13, నవంబర్ 2022, ఆదివారం

తంగేడు చెట్టు ఉపయోగాలు

 తంగేడు చెట్టు ఉపయోగాలు  - 


 *  ఈ చెట్టు యొక్క వేరు కషాయం కాచుకొని తాగిన నీళ్ల విరేచనాలు తగ్గును. లేదా 4 గ్రాముల తంగేడు బెరడు నమిలి రసం మింగినా కూడా విరేచనంలో చీము వంటి పదార్థం పొవడం తగ్గుతుంది . 


 *  5ml తంగేడు చెట్టు యొక్క బెరడు రసాన్ని రోజుకి ఒకసారి చొప్పున 3 రోజులపాటు  తాగితే టాన్సిల్స్ సమస్య తొలగిపోవును .


 *  తంగేడు చెట్టు లేత ఆకు నమిలి మింగితే దగ్గు తగ్గును.


 *  తంగేడు చిగుళ్లు దంచి కడితే తేలు విషం విరిగి మంట తగ్గును. 


 *  తంగేడు లేత ఆకుతో పాటు రెండు వెల్లుల్లి రెక్కలు , రెండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ముద్దచేసి ఒకే రోజున మూడు మోతాదులు పెరుగు అనుపానంతో కలిపి ఇస్తే చీముతో కూడిన విరేచనాలు తగ్గుతాయి .


 *  తంగేడు ఆకుని నీడలో ఎండించి ఆ చూర్ణాన్ని గొరువెచ్చటి నీటితో రోజు తీసుకోవడం వలన మలబద్దకం తగ్గును. 


 *  రేచీకటి తో భాదపడుతున్న వారు కోడి లేక మేక చేదుకట్టు , లివరు , మసాలా దినుసులు కలిపి మెత్తగా నూరి కోడికూర కాని మేకకూర కాని వొండుకొని తింటూ ఉంటే రేచీకటి బాధ నుంచి విముక్తం అవ్వుదురు .


 *  తంగేడు చిగుళ్లు మెత్తగా నూరి పెరుగులో కలుపుకుని పరగడుపున తాగితే నీళ్ల విరేచనాలు నశించును.


 * తంగేడు చిగుళ్లు మజ్జిగలో నూరి పాదాల మడమలు కు రాస్తే కాలిపగుళ్ళు తగ్గుతాయి. 


 *  తంగేడు చిగుళ్లు నేతితో వెచ్చచేసి కన్నులకు కట్టిన కంటి ఎరుపులు , పోట్లు నివారించును.


 *  మూత్రం బంధించి ఉన్నప్పుడు తంగేడు పువ్వులతో కషాయం పెట్టి దానియందు పంచదార చేర్చి ఇచ్చినచో మూత్రం వెంటనే బయటకి వెడలును.


 *  తంగేడు విత్తనాల చూర్ణం 3 గ్రాములు తీసుకుని దానియందు తేనే కలిపి పుచ్చుకొనిన అతిమూత్రం కట్టను. 


 *  తంగేడు పువ్వులను నీడ యందు ఎండించి చూర్ణం చేసి సమంగా పంచదార కలిపి పూటకు 2 నుంచి 3 గ్రాముల చొప్పున తీసుకున్న యెడల అతిమూత్ర వ్యాధి నివారణ అగును. 40 దినములు పాటించవలెను . 


 *   తంగేడు లేత చిగుళ్లు మాడుమీద వేసి గట్టిగా తలకు బట్ట కట్టిన యెడల తలపోటు , తలనొప్పి నయం అగును. మరియు నేత్రరోగాలు నివారించబడును . 


   

     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

యమళార్జున భంజనము:

 Srimadhandhra Bhagavatham -- 72 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


యమళార్జున భంజనము:


యశోదాదేవి కృష్ణుని తీసుకుని వెళ్ళి రోటికి కట్టేసింది. ఆయన విడిపించుకోవడం చేతకాని వాడిలా నటిస్తున్నాడు. కర్మపాశముల చేత లోకముల నన్నిటిని కట్టగలిగిన పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాడిలా నటిస్తూ, పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. కొడుక్కి శిక్ష వేశాను కదా అనుకుని అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది. గోపకాంతలు కూడా వెళ్ళిపోయారు. కృష్ణుడిని అలా చేస్తే గోపకాంతలు అనవసరంగా తల్లికి చెప్పి కృష్ణుడిని బాధపెట్టిన వారమయ్యామని లోపల బాధపడ్డారు. ఆశ్చర్యకరమయిన ఒక లీల ప్రారంభం అయింది. ఆ ఇంటి ప్రాంగణంలో రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అవి కొన్ని వందల సంవత్సరముల నుండి అక్కడ పెరిగిపోయి ఉన్నాయి. వాటి మానులు చాలా స్థిరమయిన స్థితిలో ఉన్నాయి. వాటిని కూలదోయడం అంత తేలికైన విషయం కాదు. రోటికి కట్టివేయబడిన పరమాత్మ నెమ్మదిగా రాతిని ఈడ్చుకుంటూ పాకుతున్నాడు. అంత బలశాలియై ఆయన పాకుతూ వెనకాల రోలును ఈడ్చుకు వచ్చేస్తున్నాడు. ఈ రెండుమద్దిచెట్ల మధ్యనుంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు. ఈడుస్తున్న రోలు అడ్డం తిరిగి రెండు మద్దిచెట్లకి అడ్డుపడింది. కృష్ణుడు రాతిని ముందుకు లాగాడు. ఆ రెండు మద్దిచెట్లు ఫెళఫెళమనే పెద్ద ధ్వనులతో పక్కకి పడిపోయాయి. రెండు వృక్షముల నుంచి మహాపురుషులు ఇద్దరు ఆవిర్భవించారు.

ఆ చెట్లలోంచి బయటకు వచ్చిన ఇద్దరు కుబేరుని కుమారులయిన నలకూబర, మణిగ్రీవులనే యక్షులు. కుబేరుడు ఐశ్వర్యమునకు అధిపతి. ఆయన నవనిధులకు దేవత. ఆయనకు రెండుశక్తులు ఉన్నాయి. ఒకటి ఆయన అపారమయిన ఐశ్వర్యమునకు ఆధిపత్యంలో ఉంటాడు. రెండు – సర్వకాలములయందు ఆయన శంకరుని పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుని పక్కన నిలబడి స్వామి ఎప్పుడయినా పని చెపుతారేమో నని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ రెండు లక్షణములు గలిగిన కుబేరుడు అహంకరించినట్లు మీకు పురాణములలో ఎక్కడా కనపడదు. కుబేరుడు విశ్రవసువుబ్రహ్మ కుమారుడు. రావణాసురుని కన్న ముందు పుట్టాడు. పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయి ‘ఏమి కావాలి?’ అని అడిగారు. కుబేరుడు తనకు దిక్పాలకత్వం ప్రసాదించమని కోరాడు. అపుడు బ్రహ్మగారు ‘నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను. నీవు ఉత్తర దిక్కున శంకరుని పక్కనే ఉండి నవనిధులకు అధిపతివై ఉంటావు. నిన్ను కుబేరుడని పిలుస్తారు’ అన్నారు.

కుబేరుని జీవితంలో ఒకే ఒక్కసారి పొరపాటు జరిగింది. హిమవత్పర్వత ప్రాంతములో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ సౌందర్యమును చూసి తెల్లబోయి ఎవరీ కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు. దానివల్ల కుబేరుని కన్నులలో ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది. అది తప్ప కుబేరుడు తన తండ్రిగారయిన విశ్రవసు బ్రహ్మగారు ఎలా చెపితే అలా ప్రవర్తించేవాడు. తండ్రిగారు కాంచనలంకను విడిచి పెట్టివేయవలసిందని చెపితే విడిచిపెట్టేసి తమ్ముడయిన రావణునికి ఇచ్చేశాడు. తాను ఉత్తరదిక్కుకు పోయి వేరే నగరమును నిర్మించుకున్నాడు. తన తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానమును రావణాసురుడు ఎత్తుకు పోతే మారుమాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు ఎక్కడా కనపడదు. భగవద్భక్తుడు కనపడితే అతని పాదములకు వంగి నమస్కరించగలడు. తండ్రి ఐశ్వర్యమునకు మాత్రమే వారసత్వమును పొంది తండ్రి సంస్కృతికి కొడుకులు వారసత్వం పొందక పోతే వారు ప్రమాదంలో పడతారు. అదే ఇక్కడ జరిగిన గొప్ప విశేషం.

నలకూబర మణిగ్రీవులు ఒకనాడు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తమయిపోతుంది. నలకూబరమణిగ్రీవులు దిగంబరంగా స్నానం చేస్తున్నారు. వారితో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒంటిమీద బట్ట లేదు. వారు మధువు సేవించి ఉన్నారు. తాము అలా ప్రవర్తించకూడదనే విషయమును మరచిపోయి ఉన్నారు. వీళ్ళు అటువంటి స్నానం చేస్తుండగా ఆకాశమార్గమున నారదమహర్షి వెళుతున్నారు. గంధర్వకాంతలకు బుద్ధి కలిగి గబగబా ఒడ్డుకువచ్చి వస్త్రములు కట్టుకుని నారదమహర్షికి నమస్కరించారు. నలకూబరమణిగ్రీవులు మాత్రం దిశమొలలతో నిలిచి నారదమహర్షికి కనీసం నమస్కారం కూడా చేయలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచిపద్ధతి కాదు. పెద్దల మాటల యందు, ప్రవర్తన యందు, వారియందు, గౌరవమును కలిగి ఉండాలి. నారదుడు సామాన్యుడు కాదు. అంత అవిధేయతతో నిలబడ్డ వారిని చూసి నారదుడు మనస్సులో ఒకమాట అనుకున్నాడు.

‘వీళ్ళకి కలవారి సుతులం అనే అహంకారం వచ్చింది. ఈ సంపాదన వీరి తండ్రిది. వీరు ఈవేళ మదోన్మత్తులై ఉన్నారు. తండ్రి గుణముల యందు వీరికి వారసత్వం లేదు. కాబట్టి వీరికి ఈ ఐశ్వర్యమును తీసివేస్తాను. వీరికి దేనివలన అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది. వీళ్ళ కంటికి కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతలి వారిలో ఉన్న భక్తికి వంగి నమస్కరించడం అలవాటు అవుతుందో ఆ అన్జనమును వీళ్ళ కళ్ళకి దిద్దుతాను. వీళ్ళకు బుద్ధి చెపుతాను’ అనుకుని వారితో ‘మీరు కోట్ల సంపదకు పడగలెత్తిన కుబేరుని కుమారులు. మీకు బట్టకట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు. అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది. మీరు నూరు దివ్య సంవత్సరముల పాటు యమళార్జునములనే పేర్లతో మద్దిచెట్లయి నందవ్రజమునందు పడి ఉండెదరు గాక!’ అని శపిస్తే ఒంటికి పట్టిన మదం తీరిపోయి నారదుని కాళ్ళమీద పడ్డారు.

గురువు అనుగ్రహించాలి. నారదుని అనుగ్రహించి ఆయన ‘ఇపుడు మీకు పట్టిన మదం ఇంకెన్నడూ మీ తలలకు ఎక్కకూడదు. అలా చేయగలిగిన శక్తి ముకుంద పాదారవిందములనుండి స్రవించే రజస్సుకు మాత్రమే ఉన్నది. భగవంతుని పాదములను చూడగానే ఆయన పాదములకు తగిలేటట్లుగా శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ పాదరేణువులు తలమీద పడాలి. భాగవతుల పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉండే శక్తి చేరి ఉంటుంది. ఆ పాదధూళి వారి తలమీద పడగానే వారు పుణ్యతీర్థములలో స్నానం చేసినంతటి ఫలితమును పొందుతారు. అదే వారి పుణ్యమునకు, ఐశ్వర్యమునకు, వారి అభివృద్ధికి హేతువు అవుతుంది. మీరు నందవ్రజంలో మద్దిచెట్లయి పుట్టండి. కృష్ణపరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదములనుండి స్రవించిన పరాగము మీ మీద పడుతుంది. చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరమును వదులుతారు. మీరు నా పట్ల అపచారం చేస్తే చేసారు కానీ నా అనుగ్రహము వలన ఉత్తరోత్తర మోక్షమును పొందుతారు. నారాయణ భక్తులు అవుతారు. అపారమయిన ఐశ్వర్యముతో ఉంటారు. మరల యథారూపమును పొంది మీ యక్షలోకమునకు చేరుకుంటారు. చేరుకొని మీ సంపత్తిని మీ సౌఖ్యమును పొందుతారు’ అని అనుగ్రహించాడు. ఈ విధంగా నారదమహర్షి శాపావసానమును ఇచ్చారు. దీనివలన పడిపోయిన రెండుచెట్లనుండి వెలుపలికి వచ్చిన మణిగ్రీవ నలకూబరులు రెండుచెట్ల మధ్యవున్న ఏడుస్తున్న కృష్ణుని చూసి నమస్కరించి స్తోత్రం చేశారు.

నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్

నీ పేరం బనిసేయు హస్తయుగముల్ నీమూర్తిపై జూపులున్

నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్

నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్త్రేక్షణా!!

ఈపద్యమును ఒకసారి చదువుకుంటే చాలు. మనం పూజ చేసినట్లే. స్వామీ! మేము ఎప్పటికీ మరల అహంకారం రాకుండా, మా కళ్ళు ఎల్లప్పుడూ నీ మూర్తినే చూడగలగాలి. మా శిరస్సులు నీ పాదములను తాటించగలగాలి. ఎప్పుడెప్పుడు ఈశ్వరుని సేవిద్దామా అని మనస్సునందు తొందర గలగాలి. అటువంటి చిత్తమును మాకు ప్రసాదించవలసినది’ అని చేతులెత్తి పరమాత్మను ప్రార్థించారు. ఆయన ‘తథాస్తు’ మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది. మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకమును చేరుకోండి ’ అని చెప్పారు. వాళ్ళు బయలుదేరి యక్షలోకమునకు వెళ్ళిపోయారు.

ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాడో ఆ భక్తులకు వంగి నమస్కరించగలిగితే ఎల్లప్పుడూ ఐశ్వర్యమును అనుభవిస్తూ ఆనందముగా ఉండగలరు అనే మహోత్కృష్టమైన సందేశమును ఈ లీల మనకు అందజేస్తోంది. యశోదానందులు అక్కడ ఉన్న గోపాలురు ఈ చెట్లు పడిపోయిన శబ్దమును విన్నారు. ఈ రెండు చెట్లూ భూమిమీద ఎలా పడ్డాయని అక్కడి వాళ్ళందరూ అనుకుంటున్నారు. చెట్లు పడిపోవడం కృష్ణునితో పాటు ఆడుకుంటున్న చిన్న పిల్లలు చూశారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి ఈ చిన్ని కృష్ణుడే రోలు ఈడ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలో వచ్చాడు. అలా వచ్చినపుడు ఈ రెండుచెట్లూ భూమిమీద పడిపోయాయి. అందులోనుండి దివ్యతేజస్సుతో ఇద్దరు మహాపురుషులు వచ్చారు. వారు చిన్నికృష్ణుని స్తోత్రం చేసి ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు. అది మేము చూశాము అన్నారు.

పెద్దవారు వీళ్ళమాటలు కొట్టి పారేశారు. కృష్ణుడు ఏమీ తెలియని చిన్నపిల్లవాడి వలే ఏదో పాటను పాడుతున్నాడు. ఆ పాటకు అర్థం ఏమీ ఉండదు. గోపవనితలు చుట్టూ చేరి తాళం వేస్తుంటే తన కాళ్ళ గజ్జెలు మోగేటట్లుగా కాళ్ళు చేతులు తిప్పుతూ గంతులు వేస్తున్నాడు. ఇంతగా అమాయకత్వంతో ఉన్న పిల్లవాడిని చూసి వానికి దైవీశక్తులు ఉన్నాయని ఎవరు అనుకుంటారు? ఈవిధంగా కృష్ణుడు నందవ్రజంలో వారిని మభ్యపెడుతున్నాడు. అలా మభ్యపెడుతున్న కృష్ణుని మనసు దర్శనం చేసిన నాడు మనలను ఆవహించి ఉన్న మాయ తొలగిపోతుంది. గర్భిణి అయిన స్త్రీ దశమస్కంధం వింటే కృష్ణ భగవానుడి వంటి కొడుకు పుడతాడు.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage 


instagram.com/pravachana_chakravarthy

https://youtu.be/Rq3xisN-PlI 

రామాయణానుభవం_ 211*

 [13/11, 11:25 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 211* 


మండోదరి ఉపశమించింది.

అప్పుడు రాముడు విభీషణుడివైపు చూసి విభీషణా ! త్వరగా ఏర్పాట్లు చేయించు. ఈ స్త్రీ జనాన్ని లంకాపట్టణంలోకి పంపించు అని సలహా ఇచ్చాడు.


అటుపైని అన్నీ యథావిధిగా జరిగిపోయాయి. విభీషణుడు తిలోదకాలు విడిచిపెట్టాడు. అంతఃపురస్త్రీలను ఓదార్చి పంపించాడు. వినీతుడైవచ్చి రాముని పక్కనే నిలబడ్డాడు. 


అదే సమయంలో రామభద్రుడి అనుమతి తీసుకొని మాతలి దివ్యరథంతో ఇంద్రలోకానికి మరలి వెళ్ళిపోయాడు.

*రాఘవేనాభ్యానుఙ్ఞనాతో మాతలీః శక్రసారథిః*

*దివ్యం తాం తథామస్థాయ దివమేవోత్పపాత హ*


 అప్పుడు రాముడు సౌమిత్రికేసి చూస్తూ


సోదరా ! లక్ష్మణా ! మనకు అనురక్తుడు, ఉపకారి అయిన ఈ విభీషణుణ్ని లంకాసామ్రాజ్యానికి వెంటనే పట్టాభిషిక్తుణ్ని చెయ్యి. ఈ రావణసోదరుణ్ని లంకా సింహాసనంపై చూడాలని నాకు కోరికగా ఉంది.


వెంటనే బంగారు బిందెలతో వానరులు సముద్రోదకాలు తీసుకువచ్చారు. సర్వవానర సమక్షంలో ఋక్షవీరుల ఎదుట రాముడు సాక్షిగా విభీషణుడికి సౌమిత్రి యథావిధిగా పట్టాభిషేకం చేసాడు. అందరూ ఆనందంతో అభినందించారు. రామదత్తమైన తన లంకా సామ్రాజ్యంలోకి వెళ్ళి విభీషణుడు ప్రజలనందరినీ శాంతవచనాలతో ఉరడించి వెంటనే తిరిగి వచ్చాడు.


అతని వెంట అక్షతలు, మోదకములు, లాజలు (పేలాలు), దివ్యమైన పుష్పాలు మొదలయిన మంగళ ద్రవ్యాలతో లంకాపౌరులు వచ్చి భక్తితో రామభద్రుడికి మ్రొక్కి ఆ కానుకలు సమర్పించారు. విభీషణుడి ఆనందంకోసం రాముడు వాటిని స్వీకరించి లక్ష్మణుడికి అందించాడు.


అప్పుడు శ్రీరామభద్రుడు గంభీరస్వరంతో ఆంజనేయా! విభీషణుడి అనుమతి తీసుకొని లంకాపట్టణంలోకి వెళ్ళు. విజయవార్తను వైదేహికి తెలియజెయ్యి. లక్ష్మణ సుగ్రీవులతో నేను కుశలంగా ఉన్నానని చెప్పు. రావణుడు నా చేతిలో చనిపోయాడని చెప్పు. ఈ ప్రియాన్ని అందించి మైథిలి ఏమి చెబుతుందో ఆ సందేశం తీసుకురా!

*ప్రియమేతదుదాహృత్య వైదేహ్యస్త్వమ్ హరీశ్వర* 

*ప్రతిగృహ్య చ సమ్దేశముపావర్తితుమర్హసి*

** 


హనుమ లంకకు వెళ్ళాడు. అదే చెట్టుమూల అలాగే కూర్చున్న సీతాదేవిని చూసాడు. అనులేప భూషణ సంస్కారాలు ఏమీలేకుండా గ్రహపీడితయైన రోహిణీదేవిలా దీనంగా ఉన్న వైదేహిని చూసాడు. 


తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. సీతమ్మ చూసీ మౌనంగా ఉండిపోయింది. హనుమంతుడు రాముడు చెప్పమన్నదంతా చెప్పాడు. రావణవధతో రాముడు పొందిన ఆ విజయవార్తను విని హర్షాతిశయంతో సీతాదేవికి నోట మాట రాలేదు.


తల్లీ! ఇంతటి శుభవార్తను విని ఏమీ పలకకుండా మిన్నకున్నావేమిటి? అని ఆంజనేయుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ గద్గదస్వరంతో

*ప్రియమేతదుపశ్రుత్య భర్తుర్విజయసమ్ శ్రితమ్*

*ప్రహర్షవశమాపన్నా నిర్వాక్యాశ్మి క్షనాన్తరమ్*

హనుమా ! ఈ విజయవార్తను విని ఆనందంతో నాకు నోట మాట రావడంలేదు. నాకు ఇంతగా ఆనందం కల్గిస్తున్న వర్తమానం తెచ్చిన నీకు ప్రత్యభినందనం తప్ప మరింకే బహుమానమూ ఇవ్వలేను. పైగా ఇంతటి ప్రియవార్తకు బహుమతిగా ఇవ్వదగిన వస్తువుకూడా ఈ ప్రపంచంలో ఉండదు.


సీతాదేవి ఇలా పలకగా ఆంజనేయుడు వంగి నమస్కరిస్తూ- తల్లీ! భర్తృ విజయాన్ని కాంక్షిస్తూ తదేక దీక్షతో ఉన్న నీవు పలకవలసిన మాటయే యిది అన్నాడు. అప్పుడు సీతాదేవి వాయునందనా ! శత్రువులను సంహరించి విజయం చేపట్టిన శ్రీరామచంద్రుణ్ని చూడాలనుకుంటున్నాను అని తన మనసులోని మాట తెలియజేసింది.


ఆ మాటలకు ఆంజనేయుడు అభినందించి - జననీ! ఇంతకాలం నిన్ను నానాహింసలు పెట్టిన ఈ రాక్షసస్త్రీలను, నీవు అనుమతిస్తే క్షణంలో సంహరిస్తానన్నాడు.


*పాపానాంవా శుభానాంవా* *వధార్హాణాం ప్లవంగమ* *కార్యం కరుణ మార్యేణ* *నకశ్చిత్ నాపరాధ్యతి*


రాజాజ్ఞను పాటించి వాళ్ళ విధిని వాళ్ళు నిర్వహించారు. ఇందులో వాళ్ళ తప్పులేదు. నా అదృష్టం ఇలా ఉంది. దానికి వీళ్ళేం చేస్తారు. రావణాసురుడు వధింపబడ్డ క్షణంనుంచీ నన్ను హింసించడం భయపెట్టడం మానేసారు. పైగా పాపాత్ములనుకూడా ఒక్కొక్కప్పుడు క్షమించి వదిలెయ్యడం సత్పురుషుల లక్షణం- అని సీతాదేవి హనుమంతుణ్ని వారించింది.


శ్రీరామభద్రునికి ధర్మపత్నివి నీవు. ఇది ఉచితమే. ప్రతిసందేశం ఇచ్చి నన్ను రాఘవసన్నిధికి పంపించు తల్లీ!


*అబ్రవీద్రష్టుమిచ్ఛామి భర్తారం వానరోత్తమ*


వానరోత్తమా ! భర్తను చూడాలనుకుంటున్నాను.ఇది నా సందేశం అని తెలిపింది.

హనుమ బయలుదేరాడు.

*

[పాపానాంవా - అనునది సీతాదేవి యొక్క అభయ ప్రదాన శ్లోకము; 

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతిచ యాచతే | అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్వ్రతంమమ (యుద్ధ సర్గ 18, శ్లో. 33) అను శ్లోకము శ్రీరాముని అభయ ప్రదాన శ్లోకమని పూర్వము చెప్పబడినది. ఈ రెండు శ్లోకాలను సీతా చరమ శ్లోకముఅని

 శ్రీరామ చరమ శ్లోకము అని పూర్వాచార్యులు అభిప్రాయం.]

[13/11, 11:25 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 212* 


హనుమ శ్రీరాముని సన్నిధికి వెళ్లి “రావణబాధితురాలైన సీతాదేవి తన ప్రభువును తక్షణమే దర్శించగోరుతున్నట్లు తెలిపాడు. శ్రీరాముడు కొంతసేపు మౌనము దాల్చాడు. ఆయన మనస్సు పరి పరి విధాల ఆలోచిస్తున్నది. 


పదిమాసాల తరువాత తాను తన ప్రేయసిని చూడబోతున్నానే ఆనందం

ఒక వైపు, పది మాసాల పాటు ఒక కాముకుని దగ్గర గడపిన తన పత్నిని గురించి లోకులు ఏమనుకొంటారో అనే బాధ మరొక వైపు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 


ఆయన ధర్మాత్ముడైన విభీషణుని పిలిచి, "సీతాదేవికి శిరస్నానము చేయించి, నూతన వస్త్రాలను, ఆభరణాలను ధరింపజేసి తన ముందుకు తీసికరమ్మని" ఆజ్ఞాపించాడు.


విభీషణుడు అంతఃపురానికి వెళ్ళి తన వనితల ద్వారా శ్రీరామ సందేశాన్ని సీతాదేవికి తెలిపాడు.


సీతాదేవి తాను స్నానమాచరించి, నూతన వస్త్రాలంకారాలతో శ్రీరాముని సందర్శించాలన్న విషయాన్ని విన్న వెంటనే ఉలికిపడింది.


*అస్నాతా ద్రష్టు మిచ్చామి*


ఆమె శ్రీరామచంద్రస్వామిని స్నానం చేయకుండానే చూడాలనుకొన్నట్లు తెలిపింది.


అయితే ఆమె నూతన వస్త్రాలంకారాలను ధరించే శ్రీరాముని దర్శించాలన్నది తన

అభిప్రాయము కాదని అది "రామాజ్ఞ” అని విభీషణుడు తెలిపాడు.


"ఏమిటిది? ఎందుకిలా తన భర్త ఆజ్ఞాపించాడు? తమ మధ్యలో ఏమి జరగ బోతున్నది? ఏదో ఒక ఘోర విపత్తు మళ్లీ తన జీవితంలో జరగబోతున్నది" అని సీతాదేవి మనస్సు కీడును శంకించింది.


తాను తన ప్రాణేశ్వరుని వదలి వచ్చినప్పటినుండి లంకలో ఎలా జీవించింది? రావణుడు తనను అపహరించిన నాడు కట్టుకొన్న చీరే ఈ నాటికి ఆమె శరీరముపై మారకుండా అలాగే ఉంది. అది మాసిపోయింది. సీతాదేవి దానిని మార్చలేదు. వేరే చీరను ధరించలేదు. తన ఆభరణాలలో సగాన్ని ఋష్యమూక పర్వతము పై పడేసి వచ్చింది. మిగిలిన సగాన్ని తాను కూర్చున్న చోట చెట్టు కొమ్మకు వేలాడ దీసింది. శ్రీరాముని వెంట ఉన్నప్పుడు చేసిన సాన్నము మళ్లీ చేయనేలేదు.


ఈ పది మాసాలు శ్రీరాముని నుండి వేరైనందుకు నిరంతర దుఃఖమే. రామ

నామస్మరణమే, రామధ్యానమే. "రామమే వాను ధ్యాయంతీ నిత్యం శోకపరాయణా",

ఇదిగో ఇంత దుఃఖంతో, మాసిన చీరతో, ఉన్నదున్నట్లుగా తాను తన స్వామిని చూడాలనుకున్నది. తాను భోరున విలపించాలనుకున్నది. తన దుఃఖాన్ని, తన విరహ బాధను, తన కృశించిన, మట్టి పేరిన శరీరాన్ని చూచి తన భర్త కరిగి, నీరు కావాలనుకొంది.


అటువంటిది ఇప్పుడు ఏమి జరిగింది? తాను స్నానం చేసి నూతన వస్త్రాభరణాలను ధరించి స్వామిని సేవించాలట!


అప్పుడు తాను పడ్డ బాధ, అనుభవించిన దుఃఖము రామచంద్రస్వామికి అర్ధమవు

తుం? లోకులకు అర్ధమవుతుందా?


పరమనీచుడు, కాముకుడైన రావణుని ఇంట్లో ఈ పది మాసాలు తాను ఎంతో సుఖసంతోషాలతో గడిపిందని లోకము తప్పుగా అనుకోదా?


అప్పటికి ఆమె 'నమే స్నానం బహుమతం' అని శ్రీరామచంద్ర స్వామిని సేవించందే.

తనకు స్నానము ఇష్టము కాదని తెలిపింది.


అయినా తనను పట్టించుకొనేవారెవ్వరు? తన మాట వినేదెవ్వరు? 'రామాజ్ఞ' అనే ఒకే మాటకు వివశురాలైంది. శిర: స్నానము చేసి, నూతన వస్త్రాభరణాలను ధరించే స్వామి సమక్షానికి పల్లకిపై ప్రయాణించి వెళ్లింది.


సీతాదేవి శ్రీరాముని ధర్మపత్ని, కాబోయే "పట్టమహిషి" కనుక ఆమెను అందరు పైపైబడి చూడ కూడదనుకొని విభీషణుని ఉద్యోగులు అక్కడ ఉన్న వారందరిని దూరంగా పంపారు.


దూరంగా పంపుతున్న ఉద్యోగుల ధ్వనులు, దూరంగా వెళ్లుతున్న వానరాదుల ధ్వనులు శ్రీరాముని ఏకాగ్రతను భంగం చేశాయి. ఆయన విభీషణుని పిలిచి," తక్షణమే వానరులను దూరంగా పంపడాన్ని ఆపుమని" అజ్ఞాపించాడు.


*నగృహాణి న వస్త్రాణి న ప్రాకారా తిరస్క్రియాః* ॥ *నేదృశా రాజసత్కారా వృత్త మావరణం స్త్రీయాః* ॥ 


*వ్యసనేషు న కృచ్ర్చేషు న యుద్ధేషు స్వయంవరే* | 

*న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్యతి స్త్రీయాః* ॥ 


*సైషా యుద్ధగతా చైవ కృచ్చే చ మహతి స్థితా* | 

*దర్శనేస్యా న దోషః స్యాత్ మత్సమీపే విశేషతః*


విభీషణా....!

గృహాలూ వస్త్రాలూ ప్రాకారాలూ పరదాలూ ఇటువంటి రాజలాంఛనాలు ఏవీ స్త్రీలకు ఆభరణాలు కావు. శీలమే స్త్రీలకు అసలైన ఆచ్ఛాదనం. పైగా కష్టాలలోను, రాజకీయకల్లోలాలలోను, యుద్ధాలలోను, స్వయంవరాలలోను, యజ్ఞయాగాదులలోను, వివాహాలలోను ఎంతటి అంతఃపుర కాంతలయినా అందరికీ కనపడవచ్చు. తప్పులేదు. ప్రస్తుతం ఇది యుద్ధ సమయం. 


ఈ సీతాదేవి గొప్ప (రాజ్య) సంక్షోభస్థితిలో ఉంది. కాబట్టి అందరికీ కనపడవచ్చు. అందరూ చూడవచ్చు. నా సమీపంలో అసలు తప్పులేదు. అంచేత సీతను వెంటనే ఇక్కడికి తీసుకురా ! ఎవరినీ వైదొలగ మనవద్దు. మిత్రపరివారంతో ఉన్న నన్ను సీతాదేవి చూడాలి.


ఆయన మాటలు అక్కడ ఉన్న లక్ష్మణ, హనుమ, సుగ్రీవ విభీషణాడులెవ్వరికి అర్థం కాలేదు.


సీతాదేవి శ్రీరాముని సమీపించి, సిగ్గుతో శ్రీరామచంద్రుని పదనారవిందాన్ని తనివి తీరాచూచింది.


*విస్మయాచ్చ ప్రహర్షాచ్చ స్నేహాచ్చ పరిదేవతా* |

*ఉదైక్షత ముఖమ్ భర్తుః సౌమ్యమ్ సౌమ్యతారాననా*

భర్తయే దైవంగా ప్రాణాలను నిలుపుకొన్న ఆ మహాసాధ్వి ఆశ్చర్యంతో ఆనందంతో అనురాగంతో సౌమ్యమయిన తన భర్త ముఖాన్ని చూసింది. ఎంతో కాలం తరువాత కనపడిన తన ప్రియుని ముఖాన్ని చూసి ఇంతకాలం తాను పడిన మానసికవ్యధను పోగొట్టుకుంది......


** 


శ్రీరామచంద్రుడు సీతాదేవిని సూటిగా చూడలేదు.ఎవ్వరో పరులతో మాట్లాడుతున్నట్లు పలుకసాగాడు..


"సీతా! నేను లేనప్పుడు ఒంటరిదాననైన నిన్ను రావణుడు అపహరించి తెచ్చాడు. అటువంటి నీచుని సమర భూమిలో నా శౌర్యాన్ని ప్రయోగించి సంహరించాను.


"భార్యను కాపాడుకోవడం భర్త బాధ్యత. సమర్థులైనా కాకున్నా పతులు తమ సతులను కాపాడుకోవడానికి తప్పక ప్రయత్నించాలి.


ఆ విధంగా నేను కూడ నా భార్యను అపహరించిన రావణుని సపరివారంగా ఆయన ఉన్న చోటుకే వచ్చి సంహరించాను.


అందువలన నా భర్త ధర్మం నెరవేరింది. నా పరాక్రమ ప్రఖ్యాతి సమస్తలోకాలలో

వ్యాపించింది.


నిన్ను రావణుడు అపహరించడం దైవికము. దానిలో నా నీ బాధ్యతలు లేవు. అయితే దైవికంగా జరిగిన ప్రమాదమైనా నా శక్తి సామర్ధ్యాలతో తొలిగించాను.


ఇందులో సుగ్రీవుని మంత్రాంగము, హనుమదాడుల త్యాగ శౌర్యాలు, విభీషణుని సహాయ సంపత్తి నాకు ఈ విజయంలో ఎంతో తోడ్పడ్డాయి. వారందరి ప్రయత్నాలు ఫలించాయి.

*ఇత్యేవం వదతః శ్రుత్వా సితా రామస్య తద్వచః* |

*మృగీవోత్ఫుల్లనయనా బభూవాశ్రుపరిప్లుతా*

రాముడు చెప్పిన ఆ మాటలు విని, సీత ఆడ జింకలా కళ్ళు విప్పి కన్నీళ్లతో స్నానం చేసింది.


అయితే! సీతా ఈ ప్రయత్నమంతా నీపై వ్యామోహంతో చేయలేదు. "ఆశ్రిత రక్షణ. "మనే ధర్మాన్ని నిర్వర్తించడానికి చేశాను. ఇప్పుడు నిన్ను రావణుని చెరనుండి విడిపించాను. స్వతంత్రరాలిని చేశాను.


*దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృడం*

నేత్ర రోగము వచ్చిన వాడికి దీపమెలా ప్రతికూలమో? అలాగే నా ముందు నీవు ప్రతికూలంగా నిలిచావు.


నీ ప్రాతికూల్యము (విరోధము) ఏమిటంటావా? నీవు పది మాసాలు కాముకుడైన పగవాని ఇంట్లో గడిపావు. ఈ పదిమాసాలు నిన్ను రావణుడు తన వశం చేసికోకుండా ఎలా వదలిపెడతాడు? నిన్ను కన్నతల్లిలా గౌరవంగా ఆ నీచుడు చూచాడంటే లోకమెలా. నమ్ముతుంది? 


మా రఘువంశ రాజుల చరిత్రలు అతి పవిత్రాలైనవి. ఇప్పుడు నిన్ను భార్యగా

స్వీకరించి అకళంకమైన ఆ మహా పురుషుల వంశానికి మచ్చ తీసుకొ నిరావాలా? ఇప్పుడు నీకు స్వేచ్ఛను ప్రసాదించాను. 

*తదర్థం నిర్జితా మే త్వమ్ యశః ప్రత్యాహృతమ్ మాయా* |

*నాస్తి మే త్వయ్యాభిష్వంగో యథేష్టం గమ్యతామితః*


ఆడదాన్ని నేను ఒంటరిగా ఎలా జీవించగల్గుతాను? అంటావా?'

ఇక్కడే లంకలో విభీషణుని వద్ద, కిష్కింధలో సుగ్రీవుని వద్ద అయోధ్యలో భరతుని వద్ద లేదా లక్ష్మణుని వద్ద లేదా శత్రుఘ్నుడి వద్ద .. ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండవచ్చు" అని దయారహితంగా పలికాడు.


ప్రియమైన మాటలను వినుటకు అలవాటు పడిన సీత ప్రియుని నుండి ఇట్లు అప్రియములగు మాటలను వినినది. ఇంతకుముందు ఎన్నడును రాముడు ఇట్టిమాటలను అనుట ఆమె ఎరుగదు. ఏనుగు తన తుండముతో లాగి తెంపిన తామరతీగెవలె ఆమె మిక్కిలి కలత చెందినది. వణకి పోవుచున్నది.....

*తతః ప్రియార్హశ్రవనా తదప్రియమ్* |

*ప్రియాదుపశ్రుత్యా చిరస్య మైథిలీ* |

*ముమోచ బాష్పం సుభృశం ప్రవేపితా* |

*గజేంద్రహస్తాభిహతేవ వల్లరీ*


తన శరీరంలోకి తానే ప్రవేశిస్తున్నట్టుగా సిగ్గుతో బాధతో కుంచించుకుపోయింది. విలపించి విలపించి చివరకు ధైర్యం తెచ్చుకొని కన్నీరు తుడుచుకొని ముఖం ఒత్తుకుని గద్గదస్వరంతో ఇలా పలికింది.......

[13/11, 11:25 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 213* 


[_శ్రీరాముడి కఠినోక్తులు...._


*నేత్రాతురస్య దీప ఇవ ప్రతికూలా అసి* (కంటి రోగము గలవానికి దీపము వలె ప్రతికూలురాలవై ఉన్నావు) అనెడి ఉపమానముచేత, వాస్తవముగా, సీతయందు ఎట్టి దోషము లేదు, నా సందేహము చేత నేనే ప్రతికూలు రాలినిగా చేయుచున్నాను అని అంతరార్ధము సూచింపబడుచున్నది; 


దోషము దీపమునందుండదు; దీపమును చూచువానియందుండును; తనయందున్న కంటి రోగముచే, రోగము గలవాడు దీపమును జూచి బాధ భరించలేనట్లు లోకము కొఱకు చారిత్ర సందేహమును పొందిన శ్రీరాముడు సీతమ్మను జూచుచు అంతకంతకు ఎక్కువ బాధపడుచున్నాడని భావము, 


శరణాగతుడైన విభీషణుని రక్షించుటలో ఎవరిని లెక్కచేయక స్వతంత్రముగా నిర్ణయము దీసికొన్న శ్రీరాముడు, సీతమ్మను గ్రహించుటలో తాను స్వతంత్రుడుగా వ్యవహరించకూడదు;


 శ్రీరాముడు కాబోయెడిరాజు; రాజునకు ప్రజాభిప్రాయము ప్రమాణము; 


సీతాదేవి పరమపరిశుద్ధురాలు అని శ్రీరామునికి దెలిసినను, ప్రజాభిప్రాయములో చారిత్ర సందేహమేర్పడుటకు అవకాశమున్నది; కావున శ్రీరాముడు ప్రజల దృష్టితో చూచి శంకించుచు 'నేత్ర రోగము గలవానికి దీపమువలే నీవు నాకు ప్రతి కులముగా నున్నావని పలికినాడు; 


కాని సరియైన ఆలోచనలేనివారు 'సీతా విషయములో శ్రీరాముడు క్రూరముగా ప్రవర్తించినాడంటారు.


ఇక్కడ, లక్ష్మణుడు మొదలగు వారి యందు మనస్సు చేయుట; (మనస్సు నిలుపుట) అనగా, అనాథురాలికి రక్షకుడగుటచేత, వారివారి గృహమునందు వర్తించుట, అని అర్థము; 


భర్తచేత విడువబడిన వారైన ఏ స్త్రీలున్నారో, వారలు బంధువుల గృహములలో ఉండునట్టి ప్రధాన పద్ధతి గలదు; మరియు “నస్త్రీ స్వాతంత్య్రమర్హతి" - స్త్రీ స్వాతంత్య్రమునకు తగినది కాదు) ఒంటరిగా నుండుటకు వీలుపడదు అని స్మృతియందు చెప్పబడినది కూడ, కాని ఇచ్చట మరియొక విధముగా అర్ధము గ్రహించుట యుక్తమైనది కాదు; మహాపురుషుడైన శ్రీరామునిచేత అటువంటి మాట నోటి నుండి రాదు కదా...!]


** 


జయావహమైన సమయంలో భర్తనుంచి ప్రియాతిప్రియమైన మాటలు విందామని ఆశగా వచ్చిన సీతాదేవి కఠినాతికఠినమైన మాటలు విని- ఏనుగు గుంజిన లత లాగా కంపించిపోతూ దారుణంగా విలపించింది. తన శరీరంలోకి తానే ప్రవేశిస్తున్నట్టుగా సిగ్గుతో బాధతో కుంచించుకుపోయింది. విలపించి విలపించి చివరకు ధైర్యం తెచ్చుకొని కన్నీరు తుడుచుకొని ముఖం ఒత్తుకుని గద్గదస్వరంతో ఇలా పలికింది.


రామచంద్రా ! ఏమిటీ దారుణం. అనడానికి వినడానికి తగని మాటలు పలుకుతున్నావు. చెవులలో శూలాలు దించుతున్నావు. నేను అటువంటిదానను కాదు స్వామీ! నన్ను విశ్వసించు. నా శీలం మీద ఒట్టువేసి చెబుతున్నాను. నన్ను నమ్ము. చంచల స్వభావంగల ఇతర ప్రవర్తనను చూసి మొత్తం స్త్రీ జాతినే శంకిస్తున్నావు. అందరూ అటువంటివారే ఉండరు. 


నా స్వభావం నీవు ఎరుగుదువు. నన్ను శంకించకు. రావణాసురుడి గాత్రసంస్పర్శ నాకు తగిలిందంటే - మరి ఏం చెయ్యను, అశక్తురాలను, అంతే కానీ కామదృష్టి లేనేలేదు. దీనికి దైవాన్ని నిందించాలే కానీ నన్ను శంకిస్తే ఎలా?


 నా అధీనంలో ఉన్న హృదయం ఏనాడూ తప్పు చెయ్యలేదు. అనాథనై పరాధీనురాలనై శరీరం పరపురుషస్పర్శకు లోనయితే ఏమి చెయ్యగలను?


 బాల్యంనుంచీ కలిసి పెరిగాము. కలిసి జీవించాము. నన్ను నీవు అర్ధం చేసుకోలేదంటే నాథా! హతాస్మి. అలనాడు నన్ను చూసిరావడానికి హనుమంతుణ్ని పంపించినప్పుడే పరిత్యజించి ఉండవలసింది. 

*ప్రేషితస్తే యదా వీరో హనుమానవలోకః*

*లంకాస్థాహం త్వయా వీరా కిం తదా న విసర్జితా*

ఆ దుర్వార్త హనుమంతుని నోట విని అప్పుడే ప్రాణాలు వదిలేసి ఉండేదాన్ని. ఇంత యుద్ధమూ ఇంత శ్రమ నీకూ నీ మిత్రులకూ ఉండేది కాదు. 


పురుషోత్తమా ! నీవు క్రోధావేశంతో ఉన్నావు. స్త్రీ జాతికి చాంచల్యం సహజము అనే సంకుచిత దృష్టితో ఆలోచిస్తున్నావు. 

*త్వయా తు నరశార్దూల క్రోధమేవనువర్తత*

*లఘునేవ మనుష్యేన స్త్రీత్వమేవ పురస్కృతం*

నేను జనకమహారాజు కూతురిని. భూమినుంచి పుట్టినదానను. నా ప్రవర్తన ఆ మహారాజు మెప్పును పొందినది. బాల్యంలోనే జరిగిన మన వివాహాన్ని ఆ పవిత్రబంధాన్ని నీవు తిరస్కరిస్తున్నావు. నా భక్తినీ, నా శీలాన్నీ వెనక్కి నెట్టేస్తున్నావు. కించపరుస్తున్నావు.

*న ప్రమాణికృతః పాణిర్బాల్యే బాలేన పీడితః*

*మమ భక్తిశ్చ శీలం చ సర్వం తే పృష్టతః కృతం*


దుఃఖిస్తూనే ఈ మాటలు నాలుగూ చెప్పి, తనవైపు దీనంగా చూస్తున్న సౌమిత్రిని పిలిచి నాయనా ! నాకు చితి ఏర్పాటు చెయ్యి. 


ఈ దుఃఖానికీ ఈ కష్టానికీ అదే విరుగుడు. అదే మందు. ఈ అపవాదుతో ఈ అవమానంతో నేను జీవించలేను. పదిమంది ఎదుటా భర్తచేత తిరస్కరింపబడి పరిత్యక్షనైన నేను బ్రతికి ఉండలేను. అగ్నిలో దూకి మరణిస్తాను అంది. 

*అప్రీతస్య గుణైర్భర్తృస్త్యక్తా యా జనసంసది*

*యా క్షమా మే గతిర్గంతుం ప్రవేక్ష్యే హవ్యవాహనం*


లక్ష్మణుడు దీనాతిదీనంగా రాముని ముఖంలోకి చూసాడు. ముఖసంజ్ఞనుబట్టి అతడి అంగీకారాన్ని గ్రహించి చితిని పేర్చాడు.


సీతాదేవి తలదించుకొని కూర్చున్న శ్రీ రామచంద్రుడికి మెల్లగా ప్రదక్షిణం చేసి ప్రజ్వరిల్లుతున్న చితాగ్నిని సమీపించింది. సకలదేవతలకూ బ్రాహ్మణులకు నమస్కరించి అదే అంజలిబంధంతో అగ్నికి అభిముఖంగా నిలబడి


*యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్* , *తథా లోకస్య సాక్షీ మాం సర్వతః సాతు పావకః*


*యథా మాం శుద్ధచారిత్రాం దుష్టాం జానాతి రాఘవః* , *తథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావకః*


*కర్మణా మనసా వాచా యథా నాతిచరామ్యహమ్* , *రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావకః*


నా హృదయం శ్రీరాముణ్ని తప్ప మరింకెవరినీ తలచి యెరుగనిదైతే పావకుడు నన్ను రక్షించుగాక! 


నన్ను సుశీలనుగా రాఘవుడు గుర్తించేటట్టు లోకసాక్షియైన ఈ అగ్ని కాపాడుగాక! 


త్రికరణశుద్ధిగా ప్రవర్తించినదానయితే ఈ అగ్ని నన్ను కాపాడుగాక....


అని ప్రతిజ్ఞ చేస్తూ ముమ్మారు ప్రదక్షిణం చేసి అగ్నిలో ప్రవేశించింది. యజ్ఞకుండంలో పడుతున్న ఆజ్యధారలాగా, హవిస్సులాగా, స్వర్గంనుంచి పడిపోతున్న దేవతలాగా అగ్నిలో ప్రవేశిస్తున్న సీతాదేవిని ముల్లోకాలూ బెదురుబెదురుగా చూసాయి. రాక్షసులూ వానరులూ ఒక్క పెట్టున హాహాకారాలు చేసారు.


సీతాదేవి పలుకుతున్న ప్రతిజ్ఞలను వింటూ, కలతచెందిన మనస్సుతో కూర్చున్న రఘురాముడు అశ్రుపూరితాలయిన నేత్రాలను క్షణకాలం గట్టిగా మూసుకున్నాడు......

[13/11, 11:25 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 215* 


ఆ శుభరాత్రి తరువాత తెల్లవారి విభీషణుడు శ్రీరాముని సందర్శించి "మంగళస్నానానికి అవసరాలైన కుంకుమ పూవు, దివ్య జలాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలు, చందనాది పరిమళ ద్రవ్యాలు, దివ్యమాలలు సిద్ధంగా ఉన్నాయి. స్నానం చేయించడానికి, అలంకరించడానికి ఉత్తమ స్త్రీలు సంసిద్ధులై ఉన్నారు. అందువలన ప్రభూ! నా పై దయతో మంగళ స్నానానికి అంగీకరించండి” అని వేడుకొన్నాడు.


శ్రీరామచంద్రుడు “తాము అడవులలో పడ్డ కష్టాల కంటే ఎక్కువగా, అయోధ్యలో ఉండి, రాజభోగాలన్ని అనుభవించదగిన యోగ్యుడై కూడ, కష్టాలనుభవిస్తున్న తన తమ్ముడైన భరతుడు మంగళస్నానం చేయకుండా తాను చేయనని” తెలిపాడు.

*తాం వినా కైకయీపుత్రం భరతం ధర్మచారిణమ్*

*న మే స్నానం బహుమతం వస్త్రాన్యాని చ*


తాము తిరిగి వెళ్లవలసిన అయోధ్య అత్యంత దూరంలో ఉందని, తాము తక్షణమే ప్రయాణించవలసి ఉందని శ్రీరాముడు తెలిపాడు.


అప్పుడు విభీషణుడు, "రామప్రభూ! మా అన్న అయిన రావణుడు అపహరించి తెచ్చిన వస్తువులన్నిటిని తిరిగి వాటి యజమానులకు నా పట్టాభిషేకం జరిగిన వెంటనే త్రిప్పి పంపాను.


అయితే కుబేరుని నుండి మా అన్న అపహరించి తెచ్చిన విమానం మాత్రము నా దగ్గరే ఉంది. అది చాలా విశాలమైంది. ఎంతమందినైనా తీసికొని ప్రయాణించగల్గుతుంది. అత్యంత వేగవంతంగా వెళ్లగలుగుతుంది.


నీవు నీ వాళ్లందరితో అతి త్వరగా అయోధ్యకు వెళ్లగలుగుతావు. దానికి ముందు నా ప్రార్థనను దయచేసి అంగీకరించు.”


"విభీషణా! నీవు నన్ను నమ్మి రావణ విజయములో నీవు చేసిన సహాయము నేనెన్నటికి మరువజాలను. నీ మాటను కాదంటున్నానని అనుకోకు. నా మనస్సంతా నా తమ్ముడైన భరతునిపైననే ఉంది. ఆయన తన ప్రాణాలను బిగపట్టుకొని క్షణమొక యుగంగా నా కొరకు ఎదిరిచూస్తున్నాడు. మాట ఇచ్చిన రోజు వరకు నేను చేరుకోలేకపోతే మా భరతుడు ప్రాణాలతో ఉండడు. అందువలన మా తక్షణ ప్రయాణానికి ఏర్పాట్లు కావించుమని" శ్రీరాముడు పలికాడు.


శ్రీరాముని ఆదేశము మేరకు విభీషణుడు పుష్పకాన్ని సిద్ధ పరిచాడు. 


ఆ పుష్పకము వేగంలోనే కాక సౌందర్యంలో కూడ సాటిలేనిది.

దానిపైన పెద్ద పెద్ద గదులు ఉన్నాయి. అవి వైడూర్య శోభితాలు. పెద్ద పెద్ద బంగారు మిద్దెలు ఉన్నాయి. వాటిలో బంగారు కమలాలు చిత్రించబడ్డాయి. తెల్లని పతాకాలు ముత్యాలతో అలంకరింపబడ్డాయి. విమాన గవాక్షాలు రత్నానిర్మితాలు. దాని చుట్టు బంగారు గంటలు మ్రోగుతున్నాయి. అది మేరు పర్వతము లాగా ఎత్తుగా ఠీవిగా ఉంది. దానిని విశ్వకర్మ నిర్మించాడు.


అటువంటి సాటిలేని విమానాన్ని విభీషణుడు శ్రీరాముని ముందు ఉంచాడు.


శ్రీరాముడు విభీషణునితో "తన కొరకై ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి భయంకరంగా యుద్ధం చేసిన వానరులందరికి తగిన బహుమానాలిచ్చి పంపితే బాగుంటుంది. దాని వలన నీ దాతృత్వము, నీ కీర్తి ప్రతిష్టలు అందరికి తెలుస్తాయ"ని పలికాడు.

*కృతప్రయత్నకర్మాణాః సర్వ ఏవ వనేచారః*

*రత్నైరర్థైశ్చ వివిధైః సమ్పూజ్యంతాం విభీషణా*


శ్రీరామాజ్ఞ ప్రకారము విభీషణుడు అమూల్యాలైన వజ్ర, వైడూర్య, సువర్ణాలను, రత్నమాణిక్యాలను తెప్పించి, వానరులందరికి పుష్కలంగా బహుమానాలిచ్చాడు. వానరులందరు చాలా సంతోషించారు.


అప్పుడు శ్రీరాముడు వారందరికి తమ తమ స్థలాలకు వెళ్లడానికి అనుమతినిచ్చాడు.


అప్పుడు సమస్త వానర సమేతుడైన సుగ్రీవుడు, రాక్షస రాజైన విభీషణుడు శ్రీరాముని పట్టాభిషేకాన్ని సేవింపదలచి, ఆ విషయాన్ని ఆయనతో మనవి చేశారు. భక్తవత్సలుడైన రామభద్రుడు వారి కోరికను మన్నించాడు.


వారందరు మహోత్సాహంతో సువిశాలమైన పుష్పక విమానాన్ని అధిరోహించి, సౌకర్యంగా కూచొని, ఆశ్చర్యకరాలైన అనేక విషయాలను ముచ్చటించుకొంటూ అయోధ్యకు ప్రయణమయ్యారు.

** 

*కైలాసశిఖరాకారే ​​త్రికూటశిఖరే స్థితాం*

*లంకామీక్షస్వ వైదేహి నిర్మితాన్ విశ్వకర్మణా*

శ్రీరాముడు విమానంలో తన ప్రక్కనే కూర్చున్న సీతాదేవికి త్రికూట శిఖరంపై నిర్మితమైన లంకానగర సౌందర్యాన్ని చూపాడు. రావణుని, తదితర ప్రముఖ రాక్షసులు వధ జరిగిన స్థలాలను చూపించాడు.


అన్ని కాలాలలోను అత్యద్భుతమని సురులు, నరులు కీర్తించే విధంగా తాను నలుడను వానరునిచే నిర్మింప జేసిన రామసేతువును సీతాదేవికి చూపెట్టాడు.


తన తరంగాలతో ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉండి సకల జలచరాలకు నిలయమైన సముద్రాన్ని చూపాడు. మహాసముద్రానికి ఉత్తర తీరంలో తాము విడిది చేసిన స్థలాన్ని చూపెట్టాడు.


*అత్రపూర్వం మహాదేవః ప్రసాద మకరోన్మమ*


"సీతా! సముద్రుడు తనపై సేతు నిర్మాణాన్ని సూచించి, తన ప్రసాదాన్ని (దయను) మాకు కలిగించాడు" అని శ్రీరాముడు తెలిపాడు.


పుష్పకము కిష్కింధాకాశములో ప్రవేశించింది. సీతాదేవికి సుగ్రీవుని పత్నులైన తారా, రుమలను కూడ తన వెంట అయోధ్యా నగరానికి తీసిక వెళ్లాలనిపించింది. ఆమె తన కోరికను తన పతికి తెలిపింది. 

*సుగ్రీవప్రియభార్యాభిస్తారాప్రముఖతో నృప*

*అన్యేషాం వానరేంద్రానాం స్త్రీభిః పరివృతా హ్యహమ్*

*గంతుమిచ్ఛే సహాయోధ్యామ్ రాజధానీం త్వయానఘ*


పుష్పకము కిష్కింధలో నిలిచింది. సుగ్రీవుడు విమానం దిగి తారకు సీత కోరికను తెలిపాడు. తార, తన రాజ్యంలోని అంగనలను అందరిని ఆహ్వానించింది. అందరు సర్వాలంకారభూషితలై వచ్చి పుష్పకమెక్కారు.


పుష్పకము మళ్లీ పైకి ఎగిరింది.


సీతాదేవికి ఋష్యమూక పర్వతాన్ని, సుగ్రీవునితో స్నేహం చేసిన స్థలాలను చూపాడు. "ఇది హనుమ మమ్ములను మొదట కలసిన స్థలము. ఇది పంపా సరోవరము. ఇది మతంగ మహాముని వనము. ఇక్కడే మహాత్మురాలైన, ఆచార్య నిష్టాగరిష్ఠురాలైన శబరి మాకు ఆతిథ్యము నిచ్చి, ఆచార్యానుగ్రహముతో పరమపదం చేరింది.


ఇదిగో ఇక్కడ మేము కబంధుని వధించాము. ఇక్కడే జటాయువు నీ కొరకు రావణునితో పోరాడి తన ప్రాణాలను అర్పించాడు.


ఇక్కడే ఖర దూషణ, త్రిశిరుల పదునాల్గువేల సైన్యాన్ని కొన్ని క్షణాలలో మాడ్చి వేశాను.


ఇదిగో ఇదే మన పర్ణశాల. ఇక్కడే రావణుడు మారీచుని పంపి, మమ్మల్ని దాని వెంట వెళ్లేలా చేసి, నిన్ను అపహరించాడు.


విరాధుడు సంహరింపబడిన స్థలమిదే. ఇవేఋష్యాశ్రమాలు. పది సంవత్సరాలు మనము ఆనందంగా గడిపిన సుఖాలయాలు. ఇదే అనసూయాదేవి ఆశ్రమము. ఇదిగో ఇక్కడే చిత్రకూటము. ఇక్కడే భరతుడు వచ్చి రాజ్యాన్ని మళ్లీ స్వీకరించుమని నన్ను బ్రతిమాలిన ఆశ్రమ ప్రదేశము.


అప్పుడు నా ప్రాణప్రియుడైన భరతుడు అన్ని విధాల నన్ను శరణు వేడినా ఆయన ప్రార్థనను నేను మన్నించలేదు. అవే యమునా, గంగా, సరయూ మా నాన్నగారి రాజధాని అయిన అయోధ్యా నగరము ఇదే.

[13/11, 11:25 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 214* 


సీతా దేవి అగ్నిలోకి ప్రవేశిస్తోంది.....


అప్పుడు మహేశ్వరుడూ బ్రహ్మదేవుడూ దేవేంద్రుడూ దిక్పాలకులూ దివ్యరథాలపై ప్రత్యక్షం అయ్యారు. మ్రొక్కి నిలుచున్న రాముణ్ని చూసి - 


"శ్రీరామచంద్రా నీవు చరాచర సృష్టికర్తవు. ఈ విశ్వాన్ని సృష్టించి, రక్షించి, ప్రళయం చేసే భగవంతుడివి.


రావణ వధార్ధము మనుష్యుడుగా మా ప్రార్ధనలపై అవతరించిన పరమాత్మవు. 

నీ విభూతి సర్వవ్యాప్తమైనది.


"అష్ట వసువులలో ప్రజాపతి అయిన "ఋతుధాముడనేవసువు నీవు. 

ఏకాదశ రుద్రులలో ఎనమిదవవాడైన మహాదేవుడవు నీవు. 

సాధ్యులలో అయిదవవాడైన "వీర్యవంతుడివి" నీవు. 

అశ్వినీదేవతలు నీ రెండు చెవులు. సూర్యచంద్రులు నీ రెండు కళ్లు. 

నీవు ఆది మధ్యాంత రహితుడవు.


అటువంటి అవతారపురుషుడివి, *ఏమి తెలియని ప్రాకృత పురుషుని వలె* లోకమాత అయిన సీతాదేవిని అనుమానించి అగ్నిలో పడుటకు అనుమతించుట న్యాయమా?” అని ప్రశ్నించారు.

పామరుడుగా సీతాదేవిని ఉపేక్షిస్తావేమిటి ప్రభూ! అని ముక్తకంఠంతో పలికారు.


రాముడు ఆశ్చర్యపోయాడు. బ్రహ్మరుద్రాదిదేవతలారా !


*ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్* |

*యోఽహం యస్య యతశ్చాహం భగవాన్ తద్బ్రవీతుమే*


అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ దేవతలతో, "నన్ను సకల సృష్టికర్తనని ప్రశంసిస్తున్నారు. నేను దశరధ పుత్రుడను. రామచంద్రుడను. ఒక మానవ మాత్రుడినే అని అనుకొంటున్నాను” అని పలికాడు...


ఈ ప్రశ్నకు సమాధానం గా బ్రహ్మదేవుడు శ్రీరాముని నారాయణత్వాన్ని తెలిపాడు.


*సీతా లక్ష్మీర్భవాన్ విష్ణు: దేవః కృష్ణః ప్రజాపతిః* | *వధార్థం రావణ స్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్*


"రామభద్రా! 

నీవే శ్రీమన్నారాయణుడివి. 

శ్రియఃపతివి. 

శంఖ చక్రగదా ధారివి. 

నీవే ఆది వరాహస్వామివి. 

నీవే ఆనందానికి మూల స్వరూపుడివి. 

నీవే బలానికి మూల స్వరూపము.


నీవే దేవతాసేనానివి. 

నీవే నిరతిశయ సంపన్నుడైన మహేంద్రుడివి నీవే. 

కామక్రోధాది అంతశ్శత్రువులను అణిచేవాడివి నీవు. 

నా జన్మకు కారణమైన పద్మనాభుడివి నీవే. మా అందరికి రక్షణోపాయము నీవే. రక్షించేవాడివి నీవు.


నీవే యజ్ఞము. 

ఓంకార వషట్కారాలు నీవే. 

సహస్ర శిరములు సహస్ర చరణములు, సహస్ర భుజములు గల విరాట్పురుషుడివి నీవే.


ప్రళయకాలంలో ప్రకృతి, జీవులను నీ కడుపులో దాచుకొన్న కరుణామయుడివి


రామభద్రా! నేను నీకు హృదయాన్ని, సరస్వతి నీ నాలుక. సమస్తదేవతలునీ వెంట్రుకలు.......


అని బ్రహ్మ ప్రస్తుతి చేసి అవతార రహస్యాన్ని బయలు పరచాడు ......

*ఇమ మార్షం స్తవం నిత్య మితిహాసం పురాతనం* 

*యే నరాః కీర్తయిష్యన్తి నాస్తి తేషాం పరాభవః*

*

[యుద్ద కాండ 120 వ సర్గ బ్రహ్మ కృత శ్రీరామ స్తుతి గా ప్రసిద్ధి.

చాలా ఫలవంతమైన స్తోత్రం.


*ఇమ మార్షం స్తవం నిత్య మితిహాసం పురాతనమ్, యే నరాః కీర్తయిష్యన్తి నాస్తి తేషాం పరాభవః*


ఈ స్తుతి వేదం ఎవరు నిత్యం కీర్తిస్తారో ఎప్పటికీ పరాభావాన్ని పొందరు.]


** 

బ్రహ్మ శ్రీరాముణ్ణి స్తుతించడం పూర్తి అయింది.


*అబ్రవీత్తు తదా రామం సాక్షీ లోకస్య పావకః* |

*ఏషా తే రామ వైదేహీ పాపమస్యాం న విద్యతే*

సీతాదేవిని ఒడిలో కూర్చుండబెట్టుకొని అగ్ని దేవుడు చితాగ్నికుండంనుంచి లేచాడు. సీతాదేవిని రాఘవునికి సమర్పించాడు.


రామభద్రా ! ఈ సీతాదేవి పవిత్రురాలు. రావణుడు అపహరించుకొనిపోయి ఎంతగా ప్రలోభపెట్టినా ఎంతగా భయపెట్టినా చలించక మనోవాక్కాయకర్మలతో నిన్నే నమ్మి నీ రాకకోసమే ప్రతీక్షిస్తూ ఉపవాసదీక్షతో కాలం గడిపింది. ఈ పవిత్రురాలిని ఈ కళంకరహితను స్వీకరించు. ఇక చెప్పవలసింది ఏమీ లేదు. 

నేను ఆజ్ఞాపిస్తున్నాను. స్వీకరించు.

*న కిమ్చిరభిధాతవ్యా అహమాఙ్ఞాపయామి తే*


సాక్షాత్తుగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై సకలదేవతల సమక్షంలో వానర రాక్షస మహాసమూహం ఎదుట - ఇలా సీతాదేవి పాతివ్రత్యాన్నీ సౌశీల్యాన్నీ వేనోళ్ళ కొనియాడి సమర్పించగా రాఘవుడు సంబరపడి ఇలా అన్నాడు.


పావకా! ముల్లోకాలలోనూ సీతాదేవియే పరమపవిత్రురాలని నేను ఎరుగుదును. కాకపోతే రావణాంతఃపురంలో చిరకాలం నివసించింది. రాముడు కామాతురుడై పునర్గ్రహించాడు అని లోకం అనుకుంటుంది. సీత మనసు నాకు తెలుసు. అనన్యహృదయ. మానసికంగా మేము ఎడబాటు ఎరగం. ఐనా- ముల్లోకాలకూ సీతాదేవి శీలం విషయంలో నమ్మకం కలగడానికే నేను ఉపేక్షించి ఊరుకున్నాను. అగ్నిలో ప్రవేశిస్తున్నప్పటికీ వారించలేదు. 

*ప్రత్యయార్థం తు లోకానాం త్రయాణాం సత్యసమ్శ్రయః* |

*ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనమ్*


పాతివ్రత్యశక్తితో తనను తాను సంరక్షించుకోగల ఈ సీతాదేవిని రావణుడు ఏమీ చెయ్యలేడనీ, అగ్నిలో మిడతలాగా మాడిపోతాడనీ నేను ఎరుగుదును. ఇంతటి పవిత్రురాలూ భక్తురాలూ అయిన జానకిని పరిగ్రహిస్తున్నాను.


మహేశ్వరుడు.... మాట్లాడుతూ, రామచంద్రా! అదృష్టవశాత్తూ అంతా సుఖాంతం అయ్యింది. ఇక బయలుదేరు. భరతుణ్ని ఓదార్చి ముగ్గురు తల్లులకూ ఆనందం కలిగించి సర్వజనులకూ ఆహ్లాదకరంగా రాజ్యపాలన సాగించు. యజ్ఞ యాగాదులతో దేవతలను సంతోషపెట్టు. ఇదిగో మీ తండ్రి దశరథుడు. మీ అన్నదమ్ముల వీరోచిత కృత్యాలవలన మీ తండ్రికి ఇంద్రలోకం ప్రాప్తించింది. దివ్యవిమానంమీద వెలిగిపోతున్నాడు. దర్శించండి అన్నాడు.


రామలక్ష్మణులకు దశరథ మహారాజు సూర్యుడిలా వెలిగిపోతూ కనిపించాడు. ఆశ్చర్యానందాలతో నమస్కరించారు. దశరథుడు ఇద్దరినీ కౌగిలించుకొని శౌర్యప్రతాపాలకూ అన్యోన్యతకూ శీలసంపదకూ చాలా ఆనందంగా ఉంది. వనవాసంనుంచి తిరిగి వచ్చిన నిన్ను చూడబోతున్న కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, అయోధ్యాపౌరులూ అందరూ ధన్యులు. అలనాటి కైకేయి మాటలు నన్ను ఇప్పటికీ బాధిస్తూనే ఉన్నాయి. 

*కైకేయా యాని చోక్తాని వాక్యాని వదతాం వర* |

*తవ ప్రవ్రజనార్థాని స్థితాని హృదయే మమ*

ఆ బాధ ఇప్పుడు తీరిపోయింది. రావణుణ్ని సంహరించి లోకాలన్నింటికీ మేలుచేసావు.


లక్ష్మణుడినీ సీతనూ ప్రత్యేకించి మెచ్చుకొని ఆశీర్వదించి దశరథుడు వెళ్ళిపోయాడు. 


దేవేంద్రుడు - రామభద్రా! నీవు సాధించిన ఘనకార్యానికీ, ముల్లోకాలకూ ప్రసాదించిన శాంతిసౌఖ్యాలకూ నా మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది. నీవు ఏమి కోరుకుంటావో చెప్పు. అది నెరవేరుస్తాను అన్నాడు.


*మమ హేతోః పరాక్రాంతా యే గతా యమసాదనమ్* । *తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్ఠంతు వానరాః* ॥


దేవేంద్రా ! నీవు అడిగావు కాబట్టి చెబుతున్నాను. నాది ఒక్కటే కోరిక. యుద్ధరంగంలో నాకోసం పరాక్రమించి నా పక్షాన పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరులందరినీ బ్రతికించు.


ఈ ఋక్ష వానర వీరులంతా భార్యాపుత్రులను విడిచి నాకోసం యుద్ధరంగానికి తరలి వచ్చారు. మృత్యువును కూడా లెక్కించకుండా నా హితం కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడారు. వీరంతా గాయాలు మానిపోయి ఆరోగ్యవంతులు అవ్వడం నేను కోరుతున్నాను. ఈ మహావీరులు ఎక్కడ నివసిస్తే అక్కడల్లా ఆ గిరికాననాలు ఫలపుష్పజలసంపత్తితో అకాలంలో కూడా విరాజిల్లేట్టు అనుగ్రహించు.


దేవేంద్రుడు ఈ మూడు కోరికలూ క్షణంలో తీర్చాడు. ఇక ఈ ఋక్షవానరులను వీడ్కొలిపి అయోధ్యకు తరలివెళ్ళు. మున్ముందుగా ఈ సీతాదేవిని ఓదార్చు. అక్కడ భరత శత్రుఘ్నులకూ ముగ్గురు తల్లులకూ పౌరజానపదులకూ ఆనందం పంచు. ఈ మాటలు పలుకుతూనే దేవతలు నిష్క్రమించారు.


శ్రీరాముడు ఆ రాత్రి సుఖంగా ప్రశాంతంగా నిద్రించాడు......

[13/11, 11:29 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 46 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


అమరావతిని స్వాధీనం చేసుకొని ఇంద్రుడు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. పూర్వం ‘మా ఐశ్వర్యం అంతా మీది’ అని ఒక మాట అన్నాడు. ‘మహానుభావా! మీ వలననే మరల నేను ఈ అమరావతిని పొందాను. ఈ ఐశ్వర్యం అంతా మీదే. మీరు ఈ ఐశ్వర్యమును అనుభవించవచ్చు’ అన్నాడు. తనవలన శిష్యుడు అంత ఐశ్వర్యమును పొందాడని, వాని ఐశ్వర్యమును పొందే ప్రయత్నమును గురువు చెయ్యడు. విశ్వరూపుడు 'నీ ఐశ్వర్యం నాకెందుకు? నేను అలా పుచ్చుకునే వాడిని కాను. నీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు’ అన్నాడు. విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులను స్వీకరిస్తూ ఉండేవాడు. ఇంద్రాదులకు ఆ హవిస్సులు ఇస్తూ ఉండేవాడు. ఆయన తల్లిగారి పేరు ‘రచన’. ఆవిడ రాక్షస వంశమునకు చెందినది. మేనమామలైన రాక్షసులు వచ్చి ‘నువ్వు మా మేనల్లుడివి. నీవల్ల మేము స్వర్గమును పోగొట్టుకున్నాము. నీవు వెళ్ళి దేవతలకు గురుత్వము వహించావు. ఇంద్రుడికి నీమీద నమ్మకం ఎక్కువ. ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా హవిర్భాగములు పెట్టేస్తూ ఉండు’ అన్నారు.

ఇలా చేయడం తప్పే అందులో సందేహం లేదు. అయితే విశ్వరూపుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? విశ్వరూపుడు తన స్వరూపము ఏమిటో ముందరే చెప్పాడు. ‘నాకు రాగద్వేషములు తెలియవు. నేను అంతటా బ్రహ్మమునే చూస్తాను. ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కున వారిమాట వినేస్తాను’ అని చెప్పాడు. అందుకని వాళ్లకి హవిర్భాగములు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇది ఒకరోజున ఇంద్రుడు గమనించాడు. మరుక్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. వెంటనే తన చేతిలో వున్న చంద్రహాసమును తీసుకొని మహానుభావుడైన విశ్వరూపుని మూడు తలకాయలు తెగిపోయేటట్లు నరికేశాడు. ఆయన మూడు తలకాయలలో ఒక తలకాయతో యజ్ఞవేదిలో సురాపానం చేస్తూ ఉంటాడు. సురాపానం చేసే తల క్రింద పడగానే అది ఆడ పిచ్చుకగా మారిపోయింది. సోమపానం చేసే తలకాయ కౌజు పిట్టగా మారిపోయింది. అన్నం తినే తలకాయ తీతువు పిట్టగా మారిపోయింది. ఇప్పటికీ తీతువు పిట్ట అరిచింది అంటే అమంగళమని అంటారు. ఎందుకు అంటే ఆనాడు ఇంద్రుని వలన బ్రహ్మహత్య జరిగింది. ఎవరిని గురువుగా పెట్టుకున్నాడో ఆ గురువు తల కోసేశాడు. అలా కోసేసినపుడు పడిపోయిన తలకాయే తీతువు పిట్ట అయింది. దాని కూత వినపడితే అమంగళము. అది ఒక్క కృష్ణ స్మరణ చేత మాత్రమే పోతుంది. తీతువు పిట్ట అరిచినపుడు కృష్ణ స్మరణ చేస్తూ ఉంటారు.

ఈవిధంగా తెగిపడిన విశ్వరూపుని మూడు తలలు మూడు పిట్టలయ్యాయి. ఈ మూడు పిట్టలు కూస్తూ ఇంద్రుని వెంటపడ్డాయి. ఆ ఘోరమయిన కూతలను వినలేక ఏడాదిపాటు భరించాడు. బ్రహ్మ హత్యాపాతకం వలన అతనికి మనశ్శాంతి పోయింది. దీనిని ఎవరికయినా ఇచ్చివేయాలి. ఎవరు పుచ్చుకుంటారు? ఆ రోజులలో ఇంద్రుని మాట కాదనలేక బ్రహ్మ హత్యాపాతకమును పుచుకోవడానికి నలుగురు ఒప్పుకున్నారు. అవి భూమి, చెట్లు, జలము, స్త్రీలు. ఈ నలుగురు పావు వంతు చొప్పున పుచ్చుకున్నారు. తీసుకొన్నందుకు గాను తమకు వరముల నిమ్మని ఇంద్రుని అడిగారు. ఇంద్రుడు వాటికి వరములు ఇచ్చాడు. భూమికి ‘ఎవరయినా గొయ్యి తీసినా ఆ గొయ్యి కొంత కాలమునకు తనంత తాను పూడుకుపోతుంది’ అని, చెట్లకు ‘ఎవరయినా చెట్లను కత్తితో నరికేసినా మొదలు ఉంటే చాలు మరల చిగురించేలా ‘ఏ పనిచేసినా ప్రక్షాళనము అనబడే మాట దానియందు ప్రయోగింప బడదు. మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువును ముట్టుకుని ఒక కాగితమునకు తుడుచు కున్నారనుకోండి అది ప్రక్షాళనము అనరు. నీటి చుక్క ముట్టుకున్నట్లయితే వెంటనే ప్రక్షాళనము అయిపోతుంది. మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోని పువ్వులు ఈశ్వరుడి పాదముల మీద వేస్తే ఒక చుక్క నీరు చేతిలో వేస్తే చెయ్యి తుడుచుకుంటాము. ఒక్క చుక్కయినా చాలు. ప్రక్షాళన చేయగలిగే శక్తి నీటికి ఇచ్చాడు. కామోప భోగములందు ఎక్కువ సుఖము కలిగేటట్లు స్త్రీలకి వరం ఇచ్చాడు. ఈవిధంగా నలుగురుకి నాలుగు వరములు ఇచ్చాడు.

ముందు భూమి పుచ్చుకున్నది. ఊసర క్షేత్రములు వచ్చాయి. ఉప్పుతో కూడిన పంటలు పండని ఇసుక పర్రలు ఏర్పడ్డాయి. దానిమీద మొక్క మొలవదు. చెట్టు పుచ్చుకుంది. చెట్టులోంచి జిగురు కారుతుంది. అందుకే చెట్టు జిగురు వికారమును స్పృశించకూడదు అంటారు. నీటియందు బుడగగాని, నురుగు కాని ఉంటే అది బ్రహ్మహత్యా పాతక రూపం. ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగగాని, నీటియందు నురుగు కాని ఉంటే ఆ నీళ్ళని పక్కకి వదిలి పెట్టేస్తారు. కొత్తగా ప్రవాహం వచ్చేముందు పెద్ద పెద్ద నురుగు వస్తుంది. దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ, ఆ నురుగు ముట్టుకోవడం కానీ చెయ్యరు. స్త్రీలయందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యా పాతక రూపం. వారియందు ఆ నియమం ఉంచారు. ఇంద్రుడు తన బ్రహ్మ హత్యాపాతకమునుండి నివారణ పొంది మరల సింహాసనాదిష్టుడు అయ్యాడు. ఒకనాడు బృహస్పతి సభలోకి వచ్చినపుడు లేవనందుకు సంభవించిన పాపం ఇప్పటికీ తను సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీల్లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని వెనుక మరొకటి తీసుకు వస్తున్నది.

విశ్వరూపుడు మరణించాడని త్వష్ట ప్రజాపతికి తెలిసి కోపముతో ఒక పెద్ద యజ్ఞం మొదలు పెట్టాడు. ఇంద్రుడిని సంహరించే వేరొక కొడుకు ఆ యజ్ఞంలోంచి రావాలని అన్నాడు. యజ్ఞం పరిసమాప్తము అవుతుండగా ఒక బ్రహ్మాండమయిన రూపము ఆ యజ్ఞ గుండంలోంచి బయటకు వచ్చింది. ఆ యజ్ఞగుండంలోంచి బయటకు వచ్చిన రూపమునకు పేరు తండ్రిగారు పెట్టలేదు.అది పుట్టీ పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండము ఎంతవరకు ఉన్నదో అంతవరకూ వ్యాపించి నిండిపోయింది దానికి ‘వృతాసురుడు’ అని పిలిచారు. ఆయన తలకాయను నరకడానికి ఇంద్రునికి ఒక ఏడాదికాలం పట్టింది. వజ్రాయుధంతో ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఒక ఏడాదిపాటు నరికాడు. కోస్తే ఉత్తరాయణ, దక్షిణాయన మధ్య కాలానికి కోయడం పూర్తయింది. అతడు పుడుతూనే ఆకాశం అంతటిని నోట్లో పెట్టుకుని చప్పరించాడు. ఆ తరువాత అది ఏమయినా రుచిగా ఉంటుందేమోనని ఒక్కొక్క గ్రహమును నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. అలా గ్రహములను, నక్షత్రములను, బ్రహ్మాండములను, అన్నింటినీ చేత్తో పట్టుకుని వాటిని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. వాడు పుడుతూనే ‘ఇంద్రుడనేవాడు ఉండాలి. ఎక్కడ ఉంటాడని అడిగాడు. వాడు తనని చంపడానికి వచ్చేస్తున్నాడని ఇంద్రుడికి తెలిసిపోయింది. ఇంద్రుడు సైన్యం అంతటినీ తీసుకుని యుద్ధమునకు వెళ్ళాడు. వీరు వేసిన అస్త్రములను తన గుప్పెటతో పట్టుకుని నోట్లో వేసుకుని చప్పరించేశాడు. ఇంకా వానితో యుద్ధం లాభం లేదని, ముందు బతికితే చాలనుకుని దేవతలందరూ పారిపోవడానికి నిశ్చయించుకున్నారు. శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠ ద్వారం వద్దకు వెళ్ళి నిలబడి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆయనకు ఆర్తత్రాణ పరాయణుడని బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పుచేశాడా, ఒప్పు చేశాడా అని చూడడు. గభాలున వచ్చి దర్శనం ఇచ్చి రక్షిస్తారు. తనను నమ్మినవారి పట్ల అలా ప్రవర్తిస్తారు. స్వామి దర్శనం ఇచ్చి ‘మీరేమీ బెంగ పెట్టుకోకండి. భయపడకండి’ అని అభయ ప్రకటన చేశారు. వీరందరూ స్వామిని స్తోత్రం చేశారు.

వెంటనే స్వామి పోనీలెండి మీరేమీ బెంగ పెట్టుకోకండి వృతాసురుణ్ణి సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అనలేదు. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది. అంటే ఎక్కడో మనస్సులో వాళ్ళ పట్ల చులకన భావం ఉన్నది. మనం పలుమార్లు వాళ్ళను తెచ్చుకోవచ్చు. ఎలాగయినా వాడుకోవచ్చు అనే భావన ఒకటి మనసులో మెదలుతోంది. ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి. గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలి అనుకుని ‘మిమ్మల్ని రక్షించడానికి మీకు అస్త్ర శస్త్రములు పోయాయి కదా! వృతాసురుణ్ణి సంహరించడానికి కావలసిన ఆయుధమును ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే దధీచి మహర్షి. మీకు కావలసిన ఆయుధం ఆయన శరీరం నుండి వస్తుంది. ఆయన నిరంతరం నారాయణ కవచమును పారాయణం చేశాడు. ఆయన వద్దకు వెళ్ళి ‘మీ శరీరము ఇవ్వండి అని అడగండి. ఆయన బ్రహ్మజ్ఞాని. తన శరీరమును ఇచ్చేస్తాడు. ఆయన శరీరము ఇచ్చిన తరువాత ఆయన శరీరమును కోసివేయండి. లోపల ఉన్న ఎముకలను పైకితీసి మూట కట్టుకుని పట్టుకు వెళ్ళి విశ్వకర్మకు ఇవ్వండి విశ్వకర్మ ఆ ఎముకలలోంచి నూరు అంచులు కలిగిన వజ్రాయుధమును తయారుచేస్తాడు. దానితో వృతాసురుడు సంహరింప బడతాడు. అందుకని వెళ్ళి దధీచిని ప్రార్థించండి అని చెప్పాడు. గతంలో త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుని సంహరించడం వల్ల తనకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. వృత్రాసురుని సంహరించడం వలన మళ్ళీ తనకు ఏమి కీడు మూడుతుందో అన్న ఆలోచన ఇంద్రునికి కలిగింది. ఈవిషయము దేవతలకు చెప్పాడు. ఇంద్రునిలో కొంచెం పాప పుణ్యముల విచారణ ప్రారంభం అయింది. దేవతలు ‘మేము నీచేత అశ్వమేధ యాగమును చేయించి ఎలాగోలాగ నీవు బ్రహ్మహత్యాపాతకము నుండి విముక్తుడవయ్యేలా చూస్తాము. ముందు వెళ్ళి దధీచి శరీరమును అడగవలసినది’ అని చెప్పారు. పరుగెత్తుకుంటూ దేవతలను తీసుకుని దధీచి దగ్గరకు వెళ్ళాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[13/11, 11:29 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 47 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఇంద్రుడు దధీచి దగ్గరకు వెళ్ళి ‘నేను ఇంద్రుడనని చాలా గొప్పవాడిననే అహంభావంతో మా గురువుగారు సభలోకి వచ్చినపుడు లేవకుండా కూర్చుని ఆయనకు అపచారం చేశాను. ఈవేళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా! నేను దేహంతో ఉండడానికి దేహీ, అని అభ్యర్ధిస్తున్నాను. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నేను బ్రతికి ఉండడానికి దయచేసి ‘మీ దేహమును నాకీయవలసినది. ఇంతకన్న నేను ఏమి అడగను. ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయాను’ అని ఇంతటి ఇంద్రుడు తలదించుకుని అడిగాడు.

దధీచి గొప్పతనం ఏమిటంటే ఆయన ఇంతకుముందు రెండుమార్లు చచ్చిపోయాడు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్వనీ దేవతలు వచ్చి ‘మీరు మాకు ‘అశ్వశిరము’ అనే మంత్రమును ఉపదేశం చెయ్యాలండి' అన్నారు. దధీచి ఇపుడు నేను ఒకయాగం చేసుకుంటున్నాను. అది పూర్తయిపోయిన తరువాత తప్పకుండా ఉపదేశం చేస్తాను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇంద్రుడు దధీచి దగ్గరకు వచ్చి మీరు ఆ విద్య అశ్వనీ దేవతలకు చెప్పినట్లయితే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. తరువాత మరల అశ్వనీ దేవతలు వచ్చారు. దధీచి నేను మీకు ఆ మంత్రమును ఉపదేశించినట్లయితే ఇంద్రుడు నన్ను చంపేస్తానన్నాడు ఎలాగ? అన్నాడు అశ్వనీ దేవతలు ‘నీవు మాకు విద్య ఉపదేశం చేసావని చెప్పగానే ముందు వెనుక చూడకుండా ఇంద్రుడు నీ కంఠమును కోసేస్తాడు. ఆ పనేదో మేమే చేసేస్తాము. ఒక గుఱ్ఱం తలకాయ తీసుకు వచ్చి నీకు పెట్టేస్తాము. ఆ విద్య పేరు ఎలాగు అశ్వశిరము కదా. నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పెయ్యి. ఇంద్రుడు వచ్చి కోపంతో ముందు వెనుక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు. మేము ఆ గుర్రం తలకాయ తీసివేసి అసలు తలకాయ పెట్టేస్తాము అన్నారు.

గురువు అంటే ఎలా ఉంటాడో ఎంత స్వార్థ త్యాగంతో ఉన్నాడన్నది చూడాలి. దధీచి నరికెయ్యండి అన్నాడు. వెంటనే వారు దధీచి కంఠం నరికేసి ఒక గుఱ్ఱం తలకాయను తెచ్చి అతికించారు. ఇంద్రుడు వచ్చి మరల తలకాయ నరికేశాడు. వీళ్ళు ఆ గుర్రం తలకాయను ప్రక్కన పెట్టి దధీచికి మామూలు తలను పెట్టేశారు. ఆయన ప్రాణంతోనే ఉన్నాడు. బ్రహ్మహత్యాపాతకం రాలేదు. దధీచి ద్విజుడు. మహాపురుషుని దగ్గరకు వెళ్ళి ఈమాట అడిగితే ఆయన వీళ్ళను చూసి ఒక చిరునవ్వు నవ్వి 'నేను ప్రపంచములో కోర్కెలను అడిగిన వారిని చూశాను. మీరు నా శరీరమును అడుగుతున్నారు. ఇలా అడగడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు బ్రతకడానికి ఇంకొకరిని చంపుతారా? ఇలా అడగవచ్చునా? అన్నారు. అంటే వాళ్ళు ‘ మాకు ఇంతకన్న వేరు మార్గం లేదు. మిమ్మల్ని వేడుకుంటున్నాము. మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ఈ ప్రపంచమునందు వేరొకరు లేరు అన్నారు.

దధీచి 'ఈ శరీరము నేను కాదు. నేను ఆత్మని. మీకు శరీరము కావాలి తీసుకోమని చెప్పి యోగవిద్యతో తనలో ఉన్న ప్రాణవాయువును పైకిలేపి అనంతములో కలిపేసి శరీరమును కిందపడగొట్టేశాడు. వీళ్ళందరూ ఆ శరీరము కోసి అందులోని ఎముకలను తీసుకొని విశ్వకర్మకు ఇచ్చారు. అందులోంచి విశ్వకర్మ నూరు అంచులు కలిగిన వజ్రాయుధమును తయారు చేశాడు.

ఈలోగా వృత్రాసురుడు లోకములన్నింటిని గడగడలాడించేస్తున్నాడు. ఇంద్రుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధమును చేతిలో పట్టుకుని ఐరావతమునెక్కి తన సైన్యమునంతటిని తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. వృత్రాసురుడితో యుద్ధం చేశాడు. వృత్రాసురుడు 'ఇంద్రా !నేను ఈ విశ్వమంతా నిండిపోయి ఉండి నీవేమి చేస్తున్నావో చూస్తూనే ఉన్నాను. నువ్వు శ్రీమన్నారాయణ దర్శనము చేసుకుని, దధీచి ఎముకలు పట్టుకుని దానితో వజ్రాయుధం చేయించుకుని నన్ను చంపడానికి వచ్చావు. నేను నీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకంటే నీకు శ్రీమన్నారాయణుడి అండ ఉన్నది. వజ్రాయుధానికి నేను చచ్చిపోతానని స్వామి చెప్పారు. ఆయన వాక్కుకు తిరుగులేదు. నేను చచ్చిపోతానన్న భయం లేదు. నాకు ఎప్పటికయినా భగవంతుని సేవ చేసి భగవద్వాక్యములు చెప్పే వారితో కూడిక కావాలి. నేను శ్రీమన్నారాయణుని పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్న వాడిని. తొందరగా నీ వజ్రాయుధమును నామీద ప్రయోగించి నన్ను తుదముట్టించు’ అన్నాడు.

వాని మాటలకు ఇంద్రుడు ఆశ్చర్యపోయి ‘నిన్ను చూస్తుంటే నాకు నారాయణునే చూస్తున్నట్లు ఉంది నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. నీవు రాక్షసుడవు ఏమిటి, నీకు యుద్ధం ఏమిటి’ అని అడిగాడు. ఆయన ‘ధర్మము ధర్మమే. నీవు మా అన్నయ్యను చంపేశావు. చచ్చిపోయేవరకు నీతో యుద్ధం చేస్తాను' అని ఒక శూలం తీసి ఐరావతం తలమీద కొట్టాడు. ఆ దెబ్బకు తలబద్దలై నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్లు ఇంద్రుని చెంపమీద కొట్టాడు. ఆ దెబ్బకు తల గిర్రున తిరిగి ఇంద్రుడు తన చేతిలో వున్న వజ్రాయుధమును క్రింద పడేశాడు. అది భూమిమీద పడిపోయింది. ఇంద్రా! వజ్రాయుధమును తీసుకుని నాతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. నిజంగా ఆ వృత్రాసురుడు ఎంతో ధర్మాత్ముడు. ఇంద్రుడు అనుమాన పడుతూనే వజ్రాయుధాన్ని చేతితో పట్టుకుని ఆయన రెండు చేతులు నరికేశాడు. అలాగే వాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ దగ్గరకు వచ్చి నోటితో ఉఫ్ అన్నాడు. ఆ గాలికి ఇంద్రుడు, ఇంద్రుని ఐరావతము అన్నీ కలిసి ఆయన నోట్లోకి వెళ్ళిపోయాయి. గుటుక్కున మింగేశాడు. వృత్రాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇంతకు పూర్వం విశ్వరూపుని దగ్గర నారాయణ కవచం పొందాడు. ఆ నారాయణ కవచ స్మరణం చేత, వైష్ణవీ విద్య చేత అతడు వృత్రుని కడుపులోకి వెళ్ళిపోయినా జీర్ణము కాలేదు. వృత్రాసురుని కడుపులో ఉండిపోయి వజ్రాయుధంతో ఆయన కడుపు కత్తిరించి బయటకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఒక సంవత్సరం పాటు ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ వజ్రాయుధంతో ఆయన కంఠమును కత్తిరించాడు. ఉత్తరాయణ దక్షిణాయనముల సంధికాలంలో వృత్రాసురుని శిరస్సు దుళ్ళి క్రింద పడిపోయింది. వృత్రాసురుడు రాక్షసుడే కానీ పోతనగారు అన్నారు –

అఖిల దుఃఖైక సంహారాది కారణం; బఖిలార్థ సంచ యాహ్లాదకరము

విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం; బనుపమ భక్త వర్ణనరతంబు

విబుధహర్షానేక విజయ సంయుక్తంబు; గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు

బ్రహ్మహత్యానేక పాపనిస్తరణంబు; గమనీయ సజ్జన కాంక్షితంబు

నైన యీ యితిహాసంబు నధిక భక్తి, వినినఁ జదివిన వ్రాసిన ననుదినంబు

నాయు రారోగ్య విజయ భాగ్యాభివృద్ధి, కర్మనాశము సుగతియుఁ గల్గు ననఘ!

ఎవరికయినా విశేషమయిన కష్టములు, బ్రహ్మహత్యాపాతకం వంటి కష్టములు వస్తే వృత్రాసుర వధలో వున్న పద్యములను, వచనములను కూర్చుని ఒక పుస్తకములో వ్రాస్తే చాలు వాళ్ళ కష్టములు పోతాయి. చెపితే చాలు కష్టములు పోతాయి. ఎంతటి మహాపాపము తరుముకు వస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు ఆ పాపములన్నీ పోతాయి.

ఇదంతా విని పరీక్షిత్తు ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పటివరకు నీవు నాకు ఎన్నో విషయములు చెప్పావు. ఇలాంటి రాక్షసుని గురించి నేను వినలేదు. ఏమి ఆశ్చర్యము! నన్ను తొందరగా చంపెయ్యి – నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతానన్న రాక్షసుడిని ఇంతవరకు నేను చూడలేదు. ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది? ఇంతజ్ఞానం ఎలా కలిగింది? నాకు చెప్పు నా మనస్సు ఆత్రుత పడిపోతోంది అన్నాడు. మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...

instagram.com/pravachana_chakravarthy

[13/11, 11:29 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 48 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


3. చిత్రకేతూపాఖ్యానం:

పూర్వకాలంలో చిత్రకేతువు అనే మహారాజుగారు ఉండేవారు. ఆయన శూరసేన దేశమును ఏలుతూ ఉండేవాడు. ఆయనకు అనేకమంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడి చిత్రకేతువు రాజ్యపరిపాలన చేస్తున్నాడు. నిరంతరం మనస్సులో ఒక్కటే శోకం. ఆయనకు సంతానం లేదు. ఆయన పెద్ద భార్య పేరు ‘కృతద్యుతి’. ఒకరోజున ఆయన వద్దకు అంగీరస మహర్షి వచ్చారు. ఆయన స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. అంగీరస మహర్షి – ‘ఇంతమంది భార్యలు ఉన్నారు, ఐశ్వర్యం ఉన్నది. ఇంత పెద్ద సామ్రాజ్యం ఉన్నది. నీ ముఖంలో కాంతి లేదు. నీవు దేనిని గురించి బెంగ పెట్టుకున్నావు’ అని అడిగారు. చిత్రకేతువు ‘మహానుభావా! మీరు త్రికాలజ్ఞులు. మీరు సర్వము తెలుసుకోగలరు’ అన్నాడు. అంగీరస మహర్షి ‘నాకు అర్థం అయింది. నీకు పిల్లలు లేరు. అందుకు కదా బాధపడుతున్నావు. నీచేత పుత్రకామేష్టి చేయిస్తాను. నీకు బిడ్డలు కలుగుతారు’ అని పుత్రకామేష్టి చేయించి యజ్ఞ పాత్రలో మిగిలిపోయిన హవిస్సును నీ పెద్ద భార్యచేత తినిపించు. నీకు యోగ్యుడయిన కుమారుడు కలుగుతాడు. వాడివలన నీవు సుఖదుఃఖములు పొందుతావు’ అని చెప్పాడు.

రాజు యజ్ఞపాత్ర తీసుకువెళ్ళి పెద్దభార్యకు ఇచ్చాడు. ఆవిడ దానిని స్వీకరించి గర్భాన్ని ధరించి ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంక రాజు పరవశించి పోయాడు. అర్బుదముల బంగారమును దానం చేశాడు. రాజ్యం అంతా సంతోషంగా ఉన్నది. ఒకరోజు రాత్రి పెద్దభార్య కుమారుని పెట్టుకుని నిద్రపోతోంది. మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది. ‘మనకందరికీ పిల్లలు లేరు కాబట్టి రాజు ఇప్పటివరకు మనందరితోటి సమానంగా ఉన్నారు. ఆవిడకి పిల్లవాడు పుట్టాడు కాబట్టి కృతద్యుతి మందిరానికే వెళుతున్నాడు. ఆవిడకి ఈ ఆదరణ పోవాలంటే ఆ పిల్లవాడిని చంపేయాలి’ అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవానికి మెల్లగా విషాహారాన్ని పెట్టేశారు. మరునాడు ఉదయం చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించి ఉన్నాడు. ఆ పిల్లవాని పాదముల వద్ద కూర్చుని తాను ప్రభువుననే విషయమును కూడా మర్చిపోయి ఏడుస్తున్నాడు.

అంగీరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదునితో కలిసి వచ్చారు. వారు వచ్చేసరికి రాజు ఏడుస్తున్నాడు. ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగీరస మహర్షిని మరచిపోయాడు. అంగీరస మహర్షి ‘రాజా ఎందుకు ఏడుస్తునావు?’ అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయి ‘కొడుకు చచ్చిపోయినందుకు ఏడుస్తున్నాను’ అన్నాడు. అంగీరసుడు ‘నువ్వు ఇప్పుడు నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా. నేను ఇంతకుపూర్వం నీకు కొడుకు పుట్టడం కోసం నీచేత యజ్ఞం చేయించాను. నీకు ఈ కొడుకు లేడు. అంతకుముందు నీకు కొడుకు లేనపుడు నీవు సుఖంగా ఉండేవాడివి. ఈ కొడుకు మధ్యలో వచ్చాడు. మధ్యలో వెళ్ళిపోయాడు. చిత్రకేతూ, మనుష్యుల జీవితములు ఎలా ఉంటాయో తెలుసా? నీకు ఒక విషయం చెపుతాను. ‘ఈ శరీరమును చూసి అనేకమయిన అనుబంధములను పెట్టుకుంటారు. అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు. కానీ లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. రాజా! అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుని ఒక్కనితోటే. అదిలేక నీ కొడుకుతో పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగడం లేదని సుఖదుఃఖకారణమైన కొడుకును నీకు ఇచ్చాను. చూశావా – వాడే సుఖం, దుఃఖం ఇచ్చాడు. నీకు మాయయందు తగులుకునే స్వభావం ఉన్నది. దానివలన నీవు సుఖదుఃఖములను పొందుతున్నావు’. అపుడు నారదుడు ‘నాకొడుకు పోయాడు అని అంటున్నావు కదా! నీ కొడుకును బ్రతికిస్తాను. వరం ఇస్తాను. వాడు అంగీకరిస్తాడేమో చూద్దువు కాని వాడిచేత మాట్లాడిస్తాను’ అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి తెచ్చాడు. నువ్వు వెళ్ళిపోవడం వల్ల నీ శరీరమునకు తల్లిని, తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. ఓ జీవుడా నువ్వు నీ శరీరము నందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయంతో సింహాసనమును అధిష్ఠించి నీ తల్లిదండ్రులకు ఆనందమును కలిగించు’ అన్నాడు. జీవుడు వెనక్కి వచ్చి తండ్రివంక చూసి భ్రుకుటి ముడివేసి ‘నేను ఈ శరీరము వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ శరీరమునకు వారు తల్లిదండ్రులు. నా కర్మ వల్ల నేను ఇప్పటికి ఎన్ని కోట్లమంది తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టానో! వాళ్ళలో వీరొకరు’. ఈమాట విని చిత్రకేతువు ఇంతవరకు వీడు నాకొడుకు నాకొడుకని అనుకున్నాను. ఇదా వీడు మాట్లాడడమని వెనక్కి పడిపోయాడు. చిత్రకేతుడు అసలు విషయం అర్థం చేసుకుని ‘ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. వాడు అలా మాట్లాడిన తరువాత నాకు తత్త్వం అంటే ఏమిటో తెలిసింది’ అన్నాడు. అంగీరసుడు ‘వానికి సంస్కారం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి రావలసింది. నీకొక మంత్రం చెపుతాను. ఈ శరీరము ఉండగా చేరవలసింది ఈశ్వరుడిని. అనుబంధముల మాయా స్వరూపమని తెలుసుకొని ఈశ్వరుడి పాదములు పట్టుకో. నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ ఉపదేశం చేత ఏడురాత్రులు ఈ మంత్రమును జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుంది’ అన్నారు. ఆయనను నమ్మి చిత్రకేతువు ఏడురాత్రులు, ఏడు పగళ్ళు జపం చేశాడు. అలా జపం చేస్తే ఆయనకి శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునే పాదపీఠియైన ఆదిశేషుడు దర్శనం ఇచ్చాడు. ఆయనను విశేషంగా స్తోత్రం చేశాడు. అలా సోత్రం చేస్తే ఆయన –

ఆదిశేషుడు తన రూపమును భాసింప చేసి ‘నీటియందు బుడగపుట్టినట్లు ఆ బుడగకు అస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్లు బ్రహ్మమునందే నామరూపములయిన మాయచేత జగత్తుగా పరిణమించింది. ఈ తత్త్వము అర్థమవడమే నా దర్శనం కలగడం. ఇపుడు నీవు బ్రహ్మజ్ఞానివి అయిపోయావు’ అన్నాడు. ఆయన ఇచ్చిన ఒకే ఒక వరం ఈయన పాలిటి శాపమయి కూర్చున్నది. అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చి ‘నీవు ఈ విమానంలో ఎక్కడికయినా విహరించు’ అని చెప్పి ఆయన తిరిగి సిద్ధ గణములతో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటే చిత్రకేతుడు ఆయనను స్తోత్రం చేసి తదుపరి విమానమును ఎక్కి అన్ని బ్రహ్మాండములు తిరుగుతూ యక్ష కాంతలతో హరికథలను నాటకములుగా ప్రదర్శనలు చేయిస్తూ లోపల పరమ భక్తి తత్పరుడై ఉండేవాడు. ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతమునకు వెళ్ళాడు. పార్వతీదేవి పెనిమిటి అయిన పరమశివుడు సభలో కూర్చుని ఉండగా నాలుగు వేదములు పురుష రూపమును పొంది వాదించుకుంటున్నాయి. పరబ్రహ్మ తత్త్వం అంటే ఇలా ఉంటుందని అంటున్నారు కదా అంటే కాదు ఇలా ఉంటుంది అని వాదించు కుంటున్నాయి పరబ్రహ్మ తత్త్వాన్ని అర్థం చేసుకోలేక. బ్రహ్మగారు, సనక సనందనాది మహర్షులు అంజలి ఘటించి పరమశివా! మాయందు నీ అనుగ్రహమును ప్రసరింపజేసి మాకు జ్ఞానమును ప్రసాదించమని అడుగుతున్నారు. పార్వతీ పరమేశ్వరులను చూసి పొంగిపోయిన భృంగి నాట్యం చేస్తున్నాడు శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంటారు. అంత పరమపవిత్రమయియన సభలోనికి చిత్రకేతువు తన విమానంలోంచి క్రిందకు దిగాడు. పరమశివుడు పార్వతీ దేవిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకొని చేతితో గాఢాలింగనం చేసుకొని ఉన్నాడు. అది చూసి చిత్రకేతుడు అమ్మవారు వినేటట్లుగా పెద్ద ధ్వనితో నవ్వాడు. అందరూ ఆశ్చర్యపడిపోయి ఒక్కసారి అటు తిరిగి చూశారు.

అంత పెద్ద నవ్వు నవ్వేసరికి పార్వతీ దేవి చూసి ‘నీవు ఎందుకు నవ్వుతున్నావు’ అని అడిగింది. చిత్రకేతుడు అన్నాడు – ‘ఏమీ తెలియని అజ్ఞానికూడా భార్యను కౌగలించు కోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగలించుకుంటాడు. అంతేకానీ ఇంతమంది తాపసులు ఉన్న సభలో, బ్రహ్మగారు నిలబడ్డ సభలో, సనకసనందనాదులు నిలబడ్డ సభలో, సిగ్గులేకుండా ఆచార్యుడనని లోకానికి జ్ఞానమును ఇచ్చేవాడినని జగద్గురువునని లోక రక్షకుడనని అనిపించుకు సర్వమంగళప్రదుడనని అనిపించుకున్న పరమశివుడు ఎడమ తొడమీద భార్యను కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తుండగా భార్యను గాఢాలింగనం చేసుకున్నాడు. ఆ మిథున రూపమును చూస్తే నవ్వు వస్తోంది. ఆయనకు కూడా ఇంత కామ వ్యామోహమా!' అన్నాడు. పార్వతీ దేవి ‘ఏమిరా ధూర్తుడా! కపిలుడు, భృగువు, నారదుడు, బ్రహ్మ, సనక సనందనాదులు శివుని ముందు నమస్కరిస్తూ నిలబడతారు. ఎవరి పాదములకు అంటుకున్న ధూళి మస్తకము మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో ఎవరి పాదము తగిలితే మంగళ తోరణమై నీ ఇంటిని పట్టుకుంటుందో, ఎవరు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యములు జరుగుతాయో, ఎవరు లోపల ఉండడము చేత నీవు శివమై పదిమంది చేత నమస్కరింప బడుతున్నావో, ఏ శివము లోపలి నుంచి వెళ్ళిపోతే శవమై పోతావో, ఏ మహానుభావుడు లోకములన్నింటిని రక్ష చేస్తున్నాడో, ఎవరు తాను మహాత్యాగియై జ్ఞానిగా నిలబడ్డాడో అటువంటి పరమశివుని తూలనాడడానికి నీకు ఉన్న గొప్పతనం ఏపాటిది? ప్రకృతి పురుష తత్త్వమును తెలియక, గుర్తెరుగక ఒక ప్రాకృతమయిన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్లు మాట్లాడావు. నీవు విష్ణుభక్తుడవని అనిపించుకునేందుకు నీకు అర్హత లేదు. శివుని గౌరవించనివాడు విష్ణు భక్తుడు కానేకాడు. నువ్వు ఇలా ప్రవర్తించావు కనక నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఉత్తరక్షణం రాక్షస యోనియందు జన్మిస్తావు. నీవు చేసిన తపస్సు చేత శ్రీమన్నారాయణుని చేరెదవు గాక’ అని అనుగ్రహించింది.

చిత్రకేతువు విమానంలోంచి క్రింది పడిపోయి తల్లి పాదముల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట అన్నాడు ‘అమ్మా! అనంతుని దర్శనం చేశాను. సంకర్షణుని దర్శనం చేశాను. ఎన్ని జన్మల నుంచో ఉన్న చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయాయి. నీ మ్రోలకు వచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను. ఇంత శాపమును పొందాను. నువ్వు శపించిన శాపం నన్ను ఉద్ధరించడానికేనని అనుకుంటున్నాను. అలాగే రాక్షసయోనియందు జన్మిస్తాను. నా అజ్ఞానము అక్కడితో తొలగుగాక’ అని నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ప్రణిపాతము చేసి లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు.

ఇది చూసి పరమశివుడు ‘పార్వతీ చూశావా ఇతను పరమభక్తులు నీవు ఇంత శాపం ఇస్తే అతను కసుగందలేదు. నిజమయిన విష్ణుభక్తుడయినవాడికి అటువంటి సత్త్వగుణం కలగాలి. ఇతడు విష్ణు భక్తుడే. ఈ భక్తి వీనిని రక్షించి ఒకనాడు ఇంద్రసంహారం కోసం త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్రాసురునిగా పైకి వస్తాడు. వచ్చినా ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు. మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టి శ్రీమన్నారాయణుని చేరుకుంటాడు. తాను చేసుకున్న సుకృతము చేత అపారమయిన భక్తితో నిలబడిపోతాడు’ అన్నాడు. ఈ ఆఖ్యానము ఇంత పరమ పావనమయినది కాబట్టి ఇహమునందు వాళ్లకి ఏమయినా ప్రమాదము రావలసి ఉంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్రపౌత్రాభివృద్ధిగా మూడు తరములు చూసి, సమస్త ఐశ్వర్యములు పొంది అంత్యమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి, మరల పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యమును పొందుతారు. అటువంటి స్థితిని కటాక్షించ గలిగిన మహోత్కృష్టమయిన ఆఖ్యానము ఈ వృత్రాసుర వధ.



https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

[13/11, 11:29 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 49 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వృత్రాసుర సంహారం చేయడం వలన మరల బ్రహ్మ హత్యాపాతకం అంటుకుంటుంది. క్రిందటి సారి ఆ బ్రహ్మహత్యా పాతకమును నలుగురికి పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ హత్యా పాతకం పరమ వృద్దుడయిన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో, ఒళ్ళంతా క్షయ వ్యాధి, కుష్ఠు వ్యాధి చేత పుండ్లు పడిపోయి నోటివెంట నవరంధ్రముల వెంట పుల్లటి కంపు కొడుతుండగా ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణములతో ఇంద్రుని కౌగలించుకోవడానికని వెంటపడింది. బ్రహ్మహత్యాపాతక స్వరూపం బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగుపరుగున అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఎటువైపుకు వెళ్ళినా విడిచి పెట్టలేదు. ఇంక దారిలేక ఇంద్రుడు ఈశాన్య దిక్కుపట్టి పరుగెత్తి మానససరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. అక్కడికి బ్రహ్మహత్యా పాతకం కూడా తరిమి రాలేక పోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురుచూస్తూ నిలబడింది. ఇంద్రుడు మానస సరోవరంలోకి దూకి ఒక తామరపువ్వు గుండా తామర నాళం లోనికి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరి వేయి సంవత్సరములు ఉన్నాడు. ఒడ్డున ఆ బ్రహ్మహత్యా పాతకం బయటకు రాకపోతాడా పట్టుకోలేక పోతానా అని నిరీక్షిస్తూనే ఉన్నది. అలా ఇంద్రుడు నారాయణ కవచమును, శ్రీమన్నారాయణుని తపమును ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు. ఈశ్వరారాధనం చేస్తూ కూర్చున్నాడు.

ఈ వెయ్యి సంవత్సరములు గడిచేలోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇంద్రపదవి ఖాళీగా ఉన్నది. ఆ పదవిలోకి తాత్కాలికముగా అనేక యాగములు చేసిన నహుషుడు అనే మహారాజును తెచ్చి కూర్చోబెట్టారు. ఇంద్రపదవిలో కూర్చోగానే ఆయనకో వెర్రి పుట్టింది. ‘ఇంద్రపదవి ఒకటీ ఇచ్చి వదిలిపెడితే ఎలా – శచీదేవి కూడా నాది కావాలి కదా’ అన్నాడు. ‘ప్రస్తుతం నేనే ఇంద్రుడిని కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నీవు నా భార్యగా ఉండు’ అని శచీదేవికి వర్తమానం పంపాడు. ఆయన ప్రవర్తన నచ్చక శచీదేవికి ఏమి చేయాలో అర్థం కాలేదు. లలితా సహస్రనామ స్తోత్రములో అమ్మవారికి ‘పులోమజార్చిత’ అని పేరు ఉన్నది. పులోముడు శచీదేవి తండ్రి. పులోముని కుమార్తె అయిన శచీదేవి చేత నిరంతరం లలితా పరాభట్టారిక అర్చింపబడుతు ఉంటుంది. భార్య చేసే పూజ వలన భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. అందుకని ఆయన ఇంద్రపదవి యందు ఉన్నాడు. ఈమె యందు ఏ దోషము లేదు బృహస్పతి ఈమెకు దర్శనం ఇచ్చి ‘అమ్మా!దీనికి ఒకటే పరిష్కారం. నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో ఇలాగ వీనితోను ఒక అపచారం చేయించు. నహుషుడిని ‘సప్తర్షులు మోస్తున్న పల్లకిలో రా – నీవు నాకు భర్తవు అవుదువు గాని’ అని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఈ పని చేయనా అని ఉండదు. ‘సప్తర్షులను పిలిచి మోయమని పల్లకి ఎక్కుతాడు అని చెప్పాడు. బృహస్పతి తెలివితేటలు వట్టినే పోవు. ఆవిధంగా నహుషుడు సప్తర్షులు మోస్తున్న పల్లకి ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో ఉన్నారు.

మహాశక్తి సంపన్నుడు, పొట్టిగా ఉన్న అగస్త్యమహర్షి ఉన్నారు. అడుగులు గబగబా పడడము లేదు. నహుషుడు లోపలినుంచి చూశాడు. తొందరగా శచీదేవి వద్దకు వెళ్ళాలనే తాపత్రయంతో ‘సర్పసర్ప’ ‘నడు నడు’ అని ఆయనను హుంకరించి డొక్కలో తన్నాడు. అగస్త్యునికి కోపం వచ్చింది. పైకి చూసి ‘చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని అడుగులు వేయలేక పోతున్న వాడిని అయిన నన్ను ‘సర్ప సర్ప’ అన్నావు కాబట్టి నీవు సర్పమై కొండచిలువవై భూలోకంలో పడిపో’ అని శపించాడు.వెంటనే నహుషుడు కొండచిలువయి క్రిందపడ్డాడు. మరల ఇంద్రపదవి ఖాళీ అయింది మరల ఇంద్రుని తీసుకురావాలి. దేవతలు, ఋషులు అందరూ కలిసి మానససరోవరం దగ్గరకు వెళ్ళారు. వెయ్యి సంవత్సరాలు తపించిన ఇంద్రుని శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. పూర్తిగా నివారణ కాలేదు. ఇంద్రుని తీసుకు వచ్చి అశ్వమేధ యాగం చేయించారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాపపరిహారం చేశారు. ఏది చేసినా భగవానుడే చేయాలి. ఇంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహమునకు నోచుకున్నాడు. బ్రహ్మహత్యా పాతకము నివారణయై మరల వచ్చి ఇంద్రపదవిలో కూర్చుని సంతోషముగా గురువును సేవిస్తూ కాలమును గడుపుతున్నాడు.

ఇంద్రపదవిని అలంకరించిన వాడే గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కష్టములు పడ్డాడు. మనం ఎల్లప్పుడూ గురువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువులు మీ డబ్బు కోరుకునేవారు కారు. ఐశ్వర్యమును కోరుకునే వారు కాదు. వారిపట్ల ఎప్పుడూ మర్యాద తప్పకూడదు. ఎప్పుడూ వారిపట్ల మర్యాదతో ప్రవర్తించడం, వారు చెప్పిన మాట వినడం అనే మంచి లక్షణమును కలిగి ఉండాలి. దాని చేత ఉద్ధరింపబడతారు.

సప్తమ స్కంధము – ప్రహ్లాదోపాఖ్యానం:

ప్రహ్లాదోపాఖ్యానం పరమపవిత్రమయిన ఆఖ్యానం. అందులో ఎన్నో రహస్యములు ఉన్నాయి. వైకుంఠ ద్వారపాలకులయిన జయవిజయులు ఇద్దరు సనక సనందనాదుల పట్ల చేసిన అపచారం వలన శాపవశం చేత భూలోకమునందు అసురయోనిలో జన్మించి రాక్షసులయి మూడు జన్మలు ఎత్తిన తరువాత మరల శ్రీమన్నారాయణుడు వారిని తన ద్వారపాలకుల పదవిలోనికి తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు. వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు.

హిరణ్యకశిపుడు అంటే కనబడినదల్లా తనదిగా అనుభవించాలని అనుకునే బుద్ధి కలవాడు. ఆయనకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అను నలుగురు కుమారులు కలిగారు. ప్రహ్లాదునికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు సింహిక. సింహిక కుమారుడు రాహువు. ఆ రాహువే ఇప్పటికీ పాపగ్రహం క్రింద సూర్య గ్రహణం, చంద్ర గ్రహణంలో కనపడుతూ ఉంటాడు. ఆయనే మేరువుకి అప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాడు. హిరణ్యాక్షుడు మరణించిన సందర్భముతో ఈ ఆఖ్యానమును ప్రారంభం చేస్తున్నారు. ఆయన భార్యలు, తల్లిగారయిన దితి హిరణ్యాక్షుడు మరణించాడని విలపిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి హిరణ్యకశిపుడు వచ్చాడు. హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతమును చూస్తే అసలు ఇతను రాక్షసుడేనా ఇలా వేదాంతమును ఎవరు చెప్పగలరు? అనిపిస్తుంది.

హిరణ్యకశిపుడు ఏడుస్తున్న భార్యలను, తల్లి చూసి “సాక్షాత్ శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. ఉత్తమలోకాల వైపుకి వెళ్ళిపోయాడు. అటువంటి వాని గురించి ఎవరయినా ఏడుస్తారా? ఏడవకూడదు అని ఒక చిత్రమయిన విషయం చెప్పాడు.

పూర్వకాలంలో సుయజ్ఞుడు చాలాకాలం ప్రజలను పరిపాలన చేసి అనేకమంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు. అతని భార్యలు, పుత్రులు అందరూ విలపిస్తున్నారు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఆయన ఒక బ్రాహ్మణ కుమారుని వేషంలో అక్కడికి వచ్చి ఒకమాట చెప్పాడు “ఏమయ్యా, మీరందరూ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. చావు తప్పించుకొని దాక్కున్న వాడెవడూ లేదు. కొన్నాళ్ళు బ్రతికిన తరువాత వెళ్ళిపోవడం అన్నది ఈ ప్రపంచమునకు అలవాటు. ఈ మహాప్రస్థానంలో మనం ఎక్కడినుండి వచ్చామో అక్కడికి వెళ్లిపోతాము. ఆ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారెందుకు?’ అని అడిగాడు యమధర్మరాజుగారు.

పూర్వకాలంలో ఒక చెట్టు మీద గూటిలో ఒక మగపక్షి, ఒక ఆడపక్షి ఉండేవి. ఒక బోయవాడు అటు వెళ్ళిపోతూ చెట్టుమీద మాట్లాడుకుంటున్న పక్షుల జంటను వాటి వెనకాల ఉన్న పక్షి పిల్లలను చూసి ఉండేలు బద్ద పెట్టి రాతితో ఆడపక్షి గుండెల మీద కొట్టాడు. గిరగిర తిరుగుతూ ఆ పక్షి కిందపడిపోయింది. అది మరల ఎగరకుండా ఆ పడిపోయిన పక్షి రెక్కలు విరిచేచేసి బుట్టలో పడేసుకొని తీసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ బుట్ట కన్నాలలోంచి ఆడపక్షి నీరస పడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి భర్తవంక చూస్తోంది. భర్త అన్నాడు “మనిద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాము. నాకేమీ సంసారం తెలియదు. రేపటి నుండి పిల్లలు లేవగానే అమ్మ ఏది అని అడుగుతాయి. నేను ఏమని సమాధానం చెప్పను? ఈ పిల్లలు ఆహరం కోసమని నోళ్ళు తెరచుకుని చూస్తూ ఉంటాయి. నీవు లేని సంసారం ఎలా చేయాను’ అని ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆడపక్షి వంక చూస్తూ మాట్లాడుతూ మైమరచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దానిని కొట్టాడు. అది చచ్చిపోయింది. తాను ఉండిపోతాను అనుకున్న మగపక్షి చచ్చిపోయింది. రెక్కలు వంగిన ఆడపక్షి ఇంకా బ్రతికే ఉన్నది. కాబట్టి ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలుసు. అందుకని ఈశ్వరుని గురించి ప్రార్థన చెయ్యండి అన్నాడు.

ఈ మాటలకు దితి, హిరణ్యాక్షుని భార్యలు ఊరట చెంది అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం తపస్సుకు బయలుదేరాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

[13/11, 11:29 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 50 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


హిరణ్యకశిపుడు తపస్సుకు బయలు దేరి బయటకు వచ్చి తన దగ్గర ఉండే మంత్రి, సామంత్రులందరినీ పిలిచి ‘శ్రీమన్నారాయణుడంతటి దుండగీడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అతడు చేతకాని వాడు పిరికివాడు. నా తమ్ముడిని సంహరించాడు. ఆ విష్ణువు మహామాయగాడు. అతను ఉండే స్థానములు కొన్ని ఉన్నాయి. అవే బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు, వేదము, ఆవులు, సాధుపురుషులు, ధర్మము, అగ్నిహోత్రము మొదలయినవి. చెట్టు మొదలును కాల్చేస్తే పైన ఉండే పల్లవములు శాఖలు తమంతతాము మాడిపోతాయి. ఇలాంటివి ఎక్కడ కనపడినా ధ్వంసం చేయండి. ఎవడయినా తపస్సు చేస్తుంటే నరికి అవతల పారెయ్యండి. ఎవడయినా వేదము చదువుకుంటుంటే వాడిని చంపెయ్యండి’ అన్నాడు. ఆమాటలు వినడముతోనే భటులందరూ లోకం మీద పడ్డారు. ‘నేను అపారమయిన తపశ్శక్తి సంపన్నుడనయి ఈ మూడులోకములను నేను పరిపాలిస్తాను. విష్ణువనేవాడు ఎక్కడ కనపడినా సంహరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ’ అని బయలుదేరి మంధరపర్వత చరియలలోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. మహా ఘోరమయిన తపస్సు చేశాడు. ఆయన కపాలభాగమునుండి తపోధూమము బయలుదేరి సమస్త లోకములను కప్పేస్తోంది. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. ఇటువంటి పరిస్థితులలో దేవతలు అందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘ఈ హిరణ్యకశిపుని తపో ధూమముచేత మేమందరమూ తప్తమయి పోతున్నాము. నువ్వు తొందరగా వెళ్ళి ఆయనకు దర్శనం ఇచ్చి ఏమి కావాలో ఆయనను అడిగి ఆయన కోర్కె సిద్ధింపచేయవలసింది’ అన్నారు.

పక్కన దక్షప్రజాపతి భ్రుగువు మున్నగువారు కొలుస్తూ వుండగా స్వామి హంసవాహనము మీద ఆరూఢూడై వచ్చి తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుని ముందుకు వచ్చి నిలబడి తన కమండలములో ఉన్న మంత్రజలమును తీసి పుట్టలు పట్టిపోయి వున్న హిరణ్యకశిపుని శరీరము మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమయిన తేజస్సుతో కూడుకున్న నవయౌవనముతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచివచ్చి సాష్టాంగ దండ ప్రణామము చేసి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఆయన ‘నువ్వు దుస్సాధ్యమయిన తపస్సు చేశావు. నాయనా హిరణ్యకశిపా! నీవు ఏమి కోరుకుంటావో కోరుకో’ అన్నాడు.

‘తనకు మృత్యువు ఉండకూడదు. గాలిచేత చచ్చిపోకూడదు. ఏ దిక్కునుంచి వస్తున్న ప్రాణిచేత చచ్చిపోకూడదు. పైనచచ్చిపోకూడదు. క్రిందచచ్చిపోకూడదు. ఇంట్లోచచ్చిపోకూడదు. బయటచచ్చిపోకూడదు. ఆకాశంలోచచ్చిపోకూడదు. ప్రాణం ఉన్న వాటివలన చచ్చిపోకూడదు. ప్రాణం లేని వాటి వలన చచ్చిపోకూడదు. మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నరుల చేత, దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, వీటి వేటి చేత పగలు కాని, రాత్రి కాని మరణములేని స్థితిని నాకు కటాక్షించు’ అని కోరాడు. ఈ కోరికను విని బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. తథాస్తు ఇచ్చేశాను. కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి అనుకూల్యతతో మంచినడవడితో ప్రవర్తించు సుమా’ అని చెప్పి హంసవాహనం ఎక్కి వెళ్ళిపోయారు.

హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చి అందరిని పిలిచి ‘నేను వరములు పుచ్చుకుని వచ్చాను. విష్ణువు ఎక్కడ ఉన్నాడో పట్టుకొని సంహారం చేయాలి. పైగా ఇంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేయాలి. త్రిలోక్యాధిపత్యము పొందాలి’ అని చెప్పి పెద్ద అసుర సైన్యమును తీసుకొని ఇంద్రలోకము మీదికి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రునికి ఈ వార్త అంది ఎప్పుడయితే హిరణ్యకశిపుడు ఇన్ని వరములు పొందాడని తెలిసిందో ఇక వానితో యుద్ధం అనవసరం అనుకుని సింహాసనం ఖాళీ చేసాడు. హిరణ్యకశిపుడు వచ్చి అమరావతిని స్వాధీనము చేసుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు లేనేలేవు. హవిస్సులన్నీ హిరణ్యకశిపుడికే భయంకరమయిన పాలన సాగిస్తున్నాడు.

దేవతలు అందరూ చాలా రహస్యమయిన సమావేశం ఒకటి పెట్టుకున్నారు. తమ కష్టములు తీర్చమని శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తే అశరీరవాణి వినబడింది. ‘మీరందరూ దేనిగురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరు నాకేమీ చెప్పనవసరం లేదు. నేను సమస్తము తెలిసి ఉన్న వాడిని. నాకంటూ ఒక నియమం ఉన్నది. వాడు ధర్మము నుండి వైక్ల్యబ్యం పొందాలి. బాగా ధర్మం తప్పిపోవాలి. వాడిని చంపేస్తాను’ అని స్వామి ప్రతిజ్ఞచేశారు. ఆ పని వాడు ఎప్పుడు చేస్తాడో కూడా నేను మీకు చెప్తున్నాను. వానికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు ప్రహ్లాదుడు. మహాభక్తుడు. ప్రహ్లాదుని ఆపదల పాలు చేయడం ప్రారంభం చేస్తాడో ఆనాడు వానిని సంహరించేస్తాను. మీరెవ్వరూ బెంగపెట్టుకోకండి’ అన్నాడు. ఈ మాటలు విని దేవతలందరూ సంతోషించారు.

హిరణ్యకశిపునికి లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. ఆయన మహానుభావుడు. మహాజ్ఞాని. గురువులు కరచరణాదులతో కదిలివస్తున్న ఈశ్వరుడే అన్న భావన కలిగినవాడు. తనతో కలిసి చదువుకుంటున్న స్నేహితులను కేవలం స్నేహితులుగా కాక తన తోడబుట్టిన వాళ్ళలా చూసేవాడు. గురువులు చండామార్కులు ఉన్నది రాక్షస విద్యార్థులు. ఒక్కనాడు అబద్ధం ఆడింది లేదు. మిక్కిలి మర్యాద కలిగిన వాడు. ప్రహ్లాదుని సుగుణములు అన్నీ ఇన్నీ అని చెప్పడానికి కుదరదు. ప్రహ్లాదుడిని చూసిన హిరణ్యకశిపుడు ‘ఏమిటో కనపడ్డ వాళ్ళందరినీ హింసించడం, బాధపెట్టడం వాడి దగ్గర వీడి దగ్గర అన్నీ ఎత్తుకురావడం ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుడిలా కూర్చుంటాడు. తనలో తాను నవ్వుకుంటాడు. కళ్ళు మూసుకొని ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉంటాడు. ఓ పుస్తకం పట్టుకోడు. వీడు రేపు పొద్దున్న సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా పరిపాలన చేస్తాడు? రాక్షసులను ఎలా సుఖపెడతాడని బెంగపెట్టుకున్నాడు.

శుక్రాచార్యులవారి కుమారులయిన చండామార్కుల వారిని పిలిచాడు. 'మీ భ్రుగు వంశం మా రాక్షసజాతిని ఎప్పటినుంచో ఉద్ధరిస్తోంది. మా బిడ్డడయిన ప్రహ్లాదుడు జడుడిగా తిరుగుతున్నాడు. వీనికి నీతిశాస్త్రమో, ధర్మ శాస్త్రమో, కామశాస్త్రమో బోధ చెయ్యండి. వీనియందు కొంచెం కదలిక వచ్చి నాలుగు విషయములు తెలుసుకొని పదిమందిని పీడించడం నేర్చుకుంటే నా తరువాత సింహాసనం మీద కూర్చోవడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది’ అని ప్రహ్లాదుని తీసుకువెళ్ళి చండుడు, మార్కుడికి అప్పచెప్పాడు.

ఆ రోజులలో రాజాంతఃపుర ప్రాంగణంనందు ఒక విద్యాలయము ఉండేది. అందులో గురువులు శిష్యులకు విద్యలు నేర్పుతూ ఉండేవారు. ప్రహ్లాదుడు చిత్రమయిన పని చేస్తుండేవాడు. ఆయన ఏకసంథాగ్రాహి గురువులు చెప్పిన విషయమును వెంటనే ఆయన మేధతో పట్టుకునేవాడు. తానుమాత్రం మరల బదులు చెప్పేవాడు కాదు. ఏమీ మాట్లాడేవాడు కాదు అన్నీ వినేవాడు. వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే నేర్చుకునేవాడు. వాళ్ళు దుర్మార్గమయిన నీతులు చెబితే ఆ నీతులు నేర్చుకునే వాడు. అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకునే వాడు. అది మనస్సులోకి వెళ్ళలేదు. అనగా అంత దుష్ట సాంగత్యమునందు కూడా తన స్వరూపస్థితిని తాను నిలబెట్టుకున్న మహాపురుషుడు ప్రహ్లాదుడు. ఒకనాడు హిరణ్యకశిపునికి తన పిల్లవాని బుద్ధిని పరీక్షించాలని ఒక కోరిక పుట్టింది. గురువులు వెళ్ళి ‘మీరు చెప్పిన విధిని మేము నిర్వహించాము. మీ అబ్బాయి చాలా బాగా పాఠములు నేర్చుకున్నాడు’ అన్నారు. తన పిల్లవానిని సభామంటపమునకు పిలిచాడు. తన కొడుడు తన తొడమీద కూర్చుని అవన్నీ చెపుతుంటే సభలో ఉన్నవాళ్ళు చూసి తన కొడుకు తనకంటే మించినవాడని పొంగిపోవాలని ఆయన అభిప్రాయం. అందుకని సభకు పిలిపించాడు ప్రహ్లాదుడు వస్తూనే తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండు చేతులు చాపి తన పిల్లవాడిని ఎత్తుకున్నాడు. తన తొడమీద కూర్చోబెట్టుకుని ‘నీవు ఏమి నేర్చుకున్నావో ఏది నాలుగు మాటలు చెప్పు. నీవు నేర్చుకున్న దానిలో నీకు ఇష్టం వచ్చినది నీకు బాగా నచ్చింది ఏది ఉన్నదో అది ఒక పద్యం చెప్పు అని అడిగాడు. ప్రహ్లాదుడు

ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతిలోపలం

ద్రెళ్లక వీరు నే మను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ

ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునం

దుల్లము జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ !

ప్రతి జీవుడు ప్రతి శరీరధారి శరీరమును పొంది ఇల్లు అనే ఒక చీకటి నూతిలోకి దిగిపోయి అక్కడి నుంచి ‘నేను’, ‘మీరు’ అనే భావన పుట్టి అందులోంచి అహంకారం, మమకారం పుట్టి నా వాళ్లకు మేలు జరగాలి, ఎదుటి వాళ్లకు కీడు జరగాలి అనుకుంటూ ఉంటారు. నేను నా వాళ్ళు అనే భావనను విడిచి పెట్టి జగత్తంతా ఉన్నది పరబ్రహ్మమే అనుకుని గుర్తెరిగి వాడు ఘోరారణ్యములోకి వెళ్ళి కూర్చున్నా ఉద్ధరించ బడుతున్నాడు. ఇది తెలుసుకోకుండా ‘నేను’ ‘నాది’ అన్న భావన పెంచుకున్న వాడు ఊరినడుమ కూర్చున్నా అటువంటి వాని వలన కలిగే ప్రయోజనం ఏమీలేదు. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం. ఇంత తపస్సు చేసి నీవు ఏమి తెలుసుకుంటున్నావు? నీవు మార్చుకోవలసిన పధ్ధతి ఉన్నదని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు. ఇతని మాటలు విని హిరణ్యకశిపుడు తెల్లబోయాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

[13/11, 11:31 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 52 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ప్రహ్లాదుడు చెప్తున్న విషయములను విని హిరణ్యకశిపుడు కోపించిన వాడై గురువుల వంక చూశాడు. మేమేమీ చెప్పలేదు మహా ప్రభో అన్నట్లు హడలిపోయి చూస్తున్నారు చండామార్కులు. ‘ఈ పద్యములన్నీ నీకు ఎక్కడినుంచి వచ్చాయి? శ్రీమన్నారాయణుని సేవించాలని ఎలా చెప్తున్నావు? నీకీ భక్తి ఎలా కలిగింది? వాళ్ళెవరో నాకు చెప్పు. వాళ్ళ సంగతి చూస్తాను’ అన్నాడు. ప్రహ్లాదుడు ‘నాన్నా! నీలాంటి వాడికి శ్రీమన్నారాయణుని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారని చెప్పినా నీకు అర్థంకాదు. నీ కళ్ళను మూసుకున్నావు. అజ్ఞానంలో పడిపోయిన వారికి చెపితే తలకెక్కుతుందా! అజ్ఞానావస్థలో కోరికోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మే నీలాంటి అహంకార పూరితమయిన వ్యక్తులకి ఎవరు చెప్పారని చెపితే నీకు అర్థం అవుతుంది?’ అని అన్నాడు.

ఈ మాటలు వినేసరికి హిరణ్యకశిపునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. రాక్షసులను పిలిచి ‘వీడిని చంపండి. వీడిని తీసుకెళ్ళి మంచులో నిలబెట్టండి, కొన్నాళ్ళు ఆహారం ఇవ్వడం మానేయండి. ఆ తరువాత వీడి నవరంధ్రములు మూసేసెయ్యండి. ఆ తరువాత నేను నా మాయను చూపెట్టి భయపెడతాను. మరుగుతున్న నూనెలో వేయండి. పర్వత శిఖరముల మీదనుండి కిందకి తొయ్యండి. ఏనుగులతో తొక్కించండి. సముద్రంలో పారెయ్యండి’ అన్నాడు.

తనని శూలంపెట్టి రాక్షసులు పొడిచేస్తుంటే, పర్వత శిఖరం మీదనుంచి కింద పారేస్తుంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కిందపడేసి ఏనుగుల చేత తొక్కిస్తుంటే, రాక్షసులలో, తండ్రిలో, అందరిలో, అంతటా శ్రీమన్నారాయణుని చూసి పొంగిపోతుంటే గుప్తరూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ప్రహ్లాదుని పట్టుకుంటున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఏమీ జరగడం లేదు. ఈశ్వరుడిని నమ్ముకున్న వాడికి ఏమి లోటు ఉంటుంది. రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి నారాయణ జపం చేస్తుంటే అంతకంతకీ తేజోవిరాజితుడు అయిపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమయిన స్థితిని పొందాడు. తన వాడయిన కారణం చేత, తనయందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించుకున్నాడు. హిరణ్యకశిపుడు రాత్రింబవళ్ళు దీనవదనంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని ఉన్నాయో అన్నింటిని ప్రయోగించాడు. అతడు చచ్చిపోలేదు కనీసం నీరసపడలేదు. పైగా తాను ప్రయత్నించే కొలదీ పిల్లవాడు ఎక్కువ తేజమును పొందుతున్నాడు. గురువులు ‘బెంగ పెట్టుకోవద్దు. చావుతో సమానమయిన మందు ఒకటి మావద్ద ఉన్నది. వీనిని తీసుకువెళ్ళి అది వేస్తాము. ఈ పిల్లవాడికి వయస్సు వస్తోంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధ చేస్తాము. వీడు భ్రష్టుడయిపోతాడు. సంసారమునందు అనురక్తి కలుగుతుంది’ అని చెప్పి పిల్లవాడిని తీసుకువెళ్ళి అతనికి శాస్త్రబోధ ప్రారంభించారు. పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పినది చక్కగా నేర్చుకుంటున్నాడు.

ఒకరోజున గురువులు తమ గృహకార్యములను నిర్వర్తించుటకు లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రహ్లాదుడు పిల్లలందరినీ పిలిచి ‘ఒరేయ్ మీరు ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు కానీ నేను మీకొక విషయం చెప్తాను. మీరందరూ కూర్చోండి. అని మనకి ఆయుర్దాయం నూరు సంవత్సరములు. రాత్రి అయితే నిద్రపోతాము. ఏభై ఏళ్ళు నిద్రలో పోతుంది. ఇరవై ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది. ఇంకా మిగిలింది ముప్పది ఏళ్ళలో మన కోరికలన్నీ అక్కర్లేని వాటికన్నింటికీ తగుల్కొని అరిషడ్వార్గాలకి లొంగిపోతాయి. నా మాట వినండి. ఈ పంచ భూతములను, మూడు గుణములను, ఇరవై ఏడు తత్త్వములను నిర్మించి మాయచేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆత్మ దర్శనాభిలాషులు అవండి. నామాట నమ్మండి’ అన్నాడు. వాళ్ళు ‘ఈపాఠం చాలా గమ్మత్తుగా ఉన్నది. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు. మాతోనే చదువుకున్నావు. గురువులు మాకేమి చెప్పారో నీకు కూడా అదే చెప్తున్నారు. గురువులు చెప్పని విషయములు నీకు ఎవరు చెప్తే వచ్చాయి?’ అని అడిగారు. ప్రహ్లాదుడు ‘మహానుభావుడయిన నారదుడు చెప్పాడు’ అని బదులిచ్చాడు. వాళ్ళు ‘నారదుని నీవు ఎప్పుడు కలుసుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు?’ అని అడిగారు.

హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురువచ్చి ‘మహాపతివ్రతయిన ఆమెను ఎందుకు చెరపట్టి తీసుకువెళుతున్నావని అడిగాడు. ఆయన ‘నాకు ఆవిడ మీద క్రోధం లేదు. ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని తేజం ఉన్నది. వాడు తపస్సుయందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. ఈలోగా బిడ్డపుట్టి వాడు కూడా పెరిగి పెద్ద వాడయితే చాలా ప్రమాదం. ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు. నారదుడు ‘నీకేమి తెలుసు! ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడయిన వాడు ఉన్నాడు. వాడు జన్మచేత భక్తిజ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుని కథ వింటే తరించిపోతాము. లీలావతిని నా ఆశ్రమమునకు తీసుకువెడతాను’ అని తీసుకు వెళ్ళి అక్కడ వేదాంత తత్త్వమును ప్రబోధం చేశాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రమేమిటంటే విన్న లీలావతి మరిచిపోయింది. కడుపులో ఉన్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. ‘మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యములలో నారదుడు చెప్పిన బోధ మరిచిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవ అనుగ్రహం నాయందు ఉన్నది. అందుకని అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం, జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా’ అన్నాడు.

 పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయడం మొదలు పెట్టారు. లోపలనుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదుడిని పట్టుకుని జరజర ఈడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి ‘తులసివనంలో గంజాయిమొక్క పుట్టినట్లు రాక్షసవంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి పాఠం చెప్పడం దేవుడెరుగు వీడు రాక్షస బాలకులనందరిని పాడు చేసాడు. అందరిని నారాయణ భక్తులుగా చేస్తున్నాడు’ అన్నారు. హిరణ్యకశిపుడు ‘ఎవరి దిక్కు చూసుకుని, ఎవరి బలం చూసుకొని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు?’ అని కుమారుని చూసి అడిగాడు.

బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్!

బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బల మసురేంద్రా!

‘నాన్నా! నీలో బలానికి కారణమెవడో వాడే నాలో బలమునకు కూడా కారణం. బలహీనుడయిన వానిలో ఉన్న కొంచెం బలానికి కారణం ఎవరో లోకములను సంపాదించిన మహాబలవంతుల బలమునకు కారణమెవడో వాడు నాకు దిక్కు’ అన్నాడు. ‘ఏమిరా ! వాడు దిక్కు దిక్కు అంటున్నావు కదా! వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?’ అని అడిగాడు. ‘నాన్నా! ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతావేమిటి? ఇదొక వెర్రి ప్రశ్న.

ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూసిన నందందే కలడు దానవాగ్రణి! వింటే.

జ్ఞాననేత్రంతో చూస్తే దంతి కనపడదు. దారువు కనపడుతుంది. ఆభరణం కనపడదు. స్వర్ణం కనపడుతుంది. పాత్ర కనపడదు. మట్టి కనపడుతుంది. జ్ఞాన నేత్రంతో చూడు. ఉన్నది నారాయణుడు ఒక్కడే. అంతటా స్వామి ఉన్నాడు. నువ్వు చూడడానికి ప్రయత్నం చెయ్యి’ అన్నాడు. ఒక ప్రక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవశ్యం వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ

కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం

గల, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం

గల, డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటం

గల, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల నీ యా యెడన్!!

నాన్నా! ఈశ్వరుడు ఎక్కడలేడు? అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు. రాత్రులందు పగలందు, ఆకాశమునందు పైన మధ్యలో సర్వభూతములయందు అగ్నియందు ఓంకారము నందు సమస్త ప్రపంచమునందు నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆయనలేని ప్రదేశం లేదు’ అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[13/11, 11:31 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 51by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరయినా తన కుమారునికి నేర్పారేమోనని ఆయనకు అనుమానం కలిగి “నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది నీవు రాక్షసునికి జన్మించిన వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా లేక ఎవరయినా పిల్లలు పక్కకి తీసుకెళ్ళి రహస్యంగా నీచేత చదివిస్తున్నారా?” అని అడిగాడు. “ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకు వెళ్ళి ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా? శ్రీమహావిష్ణువు మన జాతికంతటికీ అపకారం చేసినవాడు. అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా? అలా చెయ్యకూడదు” అన్నాడు. ఇవన్నీ విని ప్రహ్లాదుడు “

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు

నిర్మల మందాకినీవీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త

చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు! వినుత గుణశీల, మాటలు వేయునేల?

ఎక్కడయినా పారిజాత పుష్పములలో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? ఎక్కడో హాయిగా ఆకాశములో ఉండే మందాకినీ నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమయిన ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ళు తాగుతుందా? ఎక్కడయినా లేత మామిడి చిగురు తాను తిని ‘కూ’ అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవిమల్లెలు పూసే చెట్టుమీద వాలుతుందా? పూర్ణమయిన చంద్రబింబం లోంచి వచ్చే అమృతమును త్రాగడానికి అలవాటు పడిపోయిన చకోరపక్షి పొగమంచును త్రాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలములయందు తామరపువ్వుల వంటి పాదములు కలిగిన శ్రీమన్నారాయణుని పాదములను భజించడం చేత స్రవించే భక్తి తన్మయత్వమనే మందార మకరందపానమును త్రాగి మత్తెక్కి ధ్యానమగ్నుడనై ఉండే నాకు నీవు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములయిన వాటిమీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను?” అని అడిగి వేయిమాటలెందుకు? నాకు నీవు చెప్పిన లక్షణములు రమ్మనమంటే వచ్చేవి కావు’ అని అన్నాడు.

ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి ‘మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెపుతున్నాడేమిటి? ఈమాటు తీసుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా వేయి కళ్ళతో చూస్తూ విద్య నేర్పండి అన్నాడు. చండామార్కులు పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్లకి భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదునితో “నాయనా! మేము నీకు నేర్పినది ఏమిటి? నువ్వు చెప్పినది ఏమిటి? మీ నాన్నకి మామీద అనుమానం వచ్చింది. ఇపుడు మా ప్రాణములకు ముప్పు వచ్చేటట్లు ఉన్నది. మేము ఏమి చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పచెప్పు. ఇంక ఎప్పుడూ నీవు అలాంటి పలుకులు పలుకకూడదు. గురువుల మయిన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి అర్థమయిందా?” అన్నారు. ప్రహ్లాదుడు ‘అయ్యా, చిత్తం. మీరు ఏమి చెపుతారో దానిని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను’ అని చక్కగా నేర్చుకున్నాడు. ఎక్కడనుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కా వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. పిల్లవాడు మారాడని వారు అనుకున్నారు. ఎందుకయినా మంచిదని తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి, తండ్రి దగ్గర మాట్లాడదానికి పెద్ద తేడా ఉండదని ముందుగా అతనిని తల్లి లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళారు.

లీలావతి కుమారుని ప్రశ్నించింది ‘నాయనా! బాగా చదువుకుంటున్నావా? ఏది నీవు నేర్చుకున్నది ఒకమాట చెప్పు’ అన్నది. ధర్మార్థ శాస్త్రములలోంచి కొన్ని మాటలు చెప్పాడు తల్లికి. తన కుమారుడు చాలా మారిపోయినందుకు చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుని చూసి “నీ బుద్ధి మారిందా? గురువులు చెప్పింది తెలుసుకుంటున్నావా? లేక సొంతబుద్ధితో ఏమయినా నేర్చుకుంటున్నావా?’ అని అడిగాడు. ప్రహ్లాదుడు

“చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నే

జదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ!!

గురువులు నన్ను చదివించారు. ధర్మశాస్త్రం, అర్థ శాస్త్రములను నూరిపోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో దానిని నేను తెలుసుకున్నాను అన్నాడు. హిరణ్యకశిపుడు నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వడగడితే ఇది వింటే చాలు అన్నపద్యం ఒక్కటి నాకు చెప్పు’ అని కుమారుని అడిగాడు. ప్రహ్లాదుడు

తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా

ర్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం

బనునీతొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మిస

జ్జనుడైయుండుట భద్రమంచు దలతున్ సత్యంబుదైత్యోత్తమా!!

“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

అంటారు వ్యాసమహర్షి. ‘తండ్రీ ఈ శరీరం ఉన్నందుకు మనం ఈశ్వరుడిని తొమ్మిది రకములుగా సేవించాలి. ఇదే నేను చదువుకున్న చదువుల మొత్తం సారాంశము’ అని చెప్పాడు.

ఈమాటలకు హిరణ్యకశిపుడు తెల్లబోయి ఇది గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు. అలాంటి ఆలోచన నీకు ఎక్కడినుంచి వస్తోంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు. కంటికి కనపడని శ్రీమన్నారాయణుని మీద నీకు భక్తి ఎక్కడినుండి వచ్చింది?” అని అడిగాడు. ప్రహ్లాదుడు

తండ్రీ ! మీకందరికీ రాని ఆలోచన నాకెందుకు వస్తోందని అడిగావు కదా! ఆయనను విడిచిపెట్టి మిగిలినవి నీవు ఎన్ని చేసినా అవి అన్నీ ఎటువంటి పనులో చెపుతాను. పుట్టు గుడ్డి వాడిని తీసుకు వెళ్ళి పున్నమి చంద్రుని దగ్గర కూర్చోబెట్టి పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడరా అంటే ఎంత అసహ్యమో ఈశ్వరుడిని విడిచి పెట్టి సంసారం చాలా బాగుంటుంది అనుకోవడం అంత అసహ్యకరం.

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;

సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;

భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;

తే. దేవదేవుని చింతించు దినము దినము; చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;

కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు; తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి!!

కమలముల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుని అర్చించిన చేతులు ఏవయితే ఉంటాయో వాటికి చేతులని పేరు. శ్రీ మహావిష్ణువు గురించి పరవశించి పోయి స్తోత్రం చెయ్యాలి. అర్చన చేసేటప్పుడు ఒకమెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు. శేషశాయికి మొక్కని శిరము శిరము కాదు. ఆ మహానుభావుడి గురించి కీర్తనము చేయని నోరు నోరు కాదు. ఆయనకు ప్రదక్షిణలు చేయని కాళ్ళు కాళ్ళు కాదు. ఆయనను లోపల ధ్యానం చేయని మనస్సు మనస్సు కాదు. ఆయనను గురించి చెప్పని గురువు గురువు కాదు” అని ఇంకొక మాట చెప్పాడు.

కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రి గాక

వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధనితోడి ఢక్క గాక

హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక

కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక

చక్రిచింత లేని జన్మంబు జన్మమే? తరళ సలిల బుద్భుదంబు గాక

విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే? పాదయుగము తోడి పశువు గాక!!

ఈశ్వరుడు మహోదారుడు. ఆయన నిర్మించిన ఈ శరీరము చాలా గొప్పది. తొమ్మిది రంధ్రములు కలిగిన తోలు తిత్తియందు పది వాయువులు ఆయన శాసనము అయ్యేంతవరకు బయటకు వెళ్ళడానికి వీలులేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్న పరమాత్ముని తలుచుకోని వాడు, ఆ కంజాక్షుని సేవించడానికి సిద్ధపడని శరీరము శరీరము కాదు వట్టి తోలుతిత్తి. తండ్రీ చెయ్యవలసినది ఏదయినా ఉంటే ఒక్క కైంకర్యము చేయడానికే మనిషి బ్రతకాలి. అటువంటి బుద్ధితో ఉండాలి అన్నాడు

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...

instagram.com/pravachana_chakravarthy

[13/11, 11:31 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 54 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


అష్టమ స్కంధము – గజేంద్రమోక్షం

భాగవతములో అన్నీ ఒక ఎత్తు అయితే అష్టమస్కంద ప్రారంభములోని గజేంద్రమోక్షణ ఘట్టము ఒక్కటి ఒక ఎత్తు. అందులో కొన్ని చిత్రమైన సన్నివేశములు జరిగాయి. వ్యాసులవారు మూలములో చెప్పిన విషయములకన్నా మహానుభావుడు ఎంతో దర్శనము చేసిన పోతనగారు కొంచము ముందుకు వెళ్ళి స్వేచ్ఛగా అనువాదము చేసారు.

గజేంద్రమోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. ‘గజ’ అనే అక్షరములను కొంచెం అటూ ఇటూ మారిస్తే ‘జగ’ అవుతుంది. ‘జాయతే గచ్ఛతే’ ‘జ’ అంటే ‘జాయతే’ అంటే వెళ్ళిపోవడం. ‘గ’ అంటే ‘గచ్ఛతే’ అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని ‘జగము’ అంటారు. ఏదీ శాశ్వతంగా ఉండదు. అలా ఏదయినా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కథ గజముగా చెప్పాలి. అదే గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం. గజముగా ఎందుకు చెప్పాలి? అంటే ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉన్నది. భూమినుండి చాలా తక్కువ ఎత్తు మాత్రమే ఎగరగలిగిన ప్రాణి ఏనుగు ఒక్కటే. ఏనుగు పైకి ఎగరలేక పోవడానికి దాని శరీరబరువే దానికి అడ్డు వస్తుంది. మనిషి ఈశ్వరుడి వైపుకి ఊర్ధ్వ గతికి ఎందుకు నడవలేడు? అతని సంసారమే అతనికి బరువై ఉంటుంది. మగ్నత పెంచుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది. నిజమునకు అది ఏనుగు కథా లేక మన కథా? ఏనుగు కథగా విన్నా కూడా గజేంద్రమోక్ష కథను వింటే విశేషమయిన శుభఫలితం కలుగుతుందని ఆఖరున ఫలశ్రుతిలో చెప్తారు. నిత్యపారాయణము చేయవలసినదని నిర్ణయింపబడినది గజేంద్రమోక్ష కథ జీవితంలో ఒక్కసారి విన్నా చాలు. వారికి అపారమయిన ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథమును రచించారో వారు చెబుతారు. గజేంద్రమోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఫలశ్రుతిని చెప్పారు. ఈ గజేంద్రమోక్ష కథాశ్రవణము ఒక పూజకాదు, ఒక కర్మ కాదు.

పరీక్షిత్తుతో శుకుడు - ‘ఒకానొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగును ఒక మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠము నుండి కదలివచ్చి రక్షించాడు’ అని లఘువుగా చెప్పి తరవాత విషయం చెప్పబోతు ఉండగా పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మగారిని ఒక చిత్రమైన ప్రశ్న వేసారు. ‘స్వామీ! ఏమిటా కథ? అంత విచిత్రంగా చెప్పారు. నీళ్ళల్లో ఉండే జీవి మొసలి. భూమి మీద ఉండే జీవి ఏనుగు . రెండిటికీ పోరాటము ఎలా కలిగింది. ఏనుగు ప్రార్థన చేస్తే వెనకాల వస్తున్న లక్ష్మీదేవి ఉనికిని కూడా పట్టించు కోకుండా, భక్తుని కష్టము తీర్చడానికి, తనను తాను మరచి మహావిష్ణువు వచ్చి రక్షించడము ఎలా సంభవము ? ఒక అడవిలో ఈ ఏనుగు కధ ఎలా జరిగింది? వివరముగా చెప్పవలసింది అని అడిగితే’ అన్నాడు. శుకబ్రహ్మ పరీక్షిత్తు ఆర్తికి సంతోషించి గజేంద్రమోక్ష కథను చెప్పడం ప్రారంభించారు.

పూర్వము పాల సముద్రములో పదివేల యోజనముల పొడవు, పదివేల యోజనముల ఎత్తు, పదివేల గల యోజనములు వెడల్పుతో బంగారు, వెండి, ఇనుప శిఖరములతో త్రికూటాచలము అనే పర్వతము ఉన్నది. ఆ అరణ్యములో అనేకమైన ప్రాణులు సంచరిస్తూ ఉండేవి. ఎన్నో రకముల ఫలములు, పుష్పములు, కాయలు గల చెట్లు ఉన్నాయి. ఏ అరణ్యములో చాలా గొప్ప ప్రాణిగా చెప్పబడేది సింహము. వ్యాసులవారు అడవికి రాజు అయిన సింహము గొప్పదని చెప్పలేదు. అక్కడున్న వాటిల్లో ఏనుగులు గొప్పవని చెప్పారు. గుహలలో నుంచి భయంకరమైన ఆ ఏనుగులు బయటికి వస్తుంటే సూర్యాస్తమయము అయిపోయిన తరవాత చీకట్ల గుంపులు వచ్చినట్టుగా ఉండేది. వాటన్నిటికీ కొన్నిలక్షల భార్యలతో ఆనందముగా గడుపుతున్న ఎంతో బలమైన ఒక అధినాధుడు ఉండేవాడు.

కొండలు అడ్డు వస్తే కుంభస్థలములతో కొట్టి పిండి చేసేస్తాయి. పిడుగులు పడినా అవి చెక్కు చెదరవు. అవి బయటికి వస్తుంటే ఏనుగులు వస్తుంటే పులులగుంపులు పారిపోయేవి. భయంకరమైన స్వరూపములు కలిగిన భల్లూకములు గుహలలోకి పారిపోయేవి. అడవి పందులు భూమి గోతులలో దాక్కుంటూ ఉండేవి. లేళ్ళు దిక్కులయొక్క చివరకు వెళ్ళిపోతుండేవి. దున్నపోతులు నీటి మడుగులలోకి వెళ్ళి దాక్కునేవి. నెమళ్ళు ఆకాశములోకి ఎగిరిపోయేవి. చమరీ మృగములు విసన కర్రలవలె తమ తోకలతో అలసట తీరేందుకు ఏనుగులకు విసిరేవి. పది లక్షలకోట్ల ఆడ ఏనుగులకు భర్తయిన ఒక ఏనుగు అడవిలో అపారమైన ఠీవితో తిరుగుతూ సంతోషముగా కాలము గడుపుతూ ఉండేవాడు.

ఒకసారి అనుకోకుండా ఉపద్రవము వచ్చింది. అపారమైన దాహము వేసి నీటి కోసము ప్రతి రోజు వెళ్ళే దారి కాక కొత్త దారిలో వెళ్ళాడు. త్రాగుదామంటే నీళ్ళు కనపడలేదు దారి తప్పాడు. నీటి నుంచి వచ్చే గాలి ఎటు వస్తున్నదో వెతుక్కుంటూ అటు వైపు ప్రయాణము చేసి వెళ్ళాడు. ఒక గొప్ప సరోవరము కనపడింది. దాహము వేసి నీళ్ళు త్రాగవలసినవాడు ఒడ్డున నిలబడి నీళ్ళు త్రాగి వెంటనే గట్టు ఎక్కి పైకి రావాలి.

నీళ్ళు త్రాగడానికి సరస్సులోకి దిగాడు. అందులో ఉన్న పద్మములను అన్నీతొక్కి పీకేస్తూ ఉంటే చేపలు, ఎండ్రకాయలన్నీ మరణిస్తున్నాయి. తొండముల నిండా నీరు తీసుకుని చుట్టూ ఉన్న ఆడఏనుగుల మీద చల్లుతుంటే ఎంతో సంతోషిస్తున్నాయి. కొన్ని ఏనుగులు తామరపూలను మగఏనుగు మీద చల్లితే ఇంకొన్ని పూలలో ఉన్న పుప్పొడిని చల్లారు. ఇంకొన్నిఏనుగులు తామర తూడులు తీసి అలంకారము చేసారు. చుట్టూ చేరి తనభార్యలు మురిపిస్తుంటే గజేంద్రుడు పొంగిపోతున్నాడు. నాయకత్వం వహించే అధినాధుడు ఆ మందకు రాజు అయిన ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. దానికి గల భార్యల సంఖ్య పదిలక్షల కోట్లు. జీవుడు ఒక్కడే కానీ ఎన్ని శరీరములో ఈ పరివారంతో తిరుగుతున్నాడు. సంసారంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయాడు. చాలా దూరం తిరిగాడు. నీటికోసం చాలా చోట్ల వెతికాడు. చిట్టచివరకు అద్భుతమైన సరోవరం కనపడింది - అదే సంసారం. దీని ఒడ్డున ఉండి నీరు త్రాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి. ఈయన పొంగిపోయి అబ్బ! ఈ సరోవరం ఎంత బాగుందో అనుకుని తన భార్యలతో అ నీళ్ళలోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్ళలోకి దిగింది. ఆయనకు ఒక కోరిక పుట్టింది. తానెంత మొనగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు. త్రాగడానికి వెళ్ళినవాడు నీళ్ళు తాగడం మానివేసి గట్టిగా పాదములను ఊన్చుకుని నిలబడిన వాడై విపరీతమయిన శక్తితో తొండం నిండా నీళ్ళు లాగాడు. ఆ నీటివేగంతో లోపలి చేపలు వెళ్ళిపోయాయి. మొసళ్ళు వెళ్ళిపోయాయి. ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఒకసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంలో నిలబెట్టాడు. తొండమును పైకెత్తి ఆ నీళ్ళను ఆకాశం మీదకి విసిరాడు. పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో వున్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాయి. ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి. మొసళ్ళు అన్నీ మకరరాశిలో పడిపోయాయి. అలా మూడు రాశులలో పడేటట్లు కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారు. గజేంద్రుడు అలా చేసేసరికి దీనిని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడి పోయారు. అందరూ సరోవరంలో దిగి నీళ్ళు తాగేస్తున్నారు, చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు. కనపడిన చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయేసరికి నీరు బురద అయిపోయి అంతా కల్మషం అయిపోయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఆ నీటిలో ఉన్న పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణము. దీనిని పట్టుకోవాలి అనుకుని తలపైకెత్తి చూసింది. భుగ భుగమనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలను పుట్టించి నీటిని జిమ్మీ తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి ఏనుగుకాలు ఎక్కడ ఉంటుందో చూసి పట్టేసుకుంది. మొసలి నీటి అడుగునుంచి పట్టుకోవడం అంటే సంసారం ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతంగా మృత్యువు వస్తుంది. కాబట్టి మృత్యువు కాలును పట్టింది ఇహ కదలడు. పట్టు విడిపించుకుందామని చూస్తోంది. ఇపుడు మిగిలిన కోరికలన్నింటినీ పక్కన పెట్టేసినట్లయితే ఏనుగుకి ఉన్న కోరిక ఒక్కటే. ఆ మొసలి పట్టు తప్పించుకుని గట్టు ఎక్కేద్దామని ఏనుగు చూస్తోంది. ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళలోకి లాగేద్దామని మొసలి చూస్తోంది. ఇప్పడు గజరాజుతో కూడివున్న మిగిలిన పరివారం ఏమి చేస్తున్నారు?

మకరితోడ బోరు మాతంగ విభుని నొక్కరుని డించి పోవ గాళ్ళు రాక

కోరి చూచుచుండె గుంజరీయూధంబు, మగలు దగులు గారె మగువలకును.

ఈ పద్యం ఒక్కటి రోజూ స్మరణ చేసుకుంటే చాలు. వైరాగ్యం వస్తుంది. ఆయన మాతంగ విభుడు. గొప్ప ఏనుగు. ఈయన నీళ్ళల్లో యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఒడ్డున చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజుగారు యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చేస్తాడని గట్టుమీద ఉండి చూస్తున్నారు. గజేంద్రుడు అలా వెయ్యేళ్ళు యుద్ధం చేసింది. మొసలి పట్టు తప్పుకోలేక ఏనుగు 'అయ్యో! భూమి మీద ఉంటే నాకు బలం. నిష్కారణంగా నీళ్ళలోకి ప్రవేశించాను. ఈ నీళ్ళలోకి ప్రవేశించిన తరువాత ‘నావారు’ అనుకున్న వారు వెళ్ళిపోయారు. ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను. నన్ను రక్షించే వారు ఎవరు?’ అని ఆ ఏనుగు అనుకుంటూ ఉండగా పూర్వం పుణ్య ఫలము వలన ఆ స్థితిలో జ్ఞాపకమునకు వచ్చింది.

పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మృతిలోకి వచ్చిన జ్ఞానము నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తోంది.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!

ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితి కర్తో, ఎవరు ప్రళయ కర్తో, లోకములన్నిటిని ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో. లోకములు ఎవరియందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయము అయిపోతున్నాయో ఎవరు అంతటా నిండి నిబిడీ కృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతున్నదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!’ అని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు ముప్పది మూడుకోట్ల దేవతలు లేచి నిలబడ్డారు.

లోకంబులు లోకేశులు, లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం

జీకఁటి కవ్వల నెవ్వఁడు - నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

లోకములు, దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు, ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటై పోయి నీరై పోయి ముద్దయి పోయి, గాడాంధకారం కమ్మేస్తే ఈ గాడాంధకారమునకు అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు.

ఎటువంటి మహాపురుషుడయిన వాడు, తానొక్కడే ఉండి అనేకులుగా కనపడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరూ స్తుతి చెయ్యలేరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవారూ చెప్పలేదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక! దేవతలు ఎవరి మటుకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించడం లేదని కూర్చున్నారు. దేవతలు కూర్చోవడంలో ఒక రహస్యంకూడా ఉన్నది. ఏనుగు అడుగుతున్నది రక్షణ. మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీమహావిష్ణువు. కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉన్నది. ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఇన్నీ చెప్పి చివర ఒకమాట అంది

కలడందురు దీనులయెడ గలడందురు పరమయోగి గణముల పాలం

గలడందు రన్నిదిశలను గలడు కలండనెడి వాడు గలడో లేడో!

ఇంతా చెప్తోంది కానీ దానికో అనుమానం. నిజంగా దీనులయిన వారు పిలిస్తే వస్తాడా? అంతటా ఉన్నాడని అంటారు. అలా ఉన్నాడని చెప్పబడుతున్న వాడు కలడు కలడు అనేవాడు కలడో లేడో! అన్నది. ఏనుగుకి అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు.

లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్,

నీవే తప్ప నితఃపరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్,

రావే యీశ్వర! కావవే వరద, సంరక్షింపు భద్రాత్మకా!

నీవు తప్ప నాకిప్పుడు దిక్కులేదు. నేను దీనుడిని. నా తప్పులన్నీ క్షమించు ఈశ్వరా! వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా ! నన్ను రక్షించమని పిలిచి స్పష్టమయిన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయములో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠమునుండి రావాలి.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

[13/11, 11:31 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 53 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ప్రహ్లాదుడి మాటలకు హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. అటువంటి స్థితిలో హిరణ్యకశిపుడు ఒక స్తంభము వైపు వేలు చూపించి ‘ఈ స్తంభమునందు ఉన్నడా?’ అని అడిగితే ప్రహ్లాదుడు ‘అనుమానమా’ అన్నాడు. ‘అయితే చూపించు’ అన్నాడు. ‘నేను చూపించడమేమిటి – నువ్వు అడుగు వస్తాడు’ అన్నాడు ప్రహ్లాదుడు.

వెంటనే హిరణ్యకశిపుడు సింహాసనం మీదనుంచి దిగి గద ఎడమచేతితో పట్టుకుని కుడి అరచేతితో స్తంభం మీద ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమయిన మెరపు మెరిసింది. అది ప్రళయకాలంలో మెరిసే మెరపు ఎలా ఉంటుందో అటువంటి మెరపు వచ్చింది. ఆ మెరుపుకాంతికి అక్కడ ఉన్న వాళ్ళంతా స్పృహతప్పి పడిపోయారు. ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళు వస్తాయో అంత భయంకరమయిన ధ్వనులు వచ్చాయి. మహానుభావుడు అపారమయిన తేజోవంతమయిన పాదములతో, పాదములకు అలంకరింపబడిన మణి మంజీరములతో, బలిష్ఠమయిన తొడలతో, గుండ్రని పిక్కలతో, అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో, దానిమీద పెట్టబడిన మొలనూలుతో, మొలనూలు నుంచి వస్తున్న చిరుగంటల సవ్వడితో, పిడికిలితో పట్టుకోవడానికి వీలయిన సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్ళిన నాభితో, కఠినమయిన శిలవంటి విశాలమయిన వక్షస్థలంతో, అనంతమయిన బాహువులతో, శంఖ చక్ర గదా పద్మ తోరణములను గండ్ర గొడ్డలిని పట్టుకున్న వాడై, చక్కటి పొడుచుకు వచ్చిన చుబుకముతో, గాలికి అల్లల్లాడే నవపల్లవము ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషముతో కూడిన పెదవితో, ముత్యాలవంటి దంతపంక్తితో, మంధరపర్వతగుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికా రంధ్రములతో, తూర్పుకొండ మీద ప్రకాశిస్తున్న రెండు సూర్యులా అన్న నేత్రములతో, విశాలమయిన ఫాలభాగముతో, అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచితమయిన కిరీటంతో అటూ ఇటూ శిరస్సును కదుపుతుంటే ఆయన రోమములు ఆకాశమంతా వ్యాపించి కొడితే ఆకాశమునందు సంచరించే సిద్ధుల విమానము అన్నీ క్రింద పడిపోయాయి. ఆనాడు స్తంభంలోంచి బయటకు వచ్చి గర్జన చేసి ఘార్ణిల్లితే ఆ ధ్వనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయి. భూమి కంపించి బద్దలయి పోయింది. ఎక్కడి వాళ్ళక్కడ స్తంభీభూతులై ప్రళయం వస్తోందని అనుకున్నారు. ఇటువంటి మూర్తిని చూసి కూడా హిరణ్యకశిపుడు దుస్సాహసం చేశాడు. కత్తి పట్టుకుని స్వామిమీద పడ్డాడు.

స్తంభంలోంచి బయటకు వచ్చి చంద్రహాసమును దూస్తున్న హిరణ్యకశిపుని ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞచేశాడో అలా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను నాగుపాము ఒడిసి పట్టినట్లు తన ఎడమచేతితో హిరణ్యకశిపుని తొడ పట్టుకొని గడప దగ్గరకి తీసుకు వెళ్ళి ప్రళయకాలంలో వచ్చే ధ్వనిలాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కూర్చుని తన తొడల మీద పడేసి భయంకరమయిన కనుబొమలను వేయి ఇంద్రధనుస్సులను ఒక్కసారి విరిచినట్లు ముడివేసి ఘోరమయిన స్వరూపంతో ఇలా చూస్తుంటే మెరిసిపోతున్న దంష్ట్రలు, ఆ నోరు, కాలనాగు వేలాడుతున్నట్లు ఉన్న నాలుక, పెద్ద గోళ్ళు అటువంటి స్వామి తన బాహువుల నెత్తి తన గోళ్ళు చూపిస్తుంటే ఆయన స్వరూపమును చూసి కాళ్ళుచేతులు వేలాడేసి ఆయనకు లొంగిపోతే, ఆగ్రహంతో, తన భక్తుడిని ఇన్ని కష్టములు పెట్టాడన్న క్రోధంతో మాట తప్పకుండ, ఇంట్లో కాదు బయట కాదు మధ్యలో గడప మీద, ఆకాశంలో కాదు భూమి మీద కాదు తన తొడల మీద, అస్త్రము కాదు శస్త్రము కాదు, ప్రాణము ఉన్నది కాదు ప్రాణము లేనిది కాదు గోళ్ళచేత, క్రిందకాదు పైన కాదు తొడల మీద, మనిషి కాదు జంతువూ కాదు నరసింహావతారంతో, భయంకరమయిన స్వరూపంతో, విశేషమయిన క్రౌర్యంతో ఆ గోళ్ళను పొట్టలోకి దింపి భేదించి గండ్రగొడ్డలి పెట్టి ఉరః పంజరమును బద్దలు కొట్టి, హృదయ క్షేత్రమును చేతితో పట్టుకుని గుండె కింద నలిపి వేసి ఆ కండలు తెంపి ముక్కలు చేసి తుంపి అవతల పారేసి, నెత్తురు తీసి దోసిళ్ళతో నోట పోసుకుని ప్రేగులు తీసి మెడలో వేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నిలబడింది.

ఆయన వెళ్ళి సింహాసనం ఎక్కుతుంటే అసుర గణములు మీద పడ్డాయి. అనేకమయిన చేతులు పైకెత్తి ఆయుధములతో కొన్ని కోట్ల అసురులను ఒక్కడే మట్టుపెట్టాడు. సింహాసనం ఎక్కి పాదపీఠంమీద పాదములను ఉంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు కింపురుషులు అందరూ వచ్చి స్వామిని అనేకవిధముల స్తోత్రము చేశారు. ఘార్ణిల్లుతున్న శబ్దమునకు ఆయన చేస్తున్న ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేక పోయారు. ఎవ్వరూ దగ్గరకు వెళ్ళలేక అమ్మవారిని చేరి ‘అమ్మా! నీవు నిత్యానపాయినివి. నీవు మాత్రమే ఆ స్వామివారి స్వరూపమునకు ప్రళయ శాంతిని ఉపశాంతిని చేయగలవు. నీవు స్వామివారి దగ్గరకు వెళ్ళు’ అని కోరారు. ఆవిడ ‘ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉన్నది నేను సేవించే స్వామివారి ముఖ మండలములా లేదు. నా స్వామిలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే దయారసంతో కూడిన ముఖం కాదు. ఇది భార్య దగ్గరకి వెళ్ళడానికి సాహసించే మూర్తి కాదు’ అన్నది.

బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు. అయినా ఆయన చేసిన గర్జనలు ఆగలేదు. బ్రహ్మగారు ప్రహ్లాదుడిని పిలిచి ‘నాయనా! నరసింహుడు భక్త పరాధీనుడు. నీవు వెళ్ళు’ అన్నారు. ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగ పడిపోయాడు. ఇంత ధ్వని చేస్తున్న వాడు, ప్రశాంత పడిపోయి పెద్ద చిరునవ్వు నవ్వి, ‘ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించి తలమీద చేయివేసి రెండుచేతులతో పట్టుకు తీసుకువచ్చి తన తొడమీద కూర్చో పెట్టుకున్నాడు. నిజంగా ప్రహ్లాదునిది ఏమి అదృష్టం !

ఆనాడు ప్రహ్లాదుడు ‘స్వామీ నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చేయలేకపోయారు. వేదము తాను ఇక నిన్ను ఆవిష్కరించ లేనని వెనుదిరిగింది. నిన్ను రాక్షస వంశములో పుట్టిన బాలుడిని నేను ఏమి స్తోత్రం చేస్తాను? నిన్ను చేరడానికి. ‘నేను తపం చేశాను, యజ్ఞం చేశాను లేదా ఏదో క్రతువు చేశాను. ఈ కర్మచేశాను అంటే అలా నీవు కర్మలకి లొంగిపోయే వాడవు కావు. ఆ చేసిన కర్మల చేత హృదయ క్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యము ఏర్పడి ఈశ్వరుని సంతతము ధ్యాన నిష్టయందు కొలిచిన వాడెవడో అటువంటి వాడికి లొంగిపోయే స్వరూపం ఉన్నాడివి. అటువంటి స్వామివి ఇవాళ నాయందు కరుణించావు అన్నాడు. ఈ మాటలకు ప్రసన్నుడయి పోయి ఆరోజున నరసింహస్వామి – ‘ప్రహ్లాదా! ఇలా నన్ను మెప్పించిన భక్తుడు లేడు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. ప్రహ్లాదుడు ‘అందరూ నీ రూపం చూసి భయపడ్డారు. నేను నీరూపం చూసి భయపడలేదు. నాకు నీవెప్పుడూ తండ్రివే. నేను సంసారమునకు భయపడతాను. కామక్రోధములకు భయపడతాను. ‘నేను’ ‘నాది’ అనే భావనలకు భయపడతాను. నాకు వరం ఇస్తానని నన్ను మరల మభ్యపెట్టాలని చూస్తున్నావా తండ్రీ! నాకేమీ వద్దు. సంతతము నీపాదాంబుజ సేవ కటాక్షించు. నీ నామము చెప్పుకునే అదృష్టమును కటాక్షించు. నీ కథలు వినే అదృష్టమును కటాక్షించు. నాకింకేమీ వద్దు’ అన్నాడు. స్వామి ‘అసలు నీలాంటి భక్తుడు ఎక్కడ ఉన్నాడు? నిన్ను చూసి పొంగిపోతున్నాను. నీవు ఏదో ఒకటి అడగకపోతే నేను నాకు తృప్తి ఉండదు. నా తృప్తి కోసం ఏదో ఒకటి అడగవలసింది’ అంటే ప్రహ్లాదుడు ‘ఎంత కాదన్నా హిరణ్యకశిపుడు నా తండ్రి, అజ్ఞాని. అతడు ఎన్ని నీచ యోనులలోకి వెడతాడో! అలా వెళ్ళకుండా నా తండ్రిని నీ దగ్గరికి చేర్చుకుంటే నా తండ్రి కాబట్టి, నాకు జన్మనిచ్చిన వాడు కాబట్టి నేను సంతోషిస్తాను’ అన్నాడు. స్వామి పెద్ద నవ్వు నవ్వి ‘ప్రహ్లాదా! నీ చరిత్రము ధన్యము. ఎంత గొప్ప వరం అడిగావు. ఏనాడు నీ తండ్రి నేను కోరలు విప్పి పళ్ళు చూపిస్తూ గోళ్ళు అతని కడుపు పైనుంచి నా నేత్రములతో చూస్తూ ఉంటే అతి దగ్గరగా మహర్షులు, మునీంద్రులు కూడా చూడని నా రూపమును తేజోహీనుడై అలా చూస్తూ ప్రాణములను వదిలాడో ఆనాడే నాకు దగ్గర అయిపోయాడు. నువ్వు నీ తండ్రి గురించి బెంగ పెట్టుకోవద్దు. రాజ్యపాలన చేసి వంశమును వృద్ధిలోకి తెచ్చుకో’ అని స్వామి వారు ఆనాడు మనకందరికి గొప్ప వరమును కటాక్షించారు. అదే మనందరం కూడా తప్పకుండా స్మరించవలసిన పద్యం.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

[13/11, 11:31 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 55 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా

పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోప లో

త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము ‘పాహి పాహి’ యనగుయ్యాలించి సంరంభియై.

ఎక్కడో వైకుంఠము లోపల ఉన్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకము అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా శ్రీమన్నారాయణుడు ఆడుకుంటున్నాడు. అలాంటి స్థితిలో తనని ఎవరయినా ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమని శరణాగతి దీనముగా ప్రార్థించేసరికి దాని దురవస్థను గమనించాడు.

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింప డే

పరివారంబును జీరడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం

తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో

పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.

లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిటకొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయనవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆ జుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటున్నది. ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంతో సౌజన్యమూర్తి

తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె

న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ

క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రా వచ్చి రొ

య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్.

ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమోదకము, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వస్తున్నాయి. విష్వక్సేనుడు, నారదుడు వస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలివాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వస్తున్నారు.

వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు. అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏడిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అన్నది.

అడిగెదనని కడు వడి జను, నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్

వెడవెడ సిడిముడి తడబడ, నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!

అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.

మకరము అని పేరు కలిగిన మకరరాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవనిధులలో ఒక నిధియైన మకరనిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాక్కుంది. ప్రతిమొసలి కూడా భయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకున్నదై కాలు ఒకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మళ్ళీ అందరూ వచ్చేశారు. ఒక తామరపువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వలోకమునకు వెళ్ళాడు.

ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. శుకుడు - ఒకప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజుగారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వతశిఖరం మీద కూర్చుని అష్టాక్షరీమంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్యమహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్యమహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమోగుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించెదవు గాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి ఉంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయినవారు ఏనాడు ఇంటికి వస్తారో ఆనాడు పూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకువచ్చి శరణాగతి చేశాడు. ఒంట్లో ఓపిక ఉండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి.

మొసలిలోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వకాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవణ మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవణమహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. మొసలయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. గంధర్వుడై గంధర్వలోకమునకు వెళ్ళిపోయాడు.

ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్రమోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నవారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. రోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలిగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో మంగళతోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్రమోక్షమును వినడము ద్విగుణీకృతమయిన పుణ్యం. ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు ఉన్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy