ప్రశ్న పత్రం సంఖ్య: 29 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
ఇది వినాయకచవితి ప్రత్యేకం. దయచేసి ఇందులోని ప్రశ్నలను పూరించటానికి ప్రయత్నించండి.
- వినాయక చవితి ఏ తిధినాడు వస్తుంది.
- గజాననునికి విఘ్నదిపత్యాన్ని ఇవ్వటానికి పరమేశ్వరుడు పెట్టిన పరీక్ష ఏమిటి.
- విఘ్నధిపతిగా ఉండటానికి ఎవరు ఎవరు పోటీ పడ్డారు.
- శ్రీ కృష్ణుడు అడవిలో ఎవరితో మల్లయుద్ధం చేసారు, ఎన్ని రోజులు.
- సత్రాజిత్ సోదరుని పేరు ఏమిటి.
- సమంతకమనోపాఖ్యానం ఏ యుగములో జరిగింది.
- శ్రీ కృష్ణుడు తన నగరమున యేమని చాటింపు చేయించారు.
- వినాయక వ్రతకధలో శ్రీ కృష్ణుల వారు ఎందరిని వివాహమాడారు, వారి పేర్లు ఏమిటి.
- రామాయణంలోని ఒకరు వినాయక్ వ్రతకధలో కనపడతారు ఎవరు.
- నేను తొందరగా వెళ్ళాలి ఈ రాజు వినాయక చవితి అని శ్రీ కృష్ణునితో ఎవరు అన్నారు.
- పార్వతి దేవి గృహ ద్వారము వద్ద ఎవరు వున్నారు.
- వినాయకుని ఎవరు తయారుచేసారు, వాడిన పదార్ధం ఏమిటి.
- వినాయకునికి అతికించిన శిరస్సు ఎవరిది.
- శమంతక మణి దినమునకు ఎన్ని బారువుల బంగారమును వసగును.
- తల్లిదండ్రులకు ప్రణమిల్ల కష్టపడుతున్న వినాయకుని చూసి నవ్వినది ఎవరు.
- ఒక్క అరుంధతి వేషము తప్ప ఇతర ఋషి పత్నుల వేషము ధరించినది ఎవరు.
- శ్రీ కృష్ణ భగవానునికి కలిగిన నీలాపనిందలు ఏమిటీ.
- వినాయక చవితి రాత్రి ఎవరిని చూడకూడదని చెపుతారు.
- వినాయకుని కనిష్ట సోదరుని పేరు ఏమిటి.
- విజ్ఞేషుని భార్యల పేర్లు ఏమిటి.
- వినాయకుని వాహనం ఏమిటి పేరు తెలపండి.
- వినాయకునికి ప్రియమైన వంటకం ఏమిటి.
- ఋషి పత్నులకు కలిగిన నీలాపనిందలు ఏమిటి.
- మనం చేసే ప్రతి పూజకు ముందుగా ఆరాధించే దేముడి పేరు ఏమిటి.
- శ్రీ మహావిష్ణువు ఏ ఏ వాద్య పరికరాలను ధరించినట్లు మనం కధలో తెలుసుకున్నాం
- వినాయక చవితి అంటే నాకు ఇష్టం ఎందుకంటె.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి