19, అక్టోబర్ 2021, మంగళవారం

శ్రీమద్భాగవతము

 *19.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2296(౨౨౯౬)*


*10.1-1432-*


*క. కాలుని వీటికిఁ జని మృత*

*బాలకుఁ దే నొరుల వశమె? భవదీయ కృపన్*

*మేలు దొరఁకొనియె మాకు; వి*

*శాల మగుంగాత మీ యశము లోకములన్.* 🌺



*_భావము: “యమధర్మరాజు వద్దకు వెళ్లి మరణించిన బాలుని తిరిగి తేవటం ఇతరులకు శక్యమేనా? ఇది మీకే చెల్లింది. మీకు మాపై గల దయ, శ్రద్ధ, భక్తులతో మాకు శుభములు కలిగాయి. మీ యశశ్చంద్రికలు త్రిభువనములలో విరాజిల్లుగాక !"_* 🙏



*_Meaning: Sandeepani Guru further blessed them: ”It would be impossible for any one else to bring back a dead boy and that too from Yamaloka. You are unique and omnipotent. We are immensely benefited by Your devotion and diligence towards me and Your basic tenet of kindness._* 

*_”I bless You -Your fame and glory shine in the entire universe (all three lokas).”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

సంస్కృత మహాభాగవతం

 *19.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదిహేడవ అధ్యాయము*


*వర్ణాశ్రమ ధర్మ నిరూపణము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీభగవానువాచ*


*17.9 (తొమ్మిదవ శ్లోకము)*


*ధర్మ్య ఏష తవ ప్రశ్నో నైఃశ్రేయసకరో నృణామ్|*


*వర్ణాశ్రమాచారవతాం తముద్ధవ నిబోధ మే॥12863॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! లోకహితమునకై నీవు అడిగిన ఈ ప్రశ్న మిగుల ధర్మబద్ధమైనది. వర్ణాశ్రమ ధర్మములను, ఆచారములను పాటించునట్టి వారికి శ్రేయస్కరమైన విహిత ధర్మములను గురుంచి తెలిపెదను వినుము-


*17.10 (పదియవ శ్లోకము)*


*ఆదౌ కృతయుగే వర్ణో నృణాం హంస ఇతి స్మృతః|*


*కృతకృత్యాః ప్రజా జాత్యా తస్మాత్కృతయుగం విదుః॥12864॥*


ఈ కల్పప్రారంభమున కృతయుగమునందు మానవులలో *హంస* అను వర్ణము మాత్రమే యుండెను (హంస అనగా బ్రాహ్మణ వర్ణము). అప్పటి ప్రజలు జన్మచే కృతకృత్యులై యుండిరి. అందువలన దానిని *కృతయుగము* గా భావించిరి.


*17.11 (పదకొండవ శ్లోకము)*


*వేదః ప్రణవ ఏవాగ్రే ధర్మోఽహం వృషరూపధృక్|*


*ఉపాసతే తపోనిష్ఠా హంసం మాం ముక్తకిల్బిషాః॥12865॥*


అప్పుడు ప్రణవమే (ఓంకారమే) వేదముగా నుండెను. విభాగములు లేకుండెను. తపస్సు, శౌచము, దయ, సత్యము అను చరణములతోగూడిన ధర్మముగా నేను వృషభరూపధారినై ఉంటిని. ఆ కాలమున పాపరహితులు, తపస్సంపన్నులు ఐన భక్తులు నన్ను హంసరూపమున ఉపాసించుచుండిరి.


*17.12 (పండ్రెండవ శ్లోకము)*


*త్రేతాముఖే మహాభాగ ప్రాణాన్ మే హృదయాత్త్రయీ|*


*విద్యా ప్రాదురభూత్తస్యా అహమాసం త్రివృన్మఖః॥12866॥*


మహాత్మా! ఉద్ధవా! కృతయుగానంతరము, త్రేతాయుగ ప్రారంభమున నా హృదయమునుండి ప్రాణములద్వారా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను మూడును ప్రకటితములైనవి. ఆ మూడు వేదములనుండి *హోత, అధ్వర్యువు, ఉద్గాత* అను మూడు కర్మరూప భేదములచే నేను యజ్ఞపురుషునిగా వెలువడితిని.


*17.13 (పదమూడవ శ్లోకము)*


*విప్రక్షత్రియవిట్ శూద్రా ముఖబాహూరుపాదజాః|*


*వైరాజాత్పురుషాజ్జాతా య ఆత్మాచరలక్షణాః॥12867॥*


యజ్ఞపురుషుడనైన (విరాట్ పురుషుడనైన) నా యొక్క ముఖమునుండి బ్రాహ్మణులు, బాహువులనుండి క్షత్రియులు, ఊరువులనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు ఉద్భవించిరి. వారి వారి స్వభావములను అనుసరించి, ఆయా ఆచారములు, లక్షణములు కుదురుకొనినవి.


*17.14 (పదునాలుగవ శ్లోకము)*


*గృహాశ్రమో జఘనతో బ్రహ్మచర్యం హృదో మమ|*


*వక్షఃస్థలాద్వనే వాసః న్యాసఃశీర్షణి సంస్థితః॥12868॥*


విరాట్ పురుషుడనైన ( చతుర్ముఖ స్వరూపుడనైన) నాయొక్క కటిప్రదేశమునుండి గృహస్థాశ్రమము, హృదయమునుండి బ్రహ్మచర్యాశ్రమము, వక్షస్థలమునుండి వానప్రస్థాశ్రమము, శిరస్సునుండి సన్న్యాసాశ్రమము ప్రకటమైనవి.


*17.15 (పదిహేనవ శ్లోకము)*


*వర్ణానామాశ్రమాణాం చ జన్మభూమ్యనుసారిణీః|*


*ఆసన్ ప్రకృతయో నౄణాం నీచైర్నీచోత్తమోత్తమాః॥12869॥*


చతుర్విధ వర్ణాశ్రమములకు చెందిన పురుషులయొక్క స్వభావములు వారి వారి జన్మస్థానములైన విరాట్ పురుషుని అంగములను అనుసరించి ఉత్తమ, మధ్యమ, అధమములుగా పేర్కొనబడినవి. అనగా ఉత్తమ స్థానముల నుండి ఉత్పన్నమైన వారియొక్క వర్ణాశ్రమముల స్వభావములు ఉత్తమములుగా, అధమ స్థానములనుండి ఉత్పన్నములైన వారియొక్క వర్ణాశ్రమములు అధమములుగా భావింపబడినవి.


*17.16 (పదహారవ శ్లోకము)*


*శమో దమస్తపః శౌచం సంతోషః క్షాంతిరార్జవమ్|*


*మద్భక్తిశ్చ దయా సత్యం బ్రహ్మప్రకృతయస్త్విమాః॥12871॥*


శమము (అంతఃకరణ నిగ్రహము), దమము (బాహ్యేంద్రియ నిగ్రహము) , తపస్సు (ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట), శౌచము (బాహ్యాభ్యంతరముల శుచిత్వము), సంతోషము (దైవికముగా ప్రాప్తించినదానితో తృప్తిచెందుట), క్షాంతి (ఇతరుల అపరాధములను క్షమించుట, ఇతరులు బాధించినను కలత చెందకుండుట). ఆర్జవము (ఋజుమార్గజీవనము), దైవభక్తి, దయ, సత్యము - ఇవి యన్నియును బ్రాహ్మణవర్ణము వారి స్వాభావిక లక్షణములు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

రాత్రిళ్ళు త్వరగా భోజనం..*

 *రాత్రిళ్ళు త్వరగా భోజనం..*

              


*రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?*


*మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో ఆ ఆహారాన్ని ‘త‌గిన స‌మ‌యానికి’ తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. వేళ త‌ప్పి భోజ‌నం చేస్తే అది మ‌న ఆరోగ్యంపై ప్ర‌భావం చూపిస్తుంది. అందువ‌ల్ల ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌రైన స‌మ‌యాల‌కు భోజ‌నం చేయాలి. ఇక రాత్రి పూట కొంద‌రు ఆల‌స్యంగా భోజ‌నం చేస్తుంటారు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక రాత్రి పూట ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా భోజనం చేసేయాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.*


*1.) రాత్రి 7.30 గంట‌ల లోపు భోజ‌నం ముగించ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. మనం తిన్న ఆహారం నుంచి వ‌చ్చే శ‌క్తిని ఖ‌ర్చు పెట్టేందుకు శ‌రీరానికి త‌గిన స‌మ‌యం ల‌భిస్తుంది. దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చ‌యి కొవ్వు క‌రుగుతుంది.*


*2.) రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో స్థూల‌కాయం బారిన ప‌డ‌కుండా ఉంటారు.*


*3.) రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేసే వారికి క్యాన్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు. త్వ‌ర‌గా భోజ‌నం ముగించే పురుషుల‌కు 26 శాతం, మ‌హిళ‌ల‌కు 16 శాతం వ‌ర‌కు క్యాన్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.*


*4.) రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేసి త్వ‌ర‌గా నిద్రించ‌డం వ‌ల్ల ఉద‌యాన్నే శ‌క్తివంతంగా ఫీల‌వుతారు. కొంద‌రికి ఉద‌యం నిద్ర‌లేవ‌గానే బ‌ద్ద‌కంగా ఉంటుంది. ఏ ప‌నీ చేయ‌బుద్దికాదు. అలాంటి వారు ముందు రోజు త్వ‌ర‌గా భోజ‌నం చేసి త్వ‌ర‌గా నిద్రిస్తే మ‌రుస‌టి రోజు త్వ‌ర‌గా నిద్ర లేస్తారు. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేయ‌గ‌లుగుతారు.*


*5.) రాత్రిపూట త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం ల‌భిస్తుంది. అలాగే మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసే వ‌ర‌కు చాలా స‌మ‌యం ఉంటుంది క‌నుక జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు మ‌ర‌మ్మత్తులు చేసుకునేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం ల‌భిస్తుంది. దీంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.*


*6.) రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. భోజనానికి, నిద్ర‌కు 3 గంట‌ల వ్య‌వ‌ధి ఉంటే నిద్ర చ‌క్క‌గా వ‌స్తుంది. లేదంటే నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుంది. కనుక రాత్రి చ‌క్క‌గా నిద్ర ప‌ట్టాలంటే త్వ‌ర‌గా భోజ‌నం చేసేయాలి.*


*7.) రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేసే వారికి గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. క‌నుక రాత్రి భోజ‌నాన్ని త్వ‌ర‌గా ముగించాలి.*



   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

అమ్మ

 *బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.*


*“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.*


*“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.*


*దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.*


*“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా.*


*“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.*


*మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.*


*అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.*


*బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.*


*“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.*


*“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.*


*“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.*


*ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.*


*ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.*


*ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.*


 *మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.*


*కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.*


*నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.*


*నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.*


*“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.*


*నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.*


*ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.*


*“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.*


*“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.*


*“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.*


*“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.*


*ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.*


*🙏“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”🙏*

*ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు అంకితం*

అరుణాచలం కి ట్రైన్

 సికింద్రాబాద్ నుంచి ప్రతి మంగళవారం రాత్రి 9:30pm కి నేరుగా అరుణాచలం కి ట్రైన్ వేశారు..train nmbr 07685


ప్రతి శుక్రవారం అరుణాచలం లో ఉదయం 11:20 am కి వస్తుంది train... మర్నాడు ఉదయం 7am కి సికింద్రాబాద్ చేరుకుంటుంది

.train నంబర్ -07686.


*From tomorrow (19/10/21 ) its strting...*

మొగలిచెర్ల

 *స్వామి ఇచ్చిన మాట..*


"సీతారాంపురం నుంచి కోటయ్యను మాట్లాడుతున్నాను..ఈమధ్య నువ్వు నువ్వు హైదరాబాద్ వెళ్ళావని చెప్పారు..హైదరాబాద్ నుంచి వచ్చేసావా..?రేపు పొద్దున గుడికొస్తావా? మేము పొద్దున్నే వస్తామయ్యా" అంటూ గుక్క తిప్పుకోకుండా గబ గబ సెల్ లో ఆ పెద్దాయన చెప్పుకుపోతున్నాడు..


ఆయన ఫలానా అని గుర్తుకుతెచ్చుకోవడానికి కొద్దీ సమయం పట్టింది నాకు..

ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలం పూరేటి పల్లి గ్రామ వాస్తవ్యులు చుంచు కోటయ్య గారు..


"హైదరాబాద్ నుంచి తిరిగొచ్చి మూడు రోజులు దాటింది..ఇప్పుడు కూడా స్వామివారి మందిరం వద్దే వున్నాను..రేపు కూడా ఉంటాను.." అన్నాను.


కోటయ్య గారి అబ్బాయి గోపి బెంగళూరు లో సాఫ్టువేర్ ఇంజినీర్..భార్య సాహితి.. మూడేళ్ల వయసున్న కుమారుడు..పేరు కౌశిక్..వాళ్ళ కుటుంబం అంతా దత్తాత్రేయుడి భక్తులే..ఏ చిన్న కష్టం వచ్చినా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధి వద్దే చెప్పుకుంటారు..


అన్నమాట ప్రకారం కోటయ్య దంపతులు ఆ ప్రక్కరోజు..పైగా ఆరోజు ఆదివారం ..తమ కొడుకూ, కోడలూ, మనుమడితో కలిసి వచ్చారు..ఆ దంపతుల ముఖం లో చాలా సంతోషం తాండవిస్తోంది..కొడుకూ కోడలూ కూడా సంతోషంగా వున్నారు..నేనేమీ అడగకుండానే..నా ప్రక్కన కుర్చీలో కూర్చుని..


"మావాడికి కొడుకు పుట్టాడని నీకు తెలుసుకదా..అంతా ఈ స్వామివారి కృపే..కాకుంటే ఆ పిల్లవాడికి మాటలు రాలేదు..నాలుగో ఏడు వస్తోంది..పిల్లవాడికి మాటలు రాలేదు..కొడుకు కోడలూ బాగా తల్లడిల్లిపోయారు..ఈ స్వామికి మ్రొక్కుకోండి..మనలను ఇంతకాలం చల్లగా చూసాడు..ఆయనే ఈ కష్టం కూడా తీరుస్తాడు అని చెప్పానయ్యా.."


"పిల్లలిద్దరూ భక్తిగా స్వామికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నారు..తమ కుమారుడికి మాటలు వస్తే..ఈ మొగిలిచెర్ల మందిరం వద్ద ఒక ఆదివారం నాడు అన్నదానం చేయిస్తామని మ్రొక్కుకున్నారయ్యా..ఆ స్వామి కరుణించాడు..మనుమడికి మాటలు వచ్చాయి..ఈరోజు స్వామివారికి పొంగలి పెట్టుకొని..మ్రొక్కు చెల్లించుకుందామని అందరమూ వచ్చాము..అదీసంగతి.." అన్నారు..


ఆదివారం నాడు భక్తులు ఎక్కువమంది వుంటారు..ఆరోజు అన్నదానం చేయాలని వాళ్ళు అనుకున్నారు.ఎంత ఖర్చు అవుతుందో మా సిబ్బందిని అడిగి, వివరాలు తెలుసుకొని..అంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు..తిరిగి వాళ్ళ ఊరుకు వెళ్లేముందు..శ్రీ స్వామివారి సమాధి వద్దకు మరొక్కసారి వెళ్లి, నమస్కారం చేసుకొని వచ్చారు..


ఈ ఆధునిక కాలంలో వైద్య శాస్త్రం ఎంతో పురోగతి చెందింది..దాదాపు ప్రతి లోపాన్నీ సరిచేసే వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి..అటువంటి పద్ధతులకు కూడా అందని వాటిని దైవం మాత్రమే సరి చేయగలడు..దైవసహాయం కోసం నీవేమి ధనాన్ని ఖర్చు పెట్టనక్ఖరలేదు..అందుకు కావలసిందల్లా భక్తి, విశ్వాసాలే..సర్వస్య శరణాగతి చెందడమే..ప్రారబ్ధాన్ని తొలగించడం సాధ్యం కాదు అని మొగిలిచెర్ల స్వామివారు తరచూ చెప్పేవారు..కాకుంటే సద్గురువుకు, దైవానికి శరణాగతి చెందితే..ప్రారబ్ధ తీవ్రతను తగ్గిస్తారు అని కూడా చెప్పేవారు..పై కుటుంబం విషయం లో అదే జరిగింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం... మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మానసిక ఒత్తిడికి లోనైతున్నారా

 మానసిక ఒత్తిడికి లోనైతున్నారా !

...........................................................


మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కేవలం శారీరక ఆరోగ్యం ద్వారా మాత్రమే మానసిక ఆరోగ్యాన్ని సాధించలేము. ఇందుకోసం మంచి జీవన ప్రమాణాన్ని కలిగి ఉండటం అవసరం. 


గత రెండేళ్లుగా ప్రజలు కరోనాతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి సమయంలో చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆందోళన, డిప్రెషన్‌కు కూడా బాధితులయ్యారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే అది ఒక రుగ్మతగా మారే అవకాశం ఉంది.


మానసికంగా ఇబ్బంది పడుతున్న వారి లక్షణాలు

1. చాలా కాలంగా నిరాశ, నిస్పృహలకు గురవ్వడం

2. తరచూ భావోద్వేగానికి (యాగ్జయిటి) లోనవ్వడం

3. నిస్సహాయంగా లేదా బలహీనంగా అనిపించడం.

4. ఏదైనా కార్యాచరణపై ఆసక్తి లేకపోవడం.

5. తినడం, తాగడంపై కూడా శ్రద్ధ లేకపోవడం



డిప్రెషన్‌కి గురైన వారి లక్షణాలు


1. ప్రజలను కలవడానికి ఆసక్తి చూపకపోవడం

2. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడం.

3. చాలామంది ఉన్నచోట ఉండకపోవడం

4. మానసిక స్థితిలో అధిక మార్పు.

5. చేసే పనిపై ఆసక్తి లేకపోవడం.

6. మామూలుగా తినే ఆహారానికంటే అతి తక్కువగా తినడం, లేదా అతి ఎక్కువగా తినడం.


శారీరక సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు కానీ మానసిక సమస్యలు అలా కాదు. చికిత్స ప్రారంభించినా చాలాకాలం పడుతుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి కూడా తన సమస్యను చెప్పడానికి వెనుకాడుతాడు. ఎందుకంటే ప్రజలు అవహేలన చేస్తారని భావిస్తారు. అందుకే అలాంటి వ్యక్తులతో మామూలుగా మాట్లాడటం, కుటుంబ సభ్యులు అండగా నిలవడం, ధైర్యం చెప్పడం, నిత్యం ఎక్కువ మంది ఉన్న చోట ఉండేలా చేయడం అవసరం.


 అప్పుడే ఆ వ్యక్తిసాధారణ స్థితికి రావడం జరుగుతుంది. మానసిక ఆరోగ్యంపై వైద్యుడితో మాట్లాడితే ,సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రతిరోజు యోగా, వ్యాయామం ధ్యానం తప్పనిసరి. జానపద పురాణాకథలు చదవడం జోకులు కార్టూన్ల పుస్తకాలను చదవడం చేయాలి.

పసిపిల్లలతో ఆడుకోవాలి.ఇష్టమైన ఆటలు ఆడటం లేదా చూడటం చేయాలి.

రామకృష్ణమఠంవారి అనాధశరణాలయాలలో వృద్ధాశ్రమాలలో సేవలు అందించాలి.

................................................................................................................

ధనత్రయోదశి

 ★ *ధనత్రయోదశి కుబేరపూజ*★                                                                                

                                                                                                                                                           ■ ఈ భూమిపై మానవుడు ఆటంకాలను జయిస్తూ, ఆనందంగా బతకాలి. అయితే మానవుడు బతకాలంటే ధన సముపార్జన తప్పని సరి. ధర్మచింతనతో నలుగురికి సాయపడాలన్నా ధనవంతుడై ఉండాలి. పూర్వం ధనం లేక పోయినా అనేక మార్గాల్లో మానవుడు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అన్నిటికీ ధనం కావాలి. అయితే డబ్బును సంపాదించడానికి మానవుడు పడేపాట్లు అంతాఇంత కాదు. డబ్బు ఆర్జించడం కోసం చేయని ఉద్యోగం లేదు, వేసిన ఉపాయం లేదు. అందుకే మానవ జీవితంలో ధనం నిత్యవసరంగా మారింది.


★ ఐశ్వర్యాభివృద్ధి కోసం కుబేర పూజను చేస్తే ఐశ్వర్యం, అభివృద్ధి ఒకేసారి దక్కుతుంది. లక్ష్మిధనకనకాధులు, అదృష్టం, సౌందర్యాలనిచ్చే దేవత. లక్ష్మి కృపాకటాక్షం లేకుండా ఏది చేసినా అది అంతకంతే. ధనానికి మరో అధిపతి కుబేరుడు. ఉత్తరం దిక్కు వైపు ప్రతినిధి అయిన కుబేరుడు భూ మండలంలోని ఆగర్భంలో ఉన్న సమస్త నిధి నిక్షేపాలకూ యజమానుడు. పురాణ చరిత్రలలో తెలిపినట్టు అతి శ్రీమంతుడు అనిపించుకున్న వెంకటేశ్వరస్వామి కూడా కుబేరుని వద్ద తీసుకొన్న అప్పుకు వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉన్నాడు.


★ అయితే లక్ష్మిదేవి పూజను దేశమంతటా వివిధ రకాలుగా ఆచరిస్తున్నారు. లక్ష్మి కుబేర పూజను ఒకేసారి కలిపి నెరవేర్చినపుడు వారిరువురి నుంచి దొరికే ఆశీర్వాదం, శ్రేయస్సు, ద్విముఖమై పేదరికం, దారిద్య్రాలు దూరం అవుతాయి.


★ కుబేరునితో పాటు లక్ష్మి కూడా ఆరాధిస్తారు. సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేయుట శుభము.

ఈ రోజు వెలిగించు యమదీప మహిమ


★ హిమ అనే యువరాజు జాతకాన్ని పరిశీలించిన జ్యోతిషులు యువరాజు వివాహం జరిగిన నాలుగో రోజు రాత్రి పాము కాటు వల్ల మరణిస్తాడని చెప్పారట.కొంత కాలానికి యువరాజుకు యుక్తవయస్సు రావడంతో అతని వివాహం జరిపించుట జరిగింది అత్తవారింట్లోకి అడుగుపెట్టిన అతని భార్య ఈ వార్తని విని భయపడితన తెలివితేటలతో తనతో పాటు తెచ్చుకున్న రాశుల కొద్దీ ఆభరణాలను తమ కోట గుమ్మం ముందు రాశులుగా పోసిం కోటలోని వారందరిని కూర్చోబెట్టి కథలు చెబుతూ తెల్లవార్లూ మెలకువగా ఉంచింది. రాజకుమారుడికి మృత్యుఘడియసమయంలో యముడు, పామురూపంలో కోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు, కానీ గుమ్మం దగ్గర ఉన్న బంగారు నగల కాంతులు బటులు మిగిలినవారు అంతా మెలకువగా కనిపించారు. *యమఘడియలు దాటటంతో ఇక చేసేదేమీ లేక వెనుదిరిగాడు యముడు. *అందుకే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఇంటి ముందర ఉంచాలి.* ★ *Astro Village [INDIA]*★ ◆ *జ్యోతిష్యాలయం*◆ ■వాట్సాప్: *8008872109*

దీపాల్లో ఏ నూనె శుభ‌క‌రం

 ◆ *దీపావ‌ళి*◆

★ *దీపాల్లో ఏ నూనె శుభ‌క‌రం?*★


★ *జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. అయితే దీపాన్ని నేరుగా అగ్గి పుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.*


★ *దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు*. 


★ *ఏ నూనెతో దీపారాధన చేయాల‌న్న అనుమానం అంద‌రిలోనూ క‌లుగుతుంది. ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి*.  


★ *వేప నూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. ● అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. ●విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది. నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. ●నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. *అయితే వేరుశెనగ నూనెను దీపారాధనకు వాడరాదు*. ★ *Astro Village [INDIA]*★ ◆ *"జ్యోతిష్యాలయం*◆ ■వాట్సాప్: *8008872109*