🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 3*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*అవిద్యానామ్ అంతః తిమిర మిహిర ద్వీపనగరీ*
*జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతిఝరీ |*
*దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ*
*నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి||*
అమ్మా నీ పాదధూళి రేణువు నీవు ఈ విధంగా అవుతున్నావు.
భవతి = ఎలాగ ?
అవిద్యానాం తిమిర అంతః = అవిద్య,అజ్ఞానము అనే చీకటిని అంతం చేసే
మిహిర ద్వీపనగరీ = మిహిరుడంటే సూర్యుడు అనేకమంది సూర్యులను ఉదయింపజేసే ద్వీపనగరివి. అంటే సర్వ జ్యోతిర్మండలములకు ఆధారమైన పరంజ్యోతివి.*ఉద్యద్భాను సహస్రాభా* అని అమ్మవారి నామం.
జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతిఝరీ = స్పందన లేని జడులకు కూడా చైతన్యమును ఇస్తావు. ఎటువంటి చైతన్యం? పూలగుత్తి (స్తబకం) నుండి వెలువడే మకరంద ప్రవాహము (శ్రుతి) యొక్క వేగము (ఝరి) వంటి చైతన్యము. అమ్మవారి నామాల్లో *సుధా శ్రుతిః* ఒకటి.
దరిద్రాణాం చింతామణి గుణనికా = చింతామణి హారము వంటిది.అన్ని దారిద్ర్యములను పోగొట్టేది. చింతలను పోగొట్టేది చింతామణి.
జన్మజలధౌ నిమగ్నానాం = సంసార సాగరంలో మునిగినవాడిని
దంష్ట్రా మురరిపు వరాహస్య = భూమిని జలధి నుండి ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి కోరల వంటిది.
ఇది అమ్మవారి వారాహీ శక్తిని గురించిన స్తుతిగా ఉపాసకులు భావిస్తారు. అమ్మవారి నామాల్లో *సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా* అని ఒకటి. జనన మరణ రూప ప్రవాహమే సంసారము. దాని నుండి ఉద్ధరింపబడటమే మోక్షము.
ఈ శ్లోకంలో అవిద్య, జడత్వము తొలగింపబడుట, ధర్మ పురుషార్ధమును, చింతామణి హారము దారిద్ర్యమును తొలగించుట, అర్ధ కామములను సంసార సాగరం నుండి ఉద్ధరింపబడటం, మోక్షమును సూచిస్తున్నాయని, ఈ విధంగా అమ్మవారి పాదధూళి రేణువు చతుర్విధ పురుషార్ధములను అనుగ్రహిస్తున్నదని పండిత ఉవాచ. అర్ధ కామములు ఒకే వర్గముగా పరిగణింపబడి ధర్మమూ మోక్షముతో కలిసి త్రివర్గముగా త్రిపురా విద్యగా వారిచే చెప్పబడుతున్నది.
. 🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి