28, అక్టోబర్ 2023, శనివారం

Birthplace of different religion


 

Airplane travel


 

Opening a nut


 

Stone fish


 

New truck


 

Head hunters in nagaland


 

Know fake note


 

Trip guarantee


 

Village in Brazil


 

Don't do like this


 

3d art


 

Heavy load vehicle


 

Panchanag


 

Navadurga vratam


 

*శ్రీ మహాలక్ష్మి ఆలయం*

 🕉 మన గుడి : నెం 222






⚜ గోవా  : పనాజీ


⚜ *శ్రీ మహాలక్ష్మి ఆలయం*

  

💠 తీవ్ర వ్యతిరేకత తర్వాత 300 ఏళ్ల తర్వాత గోవాలో పోర్చుగీసువారు నిర్మించేందుకు అనుమతించిన తొలి హిందూ దేవాలయం ఇదే.  

ఇది చాలా ఆలస్యం తర్వాత 1818లో పోర్చుగీస్ అధికారులచే ఆమోదించబడింది మరియు భక్తులు చేసిన ముడుపుల ఆధారంగా నిర్మించబడింది.  

ఇది ఇటీవల 1983లో పునరుద్ధరించబడింది.


💠 ఒక నగరంగా, పనాజీ ప్రతి సందు మరియు మూలలో చారిత్రక రత్నాలతో నిండి ఉంది.  నగరం గుండా ఒక నడక ఒక శతాబ్దం క్రితం నిర్మించిన ఇటువంటి అనేక భవనాలను బహిర్గతం చేస్తుంది.  అలాంటి ఒక కట్టడం అల్టినో కొండ దిగువన శ్రీ మహాలక్ష్మి ఆలయం ఉంది.  

ఈ మైలురాయిని 200 సంవత్సరాల క్రితం పోర్చుగీస్ పాలనలో నిర్మించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు.


💠 ఈ ఆలయానికి అద్భుతమైన చరిత్ర ఉంది. 16వ శతాబ్దంలో కార్వార్-కుంఠ ప్రాంతాలకు చెందిన హవిగ్ బ్రాహ్మణులు భిక్ష మరియు ఇతరుల దానధర్మాలతో జీవించేవారు. మహాలక్ష్మిని ఆరాధించారు మరియు వారు భిక్ష కోసం ఎక్కడికి వెళ్లినా వారు ఈ దేవతను వెంట తీసుకువెళ్లారు. 

16వ శతాబ్దంలో, వారు ఈ దేవతతో పాటు గోవాకు వెళ్లారు మరియు గోమతి (మాండోవి) నది వెంబడి పంజిం కేవలం వార్డుగా ఉన్న తాలిగో గ్రామానికి చేరుకున్నారు. 

రోజంతా భిక్షాటన చేస్తూ గడిపిన హవిగ్ బ్రాహ్మణులు తలైగావోలోని విఠల్ దేవాలయం ఆవరణలో ఆశ్రయం పొందారు. 

కానీ వారు పోర్చుగీసు వారి మతమార్పిడి విధానం గురించి తెలుసుకున్నప్పుడు, పాలరాయితో చేసిన తమ పూజ్యమైన మహాలక్ష్మి విగ్రహాన్ని అపవిత్రం చేస్తారనే భయంతో, వారు తలీగావ్ నుండి దూరంగా వెళ్లారు మరియు వారు కదులుతున్నప్పుడు వారు పోర్చుగీస్ ప్రభుత్వానికి చెందిన గుర్రపుశాలను కనుగొన్నారు.


💠 అప్పుడు పోర్చుగీస్ మిలటరీలో పనిచేసిన రాఘవేంద్ర కామత్ మమై హవిగ్ బ్రాహ్మణులు తమ దేవతను దాచడానికి ఎంచుకున్న ఈ ప్రదేశం సురక్షితం కాదని గుర్తించి, దానిని పంజిమ్ నగరం నడిబొడ్డున ఉన్న ఆదిల్షాహి ప్యాలెస్ (పాత సెక్రటేరియట్) ఎదురుగా ఉన్న తన రాజభవనానికి మార్చారు. 

దేవత యొక్క భద్రత కోసం ఇప్పటికీ భయపడి, అతను దానిని బిచోలిమ్ తాలూకాలోని మాయెమ్ గ్రామానికి తరలించాడు, అక్కడ అది 1817 వరకు ఉంది.

కొంతకాలం తర్వాత 1817లో

పనాజీకి చెందిన శ్రీ నారాయణ్ కామత్ మమై దేవత గురించి కలలు కన్నారు మరియు మరుసటి రోజు అతను ఇతరులతో కలిసి మాయెమ్‌కు వెళ్లి పంజిమ్‌కు దేవతని తీసుకువచ్చి స్వర్గీయ శ్రీ రాయ కామత్ ఘనేకర్ పూర్వీకుల ఇంటిలో ఉంచాడు. 


💠 ఈ సమయంలో పోర్చుగీస్ పాలనలో రాచరికం ప్రబలంగా ఉంది అందుకే ఆలస్యంగా నారాయణ్ కామత్ మమై ప్రత్యేకంగా ఆలయ నిర్మాణానికి పోర్చుగల్ రాజు నుండి ఆమోదం పొందారు. అప్పటి గోవా గవర్నర్ జనరల్ కొండే-డి-రియో-పార్డో ఈ ఉత్తర్వును ఆమోదించారు.

1819 నాటికి, ఆలయం పూర్తయింది. 


💠 అప్పటి నుండి తీస్‌వాడి తాలూకాలోని తలీగావ్‌లో స్థిరపడి, 16వ శతాబ్దంలో విగ్రహాన్ని గోవాకు తీసుకువచ్చిన హిందూ సమాజం భయం లేకుండా జీవించింది. 

ఆలయంలో ఇప్పుడు లోహపు విగ్రహం ఉండగా, రాతితో చెక్కబడిన అసలు విగ్రహం అదే ప్రాంగణంలో భద్రంగా ఉంది.


💠 ఆలయ సముదాయంలో శివుడు, గణపతి, గ్రామ పురుషుడు మరియు రావల్నాథ్ వంటి పరివార్ దేవతలు ఉన్నాయి.  

పక్కనే కొత్త రాధాకృష్ణ మందిరం నిర్మించారు.  ఇది ఏడాది పొడవునా అన్ని పండుగలను జరుపుకుంటుంది


💠 మహాలక్ష్మి ఆలయం ఉదయం 7:30 మరియు రాత్రి 9:00 మధ్య తెరిచి ఉంటుంది మరియు రోజుకు రెండుసార్లు, మధ్యాహ్నం మరియు రాత్రి 8:00 గంటలకు హారతి ఉంటుంది 

శుక్రవారాలు ప్రత్యేకమైనవి, 

భక్తులు రాత్రి 9:00 - 10:00 గంటల మధ్య భజనలు (భక్తి పాటలు) పాడతారు.

గ్రహణ సమయంలో దర్భలు

 *గ్రహణ సమయంలో దర్భలు ఎందుకు ఉపయోగిస్తారు*..?


సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి ఉంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారు? దీనికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే.. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు అంటారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలు, గృహాలను సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయి. 


*దర్భలను ఎక్కడ ఉంచుకోవాలి*..

ఈ క్రమంలో దర్భలను కూడా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో ఉంచుతారు. గరిక అనేది యాంటి రేడియేషన్ గుణాలు కలిగిఉన్నది. అందుకే గ్రహణం సమయంలో మన ఇంట్లోని అన్ని పాత్రలు, నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతారు. దర్భల మీద 1982-83 ప్రాంతంలో భారత దేశంలో సూర్య గ్రహణం రోజున పరిశోధన జరిగింది. గరిక గడ్డి జాతికి చెందినది. అది నిటారుగా పైకి నిలబడి, సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలో దాచి ఉంచుకుంటుంది. అతినీలలోహిత కిరణాలను, గ్రహణ సమయంలో భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితో అడ్డుకుంటుందని ఆ పరిశోధనలో తేలింది.



*గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు*..

ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది. వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. గర్భిణిలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. కానీ సృష్టితీరులో ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఏది జరిగినా దాని ప్రభావం ఏదో ఒక రూపంలో వెల్లడి అవుతుంది. ఆ కారణంగా నిత్యపూజాది కార్యక్రమాలు, శాంత్యోపచరాలు చేసుకోవాలని సాధకులు చెబుతారు. సముద్రపు ఆటుపోట్లు జాగ్రత్తగా పరిశీలించమని చెబుతారు. ముఖ్యంగా గర్భిణీలపై వీటి ప్రభావం ఎక్కువై శరీరంలో అధిక వేదనలు పడతాయని అంటారు. అందుకే గ్రహణములు చూడొద్దు అంటున్నారు. కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. 


*ముందుగా దర్భలు ఇంట్లో వేయాలి.* 

**పచ్చళ్లు, ఆహార పదార్ధాల మీద ఉంచాలి*

*గ్రహణానికి 2 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి*.

*గ్రహణం వీడిన తర్వాత స్నానము చెయ్యాలి.*



 *ఆ సమయంలో మంత్ర పునరశ్చరణతో అధిక ఫలితం ఉంటుంది*


దర్భలను ఎప్పుడు కోయాలంటే..

గ్రహణాల సమయంలో భూమిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. దానికి అనుగుణంగా మన శరీరంలోనూ, జీవన విధానంలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. సూర్య, చంద్రులు ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషసూక్తి. గ్రహణ సమయాల్లో మనం వాటికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి.

దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ల చాలా పదునుగా సూదిలా ఉంటాయి. దర్భలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడు కొయ్యాలని చెబుతారు. 

ఆ విధంగా చేసినటైతే ఆ దర్భలు రేడియేషన్ ను తొలగిస్తాయంటారు. గ్రహణ సమయాలలో ఉత్పత్తి అయ్యే ఫలితాన్ని అల్త్రా వైలెట్ కిరణాల ప్రభావాన్ని అవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో,  పచ్చళ్లపై ఉంచినట్టు అయితే.. బూజు పట్టకుండా ఉంటాయని పరిశోధనలో తేలింది. 


ఆహారం ఎప్పుడు తీసుకోవాలంటే…

ఇక గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణం కాదంటారు. వాతావరణ మార్పులే దీనికి కారణం. ఈ గ్రహణాల వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని భావిస్తారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు, నిద్రపోనివ్వరు. ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతారు. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణిలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తారు. గ్రహణం ఏర్పడటానికి 3 గంటల ముందు.. ఏర్పడిన అనంతరం మరో మూడు గంటల వరకు పసి పిల్లలు, వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, యుక్త వయస్కులు మాత్రం గ్రహణ సమయానికి 12 గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు.

దర్భ అనేది ఒక రకమైన గడ్డి.

 దర్భ అనేది ఒక రకమైన గడ్డి. దీనిని హిందువులు చాలా పవిత్రముగా భావిస్తారు. అందువలన హిందూ సంప్రదాయంలో దీనికి విశిష్ఠ స్థానం ఉంది.ఇది ఒక క్రిమి నాశనిగా అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు గుర్తించారు.

ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది.

వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

తప్పనిసరి చేయాల్సిన

 *ప్రతిరోజు ఉదయం ప్రతి ఒక్కరు తప్పనిసరి చేయాల్సిన పన్నెండు నమస్కారాలు 🙏🙏*


 1. ఓం భూదేవ్యై నమః (శ్రీ భూమాతకు నమస్కారం!)


2. ఓం జలదేవాయ నమః (శ్రీ జల దేవునకు నమస్కారం!)


3. ఓం అగ్నిదేవాయ నమః (శ్రీ అగ్ని దేవునకు నమస్కారం!)


4. ఓం వాయుదేవాయ నమః (శ్రీ వాయు దేవునకు నమస్కారం!)


5. ఓం ఆకాశదేవాయ నమః (శ్రీ ఆకాశదేవునకు నమస్కారం!)


6. ఓం సూర్యదేవాయ నమః (శ్రీ సూర్యదేవునకు నమస్కారం!)


7. ఓం చంద్రదేవాయ నమః (శ్రీ చంద్రదేవునకు నమస్కారం!)


8. ఓం కాలదేవాయ నమః (శ్రీ కాలదేవునకు నమస్కారం!)


9. ఓం మాతృదేవ్యై నమః (శ్రీ మాతృదేవతకు నమస్కారం!)


10. ఓం పితృదేవాయ నమః (శ్రీ పితృదేవునకు నమస్కారం!)


11. ఓం ఆత్మదేవాయ నమః (శ్రీ ఆత్మదేవునకు నమస్కారం!)


12. ఓం పరమాత్మదేవాయ నమః (శ్రీ పరమాత్మదేవునకు నమస్కారం!)

అందం’ అంటే

 *🙏💐😇👍‘అందం’ అంటే ఏంటి నాన్నా? అని ఎనిమిదేళ్ళ కూతురు తన నాన్నను అడిగితే*


*నాన్న చెప్పిన సమాధానం*


*“రోజూ లేవగానే నువ్వు నానమ్మకు గుడ్ మార్నింగ్ నానమ్మా’ అని చెప్తావు చూడు ఆ పలకరింపే ‘అందం’ అంటే.*


*”స్కూల్ కి నిన్ను తీసుకెళ్లేటప్పుడు టర్నింగ్ లో నువ్వు చేతితో సిగ్నల్ ఇస్తావు చూడు అదే అందమంటే.*


*”ఒకరోజు నీ ఫ్రెండ్ నీకు తెలీకుండా నీ పెన్సిల్ తీసిందని నీకు తెలిస్తే ‘మళ్లీ ఎప్పుడూ అలా చెయ్యకు, కావాలంటే నన్నడుగు’ అంటూ ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’ అని అన్నావు చూడు అదే అందమంటే.*


*”షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏదన్నా బొమ్మ నచ్చితే ‘కాస్ట్లీ అయితే వద్దు నాన్నా’ అంటావు చూడు అదే అందమంటే.*


*”అమ్మకూ నాకూ గొడవైనప్పుడు నా దగ్గరికొచ్చి ‘స్మైల్ నాన్నా!’ అంటావు చూడు అదే అందమంటే.*


*నీకు ఐస్ క్రీం కొన్నప్పుడు బయట నుంచి ఆశగా చూస్తున్న ఇద్దరి పిల్లలకు కూడా తీసుకో నాన్నా అన్నావు చూడు అదే అందమంటే.*


*”అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు ఇంటి పనిలో నాకు సాయం చేస్తావు చూడు అదే అందమంటే.*


*”నా బాధ నీకు తెలీకుండా నీతో మాట్లాడినప్పుడు ‘అలా ఉన్నావేంటి నాన్నా అంతా ఓకే అవుతుందిలే’ అంటావు చూడు అదీ అందమంటే.*


*అని అనగానే*


*ఓహో అందం అంటే గుండెలో ఉంటుందా, మంచి మనస్సులో ఉంటుందా, మంచి ఆలోచనలో ఉంటుందా అన్న కూతురు సమాధానం విని ఆశ్చర్యంగా ఆనందంగా తన వైపే చూస్తూ ఉండిపోయాడు.*💐😇👍

గ్రహణ_ప్రభావము

 శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు తెలియజేసిన #గ్రహణ_పురశ్చర్య_విధానం....🔥🙏🔥


✔#గ్రహణ_ప్రభావము:-

సూర్య, చంద్ర గ్రహణాలలో ఏది వచ్చినా గ్రహణం పట్టిన దగ్గర నుండి విడచిన దాకా #ఒకే_మంత్రం జపం చేస్తే అది ఒక జప పురశ్చరణతో సమానం...... ఆ సమయం అసుర శక్తులు అంటే రాజస, తామస శక్తులు #విజృంభిస్తాయి. కనుకనే సాత్విక శక్తి కేంద్రాలయిన దేవాలయాలు అన్నింటిని మూసివేస్తారు....... రాజస, తామస విద్యలు ఆ సమయంలో సాధన చేస్తే మంత్రం #శీఘ్రసిద్ధిని, ఉత్తమ ఫలితాన్ని, సత్వర సిద్ధిని ఇస్తుంది......


గ్రహణ సమయంలో #నది వద్దగానీ, #సముద్ర తీరానికి గాని వెళ్ళి..... నదిలోనైతే బొడ్డులోతు నీళ్ళలో నిలబడి, సముద్రం వద్దనైతే తీరంలో #దర్భాసనం మీద కూర్చుని గానీ, లేదా తమ #ఇళ్లోలో గాని ఆచమనం ప్రాణాయామం చేసిన తరువాత......


✔#సంకల్పం:- 

మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ ____పరదేవతా ముద్దిస్య, శ్రీ _____పరదేవతా ప్రీత్యర్థం, ______గోత్రోద్భవస్య, ______నామధేయస్య అహం, శ్రీ ______పరదేవతా ప్రీత్యర్థం, పవిత్ర _____గ్రహణకాలే, స్పర్శాది మోక్షపర్యంతం, శ్రీ ______మంత్ర జపం కరిష్యే...


అని సంకల్పం చెప్పుకుని గ్రహణం #ప్రారంభసమయం నుండి గ్రహణం #విడిచేదాకా జపాన్ని చేయాలి..... దీనికి ముందు గ్రహణం పట్టు స్నానం - జపం తరువాత విడుపు స్నానం చెయ్యాలి..... జపం పూర్తయిన తరువాత తిరిగి మూడు సార్లు #ఆచమనం చేసి కొన్ని నీళ్ళు చేతిలో తీసుకుని......


✔#జప_సమర్పణ:- 

అనేన మయాకృతేన శ్రీ _____పరదేవతా మంత్ర జపేన, శ్రీ _____పరదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శ్రీ _____పరదేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్యర్ధం, ఏతత్ జపఫలం శ్రీ  _____పరదేవతా చరణారవిందార్పణమస్తు., తత్సత్ బ్రహ్మార్పణమస్తు.


అని ఆ నీటిని #అరివేణం (ఒక పళ్ళెం)లో విడవాలి...... అలా విడిచిన నీటిని మూడు సార్లు #తీర్థంగా తీసుకోవాలి..... ఈ విధంగా జప సమర్పణ చెయ్యాలి. దీనిని గ్రహణ పురశ్చర్య అంటారు.....


గ్రహణం పట్టినప్పటి నుండి విడిచే వరకూ ఉన్న సమయం అది 1 గంటైనా, అరగంటైనా ఆ సమయంలో చేసిన జపం (#సంఖ్యతో_పనిలేదు) 1 లక్ష జపంతో సమానం.....


కాబట్టి గ్రహణ సమయాన్ని వినియోగించుకుంటే సాధకులకు మంచిది..... గ్రహణం తరువాత రోజు లేదా మంచిరోజు పురశ్చరణలో చెప్పిన విధంగా పదివేల #హోమం, ఒక వేయి #తర్పణం, ఒక వంద #మార్జనం లేదా అభిషేకం, పది మంది #బ్రాహ్మణుల_భోజనం యథావిధిగా చేయాలి....... 


గ్రహణ జపం వల్ల కేవలం #జప_సంఖ్య మాత్రమే కలిసి వస్తుంది, హోమాది మిగతా విధులు యధాతథం.....

🌹🙏🌹


http://www.siddheswaripeetham.org/

_

సేకరణ:- వాట్సాప్ పోస్ట్.

శ్రీకాళహస్తీశ్వరమ్

 🌹శ్రీకాళహస్తీశ్వరమ్ 🌹

    

క్షితి యందు కొందరు జీవన బ్రాంతులై

          యజ్ఞాన తిమిరాన నలమటించి

కొడుకులు లేరంచు కుములుచు న్నుందురు

         ధృతరాష్ట్రునకు లేరె ! సుతులు శతము

వారిచే నేగతుల్  వసుధేశు డొందెనొ

         తెలియని విషయమా ! యిలను మనకు 

సుతులు లేనట్టి  యా శుకునకు నేవైన 

         దుర్గతుల్ కల్గెనా? భర్గ చెపుమ

'సుతులు లేకున్న నిహపర  గతులు లేవు 

ముక్తి లేద' ను మాటలు  మోసమె గద  ! 

భక్త పాలన శంకరా ! భవ విదూర !

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !            


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

శ్రీ వాల్మీకి జయంతి

 ॐ     శ్రీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. 


      వాల్మీకి మహర్షి పేరు వినగానే, వెంటనే మనకు నాలికపై  "శ్రీమద్రామాయణం" అని పలుకుతుంది. 


 ఆదికావ్యం - ప్రత్యేకత 


    శ్రీ వాల్మీకి మహర్షి, 

    బ్రహ్మదేవుని అనుగ్రహంతో, 

      రామాయణ కథా - ఆ కథలోని పాత్రల అంతరంగాలు కూడా అవగతమయ్యేలా చూచి వ్రాసినది "శ్రీమద్రామాయణం". 

    ఇదే మొదటి కావ్యం కాబట్టి "ఆదికావ్యం" అంటాం. 


   "వేద ధర్మాన్ని వివరించేదిగా" మహర్షి చెప్పండం దీని ప్రత్యేకత. 


    ఈ భూమండలం మీద "పర్వతాలూ నదులూ ఉన్నంత కాలమూ" ఈ "రామాయణ"కథ లోకంలో నడుస్తుందని 

    సాక్షాత్తూ బ్రహ్మదేవుడు వాల్మీకిమహర్షి వద్దకే వచ్చి, తెలిపి, వ్రాయమన్నాడంటే, 

    ఆ కావ్యం గొప్పదనం ఎంతదో మనకి తెలుస్తుంది. 


విజ్ఞాన సర్వస్వం 


    జీవన విధానాలు 

  - ప్రాంతాలబట్టీ వ్యత్యాసమున్నా,

  - కాలాన్నిబట్టీ మారినా, 

    అందఱికీ, అన్ని కాలాలకీ, 

   "ఆలోచన - మాట - చేతకి" సంబంధించి చక్కని ప్రవర్తనకి ఉపయోగపడే "విజ్ఞాన సర్వస్వం" శ్రీమద్రామాయణం. 


సార్వకాలీనం 


    ఏ కాలంలోనైనా, జీవన విధానాలు కాలాన్నిబట్టీ మారుతున్నా, 

   కొన్ని మౌలిక విషయాలు అత్యవసరం. వాటిలో కొన్ని ముఖ్యమైనవి 

  - దోపీడీవ్యవస్థ ఏర్పడకుండానూ, ఒకవేళ ఏర్పడతే దానిని తొలగించడానికీ "సత్య - ధర్మాలు" ముఖ్యం. 

  - ప్రకృతిని చెరిపే పర్యావరణ హానికి విరుగుడు "ప్రకృతి ఆరాధన - ఆస్వాదన". 

  - మానవీయ సంబంధాలు రాక్షస ప్రవృత్తికి దిగజారకుండా, 

   "దైవీ" సంబంధాల స్థాయికి ఎదగాలి. 

    ఈ సార్వకాలీన విషయాలు స్పష్టంగా తెలపుతూ వివరించేది రామాయణం. 


      ఇది వ్యక్తులకీ, సమూహాలకీ, ప్రకృతికీ సర్వరోగ నివారిణి. 


    "సత్యం వద - ధర్మం చర" అని చెప్పే వేదం సార్వకాలీనం. ఆ వేదధర్మాన్ని వివరించిన రామాయణం కూడా సార్వకాలీనమే కదా! 


జనబాహుళ్యంలో 


    వేదం నేర్చుకోవాలంటే, అందఱికీ సాధ్యమయ్యే పనికాదు. 

    అందుకనే వేదాన్ని వివరిస్తూ, వేద ధర్మాన్ని  సర్వులకూ రామాయణం తెలుపుతుంది. 

         (వేదోపబృంహణం) 

     దానివలన, వేద ధర్మంగా రామాయణం పండితులకే కాక, పామరులందఱికీ కూడా సులువుగా అర్థమవుతూ, ఆచరించవలసిన, విసర్జించవలసిన విషయాలని చక్కటి విధానంలో తెలియజేస్తుంది. 


విశ్వ ప్రయోగశాల - ప్రయోగదీపిక 


      ఏఏ పనులు చేస్తే - వాటి పర్యవసానాలు ఏఏ విధంగా ఉంటాయో తెలిపే "ప్రయోగ దీపిక"యే శ్రీమద్రామాయణం. 


      "ప్రపంచమ"నే ప్రయోగశాలలో, "జీవితం" అనే ప్రయోగం చేస్తున్న మానవులందఱికీ ప్రయోగ దీపిక (manual)గా అన్ని సమయాలలోనూ అవుసరమైనది "శ్రీమద్రామాయణం". 


రచయిత - రాయల్టీ 


        ప్రస్తుత కాలంలో, ఏ పుస్తకమైనా వ్రాసిన రచయితకి అమ్మకం ద్వారా "రాయల్టీ" లభించడం చూస్తూంటాం.

        కానీ సృష్టికర్త తాను ఎన్నుకొని, సమస్తమానవాళికి సుఖశాంతులని అందించే గ్రంథ -  రచయితగా "కారణ జన్ముడైన" వాల్మీకి మహర్షిని ఆదేశించారు. 

    

    ఆ గ్రంథాన్ని అవగతం చేసికొంటూ, మనం "శ్రీరాముడు"గా అయి, మనలోని "రావణు"ని అంతం చేయడమే

  - వాల్మీకి మహర్షికి మనం ఇచ్చే "రాయల్టీ" 


        అదే వాల్మీకి జయంతి మనకి అందిచ్చే సందేశం. 


వందే వాల్మీకి కోకిలమ్ 


కూజంతం రామరామేతి 

          మధురం మధురాక్షరం I 

ఆరుహ్య కవితాశాఖాం 

            వన్దే వాల్మీకి కోకిలమ్॥ 


  - కవిత్వం అనే కొమ్మపై ఎక్కి, 

  -"రామరామ" అనే మధురాతిమధురమైన అక్షరాలను కూయు, 

  - వాల్మీకి అనే కోకిలకు వందనము. 


  (కోకిల అంటే 

    "క్రోకతి శ్రోతుచిత్తం లాతీతి కోకిలః" 

    - వినేవారి చెవులను ఆకర్షించేది)


                    =x=x=x=


      — రామాయణం శర్మ

               భద్రాచలం

గ్రహణ కాలమందు

*గ్రహణ కాలమందు మంత్ర పురశ్చరణము, దీక్షలు,ఆచరించవలసిన నియమాలు...*


శ్లో ll చంద్ర సూర్యగ్రహే తీర్దే మహా పర్వాదికే తథా మంత్ర దీక్షాం ప్రకుర్వాణో మాపర్ క్షాదీన్న శోధయేత్ ॥


తాత్పర్యము : చంద్ర సూర్య గ్రహణ కాలమందును, తీర్ధమందును,

మహాపర్వము మొదలగువాటి యందును మంత్రపురశ్చరణ దీక్షను గాని ఉప లక్షణములచే మంత్రోపదేశమును చేయువారికి మాస నక్షత్రాది (ముహూర్తము)  శోధన అక్కరలేదు. దీక్షాక్రమమును మంత్ర శాస్త్రోక్త ప్రకారముగ తెలియవలెను. 


శ్లో॥ యుగేయుగే తు దీక్షాసీ దుపదేశః కలౌయుగే చంద్రసూర్యగ్ర హేతీర్ధే సిద్ద క్షేత్రే శివాలయే మంత్రమాత్ర ప్రకథన ముపదేశస్య ఉచ్యతే ॥


తాత్పర్యము : ప్రతి యుగమందును మంత్రోపదేశము దీక్షారూపమై అనేక నియమములు కలిగి యుండును. కలియుగమందు మాత్రమే మంత్రోపదేశమే అయిఉండును. అదియును సూర్యచంద్ర గ్రహణములలో తీరమందును, సిద్ధక్షేత్రమందును, శివాలయమందును చేయవలయును.


మంత్రగ్రహణ విషయమై సూర్యగ్రహణమే ముఖ్యము చంద్ర గ్రహణమైనచో దారిద్ర్యాది దోషములు కలవని కొందరి వచనము.


మంత్ర పురశ్చరణ లేక జప నియమములు :


శ్లో॥ చంద్ర సూర్యోపరాగేచ స్నాత్వా పూర్వ ముపోషితః స్పర్శాది మోక్ష పర్యంతం జపేన్మంత్రం సమాహితః జపాద్దశాంశతో హోమస్తథా హోమాచ్చ తర్పణం హోమాశక్తౌ జపం కుర్యా ద్దోమ సంఖ్యా చతుర్గుణం || 


తాత్పర్యము : చంద్ర సూర్య గ్రహణ దినమందు భోజనము విడచి స్పర్శ  కాకముందే స్నానము చేసి అది మొదలుకొని శుద్ధమోక్ష మగునంతవరకు మంత్రమును ఏకాగ్రతతో జపించవలయును. అట్టి జపసంఖ్యకు పదియవ వంతు  హోమమును, దానికి పదియవ వంతు తర్పణమును చేయవలెను. హోమము చేయలేని ఎడల దాని సంఖ్యకు (నాలుగు రెట్లు)  చతుర్గుణముగ జపమే చేయవచ్చును. 


 తర్పణములు వదలునప్పుడు మూలమంత్రము ఉచ్చరించి మంత్ర దేవత నామమును ద్వితీయాంతముగ ఉచ్చరించి (దేవత పేరు) ....... దేవతాం తర్పయామి" (యవలతో కూడిన )  యవాదులతో కూడిన జలము దోసిలితో అర్పించవలయును. ఇట్లు నమశ్శబ్దమంతమగునట్లు మూలమంత్రము ఉచ్చరించి "....... దేవతా మహమభిషించామి" అని తన శిరస్సుయందు చల్లుకొనుచు మార్జనము తర్పణమునకు పదియవ భాగము చేయవలయును. మార్జన సంఖ్యకు దశమ భాగము బ్రాహ్మణ భోజనము. ఇట్లు జపహోమ తర్పణమార్జన, విప్ర భోజనమను అయిదు భాగములు కలది పురశ్చరణము. 'తర్పణముల'లో ఏదైన సంభవించని ఎడల అనగా చేయలేని ఎడల దాని సంఖ్యకు(నాలుగు రెట్లు ) చతుర్గుణము జపమే చేయవలయును. ఇట్టి పురశ్చరణము గ్రస్తోదయము, గ్రస్తాస్తమయము లందు అవసరము లేదు. పురశ్చరణాంగమైన ఉపవాసము పుత్రవంతుడైన గృహస్థు చేయ వచ్చును. పురశ్చరణ చేయువానికి స్నాన, దానాది నైమిత్తిక లోపముచే (పాపము) 'ప్రత్యవాయము కలుగును. కనుక అవి భార్యా పుత్రుడు మొదలగు ప్రతినిధులచే చేయించవలెను.


పురశ్చరణ చేయు విధానము :


 స్పర్శకు ముందే స్నానము, ఆసనము వేసుకొని (గోత్రము చెప్పవలయును)..... గోత్రో .......(పేరు చెప్పవలయును)..... శర్మాహం రాహుగ్రస్తే దివాకరే నిశాకరే వా "......... దేవతాయా....... మంత్రసిద్ది కామోగ్రాసాది ముక్తి పర్యంత .......మంత్రస్య జపరూపం పురశ్చరణం కరిష్యే" అని సంకల్పము చెప్పుకొని స్పర్శ మొదలుకొని మోక్ష పర్యంతము జపము చేయవలయును. ఆపైన పర దినమందు స్నానాది నిత్యకర్మలు చేసి "........ మంత్రస్య కృతై తద్గ్రహణ కాలికా...... సంఖ్యా జప సాంగతా సిద్ధ్యర్థం తర్దశాంగ హోమ తద్దశ్శాంశాంశ మార్జన తద్దశాంశ విప్ర భోజనాని కరిష్యే" అని సంకల్పించి హోమాదులైనను, తత్ చతుర్గుణ మంత్ర జపమైననూ చేయ వలయును. ప్రతినిధిగా ( నియమింపబడిన) ప్రేరణ చేయబడిన పుత్రాదులు గ్రహణ కాలమందే "...... గోత్రస్య........ శర్మణో గ్రహస్పర్శ స్నాన ప్రయుక్త శ్రేయః ప్రాప్త్యర్థం స్పర్శ స్నానం కరిష్యే" అని సంకల్పము చెప్పుకొని స్నాన దానాదికము చేయవలెను. పురశ్చరణ చేయనివారును తమతమ ఇష్ట దేవతా మంత్రజపమును గాయత్రి మంత్ర జపమును తప్పక చేయ వలయును. లేనిచో మంత్రమునకు మాలిన్యమగును.


గ్రహణకాలమందు శయనించినచో రోగము, మూత్రము విడిచినచో దారిద్ర్యము, (మలము) పురీషము విడిచినచో (పురుగు) కృమి జన్మము, మైథునము చేసినచో ఊరపంది జన్మము, (తలంటు స్నానము) అభ్యంగము జేసికొనినచో కుష్టురోగము, భోజనము చేసిన నరకము వచ్చును. గ్రహణమునకు ముందు వండిన అన్నము గ్రహణము తరువాత భుజింపకూడదు. గ్రహణకాల స్థితమైన జలమును త్రాగినచో (పాపము) పాదకృచ్చ్ర ము. కనుక త్రాగరాదు. మీగడ, మజ్జిగ, తైల పక్వము క్షీరము పూర్వ సిద్ధమైననూ గ్రహణము తరువాత గ్రహించవచ్చును. కానీ గ్రహణ కాలమందు వాటిలో దర్భముక్కను వేయవలయును.


- ధర్మ సింధు గ్రంధం ప్రకారం


*బ్రాహ్మణ చైతన్య వేదిక*

Cheating

 



ఇది మీ పరిచయాలు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ చేరే వరకు ఫార్వార్డ్ చేస్తూ ఉండండి

Please see the photo


 

ఎవరి ఆత్మను వారే ఉధ్ధరించుకోవాలి.

 శు భో ద యం🙏


కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ 

జీవన భ్రాంతులై

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్

వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!

చెడునే మోక్షపదంబ పుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు.

వేదోక్త కర్మలు చేసేవారు, జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ... సాధన చేసేవారూ, పిల్లలున్నా, 

లేకున్నా వారి వారి సత్కర్మలవలన వారు ఉద్ధారింపబడతారు. 


పాపులు, దుష్కర్మలు చేసినవారు, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యం తోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మల తోనో, పిండ ప్రదానాల తోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప పిల్లలు లేరని నరకం లేదు.


మనకు భగవద్భక్తి లేక సాధన చేయక పోతే దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే నరకమే. 


తన జ్ఞానం వల్లనే, తను చేసిన విహిత కార్యాల వల్లనే, సాధన వల్లనే...

సద్గతి అదే శాస్త్రం...


శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది...


పుత్రులు ఆరు రకాలు.


1. ఔరసుడు, 

2. దత్తకుడు, 

3. కృత్రిముడు, 

4. గూఢోత్పన్నుడు, 

5. అపవిధ్ధుడు, 

6. క్షేత్రజుడు. 


వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది. 


ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు...


1. కానీనుడు, 

2. సహోఢుడు, 

3. క్రీతుడు, 

4. పౌనర్భవుడు, 

5. స్వయందత్తుడు, 

6. జ్ఞాతుడు. 


వీరు కూడా పుత్ర సమానులే కాని, 

వీరికి రాజ్యాధికారము కాని, 

ఆస్తిలో భాగము కాని లేదు. 


మనుమడు, 

కూతురు,

కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు. 


అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి, 

అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము. 


కాబట్టి ఒకరికి...

కొడుకు లేడు.

అని బాధ పడ వలదు.


యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా...

అవి ఆ తండ్రికి అందుతాయి.


ఈ ప్రాపంచిక జీవనమును జీవన ప్రవృత్తి నను సరించి ఆలోచింతురు. 


తమకు పరలోకమున ఉత్తమ,గతులు లభించుటకు...

పుత్రులు కావలయు నను కొందరు... 


తమకు పుత్రులు కలగని వారు...

అయ్యో మాకు పుత్రులు కలుగ లేదు, 


మాకు ఎట్లు ఉత్తమ,గతులు కలుగును.

అని ఏడ్చు  చుందురు. 


కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది...

పుత్రులు కలిగినను వారి మూలమున అతడు...

ఏ ఉత్తమ లోకములు పొంద గలిగెను? 


బ్రహ్మచారిగనే యుండి సంతతి యే లేకున్న శుకునకు దుర్గతి ఏమయిన కలిగెనా?


కనుక పుత్రులు లేని వానికి మోక్షపదము లభించక పోదు...


పుత్రులు కల వారికి ఉత్తమ,గతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును.


పుత్రులు లేని వారికి,ని అవి రెండు ను సిద్దించనూ వచ్చును.


కావున కొడుకులు లేరు.

అని ఎవరూ బాధ పడ వలదు.


మన పుణ్యం మనం సంపాదించు కోవాలి.

మన ఉద్ధారం కోసం...

మనమే పాటు పడాలి.


మనకు ఆ వేంకటేశుని దయవలన 

ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై మనం  ఉత్తమ,గతులు సాధించు గాక...


ఉధ్ధరేధాత్మనాత్మానాం


ఎవరి ఆత్మను వారే ఉధ్ధరించుకోవాలి.


🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


కళ్ళుపోయిన బాధను తట్టుకోలేక చ్యవనుడు క్రుద్ధుడయ్యాడు. ఆ క్షణంలోనే రాజ సైనికులకూ

పరివారానికీ గణాశ్వాలకూ శకృన్మూత్రనిర్బంధం అయిపోయింది. శర్యాతికీ అవి బంధించాయి. భరించలేని

ఇబ్బంది. అలాగే రాజధానికి చేరుకున్నాడు. ఏమి జరిగింది? ఎవరు ఎవరికి ఏమి అపకారం చేశారు?

సైనికులను పిలిచి ఆరాతీశాడు. వాళ్ళు చెప్పారు. సరోవరానికి దగ్గరలోనే చ్యవనుడు తపస్సు

చేసుకుంటున్నాడు, బహుశ మనవాళ్ళల్లో ఎవరో అతడికి ఏదో అపకారం చెయ్యడమో అవహేళన

చెయ్యడమో జరిగి ఉంటుంది. ఆ తపస్వి కోపించి మనందరికీ మలమూత్ర బంధనం చేసి ఉంటాడు-

(అధ్యాయం-2, శ్లోకాలు 65)

అని.శర్యాతి ఇంకా విచారణ కొనసాగిస్తున్నాడు. అందరూ మాకు తెలియదంటే మాకు

తెలియదంటున్నారు. సైనికులకు రాజుగారికి గజాశ్వాలకూ శకృన్మూత్రాలు అవ్వడం లేదు. ఇదంతా

గమనించిన సుకన్య తండ్రి దగ్గరికి వెళ్ళి పుట్టరంధ్రాలలో తాను పొడిచిన సంగతి, పొడిచిన పుల్లకొనకు

తేమఅంటిన సంగతి, నీరసంగా హాహాకారాలు వినిపించిన సంగతి చెప్పి, ఆ పుట్టలో ఎవరు ఉన్నారో ఏమి

జరిగిందో మాత్రం నాకు తెలియదని అమాయికంగా విన్నవించింది.

రాజుకి విషయం అర్థమయ్యింది. వెంటనే పుట్టను చేరుకున్నాడు. దుఃఖిస్తున్న చ్యవనుడు

రంధ్రాలనుంచి కనిపించాడు. మెల్లగా వల్మీకాన్ని పగులగొట్టించాడు శర్యాతి. సాష్టాంగపడ్డాడు. వినయంగా

నమస్కరించి నిలిచి స్తుతించాడు. అజ్ఞానంవల్ల మా అమ్మాయి మీకు తీరని అపకారం చేసింది. క్షమించండి 

మహామునీశ్వరులకు క్రోధం ఉండదని విన్నాను. అమాయికురాలు, చిన్నపిల్ల, మా సుకన్యను క్షమించుము 

అనిప్రాధేయపడ్డాడు.

అక్రోధవా హి మునయః భవంతీతి మయా శ్రుతమ్ ।

తస్మాత్ త్వమపి బాలాయాః క్షంతు మర్హసి సాంప్రతమ్ (3 - 11)

వాల్మీకి మహర్షి జయంతి

 🌹వాల్మీకి మహర్షి జయంతి 🌹


పామరువోలె బుట్టి బహు 

         పాపము లెన్నియొ  నాచరించియున్ 

నీమము తోడ నారదుని 

         నెయ్యపు పల్కుల నాలకించి , యా

రాముని నామమున్ మదిని 

         రంజిల బల్కియు పుట్టలోపలన్,  సు 

త్రాములు మెచ్ఛ మౌనివయి 

         రామకథన్ రచియించి నావు , నీ

నామము దల్చియున్ మదిని        

        యాదికవీ !  నిను గొల్తు నిచ్చలన్ .   


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

పారిజాతాపహరణం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 ముద్దు పలుకుల ముక్కు తిమ్మన రచించిన మనోహరమైన కావ్యం పారిజాతాపహరణం. నారదుడు కానుకగా ఇచ్చిన పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడు తన చెంతనే ఉన్న పట్టపురాణి రుక్మిణికి కానుకగా ఇస్తాడు. ఆ విషయం మరో పట్టపురాణి సత్యభామకు చెలికత్తె ద్వారా తెలుస్తుంది. అప్పుడేమయిందో, తిమ్మన ఎంత సొగసుగా చెప్పాడో అంతే సొగసుగా ఆచార్య వేణు గారి మాటల్లో వినండి. అసలు ఈ కావ్యాన్ని తిమ్మన ఎందుకు రచించాడన్నది కూడా తెలుసుకోవాలి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

Kidney saver


 

కలిగెనిదె నాకు కైవల్యము

 గానము: ప్రియ*సిస్టర్స్ 


కలిగెనిదె నాకు కైవల్యము

తొలుతనెవ్వరికి దొరకనిది


జయపురుషోత్తమ జయ పీతాంబర

జయజయ కరుణాజలనిధి

దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా

క్రియ యిది నీదివ్యకీర్తనమే


శరణము గోవింద శరణము కేశవ

శరణు శరణు శ్రీజనార్ధన

పరమ మెఱంగను భక్తి యెఱంగను

నిరతము నాగతి నీదాస్యమే


నమో నారాయణా నమో లక్ష్మీపతి

నమో పుండరీకనయనా

అమిత శ్రీవేంకటాధిప యిదె నా

క్రమమెల్లను నీకయింకర్యమే

హద్దు

 *హద్దు* 


నీలాలా నింగి రేరాజు 

కొలను అలలపై కదలాడినవేళ

కలువ కన్నె రెక్కలు 

నీటనే విప్పుతుందే తప్ప 

 నింగికి చేరలేదేమి?


ముప్పిరిన మేఘమాలలు 

 వేసే పందిళ్ళను చూసి   

మురిసిన మయూరాలు  

 పురివిప్పినాట్యమాడేను 

నింగికెగిరి అందుకోలేదేమి?

 

మావి చిగురపల్లవాల వసంతానికి

పరవశించి కోయిలరాగాలు పలుకునే కాని

వసంతాన్ని నిలువరించలేదేమి?

 

నిత్యం ఉవ్వెత్తున ఎగిసే కెరటాలు

 చెలియల కట్ట దాటెరుగవేమి మనసుపట్టు తప్పిపరవశిస్తుంది అందుబాటులో వున్నా

అందుకోలేని అందమైన హద్దు సాంప్రదాయమై ఒద్దికగా గుర్తు చేస్తుంటుంది.

ప్రకృతిలోనే ఎన్నెన్ని  హద్దులు

హద్దులెప్పుడు అందము?అవసరమూ!?.


 *లలితా భాస్కర దేవ్* 

 27-10-2023

త్వమేవ శరణం

 త్వమేవ శరణం త్వమేవ శరణం

కమలోదర శ్రీజగన్నాథా

॥త్వమేవ॥


వాసుదేవ కృష్ణ వామన నరసింహ

శ్రీసతీశ సరసిజనేత్రా

భూసురవల్లభ పురుషోత్తమ పీత-

కౌశేయవసన జగన్నాథా

॥త్వమేవ॥


బలభద్రానుజ పరమపురుష దుగ్ధ-

జలధివిహార కుంజరవరద

సులభ సుభద్రాసుముఖ సురేస్వర

కలిదోషహరణ జగన్నాథా

॥త్వమేవ॥


వటపత్రశయన భువనపాలన జంతు-

ఘటకారకరణ శృంగారాధిపా

పటుతర నిత్యవైభవరాయ తిరువేం-

కటగిరినిలయ జగన్నాథా

॥త్వమేవ॥


              - తాళ్ళపాక అన్నమాచార్యులు

      గానం - శ్రీ డి పశుపతి

Praana pratista


 

శ్రీ వాల్మీకి జయన్తి 卐

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*ॐ 28/10/2023 - శ్రీ వాల్మీకి జయన్తి 卐*

                   ~~~~~~


    *ఆదికవి వాల్మీకి మహర్షి*                 


మహా పుణ్య కవి , రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు . వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపా, పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు, తన రామాయణ ఇతి మానవుడు రచించిన తొలి గ్రంథము, చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం చెప్పడమే కాకుండా కథనం మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు.  సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందింది. హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది.


వాల్మీకి గొప్ప మహర్షి, తపఃశాలి. ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్నే భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు.

రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది.


ఆ కథనం ప్రకారం వాల్మీకికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . ఆయన తన కుటుంబాన్ని పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారుల సొత్తును దోచుకుని జీవితం గడిపేవారు. ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ….. కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ప్రశ్నిస్తారు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు. నారదుడు రామనామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తారు.


ఉపదేశం తర్వాత ఆయన జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధి లోకి వెళ్ళిపోయారు చుట్టూ చీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తారు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా వాల్మీకి అనే పేరుతో పిలుస్తాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యారు. తపఃసంపన్నత తర్వాత వాల్మీకి ఆశ్రమవాసం చేయసాగారు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలకు జన్మనిచ్చినట్లూ..తెలుస్తుంది.


యోగవాశిష్టము అనే యోగా, ధ్యానముల గురించిన సంపూర్ణణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు.ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే.

రాముడు పది-పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై, మానసిక ధౌర్భల్యమునకు గురి అయిన ప్పుడు వశిస్టుడి ద్వారాయోగా, ధ్యానములను శ్రీరాముడికి బోధించారు వ్రాసింది. వాల్మీకిమహర్షి, పలికింది, బోధించింది వశిస్టుడు,అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది.


ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే. కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు వాల్మీకియే. మహర్షివాల్మీకి “వాల్మీకి మతము” అనే దానిని నెలకొల్పారు.


భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ రామాయణ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము.


24,000 శ్లోకము లతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు- భక్తుడు – వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

అటువంటి సుందర కావ్యాన్ని చదివేముందు మనం వాల్మీక మహర్షిని స్మరించుకోవాలని పండితులు ఆయనను ఎంత అందంగా అనుభూతిస్తారో చూడండి.


*కూజంతం రామ రామేతి I మధురమ్ మధురాక్షరమ్ II*

*ఆరుహ్య కవితా శాఖాం I వందే వాల్మీకి కోకిలమ్ II*


కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని, వాల్మీకి అనే కవికోకిల, మధురమూ మధురాక్షరమూ అయిన రామనామాన్ని పాడుతోందట! ఎంత సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో!


ఈ స్లోకంలో ఆదికవి వాల్మీక మహరిషి ని కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని రామాయణ పారాయణ చేసిన “కవికోకిల” గా వర్ణించారు పండితులు


ఈ శ్లోకంలో కవిత్వమనే పెద్దచెట్టుకు వాడిన “ఆరూహ్య ” పదం అద్భుతం.


రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు.


రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం.


ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది.

వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు.


శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది.


ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.


*మనకు ప్రామాణికతను అందించిన ఆదికవి వాల్మీకి మహఋషిని మనసారా స్మరించుకుందాం.*


🙏🏻 *శ్రీరామ జయరామ జయ జయ రామ* 🙏🏻


🚩 *స్వస్తి* 🚩

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

Chandra grahanam


 

నవగ్రహా పురాణం🪐* . *67వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *67వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*చంద్రగ్రహ చరిత్ర - 5*


*"రోహిణీ , నువ్వు వేశ్యలాగా ప్రవర్తిస్తున్నావు. చివరి సారిగా హెచ్చరిస్తున్నాను. పత్నులుగా మాకున్న అధికారాన్ని..."*


*"అపహరించానా ? అలాగే అనుకుని ఏడుస్తూ కూర్చోండి. వెళ్ళండి !"* రోహిణి తలుపుల్ని దభాలున మూసివేసింది.


అశ్వినిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఆమె ముఖం ఎర్రబారింది. శరీరం వణుకుతోంది. మూసిన తలుపు వైపు ఆమె కదలబోయింది.


తలుపు తటాలున తెరుచుకుంది. ద్వారానికి అటు వైపున చంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.


అతని కళ్ళు ఆగ్రహాన్ని చిమ్ముతున్నాయి. *"యుద్ధానికి వచ్చారా ? విజయం దక్కదు మీకు. రోహిణి నా ఇష్ట సఖి. రోహిణి కోసమే మీ గుంపును అంగీకరించాను. రోహిణి వల్లే మీకు ఈ మందిరంలో ప్రవేశం లభించింది. మీ పాదపూజలూ , పుష్పార్చనలు నా మీద పనిచేయవు !"* చంద్రుడు కోపంగా అని క్షణకాలం ఆగి అశ్విని ముఖంలోకి తీక్షణంగా చూశాడు. *"నా రోహిణిని నువ్వు అన్న మాటలన్నీ విన్నాను. ఆమె నా పట్టపురాణి. ఈ మందిరంలో ఉండాలనుకుంటే అందరూ మీరందరూ పరిచారికలుగా ఉండండి. నాకు , రోహిణికి సేవ చేస్తూ పడిఉండండి. వెళ్ళండి !".*


తన హెచ్చరిక ముగించి చంద్రుడు ఆవలికి జరిగాడు. అంతసేపూ చాటులో నిలుచున్న రోహిణి ముందుకు వచ్చి , తలుపుల్ని రెండుచేతుల్తో పట్టుకుంది. చంద్రుడు ఆమె వెనుకకు జరిగి ఆమె భుజాల మీద రెండు చేతుల్ని వేశాడు.


రోహిణి విశాల నేత్రాలు అహంకారానికి పట్టిన భూతద్దాల్లా , అక్కచెల్లెళ్ళ ముఖాలను కలయజూశాయి. వాళ్ళని పరిహసిస్తున్న చిరునవ్వు ఆమె పెదాల మీద నాట్యం చేస్తోంది. రోహిణి చేతులు కదిలాయి. తలుపులు మూసుకున్నాయి. శబ్దం చేస్తూ , అశ్విని మందిరంలోంచి బైటికి నడిచింది , చెల్లెళ్ళతో బాటు.


దక్షప్రజాపతి , ప్రసూతి నోట మాట లేకుండా , నిర్ఘాంతపోతూ విన్నారు. ఇరవై ఆరుగురు పుత్రికలూ గద్గదకంఠాలతో చెప్తున్న సంగతులు వాళ్ళ హృదయాలను కలిచి వేస్తున్నాయి. దక్షప్రజాపతి ముఖం జేవురించింది. దవడలు అదురుతున్నాయి.


*"అల్లుడు సరే ! మీ అందరికీ కొత్త రోహిణి ఎందుకలా ప్రవర్తిస్తోంది ? చిన్ననాటి నుండి మీతో తనకు ఉన్న చెలిమిని ఏం చేసిందది ?"* ప్రసూతి అంది.


*"వాళ్ళిద్దరికీ సపర్యలు చేసే పరిచారికలుగా మీరు మమ్మల్ని అక్కడికి పంపలేదు. ఆ మందిరంలోంచి నిషేధించబడితే ఆ స్వార్ధ దంపతుల సేవ ఎందుకు ? తల్లిదండ్రులు పాదాలు సేవించుకుంటూ ఇక్కడే ఉంటాం !"* అశ్విని అంది.


*"స్వామీ...పరిష్కారం ఆలోచించండి !"* ప్రసూతి దక్షప్రజాపతితో అంది. 


*"నా కన్నబిడ్డలకు జరిగిన అవమానం నన్ను దహించివేస్తోంది. కానీ ఆవేశం సమస్యను జటిలతరం చేస్తుంది. సంయమనంతో మన బిడ్డల కాపురాన్ని చక్కదిద్దాలి."* దక్షుడు ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ అన్నాడు. *“పిల్లలు నిరాదరణతో , అవమానంతో అలసిపోయి ఉన్నారు. కొన్ని రోజులు ఇక్కడ విశ్రాంతిగా ఉంటారు. ఆ తరువాత స్వయంగా వెళ్ళి , రోహిణిని మందలించి , చంద్రుడికి హితవు చెప్పి వస్తాను.”*


*"నీ సోదరీమణులు ఏరి తల్లీ ?"* చంద్ర మందిరంలోనికి వచ్చిన నారదుడు , నమస్కరించిన రోహిణిని ఆశీర్వదించి , ప్రశ్నించాడు.


రోహిణి కళ్ళల్లో దోబూచులాడి , క్షణంలో అంతర్థానమైన అనుమానం నారద మహర్షి దృష్టి నుండి తప్పించుకోలేకపోయింది.


*"వాళ్ళు... మా పుట్టింటికి వెళ్ళారు."* రోహిణి మెల్లగా అంది. *"నిన్ను ఒక్కదాన్నే వదిలిపెట్టి అందరూ వెళ్ళి పోయారా ?"* నారదుడు అడిగాడు. *“వాళ్ళు వెళ్ళిన కారణమేమిటమ్మా ? అలుకా ? ఆగ్రహమా ?”*


అడగకూడని ప్రశ్నలు అడుగుతున్న నారదుడిని రోహిణీ ఇబ్బందిగా చూసింది. *“నమస్కారాలు మహర్షీ !”* అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రుడు అభివాదం చేస్తూ అన్నాడు. *“అలకలూ , ఆగ్రహాలు అందగత్తెలు అన్ని వేళలా ధరించే అలంకారాలే కదా ! కానీ దక్షపుత్రికలు తమ తల్లిదండ్రులను దర్శించడానికి వెళ్ళారు."*


*"గిలిగింతలు పెట్టే సమాధానం. ఇరవై ఏడుమంది అందగత్తెల అలుకలనూ , ఆగ్రహాలను అనుభవిస్తూ ఆనందం అనుభవించే అదృష్టం నీదే. వస్తాను - బృహస్పతి ఆశ్రమానికి వెళ్తూ దారిలోనే కదా అని నీ మందిరానికి వచ్చాను. నీ వివాహానికి సూత్రధారిని. మీ సుఖాలూ , సంతోషాలు చూడాల్సిన వాణ్ణి."* అంటూ నారదుడు ద్వారం వైపు వెళ్తున్నాడు. ఆయన మెడలోంచి వేళ్ళాడుతున్న 'మహతి'. ఆయన అంగుళీ స్పర్శతో 'నారాయణ ! నారాయణ' అంటోంది. 


నారదుడి వీపునే చూస్తూ చంద్రుడూ , రోహిణి ఒకేసారి తేలికగా నిట్టూర్చారు.


ఇరవై ఆరుగురు పుత్రికలనూ వెంట బెట్టుకుని అకస్మాత్తుగా వచ్చిన దక్షప్రజాపతిని చూసి , చంద్రుడు కొద్దిగా కలవరపడ్డాడు. రోహిణి ఆందోళనలో మునిగిపోయింది. ఆసనం మీద ఠీవిగా కూర్చున్న దక్షప్రజాపతి వెనుక ఇరవై ఆరుగురు పుత్రికలు నిలుచున్నారు. రోహిణి చంద్రుడి సమీపాన నిలుచుంది.


చంద్రా ! నేను పది మంది పుత్రికలను ధర్ముడికి కన్యాదానం చేశాను. త్రయోదశ కన్యలను కశ్యపుడికి భార్యలుగా ఇచ్చాను. నీ వంశాన్ని గౌరవించి , నీ చక్కదనాన్ని అభిమానించి చక్కని చుక్కలైన ఇరవై ఏడుగురు పుత్రికలను పత్నులుగా బహూకరించాను. కానీ , నీవు ధర్మం తప్పి చరించావు. పరస్త్రీని దగ్గర చేర్చుకోవడం అపరాధం. అలాగే స్వపత్నిని దూరంగా ఉంచడం కూడా అపరాధమే !"* చంద్రుడికి ఆలోచించుకునే అవకాశం ఇస్తున్నట్టు ఆగాడు దక్షుడు. 


తన పరదారా ప్రణయ ప్రసంగం వినగానే చంద్రుడు తలవాల్చుకున్నాడు. దక్షుడు ఇలా అన్నాడు.


*"వివాహానికి ముందు గురుపత్ని తారతో నీవు పారడారికం నెరపావు. పాపం. చేశావు. నీ భార్యలుగా రూపొంది నీకే తమను అంకింతం చేసుకున్న అశ్వినినీ , ఆమె చెల్లెళ్ళను పరిచారికలుగా చూస్తూ చేరదీయకుండా దూరంగా ఉంచావు. మళ్ళీ పాపం చేస్తున్నావు. మామ అయిన నేను నీకు పితృసమానుడిని. నీ అపరాధాన్ని క్షమించి నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. దక్షపుత్రికలందరినీ సమదృష్టితో దక్షతతో ఏలుకో. నీ అనురాగాన్ని ఒక్క రోహిణికే కైంకర్యం చేయవద్దు. అందరికీ పంచు !"* తన ప్రసంగం ముగించి దక్షుడు పైకి లేచాడు.


*"అమ్మా అశ్వినీ , మీరందరూ మీ మీ ఉపగృహాలకు వెళ్ళండి. మీ భర్త మిమ్మల్ని ఆదరిస్తాడు !"* దక్షుడు పుత్రికలతో అన్నాడు.


దక్షపుత్రికలు ఆనందబాష్పాలతో తమ తండ్రి వైపు చూసి , వెళ్ళారు. *"ఆత్రేయా ! నీ సమాధానం కావాలి నాకు ,"* అన్నాడు దక్షుడు , మౌనంగా ఉన్న చంద్రుడిని చూస్తూ.


చంద్రుడు రెప్పలెత్తి మామగారి ముఖంలోకి చూశాడు. దక్షుడు తీక్షణంగా చూశాడు.


*"నీ అపరాధాన్ని క్షమిస్తున్నాను. పునరావృతం కాకుండా చూసుకో. మరొక్కసారి అపరాధం చేసిన అల్లుడికి ఈ దక్షుడు అరణంగా ఇచ్చేది దారుణ శాపమే. గ్రహించావు కదా ?"*


గ్రహించినట్టుగా చంద్రుడు మౌనంగా తలపంకించాడు. దక్షుని చూపులు తలవాల్చుకుని నిలుచున్న రోహిణి మీద వాలాయి. *“రోహిణీ ! ఒకసారి నీ మందిరానికి పదా!"*


తండ్రి ఆజ్ఞ రోహిణిని నిలుచున్న చోటు నుండి కదిల్చింది. దక్షుడు ఆమె వెంట గంభీరంగా అడుగులు వేశాడు.


తలుపుల్ని మూసి , రోహిణీ తండ్రి వైపు తిరిగి మౌనంగా చూసింది.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 77*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 77*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఒక రోజు శ్రీరామకృష్ణులు తమ ఇష్టమంత్రమయిన రామనామ మంత్ర దీక్షను నరేంద్రునికి అనుగ్రహించారు. అతి చిన్నతనం నుండే శ్రీరాముని పట్ల కలిగివున్న భక్తిప్రపత్తులు, శ్రీరామకృష్ణులు అనుగ్రహించిన మంత్ర శక్తితో అతడిలో ద్విగుణీకృతమయినాయి. అతడు ఆనందపారవశ్యంలో 'రామ, రామ' అంటూ ఉచ్చరిస్తూ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు. సమయం గడిచేకొద్దీ అతడి కంఠస్వరం తీవ్రస్థాయికి చేరసాగింది. ఆ పరిస్థితిని చూసినవారు అతణ్ణి సమీపించడానికే భయపడ్డారు.


 'రామ రామ' అంటూ గంటల తరబడి ఉచ్చరిస్తూ ప్రదక్షిణలు చేయడం చూసి ఈ సంగతి శ్రీరామకృష్ణులకు తెలియపరిచారు. అందుకు ఆయన, "అతణ్ణి అలాగే వదలిపెట్టండి. త్వరలోనే మామూలు స్థితిలోకి వస్తాడు" అన్నారు. కొన్ని గంటలు గడచిపోయాక కూడా అతడు మామూలు స్థితిలోకి రాకపోవడంతో శ్రీరామకృష్ణులు అతణ్ణి తమ వద్దకు తోడ్కొని రమ్మన్నారు. కాని ఎవరూ నరేంద్రుణ్ణి ఆపలేకపోయారు. 

 

చివరికి ఒక వ్యక్తి బలవంతంగా అతణ్ణి పట్టుకొని ఎలాగో గురుదేవుల వద్దకు తోడ్కొని వెళ్లగలిగాడు. పిదప శ్రీరామకృష్ణులు క్రమక్రమంగా అతణ్ణి మామూలు స్థితిలోకి తీసుకు రాగలిగారు. తరువాత అతడితో, "నాయనా, నరేంద్రా! ఎందుకింతగా ఆర్భాటం చేస్తావు? ఇదంతా నిష్ప్రయోజనం. ఈ ఒక్క రాత్రి నువ్వు ఏ రీతిలో గడిపావో, నా జీవితంలో పన్నెండేళ్లు అలా గడిచాయి. ఒక భయంకరమైన తుపానులా వచ్చి వెళ్లిపోయింది. ఒక్క రాత్రిలో నువ్వు ఏం సాధించగలవు, నాయనా!" అని చెప్పి, అతణ్ణి సాంత్వనపరిచారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 67*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 67*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా*

*గిరీశే నోదస్తం ముహు    రధరపానాకులతయా |*

*కరగ్రాహ్యం శంభో ర్ముఖముకురవృన్తం గిరిసుతే*

*కథంకారం బ్రూమ స్తవ చుబుక మౌపమ్యరహితమ్ ‖*


*అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా* అని శ్రీ లలితా సహస్రనామాల్లో అన్నారు. 

అంటే, పోలిక చెప్పటానికి సాధ్యం కాని చుబుకము కల తల్లీ అని. అదే  భావం సౌందర్యలహరిలో ఈ శ్లోకంలో చెప్తున్నారు శంకరులు.


కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా = అమ్మా, నీవు చిన్నదానవుగా వున్నప్పుడు నీ తండ్రి హిమవంతుడు వాత్సల్యంగా నీ చుబుకాన్ని పట్టుకొని నిన్ను తనివితీరా చూసేవాడు.


గిరిశే నోదస్తం ముహురధర పానాకులతయా = వివాహం అయినాక నీ పతి శివుడు మాటిమాటికీ నీ అధర పానము చేయవలెననే తీవ్రమైన కోరికతో,


మకరగ్రాహ్యం శంభో ర్ముఖముకుర వృంతం గిరిసుతే = ఓ గిరిజా దేవీ, నీ చుబుకమును ఆయన తన చేతితో పట్టుకొని అద్దము వంటి నీ ముఖమును పైకి ఎత్తగా, ఆయన ముంజేయి నీ ముఖ దర్పణమునకు పిడి వలె కనబడుతున్నది తల్లీ.


కథం కారం బ్రూమ-స్తవ చుబుక మౌపమ్యరహితమ్ = అహో, దేనితోనూ పోల్చనలవికాని నీ చుబుకమును యేమని వర్ణింతును అమ్మా

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Mechatronics

 


Machine balancing the ball. Watch how it draws straight lines as if making a star shape. ⭐️


This is *Mechatronics* Engineering.

Not a joke


 

శనివారం, అక్టోబరు 28, 2023

 🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻

శనివారం, అక్టోబరు 28, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:పౌర్ణమి రా1.58 వరకు  

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:రేవతి ఉ7.57 వరకు

యోగం:వజ్రం రా12.35 వరకు

కరణం:విష్ఠి మ2.51 వరకు తదుపరి బవ రా1.58 వరకు

వర్జ్యం:తె3.03 - 4.35

దుర్ముహూర్తము:ఉ6.00 - 7.31

అమృతకాలం:రా12.00 - 1.32

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:తుల 

చంద్రరాశి:మీనం

సూర్యోదయం:6.00

సూర్యాస్తమయం: 5.28

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

శనివారం, అక్టోబరు 28, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శనివారం, అక్టోబరు 28, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:పౌర్ణమి రా1.58 వరకు  

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:రేవతి ఉ7.57 వరకు

యోగం:వజ్రం రా12.35 వరకు

కరణం:విష్ఠి మ2.51 వరకు తదుపరి బవ రా1.58 వరకు

వర్జ్యం:తె3.03 - 4.35

దుర్ముహూర్తము:ఉ6.00 - 7.31

అమృతకాలం:రా12.00 - 1.32

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి: తుల

 చంద్రరాశి: మీనం 

సూర్యోదయం:6.00

సూర్యాస్తమయం: 5.28


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

ఏకాంశ కవిత్వం

 *ఏకాంశ కవిత్వం- 154వ వారం- అంశం: అమ్మ అల్లం-ఆలి‌ బెల్లం*


*మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక* సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా *979వరోజు ‘అమ్మ‌ అల్లం- ఆలి‌‌ బెల్లం’ అనే అంశంపై* పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  *ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, ఎ.రాజ్య శ్రీ, కె.కె.తాయారు, కనకయ్య మల్లముల, జె.నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు, పగడాల రెడ్డెమ్మ, గుండం మోహన్ రెడ్డి, జక్కని‌ గంగాధర్ రాసిన కవితలు 2023 అక్టోబరు 26వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.*  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 


*-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839*       


https://drsuryaprakash.blogspot.com/2023/10/153_26.html

పంచాంగం 28.10.2023 Saturday,

 ఈ రోజు పంచాంగం 28.10.2023  Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష: పౌర్ణమి  తిధి స్థిర వాసర: రేవతి నక్షత్రం వజ్ర  యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


పౌర్ణమి రాత్రి 01:55 వరకు.

రేవతి ఉదయం 07:31 వరకు .

సూర్యోదయం : 06:16

సూర్యాస్తమయం : 05:43

వర్జ్యం : రాత్రి 02:10 నుండి 03:39 వరకు.

దుర్ముహూర్తం : ఉదయం 06:16 నుండి 07:48 వరకు.


రాహుకాలం : పగలు 09:00  నుండి 10:30 వరకు 


యమగండం : మద్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

స్వామివారి సంకల్పం

 *స్వామివారి సంకల్పం..*


ఆరోజు శనివారం.."మా అమ్మాయి పరీక్షలు దగ్గరపడుతున్నాయి..కష్టపడి చదువుతున్నది..మీకు అమ్మాయి పేరు, గోత్రము పంపుతాను..స్వామివారి వద్ద అర్చన చేయించండి..అది ఎంత కష్టపడ్డా..స్వామివారి కృప వుంటే..సులభంగా పరీక్ష గట్టెక్కుతుంది..పాపకు పరీక్షలు పూర్తి కాగానే..దానిని తీసుకొని నేనూ మావారూ మొగిలిచెర్ల కు వచ్చి ఆ దత్తాత్రేయుడి దర్శనం చేసుకుంటాము..మా అబ్బాయి విషయం లో స్వామివారు పరిపూర్ణంగా కరుణ చూపబట్టే..వాడు స్థిరపడ్డాడు..అమ్మాయి పేరు తో అర్చన చేయించండి..మీకు నమస్కారాలు.." అంటూ హేమలత గారు ఫోన్ చేశారు.."సరే అలాగే గోత్రనామాలు పంపించండి.." అన్నాను..


ప్రతి శనివారం నాడు పల్లకీసేవ జరుపుతామని పాఠకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇలా ఏదైనా కోరికతో అర్చన చేయించదల్చిన వారికి..శనివారం నాడే తమ గోత్రనామాలు నాకు పంపమని నేనూ చెపుతూ ఉంటాను..అలా నాకు మెస్సేజ్ రూపం లో వచ్చిన వారి పేర్ల తో స్వామివారి పల్లకీసేవ వద్ద అర్చన జరిపిస్తాము..మా అర్చకస్వాములు కూడా ఆ గోత్రనామాలు శ్రద్ధగా చదువుతారు..ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ..ఒక్కొక్కసారి నూరు మందికి పైగా తమ తమ పేర్లను పంపుతారు..భవిష్యత్ లో ఏదైనా మార్పు ఉంటుందేమో మాకు తెలియదు..అది స్వామివారి అనుగ్రహాన్ని బట్టి వుంటుంది..కాకుంటే..ఒక్కొక్కరికి ఐదు శనివారాల వరకూ ఇలా మేము అర్చన చేయిస్తాము..ఆపై కూడా కావాలంటే..వాళ్లే వచ్చి స్వయంగా అర్చన చేయించుకొని వెళ్ళమని చెపుతుంటాము..ప్రస్తుతానికి ఈ విధానాన్ని అనుసరిస్తున్నాము..


మరో మూడు వారాల తరువాత హేమలత గారు మళ్లీ ఫోన్ చేశారు..అమ్మాయికి పరీక్షలు పూర్తి అయ్యాయని..కుటుంబం అంతా కలిసి మరో రెండువారాల తరువాత స్వామివారి సమాధి దర్శనం కొరకు రాదల్చుకున్నామని చెప్పారు..రండి అని అన్నాను..అనుకున్న విధంగానే హేమలత గారు తన భర్త, పిల్లల తో కలిసి మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..పల్లకీసేవ కు తమ పేర్లు నమోదు చేయించుకొని..నా వద్దకు వచ్చి కూర్చున్నారు.."ప్రసాద్ గారూ..అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది..ఇప్పుడు వాడికి ఇరవై నాలుగేళ్లు..అమ్మాయికి ఇరవై ఒకటి నడుస్తోంది..వాడికి వివాహం చేద్దాం అని అనుకుంటున్నాము..ఇప్పుడే తొందర వద్దు అని మావారు అంటున్నారు..నేను వివాహం చేద్దాము అని అంటున్నాను..అబ్బాయికి వివాహం చేయాలా? వద్దా? అని మాలో మేము మథన పడటం ఎందుకని..స్వామివారికే విన్నవించుకుందామని ఇక్కడికి వచ్చాము..వాడి పెళ్లి అయిన మరుసటి సంవత్సరమే అమ్మాయికి కూడా పెళ్లి చేస్తాము..అది గట్టిగా నిర్ణయించుకున్నాము.." అన్నారు.."మీరు నిర్ణయం తీసుకోవడం సరే..ఇంతకూ మీ పిల్లలు ఒప్పుకున్నారా?" అని అడిగాను.."అదేం లేదండీ..అంతా మీ ఇష్టం.." అని చెప్పేసారు..అన్నారు హేమలత గారు..ఆరోజు పల్లకీసేవ లో పాల్గొని..ప్రక్కరోజు ఆదివారం నాడు స్వామివారి సమాధి దర్శనం చేసుకొని తమ ఊరికి వెళ్లిపోయారు...


మరో నెల తరువాత.."ప్రసాద్ గారూ..స్వామివారి వద్ద అమ్మాయి పేరుతో అర్చన చేయించండీ..అమ్మాయికి సంబంధం వచ్చింది..అన్నివిధాలా బాగుంది..ఈ సంబంధం ఖాయం అయింది..దాని పేరు తో అర్చన చేయించండి.." అని హేమలత గారు ఫోన్ చేశారు.."అదేమిటి..మీరు అబ్బాయి గురించి కదా స్వామివారికి మొక్కుకున్నది..ఇప్పుడు అమ్మాయి వివాహం అంటున్నారు.." అని అడిగాను.."మేము స్వామివారి వద్ద కోరుకున్న కోరిక మా అబ్బాయి వివాహం గురించే..కానీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది..ఇది కూడా స్వామివారి అనుగ్రహమే అని అనుకున్నాము..మరో రెండేళ్ల దాకా పాపకు పెళ్లి అనుకోలేదు..కానీ..ఈ సంబంధం వాళ్ళు రావడం..మమ్మల్ని అడగటం..అమ్మాయి కూడా పెళ్ళికి ఒప్పుకోవటం చక చకా జరిగిపోయాయి..బాగా ఆలోచిస్తే..ఈ వయసులోనే అమ్మాయికి వివాహం చేయటం సరైనదేనని అనిపించింది..స్వామివారిని పూర్తిగా నమ్మాము..మాకు ఏది మంచిదో అదే ఆయన చేస్తాడు అని అనుకుంటున్నాము..ఏమో..అబ్బాయికి కూడా మరో మంచి సంబంధం చూసి పెట్టారేమో స్వామివారు..అంతా ఆయన దయ.." అన్నారు భక్తిగా..


హేమలత గారి మాటలు నిజమే..మరో ఆరునెలలు గడిచేలోపలే..వారి కుమారుడికి కూడా వివాహం నిశ్చయం అయింది..ఆ ఇద్దరు పిల్లల్లో ఎవరి వివాహం ముందుగా జరపాలో స్వామివారు నిర్ణయం చేసారు..ఆమాటే హేమలత గారు పదే పదే చెపుతుంటారు.."కోరుకోవడం వరకే మనచేతుల్లో ఉన్నది..అమలు చేసే విధానం స్వామివారు చూసుకుంటారు..మనం ఆ నిర్ణయాన్ని స్వాగతించడం వరకే చేయాలి.."


నిజమే కదా?...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

*దేవాలయాలపై మద్రాస్ హైకోర్టు

 *దేవాలయాలపై మద్రాస్ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది.*


*ఆలయ భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయని... వాటి మీద వచ్చే ఆదాయం దేవాలయాల అభివృద్ధి, హిందువుల కోసమే ఉపయోగించాలంది.*


*ప్రభుత్వాలు దొంగల మాదిరిగా దోచుకొని ఇతర కార్యక్రమాలు ఇతర మతాలకు ఇవ్వకూడదని చెప్పింది. ఆలయాలకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను తెలిపింది మద్రాస్ హైకోర్టు’*


*1985లో తమిళనాడులో 5 లక్షల ఎకరాలు దేవాలయాల భూములను ఉండేవి... ప్రస్తుతం 4 లక్షల 50 వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారు... మరి 50 వేల ఎకరాలు ఏమయ్యాయి లెక్క తీయండి, ఆక్రమంలో ఉంటె తొక్క తీయండి కేసులు పెట్టండి, మళ్లీ 50 వేల ఎకరాలను దేవాలయాలకు అప్ప చెప్పండి... ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలి, దేవాలయ అధికారులు ఆధీనంలో దేవాలయం ఆధీనంలో మాత్రమే ఉండాలి...*


*ప్రభుత్వాలు పనికిరాని చెత్త పెత్తనం చేయకూడదు... హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అంతేకాదు... దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి, ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి, కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి, దొంగల మాదిరిగా దోచుకొని మరి ఇతర మతాల కోసం క్రైస్తవులు, ISLAMIC కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ప్రభుత్వాల రోజు వారి పరిపాలన కోసం మీ యొక్క భోగాల కోసం హిందువుల దేవాలయాల ఆదాయాన్ని ఎందుకు వాడుతున్నారు...*


*దాతలు హిందూ దేవాలయాలకు హిందూ దేవుడికి భూములు ఇచ్చారు... దాతలు మీ భోగాల కోసం ఇవ్వలేదు హిందూ ధర్మం కోసం ఇచ్చారు... హిందూ దేవాలయాల ఆదాయాన్ని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి... దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయండి హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వండి అన్యమతస్తులకు కాదు... సెక్యూలరిజం బొంగు భోషాణం దొంగ ముచ్చట్లు అన్ని మీరు చూసుకోండి కానీ అది హిందూ దేవాలయాలు వాటిని హిందువుల కోసం మాత్రమే ఉపయోగించాలి... దేశంలో చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు అందులో ఎంత ఆదాయం వస్తుందో ఎవరికీ తెలియదు కానీ హిందూ దేవాలయాలను మాత్రం దొంగల మాదిరిగా దోచుకుంటున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవాలయాల భూములు దేవుళ్ళ యొక్క సంక్షేమం కోసం కృషి ఇచ్చింది ఎస్సార్ మహదేవన్ అనే జడ్జిగారు... కొన్ని రోజుల క్రితమే మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది... హిందూ ధర్మం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు తీసుకొని క్రైస్తవం ఇతర మతాలలో ఉద్యోగాలు తొలగించండి, జీతాన్ని రికవరీ చేయండి కేసులు పెట్టండి అని జడ్జి గారు తీర్పు ఇచ్చారు ఇప్పుడు అదే జడ్జిగారు మళ్లీ హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ కోసం గొప్ప చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది త్వరలో హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వాధీనంలో నుండి బయటకి రావాలి, ఆక్రమణకు గురైన హిందూ దేవాలయాల భూములన్నీ మళ్ళీ దేవాలయాలకు చెందాలి. ఆలయాలు దేవుడి సాక్షిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడవాలి... హిందూ దేవాలయాల ఆదాయంతో హిందువులకు మాత్రమే విద్య, వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి కార్యక్రమాలు జరగాలి. SAVE టెంపుల్స్ అని ఒక గొప్ప ఉద్యమం తమిళనాడులో జరుగుతుంది. భారతదేశ చరిత్ర మొత్తం మలుపుతిప్పే విధంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.*


🚩 *మార్క సునీల్ కుమార్*

*వ్యవస్థాపక అధ్యక్షులు*

*హిందూ ఆలయ సంరక్షణ సంఘం* 🚩

ఆలోచనాలోచనాలు

 ### ఆలోచనాలోచనాలు ###                                     --------౦ పొగడ్తలు ౦--------                                 ***** భగవాన్! నన్ను కాపాడు! దట్టమైన అరణ్యంలో పులి, సింహం మొదలైన క్రూరజంతువుల నుండి; జనావాసాలలో పొగిడి పనులను పూర్తిచేసుకొనే కపటుల నుండి---                                      ***** మనలో పొగిడించుకొనాలనే దురాశ లేనంతవరకు పొగడ్తలు మనల్ని ఏంచేయలేవు. కోట్లకొలది సంవత్సరాల నుండి ఎండావానలను, తీవ్రమైన గాలులకు తట్టుకొని పర్వతాలు నిలచివుండటం లేదా!                                    ***** ఈ లోకంలో అతి నీచమైన శత్రువులు ఎవరయ్యా, అంటే చేతిలో ఏ ఆయుధం లేకుండా మిమ్మల్ని పొగడటమే కార్యసాధనకు మార్గం అని ఎంచుకున్నవారే!                   ***** పొగిడేవాడెప్పుడూ ఖాళీ చెంచాతోనే తినిపిస్తూవుంటాడు. ఎన్ని పర్యాయాలు దౌడలు ఆడించినా, పొట్ట మాత్రం నిండదు.                                ***** పొగడ్తలు విని ఆనందంలో మునిగితేలడం అంటే ఎత్తెన ముక్కాలి పీటపై కూర్చొని , గర్వంతో విర్రవీగుతూ వెనక్కి వాలడం లాంటితే!                   ***** పొగడ్త వాసన చూచి వదిలేయాల్సిన పరిమళ ద్రవ్యం ( సెంట్) వంటిది. ఎగబడి త్రాగడానికి నిండు వేసవిలో త్రాగే శీతల పానీయం కాదు.                    ***** పొగడ్తలు ఇరువురినీ చెడగొడతాయి. ఒకటి పొగిడే వాడిని. రెండు పొగిడించుకొని ఆనందించేవాడిని.                ***** పొగడ్త దారపు పోగు వంటిదైతే, సన్మాన సభ "" కాశ్మీరీ శాలువా"" ను కప్పించుకోవడం వంటిది.      ***** మూర్ఖులతో పొగడ్తలు పొందడం కంటే తెలివైనవారితో తిట్లు తినడం మంచిది.                   ***** పొగడ్తలతో మనిషిని ఆకాశానికి ఎత్తేవాడు అవసరం అయితే పదిమంది లో గజమాలతో సత్కరించగలడు. వరసతప్పితే వీపు వెనక పిస్టల్ ఉంచి ట్రిగ్గర్ ను నొక్కగలడు కూడా!               *****  అర్హత లేకున్నా శాలువాలను కప్పించుకొనే అలవాటు ఉన్నవారు , గంగిరెద్దును చూచి జ్ఞానం పొందాలి. దాని వీపుపై ఒకటేమిటి అనేక రకాల రంగుల శాలువాలు కప్పబడివుంటాయి.                 ***** పొగిడేవాడు సత్యదేవతను నాలుక అనే పదునైన ఆయుధం తో దాడి చేస్తుంటాడు. పొగిడించుకొనేవాడి మానసిక శక్తిని బలహీనపరుస్తూవుంటాడు ***** పక్షులను పట్టేవాడు  కొన్ని గింజలను వాటి ముందు చల్లి , వల విసరుతాడు. చేపలు పట్టేవాడు గాలపు ముల్లుకు మాంసపు ఎఱను గుచ్చుతాడు. కానీ పొగిడేవాడు ఇవేవీ లేకుండా "తియ్యని మాటల నైపుణ్యం" తో పొగిడించుకొనేవాడిని లొంగదీసుకోగలడు.             * * * * * * * * * * * * * * * * * * *                                  తెలుగు వారి పొడుపుకథలు ( విడుపులు)                         1* మా ఇంట్లో రెండు ఎద్దులున్నాయి. ఒకటి గుండ్రంగా తిరుగుతుంది. ఇంకొకటి తిరగకుండా అట్లాగే పడివుంటుంది. ఏమిటది? (తిరగలి లేదా విసరురాయి)                        2* మా ఊరేనుగు. మదపుటేనుగు. కదలలేదు. మెదలలేదు. ఏమిటది? ( మఱ్ఱి చెట్టు)       3* నాకు రెండుకళ్ళు. మా తాత గారికి నాలుగు కళ్ళు, మూడు కాళ్ళు. ఏమిటవి? ( కళ్ళజోడు మరియు చేతికర్ర)                                4* మణికట్టు పై నుండు మహరాజులాగా! కాలంతో పాటు పరుగెత్తుచుండు! ( చేతి రిస్ట్ వాచ్)                   5* మా ఇంటి వెనకాల పంగనామాలవాడు పందిరి కి వేలాడుతున్నాడు. ( పొట్లకాయ)                        తేది 28--10--2023, శనివారం, శుభోదయం.

ఆయుర్వేద వైద్య మెడికల్ క్యాంప్

 *హరి ఓం ! శ్రీకాకుళం ఎ. పి.హెచ్.బి. కాలనీ ప్రజలకు శుభవార్త.* 


 *చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భవ ఉచిత ఆయుర్వేద వైద్య మెడికల్ క్యాంప్.* 


ప్రముఖ ఆయుర్వేద వైద్యులచే పురుషులకు మరియు స్త్రీలకు అన్నిరకముల జబ్బులకు ఉచిత ఆయుర్వేద శిబిరం. (మెడికల్ క్యాంప్)


డాక్టర్. *జగదీష్ గారు* (సీనియర్ మెడికల్ ఆఫీసర్)

కాంపౌండర్. *చంద్రశేఖర్ గారు* 

యోగాట్రైనర్. *గాయత్రి గారు* మొదలైన వారు వచ్చి స్త్రీలకు మరియు పురుషులకు పరీక్షలు చేసి తమ తమ జబ్బులకు తగిన విదంగా మంచి *ఆయుర్వేద మందులు మరియు ఉచిత సలహాలు* ఇవ్వగలరు. 


కావున ప్రజలందరు ఈ సదవకాశమును వినియోగించుకోవాలని కోరుతున్నాము. 


 *తేది 28-10-2023 శనివారం ఉదయం 10:00ని.. నుండి 12:00 వరకు* 

స్థలం:- చిన్మయ మిషన్, శ్రీకాకుళం

ఎ. పి.హెచ్.బి కాలనీ, ఇంటి నెంబర్ 153

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - పూర్ణిమ  -  రేవతి / అశ్విని - స్థిర వాసరే* (28.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/hdD77BXHDSs?si=p7mvTnXMokLF66im



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

*శ్రీ చెక్కా కేశవులు

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ చెక్కా కేశవులు గారి అనుభవం..*


*(పదవ రోజు)*


శ్రీ స్వామివారితో చెక్కా కేశవులు గారు, తమ మనసులోని కోరికను సందేహిస్తూనే బయటపెట్టారు..ఆ కోరిక వినగానే శ్రీ స్వామివారు ఫక్కున నవ్వారు..


తనకు అమ్మవారి దర్శనం చేయించమని శ్రీ స్వామివారిని కేశవులు గారు కోరారు..శ్రీ స్వామివారు.."అది అంత సులభంగా..అరచేతిలో చూపేది కాదనీ..గొప్ప గొప్ప సాధకులకే సాధ్యం కాని కోరికలు కోరకూడదనీ.." కేశవులు గారికి నచ్చచెప్పబోయారు..కానీ..కేశవులు గారు మాత్రం..తల్లి వద్ద పసిబిడ్డ మారాము చేసినట్టు, అదే పట్టు మీద ఉండిపోయారు..


శ్రీ స్వామివారు..."సరే!..నాయనా..ఇలారా..నాకెదురుగా పద్మాసనం వేసుకొని స్థిరచిత్తంతో కళ్ళు మూసుకొని కూర్చో..ఎటువంటి పరిస్థితుల లోనూ కళ్ళు తెరవకు!..జాగ్రత్త సుమా!.." అని హెచ్చరించి కేశవులు గారిని తమ కెదురుగా కూర్చోబెట్టుకున్నారు..కేశవులు గారు కళ్ళు మూసుకున్నారు..శ్రీ స్వామివారు కూడా పద్మాసనం వేసుకొని..కళ్ళుమూసుకొని..సమాధి స్థితి లోకి వెళ్లిపోయారు..కొద్దిసమయం గడిచేసరికి..కేశవులు గారికి, తన శరీరమంతా కంపించిపోతున్నట్టు..ఏదో వెలుగు తన శరీరమంతా క్రమ్ముకుంటునట్లూ..తాను గాలిలో తేలిపోతున్నట్లు..అనుభూతి కలుగసాగింది..ఏం జరుగుతుందో అర్ధం కాలేదు..ఒకరకమైన భయం మనసునిండా ఆవరించిపోయింది..తట్టుకోలేక కళ్ళు తెరిచారు..పార్వతీదేవి మఠం లేదు..స్వామివారు లేరు..నింగినుండి నేలదాకా.. ఎఱ్ఱని కాంతిపుంజాలు వ్యాపించి ఉన్నాయి..


"స్వామీ!..స్వామీ!.." అంటూ వెఱ్ఱి కేకలు పెట్టారు..తనెక్కడున్నాడో తెలీడం లేదు..ఏదో మాయ క్రమ్ముకొస్తోంది..కొద్దిసేపటికి ఆ కాంతిపుంజాలు మాయమయ్యాయి..శ్రీ స్వామివారు పద్మాసనం లో నిశ్చలంగా కూర్చుని నవ్వుతూ వున్నారు..


"ఏం కేశవులు గారూ..అమ్మ దర్శనం అయిందా?.." అన్నారు..కేశవులు గారు ఇంకా ఆ భ్రమలో నుంచి బైటపడలేదు..వళ్ళంతా చెమటలు పట్టి.. కంపిస్తోంది..


"లేదు స్వామీ..ఆ వెలుగు భరించలేకపోయాను.." అన్నారు..


"చూసావా నాయనా!..కొద్దిపాటి చిత్కళ నే భరించలేకపోయావే.. ఇక సంపూర్ణ దర్శనం అయితే తట్టుకొని ఈ భూమ్మీద వుండగలవా?..మహా మహా యోగులు ఎంతో సాధన చేసి..తపస్సు చేసి..ఒక స్థాయికి చేరిన తరువాతే..ఆ వెలుగును భరించగలరు..ఆ నమ్మకం వారికి కలిగాకే..వారు భగవంతుడి సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు..దైవ దర్శనం, యోగం, బ్రహ్మవిద్య అనేవి సులభసాధ్యాలైతే..ధనం తోనో..కానుకలతోనో..పొందేవి అయితే..ఈపాటికి ఈ భూమ్మీద ఎంతో మంది ధనవంతులు దేవీ దేవతల సాక్షాత్కారం పొంది..వారిని కూడా తమ ఇనప్పెట్టెలో దాచివుంచేవారు..దేనికైనా ఒక స్థాయి ఉంటుంది..గృహస్తు కర్తవ్యం గృహస్థు చేయాలి..సన్యాసి కర్మ..సన్యాసి చేయాలి..ఎవరికి నిర్దేశించిన మార్గం వారు అనుసరించాలి..నాలాటి వారికి ఈ యోగ సాధన అనువైనది..మేము ప్రలోభాలకు లొంగకూడదు..నా సౌకర్యాల కోసం నీవు తపించకు.." అని చెప్పారు..


కేశవులు గారికి ఆ క్షణమే శ్రీ స్వామివారు చేసిన బోధ బాగా హత్తుకున్నది.. ఆనాటి నుంచీ శ్రీ స్వామివారికి శిష్యుడిగా మారిపోయారు..తన కర్తవ్యమేమిటో చెప్పమని స్వామివారిని కోరారు..


"ఆ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి గర్భాలయాన్ని బాగుచేయించు!..భక్తులకు ఇబ్బందిగా ఉంది..పదిమందికి సేవ చేసినట్లుగా ఉంటుంది" అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు..తక్షణమే ఆ పని చేయిస్తానని..కాకుంటే ఒక్కసారి తన కోరికను మన్నించి, తన గృహాన్ని పావనం చేయమని ప్రాధేయపడ్డారు కేశవులు గారు..శ్రీ స్వామివారు సరే నని ఒప్పుకున్నారు..


ఆ తరువాత కొంతకాలానికి  విజయవాడ లోగల కేశవులు గారింటికీ శ్రీ స్వామివారు వెళ్లారు..అక్కడ కొంతకాలం వున్నారు..కేశవులు గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్ రావు గారింట్లోనూ కొద్దిరోజులున్నారు స్వామివారు..శ్రీ స్వామివారు ఎక్కడున్నా తన సాధన మాత్రం ఖచ్చితంగా చేసేవారు..కేశవులు గారు, మస్తాన్ రావు గార్లు నాగార్జున సాగర్ సమీపంలో ఒకటిన్నర ఎకరా స్థలాన్ని శ్రీ స్వామివారి ఆశ్రమం కోసం ఇస్తామని తెలిపారు..వద్దు అని ఖచ్చితంగా చెప్పేసారు శ్రీ స్వామివారు.


శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి గర్భాలయ మరమ్మత్తులు కేశవులు గారు మొదలుపెట్టారు..సరిగ్గా అప్పుడే శ్రీధరరావు గారితో పరిచయం ఏర్పడింది కేశవులు గారికి..శ్రీధరరావు గారితో శ్రీ స్వామివారి గురించిన మరెన్నో విశేషాలు కేశవులు గారు చెప్పుకొచ్చారు..ఇద్దరికీ శ్రీ స్వామివారి మూలంగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది..


అలా శ్రీధరరావు గారు  శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలూ సేకరించారు...అందుకే..ప్రభావతి గారడిగినప్పుడు "అన్ని విషయాలూ నేను చెపుతాను ప్రభావతీ!.." అన్నారు...


శ్రీ స్వామివారి కోరిక....రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).