ॐ श्री शिवानन्दलहरी
శ్రీ శివానన్దలహరీ
SREE SIVAANANDALAHAREE
(श्रीमच्छंकरभगवतः कृतौ)
(శ్రీ శంకరాచార్య విరచితమ్)
(BY SREE AADI SANKARA)
శ్లోకం :88/100
SLOKAM :88/100
यदा कृताम्भोनिधिसेतुबन्धनः
करस्थलाधःकृतपर्वताधिपः ।
भवानि ते लङ्घितपद्मसम्भवः
तदा शिवार्चास्तवभावनक्षमः ॥ ८८॥
యదా కృతాంభోనిధి సేతుబంధనః
కరస్థలాధఃకృతపర్వతాధిపః I
భవాని తే లంఘితపద్మసంభవ
స్తదా శివార్చాస్తవ భావన క్షమః ॥ -88
శంకరా!
ఎప్పుడు సముద్రానికి వంతెన కట్టినవాణ్ణి (రాముణ్ణి) కాగలనో,
వింధ్యపర్వతాన్ని ఎగనీయకుండా అరచేతితో అణచినవాణ్ణి (అగస్త్యుణ్ణి) కాగలనో,
బ్రహ్మదేవుని మించగలనో అప్పుడే నిన్ను అర్చించడంలోను, స్తుతించడంలోను, ధ్యానించడంలోను సమర్థుణ్ణి కాగలుగుతాను.
How will I ever worship thee lord?
For I have not built the bridge across the sea (Rama),
I have not subdued the king of the mountain by palm of my hands (Agasthya) and
I am nor born out of lotus from the belly of Lord Vishnu (Brahma).
If I ever do or attain these,
then I would become capable of
offering flowers,
singing your praise and
meditating on you.
పరమేశ్వరుణ్ణి భక్తితో
- పూజించి రాముడు సముద్రానికి వారధి కట్టాడు.
- స్తుతించి అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని మీదికి ఎదగనీయకుండా చేతితో అణచివేశాడు.
- ధ్యానించి బ్రహ్మ సృష్టికార్యాన్ని నిర్వహిస్తున్నాడు.
కాబట్టి పరమశివుణ్ణి భక్తితో అర్చించి స్తుతించి, ధ్యానించి జీవితాన్ని తరింపజేసుకోవాలి.
* శ్రీరామ - అగస్త్య - బ్రహ్మలు మహాశివ భక్తులు.
శివభక్తులకు అసాధ్యముండదు,
సర్వమూ సాధ్యమే!
https://youtu.be/h8qlcoPKG5o
కొనసాగింపు..
=x=x=x=
సేకరణ, కూర్పు :
రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి