ధో ఢుంఢిర్వినాయకః |

మోదకైరేభిరత్రైకవింశత్యా నామభిః పుమాన్ ‖ 212 ‖


ఉపాయనం దదేద్భక్త్యా మత్ప్రసాదం చికీర్షతి |

వత్సరం విఘ్నరాజోఽస్య తథ్యమిష్టార్థసిద్ధయే ‖ 213 ‖


యః స్తౌతి మద్గతమనా మమారాధనతత్పరః |

స్తుతో నామ్నా సహస్రేణ తేనాహం నాత్ర సంశయః ‖ 214 ‖


నమో నమః సురవరపూజితాంఘ్రయే

నమో నమో నిరుపమమంగలాత్మనే |

నమో నమో విపులదయైకసిద్ధయే

నమో నమః కరికలభాననాయ తే ‖ 215 ‖


కింకిణీగణరచితచరణః

ప్రకటితగురుమితచారుకరణః |

మదజలలహరీకలితకపోలః

శమయతు దురితం గణపతినామ్నా ‖ 216 ‖


‖ ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖండే ఈశ్వరగణేశసంవాదే

గణేశసహస్రనామస్తోత్రం నామ షట్చత్వారింశోధ్యాయః 

_శ్రీ వినాయక వ్రతకల్పం_

 *🚩_శ్రీ వినాయక వ్రతకల్పం_🚩*


🕉️🐁🕉️🐁🕉️🐁🕉️🐁🕉️🐁🕉️


*పూజకు కావలసినవి*


పసుపు , కుంకుమ , గంధం , అగరువత్తులు , కర్పూరం , తమల పాకులు , వక్కలు , పూలు , పూలదండలు , అరటిపండ్లు , కొబ్బరి కాయలు , బెల్లం లేదా పంచదార , పంచామృతాలు , తోరము , దీపారాధన కుందులు , నెయ్యిలేక నూనె , దీపారాధన వత్తులు. వినాయకుడి ప్రతిమ , 21 రకాల ఆకులు , ఉండ్రాళ్ళు , పాయసం , భక్ష్యాలు.


వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి , దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.


వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు , పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.


*ఆచమనం*


ఓం కేశవాయ స్వాహాః

నారాయణాయ స్వాహాః

మాధవాయ స్వాహాః

(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)


గోవిందాయ నమః

విష్ణవే నమః

మధుసూదనాయ నమః

త్రివిక్రమాయ నమః

వామనాయ నమః

శ్రీధరాయ నమః

హృషీకేశాయ నమః

పద్మనాభాయ నమః

దామోదరాయ నమః

సంకర్షణాయ నమః

వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః

అనిరుద్దాయ నమః

పురుషోత్తమాయ నమః

అధోక్షజాయ నమః

నారసింహాయ నమః

అచ్యుతాయ నమః

ఉపేంద్రాయ నమః

హరయే నమః

శ్రీ కృష్ణాయ నమః

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః


*దైవ ప్రార్థన*


(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను).


1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం


2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:


3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం


4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.


తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై , సర్వ మంగళ నామధేయురాలవై , అన్ని అర్థములను సాధించి , శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే , ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ ! పార్వతీ , ఓ ! దుర్గాదేవీ, ఓ ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.


(ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.)


ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||


భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)


శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే


తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.


ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)


ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |


ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||


||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||


*కారణము:* (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి , ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం , కుంభకం , రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు , చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)


అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)


*ప్రాణాయామం*


*సంకల్పము:* (ఎప్పుడు , ఎక్కడ, ఎవరు , ఏమి కోరి , ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే , శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే , శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూ ద్వీపే, భరతవర్షే , భరతఖండే , మేరోర్ధక్షిణదిగ్భాగే , …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే , శుభ నక్షత్రే , శుభయోగే శుభకరణే , ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం , శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)


భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజేఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం


*షోడశోపచారపూజ*


ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥


శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి


అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ


*ఆవాహయామి*


మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥


*ఆసనం సమర్పయామి*


గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥


*ఆర్ఘ్యం సమర్పయామి*


గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥


*పాద్యం సమర్పయామి*


అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥


*ఆచమనీయం సమర్పయామి.*


దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥


*మధుపర్కం సమర్పయామి.*


స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥


*పంచామృత స్నానం సమర్పయామి.*


గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥


*శుద్దోదక స్నానం సమర్పయామి.*


రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥


*వస్త్రయుగ్మం సమర్పయామి.*


రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥


*ఉపవీతం సమర్పయామి.*


చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥


*గంధాన్ సమర్పయామి.*


అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ , గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥


*అక్షతాన్ సమర్పయామి.*


సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥


*పుష్పాణి పూజయామి.*


*అథాంగ పూజ*


*(పుష్పములతో పూజించవలెను)*


గణేశాయ నమః - పాదౌ పూజయామి ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి హేరంబాయ నమః - కటిం పూజయామి లంబోదరాయ నమః - ఉదరం పూజయామి గణనాథాయ నమః - నాభిం పూజయామి గణేశాయ నమః - హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి


*ఏకవింశతి పత్రపూజ*


(21 విధముల పత్రములతో పూజింపవలెను)


సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామిగజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి , ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి , వికటాయ నమః - కరవీరపత్రం పూజయామిభిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి , వటవేనమః - దాడిమీపత్రం పూజయామి , సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి , ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి , హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి , సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి , ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి , సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.


*శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా*


ఓం గజాననాయ నమః


ఓం గణాధ్యక్షాయ నమః


ఓం విఘ్నరాజాయ నమః


ఓం వినాయకాయ నమః


ఓం ద్వైమాతురాయ నమః


ఓం ద్విముఖాయ నమః


ఓం ప్రముఖాయ నమః


ఓం సుముఖాయ నమః


ఓం కృతినే నమః


ఓం సుప్రదీప్తాయ నమః


ఓం సుఖనిధయే నమః


ఓం సురాధ్యక్షాయ నమః


ఓం సురారిఘ్నాయ నమః


ఓం మహాగణపతయే నమః


ఓం మాన్యాయ నమః


ఓం మహాకాలాయ నమః


ఓం మహాబలాయ నమః


ఓం హేరంబాయ నమః


ఓం లంబజఠరాయ నమః


ఓం హయగ్రీవాయ నమః


ఓం ప్రథమాయ నమః


ఓం ప్రాజ్ఞాయ నమః


ఓం ప్రమోదాయ నమః


ఓం మోదకప్రియాయ నమః


ఓం విఘ్నకర్త్రే నమః


ఓం విఘ్నహంత్రే నమః


ఓం విశ్వనేత్రే నమః


ఓం విరాట్పతయే నమః


ఓం శ్రీపతయే నమః


ఓం వాక్పతయే నమః


ఓం శృంగారిణే నమః


ఓం ఆశ్రితవత్సలాయ నమః


ఓం శివప్రియాయ నమః


ఓం శీఘ్రకారిణే నమః


ఓం శాశ్వతాయ నమః


ఓం బల్వాన్వితాయ నమః


ఓం బలోద్దతాయ నమః


ఓం భక్తనిధయే నమః


ఓం భావగమ్యాయ నమః


ఓం భావాత్మజాయ నమః


ఓం అగ్రగామినే నమః


ఓం మంత్రకృతే నమః


ఓం చామీకర ప్రభాయ నమః


ఓం సర్వాయ నమః


ఓం సర్వోపాస్యాయ నమః


ఓం సర్వకర్త్రే నమః


ఓం సర్వ నేత్రే నమః


ఓం నర్వసిద్దిప్రదాయ నమః


ఓం పంచహస్తాయ నమః


ఓం పార్వతీనందనాయ నమః


ఓం ప్రభవే నమః


ఓం కుమార గురవే నమః


ఓం కుంజరాసురభంజనాయ నమః


ఓం కాంతిమతే నమః


ఓం ధృతిమతే నమః


ఓం కామినే నమః


ఓం కపిత్థఫలప్రియాయ నమః


ఓం బ్రహ్మచారిణే నమః


ఓం బ్రహ్మరూపిణే నమః


ఓం మహోదరాయ నమః


ఓం మదోత్కటాయ నమః


ఓం మహావీరాయ నమః


ఓం మంత్రిణే నమః


ఓం మంగళసుస్వరాయ నమః


ఓం ప్రమదాయ నమః


ఓం జ్యాయసే నమః


ఓం యక్షికిన్నరసేవితాయ నమః


ఓం గంగాసుతాయ నమః


ఓం గణాధీశాయ నమః


ఓం గంభీరనినదాయ నమః


ఓం వటవే నమః


ఓం జ్యోతిషే నమః


ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః


ఓం అభీష్టవరదాయ నమః


ఓం మంగళప్రదాయ నమః


ఓం అవ్యక్త రూపాయ నమః


ఓం పురాణపురుషాయ నమః


ఓం పూష్ణే నమః


ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః 


ఓం అగ్రగణ్యాయ నమః


ఓం అగ్రపూజ్యాయ నమః


ఓం అపాకృతపరాక్రమాయ నమః


ఓం సత్యధర్మిణే నమః


ఓం సఖ్యై నమః


ఓం సారాయ నమః


ఓం సరసాంబునిధయే నమః


ఓం మహేశాయ నమః


ఓం విశదాంగాయ నమః


ఓం మణికింకిణీ మేఖలాయ నమః


ఓం సమస్తదేవతామూర్తయే నమః


ఓం సహిష్ణవే నమః


ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః


ఓం విష్ణువే నమః


ఓం విష్ణుప్రియాయ నమః


ఓం భక్తజీవితాయ నమః


ఓం ఐశ్వర్యకారణాయ నమః


ఓం సతతోత్థితాయ నమః


ఓం విష్వగ్దృశేనమః


ఓం విశ్వరక్షావిధానకృతే నమః


ఓం కళ్యాణగురవే నమః


ఓం ఉన్మత్తవేషాయ నమః


ఓం పరజయినే నమః


ఓం సమస్త జగదాధారాయ నమః


ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః


ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే


దశాంగం గుగ్గలోపేతం సుగంధం , సుమనోహరం , ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥


ధూపమాఘ్రాపయామి॥


సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా , గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే


దీపందర్శయామి


సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్ , నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్ ,


భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ , ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ,


నైవేద్యం సమర్పయామి


సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక


సువర్ణపుష్పం సమర్పయామి.


పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం


తాంబూలం సమర్పయామి


ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ


నీరాజనం సమర్పయామి


అథ దూర్వాయుగ్మ పూజాసవరించు


గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి


ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి


కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి


*నమస్కారము , ప్రార్థన*


ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన ,


ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ,


అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన ,


పునరర్ఘ్యం సమర్పయామి ,


ఓం బ్రహ్మవినాయకాయ నమః


నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ,


ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్


వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ


నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.


*శ్రీ వినాయక వ్రత కథ*


*గణపతి జననము*


సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను. గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు తనను ఎవరూ వధించజాలని శక్తిని , శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు అతడు అజేయుడైనాడు.


భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది , జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది , విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో *"ఏమి కావలయునో కోరుకో"* అన్నాడు విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు అయినా మాట తప్పుట కుదరదు కుక్షియందున్న శివుని ఉద్దేశించి *"ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు , నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది"* అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు శివుడు గజముఖాసురుని శిరమును , చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు


అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది తనలో తాను ఉల్లసిస్తూ , స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది.


శివుడు తిరిగి వచ్చాడు , వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా ! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.


జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును , త్రిలోకపూజనీయతను కలిగించాడు గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి.


*గణేశుడు అగ్రపూజనీయుడు*


ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి ? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు గజాననుడుమిగిలిపోయినాడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు , జలమున్నియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు , మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు వినాయకునికే ఆధిపత్యము లభించినది.


*చంద్రుని పరిహాసం*


గణేశుడు జ్ఞానస్వరూపి , అగ్రపూజనీయుడు , జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।


(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।


చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు ? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు ? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు.


ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడింది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది.


*శ్యమంతకోపాఖ్యానము*


*చంద్ర దర్శనం నీలాపనింద:*


ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.


అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది.


నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.


ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.


అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము , భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు , రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.


అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు.


అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని , ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.


శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.


వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.


పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః


సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.


సర్వేజనాః సుఖినో భవంతు.


*విఘ్నేశ్వర చవితి పద్యములు*


*ప్రార్థన :*


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.


తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌


అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.


*వినాయక మంగళాచరణము*


ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు 

కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం


వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి 

మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం


శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు 

సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం


ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు 

బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం


చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను 

పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌


మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌. 


మరొక పద్యం కూడా విద్యార్థులకు ఉచితమైనది.


తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా! 


ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్థనా శ్లోకము


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పత్రాలు - వాటి ఔషధ గుణాలు .

 విఘ్నేశ్వరుడి పూజకు ఉపయోగించవలసిన పత్రాలు - వాటి ఔషధ గుణాలు .


   ప్రధమ పూజలు అందుకునేవాడు , పార్వతి తనయుడు అయిన విఘ్నేశ్వరుడికి పూజ చేయుటకు మొత్తం 21 రకాల పత్రాలను ఉపయోగించవలెను . ఇప్పుడు మీకు ఆ పత్రాల పేర్లు వాటి యెక్క ఔషధ గుణాలు గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను.


      మొత్తం 21 రకాల పత్రాలు వరసగా అవి.


 * మాచిపత్రి -


         ఇది కుష్టు , వాతరక్తం , జ్వరాన్ని , భూతబాధ , గ్రహ బాధని తొలగించును.


 * వాకుడు -


         కఫం , వాతం , శ్వాసము , శూలజ్వరం , వాంతుల రోగం , గుండెజబ్బు , ఆకలి లేకపోవటం , ఆమదోషం నివారించును.


 * మారేడు - 


         వాతాన్ని తగ్గించును , దీని పండు శూల, జ్వరాన్ని , మూత్రకృచ్చం నశింపచేయును.


 * గరిక - 


         ఇది రక్తపైత్యం , కఫం , తాపము , దప్పిక , విసర్పి రోగాలను నయం చేయును .


 * ఉమ్మెత్త -


         కుష్టువు , దురద, వ్రణము , అరికాలిబొబ్బలు , విషము వీటిని నశింపచేయును .


 * రేగు -


          ఇది పిత్తాన్ని , వాతాన్ని హరించును . ఆమ దోషాన్ని నివారించి ఆకలి బాగుగా కలుగచేయును .


 * ఉత్తరేణి -


           కఫము , కుష్టు , మహోదరము , మొలలవ్యాధి , వాపు , దురద, శూల , అరుచి సమస్యలను నివారించును. శీఘ్రవిరేచనం కలుగచేయును.


 * తులసి -


           దాహాన్ని కలిగించును. పిత్తాన్ని ఉత్పత్తి చేయును . హృదయానికి బలాన్ని కలిగించును. ఆకలి పుట్టించును . శ్లేష్మం , దగ్గు , శ్వాస , కుష్టు , క్రిమిరోగాలు , వాంతులు , దుర్గoదం , పార్శ్వపు శూల , విషాన్ని హరించును .


 * విష్ణుక్రాంత -


         పిత్తము , కఫాన్ని పోగొట్టును .విషము , కుష్టు , ఆమము , శోఫ , తలనొప్పి , నేత్రరోగాలను నయం చేయును .


 * దానిమ్మ -


         చలువచేయును , నీరుని పెంచును , గుండెకి బలము ఇచ్చును. దుష్టరక్తం హరించును , త్రిదోష హరమైనది, ఆకలి పుట్టించును , రక్తగ్రహణి తగ్గించును , కంఠస్వరం బాగుచేయను . దేహపుష్టిని , రక్తపుష్టిని ఇచ్చును , భోజనాంతరం పుచ్చుకునిన అన్నమును జీర్ణం చేయును , వాతము , కఫం , పైత్యాన్ని హరించును . రక్తమును శుభ్రపరచును.


 * దేవదారు -


         ఇది శ్లేష్మం , వాతం , ఆమదోషం , మలబంధం , ప్రమేహం , ప్రదరము , జ్వరం , క్రిమిరోగం పోగొట్టును .


 * మరువం -


          దీని కషాయం పైత్యం , శ్లేష్మం , విషము , మేహము , మొలలరోగం , క్షయరోగం , పైత్య భ్రమ , దాహము , తాపము తగ్గించును . విరేచనబద్ధము చేయును . ఆకలి పుట్టించును , జీర్ణశక్తిని వృద్దిచేయును , ఇంద్రియపుష్టి చేయును .


 * వావిలి - 


          ఇది క్రిమి , కుష్టువు , పిత్తము , శ్లేష్మం , ప్లీహము , గుల్మరోగం , అరుచి , సన్నిపాతం , జ్వరం , పిచ్చి , పీనస వీటిని నశింపచేయును .


 * జాతిపత్రి -


         ఇది కారంగా , ఉష్ణంగా , పరిమళంగా ఉండును. కఫం , మూత్రదోషం , అతిసారం , శ్వాస , హుద్రోగం , శూల నశింపచేయును. నోటికి పరిమళం కలిగించును.


 * శీతాఫలం -


         ఇది శరీరముకు వేడిచేసి చలువచేయును . రక్తమును , ఇంద్రియమును వృద్దిచేయును , ముంతగుండెకు , మనస్సుకు బలమును ఇచ్చును , జీర్ణశక్తిని ఇచ్చును. క్రిమిని హరించును , మేహవాతం అణుచును , శ్లేష్మము పెంచును .


 * జమ్మి -


         ఇది విసర్పిరోగం , వ్రణము , దద్దురులు , ప్రదరరోగం , కేశములను నశింపచేయును .


 * అత్తిపత్తి - 


          ఇది మూలవ్యాది , వరిబీజం , భగంధరం , దగ్గులు తగ్గును. కంటిపొరలు , వీర్యవృద్ధి , అతివేడి , పైత్య శాంతి కలుగచేయును.


 * రావి -


          చలువచేయును , పిత్తము , శ్లేష్మము , వ్రణము , యోని దోషము , మంట , పిత్తము , కఫము పోగొట్టును . బాగుగా పండిన రావిపండ్లు హృదయానికి ఎక్కువుగా మేలుచేయును . పిత్తరక్తం , విషపీడ , తాపం , వాంతి , అరుచి నశింపచేయును .


 * మద్ది -


         హృదయానికి హితమైనది , కఫ , పిత్తములను శమింపచేయును . విషము , రక్తదోషం , మేధోవృద్ధి , ప్రమేహము , వ్రణము అను వ్యాధులను పోగొట్టును .


 * జిల్లేడు -


        వాతదోషం , శోఫ , వ్రణము , దురద , కుష్టు , ప్లీహారోగం , క్రిమిదోషం నివారణ చేయును .


 * మామిడి -


       ఇది ప్రమేహము , రక్తదోషం , కఫం , పిత్తము, వ్రణము వీటిని హరించును . లేత మామిడికాయ త్రిదోషం , ప్రకోపం , రక్తదోషం హరించును .


 * వెలగ -


        ఇది శీతలంగా ఉండును , స్వరం , కఫము నశింపచేయును . దీని ఫలం మధురంగా , పుల్లగా ఉండును. శ్వాస కాస , అరుచి , దప్పిక తగ్గించును . కంఠశుద్ధి కలుగచేయును . నిద్ర కలుగచేయును . తలనొప్పి తగ్గించును . మూత్రములో పోవు తీపి తగ్గును.


        పైన చెప్పినవన్నీ విఘ్నేశ్వరుడు పూజలో వాడుదురు .


      

గణేశ ..సాహో...జయహో

 గణేశ ..సాహో...జయహో


నాయకులకు నాయకుడు

గణ నాయకుడు వినాయకుడు

విభిన్న రూపధాయకుడు

గజన్మోఖుడు ఏకదంతుడు

చతుర్భుజుడు లంభోధరుడు

మోదక హస్తుడు గణేషుడు.


రూపంబున చిన్నవాడు

మనసున పెద్దవాడు

జనకుల పట్ల ప్రేమ గలవాడు

జనులకు ప్రీతి పాత్రుడు

ప్రధమ పూజితుడు

పిలవంగ పలుకువాడు

చిట్టి ఎలుక వాహనం కలవాడు

బలమైన తొండము ఉన్నవాడు

కుడుముల ప్రీతి గలవాడు

విఘ్నములను తొలగించ గలవాడు.


నలుపిండితో రూపుదిద్ద బడిన వాడు

అమ్మ మాటకు కట్టుబడినవాడు

శివుడిని అడ్డగించి పోరుసల్ఫిన వాడు

నాటి చిన్న బాలుడు.


శివాగ్రహము చవిచూడగా

త్రిశూలముచే శిరము తెగి

అంతట గజము శిరము అతికించ పునర్జీవుడై

శివానుగ్రహముతో

గణేష నామధేయంతో

సకల లోకల పయనం తల్లిదండ్రులకు ప్రదక్షణతో మెలిగి

భక్త గణము గల్గి గణ నాధుడైన

తొలి పూజ అర్హత నీకే నాయకా

వినాయక.


ప్రధమ పూజలో భక్తులొనర్చిన సేవలకు మెచ్చిన నీవు

ప్రీతికరమైన పిండి వంటలు ఆరగించి ఆకసమున తిరిగి పోవుచుండగా

శశి దోష చూపుల నవ్వులతో

లంభోధరం బీటలు కాగా

శివానుగ్రహముతో పునర్జీవుడైన వినాయక.


దేహం విలక్షణమైనది.

జ్ఝానం అనంతమైనది

సేవ అనుగ్రహమైనది

వినయం అనుసరణీయమైనది.

భక్తి ప్రియమైనది.

గణం శక్తి వంతమైనది.

గౌరవం ప్రధానమైనది.

లక్షణమైన సంస్కారం

అతని నాయకత్వం.


అందుకే గణ నాయక

గణేశ సాహో..జయహో.


అశోక్ చక్రవర్తి నీలకంఠం.

9391456575.

ప్రశ్న పత్రం సంఖ్య: 29

 ప్రశ్న పత్రం సంఖ్య: 29  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది 

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. 

ఇది వినాయకచవితి ప్రత్యేకం. దయచేసి ఇందులోని ప్రశ్నలను పూరించటానికి ప్రయత్నించండి.   

  1. వినాయక చవితి ఏ తిధినాడు వస్తుంది. 
  2. గజాననునికి విఘ్నదిపత్యాన్ని ఇవ్వటానికి పరమేశ్వరుడు పెట్టిన పరీక్ష ఏమిటి. 
  3. విఘ్నధిపతిగా ఉండటానికి ఎవరు ఎవరు పోటీ పడ్డారు. 
  4. శ్రీ కృష్ణుడు అడవిలో ఎవరితో మల్లయుద్ధం చేసారు, ఎన్ని రోజులు. 
  5. సత్రాజిత్ సోదరుని పేరు ఏమిటి. 
  6. సమంతకమనోపాఖ్యానం ఏ యుగములో జరిగింది. 
  7. శ్రీ కృష్ణుడు తన నగరమున యేమని చాటింపు చేయించారు. 
  8. వినాయక వ్రతకధలో శ్రీ కృష్ణుల వారు ఎందరిని వివాహమాడారు, వారి పేర్లు ఏమిటి. 
  9. రామాయణంలోని ఒకరు  వినాయక్ వ్రతకధలో కనపడతారు ఎవరు. 
  10. నేను తొందరగా వెళ్ళాలి ఈ రాజు వినాయక చవితి అని శ్రీ కృష్ణునితో ఎవరు అన్నారు. 
  11. పార్వతి దేవి గృహ ద్వారము వద్ద ఎవరు వున్నారు. 
  12. వినాయకుని ఎవరు తయారుచేసారు, వాడిన పదార్ధం ఏమిటి. 
  13. వినాయకునికి అతికించిన శిరస్సు ఎవరిది. 
  14. శమంతక మణి దినమునకు ఎన్ని బారువుల బంగారమును వసగును. 
  15. తల్లిదండ్రులకు ప్రణమిల్ల కష్టపడుతున్న వినాయకుని చూసి నవ్వినది ఎవరు. 
  16. ఒక్క అరుంధతి వేషము తప్ప ఇతర ఋషి పత్నుల వేషము ధరించినది ఎవరు. 
  17. శ్రీ కృష్ణ భగవానునికి కలిగిన నీలాపనిందలు ఏమిటీ. 
  18. వినాయక చవితి రాత్రి ఎవరిని చూడకూడదని చెపుతారు. 
  19. వినాయకుని కనిష్ట సోదరుని పేరు ఏమిటి. 
  20. విజ్ఞేషుని భార్యల పేర్లు ఏమిటి. 
  21. వినాయకుని వాహనం ఏమిటి పేరు తెలపండి. 
  22. వినాయకునికి ప్రియమైన వంటకం ఏమిటి. 
  23. ఋషి పత్నులకు కలిగిన నీలాపనిందలు ఏమిటి. 
  24. మనం చేసే ప్రతి పూజకు ముందుగా ఆరాధించే దేముడి పేరు ఏమిటి. 
  25. శ్రీ మహావిష్ణువు ఏ ఏ వాద్య పరికరాలను ధరించినట్లు మనం కధలో తెలుసుకున్నాం 
  26. వినాయక చవితి అంటే నాకు ఇష్టం ఎందుకంటె.