19, జులై 2022, మంగళవారం

హనుమంతుడు

 🍃🌷🌻🙏🌻🍃


శ్రీ *హనుమంతుడు* ఎప్పుడూ 

నమస్కరిస్తూనే కన్పిస్తాడెందుకు ?

( ఆలయ విగ్రహాల్లో )


రావణవధ! 

అయ్యాక వెళ్ళిపోతుంటే 


సీతారాములు కూడా వెళ్తుంటే 

రాముడు ఆంజనేయుడితో అన్నాడు 


" హనుమా " నీకేం కావాలి ? అని 


అప్పుడు హనుమంతుడు 

ఇలా అన్నాడు !


నాకు మరే విధమైన 

కోరికలు లేవు తండ్రి... 

ఏ రూపంలో చూచినా 

అందులో 

నీ రూపమే కన్పించేలానూ 

ఏ శబ్దం వినిపించినా 

అందులో సీతారాముల కథే 

ఉందని అనిపించేలానూ


ఎక్కడ నమస్కరించినా 

అది మీకే చెందేలానూ

ఈ భావం నాకు శాశ్వతంగా

ఉండేలా అనుగ్రహించు

అని సీతారాముల ముందు

కోరాడు హనుమంతుడు


దానికి రాముడు సరేనన్నాడు !


అందుకని ఆంజనేయుని 

నమస్కారం సీతారాములకే !

ఆంజనేయ ధ్యానమంతా 

సీతారాముల విషయంలోనే 


సీతారాములకి 

నమస్కరిస్తున్న హనుమకి

నమస్కరించడం 

సీతారాములకి మరింత ఇష్టం !!


ఎందుకంటే 


భగవంతుడు తనకి చేసిన

నమస్కారం కంటే,

తన భాగవతునికి ( భక్తునిగా )

చేసిన నమస్కారానికి 

ఎక్కువ ప్రాధాన్యాన్నిసాడు కదా !!

( అహం స్మరామి మద్భక్తమ్ )


🙏శ్రీరామదూతం శిరసా నమామి🙏


                🌷 *సేకరణ*🌷

          🌹🌷🌞🌞🌷🌹

                  *న్యాయపతి*

               *నరసింహా రావు*


🌴🎋🌾🌹🍁🛕🍁🌹🌾🎋🌴

శ్రీ శివానన్దలహరీ

 ॐ                 श्री शिवानन्दलहरी    

                     శ్రీ శివానన్దలహరీ    

      SREE SIVAANANDALAHAREE      


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                  శ్లోకం :88/100

                           SLOKAM :88/100     


यदा कृताम्भोनिधिसेतुबन्धनः

     करस्थलाधःकृतपर्वताधिपः ।

भवानि ते लङ्घितपद्मसम्भवः

     तदा शिवार्चास्तवभावनक्षमः ॥ ८८॥


యదా కృతాంభోనిధి సేతుబంధనః 

కరస్థలాధఃకృతపర్వతాధిపః I 

భవాని తే లంఘితపద్మసంభవ 

స్తదా శివార్చాస్తవ భావన క్షమః ॥          -88    


శంకరా!    

    ఎప్పుడు సముద్రానికి వంతెన కట్టినవాణ్ణి (రాముణ్ణి) కాగలనో,    

    వింధ్యపర్వతాన్ని ఎగనీయకుండా అరచేతితో అణచినవాణ్ణి (అగస్త్యుణ్ణి) కాగలనో,    

    బ్రహ్మదేవుని మించగలనో  అప్పుడే నిన్ను అర్చించడంలోను, స్తుతించడంలోను, ధ్యానించడంలోను సమర్థుణ్ణి కాగలుగుతాను.    

 

    How will I ever worship thee lord? 

    For I have not built the bridge across the sea (Rama), 

    I have not subdued the king of the mountain by palm of my hands (Agasthya) and 

    I am nor born out of lotus from the belly of Lord Vishnu (Brahma). 

    

    If I ever  do or attain these, 

    then I would become capable of 

    offering flowers, 

    singing your praise and 

    meditating on you.    


    పరమేశ్వరుణ్ణి భక్తితో 

  - పూజించి రాముడు సముద్రానికి వారధి కట్టాడు.    

  - స్తుతించి అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని మీదికి ఎదగనీయకుండా చేతితో అణచివేశాడు.    

  - ధ్యానించి బ్రహ్మ సృష్టికార్యాన్ని నిర్వహిస్తున్నాడు.  

     కాబట్టి పరమశివుణ్ణి భక్తితో అర్చించి స్తుతించి, ధ్యానించి జీవితాన్ని తరింపజేసుకోవాలి. 


*  శ్రీరామ - అగస్త్య - బ్రహ్మలు మహాశివ భక్తులు. 

    శివభక్తులకు అసాధ్యముండదు, 

    సర్వమూ సాధ్యమే! 


https://youtu.be/h8qlcoPKG5o


                            కొనసాగింపు.. 


                         =x=x=x= 


సేకరణ, కూర్పు :                         

 రామాయణం శర్మ 

      భద్రాచలం

భోజన నియమాలు

 *హిందూ సాంప్రదాయములో భోజన నియమాలు, క్లుప్తంగా----*

>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<<                                     

1. భోజనానికి ముందు,తరువాత తప్పకకాళ్ళు,చేతులుకడుక్కోవాలి. 

తడికాళ్ళను తుడుచుకుని భోజనా నికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు,మొదలైన.) తినే పళ్ళాని కి తాకించరాదు.  

అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరా దు. చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పె ట్టి నెయ్యినీ కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనంచేస్తున్నప్పుడుమధ్య లో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్నిచూ పించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్నిము ట్టుకోన కూడదు. 

ఒకవేళకంచాన్నిముట్టుకుంటే! .వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టు కోనవలెను.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కం చంలో భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్ర మంగా దరిద్రులు అవుతారు.

10  భగవన్నామము ఉచ్చరించి భో జనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపము తో అన్నం పెట్టేవారిని తిట్టడంచేయ రాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోనరాదు. ఏవైనా పదార్థా లలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థా లుఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచంఒడిలోపెట్టుకునిభోజనం చేయరాదు. పడుకునే  మంచం మీ ద భోజనం చేయరాదు. 

(ఇదివృద్ధులకు,అనారోగ్యము గా ఉన్న వారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్నిదేమునకు ని వేదించరాదు.అతిథులకుపెట్టరాదు.15. భోజనం అయ్యాక క్షురకర్మ చే సుకోనరాదు. (వెంట్రుకలు కత్తిరిం చడం)

16. గురువులు లేదా మహాత్ములు అతిథులుఇంటికి వస్తే మనంతినగా మిగిలిన వి పెట్టరాదు. 

మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తి బేధం చూపరాదు. అనగా ఒకరికి ఎ క్కువ వడ్డించడం మరొకరికితక్కువ వడ్డించడం చేయరాదు. 

18. భోజనం చేస్తున్నప్పుడు తింటు న్నపదార్థాలలోవెంట్రుకలువస్తే,ఆపదార్ధములోనెయ్యినివడ్డించితినాలి. పురుగులు వస్తే ఆ భోజనం తక్షణం విడిచి పెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలోఆవునెయ్యివేసుకుం టే ఆహారం శుద్ధి అవుతుంది. 

20.భగవన్నామములుతలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ  వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమము. 

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బల వంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు) 

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

23. గిన్నెలోనిపదార్ధమునుమొత్తం ఊడ్చుకుని తినరాదు.ఆహార పదా ర్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డనసమయంలోఅక్కడఉండరాదు.

26. అరటిఆకులవంటి వాటిలో భో జనం చేసిన వ్యక్తి వాటినిమడవకూ డదు (తిన్న విస్తరిని మడవడం అ నాచారం).తన ఇంటిలో ఒక్కడే ఉ న్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడి కి వచ్చేపుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రము.

(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసినరాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆ కులు ఎత్తాడని మహాభారతం చెబు తోంది.)    

28.  భోజనం అయ్యాక రెండుచేతు లూ,కాళ్ళూ కడుక్కోవాలి. 

అవకాశం లేనప్పుడు రెండు చేతు లైనా తప్పక కడుక్కోవాలి. 

నోరునీటితోముమ్మారుపుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాకనేలనులేదా బల్లనుశుద్ధిచేయాలి (మెతుకులుతీ సేసి,తిన్నచోట శుద్ధిపేట్టితడిగుడ్డతో శుభ్రం) చేసినతరువాత మాత్రమేఅ క్కడ వేరేవారికి భోజనంవడ్డించాలి.(ఇప్పటికీసదాచారములుపాటించేకొందరి ఇళ్ళల్లో గోమయం లేదా ప సుపునీళ్ళు చల్లి మరీశుద్ధిచేస్తారు.)  

30.స్నానం చేసి మాత్రమే వంట వం డాలని కఠోర నియమము.  

పెద్దలు,సదాచారపరులు,హోటళ్ళలో మరియు ఎక్కడంటేఅక్కడభోజ నం చేయకపోవడానికిఇదేముఖ్యకా రణం.అక్కడవంటచేసేవారుస్నానం చేసారో లేదో తెలియదుకదా,పాచి ముఖంతో వంట చేసినా,రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించివంటచేసినా దోషము. అవి తిన్న వారికి మెల్లగా వారిమనసుపైప్రభావంచూపుతుంది.పుణ్యం క్షీణిస్తుంది.అజ్ఞానంవస్తుం ది జ్ఞాపకశక్తిపోతుంది.

31.ఒకసారివండాకఅన్నము,కూర,పప్పు వంటి ఇతరఆహారపదార్థాల ను మళ్ళీ వేడిచేసి తినరాదు. ద్వి పాక దోషం వస్తుంది. 

32. ఆడవారు గాజులు ధరించకుం డా భోజనం చేయరాదు. ఇతరులకుభోజనమువడ్డించరాదు.

*ఇవీ,క్లుప్తంగా  హిందూసాంప్రదా యంలోని కొన్ని భోజన నియమా లు---//-*

పాదుకా స్పర్శనం - పరమాత్మ దర్శనం

 పాదుకా స్పర్శనం - పరమాత్మ దర్శనం


పరమాచార్య స్వామికి గొప్ప భక్తులైన పోలూర్ శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు జీవితంలో ఒక్కసారైనా స్వామివారి పాదుకలను తాకాలని ఆశపడేవారు. వారు సాంప్రదాయక బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ పోస్ట్ మాష్టరుగా ఉద్యోగం చేసేవారు. తలపై శిఖతో మూడుపూటలా సంధ్యావందనం చేసే నిష్టాగారిష్టుడు.


భగవంతుడే భక్తుని వద్దకు వెదుక్కుంటూ వస్తాడని నమ్మేవారు. దాన్ని నిజం చేస్తున్నట్టుగా మహాస్వామివారు కలశపక్కం జిల్లాలో మకాం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య అయ్యర్ మహాస్వామివారి దర్శనానికి బయలుదేరగా, స్వామివారు ఈశ్వరాలయానికి వెళ్తున్నారు. వెంటనే స్వామివారు వెళ్ళిన దారిలో ఈశ్వరాలయానికి వెళ్ళాడు. కొద్దిదూరంలో మహాస్వామివారు ఆలయానికి వెళ్తుండడం గమనించారు. అప్పుడే ఆయన దృష్టి మహాస్వామివారి పాదాలపై, వారు వేసుకున్న దివ్యపాదుకలపై పడింది.


ఒక్కక్షణం ఇలా ఆలోచించారు. “ఒక్కసారి పరమాచార్య స్వామివారి పాదుకలను తాకగలిగితే, ఈ జన్మకే కాదు ఇక నాకు మరో జన్మంటూ ఉండదు” అని. మహాస్వామివారు దేవాలయం బయట ఆగి ఒకసారి అందరిని చూశారు. సుబ్రహ్మణ్య అయ్యర్ పరిగెత్తుకుని వెళ్లి గుంపులో చేరాడు. స్వామివారి పాదుకలను చూసుకునే భాగ్యం కల్పించాలనే మహాస్వామి వారు ఆలయ దర్శనానికి వచ్చారు అని తనలో తానూ అనుకున్నాడు.


పరమాచార్య స్వామివారు అందరిని పలకరించి, “నేను లోపలి వెళ్లి స్వామీ దర్శనం చేసుకుని వచ్చేదాకా ఎవరైనా నా పాదుకలను చూసుకుంటారా?” అని అడిగారు. ఇది వినగానే ఆ భాగ్యం ఎవరికీ కలుగుతుందో అని అందరూ ఉత్సుకతతో చూస్తున్నారు. మరలా స్వామివారు, “ఈ గుంపులో శాస్త్రోక్తమైన శిఖముడి ఉన్నవారెవరైనా ఈ పనికి రావచ్చు” అని అన్నారు.


అక్కడున్నవారందరిలో స్వామివారి సహాయకులు వినా శిఖముడి ఉన్నవారు సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక్కరే. మనం విన్నట్టు రామాయణంలో ఆ రోజు భరతునికి కలిగిన భాగ్యం ఈ రోజు సుబ్రహ్మణ్య అయ్యర్ కు దక్కింది. వొణుకుతున్న చేతులతో, కళ్ళల్లో ఆనందభాష్పాలతో ఆ పాదుకలను చేతిలోకి తీసుకున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్.


ఆయన ఆలయం వెలుపల ఆనందంగా నిల్చుని ఆ పాదుకలను అత్యంత మృదువుగా తాకుతూ, కళ్ళతో చూస్తూ, తలపై పెట్టుకుంటూ తనలో తాను రమిస్తున్నాడు. స్వామివారి అనుగ్రహానికి కరిగి కన్నిరైపోయాడు. స్వామివారితో సహా అందరూ దర్శనానికి లోపలి వెళ్ళారు. నిజమైన భక్తుడికి భగవంతుని విషయంలో ‘చాలు’ అనే మాట ఉండదు. సుబ్రహ్మణ్య అయ్యర్ విషయంలో కూడా అంతే. స్వామివారి పాదుకలు లభించడం మహా భాగ్యమే. కానీ అందరిలా మహాస్వామివారితో కలిసి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం కలగలేదు కదా అనుకున్నాడు.


పరమాచార్య స్వామివారికి స్వాగతం పలికిన పిదప ఆలయ అర్చకులు శివునకు మంగళ నీరాజనం ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు. స్వామివారు ఆ అర్చకున్ని ఆపమని తమ పార్శదున్ని పిలిచి, “బయట నా పాదుకలు పట్టుకుని నిలుచున్న అతణ్ణి లోపలికి పంపు, ఆ పాదుకలను నీవు తీసుకుని” అని పంపారు.


తక్షణమే సుబ్రహ్మణ్య అయ్యర్ రెండవ కోరికను కూడా స్వామివారు తీర్చారు. గర్భాలయంలో నాగాభరణం ధరించి, బిల్వామాలతో విరాజమానంగా ఉన్న శివలింగానికి మంగళ హారతి ఇస్తున్నారు. శివలింగం చుట్టూ కట్టిన పంచె జలపాతంలా పక్కనే మహాస్వామివారు నిలబడి ఉండగా ఇరువురికి ఏకకాలంలో నీరాజనం అర్పించారు అర్చక స్వాములు. అమ్మవారి ఆలయంలో కూడా సుబ్రహ్మణ్య అయ్యర్ కు ఇలాంటి దృశ్యాన్నే అనుగ్రహించారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అటుదిటు ( చిన్నకథ)🌷

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

   *🌷అటుదిటు ( చిన్నకథ)🌷* 

                శశికళ ఓలేటి 

                   🌷🌷🌷

"ఏవండీ! సేతు మాధవరావు గారు , భార్యా వచ్చారు ఇందాకా...వాళ్ళ పెద్దబ్బాయి ఇంటి గృహప్రవేశం ట. పిలవడానికి వచ్చారు."


"ఏ సేతు మాధవరావు? "


"ఎంతమంది ఉన్నారేమిటి? అదే మన వియ్యంకుడు,మన అమ్మాయిని ఇచ్చుకున్న ఇంటి యజమాని!"..  అన్నారు లక్ష్మిగారు కాస్త వ్యంగ్యంగా. 


" ఓ ఆయనా. నేనేం ఇవ్వలేదు నా కూతుర్ని.‌ఆయనే‌ అడిగి మరీ చేసుకున్నాడు. ఇంతకీ ఏంటంటావు? ఈ ఉన్న ఊళ్ళో సంబంధాలు కాదు కాని, ఏదో దానికి పిలుపు..ఇహ‌ నీ అత్యుత్సాహం. చూడవోయ్...ఈ మొహమాటాలన్నీ నా వల్ల కాదు. ఆ సోదంతా వింటూ, అందరినీ పలకరిస్తూ,ముఖస్థుతులు చేస్తు కూర్చోడం నాకు తలనొప్పి. నా మాట విని...ఆ బట్టలూ గట్రా కొనేసి, ఏం చదివిస్తావో చదివించేసి‌ చక్కా‌వచ్చేయి. నేనయితే కలవలేను వాళ్ళతో.".. అంటూ నిక్కచ్చిగా చెప్పేస్తున్న భర్త అహంకారానికి ఒళ్ళు మండిపోయింది లక్ష్మి గారికి.‌


"అయినా ఆ శాఖాభేదం మీరు మనసులోంచి తీసేయట్లేదు. వాళ్ళు పద్ధతులన్నీ శాస్త్రోక్తంగా పాటిస్తున్నారు.ఇంట్లో ఆ దేవతార్చన లు, అనుష్టానాలు.. పితృకార్యాలు...సమస్తం ఎంతో వేదోక్తంగా జరుపుతారు. మనలాగా అన్నీ మమ‌ అనేసి నీళ్ళు వదిలేయరు. మన పిల్ల అదృష్టం అలాంటి ఇంట్లో పడడం.. ! మీ బడాయిలు‌ పక్కకు పెట్టి‌ నడవండి.‌ పిల్లకు తలవంపులు తేకూడదు.""...పెట్టవలసిన నాలుగూ పెట్టి... ఆదివారం వియ్యాలారి కొత్తింటికి బయలుదేర దీసింది భర్తగారిని.


‌‌ వెళ్తూనే ఆయన ఎవరితోనూ ఒక పలుకూ, పలకరింతా లేకుండా బిగుసుకుపోయాడు. ఆయన వ్యవహారానికి లక్ష్మి గారికి బీపీ పెరిగి పోతోంది.‌అమెరికాలో ఉన్న కూతురి కి ఎక్కడ మాటొస్తుందో అని, కలివిడిగా.. కొంగు బిగించి అన్ని పనుల్లోకీ‌ దూకేసింది.‌వియ్యపురాలి చేతిలో పని లాక్కుని మరీ చేసేస్తు, అందరితో అంటీ ముట్టనట్లు మాట్లాడుతున్న భర్తమీద ఒక కన్నేస్తు...తెగ అలిసిపోయింది.‌ 


వియ్యాలారు మర్యాదస్తులు.‌ వియ్యంకుడు,ఆయన అన్నదమ్ములు ఈయనతో కూర్చుని కబుర్లు చెప్తూ, ఈయన అప్పుడప్పుడు రాలుస్తున్న మాటలు ముత్యాలు శ్రద్ధగా ఏరుకుంటూ..బాగానే ఎంగేజ్ చేస్తున్నారు. 


 సందడంతా సద్దుమణిగింది. పాపం ఆఖరు వరకు ఉండి,అలిసిపోయిన వాళ్ళకు టీలు పెట్టీ అందించి మరీ సెలవు తీసుకుంది లక్ష్మి గారు. ఆయన మటుకు అదే‌ గోరోజనం మెయింటెయిన్ చేస్తు వెళ్ళొస్తా అని చెప్పేసి కారెక్కేసాడు. ఇంటిల్లిపాదీ బయటకొచ్చి మరీ వీడ్కోలిచ్చారు. 

" హమ్మయ్య! పెద్ద మొహమాటం వదిలిపోయింది.‌విసుగొచ్చేసిందనుకో అంత సేపు కూర్చోవాలంటే!"... అన్నారు బడాయి గా! 


" మీ ముక్తసరి ప్రవర్తనకు ఖచ్చితంగా వెనుక అనుకుంటార్లెండి.".. అంది ఆవిడ వెటకారంగా! 


‌‌వియ్యాలారింట....


" మన చిన్నాడి‌‌ మావగారు పదిమంది పెట్టే.‌ మనిషి మితభాషి అయినా మర్యాదస్తులు,చిరునవ్వు మొహంలో చెదరకుండా అందరినీ ఇట్టే ఆకట్టుకున్నారు.నిండుకుండ‌ తొణకదు‌ అంటే‌ ఇదే!"అంటూ భార్యతో అన్నారు వియ్యంకుడు.


" మరే! ఆయన నిండుకుండే. కానీ ఆవిడే‌ మహాగాభరా మనిషి. పదే‌పదే సాయం చేస్తానని ఓ కాళ్ళల్లో,చేతుల్లో పడిపోతూ..‌పనులు తెమలనివ్వకుండా!"....అంది వియ్యపురాలు కాస్త విస్సాటంగా.


 *శశికళ ఓలేటి గారి కథ.*

గ్రామదేవతలు

 💐💐*గ్రామ దేవతల పేర్లు*💐💐

💐*గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు* :-💐

*పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షనిస్తుందని బలమైన నమ్మకం* .

*ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు* .

1.పాగేలమ్మ

2.ముత్యాలమ్మ

3 .గంగమ్మ

4.గంగానమ్మ

5.బంగారమ్మ

6.గొంతెమ్మ

7.సత్తెమ్మ

8.తాళమ్మ

9.చింతాలమ్మ

10.చిత్తారమ్మ

11.పోలేరమ్మ

12.మావుళ్లమ్మ

13.మారెమ్మ

14.బంగారు బాపనమ్మ

15.పుట్టానమ్మ

16.దాక్షాయణమ్మ

17.పేరంటాలమ్మ

18.రావులమ్మ

19.గండిపోచమ్మ

20.మేగదారమ్మ

21.ఈరినమ్మ

22.దుర్గమ్మ

23.మొదుగులమ్మ

24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )

25.మరిడమ్మ

26.నేరెళ్లమ్మ

27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )

28.మాచరమ్మోరు

29.మద్ది ఆనాపా అమ్మోరు

30.సొమాలమ్మ

31.పెద్దయింట్లమ్మ

32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )

33 .అంబికాలమ్మ

34.ధనమ్మ

35.మాలక్షమ్మ

36.ఇటకాలమ్మ

37.దానాలమ్మ

38.రాట్నాలమ్మ

39.తలుపులమ్మ

40.పెన్నేరమ్మ

41.వెంకాయమ్మ

42.గుణాళమ్మ

43.ఎల్లమ్మ (విశాఖపట్నం )

44.పెద్దమ్మ

45.మాంటాలమ్మ

46.గంటాలమ్మ

47.సుంకులమ్మ

48.జంబులమ్మ

49.పెరంటాలమ్మ

50.కంటికలమ్మ

51.వణువులమ్మ

52.సుబ్బాలమ్మ

53.అక్కమ్మ

54.గనిగమ్మ

55.ధారాలమ్మ

56.మహాలక్షమ్మ

57.లంకాలమ్మ

58.దోసాలమ్మ

59.పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )

60.అంకాళమ్మ .

61.జోగులమ్మ

62.పైడితల్లమ్మ

63.చెంగాళమ్మ

64.రావులమ్మ

65.బూరుగులమ్మ

66.కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )

67.పోలమ్మ

68.కొండాలమ్మ

69.వెర్నిమ్మ

70.దే శిమ్మ

71.గరవాలమ్మా

72.గరగలమ్మ

73.దానెమ్మ

74.మహాంకాళమ్మ

75.వేరులమ్మ

76.మరిడమ్మ

77.ముళ్ళ మాంబిక

78.యలారమ్మ

79.వల్లూరమ్మ

80.నాగులమ్మ

81.వేగులమ్మ

82.ముడియలమ్మ

83.రేణుకమ్మ

84.నంగాలమ్మ

85.చాగాలమ్మ

86.నాంచారమ్మ

87.సమ్మక్క

88.సారలమ్మ

89.మజ్జిగౌరమ్మ

90.కన్నమ్మ -పేరంటాలమ్మ

91.రంగమ్మ -పేరంటాలమ్మ

92.వెంగమ్మ -పేరంటాలమ్మ

93.తిరుపతమ్మ

94.రెడ్డమ్మ

95.పగడాలమ్మ

96.మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )

97.కుంచమ్మ విశాఖపట్నంలో

98.ఎరకమ్మ

99.ఊర్లమ్మతల్లి

100.మరిడమ్మ

101.సుంకాలమ్మవ్వ ఉన్నారు .

💐నుసకపల్లి ,పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .

1.నుసకపల్లమ్మ

2.వెలగలమ్మ

3 .ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )

4.పైళ్లమ్మతల్లి

5.బల్లమ్మతల్లి

6.లొల్లాలమ్మతల్లి

7.ఊడలమ్మ తల్లి

8.కట్వాలాంబిక

9.నాగాలమ్మ నాంచారమ్మతల్లి

10.సింగమ్మతల్లి

11.ఘట్టమ్మతల్లి

12.అంజారమ్మతల్లి .

13. మంత్రాలమ్మ తల్లి

14.పాతపాటేశ్వరి తల్లి

15.కుంకుళమ్మ ద్వారకా తిరుమల

16.చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా

అలాగే ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .

💐అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు వందనాలు,💐

💐💐మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ?💐💐

మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?

💐గ్రామదేవతా వ్యవస్థ:💐

గ్రామాలలో వెలిసే దేవత...దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను  గ్రామదేవతలని అంటారు.

సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.

ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,

ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే

కుదరకపోవచ్చు.

ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము

సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో

అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు

ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే

తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.

ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త,

ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.

ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు

అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో

అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా

నియమించారు పూర్వీకులు.

అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.

దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది

కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము

సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి

గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-

భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.

అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన

ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.

💐💐గ్రామదేవతల ఆవిర్భావము:💐💐

పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.

అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు

గ్రామదేవతలను ఏర్పాటు చేసారు

తొలి దశలో.

💐పృధ్వీ దేవత:💐

మొదటిది పృధ్వీ అంటే నేల,ఇది పంటకి ఆధారము,

కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన

పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.

గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము

కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.

జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.

మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా

మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.

పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని

చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి

కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.

ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో

జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.

💐జల దేవత:💐

రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.గుడి ఎత్తుగా కట్టినా

తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.

💐అగ్ని దేవత:💐

మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ,రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. ( చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).

సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.

ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).

💐వాయు దేవత:💐

నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.

కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.

💐ఆకాశ దేవత:💐

ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను

ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన. ఇలాంటి వాటి నుండి

రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.

💐*గ్రామదేవతా నామ విశేషాలు*:💐

మనం రకరకాల పేర్లతో పిలిచే  ప్రతి గ్రామదేవత

పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది 

సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల

రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో

వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.

ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.

ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి

'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.

ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు

రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.

ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే

ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల

(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=

కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.

స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.

సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.

'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో

ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే

క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.

ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది.ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి

లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.

శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో

అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా

అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.

పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.

ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.

తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత

పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా

వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.

పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.

అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో

పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ'

అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=

సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.

గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా

ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. 

అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ.

ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది

కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.

ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే

చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.

బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు

బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.

అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది

బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ

అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.

భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో

బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=

బోనాలమ్మ.

అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి

ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల

పిలుస్తారు.

లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది

కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.

ఊరు పేరుని బట్టి పీల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ'

అన్నారు.సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..!!

పేర్లు ఏవైతేనేమి,

ఆ తల్లి ఎప్పుడూ

మనకు తోడుగా,

అండగా నిలిచి

మనందరినీ

కంటికి రెప్పలా

కాపాడుతుంది...

శుభం .ఓం శనైశ్చరాయనమః


ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి ఈ గ్రూపులో చెర్పించండి 🌹🌹🌹jai గురు దత్త 🌹🌹🌹