15, సెప్టెంబర్ 2021, బుధవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 30 జవాబులు

  ప్రశ్న పత్రం సంఖ్య: 30 జవాబులు   కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 తత్వ వేదాంత సంబంధిత ప్రెశ్నలు. 

జీవకోటిలో దుర్లభము, ఉత్తమము అయిన మానవజన్మ కలిగి మనం ఉన్నామంటే అది కేవలం మనం గతజన్మలలో చేసుకున్న సుకృతం మాత్రమే.  ఈ జన్మను మనము జన్మ రాహిత్యానికి అంటే మోక్షానికి మాత్రమే ఉపయోగించాలని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. ముముక్షువులారా క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.   

1. ధృతరాష్ట్రునికి భగవత్గీతను వినిపించింది ఎవరు. జవాబు: సంజయుడు 

2. యుద్ధవీరుడు, ధనుర్విద్యా పారంగతుడు అయిన అర్జనుడు యుద్ధం చేయటానికి ఎందుకు వెనుకాడడు.

జవాబు: తనవారిని చంపి పొందే రాజ్యం ఎందుకని విషాదాన్ని పొంది యుద్ధం చేయ వెనుకాడడు.  

3. తత్త్వం అంటే ఏమిటి. జవాబు: నీవు వెతికేది (బ్రహ్మము) అది నీవే అని అర్ధం. 

4. వేదాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది. జవాబు: వేదాలకు అంతిమంగా వున్నది కనుక వేదాంతం అన్నారు. 

5. సాధకునికి తానూ చేసే సాధనకు మూడు విధాల విజ్ఞాలు కలుగవచ్చ అని అంటారు అవి ఏవి. జవాబు: 1) ఆద్యాత్మికం. అనగా తన శరీరం సాధనకు అనుకూలించక పోవటం  శారీరికి రుగ్మత, బద్ధకం 2మొదలైనవి. 2) అది దైవికం అంటే ప్రక్రుతి శక్తులవల్ల కలిగే ఆటంకాలు ఉదా . వర్షాలు, పిడుగులు, మెరుపులు, భూకంపాలు మొదలైనవి. 3) అది బౌతికం అనగా ఇతరుల వలన కలిగే ఆటంకం. సాధకుడు సాధన చేస్తున్నపుడు ఇతరులు బిగ్గరగా మాట్లాడటం, మైకు శబ్దాలు, వాహనాలశాబ్దాలు, ఇంకా ఇతర జంతువులవాలం అవరోధాలు మొదలైనవి. 

6. మహావాక్యాలు అంటే ఏమిటి. జవాబు: వేదాంత విషయాలను సూక్ష్మంగా చెప్పే వాక్యాలు. ప్రతిదీ పరబ్రహ్మ గూర్చే చెపుతుంది 

7. అరిషడ్వార్గం అంటే ఏమిటి. జవాబు. కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు

8. అహం బ్రహ్మాస్మి అనే మహా వాక్యం ఏ ఉపనిషతులోనిది. జవాబు సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన మహా వాక్యం ఇది.

9. మోక్షము సిద్ధవస్తువా లేక సాద్యవస్తువా.జవాబు మోక్షము సిద్ధవస్తువు 

10. ప్రస్నోపనిషత్తులో ప్రశ్నలకు సమాదానాలు తెలిపిన మహర్షి పేరు ఏమిటి. జవాబు. పిప్పలాదుడు 

11. త్రిగుణాలు అంటే ఏమిటి. జవాబు.  త్రిగుణాలు -1. త్రిగుణాలు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే మూడు 

12. తమోగుణవంతులు మోక్షానికి అర్హులా జవాబు. కాదు.  ఎందుకనగా తమోగుణం త్రిగుణాలలో అధమగుణంగా పేర్కొన్నారు, రజోగుణం మధ్యస్తంగా, సత్వ గుణం ఉత్తమ గుణంగా  పేర్కొన్నారు. నిజానికి సత్వగుణంకన్నా శుద్ధ స త్వ గుణం అంటే సత్వగుణం కన్నా శ్రేష్టమైనది మాత్రమే మోక్షాన్ని కలుగచేస్తుంది శ్రీ కృష్ణ భగవానులు తెలిపారు. 

13. కృష్ణ భగవానులు అన్నిధర్మాలు పరిత్యజించి ఏమి చేయమన్నారు. జవాబు "సర్వధర్మ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ, అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః"

మనిషికి శరణాగతి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం లాంటి అన్నిసాధనలకు ప్రత్యామ్నాయం. మానవ ధర్మాలు పాటించలేనప్పుడు మనిషి మనుగడ శరణాగతిలోనే.  

14. సంసారం, సన్యాసం రెంటిలో మోక్షసాధకుడు దీనిని ఎంచుకుంటారు. జవాబు. మోక్షసాధకుడు నిరంతరం నిధిజాసలోనే వుండాలని  తలుస్తాడు. సంసారం ఒక అవరోధగా భావిస్తాడు ఎందుకంటె ఇందులో భాద్యతలు, ధనార్జన, బంధాలు ఉంటాయి.  అవి విముక్తి పొందినప్పుడే సాధకుడు మోక్షార్ధి కాగలదు కదా. 

15. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు. జవాబు "దుఃఖము కలిగినపుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినపుడు స్పృహ లేనివాడు, రాగము, ద్వేషము, భయము లేనివాడు.....అట్టివాడిని..స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చును..

16. సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటి. జవాబు. సంగమం అంటే కలయిక అని అర్ధం పరిత్యాగం అంటే పూర్తిగా వదలివేయటం అని భావం వివరిస్తే తనకు కలిగిన అన్ని కలయికలను అంటే బంధాలను పూర్తిగా వదలివేయటం అని అర్ధం.  ఇది కేవలం నిష్టగా సన్యాసాశ్రమంలో వున్నమహానుభావులకే సాధ్యం. ఇప్పుడు కాషాయం కట్టుకొని వేడుకగా ఉపన్యాసాలు చేసే స్వామీజీలు, బాబాలు, గురువులకు వర్తించదు. సర్వసంగ పరిత్యాగి ఈ జనావాసాలలో ఉండడు , అరణ్యాలలోనో, హిమాలయాలలోనో నివాసం ఏర్పాటుచేసుకుని నిత్యం పరబ్రహ్మ చింతనలోనే ఉంటాడు. 

17. అహమాత్మా బ్రహ్మా అంటే అర్ధం ఏమిటి. జవాబు.  నేను శరీరాన్ని కాదు ఆత్మను, ఆ ఆత్మే బ్రహ్మమై వున్నదని అర్ధం. 

18. తత్వమసి ఏ ఉపనిషత్తులోది జవాబు. చాందోగ్యోపనిషత్తు లోనిది. 

19.  పంచేంద్రియాలు ఏవి. జవాబు. ఇంద్రియాలు - ఐదు; వాటిలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని రెండు విధాలు.కర్మేంద్రియ పంచకంవాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ, జ్ఞానేంద్రియ పంచకం: త్వక్కు = చర్మం, చక్షువు = కన్ను, రసన = నాలుక, శ్రోతం = చెవి, ఘ్రాణం = ముక్కు

20. నాలుగు మహావాక్యాలు ఏవి జవాబు. ప్రజ్ఞానం బ్రహ్మ,  ఆహం బ్రహ్మాస్మి,  తత్ త్వమసి,  అయమాత్మా బ్రహ్మ

21. ప్రస్థానత్రయం అని వీటిని అంటారు జవాబు. 1. ఉపనిషత్తులు, 2. భగవద్గీత, 3. బ్రహ్మసూత్రాలు 

22. శ్రీ ఆదిశంకరాచాయులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. జవాబు.అదివైతము 

23. శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. జవాబు. విశిష్టాదివైతము 

24. శ్రీ మద్వాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఏమిటి. జవాబు. డీవీఈతము 

25. చారువాకవాదం ఏమిటి జవాబు. చార్వాకుడు ప్రతిపాదించిందానిని చార్వాక వాదము అంటారు. కనపడేదానినే నమ్ము అని ఆయన వాదము. అంటే అన్ని సుఖాలను అనుభవించు అంటాడు.  ఒకరకంగా ఇది నాస్తిక వాదంగా అనుకోవచ్చు. 

26. షడ్ దర్శనాలు అంటే ఏమిటి. జవాబు. 1, సాంఖ్యము: 2, యోగదర్శనము, 3, న్యాయ దర్శనము, 4, వైశేషిక దర్శనము, 5, పూర్వమీమాంస:, 6, ఉత్తరమీమాంస:

27. నిర్వాణ షట్కామ్ వ్రాసింది ఎవరు. జవాబు.  ఆది శంకరాచార్యులు 

28. జనక మహారాజుకు వేదాంతాన్ని బోధించింది ఎవరు జవాబు. అష్టవక్రుడు 

29. భగవత్గీత ప్రకారం కర్మలు చేయాలా లేక చేయవలదా. జవాబు. కర్మలు మూడురకాల,కర్మ, వికర్మ, అకర్మ ఇందులో ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మ ను బంధించవు. కర్మచేసినా కూడా ఫలితం ఉండదు అంటే కేవలం ఈశ్వరార్పణగా చేసే కర్మలు కాబట్టి ఆ కర్మలనే చేయమని భగవానులు చెప్పారు. 

30. మోక్షం అంటే ఏమిటని మీరనుకుంటున్నారు. జవాబు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం. 

కామెంట్‌లు లేవు: