9, మే 2026, శనివారం

ఆదివారం*🌞 *🌹10, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🌞 *ఆదివారం*🌞

   *🌹10, మే, 2026🌹* 

   *దృగ్గణిత పంచాంగం* 

                 

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : అష్టమి* మ 03.06 వరకు ఉపరి *నవమి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : ధనిష్ఠ* రా 12.50 వరకు ఉపరి *శతభిషం*

*యోగం : బ్రహ్మ* రా 02.09 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం  : కౌలువ* మ 03.06 *తైతుల* రా 03.21 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 10.00 మ 02.00 - 04.30*       

అమృత కాలం  :*మ 01.49 - 03.30*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం :సా04.46- 05.38* 

*రాహు కాలం  :సా04.53- 06.29*

గుళికకాళం     : *మ 03.17 - 04.53*

యమగండం    : *మ 12.04 - 01.40*

సూర్యరాశి : *మేషం*               

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 05.46* 

సూర్యాస్తమయం :*సా 06.39*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.39 - 08.13*

సంగవ కాలం      :*08.13 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.21*

అపరాహ్న కాలం  :*మ 01.21- 03.55*

*ఆబ్ధికం తిధి        : శూన్య తిథి*

సాయంకాలం     :*సా 03.55- 06.29*

ప్రదోష కాలం      :*సా 06.29- 08.43*

రాత్రి కాలం         :*రా 08.43 - 11.41*

నిశీధి కాలం        :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.54*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*హిరణ్యగర్భాయ నమః*  

*నాభిస్థానే మాం రక్షతు ।*


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*


       *శ్రీ మహావిష్ణు పురాణం*                              

               *83వ భాగం*


          *శ్రీరామావతారం-4*


        *సీతా స్వయం వరం,*

           *శివధనుర్భంగo*```


విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులు మిథిలానగరంలో ప్రవేశించారు. నగర ప్రవేశ ద్వారము వద్ద నున్న రక్షక భటులు విశ్వామిత్ర మహర్షి ఆగమన సమాచారాన్ని జనక మహారాజుకి తెలియజేశారు. 


జనకుడు తన మంత్రి పరివార గణంతో మహర్షికి స్వాగతం పలకడానికి బయలుదేరాడు.


విశ్వామిత్ర మహర్షి వెంట వినయంగా నడిచే నీలమేఘశ్యామ వర్ణపు దివ్య సుందర శరీరముతో ప్రకాశిస్తున్న శ్రీరాముడు “పదహారు ఏళ్ల వయస్సులోనే తాటకి సుబాహువు మొదలైన పద్నాలుగు వేల రాక్షసులను వధించాడు” అన్న సమాచారం తెలిసిన నగర ప్రజలు దారికి రెండు వైపుల నుంచుని గౌరవభావంతో నమస్కరిస్తున్నారు.


“శ్రీరాముని సుందర ఆకారము చూసి సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే మన మిథిలకు వచ్చినట్లుంది. మన సీతమ్మకు తగిన వరుడు” అని పూలు చల్లుతూ మహిళలు స్వాగతం పలుకుతున్నారు. తమకు నమస్కరిస్తున్న ప్రజలకు శ్రీరాముడు లక్షణునితో కలసి చిరునవ్వుతో ప్రతినమస్కారం చేస్తూ విశ్వామిత్ర మహర్షి వెంట ముందుకు వెళుతున్నారు.


రాజమార్గము చేరిన విశ్వామిత్ర మహర్షికి, రామలక్ష్మణులకు జనకుడు ఎదురు వెళ్లి స్వాగతం పలికి రాజభవనం లోకి తీసుకువెళ్లి అర్ఘ్యపాద్యములు ఇచ్చి అతిథి సేవ చేసి సముచిత ఆసనం పై విరాజమానుని చేసాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి వెనుక వినయంగా చేతులు కట్టుకుని నిలిచిన రామలక్ష్మణులను చూసి జనకుడు “మహర్షీ! పద్నాలుగు వేల రాక్షస సైన్యాన్ని, తాటకి సుబాహుల వంటి భయంకర రాక్షసులను సంహరించి యాగ రక్షణ చేసిన బాలవీరులు వీరేనా?” అని అడిగాడు.


విశ్వామిత్రుడు చిరునవ్వుతో అవునన్నట్టు చూసి, వారిని జనకునికి పరిచయం చేస్తూ “జనక మహారాజా! ఈ నీలమేఘశ్యాముడు కోసలరాజు దశరథుని పెద్దకుమారుడు శ్రీరాముడు. ఆ సువర్ణవర్ణ రూపుడు శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు. పరమేశ్వర ప్రసాదిత శివ ధనుస్సుని చూడాలనే అభిలాషతో నా వెంట వచ్చారు” అని చెప్పాడు.


తన పుత్రిక సీతకు తగిన వరుడు రాముడు అని భావించిన జనకుడు “స్వయంవరానికి కాదు. ధనుస్సు చూడటానికి” అని విశ్వామిత్రుడు చెప్పటంతో జనకుడు మదిలో కొంత నిరాశ చెందాడు. బయటకు కనపడనీయకుండా జనకుడు మహర్షిని, రామలక్ష్మణులను మరునాడు జరుగబోయే స్వయంవరానికి ఆహ్వానిస్తూ “రేపు స్వయంవర సభలో శివధనుస్సును స్వయంగా చూడవచ్చును” అని పలికి వారికి తగిన విడిది ఏర్పాటు చేసాడు.


శ్రీరాముని విడిది గృహంలో చాటుగా చూసిన పరిచారికలు సీతాదేవి మందిరానికి వెళ్లి ఆమెతో తాటకాది రాక్షసులను సంహరించిన రాముని పరాక్రమాలు, అందచందాలు వర్ణించి “సీతాదేవికి అన్నింటిలో తగిన జోడు శ్రీరాముడు. స్వయంవరంలో ధనుస్సు ఎత్తి జానకమ్మను తప్పక చేపడతాడు” అని తమ అభిప్రాయం ప్రకటించేసారు.


ఆ రోజు సాయంత్రం వనవిహారానికి వచ్చిన శ్రీరాముని దుర్గాదేవి ఆలయానికి పూజకు వెళుతున్న సీతాదేవి క్షణం పాటు చూసింది. రాముడు సీతను క్షణం పాటు చూసాడు. ఇరువురి చూపులు కలుసుకుని మనస్సులు పలకరించుకున్నాయి. తనను శ్రీరాముని భార్యగా చేయమని సీతాదేవి అమ్మవారిని ప్రార్ధిస్తూ పూజించింది.


మరుసటి రోజు స్వయంవర సభకు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో వచ్చాడు. 


జనకుడు వారికి స్వాగతం పలికి తగిన ఆసనం పై ఆసీనులను చేసాడు. సీతాదేవి అంతఃపుర గవాక్షపు తెరచాటు నుండి రాముని చూసి ఆనందపడింది. స్థిమిత పడింది. స్వయంవర సభ ప్రాంగణం ఆహ్వానితులైన రాజులతో నిండి పోయింది. మిథిల నగర ప్రజలు స్వయంవరం చూడటానికి విచ్చేశారు.


జనకుడు స్వయంవరం ప్రకటించాడు. సీతాదేవి వరమాలతో జనకుని పక్కన వచ్చి నిలుచుంది. 5 వేల మంది ధృడకాయులు శివధనుస్సు గల శకటాన్ని తమ బలం పూర్తిగా ఉపయోగిస్తూ తీసుకు వచ్చి సభా మండపం మధ్యలో ఉంచారు. చెమటలు పడుతూ ఆయాసపడుతున్న ఆ ధృడకాయులను చూసి కొందరు రాజులు శివధనుస్సు ఎత్తడం తమ వలన కాదని పోటి నుండి విరమించుకుని ప్రేక్షకులగా ఉండిపోయారు.


సీతాదేవి సౌందర్యానికి ముగ్ధులైన మిగిలిన రాజులు ఒకరి తర్వాత ఒకరు శివధనుస్సు ఎత్తడానికి ప్రయత్నం చేసి విఫలులు అయ్యారు. పరాభవంతో తల దించుకుని తమ ఆసనాలలో కూర్చున్నారు. చూస్తూ చూస్తుండగానే రాజులందరు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సభ నిశబ్దంగా ఉండి పోయింది. రాముడు లేచి శివధనుస్సు ఎత్తడానికి ఇంకా రావటం లేదని సీతాదేవి అనుకుంటుంటే శ్రీరాముడు, లక్ష్మణుడు శివధనుస్సు గొప్పదనాన్ని చూస్తున్నారు.


సభలోని వారందరిని ఆశ్చర్యచకితులను చేస్తూ లంకాధిపతి రావణుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. "పరమేశ్వరుడు నివసించే కైలాసాన్నే శిరస్సు పైకి ఎత్తి ధరించిన మహబలవంతుడైన నాకు ఈ శివధనుస్సు ఒక లెక్కా" అని అహంకారంతో పలుకుతూ శివధనుస్సు దగ్గరకు వెళ్లాడు. ఒక్క చేతితో ఎత్తలేక పోయేసరికి రెండు చేతులతో పట్టుకుని పైకి లేపసాగాడు.


సభాసదులు అందరు రావణుడు తప్పక శివధనుస్సు ఎత్తుతాడని భావించి చప్పట్లు కొట్టబోయారు. కానీ కొంచెం ఎత్తు లేచిన శివధనుస్సు బరువు రావణుడు మోయలేక పోవడంతో పెద్దశబ్దంతో కిందకు జారి పడింది. సభ నిశ్చేష్టమై నిశబ్దమయ్యింది. రావణుడి రెండు చేతులు ధనుస్సు కింద చిక్కుకున్నాయి. ధనుస్సు బరువుకి రావణుడు బాధతో విలవిలలాడుతూ కన్నులు మూసుకుని "ఈశ్వరా! నన్ను క్షమించు! అహంకారం తో ధనుస్సు ఎత్తబోయి భంగపడ్డాను. నన్ను కాపాడి పరువు దక్కించుము" అని శివుని ప్రార్ధించ సాగాడు.


విశ్వామిత్రుడు శ్రీరాముని వంక అర్ధవంతంగా శివధనుస్సుని ఎత్తమన్నట్లు చూశాడు. 


గురువు గారి కనుసైగను ఆజ్ఞగా పాటించి శ్రీరాముడు తన ధనుస్సు తూణీరం లక్ష్మణునికి ఇచ్చాడు. ముందుగా విశ్వామిత్రునికి, తరువాత జనక మహారాజుకి, ఆతరువాత సభాసదులకు నమస్కరించి శివధనుస్సు ఉన్న సభామండప మధ్యప్రదేశానికి వచ్చాడు. ధనుస్సు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి పరమేశ్వరునికి నమస్కరించి మనస్సులో శివధనుస్సు ఎత్తడానికి తగిన శక్తి ఇవ్వమని" ప్రార్ధించాడు.


వామహస్తంతో ధనుస్సు మధ్యభాగం పట్టుకుని అవలీలగా పైకి ఎత్తి నిలిపాడు. అంతవరకు ధనుస్సు కింద చేతులు పడి బాధపడుతూ శివధ్యానం చేస్తున్న రావణుడు క్షణంలో అక్కడ నుంచి అదృశ్యమయ్యాడు. శ్రీరాముడు ఎడమకాలి బొటనవేలితో ధనుస్సు కిందిభాగం నొక్కిపెట్టి నారి తీసుకుని వింటి పై కొక్కేనికి బిగించాడు. సభికులందరు ఆశ్చర్యానందాలతో చూస్తుంటే నారి లాగి ధనుష్టంకారం చేయబోయాడు. రాముని శక్తిని తట్టుకోలేనట్టు భయంకరంగా పెళపెళ శబ్దం చేస్తూ శివధనుస్సు మధ్యలో విరిగి రెండు ముక్కలయ్యింది.


"శివధనుస్సు ఎత్తితే చాలు అనుకుంటే ఈ అయోధ్య రాజకుమారుడు శ్రీరాముడు శివధనుస్సునే విరిచేసాడు" అనుకున్న ప్రజలు, సభాసదులు హర్షధ్వానాలు "శ్రీరామచంద్రమూర్తికి జై" అంటూ చేసారు. ఆకాశం నుండి దేవతలు, దేవర్షులు పుష్పవర్షం కురిపించారు.


సీతాదేవి హృదయం ఆనందంతో నిండింది. తన ఆరాధ్య దైవాలైన పార్వతీపరమేశ్వరులకు కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి జనకుని వెంట వచ్చి శ్రీరాముని మెడలో వరమాల వేసింది. శ్రీరాముడు సీతాదేవి విశ్వామిత్రునికి, జనక మహారాజుకి నమస్కరించి ఆశీస్సులు పొందారు. జనకుడు విశ్వామిత్ర మహర్షి ఆదేశం ప్రకారం సీతారాముల స్వయంవరం విశేషాలు తెలుపుతూ సీతారాముల కళ్యాణం చేయడానికి మిథిలానగరం రమ్మని దశరథుని ఆహ్వానిస్తూ శుభ సమాచారం పంపాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*



       *శ్రీ మహావిష్ణు పురాణం*                              

               *83వ భాగం*


          *శ్రీరామావతారం-4*


        *సీతా స్వయం వరం,*

           *శివధనుర్భంగo*```


విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులు మిథిలానగరంలో ప్రవేశించారు. నగర ప్రవేశ ద్వారము వద్ద నున్న రక్షక భటులు విశ్వామిత్ర మహర్షి ఆగమన సమాచారాన్ని జనక మహారాజుకి తెలియజేశారు. 


జనకుడు తన మంత్రి పరివార గణంతో మహర్షికి స్వాగతం పలకడానికి బయలుదేరాడు.


విశ్వామిత్ర మహర్షి వెంట వినయంగా నడిచే నీలమేఘశ్యామ వర్ణపు దివ్య సుందర శరీరముతో ప్రకాశిస్తున్న శ్రీరాముడు “పదహారు ఏళ్ల వయస్సులోనే తాటకి సుబాహువు మొదలైన పద్నాలుగు వేల రాక్షసులను వధించాడు” అన్న సమాచారం తెలిసిన నగర ప్రజలు దారికి రెండు వైపుల నుంచుని గౌరవభావంతో నమస్కరిస్తున్నారు.


“శ్రీరాముని సుందర ఆకారము చూసి సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే మన మిథిలకు వచ్చినట్లుంది. మన సీతమ్మకు తగిన వరుడు” అని పూలు చల్లుతూ మహిళలు స్వాగతం పలుకుతున్నారు. తమకు నమస్కరిస్తున్న ప్రజలకు శ్రీరాముడు లక్షణునితో కలసి చిరునవ్వుతో ప్రతినమస్కారం చేస్తూ విశ్వామిత్ర మహర్షి వెంట ముందుకు వెళుతున్నారు.


రాజమార్గము చేరిన విశ్వామిత్ర మహర్షికి, రామలక్ష్మణులకు జనకుడు ఎదురు వెళ్లి స్వాగతం పలికి రాజభవనం లోకి తీసుకువెళ్లి అర్ఘ్యపాద్యములు ఇచ్చి అతిథి సేవ చేసి సముచిత ఆసనం పై విరాజమానుని చేసాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి వెనుక వినయంగా చేతులు కట్టుకుని నిలిచిన రామలక్ష్మణులను చూసి జనకుడు “మహర్షీ! పద్నాలుగు వేల రాక్షస సైన్యాన్ని, తాటకి సుబాహుల వంటి భయంకర రాక్షసులను సంహరించి యాగ రక్షణ చేసిన బాలవీరులు వీరేనా?” అని అడిగాడు.


విశ్వామిత్రుడు చిరునవ్వుతో అవునన్నట్టు చూసి, వారిని జనకునికి పరిచయం చేస్తూ “జనక మహారాజా! ఈ నీలమేఘశ్యాముడు కోసలరాజు దశరథుని పెద్దకుమారుడు శ్రీరాముడు. ఆ సువర్ణవర్ణ రూపుడు శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు. పరమేశ్వర ప్రసాదిత శివ ధనుస్సుని చూడాలనే అభిలాషతో నా వెంట వచ్చారు” అని చెప్పాడు.


తన పుత్రిక సీతకు తగిన వరుడు రాముడు అని భావించిన జనకుడు “స్వయంవరానికి కాదు. ధనుస్సు చూడటానికి” అని విశ్వామిత్రుడు చెప్పటంతో జనకుడు మదిలో కొంత నిరాశ చెందాడు. బయటకు కనపడనీయకుండా జనకుడు మహర్షిని, రామలక్ష్మణులను మరునాడు జరుగబోయే స్వయంవరానికి ఆహ్వానిస్తూ “రేపు స్వయంవర సభలో శివధనుస్సును స్వయంగా చూడవచ్చును” అని పలికి వారికి తగిన విడిది ఏర్పాటు చేసాడు.


శ్రీరాముని విడిది గృహంలో చాటుగా చూసిన పరిచారికలు సీతాదేవి మందిరానికి వెళ్లి ఆమెతో తాటకాది రాక్షసులను సంహరించిన రాముని పరాక్రమాలు, అందచందాలు వర్ణించి “సీతాదేవికి అన్నింటిలో తగిన జోడు శ్రీరాముడు. స్వయంవరంలో ధనుస్సు ఎత్తి జానకమ్మను తప్పక చేపడతాడు” అని తమ అభిప్రాయం ప్రకటించేసారు.


ఆ రోజు సాయంత్రం వనవిహారానికి వచ్చిన శ్రీరాముని దుర్గాదేవి ఆలయానికి పూజకు వెళుతున్న సీతాదేవి క్షణం పాటు చూసింది. రాముడు సీతను క్షణం పాటు చూసాడు. ఇరువురి చూపులు కలుసుకుని మనస్సులు పలకరించుకున్నాయి. తనను శ్రీరాముని భార్యగా చేయమని సీతాదేవి అమ్మవారిని ప్రార్ధిస్తూ పూజించింది.


మరుసటి రోజు స్వయంవర సభకు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో వచ్చాడు. 


జనకుడు వారికి స్వాగతం పలికి తగిన ఆసనం పై ఆసీనులను చేసాడు. సీతాదేవి అంతఃపుర గవాక్షపు తెరచాటు నుండి రాముని చూసి ఆనందపడింది. స్థిమిత పడింది. స్వయంవర సభ ప్రాంగణం ఆహ్వానితులైన రాజులతో నిండి పోయింది. మిథిల నగర ప్రజలు స్వయంవరం చూడటానికి విచ్చేశారు.


జనకుడు స్వయంవరం ప్రకటించాడు. సీతాదేవి వరమాలతో జనకుని పక్కన వచ్చి నిలుచుంది. 5 వేల మంది ధృడకాయులు శివధనుస్సు గల శకటాన్ని తమ బలం పూర్తిగా ఉపయోగిస్తూ తీసుకు వచ్చి సభా మండపం మధ్యలో ఉంచారు. చెమటలు పడుతూ ఆయాసపడుతున్న ఆ ధృడకాయులను చూసి కొందరు రాజులు శివధనుస్సు ఎత్తడం తమ వలన కాదని పోటి నుండి విరమించుకుని ప్రేక్షకులగా ఉండిపోయారు.


సీతాదేవి సౌందర్యానికి ముగ్ధులైన మిగిలిన రాజులు ఒకరి తర్వాత ఒకరు శివధనుస్సు ఎత్తడానికి ప్రయత్నం చేసి విఫలులు అయ్యారు. పరాభవంతో తల దించుకుని తమ ఆసనాలలో కూర్చున్నారు. చూస్తూ చూస్తుండగానే రాజులందరు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సభ నిశబ్దంగా ఉండి పోయింది. రాముడు లేచి శివధనుస్సు ఎత్తడానికి ఇంకా రావటం లేదని సీతాదేవి అనుకుంటుంటే శ్రీరాముడు, లక్ష్మణుడు శివధనుస్సు గొప్పదనాన్ని చూస్తున్నారు.


సభలోని వారందరిని ఆశ్చర్యచకితులను చేస్తూ లంకాధిపతి రావణుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. "పరమేశ్వరుడు నివసించే కైలాసాన్నే శిరస్సు పైకి ఎత్తి ధరించిన మహబలవంతుడైన నాకు ఈ శివధనుస్సు ఒక లెక్కా" అని అహంకారంతో పలుకుతూ శివధనుస్సు దగ్గరకు వెళ్లాడు. ఒక్క చేతితో ఎత్తలేక పోయేసరికి రెండు చేతులతో పట్టుకుని పైకి లేపసాగాడు.


సభాసదులు అందరు రావణుడు తప్పక శివధనుస్సు ఎత్తుతాడని భావించి చప్పట్లు కొట్టబోయారు. కానీ కొంచెం ఎత్తు లేచిన శివధనుస్సు బరువు రావణుడు మోయలేక పోవడంతో పెద్దశబ్దంతో కిందకు జారి పడింది. సభ నిశ్చేష్టమై నిశబ్దమయ్యింది. రావణుడి రెండు చేతులు ధనుస్సు కింద చిక్కుకున్నాయి. ధనుస్సు బరువుకి రావణుడు బాధతో విలవిలలాడుతూ కన్నులు మూసుకుని "ఈశ్వరా! నన్ను క్షమించు! అహంకారం తో ధనుస్సు ఎత్తబోయి భంగపడ్డాను. నన్ను కాపాడి పరువు దక్కించుము" అని శివుని ప్రార్ధించ సాగాడు.


విశ్వామిత్రుడు శ్రీరాముని వంక అర్ధవంతంగా శివధనుస్సుని ఎత్తమన్నట్లు చూశాడు. 


గురువు గారి కనుసైగను ఆజ్ఞగా పాటించి శ్రీరాముడు తన ధనుస్సు తూణీరం లక్ష్మణునికి ఇచ్చాడు. ముందుగా విశ్వామిత్రునికి, తరువాత జనక మహారాజుకి, ఆతరువాత సభాసదులకు నమస్కరించి శివధనుస్సు ఉన్న సభామండప మధ్యప్రదేశానికి వచ్చాడు. ధనుస్సు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి పరమేశ్వరునికి నమస్కరించి మనస్సులో శివధనుస్సు ఎత్తడానికి తగిన శక్తి ఇవ్వమని" ప్రార్ధించాడు.


వామహస్తంతో ధనుస్సు మధ్యభాగం పట్టుకుని అవలీలగా పైకి ఎత్తి నిలిపాడు. అంతవరకు ధనుస్సు కింద చేతులు పడి బాధపడుతూ శివధ్యానం చేస్తున్న రావణుడు క్షణంలో అక్కడ నుంచి అదృశ్యమయ్యాడు. శ్రీరాముడు ఎడమకాలి బొటనవేలితో ధనుస్సు కిందిభాగం నొక్కిపెట్టి నారి తీసుకుని వింటి పై కొక్కేనికి బిగించాడు. సభికులందరు ఆశ్చర్యానందాలతో చూస్తుంటే నారి లాగి ధనుష్టంకారం చేయబోయాడు. రాముని శక్తిని తట్టుకోలేనట్టు భయంకరంగా పెళపెళ శబ్దం చేస్తూ శివధనుస్సు మధ్యలో విరిగి రెండు ముక్కలయ్యింది.


"శివధనుస్సు ఎత్తితే చాలు అనుకుంటే ఈ అయోధ్య రాజకుమారుడు శ్రీరాముడు శివధనుస్సునే విరిచేసాడు" అనుకున్న ప్రజలు, సభాసదులు హర్షధ్వానాలు "శ్రీరామచంద్రమూర్తికి జై" అంటూ చేసారు. ఆకాశం నుండి దేవతలు, దేవర్షులు పుష్పవర్షం కురిపించారు.


సీతాదేవి హృదయం ఆనందంతో నిండింది. తన ఆరాధ్య దైవాలైన పార్వతీపరమేశ్వరులకు కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి జనకుని వెంట వచ్చి శ్రీరాముని మెడలో వరమాల వేసింది. శ్రీరాముడు సీతాదేవి విశ్వామిత్రునికి, జనక మహారాజుకి నమస్కరించి ఆశీస్సులు పొందారు. జనకుడు విశ్వామిత్ర మహర్షి ఆదేశం ప్రకారం సీతారాముల స్వయంవరం విశేషాలు తెలుపుతూ సీతారాముల కళ్యాణం చేయడానికి మిథిలానగరం రమ్మని దశరథుని ఆహ్వానిస్తూ శుభ సమాచారం పంపాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వైశాఖ పురాణం - 22*

 



        *వైశాఖ పురాణం - 22*

                 ➖➖➖✍️

           22 వ అధ్యాయము


*దంతిల కోహల శాపవిముక్తి*```

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు ఇట్లు అడిగెను. మహామునీ ఇహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము , శుభకరములగు విష్ణుకథలు , చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.


శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.


పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీ నదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.


అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును , పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.


శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు , చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.


శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున ఇట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.


కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల ఈ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా ! పాపాత్ముడవైనను , కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా. శ్రీహరికిష్టమైనవి , నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు , యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు , గంగానదికి ప్రయాగకు , పుష్కరమునకు , కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.


ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు , గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.


కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు , కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న  మా ఇద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి *'నాయనలారా ! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుని , వ్యతిరేకమునబలుకు భార్యను , దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన , ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను , కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి , ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.


వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా ! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి ఇట్లనెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*736 వ రోజు*

అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము

వసుదేవుడికి అభిమన్యుడి మరణవార్త తెలుపుట

కురుక్షేత్రయుద్ధ విశేషాలు విన్న వసుదేవుడు చింతాకాంతుడయ్యాడు. అభిమన్యుడి మరణవార్త వసుదేవుని ఇంకా క్రుంగదీస్తుందని చెప్పలేదు. కాని సుభద్ర దుఃఖం ఆపుకోలేక " అన్నా ! మీ తండ్రి వసుదేవుడు. అది విని దుఃఖిస్తున్న వసుదేవుడిని అక్కడ ఉన్న యాదవులను ఓదార్చడము కృష్ణుడివంతైంది. ధృతరాష్ట్రుడితో చేరి ధర్మరాజు కౌరవులందరికి అంతిమ క్రియలు జపించినతీరు బ్రాహ్మాణులకు దానములు ఇవ్వడము వారిపేరు మీద అనేక ధర్మకార్యాలు నిర్వహించడము సవిస్తరంగా వివరిండు. అందరూ మెల్లమెల్లగా ఆ దుఃఖమునుండి బయట పడ్డారు " అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

ఆశ్వమేధయాగము


జనమేజయుడు " వైశంపాయన మహర్షీ ! వ్యాసుడు ధర్మరాజును అశ్వమేధయాగమును చేయమని ఆదేశించాడు కదా ! ధర్మరాజు ఆయాగమును ఎలా నిర్వహించాడు " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయ మహారాజా ! వ్యాసుడు తన మీద ఉన్న వాత్సల్యముతో అశ్వమేధయాగము చేయమని ఆదేశించిన తరువాత ధర్మరాజు తన తమ్ములను పిలిచి " భీమార్జున నకులసహదేవులారా ! వ్యాసుడి ఆదేశము విన్నారు కదా ! యాగనిర్వహణకు కావలసిన ధనము మన వద్దలేదు. కనుక వ్యాసుడు చెప్పినట్లు బ్రాహ్మాణులు దాచిన ధనము తీసుకురావలసిన అవశ్యకత ఉంది. హిమాలయములలో ఉన్న ఆ నిధిని తీసుకురావడానికి కావలసిన మార్గము గురించి, చేయవలసిన ఏర్పాటు గురించి మీరు నాకు మీ అభిప్రాయములు చెప్పండి " అని అడిగాడు. జవాబుగా భీముడు " అన్నయ్యా ! ధర్మనందనా ! మనము ఆ పరమేశ్వరుడిని నియమ నిష్టలతో పూజించి ఆయన కరుణ పొంది ప్రమధగణములను పూజించి, భూతబలులు సమర్పించి ఆ నిధిని తీసుకు వస్తాము. కనుక ధనముగురించిన చింతతో పనిలేదు. ఆ కార్యము సాధించడానికి సముచిత సైన్యము కావాలి " అని భీముడు చెప్పాడు. భీముని మాటలకు అర్జునుడు, నకులసహదేవులు తమ అంగీకారము తెలిపారు. తమ్ముల మాటలకు ధర్మరాజు సంతోషించాడు. అందరూ కలిసి హిమాలయములకు పోవడానికి నిశ్చయించుకున్నారు. తరువాత పెదనాన ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి చెప్పగానే ధృతరాష్ట్రుడు తన కుమారులు లేనందుకు విలపించాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి పాదములు పట్టుకుని గాంధారి వింటూ ఉండగా వ్యాసమహర్షికి తనకు జరిగిన సంభాషణ వ్యాసుడు తనను అశ్వమేధయాగము చేయమని చిప్పిన విషయము చెప్పి యాగము చేయడానికి ధృతరాష్ట్రుడి అనుమతి పొందాడు. తరువాత తన తల్లి కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమెకు యాగము గురించి చెప్పాడు. ఆ మాటలు విని కుంతీదేవి సంతోషంతో యాగముకు అనుమతి ఇచ్చింది. కుంతీదేవి అనుమతి తీసుకున్న ధర్మరాజు ఆస్థానమండపానికి వెళ్ళి యుయుత్సుడికి హస్థినాపుర బాధ్యత అప్పగించి అతడికి తోడుగా విదురుడిని నియమించాడు. సైన్యాధిపతులను పిలిచి ప్రయాణసన్నాహములు చెయ్యమని ఆదేశించాడు. తరువాత సమస్తదేవతలకు, పితరులకు పూజలు చేసాడు. అగ్నికార్యము నిర్వహించాడు. ధౌమ్యుడికి నమస్కరించి తరువాత రథము మీద కూర్చున్నాడు. మార్గమధ్యములో బ్రాహ్మణుల వద్ద పుణ్యస్త్రీల వద్ద ఆశీర్వాదములు స్వీకరిస్తూ తన పూరోహితుడు ముందుగా నడువగా హిమాలయములకు పయనమయ్యాడు. ధర్మరాజు వెంట భీమార్జున నకులసహదేవులు రథముల మీద అనుసరించారు. మార్గమధ్యములో సామంతరాజులు కూడా వారితో కలిసారు. అందరూ కలిసి ఒక సమతలప్రదేశంలో విడిది చేసారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఒకటవ అధ్యాయం 

అర్జునవిషాద యోగం: సంజయ ఉవాచ


అత్ర శూరా మహేష్వాసాః

భీమార్జునసమా యుధి |

యుయుధానో విరాటశ్చ

ద్రుపదశ్చ మహారథః || (4)


దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: ఈ పాండవ సైన్యంలో ఎంతో ధైర్యవంతులు, అస్త్రాల ఉపయోగంలో నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులైన సాత్యకి(యుయుధానుడు), విరాట మహారాజు, ద్రుపద మహారాజు మహారథులుగా ఉన్నారు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

శ్రీ యోగ నరసింహ పెరుమాళ్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1472


⚜  తమిళనాడు : నరసింగం - మదురై 


⚜  శ్రీ యోగ నరసింహ పెరుమాళ్ ఆలయం



💠 నరసింగం అనేది తమిళనాడు రాష్ట్రంలోని మేలూర్ వెళ్ళే దారిలో  యానైమలై కొండల దిగువన ఉన్న యోగ నరసింహ పెరుమాళ్ కు అంకితం చేయబడిన ఆలయం. 


💠 ఈ ఆలయాన్ని 770లో మధురై రాజు పరాంతక నెడుంజడయ్యన్ మంత్రిగా ఉన్న మధురకవి మారంకారి నిర్మించారు.


💠 ఈ ఆలయం పాండ్య రాజ్యం యొక్క గుహ శిల్పకళకు మంచి ఉదాహరణ. దీని ముందు భాగంలో నరసింగవల్లి దేవతకు ఒక రాతి ఆలయం ఉంది.



🪔 స్థల పురాణం 


💠 రావణుడి ముత్తాత పులస్త్య మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసి నరసింహ స్వామి దర్శనం చేసుకున్నాడని చెబుతారు.


💠 రోమస ఋషి : సంతానం లేకపోవడంతో, రోమస మహాఋషి నారద మహర్షిని సంప్రదించగా, ఆయన సక్కర తీర్థంలో స్నానం చేసి, పూలతో నిండిన పద్మ తడగం వద్ద తపస్సు చేయమని కోరాడు. 

ఆయన సత్ర మహా యజ్ఞం చేసాడు, నరసింహ స్వామి ఆశీస్సులు పొందాడు, ఆయన ప్రార్థనలకు సంతోషించిన ఆయన ఉగ్ర కోలంలో ఒక భారీ రూపంలో ప్రత్యక్షమయ్యాడు.


💠 ఈ 'వేడి' రూపంలో నరసింహుడి ఉనికి గురించి ఆందోళన చెందిన దేవతలు పరిష్కారం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. 

బ్రహ్మ శివుడిని శరభ రూపంలోకి మార్చాడు. 

ఈ శరబ పక్షి బ్రహ్మను తలగా, సూర్యుడు మరియు చంద్రుడు కళ్ళుగా కలిగి ఉన్నాడు. 


💠 అయితే, నరసింహ చల్లబడటానికి నిరాకరించాడు, వాస్తవానికి ఈ రూపాన్ని చూసిన తర్వాత అతని కోపం పెరిగింది, దేవతలు రక్షణ కోసం పరుగులు తీశారు. 

వారు ప్రహ్లాదుడిని నరసింహుడిని చల్లబరచడానికి ఈ ప్రదేశానికి రమ్మని ఆహ్వానించారు.


💠 చివరగా లక్ష్మీదేవి నరసింహుడిని చల్లబరిచింది మరియు వారిద్దరూ రోమాసి ఋషికి ఒక బిడ్డను అనుగ్రహించారని చెబుతారు


💠 మరో పురాణం ప్రకారం, బ్రహ్మదేవుని ఐదు తలలలో ఒకదాన్ని కోసిన తర్వాత శివుడు బ్రహ్మ హత్యా  దోషం (వైదిక బ్రాహ్మణుడిని చంపితే హిందువుపై పడే శాపం) బారిన పడ్డాడు. 

చక్ర తీర్థం అని కూడా పిలువబడే అక్కడ ఉన్న పవిత్ర జల వనరులో స్నానం చేసి, నరసింహుడిని పూజించిన తర్వాత అతను దాని నుండి విముక్తి పొందాడు. 


💠 ఆలయానికి సమీపంలో ఉన్న చక్ర తీర్థంలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.


💠ఒక పురాణం ప్రకారం , ఇంద్రుడు మధురైకి ఒక ఏనుగును పంపాడని, అది కొండగా మార్చబడిందని, అదే యానైమలై అని చెబుతారు.

యానైమలైని గజగిరి లేదా హస్తిగిరి అని పిలుస్తారు. 

ఈ ఆలయాన్ని గజగిరి క్షేత్రం అంటారు.


💠 ప్రధాన దైవం మూలర్ యోగ నరసింహర్, ఆయనకు సింహ ముఖం, లక్ష్మీ దేవి హృదయంలో ఉన్నాయి. 

ఆయనకు నిమ్మకాయ మరియు చందనం (గంధం) నైవేద్యాలు. 


💠 ఉర్చవర్ నరసింహ రూపంలో ఉంటాడు, అతను మరెక్కడా కనిపించని విధంగా నిలబడి ఉన్న భంగిమలో కనిపిస్తాడు మరియు చేతిలో ఆయుధం ఉంటుంది కాబట్టి అతను చాలా ప్రత్యేకమైనవాడు. 


💠 ఏ విష్ణు ఆలయంలోనైనా కూర్చున్న భంగిమలో ఉన్న నరసింహర్ విగ్రహాలలో ఇది అతిపెద్దది. 

మూలవర్ - యోగ నరసింహర్ - కూర్చుని ఉన్నాడు మరియు నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. కానీ వీటిలో రెండు అతని ఒడిలో ఉన్నాయి మరియు మిగిలిన రెండు శంఖం మరియు చక్రం పట్టుకున్నాయి.


💠 అక్కడ పాండ్య కాలం నాటి మహా మండపం, గరుడ మండపం మరియు ముఖ మండపం చూడవచ్చు. 

దేవత నరసింగవల్లి మందిరం ప్రవేశ ద్వారం వద్ద దక్షిణం వైపు ఉంది. 


💠 నరసింహ జయంతి పండుగ సమయంలో మరియు మాసి మహాం రోజున, తిరుమోహూర్‌కు చెందిన శ్రీ కలమేగ పెరుమాళ్ గజేంద్ర మోక్ష ఉత్సవం కోసం ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఆలయం కార్యకలాపాలతో సందడిగా ఉంటుంది. 

పై రెండు చేతుల్లో సుదర్శన మరియు పాంచజన్యంతో , ఎడమ దిగువ చేయి గద ఆయుధం పట్టుకుని, కుడి చేయి అభయ హస్త భంగిమలో (దీవెన భంగిమ) నిలబడి ఉన్న నరసింహుడి ఉత్సవ చిహ్నం ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఉంటుంది.


💠 విశిష్ట ఉత్సవ దేవత అయిన వరద నరసింహుడు, మరెక్కడా కనిపించని విధంగా సింహ ఆకారంలో ముఖం మరియు ఎడమ చేతిలో గదతో నిలబడి ఉన్న భంగిమలో కనిపిస్తాడు.


🔅 పండుగలు


💠 విష్ణువు గజేంద్ర అనే ఏనుగును మొసలి బారి నుండి విడిపించిన రోజును జరుపుకునే గొప్ప ఉత్సవం ఉంది మరియు ఈ రోజును గజేంద్ర మోక్ష పండుగ అని పిలుస్తారు, దీనిని మాసి నెలలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు.


💠 స్వాతి తిరుమంజనం - 

స్వాతి నక్షత్రం రోజున పసుపుతో అభిషేకం. ప్రదోషం తిరుమంజనం - పసుపుతో అభిషేకం.

ప్రదోషం రోజున మాసి పౌర్ణమి రోజున, తిరుమోహూర్ దివ్య దేశానికి చెందిన కాళమేఘ పెరుమాళ్ నరసింగంలోని యోగ నరసింహ ఆలయానికి వెళ్తాడు మరియు గజేంద్ర మోక్షం ఎపిసోడ్ ఇక్కడ ప్రదర్శించబడుతుంది. 


💠 మధురై నుండి 8 కి.మీ దూరం


రచన

©️ Santosh Kumar

నేటిపెద్దలమాట

 *సర్వేజనాః సుఖినోభవన్తు*


*🙏శుభోదయమ్🙏*


*🏵️నేటిపెద్దలమాట🏵️*


పదిమంది కూర్చున్న చోట మనం వెళ్లి కూర్చుంటే అది మర్యాద.

మనం కూర్చున్న చోట పదిమంది వచ్చి కూర్చుంటే అది మన మీద అభిమానం, గౌరవం. 


*🪷నేటిమంచిమాట🪷*


భూతకాలం నీ ఆధారం.


వర్తమానం నీ గమనం..


భవిష్యత్తు నీ లక్ష్యం...


త్రికాలాల లోనూ శోధన, సాధన నీ కర్తవ్యం.


🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

 *సర్వేజనాః సుఖినోభవన్తు*


 పంచాంగం - 09 మే 2026 - శనివారం


శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:50

సూర్యాస్తమయం - సా. 6:35


తిథి - సప్తమి మ. 1:59 వరకు

తరువాత అష్టమి

సంస్కృత వారం - స్థిర వాసరః

నక్షత్రం - శ్రవణ రా. 11:13 వరకు

తరువాత ధనిష్ఠ

యోగం - శుక్ల రా. 2:25+ వరకు

కరణం - బవ మ. 1:59 వరకు, బవ మ. 1:59 వరకు


వర్జ్యం - తె. 3:38 నుండి తె. 5:20 వరకు

దుర్ముహూర్తం - ఉ. 7:32 నుండి ఉ. 8:23 వరకు

రాహుకాలం - ఉ. 9:01 నుండి ఉ. 10:37 వరకు

యమగండం - మ. 1:48 నుండి మ. 3:23 వరకు

గుళికాకాలం - తె. 5:50 నుండి ఉ. 7:25 వరకు


బ్రహ్మ ముహూర్తం - తె. 4:14 నుండి తె. 5:02 వరకు

అమృత ఘడియలు - మ. 12:23 నుండి మ. 2:08 వరకు

అభిజిత్ ముహూర్తం - ఉ. 11:47 నుండి మ. 12:38 వరకు.


*నేటి మాట....* 


మనిషి ఎన్నడూ తనని తాను కించపరచుకోకూడదు. తనను తానే నిందించుకునే వానికి ఎదుగుదలే ఉండదు. 


     భగవంతుడు మన మీద పగబట్టలేదు. మనకూ మంచి సమయం వస్తుందని గుర్తుంచుకో!”అని ఓదార్చాడు.


     ప్రపంచంలో ఏ వ్యక్తికైనా పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలాగుండవు. వెలుగు నీడల్లా మంచి చెడు రోజులు వస్తుంటాయి. 


     అయితే శాశ్వత సత్యం ఒకటుంది. అది భగవంతుడు ఎల్లప్పుడు మన వెంట ఉంటాడు అనేది. 


     కష్ట సమయాల్లో వాటి నుంచి విముక్తి పొందడానికి అతను పరోక్షంగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అతడెలాంటి సహాయం ఎలా, ఎప్పుడు చేస్తాడో మన ఊహకందనిది. 


    కష్టాలలో మనను ఒంటరిగా వదిలేయడు.. 


     సుఖాలు తాత్కాలికమైనవేనన్న అనుభూతి కలిగిన నాడు కష్టాలు కూడా సుఖాలుగా గోచరిస్తాయి.


     సహాయాలే కాదు కష్టాలనధిగమించడానికి కృషి చేయమని ప్రేరణనిచ్చేది కూడా భగవంతుడే. ఆ ప్రేరణతోనే సత్కార్యాలు చేయగలుగుతాం. అవి మనకు తృప్తినిస్తాయి.


     ఈ సృష్టికి మూల కారణం భగవంతుడు. ప్రాణి కోటికి ప్రాణం పోసినది, వాటిని పోషిస్తున్నది ఆ సర్వేశ్వరుడే. సుఖదుఃఖాలు అతను సృష్టించినవే*. 


     మన అహంకారం పెరిగిపోకుండా ఉండడానికి మధ్యమధ్య కష్టాలనే పరీక్షలు పెడుతుంటాడు. ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమోగుణాల మార్పుల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉండగా అహంకారంతో అన్నింటికి కర్తను నేనే అని మానవుడు విర్రవీగుతాడు.


     చెడు జరిగితే భగవంతుని నిందించడానికి కూడా వెనుకాడము. 


     అన్ని జన్మలలోకెల్ల ఉత్తమమైనది మానవ జన్మ. ఇంతటి మంచి జన్మనిచ్చినందుకు ఆ భగవంతునికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. అది మన విధి. 


   👉 ఆ కృతజ్ఞతను యజ్ఞం, ధ్యానం, జపం, తపం, వ్రతం, పూజ, నామ సంకీర్తనం లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారానైనా తెలుసుకోవాలి. 


   👉 భగవంతుడిని మనం ధ్యానిస్తే ఆయన మన చెంతనే ఉంటాడు. 


   👉 సంకల్ప వికల్పాత్మకమైన బుద్ధిని నిగ్రహించి, బుద్ధిని ఏకాగ్రం చేసి అతనిని శరణు కోరాలి. అలాంటి వారికి కష్టాలు దాపురించినా భగవంతుడు తప్పక ఆదుకుంటాడు. 


   👉 ఒక్కోసారి బాధలు తాళలేక భగవంతుని నిందించినా మనకు జరగవలసిన మేలు చేస్తాడు. అదే అతని లీల.       


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


*సర్వేజనాః సుఖినోభవన్తు*

తురీయ ప్రసక్తి

  తురీయ ప్రసక్తి గురించి ఒక మంచి విషయాన్ని గ్రహించి మీ ముందు పెడుతున్నాను.


1)వేదాంతంలో తురీయాన్ని నాలుగోవది అనే అర్ధం లో ఉపయోగించి పరబ్రహ్మ తత్వాన్ని వివరించారు. మాండుక్యోపనిషత్ తురీయ ప్రసక్తి వస్తుంది. జాగ్రత్, నిద్రా, సుషుప్తి అవస్థల తరువాత ది" తురీయావస్థ ". ఇందులో శుద్ధ చైతన్యం మిగులుతుంది. చూసేవాడు, చూడబడేది ఉండవు.


ఇంతకూ చెప్పవలసింది ఏమిటంటే ఒకే పదాన్ని వైజ్ఞానికంగా, ఇతర శాస్త్రాలలో కూడా వాడటం కనిపిస్తోంది. ఆయా శాస్త్ర పరిభాష ప్రకారం అర్ధాన్ని గ్రహించాలి.


2)వేద కాలం లో తురీయమనే సులభమైన పరికరాన్ని ఉపయోగించి గ్రహాణాలు లెక్కించే వారని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి.


ఇక్కడ తురీయ మనే భావనను రెండు రకాలు గా చూసారు మహర్షులు /జ్యోతిష్య శాస్త్రవేత్త లు.


కళ్యాణ్ మల్లాది.

Mantra - 34

 Mantra - 34 ARUNAM 4 anuvaakam


ప్రకృతిని ఒక రణరంగంగా, జ్ఞాన సాధనను ఒక వీరకృత్యంగా క్రిందటి మంత్రం వర్ణిస్తే, ఈ క్రింది మంత్రం సూర్య భగవానుడి యొక్క తేజస్సును, ముఖ్యంగా హేమంత ఋతువులో ఆయన కళ్ళు (కిరణాలు) ఎలా ఉంటాయో ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తుంది.


"అక్రుధ్ధస్య యోథ్స్యమానస్య | 

క్రుద్ధస్యేవ లోహినీ। 

హేమతశ్చక్షుషీ విద్యాత్|

అక్ష్ణయోః క్షిపణోరివ||”


“అక్రుధ్ధస్య యోథ్స్యమానస్య” - కోపం లేకపోయినప్పటికీ, యుద్ధానికి సిద్ధమవుతున్న వీరుని వలె. 

సాధారణంగా యుద్ధం చేసేవారు క్రోధంతో ఉంటారు. కానీ, ఇక్కడ వీరుడు శాంతంగా ఉంటూనే పరాక్రమాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. రామాయణంలో (1.1.18) రాముడు శాంత స్వరూపి కానీ కోపం వస్తే ‘కాలాగ్ని సదృశః క్రోధే’ అంటారు వాల్మీకి. అంటే ఇదే.


"క్రుద్ధస్యేవ లోహినీ” - కోపంతో ఉన్నవాని కళ్ళు ఎలాగైతే ఎర్రగా (లోహినీ) ఉంటాయో.


“హేమతశ్చక్షుషీ విద్యాత్” - హేమంత ఋతువులో సూర్యుని కళ్ళను (కిరణాలను) ఆ విధంగానే గ్రహించాలి. 

హేమంతంలో సూర్యుడు ఉదయించేటప్పుడు లేదా అస్తమించేటప్పుడు కిరణాలు ఎర్రటి రంగులో, తీక్షణంగా కనిపిస్తాయి.


“అక్ష్ణయోః క్షిపణోరివ" - బాణాన్ని ప్రయోగించే వేటగాని లేదా వీరుని కళ్ళలో ఉండే తీక్షణత వలె.

గురి చూసి బాణాన్ని వదిలేటప్పుడు కళ్ళలో ఎంతటి ఏకాగ్రత, ప్రకాశం ఉంటాయో, సూర్య కిరణాలు కూడా అంతటి శక్తిని కలిగి ఉంటాయని భావం.


హేమంత ఋతువు వర్ణన - చలికాలం (హేమంతం) లో సూర్యరశ్మి పగటిపూట తక్కువగా ఉన్నప్పటికీ, ఉదయ కాలంలో ఆ ఎర్రటి కాంతి మనకు వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ ఎరుపు రంగును వేదం ఇక్కడ "క్రుద్ధస్యేవ లోహినీ" (కోపంతో ఎర్రబడిన కళ్ళ వంటిది) అని వర్ణించింది.


శాంతంగా ఉంటూనే లోకాన్ని రక్షించడానికి సిద్ధమైన వీరునితో సూర్యుడిని పోల్చడం ద్వారా, భగవంతుని నిర్గుణ మరియు సగుణ రూపాల మధ్య సమన్వయాన్ని ఇక్కడ చూడవచ్చు.


"విద్యాత్" (తెలుసుకోవాలి), "యోథ్స్యమానస్య" (యుద్ధానికి సిద్ధపడుతున్న) వంటి వైదిక పదజాలములు ఉపనిషత్ శైలిలో జ్ఞానాన్ని బోధిస్తాయి. అలాగే "అక్ష్ణయోః" (కళ్ళ యొక్క) అనే పదం కంటి చూపుకు సూర్యుడే అధిదేవత అని గుర్తుచేస్తుంది.


సూర్యుడు లోకాన్ని దహించడానికి కాదు, రక్షించడానికి తన తీక్షణతను ప్రదర్శిస్తాడు. హేమంతం లోని ఆ ఎర్రటి కిరణాలు మన శరీరంలోని దోషాలను హరించి, దృష్టిని ప్రసన్నం చేస్తాయని అరుణ పారాయణ చేసే ఉపాసకులు నమ్ముతారు.


తత్త్వ విచారణ చేస్తే..

అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఈ వర్ణన వెనుక ఉన్న లోతైన సూత్రాలు కొన్ని ఉన్నాయి.


ఇక్కడ సూర్యుడిని "అక్రుద్ధుడైన యోధుడు" గా వర్ణించారు. Action without Anger.

అద్వైత సాధనలో లేదా భగవద్గీత నిష్కామ కర్మలో, పని చేయాలి (యుద్ధం) కానీ అది రాగ ద్వేషముల తో కూడినది కాకూడదు.

పరమాత్మ ఈ సృష్టిని నడిపిస్తున్నప్పుడు లేదా లయ చేస్తున్నప్పుడు ఆయనకు ఎవరిమీదా కోపం ఉండదు. అది ఆయన స్వభావం (ధర్మం). 

అలాగే, జ్ఞాని కూడా లోకంలో వ్యవహరిస్తున్నప్పుడు ఎర్రని కళ్లతో (తీక్షణంగా) కార్యదక్షతను ప్రదర్శించవచ్చు, కానీ అంతరంగా మాత్రం కోపానికి అతీతమైన శాంత స్థితిలో ఉంటాడు.


ఎరుపు రంగు ఇక్కడ కేవలం కోపానికి సంకేతం కాదు, అది తీక్షణతకు మరియు పరిపక్వతకు సంకేతం.

హేమంత కాలంలో సూర్యుడు మంచును చీల్చుకుంటూ వస్తున్నప్పుడు ఎర్రగా కనిపిస్తాడు. 

అద్వైతంలో అజ్ఞానమనే మంచును దహించివేసే 'జ్ఞానాగ్ని'కి ఇది ప్రతీక. The light of wisdom.

సాధకుడి బుద్ధి, బాణం వలె (క్షిపణోరివ) సూటిగా, సత్యాన్ని ఛేదించే విధంగా ఉండాలని ఇక్కడ సూచించబడింది.


మంత్రంలో "క్రుద్ధస్యేవ" (కోపంతో ఉన్నవాని వలె) అని వాడబడింది. అంటే, సూర్యుడికి నిజంగా కోపం లేదు, కానీ అలా కనిపిస్తున్నాడు.

ఇది అద్వైతంలోని 'వివర్తవాదం' (కనిపించేది ఒకటి, నిజమైనది మరొకటి). మాయ కు ప్రతీక. The Illusion of Appearance.

పరమాత్మకు గుణాలు లేవు (నిర్గుణ), కానీ లోక కల్యాణం కోసం లేదా మాయా ప్రభావం వల్ల రకరకాల రూపాల్లో, భావాల్లో ఉన్నట్లు మనకు గోచరిస్తాడు.


హేమంత కాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా, చల్లగా ఉంటుంది. ఇది సాధకుని ఉపరతి (ఇంద్రియాలను వెనక్కి తీసుకోవడం) అనే స్థితికి సంకేతం.

బయట చల్లదనం ఉన్నా, లోపల ఆత్మ ప్రకాశం (ఎర్రని కళ్లు/తీక్షణత) వెలుగుతూనే ఉంటుంది. బయటి ప్రపంచం నిశ్చలంగా ఉన్నప్పుడే మనలోని ఆత్మ చైతన్యాన్ని యోధుడి వలె జాగృతం చేసుకోవాలి. హేమంతము - అంతర్ముఖత్వమునకు The Cold of Self-Reflection కు చిహ్నము.


అద్వైత కోణంలో ఈ మంత్రం ఇచ్చే సందేశం - నీవు చేసే ప్రతి పనిలో యోధుడి వంటి పట్టుదల, ఏకాగ్రతతో గురి చూసి వదిలిన బాణం వలె ఉండాలి. కానీ, నీ అంతరంలో మాత్రం కోపతాపాలకు తావులేని శాంతి (అక్రోధము) ఉండాలి. సూర్యుడు మంచును చీల్చి ప్రకాశించినట్లు, నీ జ్ఞాననేత్రం అజ్ఞాన పొరలను చీల్చి పరమ సత్యాన్ని దర్శించాలి.

సింహమునుn

 🦁సింహమును కుక్క🐕 అని , 🐘ఏనుగును పంది🐷అని, గుర్రమును 🐎గాడిద 🫏అని అన్నా అవి కుక్క,పంది, గాడిదలాగా మారిపోవు. ఒక వ్యక్తి కి బాధను, మనోవేదను,దుఃఖాన్ని కలిగించడం ఎలాంటిది అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఆకాశంపై ఉమ్మడం, చెత్త వెయ్యడం, ఆకాశాన్ని తన్నటానికి ప్రయత్నించడం లాంటిది. బలహీనుడిని బలవంతుడు అవమానిస్తే, బలహీనుడు ప్రతీకారం తీర్చుకోలేకపోయిన భగవంతుడు బలవంతుడిని శిక్షిస్తాడు. చేసిన కర్మ, పాపం, పుణ్యం, ధర్మం చెడిపోవు వెంట వస్తాయి.

ఆత్మతత్త్వం

  ఆత్మతత్త్వం - శక్తి నిత్యత్వ నియమం: ఒక విశ్లేషణ


అద్వైత తత్త్వ విచారణలో పుట్టడం, మరణించడం ఉండవు. పుట్టటం మరణించటం అనే విషయాలు శరీరానికి మాత్రమే ఉంటాయి. నీవు శరీరానివి కాదు ఆత్మవి. ఎలాగో ఈ క్రింది వివరణాత్మక విషయాలు చూద్దాం!


జీవకణాల ప్రవాహం - నిత్య ప్రళయం:


జీవి పుట్టడమే ప్రాణానికి ప్రారంభము కాదు. ఒక శిశువు అప్పుడే పుట్టాడు. అంటే అంతకు ముందు ప్రాణం లేదా? ఉంది. తల్లి గర్భంలో ప్రాణంతో జీవించే నవ మాసాలు ఉన్నాడు. నవ మాసాలకు ముందు ప్రాణం లేదా? ఉంది. ఒక చిన్న జీవ కణం (శుక్ర, శోణిత రూపంలో) ఉంది. ఈ చిన్న జీవ కణంలో ఆ జీవి యొక్క DNA కోడ్ నిక్షిప్తమై ఉంటుంది. ఎలాగంటే, మర్రి చెట్టు విత్తనం (వట వృక్ష బీజం) ఎంత సూక్ష్మంగా ఉంటుందో, కానీ ఆ వట వృక్షం ఎంతో పెద్దది గా పెరుగుతుంది. పెద్ద చెట్టు నిర్మాణం అంతా ఆ చిన్న బీజంలో నిక్షిప్తమై ఉంది.


అలాంటి జీవ కణాలు ప్రతీ మనిషిలో సుమారు 40 ట్రిలియన్ ఉంటాయి. ఈ జీవ కణాలు పుడుతూ మరణిస్తూ ఉంటాయి. కొన్ని జీవ కణాలు పుట్టిన కొన్ని గంటలలో మరణిస్తే, ఎముకలో ఉన్న జీవ కణాలు గరిష్ఠంగా 14 సంవత్సరాలు జీవిస్తాయి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. జీవ కణాలు పుడుతూ మరణిస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి అట్టి జీవ కణాలను సాక్షి గా చూడటం తప్ప ఏమీ చేయలేడు. అంటే ఒక 14 సంవత్సరాలలో ఒకమనిషి లోని అన్ని జీవ కణాలు పాతవిపోయి కొత్తవి రావటానికి సుమారు 13-14 సంవత్సరాలు పడతాయి. ఆ వ్యక్తి కొత్తవ్యక్తి గా మారతాడు. శరీరంలో మొత్తం సెల్స్ అన్నీ రీప్లేస్ అవటానికి సుమారు 14 సంవత్సరాలు పడుతుంది. అంటే భౌతికంగా కొత్త మనిషి కానీ అతని ఆత్మ మారదు.


రామాయణ భారతాలలో 14 ఏళ్ల ప్రాధాన్యత:


బహుశా అందుకే మన ఇతిహాసాలలో 14 ఏళ్ల వనవాసానికి అంత ప్రాముఖ్యత ఉంది. రామాయణ, భారతాల్లో సీతారామలక్ష్మణులు, పాండవుల వనవాసం ముగిసేసరికి వారు భౌతికంగా పాత శరీర సంబంధాలు లేని 'కొత్త వ్యక్తులు'. శరీరంలో మార్పులు నిరంతరం జరుగుతున్నా, వాటిని గమనించే 'సాక్షి' (ఆత్మ) మాత్రం మారదు. జీవకణాల స్థాయిలో జరిగే ఈ మార్పును ఒక రకమైన 'నిత్య ప్రళయం' అని చెప్పవచ్చు.


ఆత్మ మరియు జీవశక్తి: సంబంధం

అయితే, ఇది జీవ కణాల పుట్టుక మరణం నిరంతరం జరిగే ప్రక్రియ. శరీరంలో మార్పులు ఎన్ని వస్తూ వెళుతున్నా, జీవ శక్తి ఒక కణం నుండి మరొక కణానికి ప్రవహిస్తూనే ఉంటుంది కానీ నశించదు. కొత్త కణం పుడుతుంది పాత కణం నశిస్తుంది. ఇది ఒక రకమైన జీవ కణాల స్థాయిలో ప్రళయం. జీవ లేదా ప్రాణ శక్తి అనేది ఆత్మ యొక్క క్రియాశీలక శక్తి (Active Energy) అయితే ఆత్మ అనేది నిశ్చలమైన చైతన్యం (Constant Consciousness).


అయితే, ఇలా కొంత కాలం అనగా (ఆయువు తీరిన తరువాత) శరీరంలోని జీవ శక్తి పరమాత్మలో కలిసిపోతుంది. దీనికి ఉదాహరణగా, కుండలోని ఘటాకాశం కుండ పగిలినపుడు మహదాకాశంలో కలిసిపోయినట్లు, బల్బు లో ఫిలమెంట్ మాడిపోయినప్పుడు బల్బు లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్తు లో కలిసిపోయినట్లు వ్యష్టి సమష్టి లో కలిసిపోతుంది. ప్రాణ శక్తి నశించదు. ఒక కణం నుండి మరో కణానికి, ఒక శరీరం నుండి మరో శరీరానికి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ప్రాణుల స్థాయిలో ప్రళయం తో సమానం. ఆగే జగత్తు స్థాయిలో మహా ప్రళయం కూడా ఇటువంటిదే. ఈ జగత్తు అంతా నశించి కొత్త జగతి పుడుతుంది కానీ పరమాత్మ మారడు.


ఆధునిక విజ్ఞాన శాస్త్రం - శక్తి నిత్యత్వ నియమం


First Law of Thermodynamics లోని శక్తి నిత్యత్వ నియమం (Law of Conservation of Energy) ప్రకారం శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. కానీ శక్తిని ఒక రూపం నుండి మరో రూపంలోకి మార్చవచ్చు. దీనిని భౌతిక వాదులు అందరూ అంగీకరిస్తారు. అదే విధంగా ప్రాణ శక్తి, జీవ శక్తి, చైతన్య శక్తి ని మనం పుట్టించలేము నశింపచేయలేము కానీ ఒక రూపం నుండి మరో రూపానికి మార్పు చెందుతుంది అని సనాతన అద్వైత సిద్ధాంతాలు ప్రతిపాదించాయి. అయితే దీనిని ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు అందరిముందూ బాహాటంగా ఒప్పుకోరు. 


ప్రాణ శక్తి అనేది ఆత్మ నుండి ఉద్భవించే క్రియాశీల శక్తి. ఆత్మ యొక్క ఉనికి వల్ల శరీరంలో కలిగే కదలికనే ప్రాణం అంటారు. ఆత్మ సూర్యుడు అయితే, ప్రాణం ఆ సూర్యుని నుండి వచ్చే కిరణం వంటిది. సూర్యుడి నుండి సూర్య కిరణాలను ఎలా వేరుచేయాలేమో ప్రాణ శక్తిని ఆత్మ నుండి వేరుచేయలేము.


ఉపనిషత్తులు మరియు గీత బోధన:


మన ఉపనిషత్ లలో, భగవద్గీతలో ఈ విషయాలను స్పష్టంగా మహర్షులు బోధించారు. ఈ క్రింది సందర్భాలను చూస్తే..


కఠోపనిషత్తు లో యమధర్మరాజు నచికేతుడికి ఆత్మ తత్వాన్ని బోధిస్తూ ఇలా అంటాడు:

"న జాయతే మ్రియతే వా విపశ్చి-

న్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ |

అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో 

న హన్యతే హన్యమానే శరీరే ||". 

(కఠోపనిషత్తు - 1.2.18)


ఈ మంత్రంలో ఆత్మను 'విపశ్చిత్' అని పిలిచారు. అంటే ఆత్మ ఎప్పుడూ ఎరుకతో (Consciousness) ఉండేది. దానికి చావు పుట్టుకలు లేవు. అది దేని నుండి పుట్టలేదు, దాని నుండి ఏదీ విడివడి పుట్టలేదు. అది స్వయంప్రకాశకం.


ఇంకా దీనికి అనుబంధంగా తరువాత మంత్రం:


"హంతా చేన్మన్యతే హంతం 

హతశ్చేన్మన్యతే హతమ్ |

ఉభౌ తౌ న విజానీతో 

నాయం హంతి న హన్యతే ||"

(కఠోపనిషత్తు - 1.2.19)


ఒకవేళ చంపేవాడు "నేను చంపుతున్నాను" అని అనుకున్నా, చనిపోయేవాడు "నేను చనిపోతున్నాను" అని అనుకున్నా... వారిద్దరికీ సత్యం తెలియదు. ఎందుకంటే ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు.


భగవద్గీత ఉపనిషత్ సారం కనుక పై కఠ మంత్రాలనే గీతాచార్యులు అర్జునునకు ఈ విధంగా చెప్పారు.


“న జాయతే మ్రియతే వా కదాచిన్

నాయం భూత్వా భవితా వా న భూయః |

అజో నిత్యః శాశ్వతోఁయం పురాణో

న హన్యతే హన్యమానే శరీరే ||” గీత 2.20


ఆత్మకు ఎప్పుడూ పుట్టుక లేదు, మరణం లేదు. అది ఒకప్పుడు ఉండి, ఇప్పుడు లేకపోవడం లేదా ఇకముందు పుట్టబోవడం అనేది ఉండదు. ఆత్మ జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు పురాతనమైనది. శరీరం నశించినా ఆత్మ నశించదు. ఆత్మ ఒక పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా, ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని స్వీకరిస్తుందని దీని సారాంశం.


సంధ్యా వందన సూర్యోపస్థాన మంత్ర భాగము అయిన అయిన “న హన్యతే న జీయతే…” లో పరమాత్మ తత్త్వం సంహరింపబడదు, క్షీణించదు లేదా ముసలితనానికి గురికాదు అనగా మార్పు చెందనిది అనే భావన ఉంది.


శక్తి నిత్యత్వ నియమం ప్రకారం ఆత్మ చైతన్యము తో కూడిన ప్రాణ శక్తి కి పుట్టుక చావు లేదు. ఆ శక్తి ఒక రూపం నుండి మరో రూపానికి మారుతాయి. నువ్వు శరీరానికి కాదు. ఆత్మవి. నీకు పుట్టుక లేదు మరణం లేదు. వాటిగురించి చింతించనవసరం లేదు. స్వస్తి.

సమస్య

 ఒంగోలు నా ద్విగుణీకృతాష్టావధానంలో ఇచ్చిన సమస్య

"లాడెన్' భారతజాతిరత్నమని, యుల్లాసమ్ముతోబల్కరా!


గూడెంబందలి చెంచుజాతులకు సత్కోదండ పాండిత్యమున్,

దాడిన్జేసెడి చాకచక్యమును సీతారామరాజిచ్చి చెం డాడెన్ శ్వేతజనాధి

పత్యములనే యాంగ్లేయ సామ్రాజ్య"మ

ల్లాడెన్' భారతజాతిరత్నమని యుల్లాసమ్ముతో బల్కరా.


సురభి శంకరశర్మ.

భోజన నియమాలు

 హిందూ సాంప్రదాయంలో భోజన నియమాలు


1. భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.


2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.


3. ఆహార పదార్థాలు (కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. అది చాలా పెద్ద దోషం.


4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.


5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.


6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు.


7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.


8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.


9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు. బఫే పద్దతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధం. దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు. పాదరక్షలు తో పొరపాటున కూడా భోజనం చేయవద్దు.


10. భగవదార్పితం చేసి,భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.


11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.


12. పరిషేచనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.


13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. (ఇది వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్యంతో ఉన్నవారికి వర్తించదు)


14. మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. మన ఇంటి చాకలి వారికి పొరపాటున కూడా పెట్టకూడదు.


15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు (వెంట్రుకలు కత్తిరించడం).


16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తేమనం తినగా మిగిలినవి పెట్టరాదు. వారికి మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.


17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 


18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి. 


19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.


20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం.


21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు ముఖ్యముగా అయ్యప్ప దీక్షల వద్ద ఈ చెడు అలవాటు ఇటీవల కాలములో మితి మీరుచున్నది. అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు


22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం తింటూ మధ్యలో) వేదం చదువరాదు.


23. పళ్ళెం మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.


24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.


25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.


26. అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు తిన్న విస్తరిని మడవడం అనాచారం తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.


27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది


28. భోజనం అయ్యాక రెండు చేతులూ, కాళ్ళూ కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కిలించుకోవాలి.


29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి (మెతుకులు తీసేసి, తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు


30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము. పెద్దలు, సదాచారపరాయణులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు, పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం. అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.


31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది.

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.


మన ఆంధ్రరాష్ట్రము అన్నపూర్ణగా కీర్తించ బడటానికి మన పూర్వీకులు పాటించిన పై సూత్రాలే ప్రధాన కారణం. దయచేసి అయ్యప్ప మరియు ఇతర దీక్షా పరులు బయట ఎక్కడా తినకండి. కేవలం స్వాములు వండిన చోటే తినండి.


హిందువుగా జీవించు - హిందువైనందుకు గర్వించు.

భగవద్గీత ఎవరు చదవాలి?*

 *భగవద్గీత ఎవరు చదవాలి?*


1) విద్యార్థి - క్రమశిక్షణ కొరకు.

2) యువకుడు - ఎలా జీవించాలో తెలియడం కొరకు.

3) వృద్ధుడు - ఎలా మరణించాలో తెలియడం కొరకు.

4) అజ్ఞాని - జ్ఞానం కొరకు.

5) విద్యావంతుడు - వినయం కొరకు.

6) ధనవంతుడు - దయ కొరకు.

7) కలలుగన్న వాడు సాధించుట కొరకు.

8) దుర్భలుడు - బలము కొరకు.

9) బలవంతుడు - దిశా నిర్దేశం కొరకు.

10) వినయవంతుడు- ఔన్నత్యము కొరకు

11) అలసిన వాడు విశ్రాంతి కొరకు. 

12) అంశాంతిగా ఉన్నవాడు శాంతికొరకు.

13) సందేహస్తుడు - సమాధానం కొరకు.

14) పాపి - పాపవిముక్తి కొరకు.

15) అన్వేషి - మోక్షం కొరకు.

16) సమస్త మానవ జాతి మార్గదర్శనం కొరకు.


*భగవద్గీత ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*

వ్యాఘ్ర గోమాయి సంవాదం*

 

*వ్యాఘ్ర గోమాయి సంవాదం*                             వ్యాసభారతం శాంతి పర్వం 11వ అధ్యాయం.

పూర్వకాలం సుసంపన్నమైన పురిక అనే పేరు గల పట్టణంలో పౌరికుడు అను ఒక రాజు ఉండేవాడు. అతడు క్రూరుడు. నరాధముడు. ఇతరులను హింసించడం వేడుకగా భావించేవాడు. అతడు ఆయువు తీరగానే ఎవరునూ కోరుకొనని గతిని పొందాడు. పూర్వ కర్మల వలన నక్క జన్మను పొందాడు. పూర్వజన్మ వైభవం స్మరించుకొని పరమ నిర్వేదమును పొందినాడు. ఇతరులు తెచ్చి ఇచ్చిన మాంసమును కూడా తినెడివాడు కాదు. సర్వప్రాణులను శిక్షించడం మానుకొన్నాడు. సత్యభాషణమును పాటించుచూ ఆ వ్రతాన్ని మిక్కిలి నియమంగా కొనసాగిస్తున్నాడు. చెట్లనుండి రాలిన పళ్ళనే నియమిత సమయాలలో ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాడు. నియమంగా వ్రతాన్ని పాటిస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి ఆకులను ఆహారంగా తీసుకొంటూ ఒక్కొక్కసారి నీటితో గడపుచూ సంయమనంతో ఉంటున్నాడు. స్మశానమే ఆ నక్కకు నివాస స్థానం అయినది. అదే దానికి ఇష్టమైనది జన్మభూమి అనే పట్టింపు వల్ల ఇతరత్రా నివసించడానికి ఇష్టపడలేదు. ఆ నక్క యొక్క సదాచారములంటే గిట్టక తోడబుట్టిన నక్కలన్నీ వినయంగా నమ్మకంగా మాటలాడుతూ దాని బుద్ధిని చలింప చేయాలని ప్రయత్నించాయి. నీవు మాంసాహారివై ఉండి శ్మశానంలో నివసిస్తూ పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నావు. ఇది విపరీతంగా ఉంది  కాబట్టి నీవు మాతో సమానంగా ఉండు. నీకు భోజనం మేము పెడతాము. తిను. నీ సదాచారాలు వదలిపెట్టు. నీ జాతి వారికి ఏది ఆహారమో అదే నీకు ఎప్పుడు ఉండుగాక. అని పలికిన వాటి మాటలు విని ఆ నక్క ఏకాగ్రతతో మధురంగా వివరంగా యుక్తియుక్తంగా మృదువైన మాటలతో ఇలా బదులిచ్చింది. (సశేషం)

*శ్రీ మహావిష్ణు పురాణం*

 

      *శ్రీ మహావిష్ణు పురాణం*                                  

              *82వ భాగం*


*శ్రీరామావతారం -3*

*తాటకి సుబాహువుల వధ *అహల్యా శాప విమోచనం*```


దశరథుడు తనకు అతిప్రియమైన శ్రీరామునితో ఎక్కువ కాలం ఉండలేక పోయాడు. ఒకరోజు దశరథుని రాజసభకు కార్యార్థియై విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. 


దశరథుడు మహర్షిని సాదరంగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉచితాసనుని చేసి నమస్కరించి “వచ్చిన కార్యం ఆజ్ఞాపించమని” వినయంగా అడిగాడు.


విశ్వామిత్రుడు దశరథునితో “రాజా! విశ్వశాంతి కోసం నేను యాగం చేస్తూ యాగదీక్ష తీసు కున్నాను. నా యాగాన్ని తాటకి అనే రాక్షసి, ఆమె కుమారులు మారీచ సుబాహువులు అనేక విఘ్నాలు కల్పిస్తూ పూర్తి 

కానివ్వకుండా చేస్తున్నారు. యాగదీక్షలో ఉన్న నేను అస్త్రశస్త్రాలు, తపశ్శక్తి వినియోగించలేను. రాక్షసులను సంహరించి యాగం సమాప్తి చేయడంలో నీ సహాయం కోరి వచ్చాను” అని తను వచ్చిన పని చెప్పాడు.


దశరథుడు వెంటనే “మహర్షీ! నా సమస్త సైన్యం తమ వెంట పంపుతాను” అనగానే విశ్వామిత్రుడు వద్దన్నాడు. 


"నేనే స్వయంగా వస్తాను" అని దశరథుడు అంటే విశ్వామిత్రుడు "రాజు రాజ్యంలో ఉండాలి. 

నీ అవసరం లేదు" అన్నాడు. 


దశరథుడు సందేహంగా "మరి ఏమి కావాలి మహర్షీ!" అని అడిగాడు.


అప్పుడే రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వచ్చాడని తెలిసి దర్శనానికి వచ్చి మహర్షికి నమస్కరించారు. 


విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆశీర్వదించి దశరథుని వంక చూసి "నీ తనయుడు శ్రీరాముని నాతో పంపించుము! యాగ రక్షణకు రాముడు ఒక్కడు చాలును" అని అడిగాడు.


దశరథుడు ఉలిక్కిపడ్డాడు. "పసివాడు రాముడు రాక్షసులను సంహరిస్తాడా! వసిష్టాశ్రమం నుండి వచ్చి కొద్ది సమయమే అయ్యింది. ఇంతలో తిరిగి ప్రియ పుత్రుని, పసివానిని మునితో రాక్షస సంహారానికి పంపడమా!" అనుకుని విశ్వామిత్రునితో “మహర్షీ! పసివాడు రాముడు మొన్ననే వసిష్టాశ్రమంలో పదహారేళ్ళు విద్యాభ్యాసం చేసి వచ్చాడు. బాలుని వలన రాక్షస సంహారం ఏమవుతుంది? నేను సకల సైన్యాలతో వచ్చి యాగరక్షణ చేస్తాను. అంగీకరించండి" అని ప్రాధేయపడ్డాడు.


“శ్రీరాముడు తప్ప అన్యులు నాకు వద్దు. లేదంటే వెళ్లిపోతాను. మాట ఇచ్చి తప్పిన ఇక్ష్వాకు వంశపు మొదటి రాజువి అవుతావు" అని విశ్వామిత్రుడు కోపంగా లేచి వెళ్ళబోయాడు. 


వంశగురువు వసిష్ట మహర్షి లేచి విశ్వామిత్రుని ఉండమని చెప్పి దశరథునితో “దశరథా! తలచుకుంటే విశ్వామిత్ర మహర్షి క్షణంలో రాక్షస సంహారం చేయగలడు. అటువంటి మహాశక్తి సంపన్నుడు అడుగుతుంటే ధైర్యంగా రాముని పంపించుము. శ్రీరాముడు విశ్వామిత్రుడి వలన అనేక మహిమాన్విత శస్త్రాస్త్రాలు పొంది జగదేక వీరుడు అవుతాడు. రాక్షస సంహారంతో శ్రీరాముని కీర్తి దశదిశల వ్యాపిస్తుంది" అని నచ్చచెప్పి శ్రీరాముని విశ్వామిత్రునితో పంపించడానికి ఒప్పించాడు.


దశరథుడు రాముని వెంట రావడానికి లక్ష్మణుడి అనుమతించమని కోరగా విశ్వామిత్రుడు అంగీకరించాడు. 


రామలక్ష్మణులు తండ్రికి, వసిష్ట మహర్షికి నమస్కరించి అనుమతి, ఆశీస్సులు తీసుకుని విశ్వామిత్రుని వెంట బయలుదేరి వెళ్లారు. చీకటి పడే సమయానికి సరయూనది అవతల తీరంచేరి విశ్రమించారు. మహావిష్ణువు అవతార కథలు విశ్వామిత్రుడు ఆ రాత్రి రామలక్ష్మణులకు వినిపించాడు.


మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరామ లక్ష్మణులను నిద్ర లేపి స్నానసంధ్యలు పూర్తి చేయించాడు. తరువాత వారిరువురిని తనకు అభిముఖంగా కూర్చోబెట్టి రాముని వంక చూసి "రామా! దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నీవు మహావిష్ణు స్వరూపంగా భూమిపై అవతరించావు. రాక్షస దానవ సంహారం కోసం మీ అన్నదమ్ములకు బల,అతిబల, మహాబల మొదలైన మహావిద్యలతో పాటు బ్రహ్మ ఇంద్ర అగ్ని వరుణ మొదలైన దేవతల శక్తుల గల దేవతాస్త్రాలను ప్రయోగ ఉపసంహార మంత్రాది పూర్వకంగా ఉపదేశి స్తాను" అని సకల అస్త్ర శాస్త్రాలు రామలక్ష్మణులకు ఉపదేశించాడు.


తరువాత బయలుదేరి అరణ్యాల గుండా ప్రయాణం చేసి దండకారణ్యంలో తాటకి ఉండే ప్రదేశానికి వచ్చారు. 


తాటకి వీరిని చూడగానే భీకర ఆకారం దాల్చి పెద్ద పెద్ద వృక్షాలను, బండరాళ్ళను వీరి పైకి విసిరి వేయసాగింది. పడుతున్న వృక్షాలను, బండరాళ్ళను రామలక్ష్మణులు ఆకాశంలోనే బాణాలతో ఛేదించి పడగొట్ట సాగారు.


తాటకి మరింతగా విజృంభించడంతో విశ్వామిత్రుడు తాటకిని చంపమని రామునికి చెప్పాడు.   


"తాటకి రాక్షసి అయినా స్త్రీకదా" అని చంపడానికి రాముడు సందేహించాడు. 


విశ్వామిత్రుడు గ్రహించి రామునికి "ధర్మ సంరక్షణార్ధం రాక్షస స్త్రీ తాటకిని చంపడం ధర్మవిరుద్దం కాదు" అని ధర్మసూక్ష్మాన్ని వివరించాడు. 


సందేహం తొలగటంతో బాణం సంధించి రాముడు ఒక్కవేటుతో తాటకిని నేలకూల్చాడు. మహాపర్వతం నేలకు పడినట్లు తాటకి నేలపై పడి మరణించింది.


ఆశ్రమంచేరుకున్నవిశ్వామిత్రుడు యాగ రక్షణ బాధ్యత రామలక్ష్మణులకు అప్పగించి యాగ దీక్షలో కూర్చుని యాగం చేయసాగాడు. 


తాటకి మరణవార్త తెలిసిన ఆమె కుమారులు మారీచ సుబాహువులు ప్రతీకారేశ్ఛతో తమ పద్నాలుగు వేల రాక్షస సైన్యాన్ని విశ్వామిత్రుడి ఆశ్రమం పై దాడికి పంపారు.


రామలక్ష్మణులు రాక్షస సేనలను అవలీలగా సంహరించడంతో మరింత కోపంతో మారీచ సుబాహువులు ఆకాశంలో అదృశ్యం రూపంలో ఉండి యాగం భగ్నం చేయడానికి జంతు మానవ రక్త మాంసాలు, ఎముకలు మొదలైనవి యాగ కుండంలో పడవేసే ప్రయత్నం చేసారు. రామలక్ష్మణులు యాగశాలపై బాణాలతో రక్షణ కవచం ఏర్పాటు చేసి ఒక్క చుక్క కూడా యాగ కుండలో పడకుండా చేసారు.


తరువాత శ్రీరాముడు ఒక బాణంతో సుబాహుని చంపివేశాడు. మరొక బాణంతో తప్పించుకుని పారిపోతున్న మారీచుని సప్తసముద్రాల అవతల పడేటట్టు చేసాడు.  


విశ్వామిత్రుడి యాగం నిర్విఘ్నంగా పూర్తి అయ్యింది. విశ్వామిత్రుడు మరియు ఇతర ఋషులు పురుష సూక్తం పఠించి రామలక్ష్మణులను

ఆశీర్వదించారు.


అదే సమయంలో దేవర్షి నారదుడు అక్కడకు వచ్చాడు. విశ్వశాంతి యాగం సుసంపన్నం అయినందుకు విశ్వామిత్రుని అభినందించి రామలక్ష్మణులను ఆశీర్వదించాడు. 


మిథిలానగరంలో జనక మహారాజు తన కుమార్తె సీతాదేవికి వివాహానికి ఏర్పాటు చేసిన స్వయంవరం గురించి చెప్పాడు.


“సాక్షాత్తు పరమేశ్వరుడు 

విదేహ వంశానికి ప్రసాదించిన అమోఘమైన శివధనస్సు ఎత్తినవారికే సీతాదేవితో వివాహం అని జనకుడు ప్రకటించి సకల దేశ రాజులను ఆహ్వానించాడు. సీతాదేవి జనన వృత్తాంతం చెప్పి వేయి మంది మహావీరులైనా కదలించ లేని శివధనుస్సు గల శకటాన్ని బాలికగా ఉన్న జానకి అవలీలగా పక్కకు జరిపింది ఆడుకునే బంతి కోసం. అందుకే జనకుడు శివధనస్సు ఎత్తి నారి సంధించిన వానికే సీత నిచ్చి కన్యాదానం చేస్తానని స్వయంవరం ప్రకటించాడు అని చెప్పి నారదుడు వెళ్లి పోయాడు.


"మహా మహిమాన్వతమైన శివధనుస్సు చూడాలని ఉందా రామా" అని విశ్వామిత్రుడు శ్రీరాముని వంక చూస్తూ అడిగాడు. 


రాముడు వినయంగా "తమరు అనుగ్రహిస్తే పరమేశ్వరుని నిజ ధనుస్సు చూడాలని ఉంది" అని అన్నాడు. 


"సరే మిథిలానగరం వెళ్లి వద్దాం" అని రామలక్ష్మణులను వెంట తీసుకుని విశ్వామిత్రుడు మిథిల బయలుదేరి వెళ్లాడు.


మిథిలానగరానికి సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమం కనిపించింది. అడవిలా ఉన్న ఆశ్రమాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఇంద్రుని దుశ్చర్య వలన గౌతమ మహర్షి అహల్యకు రాయిగా పడి ఉండమని ఇచ్చిన శాపం గురించి వివరంగా చెప్పాడు. ఇంద్రుడు చేసిన దుష్కర్మలో అహల్య నిర్దోషి అని తెలుసుకున్న గౌతమ మహర్షి "భవిష్యత్తులో మహావిష్ణువు అవతారమైన ఇక్ష్వాకు వంశజుని చేత అహల్యకు శాప విమోచనం కలుగుతుంది" అని చెప్పి ఆశ్రమం వదలి వెళ్లి పోయాడు.


ఆనాటి నుండి ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంది. ‘అహల్య రాయిగా శాప విమోచనం కోసం ఎదురు చూస్తోంది’ అని రాముని వంక చూశాడు. 


విశ్వామిత్ర మహర్షి చూపులోని అర్ధం గ్రహించిన ఇక్ష్వాకు వంశజుడు అయిన శ్రీరాముడు, అక్కడి వారు శాపగ్రస్తమైన ఆశ్రమంలోకి వద్దంటున్నా లోపలికి వెళ్లాడు. ఆశ్రమం అంతా రకరకాల చెట్లు, పొదలు, దుమ్ము, ధూళి, రాళ్ళతో నిండి పోయి ఉంది. శిథిలావస్థలో ఉన్న ఆశ్రమం ముఖద్వారం వద్దకు రాముడు రాగానే, అక్కడ రాయిగా మారి ఉండిన అహల్యకు శ్రీరాముని పాదం తగిలింది.


శ్రీమహావిష్ణువు అవతారం, ఇక్ష్వాకు వంశజుడైన రాముని పాదం తగలగానే అహల్యకు శాప విమోచనం కలిగి స్త్రీ రూపం పొందింది. క్షణంలో ఆశ్రమానికి శిథిలావస్థ రూపం పోయి సుందర రూపం వచ్చింది. గౌతమ మహర్షి అక్కడకు వచ్చాడు. అహల్యను పత్నిగా స్వీకరించాడు. దంపతులిరువురు శ్రీరామునికి ధన్యవాదాలు తెలిపి ఆశీస్సులు ఇచ్చారు. గౌతమ మహర్షి "రాముని తీసుకువచ్చి అహల్యకు శాప విమోచనం చేసినందుకు" విశ్వామిత్రునికి కృతజ్ఞతలు తెలియ జేశాడు. 


విశ్వామిత్రుడు గౌతమ మహర్షి, అహల్యలకు వీడ్కోలు పలికి రామలక్ష్మణులను తీసుకుని మిథిలకు బయలుదేరి వెళ్లాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శనివారం 🍁* *🌹09, మే, 2026🌹*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁శనివారం 🍁*

 *🌹09, మే, 2026🌹*

 *దృగ్గణిత పంచాంగం*              


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : సప్తమి* మ 02.02 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : శ్రవణం* రా 11.24 వరకు ఉపరి *ధనిష్ఠ*

*యోగం : శుక్ల* రా 02.36 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : బవ* మ 02.02 *బాలువ* రా 02.39 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 10.30 - 12.30 సా 05.00 - 06.00*       

అమృత కాలం  : *మ 12.06 - 01.51*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : రా 03.39 - 05.20*

*దుర్ముహూర్తం :ఉ05.39- 07.22* 

*రాహు కాలం  :ఉ08.52 - 10.28*

గుళికకాళం      : *ఉ 05.39 - 07.15*

యమగండం    : *మ 01.40 - 03.16*

సూర్యరాశి : *మేషం*                  

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 05.47* 

సూర్యాస్తమయం :*సా 06.39*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 05.39 - 08.13*

సంగవ కాలం    :*08.13 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.21*

అపరాహ్న కాలం    : *మ 01.21 - 03.55*

*ఆబ్ధికం తిధి     : వైశాఖ బహుళ అష్టమి*

సాయంకాలం    :*సా 03.55- 06.29*

ప్రదోష కాలం      :*సా 06.29- 08.43*

రాత్రి కాలం       :*రా 08.43 - 11.41*

నిశీధి కాలం       :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.54*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*వినా వేంకటేశం న నాథో న* 

*నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


     *🍁హనుమకృత🍁*  

 *🍁సీతారామ స్తోత్రమ్🍁*


*పుత్రం దశరథస్యాద్యమ్*

*పుత్రీం జనక భూపతే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శనివారం 9 మే 2026*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

        *శనివారం 9 మే 2026*


  *🙏శ్రీ హనుమాన్ చాలీసా 🍁*


*🍁జ్ఞాన యజ్ఞం - 5వ రోజు**🍁


గత రెండు చౌపాయిల్లో హనుమంతుని జ్ఞానాన్ని, శక్తిని మరియు ఆయన జన్మ వృత్తాంతాన్ని స్మరించుకున్నాం. ఇప్పుడు ఆయన శారీరక బలాన్ని, మానసిక దృఢత్వం మరియు ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని ఈ మూడవ చౌపాయిలో దర్శించుకుందాం.


 **మూడవ చౌపాయి**


 **మహాభీర బిక్రమ బజరంగీ |**

 **కుమతి నివార సుమతికే సంగీ ||**


         **ప్రతిపదార్థం**


      * **మహావీర** 

    గొప్ప వీరుడైనవాడా!


         * **విక్రమ**     

      పరాక్రమవంతుడా!


        * **బజరంగీ** 

వజ్రం వంటి కఠినమైన శరీరం కలవాడా! (వజ్రాంగీ)


  * **కుమతి నివార** 


చెడు బుద్ధిని (దుర్బుద్ధిని) తొలగించేవాడా


      * **సుమతి కే సంగీ**


 మంచి బుద్ధి కలవారికి తోడుగా ఉండేవాడా\! (మంచి ఆలోచనలను ఇచ్చేవాడా)


 **విస్తృత ఆధ్యాత్మిక వివరణ**


**1. మహాభీర విక్రమ బజరంగీ (శక్తి స్వరూపం)**


మహాభీర, భిక్రమ, బజరంగీ ఈ మూడు స్వామి వీరత్వాన్ని తెలిపే నామాలు.


అసలు హనుమంతుని వ్యక్తిత్వం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గొప్పయోగి, మహాజ్ఞాని, మహాపండితుడు, సర్వశాస్త్రవేత్త. దానికి తోడు సర్వదేవతాత్మకుడు వీటన్నింటిని కలబోసుకుని, పరమసత్త్వమయుడే కాకుండా, మహా శౌర్యమయుడు కూడా శౌర్యము, సౌమ్యము... రెండూ ఆయన వద్ద ఉన్నాయి.


ఎంత సౌమ్యమో అంత శౌర్యం హనుమ వద్ద ఉంది,ఈ రెండు గుణాలు కలిగి ఉండటం చాలా కష్టం. ప్రతాపం ఉన్నవాడికి ప్రసన్నత ఉండదు, ప్రసన్నత ఉన్న వాడికి ప్రతాపం తీవ్రంగా ఉండదు. మనో నిగ్రహం ఉన్నవారు మాత్రమే ఈ రెండు గుణాలు నిభాయించుకుంటారు.ఏది ఎప్పుడు అవసరమో దాన్నే చేస్తాడు.


సీతమ్మ తో పిల్లి పిల్లంత పరిమాణం లో అతి సౌమ్యంగా మాట్లాడి అమ్మ దుఃఖం పోగొట్టిన స్వామి. మరుక్షణం లో మహా పర్వతం అంత పరిమాణం లోకి మారి లక్షలాది మంది రావణ సైనికులను,రావణ పుత్రులతో సహా సంహరించాడు. మళ్ళీ అంతలోనే బ్రహ్మాస్త్రం కి గౌరవం ఇచ్చి కట్టుబడి పోయాడు. ఇలా, తిరుగు లేని శారీకర బలం,మానసిక బలం, ఆత్మ జ్ఞానం కలిగి ఉన్న వీరుడు హనుమ. 


వీరుడు అంటే గొప్పవాడు అని అర్దం. ఆయన అన్నిటిలోనూ తిరుగులేని వాడే, దయ లో కూడా తన భక్తుల మీద అపార దయ చూపించి వారిని కాపాడుతాడు.


భగవత్ ఆరాధన చేసేవాడు బలహీనుడు గా ఉండకూడదు,వీరుడిగా, ధీరుడిగా ఉండాలి, అలా ఉండి మనసును నిగ్రహించి ఈశ్వరుని పాదాల దగ్గర పెట్టీ పూజిస్తేనే కదా అనుగ్రహం లభించేది, మనసు ఎటు పడితే అటు పోతే పూజ ఎక్కడిది ఫలితం ఎక్కడిది. వీరుల చేత ఇంద్రియాలు నిగ్రహించి న వారి చేత ఆరాధించబడే వాడు అని కూడా అర్దం.


విక్రమం అంటే పరాక్రమం

క్రమించుట అంటే నడచుట, వెళ్ళుట.

విశేషముగా క్రమించుట విక్రమం ఆక్రమము, విక్రమము, పరాక్రమము... ఇత్యాది మాటలు వింటూ ఉంటాం. అంటే అవతలివానికంటే ఎక్కువతనాన్ని ఋజువు చేస్తూ, వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెడితే దానిని విక్రమము అనాలి. స్వామివారు ఈ విక్రమాలు ఎన్ని రకాలుగా చూపించాడో రామాయణంలో కనబడుతున్నది.


బజరంగీ ఇది గొప్ప నామం. స్వామి పుట్టుక తోనే వజ్రము వంటి శరీరం తో పుట్టారు అని పరాశర సంహిత చెప్పింది. ఇంద్రుని వజ్రాయుధం కూడా స్వామిని ఏమి చేయలేక పోయింది. అందుకే వజ్రాంగభలి అని పేరు,అదే తెలుగులో భజరంగ బలి అయింది.


హనుమంతుడు "మహావీరుడు". ఆయన పరాక్రమం సాటిలేనిది. 'బజరంగీ' అంటే వజ్రం వంటి దృఢమైన అవయవాలు కలిగినవాడు అని అర్థం. సాధకుడికి లౌకికమైన ఆపదలను ఎదుర్కోవడానికి కావలసిన శారీరక దార్ఢ్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని ఆయన ప్రసాదిస్తారు.


**2. కుమతి నివార (అజ్ఞాన నాశనం)**


మనలోని 'కుమతి' అంటే కేవలం చెడు ఆలోచనలు, అహంకారం, అసూయ, కామ క్రోధాలు. హనుమంతుని ఉపాసన వల్ల మన మనస్సులోని ఈ మలినాలు (దుష్ట బుద్ధి) తొలగిపోతాయి. హనుమత్ ఉపాసనకు ముందు కావలసింది చెడు బుద్ధి నివారణ.

కుమతి బలహీన ఆలోచన ఈ బాధలు పడే కంటే మారణమే మేలు అని భావించిన సీతమ్మ ఆలోచన నివారించి బతుకు మీద ఆశ పుట్టించాడు స్వామి.మనలని కష్టం అనే కుమతి నుండి బయట పడేసే వాడు స్వామి.


**3. సుమతి కే సంగీ (సద్బుద్ధికి తోడు)**


చెడు బుద్ధి తొలగించడం ఒకటే కాదు మంచి బుద్ధినీ, సత్పురుషుల సాంగత్యం కూడా ఇచ్చేవాడు స్వామి.

ఎవరి హృదయంలో అయితే మంచి ఆలోచనలు, భగవంతుని పట్ల భక్తి ఉంటాయో, హనుమంతుడు వారికి వెన్నంటి ఉంటాడు. విభీషణుడు సద్బుద్ధితో రాముడిని శరణు కోరినప్పుడు, హనుమంతుడే అతనికి అండగా నిలబడ్డాడు. మనం మంచి మార్గంలో నడవాలని నిశ్చయించుకుంటే, ఆయన మనకు మార్గదర్శిగా మారి వెలుగునిస్తారు.


రామాయణంలో కుమతి అయిన వాలిని వదిలి, 

సుమతి అయిన సుగ్రీవుని పట్టుకున్నాడు

హనుమ, రాముడు కూడా అంతే, కాబట్టి నీకు దైవ అనుగ్రహం కావాలి అంటే చెడు సావాసాలు,ఆలోచనలు వదులు,విభీషణుడి లాగా.


సత్సంగాన్ని సాధించు దుస్సంగాన్ని విడిచిపెట్టు. దేనిని పట్టుకోవాలో, దేనిని వదలాలో తెలియాలి. దుస్సంగమంటే దుష్టుడని కాదు... దుష్టబుద్ధులతో సంగము కూడదని చెప్పడం.


ఆంజనేయస్వామిని ఉపాసన చేస్తే చెడుబుద్ధిని పుట్టనివ్వడు, పుట్టినా తుంచేస్తాడు. చెడు ఆలోచనను ఆచరణరూపంలో రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ప్రారబ్ధవశాత్తూ దుర్వాసనల వల్ల చెడుబుద్ధి పుట్టినా, అది చెడుపనిగా రానివ్వకుండా నా బుద్ధిని సరైన మార్గంలో 'స్వామీ! నడిపించు' అని ప్రార్ధించాలి.


**తులసీదాసు గారి సందేశం:**


మొదటి పాదం లో స్వామి పరాక్రమం చెప్పే నామాలు చెప్పి, రెండవ పాదంలో కుమతి నివారణ అన్నాడు అంటే. మహావీరుడిలా ఇంద్రియాలు నిగ్రహించి, విక్రమము క్రమ పద్ధతిలో నీ ఉత్సాహాన్ని వినియోగించి, బజరంగి లా ఎలాంటి ప్రలోభాల కు లొంగక, దుష్ట బుద్దులను దూరం పెట్టీ, సద్బుద్ధి నీ, సత్పురుషుల ను విడవక పట్టుకునేలా నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకోవడం.


బాహ్య శత్రువుల కంటే అంతర్గత శత్రువులైన (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) 'కుమతి'ని జయించడం గొప్ప విషయం. హనుమంతుడిని వేడుకుంటే ఆయన మనలో వివేకాన్ని (సుమతి) రగిలిస్తాడు. బలం ఉన్నచోట వివేకం ఉంటేనే అది సమాజానికి హితం చేకూరుస్తుంది.


అలాంటి శారీరక, మానసిక బలం ఉన్న దృఢమైన సమాజం నిర్మాణం కావాలి అని మనసారా స్వామి హనుమను కోరుకుందాం. వచ్చే రెండు చౌపాయి లలో స్వామి వారి రూప ధ్యానం ఉంటుంది చాలా అద్భుత శ్లోకాలు అవి రేపు తెలుసుకుని తరిద్దాం.


**జై శ్రీరామ్! జై హనుమాన్!**

       🍁🌹🙏🌹🍁


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

నిద్రమోహం కొడకా"

 ఇంటర్ లో 99% మార్కులు తెచ్చుకుని, ఐ.ఐ.టి ఢిల్లీలో సీట్ కొట్టి.....ఆ జిల్లాలోనే తెలివైన కుర్రోడిగా పేరు తెచ్చుకున్న సుందరం కొడుకు, ఎక్కడికన్నా తీసుకెళ్లమని వాళ్ళ నాన్నతో ఒకటే గోల.

కొడుకు బాధ పడలేక ఎక్కడకి తీసుకెళ్ళాలో చెప్పమన్నాడు సుందరం. చలికాలం రాత్రి లంబసింగిలో టెంట్ వేసుకుని ఉంటే బాగుంటుంది అన్నాడా అబ్బాయి. టెంట్ ఒకటి కొని, 

శనివారం ఉదయం బయలుదేరి సాయంత్రం లంబసింగి చేరుకుని, 

మంచి ప్లేస్ ఒకటి పట్టుకుని, టెంటు వేసుకుని పడుకున్నారు 

తండ్రి కొడుకులు. 

మధ్య రాత్రి లేపి 

కొడుకుని పైకి చూడమన్నాడు సుందరం. చూశాడు కొడుకు...... 

"ఏమి కనపడుతుందిరా?" అడిగాడు సుందరం. 

"నక్షత్రాలు!" అన్నాడు కొడుకు.

"నీకేం అర్ధం అయింది" అనడిగాడు సుందరం. 

.

"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే శుక్రుడు మకరరాశిలోకి వెళ్తున్నాడు, 

జీవ శాస్త్రం ప్రకారం చూస్తే జీవం ఉన్న ఏకైక గ్రహం మీద మనమున్నాం, 

అంతరిక్ష శాస్త్రం ప్రకారం చూస్తే ఈ విశ్వము అనంతమైనది,

భౌతిక శాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుడు తన గురుత్వాకర్షణ శక్తితో భూమిని, దాని మీద ఉన్న మనల్ని తిప్పుకుంటున్నాడు, 

రసాయన శాస్త్రం ప్రకారం చూస్తే, ఈ విశ్వములో ఉదజని 99 శాతం ఉంది" అన్నాడా కొడుకు.

ఇంతలా అడుగుతున్నావు, "ఇంతకీ నీకేమర్థమయింది నాన్నా?" అనడిగాడా అబ్బాయి,


*"మన టెంట్ ఎవడో దొబ్బుకెళ్ళాడ్రా నిద్రమోహం నా కొడకా"*- 

అని తిట్టాడాయన 

ఐ.ఐ.టి లో నెంబర్ వన్ తెచ్చుకున్న కొడుకుని


అందుకే చెప్పేది....

లోకజ్ఞానం కూడా నేర్పండి అని 😉.....

తలుపు తెరిచింది.

 నేను ఒక డెలివరీ బాయ్‌ని. ఎక్కువగా సాయంత్రం షిఫ్ట్‌లో పని చేస్తాను.

ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో చివరి ఆర్డర్ తీసుకున్నాను.

రెస్టారెంట్ నుండి ప్యాకెట్ తీసుకున్నప్పుడు గమనించాను—చాలా చిన్న ఆర్డర్: సాధారణ ఖిచ్డీ, పెరుగు, రెండు అరటిపండ్లు మాత్రమే.


అడ్రస్ నగరంలోని పాత ప్రాంతంలో ఉంది.

చాలా పాడైపోయిన భవనం. మూడో అంతస్తు.

నేను డోర్‌బెల్ నొక్కాను.


ఒక వృద్ధ మహిళ తలుపు తెరిచింది.

తెల్ల జుట్టు, వణుకుతున్న చేతులు, మందపాటి కళ్లజోడు.

ఆమె ముఖంలో అలసట కనిపించింది, కానీ స్వరంలో మాధుర్యం ఉంది—


"బాబూ, లోపల పెట్టేయి… నా చేతులు వణుకుతాయి."


నేను ఆహారాన్ని టేబుల్‌పై పెట్టి వెళ్లడానికి తిరిగినప్పుడు, ఆమె అడిగింది—


"రెండు నిమిషాలు కూర్చుంటావా?

ఒంటరిగా తినడం బాగుండదు."


నేను గడియారం చూసాను.

నా షిఫ్ట్ అయిపోయింది.

కొంచెం అలసటగా ఉంది.

కానీ ఏదో కారణంగా నేను కూర్చున్నాను.


గది నిశ్శబ్దంగా ఉంది.

గోడపై ఒక పాత గడియారం టిక్‌టిక్ మంటూ ఉంది.

ఒక మూలలో చిన్న దేవుడి ఫోటో.

మరో గోడపై అనేక ఫోటోలు.


ఆమె ప్లేట్ తెరిచి, నెమ్మదిగా ఖిచ్డీ తినడం ప్రారంభించింది.

ప్రతి రెండు ముద్దల తర్వాత, నన్ను చూసి నవ్వేది.


ఆమె చెప్పింది—


"తెలుసా బాబూ, నేను ప్రతి రోజు బయట నుంచి ఆర్డర్ చేయను.

ఈరోజు మాత్రం… ఒక మనిషి గొంతు వినాలని అనిపించింది."


నేను మౌనంగా ఉన్నాను.


ఆమె గోడపై ఉన్న ఒక ఫోటో చూపించింది.


"ఇతనే నా భర్త. రైల్వేలో పని చేసేవాడు.

ఐదేళ్ల క్రితం చనిపోయాడు."


మరో ఫోటో—


"ఇతనే నా కొడుకు. కెనడాలో ఉంటాడు.

బాగా ఉన్నాడు… ప్రతి నెల డబ్బు పంపిస్తాడు."


కొద్దిసేపు ఆమె మౌనంగా ఉంది.

ఆమె నవ్వింది, కానీ ఈసారి కళ్లలో నీళ్లు—


"కానీ… పంపడానికి సమయం మాత్రం ఉండదు."


అప్పుడే గదిలో గడియారం శబ్దం చాలా గట్టిగా వినిపించింది.


ఆమె ఇంకో ముద్ద తీసుకుంది.


"ఇది నా కూతురు. బెంగళూరులో ఉంటుంది.

తన ప్రపంచంలో సంతోషంగా ఉంది.

అలా ఉండాలి కూడా.

పిల్లలు ఎగరాలి కదా… లేదంటే పెంచిన ప్రయోజనం ఏమిటి?"


ఆమె మాట్లాడుతుండగా స్వరం కొద్దిగా కంపించింది.

కానీ ముఖంలో ఎలాంటి ఫిర్యాదు లేదు.

కేవలం ఖాళీ.


ఆమె నన్ను అడిగింది—


"నీకు అమ్మ ఉందా?"


నేను చెప్పాను—

"ఉంది."


"ప్రతి రోజు ఆమెతో మాట్లాడుతావా?"


నేను మౌనంగా ఉన్నాను.


నిజానికి, నేనూ ఇంటికి ఫోన్ చేయకుండా రోజులు గడిపేవాడిని.

అలసట, పని, పరుగులు…

ప్రతి సారి ‘రేపు చేస్తాను’ అని వాయిదా వేసేవాడిని.


ఆమె నా మౌనాన్ని అర్థం చేసుకుంది.


ఆమె మెల్లగా చెప్పింది—


"తల్లిదండ్రులు డబ్బు లెక్కించరు బాబూ…

వాళ్లు స్వరాలను లెక్కిస్తారు."


నా లోపల ఏదో మెల్లగా విరిగిపోయింది.


భోజనం ముగిసింది.

ఆమె నీళ్లు తాగింది.

తర్వాత తన పర్సులో నుంచి 500 రూపాయలు తీసి నాకు ఇచ్చింది.


"ఇది టిప్ కాదు.

నన్ను ఒంటరిగా తిననివ్వని ఆ అరగంటకి ధర."


నేను వెంటనే తిరస్కరించాను—


"వద్దు అమ్మా, నేను తీసుకోలేను."


ఆమె నవ్వింది—


"తీసుకో.

ఈరోజు నువ్వు ఆహారం డెలివర్ చేయలేదు…

సంగతిని డెలివర్ చేశావు."


నేను డబ్బు తీసుకున్నాను.

కానీ జేబులో పెట్టలేదు.

చేతిలోనే పట్టుకున్నాను.


నేను వెళ్లేటప్పుడు ఆమె చెప్పింది—


"మరియు—

ఈరోజే ఇంటికి వెళ్లి నీ అమ్మకు తప్పకుండా ఫోన్ చేయి."


ఆ రాత్రి నేను భవనం కింద బైక్ స్టార్ట్ చేయలేదు.

ముందు అమ్మకు ఫోన్ చేశాను.


అక్కడి నుంచి ఆమె స్వరం వచ్చింది—


"ఈరోజు అకస్మాత్తుగా ఫోన్ చేశావే? అన్నీ బాగున్నాయా?"


ఆ స్వరం వినగానే నా గొంతు దిగబడ్డింది.


నేను చెప్పాను—


"అవును అమ్మా…

నీ స్వరం వినాలనిపించింది."


కొన్ని క్షణాలు అక్కడ మౌనం.

తర్వాత అమ్మ అడిగింది—


"తిన్నావా?"


నేను రోడ్డు పక్కనే నిలబడి ఏడ్చేశాను.


ఆ రాత్రి తర్వాత, నేను ప్రతి రోజు అమ్మకు ఫోన్ చేయడం ప్రారంభించాను.


మరియు అమ్మ మాత్రమే కాదు—

ప్రతి డెలివరీ కూడా నాకు కేవలం ఆర్డర్‌గా అనిపించలేదు.


కొన్ని ఇళ్లకు మందులు అవసరం.

కొన్ని ఇళ్లకు ఒంటరితనం నుంచి ఉపశమనం కావాలి.

కొన్ని ఇళ్లలో ఎదురు చూపు ముగియాలి.

కొన్ని ఇళ్లకు కేవలం ఒక స్వరం కావాలి.


ఇప్పుడు తలుపు తెరుచుకున్నప్పుడు, నేను తొందరపడను.

ముఖాన్ని చూస్తాను.

స్వరాన్ని వింటాను.

కొన్నిసార్లు అడుగుతాను—

"మిగతావన్నీ బాగున్నాయా?"


చాలామంది "అవును" అంటారు.

కొంతమంది నవ్వుతారు.

మరికొంతమంది ముఖాలు రోజంతా ఎవరితోనూ మాట్లాడలేదని చెబుతాయి.


రెండు నెలల తర్వాత, అదే అడ్రస్ నుంచి మళ్లీ ఆర్డర్ వచ్చింది.


నేను వెంటనే వెళ్లాను.


ఇంకొకరు తలుపు తెరిచారు.

అది పక్కింటి ఆంటీ.


ఆమె మెల్లగా చెప్పింది—


"అమ్మా గత వారం చనిపోయింది."


నేను కొన్ని క్షణాలు తలుపు దగ్గర నిలబడ్డాను.

నా చేతులు ఖాళీగా ఉన్నాయి, కానీ నా లోపల ఏదో భారంగా పడిపోయింది.


ఆమె లోపల నుంచి ఒక చిన్న కవర్ తీసుకొచ్చింది.

"ఇది నీకోసం ఆమె వదిలింది."


నా చేతులు వణుకుతుండగా, నేను దాన్ని తెరిచాను.


లోపల 500 రూపాయలు ఉన్నాయి.

మరియు ఒక చిన్న నోట్.


దానిలో ఇలా ఉంది—


"బాబూ,

నువ్వు ఇది చదువుతున్నావంటే, నేను వెళ్లిపోయాను.

ఆ రాత్రి నాతో కలిసి తిన్నందుకు ధన్యవాదాలు.

నువ్వు నాకు ఆహారం ఇవ్వలేదు—గౌరవం ఇచ్చావు.

మరియు అవును—నీ అమ్మకు ఫోన్ చేస్తూ ఉండు.

అమ్మ"


ఇప్పటికీ ఆ 500 రూపాయలు నా బ్యాగ్‌లోని లోపలి జేబులోనే ఉన్నాయి.

నేను వాటిని ఖర్చు చేయలేదు.


ఎందుకంటే ఆ రాత్రి నాకు మొదటిసారి అర్థమైంది—


ప్రతి తలుపు వెనుక కేవలం కస్టమర్ ఉండడు.

కొన్నిసార్లు అది ఒక తల్లి.

కొన్నిసార్లు అది ఎదురు చూపు.

కొన్నిసార్లు అది చివరి సంభాషణ.


మనందరం మన మన ఆకలులతో జీవిస్తున్నాం—

కొంతమందికి అన్నం కావాలి,

కొంతమందికి మందులు కావాలి,

మరికొంతమందికి కేవలం రెండు నిమిషాల సాంగత్యం కావాలి.


మనుషులకు ఎప్పుడూ డబ్బు డెలివరీ అవసరం ఉండదు—

కొన్నిసార్లు వారికి ప్రేమ డెలివరీ కావాలి. 😭


సేకరణ

సావడి కబుర్లు

  *సావడి కబుర్లు -1*


వందేమాతరం


*అమ్మలకి లెక్కల రావు*


_జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ॥_

_తల్లి మరియు జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి._


ఆ మధ్య సాయంత్రం సావడిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఎవరో నవ్వుతూ అన్నారు, “ఈ అమ్మలకి లెక్కలు రావు!” అని. ఆ మాట విన్నాక నేను కాసేపు ఆలోచించాను. నిజమేనేమో అనిపించింది. ఎందుకంటే మా అమ్మకి లెక్కలు వచ్చి ఉంటే,


 “అమ్మా… ఆకలిగా ఉంది, రెండు చపాతీలు పెట్టు” అన్నప్పుడు నాలుగు ఎందుకు పెడుతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, పరీక్షల రోజున తెల్లవారుజామున ఐదు గంటలకే లేపి, “ఏడయ్యిందిరా! ఇంకా పడుకున్నావేంటి?” అని ఎందుకు తొందర పెడుతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, నేను పరీక్షలో ముప్పై మార్కులు తెచ్చినా, పక్కింటివారికి “యాభై వచ్చాయి” అని గర్వంగా ఎందుకు చెబుతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, ఖర్చులకని గోముగా యాభై రూపాయలు అడిగితే, పోపుల డబ్బాలోంచి వంద రూపాయలు ఎందుకు ఇస్తుంది?


లెక్కలు వచ్చి ఉంటే, నాన్న తెచ్చిన జీతం నుంచి పాలవాడు, చాకలివాడు, కిరాణావాడు, పనివాడు అంటూ అందరికీ ఇచ్చిన లెక్కలు చెప్పి, పోపులు డబ్బాలో దాచిన చిల్లర సంగతిని మాత్రం ఎందుకు మర్చిపోతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, నేను దొంగచాటుగా సినిమాకు వెళ్లి రాత్రి ఒంటిగంటకు వచ్చి పడుకున్నా, ఉదయాన్నే నాన్నకి “రాత్రి పదింటికే వచ్చి పడుకున్నాడు” అని ఎందుకు కాపాడుతుంది?


అందుకే అనిపించింది, అమ్మకి నిజంగానే లెక్కలు రావు.

ఒక్క ప్రేమ తప్ప!


అమ్మ అంటే మా అమ్మ ఒక్కతే కాదు. ఈ లోకంలోని ప్రతి అమ్మది అదే తీరు. వారు చదివేది పాఠశాల పుస్తకాలు కాదు, జీవితంలోని ప్రేమానురాగాలు. వారు అనుసరించేది గణిత సూత్రాలు కాదు, అనురాగ సూత్రాలు.


సమకాలీన జీవితంలో సాగే ప్రతి చిన్న మార్పునూ, ప్రతి కష్టాన్నీ, ప్రతి ఆనందాన్నీ నిశ్శబ్దంగా గమనించేది అమ్మ మాత్రమే. కుటుంబానికి అవసరమైనది ఏదో, అవసరం లేనిది ఏదో చెప్పకుండానే తెలుసుకునే అంతర్దృష్టి ఆమెది. బయటకు సాధారణురాలిగా కనిపించినా, లోపల పరిపూర్ణ ఆలోచనాశీలి.


అసలు అమ్మలు ఆత్మకథలు రాస్తే అవి ఆయా కాలాలకు చెందిన చారిత్రిక గ్రంధాలుగా ఆవిష్కృతమవుతాయి. అందులో మన జీవిత పోరాటాలు ఉంటాయి, కన్నీటి చరిత్ర ఉంటుంది, త్యాగాల గాథ ఉంటుంది, వాటిపై మనకు కావలసిన సమీక్షలు ఉంటాయి, విమర్శలకు సమాధానాలుంటాయి, ప్రేమకు నిర్వచనాలుంటాయి.


ఉద్యోగంలో చేరిన కొత్తలో, ఒకవైపు కార్యాలయ పని, మరోవైపు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉండగా ఒక్కసారిగా అనిపించింది “వామ్మో! అమ్మకు ఎన్ని చేతులున్నాయో!” అని. అప్పుడే తెలిసింది, ఆమెకు రెండు చేతులే ఉన్నా, ఆ చేతుల్లో వెయ్యి పనుల శక్తి ఉందని.


ఎప్పుడో చదివాను రాఘవ గారు తన "అమ్మ ముచ్చట్లు" లో అమ్మ ఉన్నంతకాలం నేను ఎంత పెద్దయినా, అమ్మ కొంగుచాటు బిడ్డనే అన్నారు. అలాగే మన మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారు నంద్యాలలో మాట్లాడుతూ దేశానికి రాజైన అమ్మకు బిడ్డే అని తన మనసులోని మాట చెప్పారు. రాజ్యాలను నడిపినవారికైనా, శాస్త్రాలను జయించినవారికైనా, ప్రపంచం గెలిచినవారికైనా, అమ్మ ఎదుట మాత్రం వారు పిల్లలే.


మానవత్వం మిగిలి ఉన్న ప్రతి మనసుకీ అమ్మ ప్రేమ అర్థమవుతుంది. అమ్మ హృదయం సముద్రంలా ఎంత విశాలమైనదో అంత లోతైనది. ఆ ప్రేమను కొనలేం, కొలవలేం, తీర్చలేం. కాలాలు మారినా, యుగాలు గడిచినా, అది కాలాతీత సత్యంగానే నిలుస్తుంది.


మనకు నడక నేర్పింది అమ్మే, నడత నేర్పింది అమ్మే, మాట నేర్పింది అమ్మే, మనిషిగా నిలబడటం నేర్పింది కూడా అమ్మే. అలాంటి తల్లికి సేవ చేయగలగడం జీవితంలో దక్కే మహాభాగ్యం. అటువంటి అమ్మపై మన ఫేమస్ సత్యమై, నిత్యమై ఉండాలి.


అబ్బురపరిచే విషయమేమిటంటే, ఇప్పుడు చాలామంది పౌర్ణమి రోజునో, పాడ్యమి రోజునో సముద్ర తీరాన నిలబడి గట్టిగా కేక వేస్తూ తమ స్వరమే సముద్ర ఘోషలా వినిపిస్తోందని చాటింపు వేసుకుంటున్నారు. కానీ నిజానికి మన జీవితమంతా వినిపించే మహాఘోష ఒకటే, అది అమ్మ పిలుపు.


అది సరే… ఇంతకీ అమ్మ కమ్యూనిస్టా? విప్లవవాదా? శ్రామికవాదా? ఆధ్యాత్మిక అమృతవాహినియా? జాతీయవాదా? లేక నా జీవితానికి జగద్గురువా?

ఏమో… నాకు అవన్నీ తెలియదు.

నాకు మాత్రం అమ్మే.

అమ్మ పిలుపు ఎప్పుడైనా మధురమే.

గడిచిన నిన్నైనా…

జరుగుతున్న నేడైనా…

రాబోయే రేపైనా…


ఉంటా

మృశి

(దశిక ప్రభాకర శాస్త్రి)

14.12.2024

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - సప్తమి - శ్రవణం -‌‌ స్థిర వాసరే* (09.05.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విష్ణు స్తుతి

 ☘️🌸☘️ విష్ణు స్తుతి🙏


కేశవా! హరిహృషీకేశ నారాయణా

   దామోదర మధుసూదన మహాత్మ

విష్ణు అధోక్షజా!జిష్ణు త్రివిక్రమ

   పద్మనాభ !యుపేంద్ర వాసుదేవ

యచ్యుత గోవింద యనిరుద్ధ మాధవ

  శ్రీధరా !శ్రీకృష్ణ శిష్ట పోష

సంకర్షణ నృసింహ శాశ్వతా యనుచును

మునులునిన్ కొలిచిరి ముదముతోడ

తే..వాసుదేవమాధవనీకు వందనములు

 నందగోపాల శ్రీ పతి నాగశయన 

సకల దేవతా పూజిత శరణు శరణు 

విన్నపాలు వినుము దేవ విష్ణుమూర్తి



సాహితీ శ్రీ జయలక్ష్మీ

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।

సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే ।। 22 ।।



ప్రతిపదార్థ:


యదృచ్ఛా— అప్రయత్నముగానే లభించిన; లాభ — లాభము; సంతుష్టో — తృప్తి; ద్వంద్వ — ద్వంద్వములకు (సుఖ-దుఃఖములవంటి); అతీతః — అతీతుడు; విమత్సరః — అసూయా రహితుడై; సమః — సమత్వముతో; సిద్దౌ — జయమునందు; అసిద్దౌ — అపజయమునందు; చ — మరియు; కృత్వా — కర్మలను చేయుచూ; అపి — ఉన్నాసరే; న, నిబధ్యతే — బంధింపబడడు.



తాత్పర్యము : 


   

అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు జీవన ద్వంద్వములకు (సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలు వంటివి) అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా, గెలుపు-ఓటమిలలో సమత్వ బుద్ధి తో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.



వివరణ:


ఒకే నాణానికి రెండు పక్కలు ఉన్నట్టు, భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వంద్వములతో సృష్టించాడు - పగలు, రాత్రి; తీపి-చేదు; వేడిమి-చల్లదనం; వాన-కరువు మొదలగునవి. అందమైన పువ్వు ఉన్న గులాబి మొక్కకి, వికృతమైన ముల్లు కూడా ఉంది. జీవితం కూడా తన వంతు ద్వంద్వములను తెస్తుంది – సుఖము-దుఃఖము; గెలుపు-ఓటమి; కీర్తి-అపకీర్తి. శ్రీ రామచంద్రమూర్తి సైతం, తన దివ్య లీలలలో, అయోధ్యకి మహారాజుగా పట్టాభిషేకం అయ్యే ఒక్కరోజు ముందు వనవాసానికి పంపివేయబడ్డాడు.


ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు, ఎవ్వరూకూడా ద్వంద్వములు లేకుండా, కేవలం అనుకూల పరిస్థితులే ఉండాలని ఆశించలేరు. మరి మన జీవితంలో ఎదురయ్యే ద్వంద్వములను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి? ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదిగి అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ, సమస్థితిలో ఉండటమే దీనికి పరిష్కారం. ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేస్తూపోతూ, మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం భగవంతుని ప్రీతి కోసం కర్మలను ఆచరించినప్పుడు, అనుకూల-ప్రతికూల ఫలితాలను ఈశ్వర సంకల్పంగా పరిగణించి రెంటినీ సంతోషంగా స్వీకరిస్తాము.

పంచాంగం 09.05.2026 Saturday,

  ఈ రోజు పంచాంగం 09.05.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష సప్తమి తిథి స్థిర వాసర శ్రవణం నక్షత్రం శుక్ల యోగః బవ తదువరి బాలవ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: సప్తమి 


 

నమస్కారః , శుభోదయం

09-05-2026 శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

09-05-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.  

---------------------------------------


వృషభం


వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు.

---------------------------------------


మిధునం


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

---------------------------------------


కర్కాటకం


ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. 

---------------------------------------


సింహం


సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------


కన్య


దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------


తుల


బంధు మిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. 

---------------------------------------


ధనస్సు


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

---------------------------------------


మకరం


ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం.

---------------------------------------


కుంభం


ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------


మీనం


సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

Mantra - 34

 Mantra - 34 ARUNAM 4 anuvaakam


ప్రకృతిని ఒక రణరంగంగా, జ్ఞాన సాధనను ఒక వీరకృత్యంగా క్రిందటి మంత్రం వర్ణిస్తే, ఈ క్రింది మంత్రం సూర్య భగవానుడి యొక్క తేజస్సును, ముఖ్యంగా హేమంత ఋతువులో ఆయన కళ్ళు (కిరణాలు) ఎలా ఉంటాయో ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తుంది.


"అక్రుధ్ధస్య యోథ్స్యమానస్య | 

క్రుద్ధస్యేవ లోహినీ। 

హేమతశ్చక్షుషీ విద్యాత్|

అక్ష్ణయోః క్షిపణోరివ||”


“అక్రుధ్ధస్య యోథ్స్యమానస్య” - కోపం లేకపోయినప్పటికీ, యుద్ధానికి సిద్ధమవుతున్న వీరుని వలె. 

సాధారణంగా యుద్ధం చేసేవారు క్రోధంతో ఉంటారు. కానీ, ఇక్కడ వీరుడు శాంతంగా ఉంటూనే పరాక్రమాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. రామాయణంలో (1.1.18) రాముడు శాంత స్వరూపి కానీ కోపం వస్తే ‘కాలాగ్ని సదృశః క్రోధే’ అంటారు వాల్మీకి. అంటే ఇదే.


"క్రుద్ధస్యేవ లోహినీ” - కోపంతో ఉన్నవాని కళ్ళు ఎలాగైతే ఎర్రగా (లోహినీ) ఉంటాయో.


“హేమతశ్చక్షుషీ విద్యాత్” - హేమంత ఋతువులో సూర్యుని కళ్ళను (కిరణాలను) ఆ విధంగానే గ్రహించాలి. 

హేమంతంలో సూర్యుడు ఉదయించేటప్పుడు లేదా అస్తమించేటప్పుడు కిరణాలు ఎర్రటి రంగులో, తీక్షణంగా కనిపిస్తాయి.


“అక్ష్ణయోః క్షిపణోరివ" - బాణాన్ని ప్రయోగించే వేటగాని లేదా వీరుని కళ్ళలో ఉండే తీక్షణత వలె.

గురి చూసి బాణాన్ని వదిలేటప్పుడు కళ్ళలో ఎంతటి ఏకాగ్రత, ప్రకాశం ఉంటాయో, సూర్య కిరణాలు కూడా అంతటి శక్తిని కలిగి ఉంటాయని భావం.


హేమంత ఋతువు వర్ణన - చలికాలం (హేమంతం) లో సూర్యరశ్మి పగటిపూట తక్కువగా ఉన్నప్పటికీ, ఉదయ కాలంలో ఆ ఎర్రటి కాంతి మనకు వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ ఎరుపు రంగును వేదం ఇక్కడ "క్రుద్ధస్యేవ లోహినీ" (కోపంతో ఎర్రబడిన కళ్ళ వంటిది) అని వర్ణించింది.


శాంతంగా ఉంటూనే లోకాన్ని రక్షించడానికి సిద్ధమైన వీరునితో సూర్యుడిని పోల్చడం ద్వారా, భగవంతుని నిర్గుణ మరియు సగుణ రూపాల మధ్య సమన్వయాన్ని ఇక్కడ చూడవచ్చు.


"విద్యాత్" (తెలుసుకోవాలి), "యోథ్స్యమానస్య" (యుద్ధానికి సిద్ధపడుతున్న) వంటి వైదిక పదజాలములు ఉపనిషత్ శైలిలో జ్ఞానాన్ని బోధిస్తాయి. అలాగే "అక్ష్ణయోః" (కళ్ళ యొక్క) అనే పదం కంటి చూపుకు సూర్యుడే అధిదేవత అని గుర్తుచేస్తుంది.


సూర్యుడు లోకాన్ని దహించడానికి కాదు, రక్షించడానికి తన తీక్షణతను ప్రదర్శిస్తాడు. హేమంతం లోని ఆ ఎర్రటి కిరణాలు మన శరీరంలోని దోషాలను హరించి, దృష్టిని ప్రసన్నం చేస్తాయని అరుణ పారాయణ చేసే ఉపాసకులు నమ్ముతారు.


తత్త్వ విచారణ చేస్తే..

అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఈ వర్ణన వెనుక ఉన్న లోతైన సూత్రాలు కొన్ని ఉన్నాయి.


ఇక్కడ సూర్యుడిని "అక్రుద్ధుడైన యోధుడు" గా వర్ణించారు. Action without Anger.

అద్వైత సాధనలో లేదా భగవద్గీత నిష్కామ కర్మలో, పని చేయాలి (యుద్ధం) కానీ అది రాగ ద్వేషముల తో కూడినది కాకూడదు.

పరమాత్మ ఈ సృష్టిని నడిపిస్తున్నప్పుడు లేదా లయ చేస్తున్నప్పుడు ఆయనకు ఎవరిమీదా కోపం ఉండదు. అది ఆయన స్వభావం (ధర్మం). 

అలాగే, జ్ఞాని కూడా లోకంలో వ్యవహరిస్తున్నప్పుడు ఎర్రని కళ్లతో (తీక్షణంగా) కార్యదక్షతను ప్రదర్శించవచ్చు, కానీ అంతరంగా మాత్రం కోపానికి అతీతమైన శాంత స్థితిలో ఉంటాడు.


ఎరుపు రంగు ఇక్కడ కేవలం కోపానికి సంకేతం కాదు, అది తీక్షణతకు మరియు పరిపక్వతకు సంకేతం.

హేమంత కాలంలో సూర్యుడు మంచును చీల్చుకుంటూ వస్తున్నప్పుడు ఎర్రగా కనిపిస్తాడు. 

అద్వైతంలో అజ్ఞానమనే మంచును దహించివేసే 'జ్ఞానాగ్ని'కి ఇది ప్రతీక. The light of wisdom.

సాధకుడి బుద్ధి, బాణం వలె (క్షిపణోరివ) సూటిగా, సత్యాన్ని ఛేదించే విధంగా ఉండాలని ఇక్కడ సూచించబడింది.


మంత్రంలో "క్రుద్ధస్యేవ" (కోపంతో ఉన్నవాని వలె) అని వాడబడింది. అంటే, సూర్యుడికి నిజంగా కోపం లేదు, కానీ అలా కనిపిస్తున్నాడు.

ఇది అద్వైతంలోని 'వివర్తవాదం' (కనిపించేది ఒకటి, నిజమైనది మరొకటి). మాయ కు ప్రతీక. The Illusion of Appearance.

పరమాత్మకు గుణాలు లేవు (నిర్గుణ), కానీ లోక కల్యాణం కోసం లేదా మాయా ప్రభావం వల్ల రకరకాల రూపాల్లో, భావాల్లో ఉన్నట్లు మనకు గోచరిస్తాడు.


హేమంత కాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా, చల్లగా ఉంటుంది. ఇది సాధకుని ఉపరతి (ఇంద్రియాలను వెనక్కి తీసుకోవడం) అనే స్థితికి సంకేతం.

బయట చల్లదనం ఉన్నా, లోపల ఆత్మ ప్రకాశం (ఎర్రని కళ్లు/తీక్షణత) వెలుగుతూనే ఉంటుంది. బయటి ప్రపంచం నిశ్చలంగా ఉన్నప్పుడే మనలోని ఆత్మ చైతన్యాన్ని యోధుడి వలె జాగృతం చేసుకోవాలి. హేమంతము - అంతర్ముఖత్వమునకు The Cold of Self-Reflection కు చిహ్నము.


అద్వైత కోణంలో ఈ మంత్రం ఇచ్చే సందేశం - నీవు చేసే ప్రతి పనిలో యోధుడి వంటి పట్టుదల, ఏకాగ్రతతో గురి చూసి వదిలిన బాణం వలె ఉండాలి. కానీ, నీ అంతరంలో మాత్రం కోపతాపాలకు తావులేని శాంతి (అక్రోధము) ఉండాలి. సూర్యుడు మంచును చీల్చి ప్రకాశించినట్లు, నీ జ్ఞాననేత్రం అజ్ఞాన పొరలను చీల్చి పరమ సత్యాన్ని దర్శించాలి.

పురాణ భాషను అర్థం చేసుకోకపోవడం


 పురాణ భాషను అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చే అపోహ. భారతీయ సాహిత్యంలో భార్య, పత్నీ, సహచరి, జటాజూటవాసిని, సుత, కుమారుడు, ఇలా ఇటువంటి పదాలు ఎల్లప్పుడూ లౌకిక అర్థంలోనే ఉండవు. చాలా సందర్భాల్లో అవి తాత్త్విక, కవితాత్మక, సంకేతాత్మక భావాలను సూచిస్తాయి.

ఉదాహరణకు: గంగా శివజటాజూటంలో నిలిచింది అంటే శివుడు గంగావేగాన్ని నియంత్రించాడు.

పార్వతి శివపత్ని అంటే శక్తి తత్వానికి ప్రతీక.

గంగా శివుని శిరస్సుపై ఉంది అంటే పవిత్రత, జ్ఞానం, కరుణ ప్రవాహానికి సంకేతం.

అందువల్ల ఎక్కడైనా కవి గంగను “శివుని మరో భార్య” అన్నట్లుగా చెప్పినా అది న్యాయపరమైన వివాహం కాదు. కవిసమయం.


కవిత్వంలో అలంకారం, భావవ్యక్తీకరణ, కవిసమయం అని ఉంటాయి. సంస్కృత, తెలుగు కవిత్వంలో కవిసమయం అనే ఒక సంప్రదాయం ఉంది. అంటే కవులు అందరికీ తెలిసిన చిహ్నాలను, అలంకారాలను, రూపకాలను ఉపయోగించి భావాన్ని బలంగా చెప్పడం.

ఎలా అంటే, 

చంద్రుడు ప్రేమికుడు,

భూమి తల్లి,

గంగా దేవి,

శివుడు గంగాధరుడు,

లక్ష్మి సముద్రతనయ, ఇలా,...

ఇవి చరిత్ర నిజాలు కాదు.

 సాహిత్యరూపకాలు.

ఇక్కడ చెప్పిన చాటువులో కూడా కవి నీటి కొరత తీవ్రతను చెప్పడానికి గంగను విడిచిపెట్టు, పార్వతి చాలు అని హాస్యరసంతో అన్నాడు. ఇది శివతత్వంపై దూషణ కాదు.


నాస్తిక వాదులు, హిందూ వ్యతిరేకుల వాదనలో లోపం

ఏమిటంటే ఒక కవితలోని రూపకాన్ని పట్టుకుని దేవతలను అపహస్యం చేయడం.


“భారతమాత” అంటే దేశం ఒక స్త్రీనా? అని ఒక మూర్ఖుడు అడిగినట్టే, “సూర్యుడు ఉదయించాడు” అంటే సూర్యుడు నిజంగా నడిచి వచ్చాడా? అనేవాళ్ళు ఉన్నారు. అలాగే నా చిన్నప్పుడు చదివాను

“గంగమ్మ తల్లి” అంటే నది ప్రసవించిందా? అని ఒక వామపక్షవాది వ్యంగ్యంగా అన్నది. ఇలా రూపకాన్ని యథార్థంగా తీసుకుని వెక్కిరించడం సబబు కాదు.


గంగాదేవి స్థానం ఏమిటి?

ఒక కవి వర్ణించినట్టు గంగా అనేది పవిత్రనది, దేవలోక ప్రవాహం, పాపనాశిని, భగీరథ తపస్సుకు ప్రసన్నమైన దివ్యశక్తి, శివజటాజూటంలో స్థిరపడిన కరుణస్వరూపిణి. ఆమెను అవమానించడం అంటే భారతీయ సంస్కృతిలో పవిత్రత భావనను అవమానించడం.


కాబట్టి, కవిత్వంలోని రూపకాన్ని చరిత్రగా తీసుకుని హేళన చేయడం అజ్ఞానం. గంగ శివుని భార్య అని శాస్త్రసిద్ధ వివాహం ఎక్కడా లేదు. గంగాధరుడు అనే శివనామాన్ని కవులు అలంకారంగా విస్తరించారు. దాన్ని అపహాస్యానికి వాడటం సాహిత్యానికీ, సంస్కృతికీ అవమానం. కవిత్వంలో భావరూపకాలు ఉంటాయి. అవన్నీ యథార్థ నిర్ణయాలు కావు. రూపకాన్ని యథార్థంగా తీసుకుని దేవతలను దూషించే వారు విమర్శకులు కాదు, వికృత దృష్టి కలవారు అని నా అభిప్రాయం.


సనాతన ధర్మంలో గంగా పవిత్రతకు ప్రతీక. శివుడు నియంత్రణకు ప్రతీక. పార్వతి శక్తికి ప్రతీక. ఇవి తత్వాలు, వీధి చర్చల విషయాలు కావు.


_*పురాణాన్ని చదవని వారు ప్రశ్నిస్తారు.*_

_*సాహిత్యాన్ని అర్థం చేసుకోని వారు వెక్కిరిస్తారు.*_

_*సంస్కృతి తెలిసినవారు మాత్రం నమస్కరిస్తారు.*_


 

 మనకు ఈ జగత్తులో రెండు గోచరిస్తున్నాయి ఒకటి శక్తి 2 పదార్థ ం ఏ పదార్థంలో చైతన్యం కావాలన్నా ఆ పదార్థంలో నిగుడికృతమైన శక్తి చైతన్య పరచటము వలన పదార్థం చైతన్యవంతంగా మనకు కనబడుతున్నది 


మన మహర్షిలు బహుశా శక్తిని ఆదిపరాశక్తిగా పదార్థాన్ని పరమేశ్వరుడు గా పేర్కొని ఉండవచ్చు కాదా 


 మనము ఎప్పుడు భగవంతుడు మనలాగే అవయవాలు కలిగి ఉన్న మానవుడి లాగా తలవకూడదు భగవంతుడు శక్తి స్వరూపుడు శక్తి మనకు కనబడదు అటువంటి పరిస్థితుల్లో భగవంతుని చూడలేము అన్నది సత్యం


 కానీ సామాన్య మానవులు దైవ తత్వాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండరు కాబట్టి దేవుడికి రూపాన్ని కల్పించి మన మనస్సుని ఆ రూపాన్ని ఆరాధించే దిశలో పంపించి ముందుగా మనస్సును స్థిరపరచుకొని తర్వాత జ్ఞానంతో భగవంతుని చేరుకోవాలని మనకు మన మహర్షులు వారు ఆచరించి ఆ దైవ తత్వాన్ని అనుభవించి మనకు   బోధించారు

 నాస్తికుడు కనబడే దానిని కూడా నమ్మడు

 భక్తుడు భగవంతుడు వేరు తాను వేరు అని తలుస్తాడు

 కేవలం జ్ఞాని మాత్రమే భగవంతుడు మాత్రమే ఉన్నాడు తాను కూడా భగవంతుడే అని నమ్ముతాడు