19, అక్టోబర్ 2021, మంగళవారం

మానసిక ఒత్తిడికి లోనైతున్నారా

 మానసిక ఒత్తిడికి లోనైతున్నారా !

...........................................................


మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కేవలం శారీరక ఆరోగ్యం ద్వారా మాత్రమే మానసిక ఆరోగ్యాన్ని సాధించలేము. ఇందుకోసం మంచి జీవన ప్రమాణాన్ని కలిగి ఉండటం అవసరం. 


గత రెండేళ్లుగా ప్రజలు కరోనాతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి సమయంలో చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆందోళన, డిప్రెషన్‌కు కూడా బాధితులయ్యారు. ఈ సమస్య ఇలాగే కొనసాగితే అది ఒక రుగ్మతగా మారే అవకాశం ఉంది.


మానసికంగా ఇబ్బంది పడుతున్న వారి లక్షణాలు

1. చాలా కాలంగా నిరాశ, నిస్పృహలకు గురవ్వడం

2. తరచూ భావోద్వేగానికి (యాగ్జయిటి) లోనవ్వడం

3. నిస్సహాయంగా లేదా బలహీనంగా అనిపించడం.

4. ఏదైనా కార్యాచరణపై ఆసక్తి లేకపోవడం.

5. తినడం, తాగడంపై కూడా శ్రద్ధ లేకపోవడం



డిప్రెషన్‌కి గురైన వారి లక్షణాలు


1. ప్రజలను కలవడానికి ఆసక్తి చూపకపోవడం

2. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడం.

3. చాలామంది ఉన్నచోట ఉండకపోవడం

4. మానసిక స్థితిలో అధిక మార్పు.

5. చేసే పనిపై ఆసక్తి లేకపోవడం.

6. మామూలుగా తినే ఆహారానికంటే అతి తక్కువగా తినడం, లేదా అతి ఎక్కువగా తినడం.


శారీరక సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు కానీ మానసిక సమస్యలు అలా కాదు. చికిత్స ప్రారంభించినా చాలాకాలం పడుతుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి కూడా తన సమస్యను చెప్పడానికి వెనుకాడుతాడు. ఎందుకంటే ప్రజలు అవహేలన చేస్తారని భావిస్తారు. అందుకే అలాంటి వ్యక్తులతో మామూలుగా మాట్లాడటం, కుటుంబ సభ్యులు అండగా నిలవడం, ధైర్యం చెప్పడం, నిత్యం ఎక్కువ మంది ఉన్న చోట ఉండేలా చేయడం అవసరం.


 అప్పుడే ఆ వ్యక్తిసాధారణ స్థితికి రావడం జరుగుతుంది. మానసిక ఆరోగ్యంపై వైద్యుడితో మాట్లాడితే ,సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రతిరోజు యోగా, వ్యాయామం ధ్యానం తప్పనిసరి. జానపద పురాణాకథలు చదవడం జోకులు కార్టూన్ల పుస్తకాలను చదవడం చేయాలి.

పసిపిల్లలతో ఆడుకోవాలి.ఇష్టమైన ఆటలు ఆడటం లేదా చూడటం చేయాలి.

రామకృష్ణమఠంవారి అనాధశరణాలయాలలో వృద్ధాశ్రమాలలో సేవలు అందించాలి.

................................................................................................................

కామెంట్‌లు లేవు: