శు భో ద యం🙏
కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్
జీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!
చెడునే మోక్షపదంబ పుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు.
వేదోక్త కర్మలు చేసేవారు, జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ... సాధన చేసేవారూ, పిల్లలున్నా,
లేకున్నా వారి వారి సత్కర్మలవలన వారు ఉద్ధారింపబడతారు.
పాపులు, దుష్కర్మలు చేసినవారు, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యం తోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మల తోనో, పిండ ప్రదానాల తోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప పిల్లలు లేరని నరకం లేదు.
మనకు భగవద్భక్తి లేక సాధన చేయక పోతే దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే నరకమే.
తన జ్ఞానం వల్లనే, తను చేసిన విహిత కార్యాల వల్లనే, సాధన వల్లనే...
సద్గతి అదే శాస్త్రం...
శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది...
పుత్రులు ఆరు రకాలు.
1. ఔరసుడు,
2. దత్తకుడు,
3. కృత్రిముడు,
4. గూఢోత్పన్నుడు,
5. అపవిధ్ధుడు,
6. క్షేత్రజుడు.
వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది.
ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు...
1. కానీనుడు,
2. సహోఢుడు,
3. క్రీతుడు,
4. పౌనర్భవుడు,
5. స్వయందత్తుడు,
6. జ్ఞాతుడు.
వీరు కూడా పుత్ర సమానులే కాని,
వీరికి రాజ్యాధికారము కాని,
ఆస్తిలో భాగము కాని లేదు.
మనుమడు,
కూతురు,
కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు.
అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి,
అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము.
కాబట్టి ఒకరికి...
కొడుకు లేడు.
అని బాధ పడ వలదు.
యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా...
అవి ఆ తండ్రికి అందుతాయి.
ఈ ప్రాపంచిక జీవనమును జీవన ప్రవృత్తి నను సరించి ఆలోచింతురు.
తమకు పరలోకమున ఉత్తమ,గతులు లభించుటకు...
పుత్రులు కావలయు నను కొందరు...
తమకు పుత్రులు కలగని వారు...
అయ్యో మాకు పుత్రులు కలుగ లేదు,
మాకు ఎట్లు ఉత్తమ,గతులు కలుగును.
అని ఏడ్చు చుందురు.
కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది...
పుత్రులు కలిగినను వారి మూలమున అతడు...
ఏ ఉత్తమ లోకములు పొంద గలిగెను?
బ్రహ్మచారిగనే యుండి సంతతి యే లేకున్న శుకునకు దుర్గతి ఏమయిన కలిగెనా?
కనుక పుత్రులు లేని వానికి మోక్షపదము లభించక పోదు...
పుత్రులు కల వారికి ఉత్తమ,గతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును.
పుత్రులు లేని వారికి,ని అవి రెండు ను సిద్దించనూ వచ్చును.
కావున కొడుకులు లేరు.
అని ఎవరూ బాధ పడ వలదు.
మన పుణ్యం మనం సంపాదించు కోవాలి.
మన ఉద్ధారం కోసం...
మనమే పాటు పడాలి.
మనకు ఆ వేంకటేశుని దయవలన
ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై మనం ఉత్తమ,గతులు సాధించు గాక...
ఉధ్ధరేధాత్మనాత్మానాం
ఎవరి ఆత్మను వారే ఉధ్ధరించుకోవాలి.
🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి