22, జూన్ 2023, గురువారం

సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం








 సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్ గ్రామం, కామారెడ్డి జిల్లా

--------------------------------------------------------------------

కృష్ణం వందే జగద్గురం !! సర్వ లోక రక్షకుడు శ్రీ కృష్ణ పరమాత్ముడు !! అటువంటి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణ మహానుబావునికి అడుగడుగునా గుడులే !! అటువంటి దివ్య క్షేత్రాల్లో ఒకటైన సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం కామారెడ్డి జిల్లా లో నాగిరెడ్డి పేట్ మండల కేంద్రం లో గల చీనూర్ గ్రామం లో వెలసిన అద్బుతమైన క్షేత్రం !!

700 సంవత్సరాల క్రితం నిజం రాజుల కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు గారి స్వప్నం లో భగవత్ రూపం లో ఒక్క వ్యక్తి కనిపించి గ్రామానికి చివరలో ఉన్న కొలనులో వేణుగోపాల స్వామి విగ్రహ రూపం లో ఉన్నాడు దాన్ని వెతికి తీసి దేవాలయం నిర్మించాలని చెప్పి అతను అదృశ్యమయ్యాడు అటు ఆ తరువాత రోజు రాజు గారు తన సైన్యం తో ఆ కొలను ను దర్శించి అక్కడ వెతకమని ఆదేశించాడు అచట చాల ప్రయత్నం తరువాత వాళ్ళకి ఒక సుందర విగ్రహం రెండున్నర అడుగుల వేణు గోపాల స్వామి వారిది రుక్మిణి ,సత్యభామల తో దొరికింది.

స్వామి వారి విగ్రహాల తో పాటు శ్రీ సుదర్శన పెరుమాళ్, శ్రీమన్నారాయణ విగ్రహాలు దొరకగ వాటిని తీసుకొని వచ్చి రాజు గారు ఒక అద్బుతమైన దేవాలయాన్ని నిర్మించి స్వామి వారలను ప్రతిష్టించారు అని స్థల పురాణం ! స్వామి వారి విగ్రహాల తో పాటు నమ్మాళ్వార్, భగవద్ రామానుజుల విగ్రహాలు ప్రతిష్టించారు.స్వామి వారికి జరిగే పూజలు,విశేష పర్వదినాల్లో జరిగే కార్యక్రమాలు ఎంతో రమణీయంగా,కన్నుల పండుగగా ఆగమ శాస్త్రాల ప్రకారం జరుగుతాయి .

ఈ దేవాలయం లో వెలసిన వేణుగోపాల స్వామి ని సంతాన వేణు గోపాల స్వామి గా ప్రసిద్దిగాంచాడు ఎవరైతే ఈ క్షేత్రం లో స్వామి వారిని మనసా వాచా ఆ స్వామి వారిని కొలిచి పూజిస్తారో వాళ్ళకి మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని అనాదిగా భక్తుల నమ్మకం !!

ఈ ఆలయం లో వెలసిన మరో సుందర విగ్రహం శ్రీ సుదర్శన పెరుమాళ్ స్వామి వారిది.ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామి కి అభిషేకం, హోమం వంటి దివ్యమైన పూజలు జరిపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య అయిన తొలిగి పోతుంది అని నమ్మకం 

స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా జరుగుతుంది ! ఆ కార్యక్రమం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్న విధంగా జరిపిస్తారు.స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం!

ప్రతి ఒక్కరు తప్పకుండ ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ జగన్నాథుని కృపా కటాక్షాలు పొందాలని మనవి !

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు !

కామెంట్‌లు లేవు: