శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు తెలియజేసిన #గ్రహణ_పురశ్చర్య_విధానం....🔥🙏🔥
✔#గ్రహణ_ప్రభావము:-
సూర్య, చంద్ర గ్రహణాలలో ఏది వచ్చినా గ్రహణం పట్టిన దగ్గర నుండి విడచిన దాకా #ఒకే_మంత్రం జపం చేస్తే అది ఒక జప పురశ్చరణతో సమానం...... ఆ సమయం అసుర శక్తులు అంటే రాజస, తామస శక్తులు #విజృంభిస్తాయి. కనుకనే సాత్విక శక్తి కేంద్రాలయిన దేవాలయాలు అన్నింటిని మూసివేస్తారు....... రాజస, తామస విద్యలు ఆ సమయంలో సాధన చేస్తే మంత్రం #శీఘ్రసిద్ధిని, ఉత్తమ ఫలితాన్ని, సత్వర సిద్ధిని ఇస్తుంది......
గ్రహణ సమయంలో #నది వద్దగానీ, #సముద్ర తీరానికి గాని వెళ్ళి..... నదిలోనైతే బొడ్డులోతు నీళ్ళలో నిలబడి, సముద్రం వద్దనైతే తీరంలో #దర్భాసనం మీద కూర్చుని గానీ, లేదా తమ #ఇళ్లోలో గాని ఆచమనం ప్రాణాయామం చేసిన తరువాత......
✔#సంకల్పం:-
మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ ____పరదేవతా ముద్దిస్య, శ్రీ _____పరదేవతా ప్రీత్యర్థం, ______గోత్రోద్భవస్య, ______నామధేయస్య అహం, శ్రీ ______పరదేవతా ప్రీత్యర్థం, పవిత్ర _____గ్రహణకాలే, స్పర్శాది మోక్షపర్యంతం, శ్రీ ______మంత్ర జపం కరిష్యే...
అని సంకల్పం చెప్పుకుని గ్రహణం #ప్రారంభసమయం నుండి గ్రహణం #విడిచేదాకా జపాన్ని చేయాలి..... దీనికి ముందు గ్రహణం పట్టు స్నానం - జపం తరువాత విడుపు స్నానం చెయ్యాలి..... జపం పూర్తయిన తరువాత తిరిగి మూడు సార్లు #ఆచమనం చేసి కొన్ని నీళ్ళు చేతిలో తీసుకుని......
✔#జప_సమర్పణ:-
అనేన మయాకృతేన శ్రీ _____పరదేవతా మంత్ర జపేన, శ్రీ _____పరదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శ్రీ _____పరదేవతా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్యర్ధం, ఏతత్ జపఫలం శ్రీ _____పరదేవతా చరణారవిందార్పణమస్తు., తత్సత్ బ్రహ్మార్పణమస్తు.
అని ఆ నీటిని #అరివేణం (ఒక పళ్ళెం)లో విడవాలి...... అలా విడిచిన నీటిని మూడు సార్లు #తీర్థంగా తీసుకోవాలి..... ఈ విధంగా జప సమర్పణ చెయ్యాలి. దీనిని గ్రహణ పురశ్చర్య అంటారు.....
గ్రహణం పట్టినప్పటి నుండి విడిచే వరకూ ఉన్న సమయం అది 1 గంటైనా, అరగంటైనా ఆ సమయంలో చేసిన జపం (#సంఖ్యతో_పనిలేదు) 1 లక్ష జపంతో సమానం.....
కాబట్టి గ్రహణ సమయాన్ని వినియోగించుకుంటే సాధకులకు మంచిది..... గ్రహణం తరువాత రోజు లేదా మంచిరోజు పురశ్చరణలో చెప్పిన విధంగా పదివేల #హోమం, ఒక వేయి #తర్పణం, ఒక వంద #మార్జనం లేదా అభిషేకం, పది మంది #బ్రాహ్మణుల_భోజనం యథావిధిగా చేయాలి.......
గ్రహణ జపం వల్ల కేవలం #జప_సంఖ్య మాత్రమే కలిసి వస్తుంది, హోమాది మిగతా విధులు యధాతథం.....
🌹🙏🌹
http://www.siddheswaripeetham.org/
_
సేకరణ:- వాట్సాప్ పోస్ట్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి