🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 67*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా*
*గిరీశే నోదస్తం ముహు రధరపానాకులతయా |*
*కరగ్రాహ్యం శంభో ర్ముఖముకురవృన్తం గిరిసుతే*
*కథంకారం బ్రూమ స్తవ చుబుక మౌపమ్యరహితమ్ ‖*
*అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా* అని శ్రీ లలితా సహస్రనామాల్లో అన్నారు.
అంటే, పోలిక చెప్పటానికి సాధ్యం కాని చుబుకము కల తల్లీ అని. అదే భావం సౌందర్యలహరిలో ఈ శ్లోకంలో చెప్తున్నారు శంకరులు.
కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా = అమ్మా, నీవు చిన్నదానవుగా వున్నప్పుడు నీ తండ్రి హిమవంతుడు వాత్సల్యంగా నీ చుబుకాన్ని పట్టుకొని నిన్ను తనివితీరా చూసేవాడు.
గిరిశే నోదస్తం ముహురధర పానాకులతయా = వివాహం అయినాక నీ పతి శివుడు మాటిమాటికీ నీ అధర పానము చేయవలెననే తీవ్రమైన కోరికతో,
మకరగ్రాహ్యం శంభో ర్ముఖముకుర వృంతం గిరిసుతే = ఓ గిరిజా దేవీ, నీ చుబుకమును ఆయన తన చేతితో పట్టుకొని అద్దము వంటి నీ ముఖమును పైకి ఎత్తగా, ఆయన ముంజేయి నీ ముఖ దర్పణమునకు పిడి వలె కనబడుతున్నది తల్లీ.
కథం కారం బ్రూమ-స్తవ చుబుక మౌపమ్యరహితమ్ = అహో, దేనితోనూ పోల్చనలవికాని నీ చుబుకమును యేమని వర్ణింతును అమ్మా
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి