19, అక్టోబర్ 2024, శనివారం

Panchaag

 


నచ్చనివారలకిదియే

 


కం.

నచ్చనివారలకిదియే 

హెచ్చరికగ మేము జెప్పు నీప్సిత మహహా! 

పచ్చని పక్షుల జాతులు 

హెచ్చుగ బోషించ మేలు నిమ్ముగ బెరుగన్ 


కం.

పక్షులె మిత్రులు సృష్టికి 

దక్షులు కశ్మలమణచగ ధారుణిలోనన్ 

భక్షించుచు కీటకముల 

రక్షించును పంటలన్ని లక్ష్యముతోడన్ 

*~శ్రీశర్మద*