తిరుమల
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు
కాలినడకన తిరుమలకు వెళ్తున్న వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్
శ్రీవారిపై వృద్ధురాలి అచంచలమైన భక్తికి స్పందించిన
సీఎం, టీటీడీ చైర్మన్
వృద్ద భక్తురాలికి, ఆమె కుటుంబసభ్యులకు ప్రత్యేక దర్శనం చేయించాలని నిర్ణయించుకున్నట్లు, ఆమె వివరాలు తెలియపరగలని నిన్న Xలో పోస్ట్ పెట్టిన చైర్మన్
చైర్మన్ విజ్ఞప్తి పై సత్వరం స్పందించి....వృద్దురాలిని కనుగొన్న విజిలెన్స్ అధికారులు
తమిళనాడు చెన్నైకి చెందిన నవనీతమ్మ గా గుర్తింపు
చైర్మన్ నిర్ణయం ప్రకారం ఈ ఉదయం వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులకు విఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన చైర్మన్ కార్యాలయ సిబ్బంది
వృద్ధురాలిని బయోమెట్రిక్ లో దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లిన చైర్మన్ కార్యాలయ సిబ్బంది
రంగనాయకుల మండపంలో వృద్ధురాలికి పండితులతో దగ్గరుండి వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి తీర్థప్రసాదాలను అందజేసిన టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర
వృద్ధురాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఈఓ రవిచంద్ర
ఆ స్వామివారి రూపంలో టీటీడీ చైర్మన్ మా అమ్మమ్మ తో పాటు కుటుంబానికి మంచి దర్శనభాగ్యం కల్పించారు
టీటీడీకు, చైర్మన్ కు మా ధన్యవాదాలు
- దిక్పతీ, వృద్ధురాలు నవనీతమ్మ మనవడు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి