21, ఆగస్టు 2023, సోమవారం

కవచాన్ని దానమిచ్చే

 *卐ॐ _-|¦¦¦|సుభాషితమ్|¦¦¦|-_ ॐ卐* 


శ్లో𝕝𝕝 కర్ణస్త్వచం శిబిర్మాంసం

జీవం జీమూతవాహనః।

దదౌ దధీచిరస్థీని

నాస్త్యదేయం మహాత్మనామ్॥


తా𝕝𝕝 (కవచాన్ని దానమిచ్చే సందర్భంలో) కర్ణుడు తన చర్మాన్ని ఒలిచి ఇచ్చేసాడు.... శిబిచక్రవర్తి (ఒక పావురాన్ని రక్షించేందుకు) తన దేహాన్ని కోసి మాంసం ఇచ్చాడు.... జీమూతవాహనుడు (సర్పాలను కాపాడుటకు) గరుత్మండికి తన దేహాన్నే ఆహారంగా సమర్పించుకున్నాడు.... (శత్రుసంహారం ద్వారా లోకకళ్యాణం ఆశించి) దధీచి తన వెన్నెముకని దానం చేసాడు.... 

ఇలా మహాత్ములచే సమర్పించబడనిది ఏది లేదు?! 

🧘‍♂️🙏🪷


కవచదానమునందు కర్ణుండు తనమేను

     ఛేదించి యిచ్చెను చింతలేక

రాజేంద్రు డా శిబి రక్షింపగువ్వను

     మేనుమాంసము కోసి దాననిచ్చె

పాములన్ రక్షించ జీమూత వాహనుం

      డాత్మదేహమ్మునే యాహుతిచ్చె

జగతిరక్షణకోరి శాత్రవులను చంప 

     వెన్నెముక దధీచి వేడ్కనిచ్చె

లోకకల్యాణమును కోరి తేకువగను

త్యాగపురుషులు ప్రాణమ్ము లీగిగాను

నొసగి జగమందుపొందిరి యశము కీర్తి 

యిల మహాత్ము లీయనిదది యేమిలేదు.


గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: