28, అక్టోబర్ 2023, శనివారం

గ్రహణ సమయంలో దర్భలు

 *గ్రహణ సమయంలో దర్భలు ఎందుకు ఉపయోగిస్తారు*..?


సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి ఉంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారు? దీనికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే.. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు అంటారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలు, గృహాలను సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయి. 


*దర్భలను ఎక్కడ ఉంచుకోవాలి*..

ఈ క్రమంలో దర్భలను కూడా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో ఉంచుతారు. గరిక అనేది యాంటి రేడియేషన్ గుణాలు కలిగిఉన్నది. అందుకే గ్రహణం సమయంలో మన ఇంట్లోని అన్ని పాత్రలు, నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతారు. దర్భల మీద 1982-83 ప్రాంతంలో భారత దేశంలో సూర్య గ్రహణం రోజున పరిశోధన జరిగింది. గరిక గడ్డి జాతికి చెందినది. అది నిటారుగా పైకి నిలబడి, సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలో దాచి ఉంచుకుంటుంది. అతినీలలోహిత కిరణాలను, గ్రహణ సమయంలో భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితో అడ్డుకుంటుందని ఆ పరిశోధనలో తేలింది.



*గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు*..

ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది. వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. గర్భిణిలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. కానీ సృష్టితీరులో ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఏది జరిగినా దాని ప్రభావం ఏదో ఒక రూపంలో వెల్లడి అవుతుంది. ఆ కారణంగా నిత్యపూజాది కార్యక్రమాలు, శాంత్యోపచరాలు చేసుకోవాలని సాధకులు చెబుతారు. సముద్రపు ఆటుపోట్లు జాగ్రత్తగా పరిశీలించమని చెబుతారు. ముఖ్యంగా గర్భిణీలపై వీటి ప్రభావం ఎక్కువై శరీరంలో అధిక వేదనలు పడతాయని అంటారు. అందుకే గ్రహణములు చూడొద్దు అంటున్నారు. కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. 


*ముందుగా దర్భలు ఇంట్లో వేయాలి.* 

**పచ్చళ్లు, ఆహార పదార్ధాల మీద ఉంచాలి*

*గ్రహణానికి 2 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి*.

*గ్రహణం వీడిన తర్వాత స్నానము చెయ్యాలి.*



 *ఆ సమయంలో మంత్ర పునరశ్చరణతో అధిక ఫలితం ఉంటుంది*


దర్భలను ఎప్పుడు కోయాలంటే..

గ్రహణాల సమయంలో భూమిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. దానికి అనుగుణంగా మన శరీరంలోనూ, జీవన విధానంలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. సూర్య, చంద్రులు ఆరోగ్యకారకులు అన్నది ఆరోగ్య జ్యోతిషసూక్తి. గ్రహణ సమయాల్లో మనం వాటికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి.

దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ల చాలా పదునుగా సూదిలా ఉంటాయి. దర్భలను పుష్యమి నక్షత్ర యుక్త ఆదివారం నాడు కొయ్యాలని చెబుతారు. 

ఆ విధంగా చేసినటైతే ఆ దర్భలు రేడియేషన్ ను తొలగిస్తాయంటారు. గ్రహణ సమయాలలో ఉత్పత్తి అయ్యే ఫలితాన్ని అల్త్రా వైలెట్ కిరణాల ప్రభావాన్ని అవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో,  పచ్చళ్లపై ఉంచినట్టు అయితే.. బూజు పట్టకుండా ఉంటాయని పరిశోధనలో తేలింది. 


ఆహారం ఎప్పుడు తీసుకోవాలంటే…

ఇక గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణం కాదంటారు. వాతావరణ మార్పులే దీనికి కారణం. ఈ గ్రహణాల వల్ల గర్భస్థ శిశువులకు హాని జరుగుతుందని భావిస్తారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు, నిద్రపోనివ్వరు. ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతారు. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణిలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తారు. గ్రహణం ఏర్పడటానికి 3 గంటల ముందు.. ఏర్పడిన అనంతరం మరో మూడు గంటల వరకు పసి పిల్లలు, వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, యుక్త వయస్కులు మాత్రం గ్రహణ సమయానికి 12 గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు.

కామెంట్‌లు లేవు: