🌹శ్రీకాళహస్తీశ్వరమ్ 🌹
క్షితి యందు కొందరు జీవన బ్రాంతులై
యజ్ఞాన తిమిరాన నలమటించి
కొడుకులు లేరంచు కుములుచు న్నుందురు
ధృతరాష్ట్రునకు లేరె ! సుతులు శతము
వారిచే నేగతుల్ వసుధేశు డొందెనొ
తెలియని విషయమా ! యిలను మనకు
సుతులు లేనట్టి యా శుకునకు నేవైన
దుర్గతుల్ కల్గెనా? భర్గ చెపుమ
'సుతులు లేకున్న నిహపర గతులు లేవు
ముక్తి లేద' ను మాటలు మోసమె గద !
భక్త పాలన శంకరా ! భవ విదూర !
ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి