6, జులై 2026, సోమవారం

కాళహస్తీశ్వర శతకం - 32

 🕉️ శ్రీ కాళహస్తీశ్వర శతకం - 32


ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)

కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె

న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్

సుఖశ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!


తాత్పర్యం :


శ్రీ కాళహస్తీశ్వరా ! 


ఆత్మకు ఆశ్రయ స్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. 


అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచే ఏర్పడిన  ’ఓం’ కారము. 

దీనిని ఉపాసనాసంప్రదాయము నందు "తారకము" అని అందురు. 


మరియొక నామము "నాదము". దీనినుండి మరియు దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. 

ఈ విశ్వమునకు "బిందువు" అనియు వ్యవహరింతురు. 


నాదము కాని బిందువు కాని చక్కని శోభతో ప్రకాశించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు. 


అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు శబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. 

ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. 


ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. 

అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. 

దానిని తెలుపు సావయవ శబ్దముల మూలతత్త్వము "కళలు” అనబడు వర్ణములు. 


ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు - శక్తి అను అంశములుగ చూడవలయును. 


ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. 

కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము.


ఓం నమః శివాయ


*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*

పూవులను రేకులుగా విడదీసి పూజ చేయవచ్చా?

 ప్ర : పూవులను రేకులుగా విడదీసి పూజ చేయవచ్చా?


జ : పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం సరస్వతి. పువ్వు అంత కోమలమైనది, పువ్వు అంత పరిమళంతో కూడుకున్నది పువ్వు అంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేలమీద పడి ఉంటే ఎవరైనా సరే దానిని తీసేయాలి ముందు. అది క్రింద ఉండకూడదు. ఎర్రపువ్వు క్రింద పడి సువాసిని కానీ, ఎవరు కానీ తొక్కకూడదు. సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు. ఎవరైనా తొక్కుతారు అని వెంటనే తీసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైన పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా అక్షతలతో పూరణ చేస్తారు. నిజానికి పూజలో మనం చాలా ఇవ్వనే ఇవ్వం. మంత్రం ఒకలా ఉంటుంది. మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు. సింహాసనం సమర్పయామి అంటారు. రోజూ పట్టుకువచ్చి సింహాసనం వేస్తున్నామా? అక్షతలు వేస్తారు. మనసులో భావన చేయాలి. ఎర్రటి మెత్తటి పరుపులు, పాదపీఠం, సింహం ముఖం తీసుకువచ్చి అక్కడ వేస్తే దానిమీద ఆయన కూర్చున్నట్లు భావిస్తాం. ’క్షతము’ అంటే విరిగిపోవడం; ’అక్షత’ నడుము విరగని పసుపు కలిపిన బియ్యం. అవి వేస్తే అందులోకి వచ్చేస్తుంది పదార్థం. ఈశ్వరుడికి అందిపోతుంది. అలాగే తాంబూలం. మనం నిజానికి ఏం చెప్తాం అంటే ఒక మాట చెప్తాం ’ముక్తాచూర్ణేన సంయుక్తే తాంబూలం ప్రతిగృహ్యతామ్’ – అసలు మంచి ముత్యం తీసుకువచ్చి కాలుస్తారు. దాని బూడిద ఒక సూది మొన పెట్టి తీస్తే ఎంత వస్తుందో అంత వేయాలి. అది కానీ ఎక్కువ అయితే నోరు అంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది. ముత్యపుగుండ అంత శక్తివంతం. తృణం వేస్తే చాలు నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో! తాంబూలం ఐదోతనానికి గుర్తు. అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దానిని మధ్యాహ్నం భార్య వేసుకోవాలి. ఆమె తాంబూలం వేసుకుంది అంటే భర్తగారి భోజనం అయిపోయింది అని గుర్తు. అయిదోతనానికి గుర్తు తాంబూలచర్వణం. అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నములుతూ ఉంటుంది. అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి, ఇచ్చేది ఒకటి. భక్తితో తమలపాకులు పెట్టి అందులో వక్క, అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడితే అప్పుడు పూర్ణంగా పదార్థాలు అన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్లే. అన్నింటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర చిదిపేసి నలిపేసి రేకులు వేయమని ఎవరు చెప్పారు? ఒక అందమైన పువ్వును ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనబడతాడు. అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారుచేస్తే తుంపి పూజ చేస్తారా? ఈశ్వరుడు అడిగాడా నిన్నుతక్కువైందని? తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం? రోజూ సింహాసనాలు తెస్తామా? రోజూ పంచెలచాపులు తెస్తామా? పట్టుచీరలు తెస్తామా? దానికి పనికి వచ్చింది పువ్వుల దగ్గరకి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది? ఎందుకు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం. అది హింస. పరమ కఠోరమైన మనస్తత్త్వంతో చేసేటటువంటి పని. కొంతమంది తెలియక చేస్తారు మనస్సు కఠినమై కాదు. మనస్సు కోమలంగా ఉంటుంది. తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే పువ్వును చిదమనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి. మిగిలినవి అక్షతలతో పూరణ చేయండి.



తిరుమల 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి దర్శనభాగ్యం

 తిరుమల



116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన‌ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు


కాలినడకన తిరుమలకు వెళ్తున్న వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ 


శ్రీవారిపై వృద్ధురాలి అచంచలమైన భక్తికి స్పందించిన  

సీఎం, టీటీడీ చైర్మన్


వృద్ద భక్తురాలికి, ఆమె కుటుంబసభ్యులకు ప్రత్యేక దర్శనం చేయించాలని నిర్ణయించుకున్నట్లు, ఆమె వివరాలు తెలియపరగలని నిన్న Xలో పోస్ట్ పెట్టిన చైర్మన్


చైర్మన్ విజ్ఞప్తి పై సత్వరం స్పందించి....వృద్దురాలిని కనుగొన్న విజిలెన్స్ అధికారులు


తమిళనాడు చెన్నైకి చెందిన నవనీతమ్మ గా గుర్తింపు


చైర్మన్ నిర్ణయం ప్రకారం ఈ ఉదయం వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులకు విఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన చైర్మన్ కార్యాలయ సిబ్బంది


వృద్ధురాలిని బయోమెట్రిక్ లో దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లిన చైర్మన్ కార్యాలయ సిబ్బంది


రంగనాయకుల‌ మండపంలో వృద్ధురాలికి పండితులతో దగ్గరుండి వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి తీర్థప్రసాదాలను‌ అందజేసిన‌ టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర


వృద్ధురాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఈఓ రవిచంద్ర


ఆ స్వామివారి రూపంలో టీటీడీ చైర్మన్ మా అమ్మమ్మ తో పాటు కుటుంబానికి మంచి దర్శనభాగ్యం కల్పించారు


టీటీడీకు, చైర్మన్ కు మా ధన్యవాదాలు


- దిక్పతీ, వృద్ధురాలు నవనీతమ్మ మనవడు

పంచాంగం 06.07.2026 Monday,

  ఈ రోజు పంచాంగం 06.07.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస క్రిష్ణ పక్ష షష్ఠి తిథి ఇందు వాసర పూర్వాభాద్ర నక్షత్రం సౌభాగ్య యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: సప్తమి 


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

--------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।

ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।। 22 ।।




ప్రతిపదార్థ:



యే — ఏదైతే; హి — నిజముగా; సంస్పర్శ-జాః — ఇంద్రియ వస్తు-విషయముల సంపర్కంచే జనించిన; భోగాః — భోగములు; దుఃఖా — దుఃఖములు; యోనయః — మూలము; ఏవ — నిజముగా; తే — వారు; ఆద్య-అంతవంతః — మొదలు మరియు తుది కలిగిన; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; న — ఎప్పటికీ కాదు; తేషు — వాటిలో; రమతే — రమించరు; బుధః — తెలివైనవారు.


 

తాత్పర్యము : 


 

ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం (మొదలు-చివర) ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు.



వివరణ:


ఇంద్రియ వస్తు-విషయ సంపర్కంచే ఇంద్రియములు సుఖానుభూతులను కలుగచేస్తాయి. మనస్సు ఒక ఆరవ ఇంద్రియము లాగా, గౌరవము, పొగడ్త, పరిస్థితులు, విజయము మొదలైన అగ్రాహ్యమైన వాటి నుండి ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. ఈ యొక్క శారీరక, మానసిక సుఖాలన్నిటినీ భోగాలు (భౌతిక సుఖానుభవము) అంటారు. ఇటువంటి ప్రాపంచిక భోగాలు, ఈ క్రింది కారణాల వలన ఆత్మను సంతృప్తి పరచలేవు:


ప్రాపంచిక ఆనందాలు పరిమితమైనవి, కాబట్టి ఏదో లోపించిన భావన వాటిలో అంతర్గతంగా ఉంటుంది. ఒక వ్యక్తికి లక్షాధికారి అయ్యాననే సంతోషం ఉండవచ్చు, కానీ అదే లక్షాధికారి ఒక కోటీశ్వరున్ని చూసినప్పుడు అసంతృప్తికి లోనై ఇలా అనుకుంటాడు, ‘నాకు కూడా ఒక కోటి రూపాయలు ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేవాడిని.’ అని. దీనికి విరుద్ధంగా, భగవంతుని ఆనందం అనంతమైనది, కాబట్టి పరిపూర్ణ సంతృప్తిని ఇస్తుంది.


ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవి. ఒకసారి అయిపోయిన తరువాత, వ్యక్తిని మరల అసంతృప్తితో వదిలిపెడతాయి. ఉదాహరణకి ఒక తాగుబోతు, రాత్రి పూట మద్యం తాగటాన్ని ఎంజాయ్ చేయవచ్చు. కానీ మరుసటి రోజు పొద్దున్న దాని దుష్ప్రభావం, అతనికి తీవ్రమైన తలనొప్పి ఇస్తుంది. కానీ, భగవంతుని ఆనందం నిత్యమైనది, ఒకసారి పొందిన తరువాత అది ఎప్పటికీ ఉంటుంది.


ప్రాపంచిక సుఖాలు అస్థిరమైనవి మరియు త్వరితగతిన వీగిపోతాయి. జనులు ఒక గొప్ప అవార్డు పొందిన సినిమాను చూసినప్పుడు, ఏంతో ఆనందిస్తారు, కానీ అదే సినిమాని రెండవ సారి స్నేహితుడికి తోడు కోసం చూడవలసి వస్తే, ఆ ఆనందం ఉండదు. ఇంకొక స్నేహితుడు మూడో సారి చూడటానికి ఒత్తిడి చేస్తే, వారంటారు , ‘ఏదైనా శిక్ష వేయండి కానీ, మరల ఆ సినిమా చూడమని అడగవద్దు.’ అని. భౌతిక వస్తువుల నుండి కలిగే సుఖం మనం దానిని ఆనందించే కొద్దీ తగ్గిపోతుంది. ఆర్థికశాస్త్రంలో దీనిని ‘లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్’ (Law of Diminishing Returns) అంటారు. కానీ, భగవంతుని ఆనందం చైతన్యవంతమైనది; అది సత్-చిత్-ఆనందం (శాశ్వతమైన నిత్య నూతనమైన దివ్య ఆనందము). కాబట్టి, ఒక వ్యక్తి అదే భగవత్ నామాన్ని నిరంతరం రోజంతా జపిస్తూ ఉన్నా, నిత్య నూతనమైన ఆధ్యాత్మిక తృప్తిని దానిలో పొందుతాడు.


ఒక స్వస్థచిత్తంగల మనిషి, రుచికరమైన స్వీటుని అస్వాదిస్తునప్పుడు, దానిని వదిలి బురదని తినమంటే తినడు. అదేవిధంగా, ఒక వ్యక్తి దివ్య ఆధ్యాత్మిక ఆనందాన్ని అస్వాదిస్తున్నప్పుడు, మనస్సు అన్ని భౌతిక సుఖాల యందు రుచిని కోల్పోతుంది. విచక్షణా జ్ఞానం ప్రసాదించబడిన వారు ఈ పైన చెప్పబడిన భౌతిక సుఖాల లోపాలను అవగతం చేసుకుని, తమ ఇంద్రియములను వాటినుండి నిగ్రహిస్తారు. శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో దీనిని ఉద్ఘాటిస్తున్నాడు.