🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 77*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఒక రోజు శ్రీరామకృష్ణులు తమ ఇష్టమంత్రమయిన రామనామ మంత్ర దీక్షను నరేంద్రునికి అనుగ్రహించారు. అతి చిన్నతనం నుండే శ్రీరాముని పట్ల కలిగివున్న భక్తిప్రపత్తులు, శ్రీరామకృష్ణులు అనుగ్రహించిన మంత్ర శక్తితో అతడిలో ద్విగుణీకృతమయినాయి. అతడు ఆనందపారవశ్యంలో 'రామ, రామ' అంటూ ఉచ్చరిస్తూ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు. సమయం గడిచేకొద్దీ అతడి కంఠస్వరం తీవ్రస్థాయికి చేరసాగింది. ఆ పరిస్థితిని చూసినవారు అతణ్ణి సమీపించడానికే భయపడ్డారు.
'రామ రామ' అంటూ గంటల తరబడి ఉచ్చరిస్తూ ప్రదక్షిణలు చేయడం చూసి ఈ సంగతి శ్రీరామకృష్ణులకు తెలియపరిచారు. అందుకు ఆయన, "అతణ్ణి అలాగే వదలిపెట్టండి. త్వరలోనే మామూలు స్థితిలోకి వస్తాడు" అన్నారు. కొన్ని గంటలు గడచిపోయాక కూడా అతడు మామూలు స్థితిలోకి రాకపోవడంతో శ్రీరామకృష్ణులు అతణ్ణి తమ వద్దకు తోడ్కొని రమ్మన్నారు. కాని ఎవరూ నరేంద్రుణ్ణి ఆపలేకపోయారు.
చివరికి ఒక వ్యక్తి బలవంతంగా అతణ్ణి పట్టుకొని ఎలాగో గురుదేవుల వద్దకు తోడ్కొని వెళ్లగలిగాడు. పిదప శ్రీరామకృష్ణులు క్రమక్రమంగా అతణ్ణి మామూలు స్థితిలోకి తీసుకు రాగలిగారు. తరువాత అతడితో, "నాయనా, నరేంద్రా! ఎందుకింతగా ఆర్భాటం చేస్తావు? ఇదంతా నిష్ప్రయోజనం. ఈ ఒక్క రాత్రి నువ్వు ఏ రీతిలో గడిపావో, నా జీవితంలో పన్నెండేళ్లు అలా గడిచాయి. ఒక భయంకరమైన తుపానులా వచ్చి వెళ్లిపోయింది. ఒక్క రాత్రిలో నువ్వు ఏం సాధించగలవు, నాయనా!" అని చెప్పి, అతణ్ణి సాంత్వనపరిచారు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి