చదువు గుడ్డివాడి చేతిలో అద్దంలా వుండకూడదు... చాణక్యుడు.
__________________________________
శ్లో॥
శతనిష్కో ధనాఢ్యశ్చ: శతగ్రామేణ భూపతి:
శతశ్వ క్షత్రియో రాజా శతశ్లోకెన పండిత:
వందరూపాయలుంటే ధనవంతుడని, వంద గ్రామాలుంటే వాడే భూపతని, వందగుర్రాలుంటే వాడేరాజని కొందరు ఈ లోకంలో విర్రవీగుతుంటారు.కాని ఎవడిదగ్గరైతే నూరు శ్లోకాలుంటాయో వాడే నిజమైన ధనవంతుడు, భూపతి, రాజు కూడా. ఇక్కడ నూరుశ్లోకాలు కలవాడంటే విద్య కలవాడని భావం.
_______భర్త్రహరి సుభాషితం.
శ్లో॥
అజ్ఞేభ్యోగ్రంథిన: శ్రేష్ఠా: గ్రంథిభ్యో ధారనో వరా:
ధారిభ్యో జ్ఞానిన: శ్రేష్ఠా: జ్ఞానిభ్యో వ్యవసాయన:
అజ్ఞానికంటే ఏదో ఒకగ్రంథం చదివినవాడు శ్రేష్ఠుడు. గ్రంథం చదివినవాడికంటే దానిని కంఠస్థం చేసినవాడు శ్రేష్ఠుడు. కంఠస్థం చేసినవాడి కంటే అందులోని మంచితనాన్ని ఆచరణలో పెట్టినవాడు మరి శ్రేష్ఠుడు.
____________ మనుస్మ్రతి.
శ్లోకం॥
యస్యనాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం కరోతికిమ్
లోచనాభ్యం విహినస్య దర్పం కిం కరిష్యతి.
గ్రంథాలు నూరు చదివినంత మాత్రాన ఉపయోగం లేదు. అందులోని నీతిని పదిమందికి చెప్పే స్వయంప్రతిభ కూడా వుండాలి. స్వయంప్రతిభ లేకపోతే ఆ చదువంతా గుడ్డివాడికి అద్దం ఇచ్చినట్లుగా వుంటుంది.
____________ చాణక్యుడు.
॥ సేకరణ ॥
__________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి