*సత్సంగ బంధు మిత్రులు అందరికీ శ్రీ గరుడ పంచమి శుభాకాంక్షలు !* 💐
🌺🙏🌺
*సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణమ్ |*
*జితాన్తకం విషారిం చ అజితం విశ్వరూపిణమ్ || ౧*
*గరుత్మన్తం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనమ్ |*
*ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః || ౨*
🌺🙏🌺
శ్రీమన్నారాయణుని దివ్య వాహనమై సదా అలరెడి గరుడునకు శతకోటి నమస్కారములు . 🙏
ఇంతటి ఘనత ఎలా అబ్బినదయ్యా నీకు ? 🙏
శ్రీహరి పాదములను నీ చేతులతో మోసి , నీ మేను అతని సింహాసనముగా అమర్చి , సదా నీ రెక్కలను చాచి , ఆతడు ఎప్పుడు ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళుటకు సర్వ సన్నద్ధముగా ఉండే ఆ గరిమ నీకు ఎలా దక్కినదయ్యా ?🙏
నీ కథను విన్న తరువాత నాకు ఎన్నో జీవిత పాఠములు తెలిసాయి !
*1 ) భగవత్కృపపై సంపూర్ణ విశ్వాసము ఉంచవలెను !!*🌺
మీ తల్లి వినత , దేవుని వరముపై సంపూర్ణ విశ్వాసమునుంచక తొందరపడి ఒక గుడ్డును చిదిమినది . ఫలితముగా అనూరుడు జన్మీంచినాడు అర్థ దేహియై . ( భగవంతుని ప్రసాదమే కావున ఆతడు సూర్యుని రథ సారధి అయినాడు . అది ప్రక్కన పెడితే , వినత కు శోకమే మిగిలనది అపనమ్మకము వల్లన ) 🙏
*2 ) లక్ష్య సాధనయే ముఖ్యము ! పట్టములు కాదు 🌺*
కద్రువ దాస్యము నుండీ తల్లియైన వినతను విడిపించుటకు ఇంద్రలోకమునకు ఏగితివి ఇంద్రునితో తలపడి అమృతమును తెచ్చుటకు .
అమృతమును సాధించిననూ నీ మతి చాంచల్యమునకు గురికాలేదు . అమృతమును సేవించి ఇట్టే దివ్యత్వమును పొందవచ్చు , కానీ నువ్వు అలా చేయలేదు . నీలక్ష్యము తల్లిని దాస్యవిముక్తురాలిని చేయుటయే . అందుకే మరలా ఇంద్రునికి అమృతమును సేవించకూండా అప్పగించేసావు !! 🙏
ఇది కదా మేము కూడా నేర్చుకోవాలి ఇక్కడ ! 🙏
*3 ) మన బలిమి భగవంతుడు , మన నిష్కామ భక్తినే అతడు కోరుకొనును .*🌺
అత్యంత శక్తిమంతుడవు నీవు ! నీవు తలుచుకున్నచో ఎవ్వరినైన ఓడించ గలవు . కానీ నీవు చేపట్టినదేమిటి ? *శ్రీహరి దివ్య చరణపంకజములు .* 🙏
దాసులకు నీవే మార్గదర్శకుడవు !
స్వామి ఏగే అన్ని మార్గములకూ నీవే వాహనమై వెలుగొందు చున్నావు ! 🙏
ఇక్కడ *శ్రీ వేంకటాద్రి పై స్వామికి స్థిరమైన పల్లకి వైనావు* 🙏
అట్టి గరుత్మంతుడా ఇదిగో నయ్యా నీ పంచమి నాడు ,
నిను స్మరించుకొనుచూ నేను వ్రాసుకున్న నీ స్తుతి గీతము !! 🙏
🌺🍃 ----------------🍃 🌺
*అన్నమయ్యవాణి_నా_సంకీర్తనాబాణి -- 202*
( ద్విపద )
*కీర్తన :- // గరుడపంచమి నేడు కడుపుణ్య దినము //*
🌺🍃 ----------------🍃 🌺
🌹🌹
*గరుడపంచమి నేడు కడుపుణ్య దినము*
*గరుడునకమృతము కైవసంబాయె*
*卐 --🌹-- 卐 // గరుడపంచమి నేడు .. //*
*ఘనముగ పోరాడి గరిమను తెలిపి,*
*ఇనసారధి సనాభి యింద్రుని గెలిచె !*
*వినయశీలునిగ తా విహితము జూప ,*
*వినతకు దాస్యము వీడిన దినము !!*
*卐 --🌹-- 卐 // గరుడపంచమి నేడు .. //*
*సుధనిలకున్దెచ్చి చూడని వాడు ,*
*మధుసూదనుని ప్రేమ మరగిన వాడు*
*మధుర గుణంబుల మహిమా న్వితుండు !*
*అధిజిహ్వములకెల్ల నభిఘాతకుండు*
*卐 ---- 卐 // గరుడపంచమి నేడు .. //*
*హరికి నీతడె యాయె నమరవాహనము ,*
*సురలకీ భాగ్యంబు సుంతైన లేదు*
*గరుడవాహనమదె కడు ప్రీతి హరికి*
*అరయ వేంకటపతి కందలంబిదియె*
*卐 --🌹-- 卐 // గరుడపంచమి నేడు .. //*
✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది ( స్వీయ రచన )*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి