21, ఆగస్టు 2023, సోమవారం

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర 25*🌷

 🌷 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర 25*🌷

                   🌷🌷🌷

*శ్రీనివాసునకూ, పెండ్లివారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట.* 

ఆకాశరాజు బంధువులతో సహితము... మంగళవాద్యాలతో సహితం శ్రీనివాసుడున్న విడిది గృహానికి వెడలినాడు.

అప్పుడు వశిష్ఠుడు ఆకాశరాజుతో "రాజా! ఇంక ముహూర్తము సమీపించనున్నది కదా, కనుక మున్ముందుగా మీరిప్పుడు, వరుని పూజచేయవలసి యున్నదనెను".  

అట్లే అని ఆకాశరాజు, ధరణీదేవి శ్రీనివాసునకు గంధము, తాంబూలము మొదలైనవి ఇచ్చి బట్టలూ, నగలూ ఇచ్చి పూలతో ప్రేమతో పూజ చేసారు.

పూజానంతరము శ్రీనివాసుని పట్టపుటేనుగుపై ఆసీనుని చేశారు. 

బ్రహ్మ, 

సరస్వతీ, 

ఈశ్వరుడు, 

పార్వతి, 

ఇంద్రుడు, 

శని

తక్కిన వారినీ, మునులను సర్వవిధ మంగళవాద్యాల మధ్య 

విడుదలు నుండి తోడుకొని వచ్చి, రాజమందిరములో ప్రవేశింపజేశారు.

రాజమందిర ద్వారము దగ్గర ముత్తైదువువులు, శ్రీనివాసునకు హారతి యిచ్చారు.

అనంతరం అలంకరించబడిన కళ్యాణమండపములోకి శ్రీనివాసుని రావించి, బంగారముతో చేయబడిన ఒక పీఠముపై కూర్చుండజేశారు. 

ఎప్పుడు ఏది చేయవలసి వున్నదో చెబుతున్నారు.  ఆయన చెప్పగా ఆకాశరాజు స్వామి పుష్కరిణీతీర్థము నుండి పవిత్రజలాన్ని తెప్పించాడు. 

భార్య ధరణీదేవి బంగారు కలశముతో ఆ జలమును పోస్తుండగా, ఆయన శ్రీనివాసుని పవిత్ర పాదకమలాలను కడిగినాడు.   కడిగి ఆ జల బిందువులను తన శిరస్సుపై జల్లుకొని ధరణీదేవి శిరముపైన జల్లినాడు. 

బృహస్పతి, వారిరువురునూ సమయోచిత శుభమంత్రాలు పఠిస్తుండగా, ఆకాశరాజు పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకొని, ధరణీదేవి స్వర్ణ పాత్రతో స్వచ్ఛ జలము పోస్తుండగా, శ్రీనివాసుని చేతిలో ధారవోసినాడు. 

వశిష్ఠుడు ఆ దంపతులకు కంకణాలు కట్టాడు.

ఏ శుభముహూర్తమునకు వివాహము జరగవలసి యున్నదో ఆ సముహూర్తము రానే వచ్చినది.

వాద్యాలు వాయించేవారు మరింతగా వాయించసాగారు.

ముత్తయిదువులు మంగళ సూత్రమును గట్టిగా అలంకరించారు. 

దేవతలు ఆనందముతో ఆ సమయములో పూలవర్షము కురిపించారు. 

తరువాత విలువయిన మంచి ముత్యాలతో తలంబ్రాలు పోసుకొన్నారు దంపతులు. 

ఈ విధముగా పద్మావతీ, శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము జరిగినది.

ఆకాశరాజు యొక్క సంకల్పమునకు వున్న బలము కారణముగా కళ్యాణము సవ్యముగా జరిగిది. 

కళ్యాణ సందర్భములోనే ఆకాశరాజు అల్లుడైనటువంటి, శ్రీనివాసునకు కట్నాలు-కానుకలు బాగానే యిచ్చారు. 

వందబారువుల స్వర్ణకిరీటము, మణులు పొదగబడిన కంఠహారాలు,  ఒక కోటి బంగారు నిష్కములు, మకరకుండలాలు, మాణిక్యాల పతకాలు, సింహలాట సహితాలైన కంకణాలు, బంగారముతో చేయబడిన మొలత్రాడు, రవ్వల ఉంగరాలు, అపరంజి పాదుకలు, రత్నాలు తాపబడిన కంబళములు, భోజనావసరమునకు స్వర్ణపాత్రలు,   సహస్రగజాలు, దశ సహస్రగజాలు, దశ సహస్ర అశ్వాలు, దాసదాసీ జనాలు మున్నగు అనేక విధాలయిన ఆభరణాలు బహూకరించాడు. 

పద్మావతీదేవి వివాహానికై వచ్చినవారందరినీ, ఉచిత మర్యాదలచే గౌరవించడము జరిగినది.

లక్షలాది బ్రాహ్మణులకు సంతుష్టిగా సంభావనలిచ్చి, పంచభక్ష్య పరమాన్నములతో భోజనములు పెట్టి, వారిని ఆనందింపజేశారు. 

అయిదు రోజుల వివాహమున్నూ అతి వైభవముగా జరిగినది.

ధరణీదేవి ఆకాశరాజు, క్షీరధారవతో, పద్మావతిని శ్రీనివాసుని హస్తములో పెట్టి అప్పగిస్తూ, ఆకాశరాజు యీ విధముగా అన్నాడు.

"శ్రీనివాసానికి, నీవు సాక్షాత్తు భగవంతుడయిన, శ్రీమన్నారాయణుడవే,అని నేను బాగా అర్థము చేసుకొన్నాను. 

నీ పవిత్ర పాద కమలాలు జలముతో కడిగి పిల్లనివ్వడము వలన మా వంశానికి వంశమే తరించిందని నేను భావిస్తున్నాను. 

నీకు సర్వులూ బంధువులే.  పిల్లనిచ్చినవాడినగుటచే నీకు ఒక చిన్న మనవి చేసుకొనదలంచుకున్నాను. 

పద్మావతి అతి సుకుమారి.  జాగ్రత్తగా యేలుకొనుము.

ఈమెను పువ్వులలో పెట్టుకొని జాగ్రత్తగ చూచుకొనమని, తండ్రిగా కోరుచున్నాను " అనెను.  

ఆకాశరాజు కుమార్తెవైపు తిరిగి, అమ్మాయి, పద్మావతీ, చాలా అదృష్టవంతురాలవు.  సాక్షాత్తూ శ్రీమన్నారాయణమూర్తియే నీకు భర్తగా లభించినాడు. 

అతనిని నీవు బహుభక్తితో చూచుకొనుచుండుము. 

స్త్రీకి భర్తయే దైవము.  పతి సన్నిధానమే నీకు పెన్నిథి.   నీ మగని బాగా నీ బాగుగా భావించి నడచుకొనుము. 

పాలూ-నీరు మాదిరిగా ఆలూ-మగలు వుండాలి.  పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తి తీసుకురావలెను.

సీత, రుక్మిణి, అనసూయ, సుమతి వంటి వారిని ఆదర్శముగా తీసుకొనుము. 

కన్నవారమయిన మమ్ము ఎన్నటికీ మరువకుము." అని సూక్తులు చెప్పినాడు. 

పద్మావతి తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వీడి, భర్తగారింటికి వెళ్ళేముందర మనస్సులో బాధపడినది. 

చిరాకు సారి, నగా నట్ర పెట్టి పద్మావతీదేవిని, అత్తవారింటికి వెడలుటకై ప్రయాణము చేశారు. 

అత్తయ్యకు, మామయ్యకు శెలవు చెప్పి, శ్రీనివాసుడు పద్మావతీ సమేతుడై, గరుడవాహనాన్ని అధిరోహించినవారై, పయనమయ్యారు. 

మార్గమధ్యములో అగస్త్యుని ఆశ్రమము తగిలినది.

అగస్త్యుడు శ్రీనివాసుని తోడుకొని, ఆశ్రమమునకు తీసుకొని...వెడలి ఉచిత రీతిని భక్తిశ్రద్ధలతో పూజించినాడు. 

అప్పుడు శ్రీనివాసుడు, దేవతలూ మొదలైన తనతో వచ్చినవారితో,  స్నేహితులారా! మీకొక విషయము చెప్పాలని అనుకొంటున్నాను. 

అదేమంటే, వివాహమయిన భార్యాభర్తలు, వివాహానంతరము ఆరు మాసాలవరకు, పర్వతాలు ఎక్కకూడదనే, ఒక ధర్మము వున్నది కదా!  అందువలన నేనున్న్నూ, పద్మావతియూ యీ అగస్త్యుని ఆశ్రమములో ఆరు నెలలపాటు వుంటాము.  తరువాత శేషాచలానికి చేరుకొంటాము." అన్నాడు. 

వారందరూ సరే అన్నారు. 

బ్రహ్మ,  ఈశ్వరుడు, అందరున్నూ శ్రీనివాసుని వద్ద శలవు గైకొని వారివారి నెలవులకు వెడలిపోయారు. 

పద్మావతీ-శ్రీనివాసులు హాయిగా అగస్త్యుని ఆశ్రమములో నివసించసాగారు. 

రత్న కిరీట గోవిందా

రామానుజనుత గోవింద

స్వయం ప్రకాశ గోవిందా

సర్వ కారణ గోవిందా 

గోవిందా హరి గోవిందా 

వేంకట రమణా గోవిందా 

గోవిందా హరి గోవిందా 

వేంకట రమణా గోవిందా!

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ:

శంఖుడనే మహర్షి అన్న తోటలో మామిడిపండు అడగకుండా తీసుకున్న పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి రాజుగారి దగ్గరకు వెళ్ళి దండన స్వీకరించాడనీ, రాజు విధిలేక చేతులు నరికివేసే దండన ఇచ్చాడనీ పురాణాల్లో ఉంది. ఒక్క పండు అడకుండా కోసుకుంటే ఇంతటి శిక్షా? అన్యాయం కాదా?

అంతరంగమందు అపరాధములు చేసి

మంచివాని వలెనె మనుజుడుండు

ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా ( విశ్వ..)

అనేది నేటి నీతి.. మనం చేసిన తప్పు మనకు బాగా తెలుసు. ఐనా , నేనేమీ చేయలేదు....అని బుకాయిస్తాం. అదేమీ పెద్ద తప్పు కాదులే అని మనకు మనమే సమర్థించు కొంటాం.

శంఖుడు , లిఖితుడు అని ఇద్దరు ముని కుమారులు. చెరొక ఆశ్రమంలో నివాసం..

ఒకనాడు లిఖితుడు అన్నను చూడ వచ్చాడు. సమయానికి ఆయన ఇంట్లో లేడు. ఆయన తోటలో మామిడి పండ్లు ఉన్నాయి. నాలుగైదు కోసుకొని తినివేశాడు

అన్నయ్య వచ్చాడు. ఈ టెంకలేమిటి ?.అన్నాడు. ఆకలిగా ఉంటే మీ చెట్టువే కోసి తినివేశాను. అని సమాధానం.

అన్నకు ధర్మాగ్రహం కలిగింది. పో .త్వరగా పో. రాజు తో చెప్పి తగిన దండన విధించుకోని , శుద్దుడవై త్వరగా రా ! అని పంపించి వేశాడు..

తమ్ముడూ రాజు దగ్గరకు చేరాడు. విప్రోత్తముడు వచ్చాడని ఆనందపడి పోయాడు. ఏమిచ్చి సేవ చేసుకోమంటారు?. అని వినయం చూపాడు రాజు. .. నేను చెప్పినట్టు చేయాలి. మాట ఇచ్చారు గదా! అన్నాడు లిఖితుడు.

జరిగిన సంగతి చెప్పి మా అన్న మీ శిక్షతో పావనుణ్ణయి రమ్మని ఆదేశించాడు. నాకు శిక్ష వేయడం మీ విధి. ..అన్నాడు.

రాజు తల్లడిల్లి పోయాడు. వేదవేత్తలు..మీకు నేను శిక్ష విధించడమేమిటి?. నన్ను క్షమించండి అన్నాడు రాజు.

మాట ప్రకారం శిక్ష వేయవలసిందే . నా పాపం ఇక్కడే పరిహారం అయి పోతుంది. అని బలవంతపెట్టాడు లిఖితుడు.

అందరికీ ఒకే శిక్ష. విజ్ఞుడికి అధిక శిక్ష. వెంటనే అమలు గొప్ప వరం. అంతటితో ఆ పీడ విరగడై ఇంక మనసును దహించదు. సత్కర్మల అనుభవానికి ఆ పాపం అడ్డు పడదు.

రాజు రెండు చేతులు ఖండించమని ఆదేశించాడు.

తెగిపోయిన చేతులతో ఆనందంగా అన్న దగ్గరకు పోయాడు.

. పోయి నదిలో పితృ తర్పణం చేసిరా.. వేళ అయింది..అన్నాడు శంఖుడు.

దగ్గర ఉన్న నదిలో స్నానం చేసి ,సభక్తికంగా అర్ఘ్యం ఇవ్వబోయాడు. చేతులు యథాప్రకారం సహకరించాయి.

పోయిన బాహువులు ఇచ్చి ఆ నదీ మతల్లి *బాహుద* అయింది.

పరుల సొత్తు( తనకు ) పాము వంటిది.. అనీ , పరద్రవ్యాణి లోష్ఠవత్ అనీ మన విశ్వాసం..( రాయితో సమానం. )

మనది కానిదాని పైన ఆశ కలగడం పతన హేతువు.

మనసెపుడూ నిర్మలంగా ఉండాలి.

శంఖుడు పరద్రవ్యం అనుమతి పొందకుండా తీసుకొన్న దోషం పొందిన తమ్ముడి పైన ఆగ్రహించాడు.

అతణ్ణి శుద్ధుణ్ణి చేయడానికీ రాజదండన అనుభవించి రమ్మన్నాడు. లిఖితుడూ విజ్ఞుడే కాబట్టి, శిక్ష అనుభవించడం పాప విమోచన మార్గం అని సంతోషించాడు.

రాజుకూ తగిన దండన వేసి, సుకృతం కలిగింది.

ఈ కథ భీష్ముడు అంపశయ్య మీద ధర్మరాజాదులకు చెప్పినది.

రాజు పదవి చాల యోగ్యమైనదనీ దాన్ని చక్కగా నిర్వర్తించి పుణ్యం సంపాదించుకో అని , ఏదో తప్పు చేశానని అనవసరమైన చింతతో కుమిలి పోవద్దు అని ధైర్యం చెబుతూ, తాను గతంలో విన్న పుణ్య కథగా దీన్ని చెప్పాడు.

ఇది శాంతి పర్వం లో ఉన్న కథ..

ఇహమూ, పరమూ రెండూ ఉన్నాయి.

ఇక్కడ ధర్మం తప్పని వాడికీ మాత్రమే పుణ్య గతులు ..

చక్కగా రాజధర్మం చేయడం విష్ణుపద ప్రాప్తి మార్గం అని ఈ కథ నీతి.

పుణ్య నదీ స్నానాలు పాప మోచకాలు.. వాటిని అర్చించడం మన ధర్మం. వాటి మహిమ. అనిర్వాచ్యం.. ఎందరో పుణ్యాత్ముల తపస్సులతో అవి పావనమైనవి అని చెప్పే కథలెన్నో భారతాదులలో ఉన్నాయి..

ఉదాత్తుణ్ణి చిన్న తప్పైనా దహిస్తుంది.. దానికి ప్రాయశ్చిత్తం చేసుకొన్నపుడు అపరిమిత ఆనందం కలుగుతుంది. అది భౌతిక లౌకిక వస్తువుల చేత లభ్యమయ్యేది కాదు.

ప్రవరుడంటాడు వరూధిని తో. అది కామ విషయ సందర్భమైనా అన్ని జ్ఞానేంద్రియాలకూ అనువర్తించేదే

బ్రాహ్మణుడింద్రియ వశగతి

జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా

జిహ్మగముల పాలై చెడు

బ్రహ్మానందాధిరాజ్య పదవీ చ్యుతుడై.

ఏ ఇంద్రియాలకూ (ఇక్కడ లిఖితుడు జిహ్వకు వశుడైనాడు) లొంగి పోక వాటిని తన వశంలో ఉంచుకొన్న వాడు తన నిత్య బ్రహ్మానందం నుండి పతనం కాడు..

జిహ్మా ఆచరణ ఏక నిపుణుడు = వక్ర మార్గం లోకి తిప్పడంలో తనకు తానే సాటి ఐన వాడు చిత్తజుడు ..మన్నథుడు.

అతడి బాణాలో.. అజిహ్మగములూ ..సూటిగా తాకుతాయి. అవి పడనిస్తే వాడు చెడుతాడు..

సుభాషితమ్

 *卐ॐ _-|¦¦¦|సుభాషితమ్|¦¦¦|-_ ॐ卐* 

శ్లో𝕝𝕝 కర్ణస్త్వచం శిబిర్మాంసం

జీవం జీమూతవాహనః।

దదౌ దధీచిరస్థీని

నాస్త్యదేయం మహాత్మనామ్॥

తా𝕝𝕝 (కవచాన్ని దానమిచ్చే సందర్భంలో) కర్ణుడు తన చర్మాన్ని ఒలిచి ఇచ్చేసాడు.... శిబిచక్రవర్తి (ఒక పావురాన్ని రక్షించేందుకు) తన దేహాన్ని కోసి మాంసం ఇచ్చాడు.... జీమూతవాహనుడు (సర్పాలను కాపాడుటకు) గరుత్మండికి తన దేహాన్నే ఆహారంగా సమర్పించుకున్నాడు.... (శత్రుసంహారం ద్వారా లోకకళ్యాణం ఆశించి) దధీచి తన వెన్నెముకని దానం చేసాడు.... 

ఇలా మహాత్ములచే సమర్పించబడనిది ఏది లేదు?! 

🧘‍♂️🙏🪷

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -26 & 27🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -26 & 27🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కొన్ని రోజుల తరువాత నారాయణపురం నుండి ఒక సేవకుడు పద్మావతీ శ్రీనివాసుల వద్దకు వెళ్ళి ‘‘ఆర్యా! ప్రభువులైన మా ఆకాశరాజుగార్కి ఆకస్మాత్తుగా జబ్బుచేసినది. వారు ప్రమాద పరిస్థితిలో వున్నారు. మహారాజుగారు మీ యిద్దరినీ చూడాలని వుందనికలవరిస్తున్నారు’’ అన్నాడు. 

పద్మావతీ, శ్రీనివాసులు చాలా అందోళన పడ్డారు. ఆగస్త్యమహామునిని వెంటబెట్టుకొని వారిరువురూ విచారముతో నారాయణపురానికి వెళ్ళారు.

నారాయణపురము పద్మావతి, శ్రీనివాసులు చేరేటప్పటికి ఆకాశరాజు స్పృహకోల్పోయి వున్నాడు. శ్రీనివాసుడు మామగారిని సంబోధించి మాట్లాడడంతో ఆకాశరాజు తేరుకొని కళ్ళువిప్పి చూసాడు. చూస్తే ఎదురుగా పద్మావతి , శ్రీనివాసులు కనిపించారు. అందోళన నిండిన ముఖముతో ధరణీదేవి కూడా కనిపించింది.

అంతమ ఘడియాలలో నున్నప్పటికీ ఆకాశరాజు లేని ఓపిక తెచ్చుకొన్నాడు. శ్రీనివాసునితో ఆకాశరాజు సర్వసృష్టినీ స్పష్టించిన స్పష్టికర్తనే స్పష్టించిన ఓ ఆదిపురుషా!జగన్నాథా! గోవిందా! నారాయణా! అంతిమ కాలములో నిన్ను నేను దర్శించడము జరిగినది. 

ఇంతకన్న నాకు కావలసినది మరియొకటి యేముంటుంది? సర్వేశ్వరా నాకు కోరికలేమీ లేవు. ఒక్క విషయములో మాత్రమే నిన్ను ప్రార్థిస్తున్నాను. 

నా కుమారుడైన వసుదాముడూ, నా సోదరుడైన తొండమానుడూ అభమూ, శుభమూ తెలియనివారు. 

వారి విషయమై మాత్రమే నాకు బెంగ, నీవు వారిద్దరినీ జాగ్రత్తగా చూచుకొనుమని కోరుచున్నాను’’ అని పలికి కుమార్తె అయిన పద్మావతిని ‘‘అమ్మా! ఇలారా నా జన్మ తరించిపోయినది నీవంటి కుమార్తెను పొందగలిగినందులకు నేనే అనేక విధాలుగా గర్విస్తున్నాను. ఇంక మనకు ఋణము తీరిపోయిందమ్మా! సుఖముగా శాంతిగా వుండమ్మా అని అంటూ, ప్రాణాలు విడిచి కీర్తిశేషుడయ్యాడు.

 పద్మావతీ, ధరణీదేవి ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఆకాశరాజునకు దహన సంస్కారము చేశారు. ధరణీదేవి స్వర్గానికి వెళుతూన్న భర్తను అనుసరించడానికి నిశ్చయించుకొని సహగమనము చేసినది. తరువాత పద్మావతీ శ్రీనివాసులు ఆగస్త్యనితో ఆయన ఆశ్రమయునకు వెళ్ళిపోయారు.

*తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము:*

తొల్లి వైఖానసుడు అనే ఒక భక్తుడుండేవాడు. అతడు శ్రీకృష్ణభగవానుని స్వయముగా చూడాలనే కోరికతో వుండేవాడు. 

నిద్రాహారములు లేక, అచంచలదీక్షతో కృష్ణభగవానుని గూర్చి ఎన్నోయేండ్లూ, పూండ్లూ తపస్సు చేశాడు. శ్రీమహావిష్ణువు ఆతనికి దర్శనభాగ్యము కలుగజేశాడు. ప్రత్యక్షమై భక్తశ్రేష్ఠా! నీకు వలయునదేమిటో కోరుకొను మిచ్చెదను’’ అన్నాడు. 

కన్నులు తెరచి వైఖానసుడు శ్రీమన్నారాయణుని దివ్యదర్శనముచేసి స్వామి పాదములకు సాష్టాంగ దండప్రణామము లాచరించి ’’స్వామీ! కరుణాసాగరా! నాకు యితరమైన కోరికలేమీ కాని, శ్రీకృష్ణావతారము నేత్రానందముగా చూచి తరించాలని వున్నది’’ అనెను.

 అందులకు శ్రీమహావిష్ణువు ‘‘నాయనా వైఖానసా నీవు యిప్పుడు శ్రీకృష్ణదర్శనము చేయాలని కోరుకుంటే వీలుపడదు. కాని, యిప్పుడు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాసరూపములో ఒక పుట్టలో నున్నాడు. నీవు అతనిని పూజించవలసినది’’ అన్నాడు.

 తరువాత శ్రీమహావిష్ణువు అంతర్థానమయ్యాడు. వైఖానుసుడు అక్కడ నుండి శేషాచలానికి బయలుదేరాడు. మార్గములో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కలసినాడు. వైఖానసుడు తాను శేషాచలము మీదనున్న శ్రీనివాసుని సేవించ వెడుతున్నాననీ చెప్పగా, రంగదాసు తానున్నూ శ్రీనివాసుని సేవించ వెడుతున్నానని చెప్పెను, 

వారిరువురు కలసి శేషాచలాన్ని అధిరోహించారు. వైఖానుసుడు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి అందున్న భగవానునీ పూజించాలనుకొన్నాడు. పూవులు కావలసివచ్చాయి. అప్పుడు వైఖానసుడు రంగదాసునితో ‘‘శ్రీనివాసుని పూజించడానికి పూవులు కావాలి కదా! అందుచే నీవు ఒక పూలతోటను పెంచవలసినది’’ అని కోరాడు.

 రంగదాసు అలాగేనని పూలతోటకు నీరు చాలా ముఖ్యము కనుక, నీటికై ఒక బావిని త్రవ్వించాడు. దాని పేరు పూలబావిగ అయింది, ఆ బావిలోని నీటితో మొక్కలను పెంచి, ఆ మొక్కలను పూలను ప్రతిపాదిమూ శ్రీనివాసుని పూజకొరకై వైఖానసునకు యిచ్చుచుండెను. 

ఒకనాడు ఒకానొక గంధర్వరాజు స్వామి పుష్కరిణిలో జలక్రీడ లాడడానికై తనసతులతో సహితము వచ్చినాడు. అక్కడికి పూవలకొరకై వచ్చిన రంగదాసు ఆ జలక్రీడలను చూచి చిత్తచాంచల్యము పొందినవాడై స్వామి పూజా సమయము కూడా మరచిపోయాడు.

 గంధర్వులు వెళ్ళిన తరువాత, రంగదాసు తన పని గ్రహించినవాడై పూవులు తీసుకొని వైఖాసమునివద్దకు వచ్చాడు.

 వైఖానసముని ‘‘ఏమిటి యింత ఆలస్యమయిన’’దని గద్దించి అడిగాడు. ఉన్నదున్నట్లు చెప్పాడు రంగదాసు పూజకు తాను చేసిన ఆలస్యానికి బాధపడుతూ క్షమించమని వేడుతూ రంగదాసు శ్రీనివాసుని అనేక విధాల ప్రార్థించాడు. ప్రార్థించగా శ్రీనివాసుడు ప్రత్యక్షమయి ‘‘ఓయీ రంగదాసా! చేసిన దానికి విచారింపకుము. నీవు నాయొక్క మాయా మోహము వల్లనే గంధర్వుల జలక్రీడల్ని చూసి భ్రాంతిలో పడినావు. యీ శరీరము విడిచి నారాయణపురము రాజైన సుధర్ముడికి కుమారుడ నయ్యెదవు గాక తొండమానుడు అను నామధేయముతో రాజ్యసుఖములన్నీ అనుభవింతువు గాక’ అని చెప్పాడు.

ఆ రంగదాసే ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడుగా పుట్టాడు.

నిత్య శుభ ప్రద గోవిందా, నిత్య కళ్యాణ గోవిందా, ఆనంద రూప గోవిందా, ఆద్యంత రహిత గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||26||

శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం..

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆకాశరాజు మరణంతో తొండమానునకూ, వసుధాముడికీ రాజ్యము గూర్చి కలహము ఏర్పడింది. అన్న అయిన ఆకాశరాజు చనిపోయినాడు కనుక రాజ్యానికి పాలకుడుగా నేనే అవుతాననీ తొండమానుడూ, తండ్రి అయిన ఆకాశరాజు చనిపోయిన కారణముగా కుమారుడనైన నేనే రాజ్యపాలకుడవవలసి వున్న’’దనీ వసుధాముడూ వాదించుకోసాగారు. చివరకు యుద్ధానికి తయారయ్యారు. 

ముందుగా వారిద్దరూ అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళి తమవైపు సహయము చేయవలసిదిగా శ్రీనివాసుని అభ్యర్ధించారు. ఆయనకు యిద్దరూ దగ్గర బంధువులే కదా! ఆలోచించాడు శ్రీనివాసుడు. తొండమానునకు తన శంఖ చక్రాలను సహాయముగా యిచ్చాడు. తాను మాత్రము బావమరిదియైున వసుధాముని వైపున సమరం చేయడానికి నిశ్చయించుకొన్నాడు. యుద్ధరంగము సిద్ధమయినది పోరు జోరుగా సాగింది. ఇరువైపుల సైన్యములోని వారూ చాలామంది మరణించినారు. కొన్ని వందలమంది క్షతగాత్రులయ్యారు. ఆ సమయములో తొండమానూడూ, శ్రీనివాసుడూ ఘోర యుద్ధముచేయసాగారు. తొండమానుడు ఒక తీవ్రబాణము శ్రీనివాసుని హృదయంపై వేసినాడు, దానితో శ్రీనివాసుడు మూర్చపోయినాడు. ఈ వార్త పద్మావతికి తెలిసి రోదిస్తూ యుద్ధ రంగానికి వచ్చి మూర్చలోనున్న తన భర్తకు ఉపచారాలు చేసినది. శ్రీనివాసుడు మూర్చ నుండి తేరుకొన్నాడు. అప్పుడు పద్మావతి ‘‘ప్రాణప్రియా! ఈ యుద్ధములో ఒకరు చేస్తే పినతండ్రి, మరొకరు చేస్తే తమ్ముడు. వారిలో ఎవరు ఓడిపోయినా నేను చూడలేను స్వామీ! దయచేసి మీ చాకచక్యమును ఉపయోగించి వారిద్దరకూ రాజీ చేయండి’’ అని వేడుకొన్నది. 

అప్పుడు శ్రీనివాసుడు తొండమానునీ,వసుధామునీపిలిచి యుద్దము కన్నా రాజీ పడడమే ఉభయతారకముగా వుంటుందనీ బోధించాడు. వారిరువురకూ శ్రీనివాసునుడనిన చాలా గౌరవము కనుక ఒప్పుకున్నారు. శ్రీనివాసుడు రాజ్యాన్ని వారిద్దరకూ చెరిసగముగా చేసి పంచి యిచ్చాడు. వారు ఒప్పుకున్నారు. ఆడబిడ్డకు ఆధారముగా వారిరువురూ తమ రాజ్యములలో ముప్పయిరెండు గ్రామములు భరణముగా యిచ్చివేశారు. పిదప శ్రీనివాసుడు, పద్మావతి ఆగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు.

శ్రీనివాసుడు తొండమానునకూ, వసుధామునకూ రాజీ కుదిర్చిన వెనుక, వారు చక్కగా రాజ్యపాలనము చేసుకొనుచుండిరి. అక్కడ ఆగస్త్యమహాముని ఆశ్రమములో శ్రీనివాసుడూ, పద్మావతీ హాయిగా కాలక్షేపము చేయుచుండిరి. 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

    *ఓం నమో వెంకటేశాయ*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 18*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 18*

 *సాధన లక్ష్యం....*

బాహ్యంగా నరేంద్రుడు వేడుకలు, వినోదాలు, సంగీత వ్యాయామాదులలో కాలం గడుపుతున్నప్పటికీ, అంతరికంగా అతడి మనస్సు ఇలా ధ్యానం ద్వారా సత్యాన్ని అన్వేషించసాగింది. 'ఈ లోకాన్ని సృజించి, పరి 

రక్షించే పనులు నిర్వహించే ఒక శక్తి ఉండివుంటే, ఎందరో మహాత్ములు దర్శించి, పూజించి, స్తుతించడం నిజమే అయితే, సత్యాన్ని, ఆ శక్తిని తాను కూడా దర్శించుకోవాలి' అనే తలంపు అతడిలో తీవ్రతరం మయింది. 

ముఖాముఖి దర్శనం కన్నా మరెలాంటి ఋజువూ అతణ్ణి తృప్తిపరచేదిగా లేదు. అలా అయితే ఆ సత్యాన్ని దర్శించాలి. 

అందుకు మొదట అవసరమైనది తగిన అర్హత.

ఆ అర్హతలు.. 

"తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం (కర్మ ఫలాలను ఈశ్వరునికి అర్పించడం) - ఈ మూడు క్రియాయోగం" అంటున్నది పతంజలి యోగ సూత్రం. ' దీన్లో తపస్సే అన్నింటికీ ఆధారం. తపస్సు అంటే దగ్ధం అని అర్థం.

దేనిని దగ్ధం చేయాలి? మన లౌకిక వాంఛలను, ఇంద్రియాల ఉద్వేగాన్ని, దుర్గుణాలను దగ్ధం చేయడమే తపస్సు. 

దీనికి పునాదియైనది బ్రహ్మచర్యం. కామశక్తిని అధోముఖంగా పోనివ్వకుండా అడ్డుకోవడమే బ్రహ్మచర్యపు ముఖ్య కర్తవ్యం. కామమార్గంలో పోకుండా ఉండడమే గొప్ప తపస్సుగా పరిగణింపబడుతున్నది.

స్వాధ్యాయం లేక ఆత్మవిచారణ మూలంగా ఈ కామశక్తి ఉదాత్త లక్ష్యాన్ని చేరుకొంటుంది. తపస్సు మూలంగా పవిత్రమైన, స్వాధ్యాయం మూలంగా ఉదా లక్ష్యాన్ని చేరుకొన్న కామశక్తి సత్యస్వరూపుడైన భగవంతుని అభి ముఖంగా నిర్దేశింపబడినప్పుడు, అది సత్యాన్ని పొందే పథంలోకి సాధకుణ్ణి చేరుస్తుంది. నరేంద్రునికి ఈ మూడు స్వతఃసిద్ధంగానే కరతలామలకమని చూస్తున్నాం.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 3*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 3*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

      *అవిద్యానామ్ అంతః తిమిర మిహిర ద్వీపనగరీ*

       *జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతిఝరీ |*

       *దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ*

       *నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి||*

అమ్మా  నీ పాదధూళి రేణువు నీవు ఈ విధంగా అవుతున్నావు.

భవతి = ఎలాగ ?

అవిద్యానాం తిమిర అంతః = అవిద్య,అజ్ఞానము అనే చీకటిని అంతం చేసే 

మిహిర ద్వీపనగరీ = మిహిరుడంటే సూర్యుడు అనేకమంది సూర్యులను ఉదయింపజేసే ద్వీపనగరివి. అంటే సర్వ జ్యోతిర్మండలములకు ఆధారమైన పరంజ్యోతివి.*ఉద్యద్భాను సహస్రాభా* అని అమ్మవారి నామం.

జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతిఝరీ = స్పందన లేని జడులకు కూడా చైతన్యమును ఇస్తావు. ఎటువంటి చైతన్యం? పూలగుత్తి (స్తబకం) నుండి వెలువడే మకరంద ప్రవాహము (శ్రుతి) యొక్క వేగము (ఝరి) వంటి చైతన్యము. అమ్మవారి నామాల్లో *సుధా శ్రుతిః* ఒకటి.

దరిద్రాణాం చింతామణి గుణనికా = చింతామణి హారము వంటిది.అన్ని దారిద్ర్యములను పోగొట్టేది. చింతలను పోగొట్టేది చింతామణి.

జన్మజలధౌ నిమగ్నానాం = సంసార సాగరంలో మునిగినవాడిని 

దంష్ట్రా మురరిపు వరాహస్య = భూమిని జలధి నుండి ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి కోరల వంటిది.

ఇది అమ్మవారి వారాహీ శక్తిని గురించిన స్తుతిగా ఉపాసకులు భావిస్తారు. అమ్మవారి నామాల్లో *సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా* అని ఒకటి. జనన మరణ రూప ప్రవాహమే సంసారము. దాని నుండి ఉద్ధరింపబడటమే మోక్షము.

ఈ శ్లోకంలో అవిద్య, జడత్వము తొలగింపబడుట, ధర్మ పురుషార్ధమును, చింతామణి హారము దారిద్ర్యమును తొలగించుట,  అర్ధ కామములను సంసార సాగరం నుండి ఉద్ధరింపబడటం, మోక్షమును సూచిస్తున్నాయని, ఈ విధంగా అమ్మవారి పాదధూళి రేణువు చతుర్విధ పురుషార్ధములను అనుగ్రహిస్తున్నదని పండిత ఉవాచ. అర్ధ కామములు ఒకే వర్గముగా పరిగణింపబడి ధర్మమూ మోక్షముతో కలిసి త్రివర్గముగా త్రిపురా విద్యగా వారిచే చెప్పబడుతున్నది.

.           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 17*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 17*

*ప్రగాఢ ధ్యానాభ్యాసం*

భగవంతుడంటూ ఒకరు ఉండివుంటే  నిశ్చయంగా ఆయన నిజమైన ప్రార్థనలను ఆలకించి భక్తునికి దర్శనమిస్తాడు; ఆయన సాక్షాత్కారం పొందడానికి ఏదో ఒక మార్గం ఉండితీరాలి; అలా లేకపోతే జీవితమే నిరర్థకమని నరేంద్రుని గట్టి నమ్మకం. కాని అలాంటి భగవన్మార్గాన్ని బోధించడంలో బ్రహ్మసమాజం అనుకూలమైనది. కాదని కొద్ది రోజుల్లోనే నరేంద్రుడు గ్రహించకపోలేదు. 

సత్యాన్ని తెలుసుకోవాలి; భగవత్సాక్షాత్కారం పొందాలనే తపనతో ఒక క్రొత్త పద్ధతిలో ధ్యానాభ్యాసం ప్రారంభించాడు. భగవంతుణ్ణి సాకారునిగా తలచినా, నిరాకారునిగా ఎంచినా మానవ రూపాన్నీ, గుణాలనూ స్వీకరించకుండా మనం ఆయనను ధ్యానించలేం. దీనిని గ్రహించడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మ సమాజ పద్ధతి మేరకు భగవంతుణ్ణి నిరాకార సగుణ బ్రహ్మంగా ధ్యానించేవాడు. ఇదీ ఒక రకమైన కల్పనగా నిర్ధారణ చేసిన నరేంద్రుడు ఆ ధ్యాన పద్ధతిని విడిచిపెట్టి, "భగవంతుడా! నీ నిజస్వరూప దర్శనానికి నన్ను అర్హుణ్ణి చేయి" అంటూ ప్రార్థించాడు. 

ఆ తరువాత మనస్సును ఆలోచనారహితం చేసి, గాలిలేని చోట వెలిగే దీపశిఖలా మనస్సును నిశ్చలంగా ఉంచడానికి అభ్యాసం చేయసాగాడు. ఈ రీతిలో కొంతకాలం అభ్యసించిన తరువాత అతడి మనస్సు పూర్తిగా శాంతించింది. కొన్ని సమయాలలో దేహభావన, కాల భావన కూడా అతడికి మృగ్యమవడం కద్దు. ఇంట్లో అందరూ నిద్రించడానికి పోగానే, అతడు తన గదిలో ఈ తీరులో ధ్యానించేవాడు. అనేక రాత్రుళ్లు ధ్యానంలోనే గడచిపోయేవి.

ఆ కారణంగా ఒక రోజు నరేంద్రునికి అసాధారణమైన అనుభవం ఒకటి కలిగింది. ఆతడు ఇలా అన్నాడు: "ఏ ఆధారమూ లేకుండా మనస్సును ఏకాగ్రం చేసి స్థిరంగా నిలిపితే, మనస్సులో ఒక రకమైన ప్రశాంతతతో కూడుకొన్న పరమానందం జనిస్తుంది. ధ్యానానంతరం కూడా చాలాసేపు ఆ పరమానందపు మత్తు కొనసాగుతుంది. కనుక ఆసనాన్ని విడిచిపెట్టి వెంటనే లేవడానికి మనస్కరించదు.” అలాంటి ధ్యానానందాన్ని చవిచూడసాగాడు నరేంద్రుడు.🙏

దాన విశిష్ఠత !

దాన  విశిష్ఠత !

             ఉ:  దాన కళా కలాప  సముదంచిత  సార వివేక  సంపదన్

                   మానిత  యాచమాన  జనమానస  వృత్సభిపూర్తి బుధ్ధి  యె

                   వ్వానికి  లేదొకింతయును  వాడొకరుండు  భరంబు ధాత్రికిన్,

                  కానలుగారు , వృక్షములుగారు  నగంబులు  గారు  భారముల్; 

శృంగార నైషథము--శ్రీనాథమహాకవి.

భావము:  దానంచేయటం ఒక  కళ.  దాని విశిష్ఠతను  తెలిసికొని  ,మాన నీయులైన  యాచకజన  మనోరథములను  తీర్చెడి

కుతూహలము  యెవనికి లేదో  ఈపుడమికి  వాడొక్కడే  భారము.

                       అడవులుగాని , వృక్షములుగానీ , పర్వతములు  గానీ , భారములుగావు.

      విశేషాంశములు: దానకళా విజ్ఙాన వంతుడే  దానంచేయగలడు. దానం చేయటానికిముందు యాచకుని యోగ్యతనుగుర్తించి,తదుచితమైన దానంచేయాలి.అది  కష్టసాధ్యమైనవిషయమే!. దాత ముందుగా ఆవివేకాన్ని  సంపాదించాలట.

యాచకులను హీనులుగా చూడరాదు.వారుపుడమికిసందేశహారులట!ఏమిటాసందేశం?"ఎన్నడూ యెవరికీ యేమీ పెట్టనివానిబ్రతుకు మాబ్రతుకులాగేఉంటుంది.దానంచేనిన వారిజీవితం మీలాగేహాయిగాఉంటుంది"- అని; అందువలనవారిని  గౌరవనీయులుగా భావించాలి. వారి  మనసెరిగి  దానంచేయాలి. అరకొర దానం చేయరాదు. అలాంటి  ఉత్తముడే దాత అతడు పుడమికి  అలంకారం. తక్కినవారు (లోభులు ) భూమికి బరువని కవియభిప్రాయం.

పర్వతాదులు గూడా భూమికి భారము కాదని  భావము.🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

M

H

G

Indian Army

Health

Changes

Panchang

శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం.

 🕉 మన గుడి 

⚜ బీహార్ : బక్సర్

⚜ శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం. 

💠 ప్రతి గుడిలో ఒక రాతి విగ్రహం ఉంటుంది, కానీ ఆ విగ్రహం మాట్లాడుతుందని చెబితే, బహుశా మీరు నమ్మరు. అయితే అటువంటి దేవత ఆలయం ఉందని, ఇక్కడ విగ్రహం రాతితో చేసినప్పటికీ దాని నుండి శబ్దాలు వస్తాయని  తెలుసా ! అవును, మీరు దీనిని మూఢ నమ్మకంగా పరిగణించవచ్చు  కానీ ఇది ఖచ్చితంగా నిజం. 

మనం అన్నింటినీ తిరస్కరించవచ్చు కానీ దేవి మరియు దేవతల ఉనికిని మరియు వారి శక్తిని తిరస్కరించలేము. 

దీని వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసినా అక్కడ ఏం జరుగుతోంది అనేది అంతుపట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. 

అలాంటి ఆలయాల్లో ఒకటి  బీహార్ రాజధాని పాట్నా బక్సర్లో ఉన్న రాజేశ్వరీ ఆలయం. 

🔅 ఊరి పేరు వెనక ఉన్న చరిత్ర 🔅

💠 పూర్వం ఈ ప్రాంతంలో ఒక ఋషి, మహిమాన్వితుడు అయిన దుర్వాస మహర్షి మీద అసూయతో ధ్యానం చేసుకుంటున్న దుర్వాస మహర్షిని భయపెట్టి, ఆయన ధ్యాననిష్టని చెడగొట్టాలని క్రూర మనస్తత్వంతో తనను తాను కామరూప విద్యతో పులిగా మారి దూర్వాస మహర్షిని భయపెట్టాలి అని అతని మీదకు వెళ్ళాడు.

తపస్సులో ఉన్న దూర్వాస మహర్షికి  దివ్య దృష్టితో ఈ విషయం తెలిసి పులి రూపంలో వచ్చిన ఆ ఋషిని అదే పులి రూపంలో జీవితాంతం ఉండిపోయేలా శపించాడు.

💠 తన తప్పు తెలుసుకున్న ఆ ఋషి క్షమించమని ఎన్నో విధాల దుర్వాస మహర్షి  కాళ్లపై పడి ప్రార్థించగా చివరికి శాంతించిన దూర్వాస మహర్షి కొన్ని సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఉన్న సరస్సులో రెండు పూటలా స్నానం చేసి ఇక్కడ వెలసియున్న అమ్మవారికి భక్తి పూర్వకంగా ఆరాధించమని చెప్పి, పుష్కరకాలం( 12 సంవత్సరాలు) తర్వాత తన నిజరూపం తనకు వస్తుంది అని శాప విమోచనం చెప్పి అనుగ్రహించాడు.

💠 అలా ఆ ఋషి నిత్యము ఈ సరస్సులో స్నానం చేసి తన నిజరూపం పొందాడు కనుక ఈ సరస్సును వ్యాఘ్ర సరస్ ,బాగ్ సరస్ ( బాగ్ అనగా హిందీలో పులి) అనే పేరు వచ్చింది.

అదే క్రమంగా బక్సర్ అయింది. భస్తర్ అని కూడా పిలుస్తారు.

🔅 ఆలయ రహస్యం 🔅

💠 రాజరాజేశ్వరి ఆలయ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మాట్లాడతారని ప్రసిద్ధి.

అంటే ఏ మనిషికో పూని మాట్లాడటం కాదు స్వయంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100 శాతం నిజమే.

💠 స్థానికుల అభిప్రాయం ప్రకారం, ప్రతి అమావాస్య, పూర్ణిమ మరియు నవరాత్రి రోజులలో ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి.

ఈ విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఒక్కసారి కాదు.. చాలాసార్లు ఈ రహస్యం  ఛేదించేందుకు ప్రయత్నించారు. 

ఇందుకోసం శాస్త్రవేత్తలు ఆలయంలో అనేక ఆధునిక యంత్రాలను అమర్చారు.  కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

చివరికి శాస్త్రవేత్తలు కూడా ఆలయం లోపల నుండి వచ్చే రహస్య ధ్వనిని ధృవీకరించారు.

💠 400 ఏళ్లక్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. తాంత్రిక శక్తులను పొందడానికి, తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 

ఈ ఆలయంలో తరతరాలుగా తాంత్రిక భవానీ మిశ్రా వంశస్తులే  పూజారులుగా ఉన్నారు.  

ఓ నాటి అర్ధరాత్రి పూట గుడిలోకి వెళ్ళి చూడగా వారికి కూడా కొన్ని శబ్దాలు వినపడుతున్నట్టు ధ్రువీకరించారు, అమ్మవారి విగ్రహం నుండి ఏవో తెలియని శబ్దాలు(అర్ధం కానీ మాటలు)వినిపిస్తున్నాయి, కానీ వాటి భావం మాత్రం అంతుపట్టడం లేదని వారు అంటున్నారు.

 💠 తాంత్రికమైన పూజలు, శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ క్షుద్ర పూజలు జరుపుతారన్న వాదన వినిపిస్తోంది. 

ముఖ్యంగా అమావాస్య, పౌర్ణిమ తదితర రోజుల్లో ఆ పూజలు చాలా ఎక్కువగా జరుగుతాయని చెబుతారు.

💠 అందువల్లే రాత్రి సమయంలోనే కాదు పగలు కూడా ఈ దేవాలయానికి వెళ్లడానికి చాలా మంది భయపడేవారు.

అయితే పగలు మాత్రం ఇక్కడ పూజరులు పూజలు నిర్వహిస్తారు.

ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఆ ఆలయం.. రాత్రి వేళల్లో మాత్రం గుండె దడ పెంచుతుంది.

💠 ఈ ఆలయంలో దశ మహా విద్యల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి:   కాళి, త్రిపుర భైరవి, ధూమావతి, తార, చిన్నమస్తక, షోడసి, మాతంగి, కమల, ఉగ్రతార మరియు భువనేశ్వరి విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. 

ఈ దేవతలందరూ తాంత్రికుల దేవతలు. 

💠 ఇవే కాకుండా, బగ్లాముఖి మాత, దత్తాత్రేయ భైరవుడు, బతుక్ భైరవుడు, అన్నపూర్ణ భైరవుడు, కాలభైరవుడు మరియు మాతంగి భైరవ విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్టించబడ్డాయి.

💠 చాలా ఏళ్లుగా ఆ దేవతను ఆరాధిస్తున్న వారు చెప్పే వివరాల ప్రకారం క్షుద్ర పూజలు చేసేవారితో అమ్మవారు మాట్లాడుతారని చెబుతారు. అది కూడా అర్థ రాత్రి తర్వాత మాత్రమే ఈ సంభాషణ జరుగుతుందని వారు చెబుతారు.

కేవలం పూజారులే కాకుండా కొంతమంది భక్తులకు కూడా ఆ మాటలు వినిపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.వీరిలో చాలా మంది అమావాస్య వంటి సందర్భాల్లో జన్మించిన వారేనని స్థానికులు చెబుతారు.

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర 25*

 🌷 *శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర 25*🌷

                   🌷🌷🌷

*శ్రీనివాసునకూ, పెండ్లివారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట.* 

ఆకాశరాజు బంధువులతో సహితము... మంగళవాద్యాలతో సహితం శ్రీనివాసుడున్న విడిది గృహానికి వెడలినాడు.

అప్పుడు వశిష్ఠుడు ఆకాశరాజుతో "రాజా! ఇంక ముహూర్తము సమీపించనున్నది కదా, కనుక మున్ముందుగా మీరిప్పుడు, వరుని పూజచేయవలసి యున్నదనెను".  

అట్లే అని ఆకాశరాజు, ధరణీదేవి శ్రీనివాసునకు గంధము, తాంబూలము మొదలైనవి ఇచ్చి బట్టలూ, నగలూ ఇచ్చి పూలతో ప్రేమతో పూజ చేసారు.

పూజానంతరము శ్రీనివాసుని పట్టపుటేనుగుపై ఆసీనుని చేశారు. 

బ్రహ్మ, 

సరస్వతీ, 

ఈశ్వరుడు, 

పార్వతి, 

ఇంద్రుడు, 

శని

తక్కిన వారినీ, మునులను సర్వవిధ మంగళవాద్యాల మధ్య 

విడుదలు నుండి తోడుకొని వచ్చి, రాజమందిరములో ప్రవేశింపజేశారు.

రాజమందిర ద్వారము దగ్గర ముత్తైదువువులు, శ్రీనివాసునకు హారతి యిచ్చారు.

అనంతరం అలంకరించబడిన కళ్యాణమండపములోకి శ్రీనివాసుని రావించి, బంగారముతో చేయబడిన ఒక పీఠముపై కూర్చుండజేశారు. 

ఎప్పుడు ఏది చేయవలసి వున్నదో చెబుతున్నారు.  ఆయన చెప్పగా ఆకాశరాజు స్వామి పుష్కరిణీతీర్థము నుండి పవిత్రజలాన్ని తెప్పించాడు. 

భార్య ధరణీదేవి బంగారు కలశముతో ఆ జలమును పోస్తుండగా, ఆయన శ్రీనివాసుని పవిత్ర పాదకమలాలను కడిగినాడు.   కడిగి ఆ జల బిందువులను తన శిరస్సుపై జల్లుకొని ధరణీదేవి శిరముపైన జల్లినాడు. 

బృహస్పతి, వారిరువురునూ సమయోచిత శుభమంత్రాలు పఠిస్తుండగా, ఆకాశరాజు పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకొని, ధరణీదేవి స్వర్ణ పాత్రతో స్వచ్ఛ జలము పోస్తుండగా, శ్రీనివాసుని చేతిలో ధారవోసినాడు. 

వశిష్ఠుడు ఆ దంపతులకు కంకణాలు కట్టాడు.

ఏ శుభముహూర్తమునకు వివాహము జరగవలసి యున్నదో ఆ సముహూర్తము రానే వచ్చినది.

వాద్యాలు వాయించేవారు మరింతగా వాయించసాగారు.

ముత్తయిదువులు మంగళ సూత్రమును గట్టిగా అలంకరించారు. 

దేవతలు ఆనందముతో ఆ సమయములో పూలవర్షము కురిపించారు. 

తరువాత విలువయిన మంచి ముత్యాలతో తలంబ్రాలు పోసుకొన్నారు దంపతులు. 

ఈ విధముగా పద్మావతీ, శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవము జరిగినది.

ఆకాశరాజు యొక్క సంకల్పమునకు వున్న బలము కారణముగా కళ్యాణము సవ్యముగా జరిగిది. 

కళ్యాణ సందర్భములోనే ఆకాశరాజు అల్లుడైనటువంటి, శ్రీనివాసునకు కట్నాలు-కానుకలు బాగానే యిచ్చారు. 

వందబారువుల స్వర్ణకిరీటము, మణులు పొదగబడిన కంఠహారాలు,  ఒక కోటి బంగారు నిష్కములు, మకరకుండలాలు, మాణిక్యాల పతకాలు, సింహలాట సహితాలైన కంకణాలు, బంగారముతో చేయబడిన మొలత్రాడు, రవ్వల ఉంగరాలు, అపరంజి పాదుకలు, రత్నాలు తాపబడిన కంబళములు, భోజనావసరమునకు స్వర్ణపాత్రలు,   సహస్రగజాలు, దశ సహస్రగజాలు, దశ సహస్ర అశ్వాలు, దాసదాసీ జనాలు మున్నగు అనేక విధాలయిన ఆభరణాలు బహూకరించాడు. 

పద్మావతీదేవి వివాహానికై వచ్చినవారందరినీ, ఉచిత మర్యాదలచే గౌరవించడము జరిగినది.

లక్షలాది బ్రాహ్మణులకు సంతుష్టిగా సంభావనలిచ్చి, పంచభక్ష్య పరమాన్నములతో భోజనములు పెట్టి, వారిని ఆనందింపజేశారు. 

అయిదు రోజుల వివాహమున్నూ అతి వైభవముగా జరిగినది.

ధరణీదేవి ఆకాశరాజు, క్షీరధారవతో, పద్మావతిని శ్రీనివాసుని హస్తములో పెట్టి అప్పగిస్తూ, ఆకాశరాజు యీ విధముగా అన్నాడు.

"శ్రీనివాసానికి, నీవు సాక్షాత్తు భగవంతుడయిన, శ్రీమన్నారాయణుడవే,అని నేను బాగా అర్థము చేసుకొన్నాను. 

నీ పవిత్ర పాద కమలాలు జలముతో కడిగి పిల్లనివ్వడము వలన మా వంశానికి వంశమే తరించిందని నేను భావిస్తున్నాను. 

నీకు సర్వులూ బంధువులే.  పిల్లనిచ్చినవాడినగుటచే నీకు ఒక చిన్న మనవి చేసుకొనదలంచుకున్నాను. 

పద్మావతి అతి సుకుమారి.  జాగ్రత్తగా యేలుకొనుము.

ఈమెను పువ్వులలో పెట్టుకొని జాగ్రత్తగ చూచుకొనమని, తండ్రిగా కోరుచున్నాను " అనెను.  

ఆకాశరాజు కుమార్తెవైపు తిరిగి, అమ్మాయి, పద్మావతీ, చాలా అదృష్టవంతురాలవు.  సాక్షాత్తూ శ్రీమన్నారాయణమూర్తియే నీకు భర్తగా లభించినాడు. 

అతనిని నీవు బహుభక్తితో చూచుకొనుచుండుము. 

స్త్రీకి భర్తయే దైవము.  పతి సన్నిధానమే నీకు పెన్నిథి.   నీ మగని బాగా నీ బాగుగా భావించి నడచుకొనుము. 

పాలూ-నీరు మాదిరిగా ఆలూ-మగలు వుండాలి.  పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తి తీసుకురావలెను.

సీత, రుక్మిణి, అనసూయ, సుమతి వంటి వారిని ఆదర్శముగా తీసుకొనుము. 

కన్నవారమయిన మమ్ము ఎన్నటికీ మరువకుము." అని సూక్తులు చెప్పినాడు. 

పద్మావతి తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వీడి, భర్తగారింటికి వెళ్ళేముందర మనస్సులో బాధపడినది. 

చిరాకు సారి, నగా నట్ర పెట్టి పద్మావతీదేవిని, అత్తవారింటికి వెడలుటకై ప్రయాణము చేశారు. 

అత్తయ్యకు, మామయ్యకు శెలవు చెప్పి, శ్రీనివాసుడు పద్మావతీ సమేతుడై, గరుడవాహనాన్ని అధిరోహించినవారై, పయనమయ్యారు. 

మార్గమధ్యములో అగస్త్యుని ఆశ్రమము తగిలినది.

అగస్త్యుడు శ్రీనివాసుని తోడుకొని, ఆశ్రమమునకు తీసుకొని...వెడలి ఉచిత రీతిని భక్తిశ్రద్ధలతో పూజించినాడు. 

అప్పుడు శ్రీనివాసుడు, దేవతలూ మొదలైన తనతో వచ్చినవారితో,  స్నేహితులారా! మీకొక విషయము చెప్పాలని అనుకొంటున్నాను. 

అదేమంటే, వివాహమయిన భార్యాభర్తలు, వివాహానంతరము ఆరు మాసాలవరకు, పర్వతాలు ఎక్కకూడదనే, ఒక ధర్మము వున్నది కదా!  అందువలన నేనున్న్నూ, పద్మావతియూ యీ అగస్త్యుని ఆశ్రమములో ఆరు నెలలపాటు వుంటాము.  తరువాత శేషాచలానికి చేరుకొంటాము." అన్నాడు. 

వారందరూ సరే అన్నారు. 

బ్రహ్మ,  ఈశ్వరుడు, అందరున్నూ శ్రీనివాసుని వద్ద శలవు గైకొని వారివారి నెలవులకు వెడలిపోయారు. 

పద్మావతీ-శ్రీనివాసులు హాయిగా అగస్త్యుని ఆశ్రమములో నివసించసాగారు. 

రత్న కిరీట గోవిందా

రామానుజనుత గోవింద

స్వయం ప్రకాశ గోవిందా

సర్వ కారణ గోవిందా 

గోవిందా హరి గోవిందా 

వేంకట రమణా గోవిందా 

గోవిందా హరి గోవిందా 

వేంకట రమణా గోవిందా!

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

Vefanta

అడిగేదాకా చూడకండి*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*నేడు ఆగష్టు 21 జాతీయ వృద్దుల దినోత్సవం ఓ తండ్రి ఆవేదన...తన మాటల్లోనే*

👉నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. 

👉నాకు 3గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం

👉ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..

👉ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.

👉చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.

👉పోయిన పండుగకి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు 

అవి బాగా పాతబడిపోయాయి

👉పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.

కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.

*ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది*

👉చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి

నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.

👉4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు

👉బస్ దిగగానే నా "చిన్నకొడలు" నాకోసం స్కూటీ తెచ్చింది

నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' 

అని అడిగింది

👉బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది

👉పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.

👉సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.

👉దారి మధ్యలో ఇలా అంది.

'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు

👉ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'

👉పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను

👉 స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.

👉 ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.

కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు....!!

👉ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...

👉 నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'

👉'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.

అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను

👉నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...

👉'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.

👉ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!'

👉కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...

'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!

👉మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది

నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!

ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు.......!!!

*పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి

అడిగేదాకా చూడకండి*

పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!

ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు తర్వాతే ఎవరైనా🍁

💕💕💕💕💕💕💕💕💕💕💕

గరుడపంచమి

 *సత్సంగ బంధు మిత్రులు అందరికీ శ్రీ గరుడ పంచమి శుభాకాంక్షలు !* 💐

🌺🙏🌺

*సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణమ్ |*

*జితాన్తకం విషారిం చ అజితం విశ్వరూపిణమ్ || ౧*

*గరుత్మన్తం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనమ్ |*

*ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః || ౨*

🌺🙏🌺

శ్రీమన్నారాయణుని దివ్య వాహనమై సదా అలరెడి గరుడునకు శతకోటి నమస్కారములు . 🙏

ఇంతటి ఘనత ఎలా అబ్బినదయ్యా నీకు ? 🙏

శ్రీహరి పాదములను నీ చేతులతో మోసి ,  నీ మేను అతని సింహాసనముగా అమర్చి , సదా నీ రెక్కలను చాచి , ఆతడు ఎప్పుడు ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళుటకు సర్వ సన్నద్ధముగా ఉండే ఆ గరిమ నీకు ఎలా దక్కినదయ్యా ?🙏

నీ కథను విన్న తరువాత నాకు ఎన్నో జీవిత పాఠములు తెలిసాయి ! 

*1 ) భగవత్కృపపై సంపూర్ణ విశ్వాసము ఉంచవలెను !!*🌺

మీ తల్లి వినత , దేవుని వరముపై సంపూర్ణ విశ్వాసమునుంచక తొందరపడి ఒక గుడ్డును చిదిమినది . ఫలితముగా అనూరుడు జన్మీంచినాడు అర్థ దేహియై .  ( భగవంతుని ప్రసాదమే కావున ఆతడు సూర్యుని రథ సారధి అయినాడు .  అది ప్రక్కన పెడితే ,  వినత కు శోకమే మిగిలనది అపనమ్మకము వల్లన )   🙏

*2 ) లక్ష్య సాధనయే ముఖ్యము ! పట్టములు కాదు 🌺*

కద్రువ దాస్యము నుండీ తల్లియైన వినతను విడిపించుటకు ఇంద్రలోకమునకు ఏగితివి ఇంద్రునితో తలపడి అమృతమును తెచ్చుటకు . 

అమృతమును సాధించిననూ నీ మతి చాంచల్యమునకు గురికాలేదు .  అమృతమును సేవించి ఇట్టే దివ్యత్వమును పొందవచ్చు , కానీ నువ్వు అలా చేయలేదు . నీలక్ష్యము తల్లిని దాస్యవిముక్తురాలిని చేయుటయే .  అందుకే మరలా ఇంద్రునికి అమృతమును సేవించకూండా అప్పగించేసావు !! 🙏

ఇది కదా మేము కూడా నేర్చుకోవాలి ఇక్కడ ! 🙏

*3 )  మన బలిమి భగవంతుడు , మన నిష్కామ భక్తినే అతడు కోరుకొనును .*🌺

అత్యంత శక్తిమంతుడవు నీవు ! నీవు తలుచుకున్నచో ఎవ్వరినైన ఓడించ గలవు .  కానీ నీవు చేపట్టినదేమిటి ?  *శ్రీహరి దివ్య చరణపంకజములు .*  🙏

దాసులకు నీవే మార్గదర్శకుడవు !

స్వామి ఏగే అన్ని మార్గములకూ నీవే వాహనమై వెలుగొందు చున్నావు ! 🙏

ఇక్కడ *శ్రీ వేంకటాద్రి పై స్వామికి స్థిరమైన పల్లకి వైనావు* 🙏

అట్టి గరుత్మంతుడా ఇదిగో నయ్యా నీ పంచమి నాడు ,

నిను స్మరించుకొనుచూ నేను వ్రాసుకున్న నీ స్తుతి గీతము !! 🙏

🌺🍃 ----------------🍃 🌺

*అన్నమయ్యవాణి_నా_సంకీర్తనాబాణి -- 202*  

(  ద్విపద ) 

*కీర్తన :-  // గరుడపంచమి నేడు కడుపుణ్య దినము //*

🌺🍃 ----------------🍃 🌺

🌹🌹

*గరుడపంచమి నేడు కడుపుణ్య దినము*

*గరుడునకమృతము కైవసంబాయె*

*卐 --🌹-- 卐  // గరుడపంచమి నేడు .. //*

*ఘనముగ పోరాడి గరిమను తెలిపి,*

*ఇనసారధి సనాభి యింద్రుని గెలిచె !*

*వినయశీలునిగ తా విహితము జూప ,*

*వినతకు దాస్యము వీడిన దినము !!*

*卐 --🌹-- 卐  // గరుడపంచమి నేడు .. //*

*సుధనిలకున్దెచ్చి చూడని వాడు ,*

*మధుసూదనుని ప్రేమ మరగిన వాడు*

*మధుర గుణంబుల మహిమా న్వితుండు !*

*అధిజిహ్వములకెల్ల నభిఘాతకుండు*

*卐 ---- 卐  // గరుడపంచమి నేడు .. //*

*హరికి నీతడె యాయె నమరవాహనము ,*

*సురలకీ భాగ్యంబు సుంతైన లేదు*

*గరుడవాహనమదె కడు ప్రీతి హరికి*

*అరయ వేంకటపతి కందలంబిదియె*

*卐 --🌹-- 卐  // గరుడపంచమి నేడు .. //*

 ✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది  ( స్వీయ రచన )*

*నేడు ఆగష్టు 21 జాతీయ వృద్దుల దినోత్సవం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*నేడు ఆగష్టు 21 జాతీయ వృద్దుల దినోత్సవం ఓ తండ్రి ఆవేదన...తన మాటల్లోనే*

👉నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. 

👉నాకు 3గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం

👉ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..

👉ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.

👉చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.

👉పోయిన పండుగకి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు 

అవి బాగా పాతబడిపోయాయి

👉పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.

కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.

*ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది*

👉చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి

నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.

👉4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు

👉బస్ దిగగానే నా "చిన్నకొడలు" నాకోసం స్కూటీ తెచ్చింది

నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' 

అని అడిగింది

👉బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది

👉పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.

👉సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.

👉దారి మధ్యలో ఇలా అంది.

'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు

👉ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'

👉పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను

👉 స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.

👉 ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.

కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు....!!

👉ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...

👉 నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'

👉'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.

అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను

👉నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...

👉'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.

👉ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!'

👉కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...

'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!

👉మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది

నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!

ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు.......!!!

*పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి

అడిగేదాకా చూడకండి*

పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!

ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు తర్వాతే ఎవరైనా🍁

💕💕💕💕💕💕💕💕💕💕💕

కవచాన్ని దానమిచ్చే

 *卐ॐ _-|¦¦¦|సుభాషితమ్|¦¦¦|-_ ॐ卐* 

శ్లో𝕝𝕝 కర్ణస్త్వచం శిబిర్మాంసం

జీవం జీమూతవాహనః।

దదౌ దధీచిరస్థీని

నాస్త్యదేయం మహాత్మనామ్॥

తా𝕝𝕝 (కవచాన్ని దానమిచ్చే సందర్భంలో) కర్ణుడు తన చర్మాన్ని ఒలిచి ఇచ్చేసాడు.... శిబిచక్రవర్తి (ఒక పావురాన్ని రక్షించేందుకు) తన దేహాన్ని కోసి మాంసం ఇచ్చాడు.... జీమూతవాహనుడు (సర్పాలను కాపాడుటకు) గరుత్మండికి తన దేహాన్నే ఆహారంగా సమర్పించుకున్నాడు.... (శత్రుసంహారం ద్వారా లోకకళ్యాణం ఆశించి) దధీచి తన వెన్నెముకని దానం చేసాడు.... 

ఇలా మహాత్ములచే సమర్పించబడనిది ఏది లేదు?! 

🧘‍♂️🙏🪷

కవచదానమునందు కర్ణుండు తనమేను

     ఛేదించి యిచ్చెను చింతలేక

రాజేంద్రు డా శిబి రక్షింపగువ్వను

     మేనుమాంసము కోసి దాననిచ్చె

పాములన్ రక్షించ జీమూత వాహనుం

      డాత్మదేహమ్మునే యాహుతిచ్చె

జగతిరక్షణకోరి శాత్రవులను చంప 

     వెన్నెముక దధీచి వేడ్కనిచ్చె

లోకకల్యాణమును కోరి తేకువగను

త్యాగపురుషులు ప్రాణమ్ము లీగిగాను

నొసగి జగమందుపొందిరి యశము కీర్తి 

యిల మహాత్ము లీయనిదది యేమిలేదు.

గోపాలుని మధుసూదన రావు

శంఖుడనే మహర్షి

 నిత్యాన్వేషణ:

శంఖుడనే మహర్షి అన్న తోటలో మామిడిపండు అడగకుండా తీసుకున్న పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి రాజుగారి దగ్గరకు వెళ్ళి దండన స్వీకరించాడనీ, రాజు విధిలేక చేతులు నరికివేసే దండన ఇచ్చాడనీ పురాణాల్లో ఉంది. ఒక్క పండు అడకుండా కోసుకుంటే ఇంతటి శిక్షా? అన్యాయం కాదా?

అంతరంగమందు అపరాధములు చేసి

మంచివాని వలెనె మనుజుడుండు

ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా ( విశ్వ..)

అనేది నేటి నీతి.. మనం చేసిన తప్పు మనకు బాగా తెలుసు. ఐనా , నేనేమీ చేయలేదు....అని బుకాయిస్తాం. అదేమీ పెద్ద తప్పు కాదులే అని మనకు మనమే సమర్థించు కొంటాం.

శంఖుడు , లిఖితుడు అని ఇద్దరు ముని కుమారులు. చెరొక ఆశ్రమంలో నివాసం..

ఒకనాడు లిఖితుడు అన్నను చూడ వచ్చాడు. సమయానికి ఆయన ఇంట్లో లేడు. ఆయన తోటలో మామిడి పండ్లు ఉన్నాయి. నాలుగైదు కోసుకొని తినివేశాడు

అన్నయ్య వచ్చాడు. ఈ టెంకలేమిటి ?.అన్నాడు. ఆకలిగా ఉంటే మీ చెట్టువే కోసి తినివేశాను. అని సమాధానం.

అన్నకు ధర్మాగ్రహం కలిగింది. పో .త్వరగా పో. రాజు తో చెప్పి తగిన దండన విధించుకోని , శుద్దుడవై త్వరగా రా ! అని పంపించి వేశాడు..

తమ్ముడూ రాజు దగ్గరకు చేరాడు. విప్రోత్తముడు వచ్చాడని ఆనందపడి పోయాడు. ఏమిచ్చి సేవ చేసుకోమంటారు?. అని వినయం చూపాడు రాజు. .. నేను చెప్పినట్టు చేయాలి. మాట ఇచ్చారు గదా! అన్నాడు లిఖితుడు.

జరిగిన సంగతి చెప్పి మా అన్న మీ శిక్షతో పావనుణ్ణయి రమ్మని ఆదేశించాడు. నాకు శిక్ష వేయడం మీ విధి. ..అన్నాడు.

రాజు తల్లడిల్లి పోయాడు. వేదవేత్తలు..మీకు నేను శిక్ష విధించడమేమిటి?. నన్ను క్షమించండి అన్నాడు రాజు.

మాట ప్రకారం శిక్ష వేయవలసిందే . నా పాపం ఇక్కడే పరిహారం అయి పోతుంది. అని బలవంతపెట్టాడు లిఖితుడు.

అందరికీ ఒకే శిక్ష. విజ్ఞుడికి అధిక శిక్ష. వెంటనే అమలు గొప్ప వరం. అంతటితో ఆ పీడ విరగడై ఇంక మనసును దహించదు. సత్కర్మల అనుభవానికి ఆ పాపం అడ్డు పడదు.

రాజు రెండు చేతులు ఖండించమని ఆదేశించాడు.

తెగిపోయిన చేతులతో ఆనందంగా అన్న దగ్గరకు పోయాడు.

. పోయి నదిలో పితృ తర్పణం చేసిరా.. వేళ అయింది..అన్నాడు శంఖుడు.

దగ్గర ఉన్న నదిలో స్నానం చేసి ,సభక్తికంగా అర్ఘ్యం ఇవ్వబోయాడు. చేతులు యథాప్రకారం సహకరించాయి.

పోయిన బాహువులు ఇచ్చి ఆ నదీ మతల్లి *బాహుద* అయింది.

పరుల సొత్తు( తనకు ) పాము వంటిది.. అనీ , పరద్రవ్యాణి లోష్ఠవత్ అనీ మన విశ్వాసం..( రాయితో సమానం. )

మనది కానిదాని పైన ఆశ కలగడం పతన హేతువు.

మనసెపుడూ నిర్మలంగా ఉండాలి.

శంఖుడు పరద్రవ్యం అనుమతి పొందకుండా తీసుకొన్న దోషం పొందిన తమ్ముడి పైన ఆగ్రహించాడు.

అతణ్ణి శుద్ధుణ్ణి చేయడానికీ రాజదండన అనుభవించి రమ్మన్నాడు. లిఖితుడూ విజ్ఞుడే కాబట్టి, శిక్ష అనుభవించడం పాప విమోచన మార్గం అని సంతోషించాడు.

రాజుకూ తగిన దండన వేసి, సుకృతం కలిగింది.

ఈ కథ భీష్ముడు అంపశయ్య మీద ధర్మరాజాదులకు చెప్పినది.

రాజు పదవి చాల యోగ్యమైనదనీ దాన్ని చక్కగా నిర్వర్తించి పుణ్యం సంపాదించుకో అని , ఏదో తప్పు చేశానని అనవసరమైన చింతతో కుమిలి పోవద్దు అని ధైర్యం చెబుతూ, తాను గతంలో విన్న పుణ్య కథగా దీన్ని చెప్పాడు.

ఇది శాంతి పర్వం లో ఉన్న కథ..

ఇహమూ, పరమూ రెండూ ఉన్నాయి.

ఇక్కడ ధర్మం తప్పని వాడికీ మాత్రమే పుణ్య గతులు ..

చక్కగా రాజధర్మం చేయడం విష్ణుపద ప్రాప్తి మార్గం అని ఈ కథ నీతి.

పుణ్య నదీ స్నానాలు పాప మోచకాలు.. వాటిని అర్చించడం మన ధర్మం. వాటి మహిమ. అనిర్వాచ్యం.. ఎందరో పుణ్యాత్ముల తపస్సులతో అవి పావనమైనవి అని చెప్పే కథలెన్నో భారతాదులలో ఉన్నాయి..

ఉదాత్తుణ్ణి చిన్న తప్పైనా దహిస్తుంది.. దానికి ప్రాయశ్చిత్తం చేసుకొన్నపుడు అపరిమిత ఆనందం కలుగుతుంది. అది భౌతిక లౌకిక వస్తువుల చేత లభ్యమయ్యేది కాదు.

ప్రవరుడంటాడు వరూధిని తో. అది కామ విషయ సందర్భమైనా అన్ని జ్ఞానేంద్రియాలకూ అనువర్తించేదే

బ్రాహ్మణుడింద్రియ వశగతి

జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా

జిహ్మగముల పాలై చెడు

బ్రహ్మానందాధిరాజ్య పదవీ చ్యుతుడై.

ఏ ఇంద్రియాలకూ (ఇక్కడ లిఖితుడు జిహ్వకు వశుడైనాడు) లొంగి పోక వాటిని తన వశంలో ఉంచుకొన్న వాడు తన నిత్య బ్రహ్మానందం నుండి పతనం కాడు..

జిహ్మా ఆచరణ ఏక నిపుణుడు = వక్ర మార్గం లోకి తిప్పడంలో తనకు తానే సాటి ఐన వాడు చిత్తజుడు ..మన్నథుడు.

అతడి బాణాలో.. అజిహ్మగములూ ..సూటిగా తాకుతాయి. అవి పడనిస్తే వాడు చెడుతాడు..

మహాత్ములచే సమర్పించబడనిది

 *卐ॐ _-|¦¦¦|సుభాషితమ్|¦¦¦|-_ ॐ卐* 

శ్లో𝕝𝕝 కర్ణస్త్వచం శిబిర్మాంసం

జీవం జీమూతవాహనః।

దదౌ దధీచిరస్థీని

నాస్త్యదేయం మహాత్మనామ్॥

తా𝕝𝕝 (కవచాన్ని దానమిచ్చే సందర్భంలో) కర్ణుడు తన చర్మాన్ని ఒలిచి ఇచ్చేసాడు.... శిబిచక్రవర్తి (ఒక పావురాన్ని రక్షించేందుకు) తన దేహాన్ని కోసి మాంసం ఇచ్చాడు.... జీమూతవాహనుడు (సర్పాలను కాపాడుటకు) గరుత్మండికి తన దేహాన్నే ఆహారంగా సమర్పించుకున్నాడు.... (శత్రుసంహారం ద్వారా లోకకళ్యాణం ఆశించి) దధీచి తన వెన్నెముకని దానం చేసాడు.... 

ఇలా మహాత్ములచే సమర్పించబడనిది ఏది లేదు?! 

🧘‍♂️🙏🪷

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -26 & 27🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -26 & 27🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కొన్ని రోజుల తరువాత నారాయణపురం నుండి ఒక సేవకుడు పద్మావతీ శ్రీనివాసుల వద్దకు వెళ్ళి ‘‘ఆర్యా! ప్రభువులైన మా ఆకాశరాజుగార్కి ఆకస్మాత్తుగా జబ్బుచేసినది. వారు ప్రమాద పరిస్థితిలో వున్నారు. మహారాజుగారు మీ యిద్దరినీ చూడాలని వుందనికలవరిస్తున్నారు’’ అన్నాడు. 

పద్మావతీ, శ్రీనివాసులు చాలా అందోళన పడ్డారు. ఆగస్త్యమహామునిని వెంటబెట్టుకొని వారిరువురూ విచారముతో నారాయణపురానికి వెళ్ళారు.

నారాయణపురము పద్మావతి, శ్రీనివాసులు చేరేటప్పటికి ఆకాశరాజు స్పృహకోల్పోయి వున్నాడు. శ్రీనివాసుడు మామగారిని సంబోధించి మాట్లాడడంతో ఆకాశరాజు తేరుకొని కళ్ళువిప్పి చూసాడు. చూస్తే ఎదురుగా పద్మావతి , శ్రీనివాసులు కనిపించారు. అందోళన నిండిన ముఖముతో ధరణీదేవి కూడా కనిపించింది.

అంతమ ఘడియాలలో నున్నప్పటికీ ఆకాశరాజు లేని ఓపిక తెచ్చుకొన్నాడు. శ్రీనివాసునితో ఆకాశరాజు సర్వసృష్టినీ స్పష్టించిన స్పష్టికర్తనే స్పష్టించిన ఓ ఆదిపురుషా!జగన్నాథా! గోవిందా! నారాయణా! అంతిమ కాలములో నిన్ను నేను దర్శించడము జరిగినది. 

ఇంతకన్న నాకు కావలసినది మరియొకటి యేముంటుంది? సర్వేశ్వరా నాకు కోరికలేమీ లేవు. ఒక్క విషయములో మాత్రమే నిన్ను ప్రార్థిస్తున్నాను. 

నా కుమారుడైన వసుదాముడూ, నా సోదరుడైన తొండమానుడూ అభమూ, శుభమూ తెలియనివారు. 

వారి విషయమై మాత్రమే నాకు బెంగ, నీవు వారిద్దరినీ జాగ్రత్తగా చూచుకొనుమని కోరుచున్నాను’’ అని పలికి కుమార్తె అయిన పద్మావతిని ‘‘అమ్మా! ఇలారా నా జన్మ తరించిపోయినది నీవంటి కుమార్తెను పొందగలిగినందులకు నేనే అనేక విధాలుగా గర్విస్తున్నాను. ఇంక మనకు ఋణము తీరిపోయిందమ్మా! సుఖముగా శాంతిగా వుండమ్మా అని అంటూ, ప్రాణాలు విడిచి కీర్తిశేషుడయ్యాడు.

 పద్మావతీ, ధరణీదేవి ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఆకాశరాజునకు దహన సంస్కారము చేశారు. ధరణీదేవి స్వర్గానికి వెళుతూన్న భర్తను అనుసరించడానికి నిశ్చయించుకొని సహగమనము చేసినది. తరువాత పద్మావతీ శ్రీనివాసులు ఆగస్త్యనితో ఆయన ఆశ్రమయునకు వెళ్ళిపోయారు.

*తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము:*

తొల్లి వైఖానసుడు అనే ఒక భక్తుడుండేవాడు. అతడు శ్రీకృష్ణభగవానుని స్వయముగా చూడాలనే కోరికతో వుండేవాడు. 

నిద్రాహారములు లేక, అచంచలదీక్షతో కృష్ణభగవానుని గూర్చి ఎన్నోయేండ్లూ, పూండ్లూ తపస్సు చేశాడు. శ్రీమహావిష్ణువు ఆతనికి దర్శనభాగ్యము కలుగజేశాడు. ప్రత్యక్షమై భక్తశ్రేష్ఠా! నీకు వలయునదేమిటో కోరుకొను మిచ్చెదను’’ అన్నాడు. 

కన్నులు తెరచి వైఖానసుడు శ్రీమన్నారాయణుని దివ్యదర్శనముచేసి స్వామి పాదములకు సాష్టాంగ దండప్రణామము లాచరించి ’’స్వామీ! కరుణాసాగరా! నాకు యితరమైన కోరికలేమీ కాని, శ్రీకృష్ణావతారము నేత్రానందముగా చూచి తరించాలని వున్నది’’ అనెను.

 అందులకు శ్రీమహావిష్ణువు ‘‘నాయనా వైఖానసా నీవు యిప్పుడు శ్రీకృష్ణదర్శనము చేయాలని కోరుకుంటే వీలుపడదు. కాని, యిప్పుడు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాసరూపములో ఒక పుట్టలో నున్నాడు. నీవు అతనిని పూజించవలసినది’’ అన్నాడు.

 తరువాత శ్రీమహావిష్ణువు అంతర్థానమయ్యాడు. వైఖానుసుడు అక్కడ నుండి శేషాచలానికి బయలుదేరాడు. మార్గములో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కలసినాడు. వైఖానసుడు తాను శేషాచలము మీదనున్న శ్రీనివాసుని సేవించ వెడుతున్నాననీ చెప్పగా, రంగదాసు తానున్నూ శ్రీనివాసుని సేవించ వెడుతున్నానని చెప్పెను, 

వారిరువురు కలసి శేషాచలాన్ని అధిరోహించారు. వైఖానుసుడు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి అందున్న భగవానునీ పూజించాలనుకొన్నాడు. పూవులు కావలసివచ్చాయి. అప్పుడు వైఖానసుడు రంగదాసునితో ‘‘శ్రీనివాసుని పూజించడానికి పూవులు కావాలి కదా! అందుచే నీవు ఒక పూలతోటను పెంచవలసినది’’ అని కోరాడు.

 రంగదాసు అలాగేనని పూలతోటకు నీరు చాలా ముఖ్యము కనుక, నీటికై ఒక బావిని త్రవ్వించాడు. దాని పేరు పూలబావిగ అయింది, ఆ బావిలోని నీటితో మొక్కలను పెంచి, ఆ మొక్కలను పూలను ప్రతిపాదిమూ శ్రీనివాసుని పూజకొరకై వైఖానసునకు యిచ్చుచుండెను. 

ఒకనాడు ఒకానొక గంధర్వరాజు స్వామి పుష్కరిణిలో జలక్రీడ లాడడానికై తనసతులతో సహితము వచ్చినాడు. అక్కడికి పూవలకొరకై వచ్చిన రంగదాసు ఆ జలక్రీడలను చూచి చిత్తచాంచల్యము పొందినవాడై స్వామి పూజా సమయము కూడా మరచిపోయాడు.

 గంధర్వులు వెళ్ళిన తరువాత, రంగదాసు తన పని గ్రహించినవాడై పూవులు తీసుకొని వైఖాసమునివద్దకు వచ్చాడు.

 వైఖానసముని ‘‘ఏమిటి యింత ఆలస్యమయిన’’దని గద్దించి అడిగాడు. ఉన్నదున్నట్లు చెప్పాడు రంగదాసు పూజకు తాను చేసిన ఆలస్యానికి బాధపడుతూ క్షమించమని వేడుతూ రంగదాసు శ్రీనివాసుని అనేక విధాల ప్రార్థించాడు. ప్రార్థించగా శ్రీనివాసుడు ప్రత్యక్షమయి ‘‘ఓయీ రంగదాసా! చేసిన దానికి విచారింపకుము. నీవు నాయొక్క మాయా మోహము వల్లనే గంధర్వుల జలక్రీడల్ని చూసి భ్రాంతిలో పడినావు. యీ శరీరము విడిచి నారాయణపురము రాజైన సుధర్ముడికి కుమారుడ నయ్యెదవు గాక తొండమానుడు అను నామధేయముతో రాజ్యసుఖములన్నీ అనుభవింతువు గాక’ అని చెప్పాడు.

ఆ రంగదాసే ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడుగా పుట్టాడు.

నిత్య శుభ ప్రద గోవిందా, నిత్య కళ్యాణ గోవిందా, ఆనంద రూప గోవిందా, ఆద్యంత రహిత గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||26||

శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం..

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆకాశరాజు మరణంతో తొండమానునకూ, వసుధాముడికీ రాజ్యము గూర్చి కలహము ఏర్పడింది. అన్న అయిన ఆకాశరాజు చనిపోయినాడు కనుక రాజ్యానికి పాలకుడుగా నేనే అవుతాననీ తొండమానుడూ, తండ్రి అయిన ఆకాశరాజు చనిపోయిన కారణముగా కుమారుడనైన నేనే రాజ్యపాలకుడవవలసి వున్న’’దనీ వసుధాముడూ వాదించుకోసాగారు. చివరకు యుద్ధానికి తయారయ్యారు. 

ముందుగా వారిద్దరూ అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళి తమవైపు సహయము చేయవలసిదిగా శ్రీనివాసుని అభ్యర్ధించారు. ఆయనకు యిద్దరూ దగ్గర బంధువులే కదా! ఆలోచించాడు శ్రీనివాసుడు. తొండమానునకు తన శంఖ చక్రాలను సహాయముగా యిచ్చాడు. తాను మాత్రము బావమరిదియైున వసుధాముని వైపున సమరం చేయడానికి నిశ్చయించుకొన్నాడు. యుద్ధరంగము సిద్ధమయినది పోరు జోరుగా సాగింది. ఇరువైపుల సైన్యములోని వారూ చాలామంది మరణించినారు. కొన్ని వందలమంది క్షతగాత్రులయ్యారు. ఆ సమయములో తొండమానూడూ, శ్రీనివాసుడూ ఘోర యుద్ధముచేయసాగారు. తొండమానుడు ఒక తీవ్రబాణము శ్రీనివాసుని హృదయంపై వేసినాడు, దానితో శ్రీనివాసుడు మూర్చపోయినాడు. ఈ వార్త పద్మావతికి తెలిసి రోదిస్తూ యుద్ధ రంగానికి వచ్చి మూర్చలోనున్న తన భర్తకు ఉపచారాలు చేసినది. శ్రీనివాసుడు మూర్చ నుండి తేరుకొన్నాడు. అప్పుడు పద్మావతి ‘‘ప్రాణప్రియా! ఈ యుద్ధములో ఒకరు చేస్తే పినతండ్రి, మరొకరు చేస్తే తమ్ముడు. వారిలో ఎవరు ఓడిపోయినా నేను చూడలేను స్వామీ! దయచేసి మీ చాకచక్యమును ఉపయోగించి వారిద్దరకూ రాజీ చేయండి’’ అని వేడుకొన్నది. 

అప్పుడు శ్రీనివాసుడు తొండమానునీ,వసుధామునీపిలిచి యుద్దము కన్నా రాజీ పడడమే ఉభయతారకముగా వుంటుందనీ బోధించాడు. వారిరువురకూ శ్రీనివాసునుడనిన చాలా గౌరవము కనుక ఒప్పుకున్నారు. శ్రీనివాసుడు రాజ్యాన్ని వారిద్దరకూ చెరిసగముగా చేసి పంచి యిచ్చాడు. వారు ఒప్పుకున్నారు. ఆడబిడ్డకు ఆధారముగా వారిరువురూ తమ రాజ్యములలో ముప్పయిరెండు గ్రామములు భరణముగా యిచ్చివేశారు. పిదప శ్రీనివాసుడు, పద్మావతి ఆగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు.

శ్రీనివాసుడు తొండమానునకూ, వసుధామునకూ రాజీ కుదిర్చిన వెనుక, వారు చక్కగా రాజ్యపాలనము చేసుకొనుచుండిరి. అక్కడ ఆగస్త్యమహాముని ఆశ్రమములో శ్రీనివాసుడూ, పద్మావతీ హాయిగా కాలక్షేపము చేయుచుండిరి. 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

    *ఓం నమో వెంకటేశాయ*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 18*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 18*

 *సాధన లక్ష్యం....*

బాహ్యంగా నరేంద్రుడు వేడుకలు, వినోదాలు, సంగీత వ్యాయామాదులలో కాలం గడుపుతున్నప్పటికీ, అంతరికంగా అతడి మనస్సు ఇలా ధ్యానం ద్వారా సత్యాన్ని అన్వేషించసాగింది. 'ఈ లోకాన్ని సృజించి, పరి 

రక్షించే పనులు నిర్వహించే ఒక శక్తి ఉండివుంటే, ఎందరో మహాత్ములు దర్శించి, పూజించి, స్తుతించడం నిజమే అయితే, సత్యాన్ని, ఆ శక్తిని తాను కూడా దర్శించుకోవాలి' అనే తలంపు అతడిలో తీవ్రతరం మయింది. 

ముఖాముఖి దర్శనం కన్నా మరెలాంటి ఋజువూ అతణ్ణి తృప్తిపరచేదిగా లేదు. అలా అయితే ఆ సత్యాన్ని దర్శించాలి. 

అందుకు మొదట అవసరమైనది తగిన అర్హత.

ఆ అర్హతలు.. 

"తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం (కర్మ ఫలాలను ఈశ్వరునికి అర్పించడం) - ఈ మూడు క్రియాయోగం" అంటున్నది పతంజలి యోగ సూత్రం. ' దీన్లో తపస్సే అన్నింటికీ ఆధారం. తపస్సు అంటే దగ్ధం అని అర్థం.

దేనిని దగ్ధం చేయాలి? మన లౌకిక వాంఛలను, ఇంద్రియాల ఉద్వేగాన్ని, దుర్గుణాలను దగ్ధం చేయడమే తపస్సు. 

దీనికి పునాదియైనది బ్రహ్మచర్యం. కామశక్తిని అధోముఖంగా పోనివ్వకుండా అడ్డుకోవడమే బ్రహ్మచర్యపు ముఖ్య కర్తవ్యం. కామమార్గంలో పోకుండా ఉండడమే గొప్ప తపస్సుగా పరిగణింపబడుతున్నది.

స్వాధ్యాయం లేక ఆత్మవిచారణ మూలంగా ఈ కామశక్తి ఉదాత్త లక్ష్యాన్ని చేరుకొంటుంది. తపస్సు మూలంగా పవిత్రమైన, స్వాధ్యాయం మూలంగా ఉదా లక్ష్యాన్ని చేరుకొన్న కామశక్తి సత్యస్వరూపుడైన భగవంతుని అభి ముఖంగా నిర్దేశింపబడినప్పుడు, అది సత్యాన్ని పొందే పథంలోకి సాధకుణ్ణి చేరుస్తుంది. నరేంద్రునికి ఈ మూడు స్వతఃసిద్ధంగానే కరతలామలకమని చూస్తున్నాం.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 3*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 3*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

      *అవిద్యానామ్ అంతః తిమిర మిహిర ద్వీపనగరీ*

       *జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతిఝరీ |*

       *దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ*

       *నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి||*

అమ్మా  నీ పాదధూళి రేణువు నీవు ఈ విధంగా అవుతున్నావు.

భవతి = ఎలాగ ?

అవిద్యానాం తిమిర అంతః = అవిద్య,అజ్ఞానము అనే చీకటిని అంతం చేసే 

మిహిర ద్వీపనగరీ = మిహిరుడంటే సూర్యుడు అనేకమంది సూర్యులను ఉదయింపజేసే ద్వీపనగరివి. అంటే సర్వ జ్యోతిర్మండలములకు ఆధారమైన పరంజ్యోతివి.*ఉద్యద్భాను సహస్రాభా* అని అమ్మవారి నామం.

జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతిఝరీ = స్పందన లేని జడులకు కూడా చైతన్యమును ఇస్తావు. ఎటువంటి చైతన్యం? పూలగుత్తి (స్తబకం) నుండి వెలువడే మకరంద ప్రవాహము (శ్రుతి) యొక్క వేగము (ఝరి) వంటి చైతన్యము. అమ్మవారి నామాల్లో *సుధా శ్రుతిః* ఒకటి.

దరిద్రాణాం చింతామణి గుణనికా = చింతామణి హారము వంటిది.అన్ని దారిద్ర్యములను పోగొట్టేది. చింతలను పోగొట్టేది చింతామణి.

జన్మజలధౌ నిమగ్నానాం = సంసార సాగరంలో మునిగినవాడిని 

దంష్ట్రా మురరిపు వరాహస్య = భూమిని జలధి నుండి ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి కోరల వంటిది.

ఇది అమ్మవారి వారాహీ శక్తిని గురించిన స్తుతిగా ఉపాసకులు భావిస్తారు. అమ్మవారి నామాల్లో *సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా* అని ఒకటి. జనన మరణ రూప ప్రవాహమే సంసారము. దాని నుండి ఉద్ధరింపబడటమే మోక్షము.

ఈ శ్లోకంలో అవిద్య, జడత్వము తొలగింపబడుట, ధర్మ పురుషార్ధమును, చింతామణి హారము దారిద్ర్యమును తొలగించుట,  అర్ధ కామములను సంసార సాగరం నుండి ఉద్ధరింపబడటం, మోక్షమును సూచిస్తున్నాయని, ఈ విధంగా అమ్మవారి పాదధూళి రేణువు చతుర్విధ పురుషార్ధములను అనుగ్రహిస్తున్నదని పండిత ఉవాచ. అర్ధ కామములు ఒకే వర్గముగా పరిగణింపబడి ధర్మమూ మోక్షముతో కలిసి త్రివర్గముగా త్రిపురా విద్యగా వారిచే చెప్పబడుతున్నది.

.           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 17*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 17*

*ప్రగాఢ ధ్యానాభ్యాసం*

భగవంతుడంటూ ఒకరు ఉండివుంటే  నిశ్చయంగా ఆయన నిజమైన ప్రార్థనలను ఆలకించి భక్తునికి దర్శనమిస్తాడు; ఆయన సాక్షాత్కారం పొందడానికి ఏదో ఒక మార్గం ఉండితీరాలి; అలా లేకపోతే జీవితమే నిరర్థకమని నరేంద్రుని గట్టి నమ్మకం. కాని అలాంటి భగవన్మార్గాన్ని బోధించడంలో బ్రహ్మసమాజం అనుకూలమైనది. కాదని కొద్ది రోజుల్లోనే నరేంద్రుడు గ్రహించకపోలేదు. 

సత్యాన్ని తెలుసుకోవాలి; భగవత్సాక్షాత్కారం పొందాలనే తపనతో ఒక క్రొత్త పద్ధతిలో ధ్యానాభ్యాసం ప్రారంభించాడు. భగవంతుణ్ణి సాకారునిగా తలచినా, నిరాకారునిగా ఎంచినా మానవ రూపాన్నీ, గుణాలనూ స్వీకరించకుండా మనం ఆయనను ధ్యానించలేం. దీనిని గ్రహించడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మ సమాజ పద్ధతి మేరకు భగవంతుణ్ణి నిరాకార సగుణ బ్రహ్మంగా ధ్యానించేవాడు. ఇదీ ఒక రకమైన కల్పనగా నిర్ధారణ చేసిన నరేంద్రుడు ఆ ధ్యాన పద్ధతిని విడిచిపెట్టి, "భగవంతుడా! నీ నిజస్వరూప దర్శనానికి నన్ను అర్హుణ్ణి చేయి" అంటూ ప్రార్థించాడు. 

ఆ తరువాత మనస్సును ఆలోచనారహితం చేసి, గాలిలేని చోట వెలిగే దీపశిఖలా మనస్సును నిశ్చలంగా ఉంచడానికి అభ్యాసం చేయసాగాడు. ఈ రీతిలో కొంతకాలం అభ్యసించిన తరువాత అతడి మనస్సు పూర్తిగా శాంతించింది. కొన్ని సమయాలలో దేహభావన, కాల భావన కూడా అతడికి మృగ్యమవడం కద్దు. ఇంట్లో అందరూ నిద్రించడానికి పోగానే, అతడు తన గదిలో ఈ తీరులో ధ్యానించేవాడు. అనేక రాత్రుళ్లు ధ్యానంలోనే గడచిపోయేవి.

ఆ కారణంగా ఒక రోజు నరేంద్రునికి అసాధారణమైన అనుభవం ఒకటి కలిగింది. ఆతడు ఇలా అన్నాడు: "ఏ ఆధారమూ లేకుండా మనస్సును ఏకాగ్రం చేసి స్థిరంగా నిలిపితే, మనస్సులో ఒక రకమైన ప్రశాంతతతో కూడుకొన్న పరమానందం జనిస్తుంది. ధ్యానానంతరం కూడా చాలాసేపు ఆ పరమానందపు మత్తు కొనసాగుతుంది. కనుక ఆసనాన్ని విడిచిపెట్టి వెంటనే లేవడానికి మనస్కరించదు.” అలాంటి ధ్యానానందాన్ని చవిచూడసాగాడు నరేంద్రుడు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

చమత్కార శ్లోకం

 *ఒక చమత్కార శ్లోకం చూడండి ...*

 అంబలి ద్వేషిణం వందే

 చింతకాయ శుభ ప్రదమ్

 కూరగాయ కృత త్రాసం

 పాలనేతి గవాం ప్రియమ్

తెలుగూ, సంస్కృతమూ కలగూరగంపలా కలగలిసి పోయిన ఈ శ్లోకం చూసారా? 

కవిగారి అభావ చేష్ఠ అని పోనీ లెమ్మని సరి పెట్టుకుందామంటే అర్ధం కూడా అదోలా లేదూ?

అంబలిని ద్వేషించే వాడికి వందనమట. 

చింతకాయ చాలా శుభ దాయకమట.

కూరగాయ భయోత్పాతకమట. 

ఆవు పాల నేయి ప్రియమైనదట. 

ఏమిటీ కారు కూతలూ అనుకుంటున్నారా?

అం, బలి = బలిని అణచి వేసిన వాడు

చింతక, ఆయ = నామ స్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటి వాడు

కు, ఉరగాయ = దుష్ట సర్పమును (కాళీయుని) అణచి వేసిన వాడు

పాలన, ఇతి = గోవులను కాచునట్టి వాడు (అయినట్టి) ( శ్రీ కృష్ణునికి )

వందే = నమస్కరించుచున్నాను.

ఇది శ్రీ కృష్ణ నామ స్మరణ చేసే శ్లోకం.

సేకరణ: బ్రహ్మశ్రీ వెల్లంకి కృష్ణ శర్మగారి సౌజన్యంతో.

Phto

H

Siva temple

దార్గా హటావో వేములవాడ బచావో

*దార్గా హటావో వేములవాడ బచావో* గత 300 సంవత్సరాల క్రితం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం పైకి దండయాత్రకు కు వచ్చి  శ్రీ రాజరాజేశ్వర శివలింగం పై మూత్ర విసర్జన చేసి ఘోరాతి ఘోరమైన అపచారం చేసి  అవమానపరిచిన అజాం గోరి, వాడు చేసిన మహా పాపనికీ అగ్రహించిన శివ భక్తులు శివ భక్తులు వాడిని అక్కడికక్కడే శులాల తో పొడిచి 🔱 చంపేశారు

ఈ విషయాన్ని తెలుసుకున్న నైజం వాడి సేనలతో వేములవాడ దేవస్థానం ప్రాంతం లో ఉన్న 400 మంది హిందువులను ఊస కోత  కోయించి వాడి తొత్తు గోరీ గాని సమాధి దేవస్థానం ముందు కట్టించాడు మిదేవుని దర్శనం చేసుకునే ముందు మా తురుక గోరీగాని  ముక్కిన తర్వాతే వెళ్లాలని హుకుం జారీ చేశాడు

 నాటి రోజుల్లో తప్పనిసరై బలవంతంగా మన హిందువులు వాడి గోరిని ని మోక్కి వెళ్లేవారు

కానీ నేడు కొంతమంది మూర్ఖులు వాడి సమాధికి మోక్కితే ఏదో కలిసివస్తుందని భ్రమించి  మూర్ఖంగా గొర్రెల ప్రవర్తిస్తున్నారు  కనుక వేములవాడ కు వెళ్లే హిందూ భక్తులు ఇకనైనా గ్రహించి అటు వైపు వెళ్లకుండా జాగ్రత్త పడగలరు ఈ విషయాన్ని అందరికీ హిందూ బంధువులందరికీ తెలియపరచగలరు

నాగ పంచమి

నాగ పంచమి*_

🐍🐍🐍🐍🐍🐍

*నాగ పంచమి ప్రాముఖ్యత*

🐍🐍🐍🐍🐍🐍

శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును *నాగ పంచమి* అంటారు. బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. *''నాగులచవితి''* మాదిరిగానే *''నాగ పంచమి''* నాడు నాగ దేవతను పూజించి వచ్చే *నాగపంచమి* రోజున నాగదేవతను పూజించాలి. *నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి.*  *గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి* రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి , ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప , పూజగదిని పసుపు , కుంకుమలు , పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ , పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం , పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం , సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

*నాగ పంచమి వ్రత కథ*

పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది  ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుండేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు.  విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం *నాగపంచమి నోము* నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను. ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి.

ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది.

మన

పంచాంగం 21.08.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 21.08.2023 Monday,

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల పక్ష: పంచమి తిధి ఇందు వాసర: చిత్ర నక్షత్రం శుభ యోగ: బవ తదుపరి బాలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 

పంచమి రాత్రి 01:58 వరకు.

చిత్ర ఈ రోజు పూర్తిగా ఉంది.

సూర్యోదయం : 06:03

సూర్యాస్తమయం : 06:35

వర్జ్యం : మధ్యాహ్నం 01:03 నుండి 02:48 వరకు.

దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:44 నుండి 01:34 వరకు తిరిగి మధ్యాహ్నం 03:14 నుండి 04:05 వరకు.

రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.  

శుభోదయ:, నమస్కార:

జగద్గురువులకే సాధ్యం.

 శ్లోకం:☝️

*బహుభ్యో బహు బోధవ్యం*

  *బహుధా బహువాసరాన్ |*

*బహుకల్పశతస్థాయి*

  *లబ్ధుం బహువిధం యశః ||*

-సభారంజనశతకం (నీలకంఠదీక్షితులు)

భావం: అనేక కల్పాల వరకు శాశ్వతమైన కీర్తిని పొందాలంటే, (మనిషి) బహుకాలం పాటు చాలా రకాల గ్రంథాలను అనేకమంది శిష్యులకి అనేక విధాలుగా బోధించాలి.

ఇటువంటి మార్గం మహా మహోపాధ్యాయులకు, జగద్గురువులకే సాధ్యం.🙏

Ekkillu