15, సెప్టెంబర్ 2021, బుధవారం

రెండో గుండె

 • పిక్క మన రెండో గుండె..!

(నిలువీత చెయ్యనివారికోసం)


ఇప్పటివరకూ మనలో చాలామందికి తెలియని సంగతి ఒకటి తెలుసుకుందాం రండి. 

మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే... మన పిక్కలు. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో... పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది. పైగా గుండె నుంచి పంప్ చేసే రక్తం భూమ్యాకర్షణ శక్తి వల్ల మన కాళ్లకు చేరడం ఒకింత సులభం. కానీ... కాళ్ల నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే పైవైపునకు అంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ప్రవహించాలి. అందుకు మరింత శక్తి కావాలి. ఆ శక్తిని సమకూర్చేదే పిక్క. అందుకే ‘పిక్క’ను మన శరీరపు రెండో గుండెకాయగా అభివర్ణిస్తారు. ఇక భాషాశాస్త్రానికి వద్దాం. గుండెబలం అంటే ఇప్పటివరకూ అర్థం మనోబలం. కానీ పిక్కబలం అంటే అధైర్యం చూపించి పరుగెత్తడం అని అర్థం. కానీ పిక్క గురించీ, గుండెలా అది నెరవేర్చే విధుల గురించీ వాస్తవం తెలిశాక పిక్కబలమూ ఇంచుమించూ గుండెబలంతో సమానమని మీకు వేరే చెప్పాలా?

 

• పిక్కకు ఎందుకీ గుండె డ్యూటీలు...?


మన పిక్కను చూడండి. కాస్త గమనించి చూస్తే అటు ఇటుగా చూడ్డానికి గుండెలా అనిపించదూ? అనిపించడం ఏమిటి, అది నిజంగానే గుండె నిర్వహించే విధులు నిర్వహిస్తుంది. కారణం... గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానికో పంపింగ్ ప్రక్రియ ఉంది, పైగా అది శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది. కాబట్టి అన్నివైపులకూ రక్తాన్ని పంప్ చేయడం సులభం. అయితే కాళ్లూ, పాదాలకు చేరిన రక్తం మళ్లీ గుండెకు చేరాలంటే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా పైకి రావాలి. అలా రావడంతో పాటు ఆ రక్తం అదనపు బరువును అంటే ఆక్సిజన్‌నూ, పోషకాలనూ తనతో మోసుకుపోవాలి. అలా చేసేందుకు పిక్క ఉపయోగపడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ (సీఎమ్‌పీ) అంటారు. అంతేకాదు... శరీరానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు.


• పిక్క గుండె డ్యూటీలెలా చేస్తుందంటే...!


 పిక్కలోని అన్ని కండరాలూ కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తుంటాయి. అయితే మరీ ముఖ్యంగా ఈ కండరాల్లోని రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ కండరాలు ఈ విధిని నిర్వహించడంలో కీలకంగా తోడ్పడతాయి. ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం, తెరచుకోవడం (రిలాక్స్‌కావడం) అనే పనిని క్రమబద్ధంగా చేస్తూ రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా రక్తం కిందికి రాకుండా వాల్వ్ (కవాటాల) సహయంతో మూసుకుపోతూ పైవైపునకే రక్తం ప్రవహించేలా చేస్తుంటాయి.

 

ఈ రెండో గుండె సరిగా పనిచేయకపోతే...


మన శరీరపు రెండో గుండె అయిన పిక్క సరిగా పనిచేయకపోతే అప్పటికే వినియోగితమైన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. ఈ రక్తంలో ఆక్సిజన్ అప్పటికే కండరాల వల్ల వినియోగం అయిపోయి ఉండటం వల్ల మళ్లీ కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు. దాంతో కండరాలు తీవ్రమైన అలసటకు గురవుతాయి.

 

ఈ సమస్య ఎవరెవరిలో ఎక్కువ?

 

చాలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారికి (ఆఫీసుల్లో పనిచేసేవారికి లేదా కదలకుండా ఇంటిపట్టునే ఉండేవారికి)ఎక్కువసేపు అదేపనిగా నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు మొదలైనవారికి) స్థూలకాయంతో బాధపడేవారికి గర్భవతులుగా ఉన్న సమయంలో కొందరు మహిళలకు ఈ సమస్య రావచ్చు.

 

• సమస్యను అధిగమించడానికి చేయాల్సిందేమిటి?


క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల చొప్పున వాకింగ్ చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా నడవడం వల్ల పిక్కతో పాటు శరీరంలోని అన్ని కండరాలకూ వ్యాయామం ఏర్పడి పూర్తి ఆరోగ్యం బాగుంటుంది).మీ శరీరపు బరువును అదుపులో ఉంచుకోండి. (స్థూలకాయాన్ని తగ్గించుకోండి).మీ కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమి వేసేలా వీనస్ స్టాకింగ్స్ అనే తరహా సాక్స్ వంటి తొడుగులను ధరించండి. ఇలా కనిపించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ సలహా తీసుకోండి.

 

• పిక్క గుండెలా పనిచేయనందున ఎదురయ్యే సమస్యలివే...!


కాళ్ల చివరలకు రక్తసరఫరా చాలా తక్కువగా జరగడంమనకు వ్యాధి నిరోధకత ఏర్పరిచే లింఫ్ ప్రవాహం నిర్వీర్యం కావడంచెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడం వంటివి జరుగుతాయి. దీనివల్ల ఏర్పడే పరిణామాలివే...కాళ్లు ఎప్పుడూ అలసటతో ఉండటం కాళ్లూ, పాదాలలో వాపువేరికోస్ వెయిన్స్ (అంటే కాళ్లపై ఉండే చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం నుంచి బయటకు కనిపించడం)కాలిపై ఏర్పడే పుండ్లు చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉండటంకాళ్లు రెండూ అదేపనిగా చకచకా కదిలిస్తూ ఉండే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్‌తో బాధపడటంకాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం you (డీప్ వీన్ థ్రాంబోసిస్)

 

- డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి

చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,

ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదర్నగర్ , హైదరాబాద్

ఇంజనీర్స్ డే* భారతదేశపు ప్రముఖ ఇంజనీరు,

 *మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి — ఇంజనీర్స్ డే*

భారతదేశపు ప్రముఖ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు, బహుముఖ మేధావి, మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివాను.

సామాన్యుడు నుండి అసామాన్యుడుగా  ఆయన సాధించిన సోపానాలు ఓ సారి మనం చదివి తరిద్దాం!!


భారతదేశంలో బ్రిటీషు రాజ్యం కాలంలో ఓ భారతీయ యువకుడు ట్రైన్ లో ప్రయాణిస్తున్నాడు. అతనిచుట్టూ తెల్లవాళ్ళు వారు ఆయనను అవహేళన చేస్తున్నా ఆతను ఏమి పట్టించుకోకుండా కూర్చొని తదేకంగా ఆలోచిస్తు టక్కున లేచి.... చైన్ లాగాడు... ట్రెైన్ ఆగిపోయింది... వాళ్ళంతా ఆతనిని పిచ్చివాడిలా చూసారు.ఇంతలో గార్డు వచ్చి చైన్ లాగింది ఎవరని ప్రశ్నించాడు. నేనే అని ఆయువకుడు చెప్పాడు. కారణం సరయిందికాకపోతే జైల్ కు వెళ్తావు కారణం చెప్పు అన్నాడు గార్డ్ .ట్రైన్ వేగం. శబ్దం, వైబ్రేషన్ లో వచ్చిన మార్పును బట్టి కొంచెం ముందులో ట్రేక్ విరిగి ఉందని తెలుస్తుంది పదండి  చూద్దాం అని గార్డుతో కలసి ముందుకు వెళ్లాడా యువకుడు.. కొంచెందూరంలో నిజంగానే ట్రేక్ విరిగి దెబ్బతిని ఉండడం చూసి గార్డ్ తదితరులు అవాక్కయ్యారు.. 


ట్రైన్ వేగం. శబ్దం, వైబ్రేషన్ లో తేడా గమనించగలిగిన ఆసునిసిత మేధావే మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.


అది బెంగళూరుకు 38 మైళ్ళ దూరంలో ఉన్న ముద్దనహళ్ళి గ్రామం. 1861 సెప్టెంబరు 15న శ్రీనివాసశాస్త్రి, వెంకటమ్మ అనే అతి సామాన్య మధ్యతరగతి  దంపతులకు ఓ బిడ్డ జన్మించాడు.ఆతనికి తల్లిదండ్రులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే నామకరణం చేసారు. తండ్రి గొప్ప సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు. 


 విద్యా భ్యాసం చిక్కబళ్ళాపూరు లో. విద్యాభ్యాసంలో విశ్వేశ్వరయ్యను ప్రోత్సహించిన వారిలో మొదటిగా నాదముని నాయుడు, మేనమామ హెచ్‌.రామయ్యలను చెప్పుకోవచ్చు. 


15వ ఏటనే ఈయన తండ్రి చనిపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. పిల్లలకు ప్రైవేట్లు చెబుతూ, మేనమామ ఇంట్లో భోంచేసేవారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తన 20వ ఏట, బెంగళూరు సెంట్రల్‌ కాలేజీ నుంచి బీఏ పరీక్షను డిస్టింక్షన్‌లో పాసయ్యారు. 


ఇంతటి విశిష్ట ప్రతిభ కనబర్చిన విశ్వేశ్వరయ్యకు సెంట్రల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ వెబ్‌స్టరు ఎంతో ప్రోత్సాహమిచ్చారు. ఆయన క్రమశిక్షణకు, ముఖ్యంగా ఆంగ్ల భాష, లెక్కల్లో చూపిస్తున్న అసామాన్య పాండిత్యానికి ముగ్ధుడై అనేక బహుమతులు ఇచ్చారు. అంతేకాక ఉన్నత విద్యాభ్యాసానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రిన్సిపల్‌, అప్పటి మైసూరు రాజ్య దివాను రంగాచార్యుల సహాయంతో ప్రభుత్వ ఉపకారవేతనం అందేది. దీంతో పూనేలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో తన విద్యాభ్యాసం కొనసాగిం చారు. ఇంజనీరింగ్‌ విద్యలో ఎంతో ప్రతిభ కనబరుస్తూ 1883లో ఉత్తీర్ణులైన వారందరిలోకి ప్రథమంగా నిలిచారు. 


1884లో ముంబయి పి.డబ్ల్యూడీ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీరుగా నేరుగా నియమితులయ్యారు. 1884 నుంచి 1909 మధ్య కాలంలో, ఇరిగేషన్‌ ఇంజనీరుగా, శానిటరీ ఇంజనీరుగా అనేక కార్యక్రమాలు చేపట్టి, నిర్ణీత కాలం కంటే ముందుగా పనులు పూర్తి చేసారు.


బొంబాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా   ఎన్నో నగరాలకు రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి రవాణా, వరద నివారణ పథకాలను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశారు. పూనే నగరానికి మంచినీటి సరఫరాకు నిర్మించిన ''వై ఫీ'' సరస్సు ఆటోమేటిక్‌ ఫ్లడ్‌ గేట్లను స్వయంగా రూపొందించి, నిర్మించారు. పైగా అతి తక్కువ ఖర్చుతో ఈ సరస్సులో నీటి నిల్వ శక్తిని పెంచారు. ఈ పనితీరుకు మన దేశంలోనే కాక ఐరోపా దేశంలోని నిపుణులు సైతంఆశ్చర్యపోయారు.


1909లో స్వచ్ఛందంగా సూపరింటెండింగ్‌ ఇంజనీరు పదవికి రాజీనామా ఇచ్చి విదేశీ పర్యటనలు చేశారు. 


దాదాపు 70 ఏళ్లకు పైగా శ్రమించి, దేశంలోని దాదాపు అన్ని ముఖ్య నగరాలకు రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్మూలన, వరద నివారణ పథకాలను పూర్తి చేశారు. 1918 నాటికి, దేశంలోకెల్లా అతి పెద్దదైన కృష్ణరాజ సాగర జలాశయాన్ని కావేరీ నదిపై నిర్మించారు. 


ఈ ఆనకట్ట మైసూరు సంస్థానంలో లక్షలాది ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్గించింది. అనేక గ్రామాలకు విద్యుత్‌ కొరత తీర్చి, మైసూరు ఆర్థిక స్వరూపాన్నే మార్చివేసింది. ఇరిగేషన్‌ ఇంజనీరుగా విశ్వేశ్వరయ్య సాధించిన ఘనవిజయమిది. సలహాదారు ఇంజనీరుగా (కన్సల్టెంట్‌) దేశంలోనే అతిపెద్ద సంస్థానాలైన బరోడా, గ్వాలియరు, ఇండోరు, భోపాల్‌, కోల్హాపూరు  ల్లోనూ, అతిపెద్ద నగరాలైన బొంబాయి, కరాచీ, నాగపూర్‌లలో పనిచేసి ఎన్నో పథకాలకు కారకులయ్యారు. 


మూసీ నదివల్ల వరదల పాలైన హైదరాబాద్‌ నగరానికి అవసరమైన మురుగునీటి పారుదల, వరద నివారణ పథకాలు పూర్తిచేశారు. 


మైసూరు మహారాజా ఆహ్వానం మేరకు సంస్థాన సమగ్రాభివృద్ధికై 1909లో చీఫ్‌ ఇంజనీరుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తన జీవితాశయాలైన పరిశ్రమల స్థాపన, విద్యాభివృద్ధి, ముఖ్యంగా సాంకేతిక విద్యావ్యాప్తి వంటి అనేక కార్యక్రమాలకు రాజావారు సహకరించి ఆమోదముద్ర వేయాల్సిఉంటుందనే షరతులపై అంగీకరించారు. వారి నేతృత్వంలో మైసూరు కేవలం ఆరేళ్లలోనే అన్ని రంగాలలో ముఖ్యంగా పరిశ్రమల స్థాపన, సాంకేతిక విద్యావ్యాప్తి, నూతన రైలు మార్గాల నిర్మాణాలలో సత్వర ఆర్థికాభివృద్ధి సాధించింది. దీంతో ఆయనకు మైసూరు ప్రధాని(దివాను) పదవి వరించింది. 


భద్రావతి ఉక్కు కర్మాగారం నష్టాల ఊబిలో వున్నప్పుడు దాని చైర్మన్‌గా అదనపు బాధ్యతలు స్వీరించి, ఆ సంస్థను పునర్‌ వ్యవస్థీకరించారు. అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థను లాభాల్లో నడిపించారు. ఇది ఆర్థిక వేత్తగా విశ్వేశ్వరయ్య సాధించిన అపూర్వ విజయం. అందుకు మహారాజా వారు లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. దానికి తన స్వార్జిత సొమ్ము కొంత చేర్చి సుమారు లక్షన్నర రూపాయల వ్యయంతో మహారాజు పేరుమీద బెంగళూరులో ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాపించారు. వీటితో పాటు పాలిటెక్నిక్‌ కళాశాల మైసూరు విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్‌ కళాశాల వంటి విశ్వ విద్యాలయాలు, మైసూరు శ్యాండిల్‌ సబ్బు ఫ్యాక్టరీలు వంటి ఎన్నో పరిశ్రమలు, స్థాపించడమే కాక పరిపాలనా సంబంధ సంస్కరణలను ప్రవేశపెట్టారు.


మోక్షగుండం విశ్వేశ్వరయ్య మేధాశక్తికి గాను1911లో సిఐఇ, 1915లో కెపిఐఇ మొదలగు అత్యున్నతమైన బిరుదులు లభించాయి. 1955లో 'భారతరత్న' బిరుదు వరించింది. 1938 నుంచి 1958 మధ్యకాలంలో దాదాపు 8 విశ్వ విద్యా లయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలు ఇచ్చాయి. అంతేగాక 1941లో 'ఆల్‌ఇండియా మాన్యుఫాక్చరర్స్‌ ఆర్గనైజేషన్‌' సంస్థకు అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1959లో రైల్వేబోర్డు చైర్మన్‌గా బీహారు రాష్ట్రంలో గంగానదిపై రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి స్థలం నిర్ణయించి వంతెన నిర్మించారు.


అమెరికా, జపాన్‌ ఇతర ఐరోపా దేశాలను అనేకసార్లు సందర్శించి మన దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపరిచేందుకు, సాంకేతిక అభివృద్ధి సాధించేందుకు ఎన్నో సూచనలు చేశారు. 


వీరి రచనలలో 'మెమొరీస్‌ ఆఫ్‌ మై వర్కింగ్‌ లైఫ్‌, రీ కన్‌స్ట్రక్టింగ్‌ ఇండియా, ప్లాన్డ్‌ ఎకానమీ ఫర్‌ ఇండియా' అనేవి ముఖ్యమైనవి.


 ఆంధ్ర, మైసూరు, బెనారస్‌ విశ్వ విద్యాలయాలతో పాటు అనేక విశ్వవిద్యాల యాలలో స్నాతకోపన్యాసాలు ఇచ్చారు.


 నవభారత నిర్మాణంలో ఖాదీ, కుటీర పరిశ్రమల స్థాపన ద్వారా సత్వరాభివృద్ధి సాధ్యం కాదని, కేవలం భారీ పరిశ్రమల స్థాపన ద్వారానే లక్ష్యసాధన సులభమని నేరుగా గాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి వాదించిన ధీశాలి విశ్వేశ్వరయ్య. 


1955 లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన  భారతరత్న లభించింది. ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు.


*భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15 ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు*


తనకు భారత ప్రభుత్వం 'భారతరత్న' బిరుదు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుసుకుని అప్పటి ప్రధాని నెహ్రూకు 'మీరు నాకు 'భారతరత్న' బిరుదు ప్రసాదిస్తే నేను మీ ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తానని భావిస్తే చాలా పొరబడినవారవు తారు' అని నిర్భీతిగా తెలిపిన ధీశాలి ఈయన.


తుదిశ్వాస విడిచే వరకు నిస్వార్థ చింతనతో దేశానికి సేవ చేసిన ధన్యజీవి మోక్షగుండం విశ్వేశ్వరయ్య.


విశ్వేశ్వరయ్య వ్యక్తిగత జీవితం అతి క్రమశిక్షణతో వుండేది. రెండు సార్లు భార్యావియోగం కల్గింది. మూడోసారి పెళ్ళాడిన భార్య వ్యవహారం నచ్చక ఆమెకు విడాకులిచ్చారు. కాల నియమాన్ని, ఆహార విహార నియమాలను కచ్ఛితంగా పాటించిన విశ్వేశ్వరయ్య 100 సం. వయస్సులో కళ్ళద్దాలు లేకుండా చదివేవారు. "గంధపు చెక్క వలె సేవలొ అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు." అనునది వారి జీవన ధ్యేయం. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. 1961లో విశ్వేశ్వరయ్య గారి శతజయంతి ఉత్సవాలకు భారత ప్రధాని నెహ్రూ విచ్చేశారు." మేము మాటలతో కాల యాపన చేశాం. మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయు" లంటూ నివాళులర్పించారు నెహ్రూ.


"ప్రజల సంపాదనాశక్తిని, కార్యదక్షతను నైపుణ్యాన్ని వివిధములైన చేతిపనుల ద్వారా పెంపొందించాలి. చేతనైన వారందరూ కష్టించి పని చేసే వీలు కల్పించాలి. యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వేయాలి. భారతీయులలో ప్రబలంగా ఉన్న 'అంతా తలరాత' అన్న  భావం రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించుట ప్రభుత్వం కర్తవ్యం."

1912 మైసూరు సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ శ్రీ విశ్వేశ్వరయ్య చెప్పిన మాటలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా నిత్య సత్యాలే... ఆయనకు ఘన నివాళి.

*భారతీయ ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు*

బంధాలు-బంధుత్వాలు

 🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃


*బంధాలు-బంధుత్వాలు*

*భోజన మహాత్యం*

*బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేసేది కాదు,బంధం అంటే ఎప్పుడూ నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇచ్చేది*...........

*మీరు మీ తాతయ్య తరంవారిని వారి కాలంలో బంధుత్వాలు, మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉండేవో ఒకసారి అడిగి చూడండి.మా చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు.వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి.ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు.ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు.ఇల్లంతా వెతికినా కనిపించవు.అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది.అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు. కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు.ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి. బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు.*  


*రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది.ఇక గత రెండు మూడు దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి.ఒకే పట్నంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది.ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు,అక్కాచెల్లెళ్లలో ఆర్ధికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభం అయింది. డబ్బున్న బంధువులకు ఒకరకమైన మర్యాదలు, డబ్బులేని బంధువులకు మరొకరకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది.ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ,అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంతవాళ్ళం అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలు పెట్టారు.డబ్బులేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు*. 


*ఇక సొంత అన్నదమ్ములైనా, అక్కాచెల్లెళ్ళే అయినా,ఏవైనా ఫంక్షన్స్ ఉంటె తప్ప కలుసుకోవడం లేదు. మామూలుగా వెళ్లి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది.ఆ ఫంక్షన్స్ కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్లడం,భోజనాలు అయ్యాక వెంటనే "పనులు ఉన్నాయి" అని వంక చెప్పి వెళ్లిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాము.మనుషుల మధ్య ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది.*  


*సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకుని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలయితే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకుని, కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్లిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు.వందలమంది అతిధులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునొ,తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చెయ్యడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు.*  


*అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా,కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్లిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి.చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెబుతుంటారు.ఏడాదికి వందరోజులు సెలవులు ఉన్నాయి మనకు.లేనిదల్లా ఆత్మీయతలు...బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు...!అన్నం అనేది మనమధ్య మానసిక బంధాలను సుదృఢంగా నిలిపి అజరామరం గావించే అమృతం లాంటిది.*


*ఒక ఇంటిలో ఆత్మీయ భోజన బంధం అనేది ప్రతి వ్యక్తి పుట్టుకకు మరియు చావుకు మధ్యలో వుండే ప్రేమ అనురాగాలచ జ్ఞాపకం*ఆతిథితో చేసే భోజనం,సహపంక్తి భోజనం జీవీతములో మరచి పోలేని మధుర గట్టం*

*########################*

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

శ్రీమద్భాగవతము

 *15.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2262(౨౨౬౨)*


*10.1-1379-*


*క. రోషప్రమోద నిద్రా* 

*భాషాశన పాన గతులఁ బాయక చక్రిన్*

*దోషగతిఁ జూచి యైన వి*

*శేషరుచిం గంసుఁ డతనిఁ జెందె నరేంద్రా!* 🌺



*_భావము: శ్రీశుకులు కంసుడు పరమాత్మలో ఐక్యమయ్యాడు అని ఇలా వివరిస్తున్నారు: "పరీక్షిన్మహారాజా! కంసుడు దోషభూయిష్టమైన స్వభావము కలిగియున్నవాడైనప్పటికీ, కోపములోను, సంతోషములోను, నిద్రిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నా, తాగుతున్నా, తింటున్నా, నడుస్తున్నా -ఇలా ఏ పని చేస్తున్నా కూడా శ్రీకృష్ణుని గురించిన ఆలోచనలు విడవకుండా ఉండుటచే, విశిష్టమైన తేజస్సుతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందే లీనమయ్యాడు."_* 🙏

*_(అందుకే కంసుడు నవ విధ భక్తులలో ఒకడయ్యాడు - తొమ్మిది భక్తి మార్గములలో భయము వలన కంసుడు)._* 🙏🏻



*_Meaning: Suka Maharshi told the king Parikshit that the soul of cruel and ill-natured Kamsa coalesced into Sri Krishna, the Almighty, since the thoughts of Kamsa were always focussed on Sri Krishna and though out of fear, every moment of Kamsa was spent in speculation about the movements of Sri Krishna whether in anger, joy, while sleeping, talking, eating or walking._* 🙏 

*_That is how Kamsa was quoted as an example of Bhaktha (devotee) (As one of the paths of Navavidha Bhakti)._* 🙏🏻



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ప్రశ్న పత్రం సంఖ్య: 30 జవాబులు

  ప్రశ్న పత్రం సంఖ్య: 30 జవాబులు   కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 తత్వ వేదాంత సంబంధిత ప్రెశ్నలు. 

జీవకోటిలో దుర్లభము, ఉత్తమము అయిన మానవజన్మ కలిగి మనం ఉన్నామంటే అది కేవలం మనం గతజన్మలలో చేసుకున్న సుకృతం మాత్రమే.  ఈ జన్మను మనము జన్మ రాహిత్యానికి అంటే మోక్షానికి మాత్రమే ఉపయోగించాలని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. ముముక్షువులారా క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.   

1. ధృతరాష్ట్రునికి భగవత్గీతను వినిపించింది ఎవరు. జవాబు: సంజయుడు 

2. యుద్ధవీరుడు, ధనుర్విద్యా పారంగతుడు అయిన అర్జనుడు యుద్ధం చేయటానికి ఎందుకు వెనుకాడడు.

జవాబు: తనవారిని చంపి పొందే రాజ్యం ఎందుకని విషాదాన్ని పొంది యుద్ధం చేయ వెనుకాడడు.  

3. తత్త్వం అంటే ఏమిటి. జవాబు: నీవు వెతికేది (బ్రహ్మము) అది నీవే అని అర్ధం. 

4. వేదాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది. జవాబు: వేదాలకు అంతిమంగా వున్నది కనుక వేదాంతం అన్నారు. 

5. సాధకునికి తానూ చేసే సాధనకు మూడు విధాల విజ్ఞాలు కలుగవచ్చ అని అంటారు అవి ఏవి. జవాబు: 1) ఆద్యాత్మికం. అనగా తన శరీరం సాధనకు అనుకూలించక పోవటం  శారీరికి రుగ్మత, బద్ధకం 2మొదలైనవి. 2) అది దైవికం అంటే ప్రక్రుతి శక్తులవల్ల కలిగే ఆటంకాలు ఉదా . వర్షాలు, పిడుగులు, మెరుపులు, భూకంపాలు మొదలైనవి. 3) అది బౌతికం అనగా ఇతరుల వలన కలిగే ఆటంకం. సాధకుడు సాధన చేస్తున్నపుడు ఇతరులు బిగ్గరగా మాట్లాడటం, మైకు శబ్దాలు, వాహనాలశాబ్దాలు, ఇంకా ఇతర జంతువులవాలం అవరోధాలు మొదలైనవి. 

6. మహావాక్యాలు అంటే ఏమిటి. జవాబు: వేదాంత విషయాలను సూక్ష్మంగా చెప్పే వాక్యాలు. ప్రతిదీ పరబ్రహ్మ గూర్చే చెపుతుంది 

7. అరిషడ్వార్గం అంటే ఏమిటి. జవాబు. కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు

8. అహం బ్రహ్మాస్మి అనే మహా వాక్యం ఏ ఉపనిషతులోనిది. జవాబు సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన మహా వాక్యం ఇది.

9. మోక్షము సిద్ధవస్తువా లేక సాద్యవస్తువా.జవాబు మోక్షము సిద్ధవస్తువు 

10. ప్రస్నోపనిషత్తులో ప్రశ్నలకు సమాదానాలు తెలిపిన మహర్షి పేరు ఏమిటి. జవాబు. పిప్పలాదుడు 

11. త్రిగుణాలు అంటే ఏమిటి. జవాబు.  త్రిగుణాలు -1. త్రిగుణాలు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే మూడు 

12. తమోగుణవంతులు మోక్షానికి అర్హులా జవాబు. కాదు.  ఎందుకనగా తమోగుణం త్రిగుణాలలో అధమగుణంగా పేర్కొన్నారు, రజోగుణం మధ్యస్తంగా, సత్వ గుణం ఉత్తమ గుణంగా  పేర్కొన్నారు. నిజానికి సత్వగుణంకన్నా శుద్ధ స త్వ గుణం అంటే సత్వగుణం కన్నా శ్రేష్టమైనది మాత్రమే మోక్షాన్ని కలుగచేస్తుంది శ్రీ కృష్ణ భగవానులు తెలిపారు. 

13. కృష్ణ భగవానులు అన్నిధర్మాలు పరిత్యజించి ఏమి చేయమన్నారు. జవాబు "సర్వధర్మ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ, అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః"

మనిషికి శరణాగతి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం లాంటి అన్నిసాధనలకు ప్రత్యామ్నాయం. మానవ ధర్మాలు పాటించలేనప్పుడు మనిషి మనుగడ శరణాగతిలోనే.  

14. సంసారం, సన్యాసం రెంటిలో మోక్షసాధకుడు దీనిని ఎంచుకుంటారు. జవాబు. మోక్షసాధకుడు నిరంతరం నిధిజాసలోనే వుండాలని  తలుస్తాడు. సంసారం ఒక అవరోధగా భావిస్తాడు ఎందుకంటె ఇందులో భాద్యతలు, ధనార్జన, బంధాలు ఉంటాయి.  అవి విముక్తి పొందినప్పుడే సాధకుడు మోక్షార్ధి కాగలదు కదా. 

15. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు. జవాబు "దుఃఖము కలిగినపుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినపుడు స్పృహ లేనివాడు, రాగము, ద్వేషము, భయము లేనివాడు.....అట్టివాడిని..స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చును..

16. సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటి. జవాబు. సంగమం అంటే కలయిక అని అర్ధం పరిత్యాగం అంటే పూర్తిగా వదలివేయటం అని భావం వివరిస్తే తనకు కలిగిన అన్ని కలయికలను అంటే బంధాలను పూర్తిగా వదలివేయటం అని అర్ధం.  ఇది కేవలం నిష్టగా సన్యాసాశ్రమంలో వున్నమహానుభావులకే సాధ్యం. ఇప్పుడు కాషాయం కట్టుకొని వేడుకగా ఉపన్యాసాలు చేసే స్వామీజీలు, బాబాలు, గురువులకు వర్తించదు. సర్వసంగ పరిత్యాగి ఈ జనావాసాలలో ఉండడు , అరణ్యాలలోనో, హిమాలయాలలోనో నివాసం ఏర్పాటుచేసుకుని నిత్యం పరబ్రహ్మ చింతనలోనే ఉంటాడు. 

17. అహమాత్మా బ్రహ్మా అంటే అర్ధం ఏమిటి. జవాబు.  నేను శరీరాన్ని కాదు ఆత్మను, ఆ ఆత్మే బ్రహ్మమై వున్నదని అర్ధం. 

18. తత్వమసి ఏ ఉపనిషత్తులోది జవాబు. చాందోగ్యోపనిషత్తు లోనిది. 

19.  పంచేంద్రియాలు ఏవి. జవాబు. ఇంద్రియాలు - ఐదు; వాటిలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని రెండు విధాలు.కర్మేంద్రియ పంచకంవాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ, జ్ఞానేంద్రియ పంచకం: త్వక్కు = చర్మం, చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి, ఘ్రాణం = ముక్కు

20. నాలుగు మహావాక్యాలు ఏవి జవాబు. ప్రజ్ఞానం బ్రహ్మ,  ఆహం బ్రహ్మాస్మి,  తత్ త్వమసి,  అయమాత్మా బ్రహ్మ

21. ప్రస్థానత్రయం అని వీటిని అంటారు జవాబు. 1. ఉపనిషత్తులు, 2. భగవద్గీత, 3. బ్రహ్మసూత్రాలు 

22. శ్రీ ఆదిశంకరాచాయులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. జవాబు.అదివైతము 

23. శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. జవాబు. విశిష్టాదివైతము 

24. శ్రీ మద్వాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. జవాబు. డీవీఈతము 

25. చారువాకవాదం ఏమిటి జవాబు. చార్వాకుడు ప్రతిపాదించిందానిని చార్వాక వాదము అంటారు. కనపడేదానినే నమ్ము అని ఆయన వాదము. అంటే అన్ని సుఖాలను అనుభవించు అంటాడు.  ఒకరకంగా ఇది నాస్తిక వాదంగా అనుకోవచ్చు. 

26. షడ్ దర్శనాలు అంటే ఏమిటి. జవాబు. 1, సాంఖ్యము: 2, యోగదర్శనము, 3, న్యాయ దర్శనము, 4, వైశేషిక దర్శనము, 5, పూర్వమీమాంస:, 6, ఉత్తరమీమాంస:

27. నిర్వాణ షట్కామ్ వ్రాసింది ఎవరు. జవాబు.  ఆది శంకరాచార్యులు 

28. జనక మహారాజుకు వేదాంతాన్ని బోధించింది ఎవరు జవాబు. అష్టవక్రుడు 

29. భగవత్గీత ప్రకారం కర్మలు చేయాలా లేక చేయవలదా. జవాబు. కర్మలు మూడురకాల,కర్మ, వికర్మ, అకర్మ ఇందులో ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మ ను బంధించవు. కర్మచేసినా కూడా ఫలితం ఉండదు అంటే కేవలం ఈశ్వరార్పణగా చేసే కర్మలు కాబట్టి ఆ కర్మలనే చేయమని భగవానులు చెప్పారు. 

30. మోక్షం అంటే ఏమిటని మీరనుకుంటున్నారు. జవాబు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం. 

" ఈ పర్స్ ఎవరిదండీ

 సిద్దార్ధ టికెట్ టికెట్ అంటూ ట్రైన్ లో అటు నుండి ఇటు వస్తూ ఉంటే ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది . దానిని పైకి తీశాడు . అందులో కొద్దిపాటి చిల్లర నోట్లు , ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు . ఎవరిదో తెలిపే ఆనమాళ్ళు ఏమీ లేవు . ఎలా తిరిగి ఇవ్వడం ? 

 .

 " ఈ పర్స్ ఎవరిదండీ ? " అంటూ అడిగారు 

.

అందరూ పర్స్ కేసీ చూశారు . తమ జేబులు తడుముకున్నారు . ఈ విషయం పక్క బే లో కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు . 

 .

 " మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ? ఏదైనా ఆనమాలు ఏమిటీ ? " 

 .

 " అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ " అన్నాడాయన 

.

 " అదే ఆనమాలు చెబితే ఎలాగండీ ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా ! " 

 .

అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమె !

 

 .

 " బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు . అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది . అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో పెట్టుకున్నాను . "

 .

నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా భార్య చాలా అందగత్తె . నాకు ఆమె అంటే చాలా ప్రేమ అపుడు ఆమె ఫోటో నా పర్సులో పెట్టుకునే వాడిని . 

 .

ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు . వాడంటే నాకు చాలా ఇష్టం . వాడి కోసం ఆఫీసు వదల గానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని . వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని . వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని . వాడే నా లోకం . అపుడు నా పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని . వాడు ఇపుడు అమెరికాలో ఉన్నాడు . నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది . ఇపుడు నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది . అందుకని నాకు తోడు గా కృష్ణుడిని పెట్టుకున్నాను . ఆయనే నాకు ఇపుడు తోడు . నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు . నా విచారానికి ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో నా పర్సులో పెట్టుకోవలసిన ఆయనను నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు నేను ఆయనతో గడుపుతున్నాను . " 

 .

 .

సిద్దార్ధ మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశాడు . 

 .

 .

పక్క స్టేషన్ లో రైలు ఆగింది . సిద్ధార్ధ రైలు దిగి బుక్ స్టాల్ కి వెళ్ళాడు . 

 .

 " దేవుడి ఫోటోలు ఏమి ఉన్నాయి పర్సు లో పెట్టుకోడానికి "

చాణక్యుడు

 చదువు గుడ్డివాడి చేతిలో అద్దంలా వుండకూడదు... చాణక్యుడు.

__________________________________


శ్లో॥


శతనిష్కో ధనాఢ్యశ్చ: శతగ్రామేణ భూపతి:

శతశ్వ క్షత్రియో రాజా శతశ్లోకెన పండిత:


వందరూపాయలుంటే ధనవంతుడని, వంద గ్రామాలుంటే వాడే భూపతని, వందగుర్రాలుంటే వాడేరాజని కొందరు ఈ లోకంలో విర్రవీగుతుంటారు.కాని ఎవడిదగ్గరైతే నూరు శ్లోకాలుంటాయో వాడే నిజమైన ధనవంతుడు, భూపతి, రాజు కూడా. ఇక్కడ నూరుశ్లోకాలు కలవాడంటే విద్య కలవాడని భావం.

_______భర్త్రహరి సుభాషితం.


శ్లో॥


అజ్ఞేభ్యోగ్రంథిన: శ్రేష్ఠా: గ్రంథిభ్యో ధారనో వరా:

ధారిభ్యో జ్ఞానిన: శ్రేష్ఠా: జ్ఞానిభ్యో వ్యవసాయన:


అజ్ఞానికంటే ఏదో ఒకగ్రంథం చదివినవాడు శ్రేష్ఠుడు. గ్రంథం చదివినవాడికంటే దానిని కంఠస్థం చేసినవాడు శ్రేష్ఠుడు. కంఠస్థం చేసినవాడి కంటే అందులోని మంచితనాన్ని ఆచరణలో పెట్టినవాడు మరి శ్రేష్ఠుడు.


____________ మనుస్మ్రతి.


శ్లోకం॥


యస్యనాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం కరోతికిమ్

లోచనాభ్యం విహినస్య దర్పం కిం కరిష్యతి.


గ్రంథాలు నూరు చదివినంత మాత్రాన ఉపయోగం లేదు. అందులోని నీతిని పదిమందికి చెప్పే స్వయంప్రతిభ కూడా వుండాలి. స్వయంప్రతిభ లేకపోతే ఆ చదువంతా గుడ్డివాడికి అద్దం ఇచ్చినట్లుగా వుంటుంది.


____________ చాణక్యుడు.


॥ సేకరణ ॥

__________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

ఆయుర్వేదం

 కనీసం రెండుబారల దూరం కనబడేలా నడవాలి.> ఆయుర్వేదం.

_________________________________

(1) కుచేలాస్థి కంటకామేధ్య కేశ తుషోత్కర భస్మ కపాలస్నాన  

భూమినాం పరిహర్తా:


చింపిరిబట్టలు, పీలికలైన బట్టలు పడినచోట, ముండ్లు ఎముకలు మలమూత్రములు వెంట్రుకలు బూడిద వరిపొట్టు కుండపెంకులు గాజుముక్కలు పడినచోట స్నానం చేసిననీరు ప్రవహించుచోట నడవరాదు.


నడిచేటప్పుడు

(2) చత్ర: > గొడుగు

(3) దండీ > దండం, చేతిలో కర్ర

(4) మౌళీ > తలపాగా (టోపి)

(5) సోఫానత్క: > పాదరక్షలు ధరించి

(6) యుగిమాత్రదృగ్విచరేత్ > కనుచూపుమేర చూస్తూ 

కనీసం రెండుబారల దూరాన్ని గమనిస్తూ నడవాలి.


(7) దౌకాలా వుపస్ప్రశేత్ > ఉదయం సాయంకాలం రెండుపూటలా స్నానం చేయాలి.

(8) మలాయ నేష్ణభీక్ష్ణ: పాదయో శ్చ వైతుల్య మాధాధ్యాత్.

చంకలలో గజ్జలు (తొడల సందులలో) పాదములయందు మురికి చేరనీయక ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి.

(9) త్రిపక్ష్యస్య కేశ శ్మశ్రు లోమనఖాన్ సంహారయేత్.

కనీసం ఐదురోజులకొకసారి క్షవరం (గడ్డం) చేయించుకోవాలి.అలాగే ప్రతి ఐదురోజులకొకమారు గోర్లు తొలగించుకోవాలి.

(10) సాధువేషా: > ఎప్పుడూ ప్రసన్నంగానే వుండాలి.


॥ సేకరణ ॥

________________________________________ జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం

కరపాత్రి స్వామి శపించారు

 *ఇందిరా గాంధీ 3వ ప్రధానిగా పదవి అలంకరించడానికి ముందు పరిస్థితి..*


*ఆమె ఎట్టి పరిస్థితులలో ప్రధాని అయ్యే అవకాశమే కనిపించలేదు. ఆనాటి పరిస్థితులలో (దక్షిణాది) మద్రాస్ వాడైన నిజలింగప్పకు పూర్తి మద్దతు ఉంది. అప్పుడు ఇందిరా గాంధీ గారు సాధు సంతుల ఆశీర్వాదం కోసం తిరిగింది. వారిలో కరపాత్రి స్వామి (హరిహరానంద సరస్వతి) ఒకరు. ఆయన అమ్మా మాకు ఒక మాట ఇస్తే మేము నీవు ప్రధనిగా కావడానికి ఆశీర్వాదం ఇస్తాము అన్నారు. మీరు కోరిన ప్రమాణం చేస్తాను నన్ను ప్రధాని పదవి వరించేట్లు ఆశీర్వదించండి అని వేడుకుందట ఇందిర...*


*నీవు ప్రదాని పదవిని చేపట్టిన వెంటనే గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి అన్నారు. అలాగే స్వామి అని ఇందిరా గాంధీ మాట ఇచ్చింది. కరపాత్రి స్వామి (హరిహరానంద సరస్వతి) మరియు శంకరాచార్య ఇద్దరూ ఆమెను ఆశ్వీర్వదించారు. వారి ఆశీర్వాద బలమో లేక ఆమె అదృష్టమో గాని తర్వాత ఇందిరా గాంధీ భారతదేశానికి 3వ మురియు మొదటి మహిళా ప్రధాని గా పదవి చేపట్టింది.*


*కరపాత్రి స్వామి, శ్రీ శంకరాచార్య ఇద్దరూ రెండు సార్లు ఆమెను కలసి ఆమె ఇచ్చిన మాటనిలబెట్టుకోమని అడిగారు. ఆమె వారికి కల్లబొల్లి కబుర్లు చెప్పి పంపించి వేసింది. గోపాష్టమి నాడు కరపాత్రి స్వామి, శ్రీ శంకరాచార్యుల ఆద్వర్యంలో డిల్లీకి గోవులు సంతులు బయలు దేరారు.* *ఇందిరా గాంధీ వారిమీద కాల్పులు జరిపించింది. అనేకమంది సంతులు చాలా గోవులు తూటాల బారిన పడి చనిపోయాయి. కరపాత్రి స్వామి కోపంతో అమ్మా మమ్మల్ని బాధించావు.. సంతులం కనుక క్షమిస్తాము. కానీ మా తల్లి గోమాతలను చంపించావు.. దీనికి నా శాపం తప్పక నీకు తగిలి తీరుతుంది. నీ వంశం నిర్వంశమౌతుంది అని శపించారు.*

*ఈ విషయం ఆనాటి పత్రికలలో వచ్చింది. ఆర్యవ్రత్, కేసరి పత్రికలలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు.*


*సాధువుల శాపవాక్కుకు ఎంతటి బలం ఉందో చూడండి.*


*ఇందిరా గాంధీ సాధువుల మీద, గోవులమీద తుపాకులతో కాల్పులు జరిపించిన రోజు గోపాష్టమి..* 

*ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ చనిపోయినది గోపాష్టమి నాడు..*

*ఇందిరా గాంధీ హత్య చేయబడింది గోపాష్టమి నాడు..*

*రాజీవ్ గాంధీ హత్య చేయబడింది గోపాష్టమి నాడు..*


*సాధువులను, గోవులను హింసించిన వాడు ఎవ్వరూ బాగుపడలేదని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.*


*గమనిక ::ఎవరికైనా అనుమానం ఉంటే ఆసంవత్సరం,రోజుని క్రాస్ చెక్ చేసుకోండి..* 🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄 🐄 *గో మహా గర్జన లైవ్ లింక్* *https://youtu.be/jfbCXDUnjO4*

*ప్లీజ్ షేర్ 🚩 JAI GOMATHA🚩*

ప్రశ్న పత్రం సంఖ్య: 31

 ప్రశ్న పత్రం సంఖ్య: 31  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

రామాయణ  సంబంధిత ప్రెశ్నలు. 

ఇతిహాసాలలో మొదటిది మరియు ఒక ఉత్తమపురుషుడు జీవనం ఎలాచేయాలి అనేది శ్రీ రాముని ద్వారా తెలుసుకోవాలని మన సాంప్రదాయాలలో శ్రీరాముని ఆదర్శ పురుషునిగా భావిస్తున్నాము. క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.   

1. రామాయణాన్ని రచించింది ఎవరు.  

2.ఆదికవికి రామాయణాన్ని రచించటానికి ప్రేరేపించిన మహాముని ఎవరు. 

3. శ్రీరాముని అక్కగారి పేరు ఏమిటి. 

4. రామాయణంలో ఎన్ని కాండలు వున్నాయి  

5. రాముని సోదరులలో కవలపిల్లలు ఎవరు 

6. నందిగ్రామము ఎవరి మేనమామయూరు 

7. దశరథమహారాజు మరణించినప్పుడు శ్రీరాముడు ఎక్కడ వున్నారు. 

8. కైకేయిని ప్రేరేపించింది ఎవరు ఆమె ఏదేశంనుండి వచ్చినది. 

9. ఇంటిగుట్టు లంకకు చేటు అనే సామెత ఎలా వచ్చింది. 

10.సీతజాడతెలిపిం పక్షి ఎవరు. 

11. పరమేశుని ఆత్మలింగాన్ని వరంగా పొందిన భక్తుడు ఎవరు. 

12. సీతాదేవిని వివాహమాడటానికి శ్రీరాముడు చేసినది ఏమిటి. 

13. రామోవిగ్రహవాన్ ______

14. నదిదాటించింది ఎవరు, ఆ నడిపేరు ఏమిటి. 

15. శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రధాన్ని నడిపిన సారధి ఎవరు. 

16. శ్రీరాముని శరీరఛాయ ఏమిటి. 

17. శ్రీరాముడు మొదటిసారి హనుమంతుని చూసినప్పుడు ఆంజనేయులు ఏవేషంలో వున్నారు. 

18.తార ఎవరి భార్య 

19. విశ్వామిత్రుడు రామాయణంలో ఏ కాండలో కనపడతాడు. 

20. మధువనంను పాడుచేసింది ఎవరు 

21. ఎంగిలి పండ్లు ఎవరు ఎవరికి తినిపించారు.  

22. శ్రీరాములవారి తల్లిగారి పేరు ఏమిటి. 

23. విశ్వామిత్రుడు దశరధుని ఏమి కోరాడు 

24. భూమినుంచి పుట్టింది ఎవరు. 

25. లక్ష్మణ రేఖ అంటే ఏమిటి. 

26. బంగారు లేడి రూపంలో వున్నరాక్షసుడు ఎవరు. 

27. పర్ణశాల అంటే ఏమిటి దీనిని నిర్మించినది ఎవరు. 

28. ముక్కుచెవులు కోసింది ఎవరు, ఎవరికి 

29. లంకను కాపలా కాసింది ఎవరు. 

30. శ్రీరాముడు ఎవరి విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.