10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

వినాయకచవితి. సందర్భంగా

 వినాయకచవితి. సందర్భంగా ఒక విన్నపం

*మనము తెలిసి తెలిసి కొన్ని క్షమించరాని తప్పులు మనం చేస్తున్నాము. ప్రతీ వినాయక చవితికి ఇదే తంతు జరుగుతుంది. ఏంటంటే అసలు వినాయకుణ్ణి మనం మండపాలల్లో ఎందుకు ప్రతిష్టిస్తున్నాము ? అందులో అంతరార్థం ఏంటి ? ఈ విషయం లో చాలా మంది తప్పుదోవ పడుతున్నారు.*


*వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందండి . వినాయక సహస్ర నామాలలో వెయ్యి రకాలు చెప్పబడాయి . అలాంటి వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవశ్యాన్ని కలుగజేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారుచేయించుకుని ఇలా ఎందుకు పూజిస్తున్నారు. '' ఫిధ గణపతి,*  

*గబ్బర్ సింగ్ 2 గణపతి, బాహుబలి 2 గణపతి, స్పైడర్ మాన్ గణపతి బుల్లెట్ గణపతి ...ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ఎందుకు ఇంతటి* *దుర్మార్గపు కృత్యాలు ..? కాలని లోని పెద్దలు, మత పెద్దలు, యువకుల తల్లి తండ్రులు , నాయకులు ఇలాంటివి చూసి కూడా ఎందుకు నోరు మెదపడం లేదు....? ఎందుకు* *ప్రోత్సహిస్తున్నారు ..?*

*మన ఇంట్లో మన కుటుంబీకులు ఎవరైనా చనిపోయిన వారుంటే వారి ఫోటోలు ఇలా తయారు చేసి పెడుతున్నారా...?*


*మన బుద్ధి రాను రాను వక్రీకరించడం వల్లనే దేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు మనకంటే ఇతర మతాల వారు చాలా ఉత్తమం అనిపిస్తుంది. వాళ్ళు ఇలా మనలాగా వాళ్ళ దేవుణ్ణి కించపరిచినట్టు ప్రవర్తించరు.*


*ముఖ్యంగా ఈ విషయంలో యువత తప్పు దారి పడుతుంది. ఇక నవరాత్రులు చివరి రోజు మాత్రం చాలా హంగామా చేస్తారు. తాగడం , ఎగరడం - దూకడం లాంటి కృత్యాలు చేసి మన హిందూ సంస్కృతీ పరువు మనమే తీస్తున్నాము. ఊరేగింపులో బూతు పాటలు. భారీగా ఖర్చు , భయకరమైన సౌండ్ సిస్టం , ఇలా ప్రతీది తపెఎ, అసలు అంత ఖర్చు ఎందుకు పెడ్తున్నారు . మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞానం ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి.*


*మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకండి. వీలైతే భజనలు చేయండి లేదా ఏమీ చేయకుండా ఉండండి.* *బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఇలా అడగడం. మీకు శక్తి లేకపోతే పెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు వద్దు. అవన్నీ మూర్ఖపు పనులు. దయచేసి మానండి.*

*మోరీల పైన మండపాలు, రోడ్డు మీద మండపాలు, ఒక్క కాలనిలో 100 మండపాలు. విపరీత పోటీ రాజకీయం... అన్నీ వికృత చేష్టలే .* 


*చాలా జాగ్రత్తగా గమనించండి....1 మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు , 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ ఒక కాలనిలో ఒకే మండపం అయితే ఐక్యమత్యo పెరిగినట్లు .*


*దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి. సంస్కృతిని కాపాడే బాధ్యత మనలో లేకపోతే మనం బతికున్న శవాలమే...* *ఆలోచించండి.*


*ధర్మో రక్షతి రక్షితః 👏*

కామెంట్‌లు లేవు: