శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
కళ్ళుపోయిన బాధను తట్టుకోలేక చ్యవనుడు క్రుద్ధుడయ్యాడు. ఆ క్షణంలోనే రాజ సైనికులకూ
పరివారానికీ గణాశ్వాలకూ శకృన్మూత్రనిర్బంధం అయిపోయింది. శర్యాతికీ అవి బంధించాయి. భరించలేని
ఇబ్బంది. అలాగే రాజధానికి చేరుకున్నాడు. ఏమి జరిగింది? ఎవరు ఎవరికి ఏమి అపకారం చేశారు?
సైనికులను పిలిచి ఆరాతీశాడు. వాళ్ళు చెప్పారు. సరోవరానికి దగ్గరలోనే చ్యవనుడు తపస్సు
చేసుకుంటున్నాడు, బహుశ మనవాళ్ళల్లో ఎవరో అతడికి ఏదో అపకారం చెయ్యడమో అవహేళన
చెయ్యడమో జరిగి ఉంటుంది. ఆ తపస్వి కోపించి మనందరికీ మలమూత్ర బంధనం చేసి ఉంటాడు-
(అధ్యాయం-2, శ్లోకాలు 65)
అని.శర్యాతి ఇంకా విచారణ కొనసాగిస్తున్నాడు. అందరూ మాకు తెలియదంటే మాకు
తెలియదంటున్నారు. సైనికులకు రాజుగారికి గజాశ్వాలకూ శకృన్మూత్రాలు అవ్వడం లేదు. ఇదంతా
గమనించిన సుకన్య తండ్రి దగ్గరికి వెళ్ళి పుట్టరంధ్రాలలో తాను పొడిచిన సంగతి, పొడిచిన పుల్లకొనకు
తేమఅంటిన సంగతి, నీరసంగా హాహాకారాలు వినిపించిన సంగతి చెప్పి, ఆ పుట్టలో ఎవరు ఉన్నారో ఏమి
జరిగిందో మాత్రం నాకు తెలియదని అమాయికంగా విన్నవించింది.
రాజుకి విషయం అర్థమయ్యింది. వెంటనే పుట్టను చేరుకున్నాడు. దుఃఖిస్తున్న చ్యవనుడు
రంధ్రాలనుంచి కనిపించాడు. మెల్లగా వల్మీకాన్ని పగులగొట్టించాడు శర్యాతి. సాష్టాంగపడ్డాడు. వినయంగా
నమస్కరించి నిలిచి స్తుతించాడు. అజ్ఞానంవల్ల మా అమ్మాయి మీకు తీరని అపకారం చేసింది. క్షమించండి
మహామునీశ్వరులకు క్రోధం ఉండదని విన్నాను. అమాయికురాలు, చిన్నపిల్ల, మా సుకన్యను క్షమించుము
అనిప్రాధేయపడ్డాడు.
అక్రోధవా హి మునయః భవంతీతి మయా శ్రుతమ్ ।
తస్మాత్ త్వమపి బాలాయాః క్షంతు మర్హసి సాంప్రతమ్ (3 - 11)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి