🕉 మన గుడి :
⚜ కడప జిల్లా : చల్లగిరిగెల
⚜ శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం
💠 ఈ ఆలయంలో శ్రీ రామచంద్రస్వామి పద్మాసనంలో ఉండి , కోదండం లేకుండా, చిన్మయి ముద్రా ధ్యానంలో ఉన్మాడు.
సీతమ్మ వారు పద్మాసనంలో ఉండి పుష్పం పట్టుకొని ఉన్నారు.
లక్ష్మణస్వామి నిల్చుని కోదండం పట్టుకుని ఉన్నారు.
ఆంజనేయస్వామి ముని కాళ్లమీద కూర్చొని రెండు చేతులతో గ్రంథం పట్టుకుని సీతమ్మవారి దగ్గర పడమటి ముఖంగా ఉన్నాడు .
ఇక్కడ రామచంద్రస్వామి ధ్యానం లో ఉన్నట్టు మరి ఎక్కడ లేరు .
💠 స్థలపురాణానికి వస్తే పరిక్షిత్తు మహారాజు కుమారుడు అయిన జనమేజయుడు ఇక్కడ వున్న సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత పట్టాభి రామచంద్రస్వామిని ప్రతిష్టించాడు.
💠 జనమేజయుడు తన తండ్రి పరిక్షిత్తు మరణానికి కారణమైన తక్షకుడనే పాము మీద కోపంతో సమస్త సర్పజాతిని అంతంచేసే సర్పయాగం చేసాడు.
అలా చేయడం వలన అమాయకులైన అనేక సర్పాలు ఆ యజ్ఞంలో పడి చావటం వలన జనమేజయ మహారాజుకు చాలా పాపం సంక్రమించింది.
బ్రాహ్మణుల సలహా ప్రకారం 101మందిరాలు స్థాపిస్తే సంక్రమించిన పాపానికి పరిహారం జరుగుతుందని తెలుసుకున్నాడు.
💠 ప్రతి దగ్గర తాను వుండడం కుదరని కారణాన ఆయన 101 భాణాలు వదిలి ఆయా ప్రదేశాలలో 101వైష్ణవ మందిరాలు బ్రాహ్మణ సహితుడై స్థాపించాడు.
అలా వెలసినదే చల్లగిరిగల తీర్థస్థలి.
💠 అయితే ఈ ప్రదేశంలోనే స్వామి వెలవడానికి వేరొక పౌరాణిక కారణం కలదు.
చల్ల అనగా మజ్జిగ, గిరి అనగా పర్వతం.
త్రేతాయుగ కాలమున ఈ పర్వత స్థానువులు ఎన్నో రమణీయమైన పుష్ప,ఫల భరితమైన వృక్షాలతో శోభాయమానంగా వుండి ఆకర్షణీయంగా వుండేవి.
వనవాస కాలమున రామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతుడై ఇక్కడ సేదతీరి,దప్పక గొని చల్ల(మజ్జిగ) త్రాగి దప్పిక తీరి పూర్ణసంతుష్టుడయ్యాడని స్థలపురాణం చెబుతోంది.
💠 ఇంకా ఇక్కడ రామానుజాచార్యులు, ఇతర ఆళ్వారులు ఇక్కడకు వచ్చి స్వామిని కీర్తించారని ఇక్కడ వున్న ఆళ్వారులు సన్నిది తెలుపుతోంది.
ఎక్కువమందికి తెలియక పోయినా ఈ స్థలం ఒంటిమిట్టకంటే ప్రాశస్త్యాన్ని చెందినదని అక్కడ నుంచి విచ్చేసిన పూజారులే అంగీకరించారు.
💠 బద్వేలు నుంచి చల్లగిరిగెలకు 25 కిమీ దూరం ,
పోరుమామిళ్ల నుంచి చల్లగిరిగెలకు 15 కిమీ దూరం ,
కడప నుంచి చల్లగిరిగెల
కు 87 కిమీ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి