*హద్దు*
నీలాలా నింగి రేరాజు
కొలను అలలపై కదలాడినవేళ
కలువ కన్నె రెక్కలు
నీటనే విప్పుతుందే తప్ప
నింగికి చేరలేదేమి?
ముప్పిరిన మేఘమాలలు
వేసే పందిళ్ళను చూసి
మురిసిన మయూరాలు
పురివిప్పినాట్యమాడేను
నింగికెగిరి అందుకోలేదేమి?
మావి చిగురపల్లవాల వసంతానికి
పరవశించి కోయిలరాగాలు పలుకునే కాని
వసంతాన్ని నిలువరించలేదేమి?
నిత్యం ఉవ్వెత్తున ఎగిసే కెరటాలు
చెలియల కట్ట దాటెరుగవేమి మనసుపట్టు తప్పిపరవశిస్తుంది అందుబాటులో వున్నా
అందుకోలేని అందమైన హద్దు సాంప్రదాయమై ఒద్దికగా గుర్తు చేస్తుంటుంది.
ప్రకృతిలోనే ఎన్నెన్ని హద్దులు
హద్దులెప్పుడు అందము?అవసరమూ!?.
*లలితా భాస్కర దేవ్*
27-10-2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి