22, జూన్ 2023, గురువారం

మచ్చల నివారణ

 శరీరం పైన ఏర్పడు మచ్చల నివారణ కొరకు సులభ యోగాలు  -


       శరీరం పైన వివిధ కారణాల వలన అనేక రకాలైన మచ్చలు ఏర్పడును . అటువంటి మచ్చలు కొరకు ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి సమస్య నుంచి బయటపడగలరు.


 మచ్చల నివారణాయోగాలు  -


 *  పచ్చి బొప్పాయిని గిల్లినప్పుడు వచ్చే పాలను రాయుచున్న మచ్చలు తగ్గును.


 *  అవిసె గింజల నూనెను ప్రతిరోజు రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చలు మాయం అగును.


 *  గోధుమపిండిని పులియబెట్టిన కడుగులో కలిపి మచ్చలపైన ప్రతినిత్యం పూయుచున్న మచ్చలు హరించును .


 *  జీడిమామిడి గింజల పైపెచ్చులు నలగగొడితే వచ్చే నూనెని మచ్చలపైన రాయుచున్న త్వరగా మచ్చలు హరించును .


 *  కొంచం నీటిలో పసుపు వేసి చిక్కగా కలిపి రోజూ రాయుచున్న శరీర మచ్చలు తగ్గును.


 * మంచి నాణ్యమయిన కుంకుమపువ్వు నీటితో తడిపి మచ్చల పైన పూయుచున్న మచ్చలు తగ్గును.


 *  ప్రతినిత్యం జాజికాయ అరగదీసి ఆ గంధాన్ని రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చల నివారణ అగును.


 *  నేలతంగేడు వ్రేళ్ళను తీసుకొచ్చి నీడలో ఎండించి ఎండిన వేళ్ళను నీటితో అరగదీయగా వచ్చిన గంధాన్ని మచ్చలపైన రెండుపూటలా రాయుచున్న మచ్చలు నివారణ అగును.


         నేను పైన చెప్పిన యోగాలు మచ్చల నివారణలో అత్యద్భుతముగా పనిచేయును కొన్ని రొజులపాటు విడవకుండా పాటించండి. మచ్చలు పోవడం కొంచం కష్టసాధ్యముగా ఉండును. పైన చెప్పిన ఔషధయోగాలలో మీకు సులభమయినది విడవకుండా వాడండి. తప్పక ఫలితాన్ని పొందుతారు.


     మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

హర్షంబొప్పగ

 శా.

హర్షంబొప్పగ నార్ద్ర వ్రాలె; ధరణిన్ వ్యాపించె సౌగంధ్యమున్;

కార్షవ్రాతము విత్తె; వేసవియు తా కాఠిన్యతన్వీడెగా; 

మర్షంబుప్పతిలంగ మారుతము సమ్మానించె దాక్షిణ్యమై;

వర్షాకాలదురంతహేల రమయై వచ్చెం ధరామార్గమున్ 


*శ్రీశర్మద* 

8333844664

భూమిపై 19 గంటలు మాత్రమే

 ఒకప్పుడు భూమిపై 19 గంటలు మాత్రమే ఉన్నాయనే సంగతి మీకు తెలుసా..


సుమారు ఒక బిలియన్ సంవత్సరాల క్రితం, భూమి( Earth ) యొక్క భ్రమణం వేగవంతంగా మారిందని, దీనివల్ల మన రోజుల వ్యవధి తక్కువ అయిందని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఆ సమయంలో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, భూమిపై బలమైన గురుత్వాకర్షణ ప్రభావం చూపడం వల్ల ఇది జరిగిందని వారు అభిప్రాయపడ్డారు.

సాధారణంగా, చంద్రుడు భూమి నుంచి నెమ్మదిగా కదులుతాడు, కానీ కోట్ల సంవత్సరాల క్రితం అది భూమికి దగ్గరగా వచ్చింది.తత్ఫలితంగా, భూమి భ్రమణం వేగంగా మారి.

ఇప్పుడు ఒక రోజులో ఉన్న 24 గంటలకు బదులుగా అప్పుడు 19 గంటలు మాత్రమే ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.

కాలక్రమేణా భూమి భ్రమణం ఎలా మారుతుందో చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.ఇక్కడ భూమి భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరిగే కాలం.ఈ భ్రమణం ఎంత వేగంగా జరిగితే అంత తక్కువ సమయంలో రోజు గడిచిపోతుంది.

అయితే గత బిలియన్ సంవత్సరాలలో, భూమిపై రోజుల వ్యవధి ప్రతి సంవత్సరం ఒక చిన్న మొత్తంలో పెరుగుతూ వస్తోందని వారు ఈ అధ్యయనంలో కనుగొన్నారు.అయితే, కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం భూమి భ్రమణం ప్రారంభం కావడానికి ముందు అది స్థిరమైన వేగంతో ఉండేదని చెబుతున్నారు.

భూమి భ్రమణం( Earth Rotation ), భూమిపై కాలం గురించి పరిశోధించడానికి, రాస్ మిచెల్, ఉవే కిర్షెర్ అనే ఇద్దరు భూభౌతిక శాస్త్రవేత్తలు భూమి చరిత్ర నుంచి భిన్నమైన ఆధారాలను పరిశీలించారు.గ్రహం చలించటం, వంగిపోవడం వంటి వాటి వల్ల భూమిపై వచ్చిన ఉష్ణోగ్రత మార్పుల రికార్డులను కూడా వారు అధ్యయనం చేశారు.

వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలలో ( Oxygen levels )పెద్ద పెరుగుదల వంటి భూమిపై కొన్ని పెద్ద మార్పుల తర్వాత ఈ స్థిరమైన భ్రమణం జరిగింది.ఈ పెరుగుదల ఓజోన్ పొరను సృష్టించింది.

ఓజోన్ పొర సూర్యుని హానికరమైన కిరణాల నుండి మనలను రక్షిస్తుంది.ఈ కాలం తర్వాత, భూమి భ్రమణం మళ్లీ మందగించడం ప్రారంభించింది.

⚜ శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం

 🕉 మన గుడి : 




⚜ కడప జిల్లా : చల్లగిరిగెల


⚜ శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం


💠 ఈ ఆలయంలో శ్రీ రామచంద్రస్వామి పద్మాసనంలో ఉండి , కోదండం లేకుండా, చిన్మయి ముద్రా ధ్యానంలో ఉన్మాడు.

సీతమ్మ వారు పద్మాసనంలో ఉండి పుష్పం పట్టుకొని ఉన్నారు.

లక్ష్మణస్వామి నిల్చుని కోదండం పట్టుకుని ఉన్నారు.

ఆంజనేయస్వామి ముని కాళ్లమీద కూర్చొని రెండు చేతులతో గ్రంథం పట్టుకుని సీతమ్మవారి  దగ్గర పడమటి ముఖంగా ఉన్నాడు .

ఇక్కడ రామచంద్రస్వామి ధ్యానం లో ఉన్నట్టు మరి ఎక్కడ లేరు .


💠 స్థలపురాణానికి వస్తే పరిక్షిత్తు మహారాజు కుమారుడు అయిన జనమేజయుడు ఇక్కడ వున్న సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత పట్టాభి రామచంద్రస్వామిని ప్రతిష్టించాడు.


💠 జనమేజయుడు తన తండ్రి పరిక్షిత్తు మరణానికి కారణమైన తక్షకుడనే పాము మీద కోపంతో సమస్త సర్పజాతిని అంతంచేసే సర్పయాగం చేసాడు.

అలా చేయడం వలన అమాయకులైన అనేక సర్పాలు ఆ యజ్ఞంలో పడి చావటం వలన జనమేజయ మహారాజుకు చాలా పాపం సంక్రమించింది.

బ్రాహ్మణుల సలహా ప్రకారం 101మందిరాలు స్థాపిస్తే సంక్రమించిన పాపానికి పరిహారం జరుగుతుందని తెలుసుకున్నాడు.


💠 ప్రతి దగ్గర తాను వుండడం కుదరని కారణాన ఆయన 101 భాణాలు వదిలి ఆయా ప్రదేశాలలో 101వైష్ణవ మందిరాలు బ్రాహ్మణ సహితుడై స్థాపించాడు.

అలా వెలసినదే చల్లగిరిగల తీర్థస్థలి.


💠 అయితే ఈ ప్రదేశంలోనే స్వామి వెలవడానికి వేరొక పౌరాణిక కారణం కలదు.

చల్ల అనగా మజ్జిగ, గిరి అనగా పర్వతం.

త్రేతాయుగ కాలమున ఈ పర్వత స్థానువులు ఎన్నో రమణీయమైన పుష్ప,ఫల భరితమైన వృక్షాలతో శోభాయమానంగా వుండి ఆకర్షణీయంగా వుండేవి.

వనవాస కాలమున రామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతుడై ఇక్కడ సేదతీరి,దప్పక గొని చల్ల(మజ్జిగ) త్రాగి దప్పిక తీరి పూర్ణసంతుష్టుడయ్యాడని స్థలపురాణం చెబుతోంది.


💠 ఇంకా ఇక్కడ రామానుజాచార్యులు, ఇతర ఆళ్వారులు ఇక్కడకు వచ్చి స్వామిని కీర్తించారని ఇక్కడ వున్న ఆళ్వారులు సన్నిది తెలుపుతోంది.

ఎక్కువమందికి తెలియక పోయినా ఈ స్థలం ఒంటిమిట్టకంటే ప్రాశస్త్యాన్ని చెందినదని అక్కడ నుంచి విచ్చేసిన పూజారులే అంగీకరించారు.


💠 బద్వేలు నుంచి చల్లగిరిగెలకు 25 కిమీ దూరం ,

పోరుమామిళ్ల నుంచి చల్లగిరిగెలకు 15 కిమీ దూరం ,

కడప నుంచి చల్లగిరిగెల 

కు 87 కిమీ.

ఇంకొక డాక్టరుని చూస్తా

 ఇంకొక డాక్టరుని చూస్తా 

ఒక పెద్దాయనకు రీనల్ ఫెయిల్యూర్,డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, కార్డియాటిక్ మిసఫంక్షన్, లివర్ సోరోసిస్, మొదలైన వ్యాధులతో ఒక పెద్ద హాస్పిటల్లో చేరాడు,  ఆయన చుట్టూ, కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవారాళ్ళు అందరు ఆయనకు సేవలు చేయటానికి  వచ్చారు. ఒక్కొక్క డాక్టరు వచ్చి ఒక్కొక్క రోగానికి చికిత్స చేస్తూ వున్నారు. ఎవరు ఏ మందులు ఇస్తున్నారో పాపం అక్కడ వున్న కొడుకులకు తెలియటంలేదు.  ఏ డాక్టర్ ఏ మందులు, ఇంజక్షన్లు తెమ్మంటే అవి తెచ్చి ఇస్తున్నారు.  అప్పటికే హాస్పిటల్ బిల్లు డాక్టర్ల బిల్లులు లక్షలు దాటాయి.  ఎప్పుడు ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందో నని భయం భయంగా అందరు ఎదురు చూస్తూవున్నారు. 

ఆయనను చూసే అందరు డాక్టర్లు మీటింగు పెట్టుకొని చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే ఆ పెద్దాయన ఇంకొక గంట లేక గంటన్నర మాత్రం బతకగలడు అనే ఉమ్మడి నిర్ణయానికి వచ్చి ఆ రోగితో వచ్చిన కొడుకులకు విషయం చెప్పారు. మీరు కావాలంటే అయన ఎవరినయిన చూస్తానంటే పిలిపించండి అని చెప్పారు.  చిన్నగా ఆ వార్త ఆ పెద్దాయన కొడుకు  నాన్న నీవు ఇంకొక గంట మాత్రం బ్రతుకుతావు నీవు ఎవరినయినా చూడదలుచుకుంటే చెప్పు పిలిపిస్తాం అని అన్నారు.  ఆ మాట విన్న ఆ పెద్దాయన ఏ మాత్రం బెదరకుండా చిరునవ్వుతో నాయనా "నాకు ఇంకొక డాక్టరుని చూడాలని ఉందిరా" అని అన్నాడు. ఇది చదవటానికి నవ్వు వచ్చేదిగా  ఉంటుంది. కానీ ప్రతి మనిషి అలవరచుకోవలసిం లక్షణం అదే అదేమిటో చూద్దాం. 

ప్రతి మనిషి రెండిటితో ఎప్పుడు ముడివేసుకుని ఉంటాడు అదేమిటంటే సుఖము, దుఖ్ఖము. మనిషి ఆలోచనలు వాటి ఫలితాలు ఎప్పుడు ఈ రెండిటిలో ఏదో ఒకదానికి తావు ఇస్తాయి. అది యెట్లా అంటే నిన్ను ఎవరైనా మెచ్చుకొని, పొగిడారనుకో అప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది అంటే అది సుఖం అన్న మాట.  అదే నిన్ను ఎవరైనా దూషించినా, కించపరచినా అవమానపరచిన వెంటనే నీకు కోపం వస్తుంది దాని పర్యవసానమే దుఃఖం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి సదా ఈ రెండు మానసిక స్థితుల మధ్యనే ఉగిసలాడుతూ ఉంటాడు. దానివలన అనవసరపు ఆలోచనలు చివరకు అనేకవిధాల అనారోగ్య సమస్యలు వస్తూవుంటాయి. ఈ రెండిటిని సమతుల్యం చేయగల వానిని స్థితప్రగ్న్యుడు అంటారు.  ప్రతి సాధకుడు స్థితప్రజ్ఞత సాదించాలి. 

ఒకమనిషి ఒక గంటలో చనిపోతాడు అని తెలిస్తే వెంటనే ఎంతో ఆందోళన భయం చెప్పలేని బాధ కలుగుతాయి.  కానీ స్థితప్రజ్ఞత కలిగినవాడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలరు అదే పైన పెద్దాయన నిర్ణయం.  ఇంతమంది డాక్టర్లు వైద్యం చేస్తున్న ఆయనకు స్వస్థతను చేకూర్చలేక పోయారు ఇంకొక డాక్టరు అయన ఆయనను బ్రతికిస్తాడనేది ఆశా వాదం. ప్రతి మనిషి ఆశావాదిగా మాత్రమే తన జీవితాన్ని గడపాలి.  అప్పుడే జీవితాన్ని సాపీగా ఎలాంటి ఒడిదుడుకులనేనా ఎదుర్కొని ముందుకు సాగగలడు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే చాలామంది సాధకులు ప్రారంభంలో నాకు ధ్యానం మీద మనస్సు లగ్నత కలగటం  లేదు నేను సాధనను కొనసాగించలేను అని చిన్న చిన్న అవరోధాలకు భయపడి సాధనను ప్రారంభంలోనే మానుకునే సాధకులు ఎందరో.  కానీ ఏ సాధకుడు అయితే ఎలాంటి అవరోధాన్ని అయినా ఎదుర్కొని ముందుకు సాగుతాడో అతనే మోక్షాన్ని పొందగలడు. 

మన మహర్షులు మనకు త్రివిధమైన అవరోధాలను తెలిపారు అవి 1) ఆద్యాత్మికం 2) అది భౌతికము 3) అధి దైవికము ఈ మూడు అవరోధాలను ఏ సాధకుడు అయితే ఎదుర్కొని తన సాధనను కొనసాగిస్తాడో ఆ సాధకుడు మాత్రమే మోక్షాన్ని చేరుకోగలడు. 

ఇప్పుడే దృఢ సంకల్పం తీసుకో ఎలాంటి అవరోధాలు ఎదురైనా నేను నా సాధనను నిలిపి వేయను. ప్రతి నిత్యం నేను నా మనస్సును పరమేశ్వరుని మీదనే నిలుపుతాను.  ఎట్టి పరిస్థితిలోకూడా నేను నా దృష్టిని ఈశ్వరునిమీద నుంచి మరల్చను.  నేను అరిషడ్వార్గాన్ని పూర్తిగా నా స్వాధీనంలో ఉంచుకుంటాను.  ఐహికమైన ఎటువంటి ప్రలోభాలకు నేను  లొంగను. అనే దృఢచిత్తంతో వున్న సాధకునికి మోక్షము కారతలామలకాలము అవుతుంది ఇది సత్యం. 

సాధకుడు ముందుగా దేహ వ్యామోహాన్ని వదలాలి అప్పుడే సాధనలో ముందుకు వెళ్లగలడు.  

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

పౌరోహిత్యం

 పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగమ్ 

శ్లో II

పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగమ్ 

మాఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నమ్ 

బ్రహ్మద్వేషః ఖలజరతిః ప్రాణినాం నిర్దయత్వం,

మాభూ దేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు.


ఓ పశుపతీ ! పౌరోహిత్యము, జాగరణము, గ్రామాధిపత్యము, నియోగము, మఠాధిపత్యము, అసత్యవాదిత్వము, సాక్షిగ బోవుట, పరాన్నభోజనము, బ్రాహ్మణ ద్వేషము, దుష్టసాంగత్యము, నిర్దయత్వము - యివి నాకు జన్మజన్మాంతరములకూ కలుగనీయవద్దు, స్వామీ !

దీనిని బట్టి చూస్తే మనం ఎంతపాపము చేస్తున్నామో......

అరుచుకుంటున్నారు

 ఒక రోజున ఒక సాధువు తన శిష్యులతో కలిసి గంగానది వద్దకు స్నానం చెయ్యడానికి వెళ్ళేడు.


      అక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు కొంతమంది కోపంతో ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. 

ఆ సాధువు తన శిష్యులవైపు చూసి నవ్వుతూ వారిని ఇలా అడిగేడు.  

“కోపంలో ఉన్నప్పుడు మనుషులు ఒకరిపై ఒకరు ఎందుకు అరుచుకుంటారు?” ఒక్క క్షణం ఆలోచించిన తరవాత ఆ శిష్యులలో ఒకడు ఇలా సమాధానం చెప్పేడు, 

“మనం సహనాన్ని కోల్పోవడం వల్ల అరుస్తుంటాము”.  

“కాని మనుషులు పక్కనే ఉన్నప్పుడు అలా అరవలసిన అవసరం ఏముంది? 

మెల్లగా పక్కనే ఉన్నవాళ్ళకి నెమ్మదిగా చెప్పవచ్చు కదా” అన్నారు సాధువు.  మిగిలిన శిష్యులు కూడా వారికి తోచిన విధంగా సమాధానాలు చెప్పేరు, 

కాని ఎవరుచెప్పిన అభిప్రాయము సంతృప్తికరంగా లేదు.  

చివరకు సాధువు ఇలా వివరించేరు.  

ఇద్దరు వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు చాలా దూరం అయిపోతాయి. ఆ దూరాన్ని అధిగమించడం కోసం, వాళ్ళకి వినిపించడంకోసం అలా గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. కోపం ఎక్కువయిన కొద్దీ తమ మధ్య పెరుగుతున్న దూరం కారణంగా మరింత గట్టిగా అరుచుకుంటారు.  

అదే ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది?  

వాళ్ళు ఏమాత్రం అరుచుకోకుండా ఎంతో మెల్లగా, మృదుమధురంగా మట్లాడుకుంటూ ఉంటారు, 

ఎందుకంటే వారి హృదయాలు ఎంతో దగ్గరగా ఉంటాయి.  

కనుక ప్రేమలో ఉన్నప్పుడు మనుషుల హృదయాల మధ్య దూరం చాల తక్కువగా, అసలు దూరమే లేనట్లుగా ఉంటుంది.  

ఆ సాధువు తన శిష్యులకు ఇంకా ఈ విధంగా వివరించేరు.  

మనుషులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? 

వాళ్ళు మాట్లాడరు, ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ చాలా ప్రేమగా దగ్గరవుతారు. 

చివరకు వాళ్ళ్ళకు గుసగుసలతో కుడా అవసరం లేకుండా  ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ చూపులతోనే మాట్లాడుకుంటారు. 

అంతే ఆవిధంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారి హృదయాలమధ్య అసలు దూరమే లేకుండా దగ్గరవుతాయి.  

ఆ సాధువు తన శిష్యులతో ఇంకా ఈ విధంగా అన్నాడు.  

“కాబట్టి మీరు వాదించుకునేటప్పుడు కోపంతో మీ హృదయలను దూరం చేసుకోకండి. 

మనుషుల మధ్య దూరం పెరిగే విధంగా మాట్లాడకండి, 

లేకపొతే ఆ దూరం ఎప్పటికీ దగ్గర కాలేనంతగా పెరిగిపోతుంది.”  

కోపం వచ్చినపుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఉత్తమమైన పద్ధతి. అటువంటి కోపంలో మట్లాడే మాటలు అవతలి వ్యక్తి హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి. కోపం మనల్ని మనకి ప్రియమైన వారి నుండి దూరం చేస్తుంది.

ముక్తిని పొందుదాం!*

 

           *ముక్తిని పొందుదాం!*

                  ➖➖➖✍️


*ప్రతి జీవుడు తాను తల్లిగర్భములో ఉన్నప్పుడు ఏడవ మాసములో ఉన్నప్పుడు తనకు పూర్వజన్మ స్మృతులు పూర్తిగా గుర్తుకు వస్తాయి. తాను గత జన్మలలో భగవంతుణ్ణి సేవించకపోవడము వలననే ఇప్పుడు మరోసారి తల్లిగర్భములోనికి ప్రవేశించవలసి వచ్చిందని గుర్తిస్తాడు.*


*గర్భములో నరకయాతన ఉంటుంది. శిశువు తలక్రిందులుగా వ్రేలాడదీయబడి కదలాడానికి కూడా చోటు ఉండదు. అనేక క్రిములు కరుస్తూ ఉంటాయి .చర్మము ఏర్పడదు. తల్లి ఏవైనా కారము, ఉప్పు అధికముగా తిన్నట్లైతే వెంటనే గర్భములోని శిశువు ను బాధిస్తుంది. మలమూత్రాదులు త్రాగవలసి వస్తుంది. గర్భములో భరించరాని దుర్వాసన ఉంటుంది. ఇదంతా భరించరాని నరకము. మనమందరమూ ఈ గర్భస్త నరకాన్ని అనుభవించినవారమే.* 


*గర్భస్థ స్థితిలో జీవుడి పై మాయా ప్రభావము ఉండదు.  అప్పుడు జీవుడికి కృష్ణభగవానుడు గుర్తుకు వస్తాడు ."హే కృష్ణా నన్ను ఈ ఒక్కసారి ఈ గర్భ నరకములోనుంచి బయటపడవేయమని, తాను బయటకురాగానే నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తానని వేడుకుంటాడు".  కానీ తల్లి గర్భములోనుంచి బయటపడగానే మాయా ప్రభావంలో పడి భగవంతుణ్ణి మరచిపోతాము.*


*ఈ వివరణ శ్రీమద్భాగవతం లో కపిలభగవానుడు తన తల్లి దేవహుతికి వివరించడము జరిగింది. కావున  మరోజన్మ ఉండకూడదని, మరోసారి గర్భస్థ నరకబాధను అనుభవించకూడదని మనము గుర్తించి శ్రీకృష్ణ భగవానుని నామాన్ని శ్రవణం చేస్తూ,  కీర్తిస్తూ, స్మరణం చేయడం వలన మన మరణ సమయంలో శ్రీకృష్ణభగవానుని స్మరించే అవకాశం ఉంటుంది.  మరణ సమయంలో శ్రీకృష్ణభగవానుని స్మరించినవారికి శాశ్వత ముక్తి లభిస్తుంది.*


*మనకు కలిగే నిజమైన దుఃఖములు - జన్మ, మృత్యువు, ముసలితనము, అనారోగ్యములు.* 


*మనము ఈ దుఃఖముల నుండి శాశ్వతమైన ముక్తి మార్గము గురించి ఆలోచించాలి. అసలు ఎందుకు మనకు ఇష్టం లేకపోయినా మనము దుఃఖబాధలకు గురవుతున్నామో ఆలోచించాలి.*


 *మనము గర్భావస్థలో ఉన్నప్పుడు భగవంతునికి ఇచ్చిన వాగ్ధానాన్ని మనము పాటించకపోవడం వల్లనే మనము మళ్లీ మళ్లీ జన్మలను పొందుతున్నాము. మనము దుఃఖములకు గురవుతున్నాము. మనము మరోసారి జన్మను పొందకపోవడమే మన అన్ని దుఃఖములకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం మనము భగవంతుని నామాన్ని జపించడమే.  ఇదే  మన అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం .*


*భగవంతునికి, భగవంతుని నామానికి బేధము లేదు.*


*కలియుగంలో ముక్తికి ఏకైక మార్గం హరినామ స్మరణ.*


*శ్రీ చైతన్య మహా ప్రభువు మనలను హరేకృష్ణ మహామంత్రము జపము, కీర్తనలు చేయమని సూచించారు. శ్రీకృష్ణభగవానుని ప్రేమతో భక్తియుతసేవలో పాల్గొనమని సూచించారు.* 9440652774.


*మహామంత్రం:*


*"హరేకృష్ణ   హరేకృష్ణ   కృష్ణకృష్ణ హరేహరే!* 

*హరేరామ హరేరామ రామరామ హరే హరే !! "*


*నిరంతరం జపం చేద్దాం. ముక్తిని పొందుదాం. శాశ్వతమైన ఆనందలోకమైన గోలోకంలో శాశ్వతంగా  నివసించే ప్రమోషన్ పొందుదాం.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺

గృహస్థాశ్రమమునే ఆశ్రయించి వుందురు

 శ్లోకం:☝️

*యథా వాయుం సమాశ్రిత్య*

  *సర్వే జీవంతి జంతవః l*

*తథా గృహస్థమాశ్రిత్య*

  *వర్తంత ఇతరాశ్రమాః ll*


భావం: ఎలా సర్వ జీవులు వాయువు నాశ్రయించి ప్రాణములతో నుంటూన్నవో అలాగనే అన్ని ఆశ్రమముల వారూ  గృహస్థాశ్రమమునే ఆశ్రయించి వుందురు. గృహస్తులే ఇతర (బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస) ఆశ్రమముల వారందరినీ పోషించెదరని భావం.

చరిత్ర చెప్పిన సత్యం

 🙏🏻 *కామన్ సివిల్ కోడ్ ఎందుకు కావాలో ఒక చిన్న ఉదాహరణ తో చూద్దాం* 


.(ఉద్యోగ,ఆర్థికపరమైన) ది. దీని కన్నా ఇంకా ఎన్నో ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి. 

ఇక్కడ ఆనంద్  స్థానంలో ఏ వర్గం ఉందొ, భాషా అహ్మద్ స్థానం లో ఏ వర్గం ఉందొ ఊహించడం కష్టం కాదు

* **** *

ఇద్దరు

A:ఆనంద్ స్వామి  మరియు B:భాషా అహ్మద్

ప్రభుత్వ ఉద్యోగులు 

.

పక్క పక్కనే 

స్థలం కొని ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్నారు.


 1970  లో ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి.

ఆనంద్ స్వామి కి  1972 లో 1వ సంతానం, 1973 లో 2వ  సంతానం   మొత్తం ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత  ప్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్.


భాషా అహ్మద్ కి 1972 లో1వ సంతానం

           1973 లో2

           1974 లో3

          1975 లో4వ

మొత్తం నలుగురు పిల్లలు.


1976 లో భాషా అహ్మద్  2 వ పెళ్లి చేసుకున్నాడు .         

   2 వ భార్యకు

            1977 లో1

             1978 లో2

             1979 లో3

              1980 లో4వ, మొత్తం 4 పిల్లలు

1982  లో మళ్ళీ 3 వ పెళ్లి

               1983 నుండి1987 వరకు ఇంకో 4 పిల్లలు


1988 లో 4 వ పెళ్లి  కేవలం 25సం౹౹ వయసు ఉన్న అమ్మాయి తో పెళ్ళి...

           1989 నుండి  1993 లోపు 3 గురు పిల్లలు..

4గురు భార్యలకు కలిపి మొత్తం 15 మంది సంతానం..


మంది ఎక్కువ అవడం తో పక్క పక్కనే ఉన్న వీరికి  ఇంటి గొడవలు. 

ఆనంద్ స్వామి తన స్వంత ఇల్లు అయినకాడికి బాషా ఆహ్మద్ కు అమ్మేసి వేరే చోటుకు షిఫ్ట్ ఆయ్యాడు.


2008 లో ఇద్దరూ రిటైర్ అయ్యారు.

ఇద్దరికీ పెన్షన్ వస్తోంది.

దురదృష్టవశాత్తు 202౦ లో ఇద్దరూ కరోనా తో చనిపోయారు


ఆనంద్ స్వామి భార్య కి పెన్షన్ వస్తుంది.


భాషా అహ్మద్ 4 గురు భార్యలకు పావు వంతున పెన్షన్స్ వస్తున్నాయి.

2022లో ఆనంద్ స్వామి భార్య పోయింది.

అదే సం౹౹లో భాషా అహ్మద్  మొదటి భార్య కూడా చనిపోయింది.

ఆనంద్ స్వామి  కుటుంబానికి పెన్షన్  ఆగిపోయింది. (పిల్లలు settled అవ్వడం వల్ల/మేజర్ అయితే)


కానీ భాషా అహ్మద్ మిగిలిన ముగ్గురు భార్యలకు(1,2,3వ) 1/3 వంతున పెన్షన్ వస్తుంది. ఇంకో 10 ఏళ్లకు భాషా అహ్మద్ 2 వ భార్య చని పోతుందనుకుంటే

మిగతా ఇద్దరికి 1/2  హాఫ్ పెన్షన్ ఆ తర్వాత

ఇంకో 10 ఏళ్లకు 3 వ భార్య పోతే

4 వ భార్య కు 100% పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఈ నాలుగవ బార్య తన పెళ్లి నాటికి వయస్సు 25 yrs కాబట్టి ఇంకో 20 ఏళ్ళు ఆవిడకు  పెన్షన్ వస్తుంది (ప్రభుత్వ సొమ్ము)


ఇక్కడ ఆనంద్ స్వామి కుటుంబానికి 2025 లోనే పెన్షన్ ఆగిపోతుంది. కానీ భాషా అహ్మద్ ఫామిలీ కి 2050 తర్వాత కూడా పూర్తి పెన్షన్ వస్తుంది..

ఒకేసారి చేరిన ఇద్దరి ప్రభుత్వ ఉద్యోగుల మధ్యే ఇంత వ్యత్యాసం ఉంటే ఎన్ని వేల మంది భాషా అహ్మద్ లు ఈ దేశంలో  ఉద్యోగాల్లో ఉన్నారో ఎంత ప్రభుత్వ సొమ్ము (ప్రజల టాక్స్) తింటున్నారో ఊహించండి..

అంతేకాక భాషా అహ్మద్ కుటుంబ సభ్యులు ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కనుక వారి కుటుంబ సభ్యులకు నెలకి 25 కిలోలు చొప్పున 100 కిలోలు బియ్యం ఇతర రేషన్ ఉచితం.

ఇది కాక Govt schemes ద్వారా ఇతర సదుపాయాలు ఉంటాయి.

వాళ్ళ voters list బట్టి కానుకలు (రంజాన్ తోఫాలు) కూడా వస్తాయి

ఇక్కడ ఆనంద్ స్వామి మరియు భాషా అహ్మద్ ఇద్దరూ ఆరోగ్యవంతులైనా ఆనంద్ స్వామి కి లేని అవకాశాలు/లాబాలు భాషాఅహ్మద్ కి ఇవ్వ వలసి వచ్చింది ? ఎందుకంటే ముస్లీం పర్సనల్ లా వల్ల, 

అది కనుక continue అయితే ఇంకొక 20 years తర్వాత ఆనంద్ స్వామి మతం జనాభా తగ్గి భాషాఅహ్మద్ జనాభా పెరిగి పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల లో లాగ హిందువులను తరిమివేస్తారు.


ఆ మధ్య  ఒక live example చూడండి 1960 లో బర్మా నుండి వచ్చిన 4 సభ్యులున్న కుటుంబం ఇప్పుడు 1000 మందితో విస్తరించింది(రాజమండ్రి లో) ఓ తెలుగు సినీ కామెడియన్ ఇంటర్వూలో చెప్పినట్టు..


భాషాఅహ్మద్ పిల్లల పిల్లలు గురించి చెప్తే,మనకి ఇంకా బీపీ... వస్తుంది.


ఇది ఇలాగే కొనసాగితే ఈ దేశం లో ఒక వర్గం వారు చంపబడతారు,, లేదా మతం మారుతారు, లేదా దేశం వదిలి పారిపోయి పరాయి దేశాల్లో హీనంగా (2nd class citizens గా) బ్రతుకుతారు..ఇది తధ్యం.


ఒక కోణంలో మాత్రమే మనం టచ్ చేసిచూశాం...


'UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్' ఎందుకు కావాలో చాలా య

కారణాలు ఉన్నాయి.


డబ్బు కావాలంటే కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ దేశాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని, సంస్కృతి ని, సంప్రదాయాలను చివరికి ప్రాణాలను తిరిగి తెచ్చుకోలేము.


కొందరు ఇలా జరుగుతుందా ? అని  మరికొందరు నా కుటుంబం వరకు రాలేదు కదా అని మౌనంగా వుంటారు. కానీ వారి ఉదాశీనత ఒక జాతి ని అంతమొందిస్తుంది  అని తెలుసుకోలేకపోతున్నారు.


కాబట్టి  'UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్' కావాల్సిందే.


అడవిలో క్రూర జంతువులు తక్కువుగా, సాధు జంతువులు ఎక్కువుగా ఉంటే అది చాలా కాలం ఉంటుంది. అలా కాకుండా క్రూర జంతువులు ఎక్కువై సాధు జంతువులు తక్కువైతే అడవి లో ఏ జంతువులు బ్రతకలేవు


ఇది చరిత్ర చెప్పిన సత్యం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 98*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 98*


కాశీ క్షేత్రము నుంచి శ్యామశాస్త్రి కబురు పంపించాడు. 'చాణక్యుని మాతృమూర్తి దేవకి తీవ్ర అస్వస్థతతో మంచము పట్టివున్నారని, కుమారుని కడసారి చూపు చూడవలెనని తపించుచున్నదని' వార్తాహారుడు విన్నవించాడు. 


ఆ వార్త విని చాణక్యుడు తీవ్ర విచారగ్రస్తుడయ్యాడు. దుఃఖవేదనను నిగ్రహించుకొనుటకు తీవ్ర ప్రయత్నం చేశాడు. 


ఆర్యుని మనోవేదనని చూడలేక తలడిల్లిపోయారు మురా, చంద్రగుప్తులు. వారు అనేక విధాల ఆర్యునికి హితధైర్యవచనాలు చెప్పారు. 


"కాశీరాజుకి తక్షణం వర్తమానం పంపించి ఆర్యని మాతృమూర్తిని రాజవైద్యుల పర్యవేక్షణలో పల్లకిలో పాటలీపుత్రమునకు రప్పిస్తానని" చంద్రుడు చెప్పగా, చాణక్యుడు తల అడ్డుగా తిప్పి "కాశీ పుణ్యక్షేత్రమునందే కన్ను మూయవలెనని మా అమ్మగారి కోరిక. ఈ పరిస్థితిలో ఆమెను ప్రయాణం చేయించుట యుక్తం కాదు" అని చెప్పి తానే కాశీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తన వెంట వస్తానన్న చంద్రుని వారించి, వెంట పంపుతానన్న సైనిక పరివారాన్ని వలదని చెప్పి తానొక్కడే అశ్వారుడుడై కాశీకి బయలుదేరాడు చాణక్యుడు. 


మూడురాత్రింపగళ్లు సుదీర్ఘ ప్రయాణానంతరం కాశీ చేరుకొని శ్యామశాస్త్రి గృహాన్ని చేరుకున్నాడు ఆర్యుడు. వీధి ద్వారకముకడనే కాశీరాజు హృషికేశవర్మ విచారగ్రస్థ వదనముతో చాణక్యునకు స్వాగతం పలికాడు. రాజవైద్యులు ఆ మరుక్షణమే చాణక్యుని దర్శించి పెదవి విరిచారు. 


శ్యామశాస్త్రి దుఃఖేద్వేగాన్ని బలవంతంగా బిగబట్టుకుంటూ చాణక్యుని ఇంటిలోపలికి తోడ్కోని పోయాడు. చాణక్యుని అర్ధాంగి గౌతమి గుడ్లనీరు కక్కుకుంటూ ఏడాది చంటిబిడ్డ అన్నపుర్ణను చంకనేసుకుని అతనికి ఎదురొచ్చింది. 


అందరి చూపులను తప్పించుకుంటూ పొంగిపొర్లుతూ బైటికి తన్నుకు రావాలని ప్రయత్నిస్తున్న దుఃఖాన్ని గొంతులోనే బిగబెట్టుకుంటూ కన్నతల్లి వైపు దీనంగా, బాధగా, ఆర్ద్రతగా చూసాడు చాణక్యుడు. బ్రాహ్మణ చాదస్తానికి తగినట్టు కుక్కిమంచంలో శుష్కించిన దేహంతో పడివుండి అంతిమక్షణాల కోసం నిరీక్షిస్తోంది అతని మాతృమూర్తి దేవకి. 


"నారాయణా.... నారాయణా..." గొణుగుతున్నట్లు హీనస్వరంతో నారాయణ నామస్మరణ చేస్తోంది దేవకి. ఎక్కడో దక్షిణాంధ్రలో పుట్టి... వేదవేదాంగవేత్త అయిన చణకుల వారికి ధర్మపత్ని అయి... అకుంఠిత విష్ణుభక్తి తత్పరురాలై... ఆ మహావిష్ణువుని స్వప్నంలో సాక్షాత్కరింపజేసుకుని... ఆయన వరప్రసాదంగా కారణజన్ముడైన చాణక్యునికి జన్మనిచ్చి... ఆ కొడుకు భవిష్యత్తుకోసం తక్షశిలకు చేరి, ఆ తదుపరి కాశీ క్షేత్రాన్ని చేరుకొని... కన్నకొడుకు కళ్యాణాన్ని కళ్లారా చూసి... మనమరాలి ముద్దు ముచ్చటలతో మురిసిపోయి... అలిసిపోయిన ఆ ముదసలి ప్రాణి ... ప్రాపంచిక స్మృతి, శృతిలను అధిగమించి... నారాయణ నామస్మరణ... తన జీవితాంతం స్మరిస్తూ వచ్చిన విష్ణునామ చేస్తూ.... 


"అమ్మా.... నేనొచ్చాను..." పలకరించాడు చాణక్యుడు తల్లి పక్కన కూర్చుంటూ డగ్గుత్తికతో.... దుఃఖంతో అతని గొంతు అర్చుకుపోతోంది. కన్నతల్లికి కడసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు కన్నీళ్ళతో.... 


"అమ్మా .... నేనమ్మా .... నేను... నీ విష్ణుగుప్తుడ్ని...." దుఃక్కోద్వేగంతో పిలిచాడు చాణుక్యుడు. 


ఆ పిలుపు ఎక్కడో నూతిలోంచి హీనస్వరంతో పిలిచినట్లు వినిపించింది దేవకికి... నారాయణ నామస్మరణ చేస్తున్న ఆవిడలో స్వల్పకదలిక... 


"నేనమ్మా... నీ విష్ణుని...." దుఃఖంతో కాస్త గట్టిగా పిలిచాడు చాణక్యుడు, అతడి చెంపల మీదుగా కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయి. దేవకి ఆ పిలుపుకి స్పందించింది. నెమ్మదినెమ్మదిగా కన్నురెప్పలు పైకెత్తింది. 


"అమ్మా .... నేనమ్మా... నేను..." ఆశగా, ఆరాటంగా తల్లి ముఖంలోకి చూశాడు ఆర్యుడు దుఃఖోద్వేగంతో. 


దేవకి కనురెప్పల్ని మరింత విశాలం చేసింది. తన ఎదురుగా ఉన్న చాణక్యుని వైపు తేరిపార చూడబోయింది. అప్పుడు సంభవించిందో అద్భుత పరిణామం... 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹

ప్రారబ్ద కర్మఫలాన్ని

 .                     🔯  

             _*సుభాషితము*_



శ్లోకం:

*అవశ్యం భావిభావానాం*

   *ప్రతీకారో భవేద్యది l* 

*తదా దుఃఖైర్న సీదేరన్*

   *నల రామ యుధిష్ఠిరాః ll*

    - ధర్మసేతువు


భావం: ప్రారబ్దకర్మ ఫలభోగాలను నివారించే పద్ధతి వుండివుంటే, నలమహారాజు, రాముడు, ధర్మరాజు ముగ్గురూ అరణ్యంలో వుండి అనేక దుఖాలను అనుభవించి వుండేవారు కారు.

   అంతటి మహానుభావులే ప్రారబ్ద కర్మఫలాన్ని తోసివేయలేక పోయినప్పుడు, ఇక సామాన్యుల విషయం చెప్పగలమా? కాబట్టి పూర్వజన్మల్లో మనం చేసిన చెడు పనులకి ఫలితంగా ఈ జన్మలో వచ్చే కష్టాలని అనుభవించి క్షయం చేసుకోవడం తప్ప పరిహారాలు అంటూ ఉండవు అని భావం.

దక్షిణామూర్తి అష్టకం-

 శుభోదయం🙏


జగద్గురువులు*శ్రీ ఆది శంకరుల విరచిత ... శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము* 


*1.విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం*

*పశ్యన్నాత్మని మాయయా* *బహిరివోద్భూతం* *యధానిద్రయా*

*యస్సాక్షాత్కురుతే* *ప్రభోధసమయే స్వాత్మానమే* *వాద్వయం*

*తస్మై శ్రీగురు మూర్తయే* 

*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*🌟ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది. నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*


*2.బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః*

*మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం*

*మాయావీవ విజృంభ త్యపి మయా* *యోగేవయః స్వేచ్ఛయా*

*తస్మై శ్రీగురు మూర్తయే* 

*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*🌟వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*


*3.యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే*

*సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్*

*యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ*

*తస్మై శ్రీగురు మూర్తయే* 

*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*🌟ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*


*4.నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప* *ప్రభాభాస్వరం*

*జ్ఞానం యస్యతు* *చక్షురాదికరణ* *ద్వారా బహిస్పందతే*

*జానామీతి తమేవ* *భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్*

*తస్మై శ్రీ గురు మూర్తయే* 

*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*🌟ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*


*5.దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః*

*స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః*

*మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే*

*తస్మైశ్రీ గురుమూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*🌟కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది. మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*


*6.రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్*

*సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్*

*ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే*

*తస్మై శ్రీగురుమూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*🌟రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*


*7.బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వా స్వవస్థాస్వపి*

*వ్యావృత్తా స్వను వర్తమాన మహమి* *త్యంతస్స్ఫురంతం* *సదా స్వాత్మానం* *ప్రకటికరోతిభజతాం* *యోముద్రయా భద్రయా*

*తస్మైశ్రీగురుమూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 


*🌟ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*


*8.విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః*

*శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః*

*స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః*

*తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 


*🌟 ఎవరి మాయ వలన ఈప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి), శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*


*9.భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః* *పుమాన్*

*నిత్యభాతి* *చరాచరాత్మక* *మిదం* *యస్మైచ మూర్త్యష్టకం*

*నాన్యత్కించ నవిద్యతే* *విమృశతాంయస్మాతత్పర స్వాదిభో*

*తస్మై గిరి మూర్తయే* 

*నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 


*🌟ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.🌟*


*10.సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్* *స్తవే తేనాస్వ* *శ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్*

*సర్వాత్మత్వ మహావిభూతి సహితం* *స్వాదీశ్వత్వం స్వతః*

*సిద్ధేత్తత్పురష్టధా* *పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్!!*


*🌟ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును. సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*

సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం








 సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్ గ్రామం, కామారెడ్డి జిల్లా

--------------------------------------------------------------------

కృష్ణం వందే జగద్గురం !! సర్వ లోక రక్షకుడు శ్రీ కృష్ణ పరమాత్ముడు !! అటువంటి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణ మహానుబావునికి అడుగడుగునా గుడులే !! అటువంటి దివ్య క్షేత్రాల్లో ఒకటైన సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం కామారెడ్డి జిల్లా లో నాగిరెడ్డి పేట్ మండల కేంద్రం లో గల చీనూర్ గ్రామం లో వెలసిన అద్బుతమైన క్షేత్రం !!

700 సంవత్సరాల క్రితం నిజం రాజుల కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు గారి స్వప్నం లో భగవత్ రూపం లో ఒక్క వ్యక్తి కనిపించి గ్రామానికి చివరలో ఉన్న కొలనులో వేణుగోపాల స్వామి విగ్రహ రూపం లో ఉన్నాడు దాన్ని వెతికి తీసి దేవాలయం నిర్మించాలని చెప్పి అతను అదృశ్యమయ్యాడు అటు ఆ తరువాత రోజు రాజు గారు తన సైన్యం తో ఆ కొలను ను దర్శించి అక్కడ వెతకమని ఆదేశించాడు అచట చాల ప్రయత్నం తరువాత వాళ్ళకి ఒక సుందర విగ్రహం రెండున్నర అడుగుల వేణు గోపాల స్వామి వారిది రుక్మిణి ,సత్యభామల తో దొరికింది.

స్వామి వారి విగ్రహాల తో పాటు శ్రీ సుదర్శన పెరుమాళ్, శ్రీమన్నారాయణ విగ్రహాలు దొరకగ వాటిని తీసుకొని వచ్చి రాజు గారు ఒక అద్బుతమైన దేవాలయాన్ని నిర్మించి స్వామి వారలను ప్రతిష్టించారు అని స్థల పురాణం ! స్వామి వారి విగ్రహాల తో పాటు నమ్మాళ్వార్, భగవద్ రామానుజుల విగ్రహాలు ప్రతిష్టించారు.స్వామి వారికి జరిగే పూజలు,విశేష పర్వదినాల్లో జరిగే కార్యక్రమాలు ఎంతో రమణీయంగా,కన్నుల పండుగగా ఆగమ శాస్త్రాల ప్రకారం జరుగుతాయి .

ఈ దేవాలయం లో వెలసిన వేణుగోపాల స్వామి ని సంతాన వేణు గోపాల స్వామి గా ప్రసిద్దిగాంచాడు ఎవరైతే ఈ క్షేత్రం లో స్వామి వారిని మనసా వాచా ఆ స్వామి వారిని కొలిచి పూజిస్తారో వాళ్ళకి మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని అనాదిగా భక్తుల నమ్మకం !!

ఈ ఆలయం లో వెలసిన మరో సుందర విగ్రహం శ్రీ సుదర్శన పెరుమాళ్ స్వామి వారిది.ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామి కి అభిషేకం, హోమం వంటి దివ్యమైన పూజలు జరిపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య అయిన తొలిగి పోతుంది అని నమ్మకం 

స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా జరుగుతుంది ! ఆ కార్యక్రమం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్న విధంగా జరిపిస్తారు.స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం!

ప్రతి ఒక్కరు తప్పకుండ ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ జగన్నాథుని కృపా కటాక్షాలు పొందాలని మనవి !

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు !

⚜ శ్రీ వృషభాచలేశ్వర ఆలయం

 🕉 మన గుడి : 


⚜ కడప జిల్లా : పులివెందుల












⚜ శ్రీ వృషభాచలేశ్వర ఆలయం


💠 పురాణాలను పరిశీలిస్తే మానవులైనా ... దానవులైనా అడిగినదే తడవుగా వాళ్లకి వరాలను ప్రసాదించే దేవతలుగా బ్రహ్మ ... శివుడు కనిపిస్తారు. 

వారు ప్రసాదించిన వరాలతో దానవులు దుర్మార్గాలకు పాల్పడుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు రంగంలోకి దిగుతాడు. దానవులు పొందిన వరాలలో లోపాలను గుర్తించి ఆ దిశగానే వారి ఆటకట్టిస్తుంటాడు.

ఇదే విషయం మనకి మరోమారు స్పష్టం చేస్తుంది 'వృషభాచల క్షేత్రం'. 


💠 ఇది కడప జిల్లా పులివెందుల సమీపంలోని వేంపల్లె గ్రామంలో దర్శనమిస్తుంది. 

ఇక్కడి ఎత్తైన కొండను అంతా 'ఎద్దులకొండ' అని పిలుస్తుంటారు. 

ఈ కొండపైనే పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి ఆవిర్భవించాడు.


💠 వెంపల్లె పాపాగ్ని నదీ తీరంలో కొండపై నెలకొన్న పురాతన ఆలయం. 

ఇటీవలే పునరుద్ధరణ జరిగి నూతనంగా నిర్మించడం జరిగింది, స్వామి వారు వృషబాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఇక్కడ వెలసినందున స్వామి వారికి "వృషభచలేశ్వర స్వామి" అని పేరు. 


⚜ స్థల పురాణం ⚜


💠 పూర్వం వృషభుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతమున ఉండేవాడు, గొప్ప విష్ణుభక్తుడు అయినా రాక్షసుడైనందున ఇక్కడి తపోధనులైన ఋషులను బాధించేవాడు.


💠 'వృషభాసురుడు' దేవతలవలన గానీ ... దానవులవలన గానీ ... మానవుల వలన గాని తనకి మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాన్ని పొందాడు. అప్పటి నుంచి సాధుజనులను అనేక విధాలుగా బాధించడం మొదలుపెట్టాడు.

దాంతో దేవగణాలు ...ముని గణాలు శ్రీ మహావిష్ణువుకి పరిస్థితిని వివరించి ఆందోళనను వ్యక్తం చేశారు.

వృషభాసురుడి బాధలను తొలగించమని శ్రీహరిని ప్రార్థించగా ధర్మరక్షణ నిమిత్తము శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన వృషభాసురుని సంహరించుటకు సిద్ధమైనాడు

 

💠 వృషభాసురుడికి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఒకసారి గుర్తుచేసుకున్న శ్రీమహావిష్ణువు, ఆ వరంలో జంతువుల ప్రస్తావన లేకపోవడంతో, ఎద్దు రూపంలో ఆ రాక్షసుడితో పోరాడి సంహరించాడు.

 

💠 వృషభుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకుని తనను కొండగా చేసి శిరస్సున స్వామి కొలువై శాశ్వతముగా తన పేరున పూజలందుకుని మోక్షాన్ని కలుగజేయమని వరం కోరాడు. శ్రీమహావిష్ణువు తన భక్తుని కోరిక మేరకు వృషభ రూపమును ధరించి తన భక్తుడైన వృషభాసురుని శిరస్సుపై తన ముందురి కాళ్ళ గిట్టలతో అదిమిపట్టి అచలునిగా(కొండగా) చేశాడు .

నాటి నుండి వేల సంవత్సరాలుగా స్వామివారు వృషభాచలేశ్వరునిగా (వృషభం,=ఎద్దు,అచలం= కొండ=ఎద్దులకొండ),  వెలసి ఎద్దుల కొండ్రాయునిగా  ఎంతో మంది భక్తులకు ఇలవేల్పుగా పూజలందుకొనుచున్నాడు


💠 అనంతరం అమ్మవారితో కలిసి ఈ క్షేత్రంలో ఆవిర్భవించాడు. 

ద్వాపరయుగంలో జరిగిన ఈ సంఘటనకు వేదికగా నిలిచిన ఈ కొండ 'ఎద్దులకొండ'గా ప్రసిద్ధి చెందగా, స్వామివారు 'వృషభాచలేశ్వరుడు' గా పూజలు అందుకుంటున్నాడు.


💠కొండపై నుండి వర్షాకాలంలో పాపాగ్ని నది సోయగాలు వీక్షించడం ఒక అనిర్వచనీయమైన అనుభవం.

ఇది భాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి.

పాపాగ్ని నది ముఖ్యంగా 5 చోట్ల పవిత్రమైనది గా వ్యవహరిస్తారు... 

వాటిలో గండి, భాస్కర క్షేత్రం(ఎద్దులకొండ) ప్రముఖమైనదిగా చెప్పవచ్చు.

ఇక్కడ పాపాగ్ని నది ఉత్తరoగా ప్రవహించడం మరో విశేషం.


💠 ఇటీవలి కాలంలో దేవాదాయ ధర్మాదాయశాఖవారు మరియు రాజకీయ నాయకులు, భక్తుల కృషితో దినదినాభివృద్ధి చెందుచు, కొండపైకి తారు రోడ్డును వేసి బైక్లు,ఆటోలు, కార్లు, బస్సులద్వారా భక్తులు కొండపైకి చేరుకునే సౌకర్యమును కలుగచేసినారు.


💠 ఇక్కడి ఆలయంలో ధనుర్మాసంలో విశేష పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. 


💠 కోరిన కోరికలను స్వామి వెంటనే తీరుస్తాడనే విశ్వాసం కారణంగా, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.


💠 ఆలయాన్ని వెంపల్లె నుంచి ఆటోలో చేరుకోవచ్చు.

 ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రం గండికి దగ్గర లో ఉంది

పక్షిణాం బల మాకాశం

 ఓం శ్రీ వేంకటేశాయ నమః


శ్రీమద్విఖనస గురవేనమః


సంధ్యావందనము


విశిష్టత


పక్షిణాం బల మాకాశం, మాత్స్యానా ముదకం బలమ్, దుర్బలస్య బలం రాజా బాలానాం రొదనమ్ బలమ్, బ్రహ్మణస్య సంధ్యావందనం బలమైశ్వర్యమ్


తాత్పర్యము : పక్షులకు ఆకాశమే బలము, చేపలకు ఊదకమే బలము, బడుగువర్గం వారికి రాజే బలము, పసిపాపలకు ఏడుపే బలము. బ్రహ్మణునికి సంధ్యావందనము బలము మరియు ఐశ్వర్యము