10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

గణేశ ..సాహో...జయహో

 గణేశ ..సాహో...జయహో


నాయకులకు నాయకుడు

గణ నాయకుడు వినాయకుడు

విభిన్న రూపధాయకుడు

గజన్మోఖుడు ఏకదంతుడు

చతుర్భుజుడు లంభోధరుడు

మోదక హస్తుడు గణేషుడు.


రూపంబున చిన్నవాడు

మనసున పెద్దవాడు

జనకుల పట్ల ప్రేమ గలవాడు

జనులకు ప్రీతి పాత్రుడు

ప్రధమ పూజితుడు

పిలవంగ పలుకువాడు

చిట్టి ఎలుక వాహనం కలవాడు

బలమైన తొండము ఉన్నవాడు

కుడుముల ప్రీతి గలవాడు

విఘ్నములను తొలగించ గలవాడు.


నలుపిండితో రూపుదిద్ద బడిన వాడు

అమ్మ మాటకు కట్టుబడినవాడు

శివుడిని అడ్డగించి పోరుసల్ఫిన వాడు

నాటి చిన్న బాలుడు.


శివాగ్రహము చవిచూడగా

త్రిశూలముచే శిరము తెగి

అంతట గజము శిరము అతికించ పునర్జీవుడై

శివానుగ్రహముతో

గణేష నామధేయంతో

సకల లోకల పయనం తల్లిదండ్రులకు ప్రదక్షణతో మెలిగి

భక్త గణము గల్గి గణ నాధుడైన

తొలి పూజ అర్హత నీకే నాయకా

వినాయక.


ప్రధమ పూజలో భక్తులొనర్చిన సేవలకు మెచ్చిన నీవు

ప్రీతికరమైన పిండి వంటలు ఆరగించి ఆకసమున తిరిగి పోవుచుండగా

శశి దోష చూపుల నవ్వులతో

లంభోధరం బీటలు కాగా

శివానుగ్రహముతో పునర్జీవుడైన వినాయక.


దేహం విలక్షణమైనది.

జ్ఝానం అనంతమైనది

సేవ అనుగ్రహమైనది

వినయం అనుసరణీయమైనది.

భక్తి ప్రియమైనది.

గణం శక్తి వంతమైనది.

గౌరవం ప్రధానమైనది.

లక్షణమైన సంస్కారం

అతని నాయకత్వం.


అందుకే గణ నాయక

గణేశ సాహో..జయహో.


అశోక్ చక్రవర్తి నీలకంఠం.

9391456575.

కామెంట్‌లు లేవు: