🌹వాల్మీకి మహర్షి జయంతి 🌹
పామరువోలె బుట్టి బహు
పాపము లెన్నియొ నాచరించియున్
నీమము తోడ నారదుని
నెయ్యపు పల్కుల నాలకించి , యా
రాముని నామమున్ మదిని
రంజిల బల్కియు పుట్టలోపలన్, సు
త్రాములు మెచ్ఛ మౌనివయి
రామకథన్ రచియించి నావు , నీ
నామము దల్చియున్ మదిని
యాదికవీ ! నిను గొల్తు నిచ్చలన్ .
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి