26, ఫిబ్రవరి 2025, బుధవారం

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో𝕝𝕝   యాన్తి ధర్మప్రవృత్తస్య*

         *తిర్యఞ్చోsపి సహాయతామ్* l

         *అపధానం తు గచ్ఛానం*

         *సోదరోఽపి విముఞ్చతి* ll 


*తా𝕝𝕝 ధర్మ మార్గములో నడిచేవాడికి పశుపక్ష్యాదులు కూడా సహాయము చేస్తాయి....చెడు మార్గములో పోయే వాడిని సోదరుడు కూడా విడిచి పెడతాడు.... శ్రీరాముడు ధర్మ మార్గములో నడిచాడు కాబట్టి కోతులు ఆయనకు సహాయము చేసాయి.... అధర్మ మార్గములో పోతున్న అన్నను విభీషణుడు విడిచి పెట్టి పోయాడు కదా!!!*


✍️🌺🌹🍇🙏

ఎత్తైన ఈ శివలింగం

 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ శివలింగం గురించి మీకు తెలుసా?


మీరు ఎన్నో పురాతన శివాలయాలను చూసి ఉంటారు. కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగాన్ని ఎప్పుడైనా చూసారా? లేకపోతే జీరో వ్యాలీలోని ఈ శివాలయం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.శివా పురాణం యొక్క 9వ సంపుటిలోని 17వ అధ్యాయంలో లింగాలయ అనే పేరుతో పిలవబడే ప్రాంతంలో అత్యంత ఎత్తైన శివలింగం దొరుకుతుందని పేర్కొనబడింది. ఆ లింగాలయ ప్రదేశాన్నే ఇప్పుడు అరుణాచల్ అని పిలుస్తున్నారు


ఈ పురాణ ప్రవచనాన్ని నిజం చేస్తూ అరుణాచల్ లోని జీరో వ్యాలీలో చాలా కాలం క్రితం ఒక చెట్లు నరికే వ్యక్తిచే ఈ పవిత్రమైన శివలింగం కనుగొనబడింది. ఇది సుమారు 25 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో పాటు మరో నాలుగు అడుగులు లింగం భూమి క్రింద ఉంటుంది.

ఈ శివలింగానికి దగ్గరగా పార్వతీ దేవి, పక్కనే కార్తికేయ స్వామిల విగ్రహాలు కుడి వైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తాయి. శివలింగం ఎడమ వైపున గణేశుడు, శివుని వాహనమైన నంది చిత్రాలు ఒక రాయిపై చెక్కబడి ఉంటాయి. ఈ లింగం 1970ల చివరలో అరుణాచల్ ప్రదేశ్ లో చేసిన సరికొత్త పురావస్తు ఆవిష్కరణగా చెబుతారు

అరుదైన క్షేత్రమే 'సురుటు పల్లి

 సదాశివుడు కూడా శ్రీమహా విష్ణువు మాదిరిగానే శయన రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే 'సురుటు పల్లి'. లోకకల్యాణం కోసం హాలాహలాన్ని మింగిన శివుడు, ఆ విష ప్రభావం కారణంగా అమ్మవారి ఒడిలో సొమ్మసిల్లి .. ఆ తరువాత సేదదీరిన క్షేత్రం ఇది. 


పల్లికొండ శయన భంగిమలో శివుడికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని సురుతపల్లిలోని 'పల్లికొండేశ్వరస్వామి ఆలయం'లో ఉంది.


పార్వతీ దేవి ఒడిలో శయనించిన స్థితిలో (సుమారు 6 అడుగుల పొడవు) శివుడిని చూడవచ్చు. ఇక్కడి స్వామిని 'నీలకంఠ' అని పిలుస్తారు.


విజయనగర యుగంలో రాజులు హరిహర మరియు బుక్క నిర్మించిన ఈ ఆలయంలో రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి, వాటిలో ఒకటి పార్వతి దేవి కోసం మరియు ఒకటి శ్రీ వాల్మీకేశ్వర (వాల్మీకి మహర్షి) కోసం.


కుబేరుడు తన భార్యలైన సంగనిధి మరియు పదుమనిధితో కలిసి గర్భ గృహాన్ని కాపాడుతాడు.


ప్రధాన దైవం పైలి కొండేశ్వర (శివుడు) తన భార్యతో చుట్టుముట్టబడి, విష్ణువు, లక్ష్మి, బ్రహ్మ, ఇంద్రుడు, నారదర్ మొదలైన అనేక ఇతర దేవుళ్లను చూడవచ్చు, విశ్వాన్ని రక్షించడానికి విషం సేవించిన తర్వాత ఆయన క్షేమాన్ని తెలుసుకోవడానికి మొత్తం కైలాసం (శివుడి పక్షిపై ఉన్న) ఇక్కడ సమావేశమైనట్లు కనిపిస్తుంది.


ఇక్కడ మరో ఆసక్తికరమైన ఆచారం ఏమిటంటే, పవిత్ర బూడిద (విభూతి) కు బదులుగా పవిత్ర జలాన్ని మాత్రమే ప్రసాదంగా ఇస్తారు.


ఆలయ లోపలి ప్రహారంలో (ఆలయం లోపలి గోడ) వరసిధి వినాయకుడు (గణేశుడు), శ్రీ వేణుగోపాల స్వామి (కృష్ణుడు), విశాలాక్షితో కాశీ విశ్వనాథన్ మరియు ఇతరులు కూడా ఉన్నారు. ఈ ఆలయం కంచి పరమాచార్యుడికి అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటి, ఆయన ఇక్కడ 10 రోజులు బస చేశారు మరియు ఆయన జ్ఞాపకార్థం ధ్యాన మండపం నిర్మించబడింది.


స్థానం:


శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం,  సురుటపల్లి, దాసుకుప్పం పోస్ట్, నాగలాపురం MD,  చిత్తూరు జిల్లా పిన్-517 588 (AP)

శివరాత్రికి ఏం చేయాలి

 *📿🔱శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?*


_*మహా శివరాత్రి-14*_ 

📿🔱📿🔱📿🔱


*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*

*⛳🛕🪔TVBC🪔🛕🔱⛳*

*****************************


🔱 *మహాశివరాత్రి*

 *ప్రత్యేక సంచిక -14*

🔱📿🔱📿🔱📿

 *🛕📜TVBC📲🪀*


*సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన #మహర్షులు.*


*శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.*

📿🔱📿🔱📿🔱

*👉గ్రూపులో కొత్తగా జాయిన్* 

*అవ్వదలిచిన వారు జాయిన్ లింక్ పై క్లిక్ చేయగలరు.*

👇👇👇👇

https://chat.whatsapp.com/DfpB3juLYrgGbUt1siH7Pm


🪀📲🪀📲🪀📲

🟥🟨🟩🟪🟦🟧

*🛕📚For more Devotional posts updates click on the join link*

🪀📲🪀📲🪀📲

*🖕WhatsApp join link*

🟥🟨🟩🟪🟦🟧


*1.ఉపవాసం*

🔱📿🔱📿🔱📿

*శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. #శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.*


*ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.*


*2. #జీవారాధాన*

🔱📿🔱📿🔱📿

*అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.* 


*శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.* 


*3. #మౌనవ్రతం*

 🔱📿🔱📿🔱📿

*శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర -నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.*


*ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.*    


*4.అభిషేకం*

🔱📿🔱📿🔱📿

*శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.*


*5.#జాగరణ* 

🔱📿🔱📿🔱📿

*శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.* 


*6.మంత్ర జపం*

🔱📿🔱📿🔱📿

*శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. #శివోహం అనే భావనను కలిగిస్తుంది.*


*శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.*

*✨శుభమ్ భూయాత్🌹*

*🔱మహా శివరాత్రి🔱 శుభాకాంక్షలుతో🙏*

🔱🕉️🙏🔱🕉️🙏🔱

*********************

*🛕TVBC channel🛕*


🟨🟥🟨🟥🟨🟥🟨

*🪔హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏*


*✨సర్వం శ్రీ శివార్పణమస్తు🙏*

*🔱🌹🪔జై మహాదేవ🪔🌹*

ఆరోగ్యాన్ని ప్రసాదించేది "ఉపవాసం."

 తనువులోని మలినాలను తొలగించి

ఆరోగ్యాన్ని ప్రసాదించేది

          "ఉపవాసం."

మనసులోని రాజస, తామస గుణాలను 

రూపుమాపి సాత్వికం కలిగించేది

        " జాగరణం."

ఆత్మను పరమాత్మలో మిళితమయ్యేలా చేసి

అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చేసేది 

              "ధ్యానం."

ఈ మూడు ధర్మాలను విధిగా పాటించి

సుఖశాంతులతో 

వర్ధిల్లమని చెప్పే పర్వదినమే

          మహాశివరాత్రి.🙏🙏

మహాశివరాత్రి రోజున

 _*మహాశివరాత్రి రోజున మన శివయ్యకు షోడశోపచార పూజా విధానము.*_

✍️ సంకలనం: శ్రీ ఇంద్రగంటి శంకరప్రసాద్ శర్మ                      


 🕉️  _*మహాశివరాత్రి రోజున మన శివయ్యకు షోడశోపచార పూజ చేద్దామా!*_ 


🕉️ _*ఒకవేళ భౌతికంగా చేయలేకపోయినా మానసికంగానైనా పూజచేసినట్లు భావిద్దాము.*_


🙏 _*భావనకు దొరికే వాడు భగవంతుడు మాత్రమే!.*_ 


1. _*ఓం శివాయ నమః*_

ధ్యానం సమర్పయామి


2. _*ఓం సర్వేశ్వరాయ నమః*_

 ఆవాహనం సమర్పయామి 


3. _*ఓం కైలాసవాసాయ నమః*_ 

నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి


4. _*ఓం గౌరీ నాథాయ నమః*_  

పాద్యం సమర్పయామి


5. _*ఓం లోకేశ్వరాయ నమః*_

 అర్ఘ్యంసమర్పయామి 


6. _*ఓం నంది వాహనాయ నమః*_

స్నానం సమర్పయామి 


7. _*ఓం దిగంబరాయ నమః*_ 

వస్త్రం సమర్పయామి 


8. _*ఓం జగన్నాథాయ నమః*_ 

యజ్ఞోపవీతం సమర్పయామి


9. _*ఓం కపాల ధారిణే నమః*_

గంధం సమర్పయామి 


10. _*ఓం మహేశ్వరాయ నమః*_

అక్షతాన్ సమర్పయామి 


11. _*ఓం పరిపూర్ణగుణాయ నమః*_

బిల్వదళయుత సుగంధ పుష్పం సమర్పయామి 

(మారేడుదళములతో పూజచేయాలి)


   1. *ఓం నిధనపతయే నమః*

2. *నిధనపతాంతికాయ నమః* 

3. *ఊర్ధ్వాయ నమః*

4. *ఊర్ధ్వలింగాయ నమః* 

5. *హిరణ్యాయ నమః* 

6. *హిరణ్యలింగాయ నమః* 

7. *సువర్ణాయ నమః*

8. *సువర్ణలింగాయ నమః*

9. *దివ్యాయ నమః*

10. *దివ్యలింగాయ నమః*

11. *భవాయ నమః*

12. *భవలింగాయ నమః* 

13. *శర్వాయ నమః* 

14. *శర్వలింగాయ నమః* 

15. *శివాయ నమః* 

16. *శివలింగాయ నమః* 

17. *జ్వలాయ నమః* 

18. *జ్వల లింగాయ నమః* 

19. *ఆత్మాయ నమః* 

20. *ఆత్మలింగాయ నమః* 

21. *పరమాయ నమః*

22. *పరమలింగాయ నమః*


12. _*ఓం పార్వతీ వల్లభాయ నమః*_

ధూపమాఘ్రాపయామి 


13. _*ఓం తేజో రూప ఆర్తరక్షణాయ నమః*_

దీపం దర్శయామి 


14. _*ఓం త్రిలోచన లోక రక్షకాయనమః*_

నైవేద్యం సమర్పయామి 


15. _*ఓం లోక సాక్షిణే నమః*_ 

తాంబూలం సమర్పయామి 


16. _ఓం భవాయ నమః*_

కర్పూర నీరాజనం దర్శయామి.


17. _*ఓం శంకరాయ నమః*_

సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి 


18. _*ఓం సజ్జన రంజనాయనమః*_

ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి

 

🙏 _*ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగ్' స్థాపయతి పాణి మంత్రం పవిత్రమ్ ||*_


  _*🙏శివోహం శివోహం శివోహం🙏*_

 🙏 _*సర్వేషాంశాన్తిర్భవతు.*_

J N RAO 🙏🙏🙏

మహా శివరాత్రి

 


శ్రీభారత్ వీక్షకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు 🌹 ఆది మధ్యాంత రహితుడైన ఆ పరమేశ్వరుని రహస్యం బ్రహ్మ, విష్ణువులైనా కనుగొనగలిగారా? అసలు మహా శివరాత్రి పర్వదినం ఎలా అయింది!  వంటి అంశాలను వివరంగా తెలుపుతూ శివరాత్రి మహాత్మ్యాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు శ్రీభారత్ వీక్షకులకు అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వివిధ పురాణాలు, ఉపనిషత్తులలోని శివ తత్వాన్ని ఈ ఎపిసోడ్ లో వివరించారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

సర్వేశ్వరుడు శివుడే.

 


శ్రీభారత్ వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు 🌹ఈ సృష్టి సమస్తానికి,, సకల జీవులకు సర్వదా శుభాలను కలుగజేసే సర్వేశ్వరుడు శివుడే. చేతులారంగ శివపూజ చేయని వారి జన్మ మెందుకు? అంటారు. అటువంటి ఆ మహా శివుని ఎంతో స్వర బద్ధంగా, శ్రుతి మంత్రంగా ' శివశంభో.. స్వయంభో ' అంటూ కీర్తిస్తున్నారు ప్రముఖ సంగీత విద్వాంసురాలు డా. మంగళంపల్లి స్వర్ణ గారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీభారత్ వీక్షకులకోసం ఈ శివ మంత్రాన్ని అందిస్తున్నారు. శివపూజ, శివ గానం..  

 పూర్వజన్మ సుకృతం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

యజ్ఞాలు చేస్తే

 *యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయా?*   

                      ➖➖➖✍️

```

యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయా అనే అంశం పై ఆమధ్య టీవీ 9 వారు  చర్చా కార్యక్రమం ఒకటి పునఃప్రసారం చేశారు. దానిలో యధాప్రకారం ఒక నాస్తికుడు, ఒక ఆధునిక శాస్త్రము చదువుకున్న వారు, మన పండితులు ఇరువురు పాల్గొన్నారు. 


నాస్తికులు “మీరు స్టూడియోలో యజ్ఞము చేసి వర్షం కురిపిస్తేనే కానీ నేను నమ్మను” అనే పంథాలోనే మాట్లాడారు.


ఇక సైంటిస్టు అనే ఆవిడ  క్లౌడ్ సీడింగ్ గురించి తనకు తెలిసిన భాషలో ఆ యాంకర్, వీక్షకులకు తెలిపే ప్రయత్నం చేసింది. 


మన పండితులు ఒకరు స్టూడియోలోనే ఉండి శ్రమపడి ‘వరుణ యాగం’  వంటివి చెబుతూంటే, యాంకరమ్మ మాములుగానే అడ్డుతగులుతూ    విషయాన్ని నాస్తికుని చేతిలో పెట్టే విఫల ప్రయత్నం చేసింది. 


కార్యక్రమం గాడి తప్పి నవ్వుల పాలయింది. 



సరే!


అసలు యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయా? అని కదా ప్రశ్న. 


ఈ ప్రశ్నకు జవాబు తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రధానాధికారిగా పనిచేసిన కీ.శే. పీ.వీ ఆర్.కే. ప్రసాదు గారు వ్రాసిన అనుభవాల సారం “నాహం కర్తా, హరిః కర్తా” అనే గ్రంధం చదవాలి. 


నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను. జ్ఞాపకం ఉన్నంతవరకు విన్నవిస్తాను…


మీలో చాలామంది ఆ ఘట్టం చదివి పులకాంకితులయ్యే ఉంటారు.``` 


   *“నాహం కర్తా, హరిః కర్తా“*```


కొన్ని సంవత్సరాల క్రితం తిరుమలలో వర్షాభావం వలన చాలా పెద్ద నీటి ఎద్దడి వచ్చింది. 


పాపనాశనం డాం, ఆకాశగంగ లో కూడా నీరు అడుగంటి, తిరుపతి నుండి తిరుమల వచ్చే యాత్రీకులను రాకుండా కట్టడి చేసే పరిస్థితి వచ్చింది. 


అప్పుడు శ్రీ ప్రసాదు గారు అన్ని విధాలా ప్రయత్నాలు చేసి, నీరు తిరుపతి చుట్టుపక్కల కూడా లేకపోవడంతో  పండితులను సంప్రదించారు. 


పండితులు ’వరుణయాగం’ చేస్తే వర్షం పడుతుందని సలహా ఇచ్చారు. 


ప్రసాదు గారు మండలిలో సంప్రదించి "వరుణ యాగం" మొదలు పెట్టారు. అది నాలుగు వారాల పాటు సాగే యజ్ఞము. మాధ్యమాలలో చాలా విమర్శలు వచ్చాయి. "శ్రీవారి డబ్బు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు. ఇది మూర్ఖం" అన్నారు.  మాధ్యమాల విమర్శలు లెక్క చేయక యాగం కొనసాగించారు. చివరి రోజు మాడ వీధులలో శ్రీవారు ఊరేగుతుంటే, పత్రికలవారు "ఇంత డబ్బు మూర్ఖంగా ప్రసాద్ ఖర్చు చేశాడు. వర్షం కాదు కదా ఒక్క తునక మబ్బు కూడా లేదు" అంటూ నానా విధాలుగా తూలనాడుతుంటే, ప్రసాదు గారు.. "తండ్రీ! నాకు ఇదేమి పరీక్ష" అంటూ హృదయావేదన చెందుతూ అలాగే మాడ వీధులలో రధం దగ్గరకి వచ్చేసరికి ఒక్కసారిగా నల్లటి మబ్బులు, ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద చినుకులతో వర్షం కురిసింది. అది ఎంత పెద్దవర్షం అంటే.., రధం దగ్గరనుండి శ్రీవారు మహాద్వారం దగ్గరకి వచ్చేసరికి అందరూ తడిసి ముద్దయిపోయారు. వర్షం లేదు కదా అని చత్రచామార సేవ చేసేవారు కూడా శ్రీవారికి రాచమర్యాదలు కూడా హడావుడిగా చేస్తూ కంగారు పడిపోయారు. 


ఆ కుంభవృష్టి కొన్ని గంటలపాటు సాగింది. రాత్రి ఇంజనీర్లు ప్రసాదు గారికి ఫోన్ చేసి ”సార్! పాపనాశనం, ఆకాశగంగలో నీరు పుష్కలంగా వచ్చి చేరింది. ఇక మూడేళ్ళపాటు తిరుమలలో నీటి కొరత ఉండదు" అని పలికినప్పుడు శ్రీవారి దయకు ప్రసాదు గారు పరవశించి, మరునాడు "వరుణయాగం" చేసిన పండితులను యధావిధిగా సత్కరించారు. 


ఇది శ్రీ ప్రసాదు గారు తిరుమలలో భక్తులకొరకు నిర్వహించిన వరుణయాగ ఫలితం! 


వారి అనుభవం ఆ గ్రంధంలో నిక్షిప్తం చేశారు. మన శాస్త్రాలలో చెప్పిన ఎన్నో విషయాలు విదేశాలలోనివారు  నిజమని నమ్మి ఆ శాస్త్రాల అధ్యయనం విశేషంగా చేస్తుంటే, మన టీవీ, పత్రికా మాధ్యమాలు అవి ఏవో మూఢనమ్మకాలు అని కొట్టేస్తే నష్టపోయేది మనమే అని వారు తెలుసుకోవాలి.✍️```


*“అన్నాద్భవంతి భూతాని* *పర్జన్యాదన్న సంభవః।*

*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః* *కర్మసముద్భవః॥”*

                      -భగవద్గీత 3-14.

-సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

శివతత్త్వం

 🙏వేదాంత వ్యాసం శివతత్త్వం 🙏 

          ఆది శంకరాచార్యుల వారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు... ఆది శంకరాచార్య విరచిత నిర్వాణషట్కం వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. నిర్వాణషట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము. కాని,. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక 'ఇది కాదు' 'ఇది కాదు'అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతంఅంటారు .

      ''నేతి... నేతి'' అంటే, 'న ఇతి', 'న ఇతి', అంటే, 'ఇది కాదు' 'ఇది కాదు'.. అని చెప్పింది! 'మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం' మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగువిధములైన అంతఃకరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది. ఆకాశానికెత్తేస్తుంది. కడకు పాతాళానికి తొక్కేస్తుంది.

        మనిషికి మనస్సే అన్నింటికి మూల కారణం, ప్రేరణ, ఉత్ప్రేరకం, వినాశకరం. 

        నాది, నాది కాదు - అనేదే బంధానికి, మోక్షానికి కారణాలు. నాది అనేది, నాకు మాత్రమే అనే విచిత్ర బంధం. ఇతరులగురించి ఆలోచింపజేయదు. ఎవరికి చెందకూడదు అంటుంది. పూర్తి స్వార్థం. ఇది వినాశనానికి దారితీస్తుంది. 

      నేను అనేది సాత్వికం. నేను కూడా అనేది రాజసిక అహంకారం. నేను మాత్రమే అనేది తామసిక అహంకారం. 

      నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడ నుండి ఎక్కడికి అనే అన్వేషణ సాత్వికం. మనిషిని ఉన్నతస్థితికి చేర్చుతుంది. నేను కూడా అనేది రాజసికమైనది. నాకు ఒక ఉనికి, నాకు శక్తి ఉంది అని సాధనకు ఉపయోగిస్తుంది. ఈ రెండూ మంచివే, అవసరమే.

        నేనుమాత్రమే, నాకు మాత్రమే అనే తామసిక ప్రవృత్తి కల్గిన వారికి, వారిని వారి ద్వారా నే సర్వ నాశనం చేస్తుంది. 

      *దీనికంతా మనస్సే కారణం.*    

      కనుకనే మనస్సును బుద్ధికి స్వాధీనం చేసి, బుద్ధి ద్వారా కల్గిన విచక్షణ తో మంచి చెడులు తెలుసుకొని, మంచిని గ్రహించి, చెడును పారద్రోలాలి. కనుక బుద్ధి పరమాత్మ తత్వం. 

      బుద్ధికి మనస్సును అప్పచెప్పి జీవిత ప్రయాణం చేస్తే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పవు. మంచి కర్మలు మిగులుతాయి. అప్పుడు మానవుడు శివుడవుతాడు

వేదాలలో 'యజుర్వేదం' గొప్పది. యజుర్వేదంలో నాల్గవకాండలో ఉన్న 'రుద్రం' ఇంకా గొప్పది. రుద్రం మధ్యలో ఉన్న 'పంచాక్షరి' అంతకంటే గొప్పది. పంచాక్షరి లోని రెండక్షరాలు మరీ గొప్పవి. ఆ రెండక్షరాలు - "శివ". శివ అంటే మంగళం శుభం అని అర్ధం.

     - శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు 

నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే ... ఈ సంసారిక జీవితంలో మానవజన్మ తరించాలంటే నామ స్మరణ చేయాలి. భగవంతుణ్ణి చేరే మార్గంలో నామస్మరణం ఉత్తమం. శివ అనే రెండక్షరాలు పరబ్రహ్మ స్వరూపం. 'శి' అంటే పాపనాశనం. 'వ'అంటే ముక్తిప్రదానం.


లోకసమస్తాన్ని తనలో నిలుపుకొని, తానే లోకమైన విశ్వనాధుడు ఈశ్వరుడు. ఆదిదేవుడు, ఆద్యంతరహితుడు అయిన శివుడు మన జీవనతాత్త్వికతకు అతిసన్నిహితంగా ఉంటాడు. సుఖదుఃఖాలు అనే ద్వంద్వాల నడుమ సాగే మన జీవనయానంలో ద్వంద్వాలన్నింటినీ ఏకంచేసే అద్వయమూర్తిగా గోచరిస్తాడు.  

ప్రమధాది గణాలను నియంత్రించే సర్వాత్మకుడైన పరమశివుడే ఇంద్రియాల్ని నియంత్రించగలిగిన శక్తిమంతుడు. 

కాలకూట విషాన్ని, శేషనాగును కంఠంలో ధరించి ఉండటం ద్వారా మృత్యుంజయ రూపత్వం విశదమౌతుంది. గంగను శిరస్సుపై ధరించి విశ్వముక్తి మూలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అగ్నిమయమైన తృతీయ నేత్రం దగ్గరే చంద్రకళను ధరించి ఉండడం వల్ల సంహారకర్త పోషకత్వరూపమై విరుద్ధ ధర్మాశ్రయత్వాన్ని దిగ్దర్శితం చేస్తున్నట్లు తెలుస్తుంది. సర్వలోకాధిపతియై కూడా విభూతీ వ్యాఘ్రచర్మాన్ని ధరించి పామును మెడలో వేసుకొని, కపాలం చేబూని శ్మశానంలో తిరుగాడే లోకశివశంకరుడు వైరాగ్యంనే శ్రేష్ఠమైనదిగా వ్యక్తం చేస్తున్నాడు. 

                                                             అణిమాది అష్టసిద్దులున్న - ఒంటికి పూసుకునేది భస్మమే. చుట్టుకున్నది గజవస్త్రమే. ధరించేది నాగభరణాలే. శివుని మూడోనేత్రం జ్ఞాననేత్రం. నటరాజు స్వరూపం - కళాంతరంగుడైన శివుని కళా స్వరూపానికి ప్రతీక. స్వచ్ఛతకు హిమాలయం మారుపేరు. ధర్మరూపమైన వృషభమే వాహనం. చంద్రుడు చిత్తానికి ప్రతినిధి. గంగ చంచలత్వానికి గుర్తు. పులి స్వార్ధ చింతనకు మరో రూపం. ఏనుగంటే నిలువంత గర్వం. వాటన్నింటిని జయించమని చెబుతుంది శివతత్వం. నంది ధర్మానికి సర్పాలు నిర్భయత్వానికి నిదర్శనం.


భస్మాన్ని ధరించిన ఆయన దగ్గర ఏముందీ అని అడుగుతారు కొందరు. కానీ,

భస్మాన్ని మించిన పవిత్రమైనది ఈ సృష్టిలో వేరే ఏమీ లేదు. జన్మాంతర పాపాలను దహించి వేసేదే భస్మం. కాబట్టే, భస్మానికి 'విభూతి' అని పేరు. విభూతి అంటే ఐశ్వర్యమనీ అర్ధముంది. 


తాను గరళాన్ని మింగి లోకానికి అమృతం దక్కించిన ఈ నీలకంఠుని నెత్తిన నీళ్లు కుమ్మరిస్తే చాలు, మెచ్చి వరాలు కురిపించేస్తాడు. దోసెడు నీళ్ల అభిషేకం, చిటికెడు బూడిద అలంకారం, కూసిన్ని బిల్వపత్రాలు, కాసిన్ని ఉమ్మెత్తపువ్వులు, 'శంభో శంకర శరణు శరణు' అన్న స్మరణకే పొంగిపోయే బోళాశంకరుడు. .

అందుకే, 

నీలకంఠుని శిరసుపై నీళ్లుచల్లి

పత్తి రిసుమంత ఎవ్వాడు పాఱవైచు

కామధేనువు వానింటి గాడిపసర

మల్ల సురశాభి వానింటి మల్లెచెట్టు

అని మాదయగారి మల్లన్నవారు కొనియాడరు.  

సామాన్యుడైన, సంపన్నుడయినా, విద్యావంతుడయినా, అవిద్యావంతుడయినా, మిత్రుడయినా, శత్రువయినా పశువయినా, పురుగయినా ... అందరూ శివయ్యకు సమానమే. అందుకే -

సుహృద్విపక్ష పక్షమో, తృణారవింద చక్షు షో, ప్రజా మహిమహేంద్రయో, సమ ప్రవృత్తికః ... అని శివతాండవస్తోత్రం లో రావణాసురుడు కీర్తిస్తాడు.


సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం. ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు.... అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు శివయ్య.

రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు. భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చాడు. దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడు శంకరుడు. ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు. 

                                                  మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసిన చిరంజీవత్వమును ఒసగేసాడు, తిన్నడు నిరక్షరాసుడయిన ముక్తినిచ్చాడు. 

సాలెపురుగు సర్పం, ఏనుగు ప్రేమకే పరవశించి మోక్షాన్ని ప్రసాదించేసాడు. చెట్టునెక్కి, భయంతో రాత్రంతా మెలుకువగా ఉండడం కోసం కొన్ని ఆకులు వేసేసరికి విలుకాడిని కూడా ఆదరంగా అక్కున చేర్చేసుకున్నాడు. అధికపనులతో కష్టింపజేసిన, అవమానించిన, అవరోధించిన .... నొవ్వక నొప్పించక చెదరని భక్తితో, దీపారాధన చేసే చాకలి పోలికి స్వర్గప్రాప్తినిచ్చాడు. ఒకానొక రోజు, విసుగ్గా ఓ ఇల్లాలు విసిరిన మలిన వస్త్రాన్ని ఆనందంగా స్వీకరించి, శుభ్రపరచి, వత్తులుగా చేసి వెలిగించిన బీద బ్రాహ్మణుకి జీవనముక్తినే ప్రసాదించిన కారుణ్యమూర్తి. ఎంతటి కరుణశాలియో కదా, ఈ గుండె చల్లని దేవర.ఇంకా శివుని దయా గుణము గురించి ఏమి చెప్పగలను!

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  -  త్రయోదశి - శ్రవణం -‌‌ సౌమ్య వాసరే* (26.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (62)*


*త్రిసామా సామగః సామ*

*నిర్వాణం భేషజం భిషక్ ।*


*సంన్యాసకృచ్ఛమః శాంతో* 

*నిష్ఠా శాంతిః పరాయణం।*


*ప్రతి పదార్థం:~*


*578) త్రిసామా - మూడు విధములైన సామగానమలచే స్తుతింపబడు వాడు;*


*579) సామగః : - సామమును గానము చేయువాడు;  సామ గానము ద్వారా స్తుతింపబడు వాడు*


*580) సామః  - సామవేద స్వరూపమైన వాడు. మృదు మధుర స్వభావము కలవాడు*


*581) నిర్వాణమ్ - భక్తులకు పరమానందమును ప్రసాదించువాడు; పరమానంద స్వరూపుడు*


*582) భేషజం :- సంసారమనెడి మొండి రోగానికి దివ్య ఔషధం అయినవాడు*


*583) భిషక్ - వైద్యుడు; భక్తుల సంసార బంధనములకు సరియైన చికిత్స చేసేవాడు*


*584) సంన్యాసకృత్ - మోక్షమునకు మార్గమైన సన్యాసాశ్రమమును ఏర్పరచినవాడు*


*585) శమః : - తన మనస్సును పూర్తిగా నిగ్రహించినవాడు. ప్రశాంత మూర్తి .*


*586) శాంతః : - సదా ప్రశాంతమైన మనస్సు కలవాడు; శాంతి స్వరూపుడు.*


*587) నిష్ఠాః  - ఏకాగ్ర జ్ఞానమునకు స్థిరమైన కేంద్రము, లక్ష్యము; ప్రళయ కాలమున సర్వజీవులకు స్థిర నివాస స్థానము;.*


*588) శాంతిః : - సమాధి స్థితిలో సమస్తమును మరపించి పరమానందము ఒసగువాడు; శాంతి స్వరూపుడు.*


*589) పరాయణమ్ - సర్వోత్తమ గమ్యము, ఆశ్రయము, నిలయము, గతి*


*తాత్పర్యము:~*


*మూడువిధములగు సామవేద మంత్రగానములచేత తృప్తి పొందువాడును, సామవేదమును గానము చేయువాడును, వేదములలో సామవేదమైనవాడును, మోక్షస్వరూపుడును,  భయంకరమగు భవరోగమునకు ఔషధమైనవాడును, మహావైద్యుడును, మోక్షమునకు మార్గమైన సన్యాసాశ్రమమును, మనోనిగ్రహము గలవాడును, మనస్సునందు వికారములు లేకుండా పరమశాంతముగా నుండువాడును, సకల భూతములను ప్రళయకాలమందు తనలో విలీనము చేసుకొనువాడు ను, పరిపూర్ణమగు అజ్ఞాన నివృత్తిచేయువాడును,సర్వోత్తమ గమ్యమైనవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం భవతు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌        *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*విశాఖ నక్షత్రం 2వ పాదం జాతకులు పై 62వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఇప్పుడు తాను ఉన్న స్థితితో ఈశ్వరుని శుశ్రూష చేయ జాలనని శంకరులు చెప్పిన   శ్లోకం  ఇది.*


*శ్లోకం:30*    


*వస్త్రోద్ధూతవిధౌ  సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా*

                 

*గంధే గంధ వహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా*

                 

*పాత్రే కాంచన గర్భతాస్తి మయిచే ద్బాలేంందు ౘూడామణే !*

                 

*శుశ్రూషాం కరవాణి తే పశుపతే ! స్వామిన్ ! త్రిలోకీ గురో !!*


*పదవిభాగం:~*


*వస్త్రోద్ధూతవిధౌ _ సహస్రకరతా _ పుష్పార్చనే _ విష్ణుతా _  గంధే _ గంధవహాత్మతా _అన్నపచనే  _  బర్హిర్ముఖాధ్యక్షతా _ పాత్రే _ కాంచన _ గర్భతా _ అస్తి _ మయి _ చేత్ _బలేందు ౘూడామణే _ శుశ్రూషాం కరవాణి _ తే _ పశుపతే _ స్వామిన్ _ త్రిలోకీ గురో.*


*తాత్పర్యం :~*


*ఓయీ ! సర్వవ్యాపకా !  ఈశ్వరా ।నీకు వస్త్రోపచారం చేయడానికి వేయి చేతులుగల సూర్యుడు కావాలి. నీకు పుష్పోపచారం చేయడానికి , సర్వ వ్యాపకుడైన విష్ణువు కావాలి. నీకు గంధోపచారం చేయడానికి, గంధవహుడు అనగా వాయుదేవుడు కావాలి. వంట చేసి నీకు నైవేద్యం పెట్టడానికి అగ్నిముఖాధ్యక్షుడైన ఇంద్రుడు కావాలి. నీకు అర్ఘ్యపాత్రను సమర్పించడానికి హిరణ్యగర్భుడు కావాలి. అటువంటి సూర్యుడునూ, విష్ణుమూర్తినీ , వాయుదేవుడనూ, దేవేంద్రుడనూ, హిరణ్యగర్భుడనూ అయితే తప్ప  నీకు ఉపచారములు చేయడం నా తరముకాదు. (కాబట్టి నీకు నేను నమస్కారమును మాత్రమే చేస్తానని భావం)..*


*వివరణ:~*


*నిత్యమూ భగవంతుని పూజించాలన్నది మన విధి. పూజలో 64 అనగా చతుష్షష్టి ఉపచారాలు చేయాలని, శాస్త్రాలు చెబుతున్నాయి. దానికి శక్తి లేకపోతే , కనీసం 16 ‍ఉపచారాలు అనగా షోడశోపచారాలు చేయాలి. దానికీ శక్తిలేనివారు కనీసం పంచోపచారాలైనా చేయాలి.*


*కొందరు పంచ ఉపచారములు అనగా  (1) గంధం   (2)  పుష్పం   (3)  దీపం  (4)  ధూపం   (5)  నైవేద్యం అని చెపుతారు.*


*మరికొందరు  (1)  ధ్యానం (2)  ఆవాహనం  (3)   నైవేద్యం  (4)   నీరాజనం  (5) నమస్కారము అని చెపుతారు.* 


*నిత్యం పంచోపచారాలతోనైనా ఈశ్వరుని అర్చించాలి. ఈ విధంగా (1)  వస్త్రోపచారం  (2). పుష్పోపచారం  (3)  గంధోపచారం (4) నైవేద్యం  (5) అర్ఘ్యపాత్రోపచారాలు అనే  ఐదు ఉపచారాలు అయినా చేయడానికి తనకు శక్తి లేదని , శంకరులు తన అసహాయతను శివునకు ఈ శ్లోకంలో నివేదించారు.*


*ఓ ఈశ్వరా! నీవు సర్వ శరీరాధ్యక్షుడవు.  నీవు పశుపతివి. నీవు ముల్లోకాలకూ గురుడవు. ఇటువంటి నిన్ను సేవించాలంటే  నీకు ముందు వస్త్ర సమర్పణం చేయాలి.  ఆపని నావల్ల కాదు. ఆపని చేయడానికి సహస్రకరుడైన సూర్యుడు కావాలి.  నీకు వస్త్రాలను ఉతికి ఎండబెట్టి ఇవ్వాలంటే  వేయి చేతులు కలిగి లోకాలకు వెలుగునూ, వేడినీ ఇచ్చే సూర్యుడు కావాలి.*


*ఇక పుష్పాలను అర్పించి పుష్పోపచారం చేయాలంటే  అంతటా వ్యాపించే లక్షణం గల విష్ణుమూర్తికే నిన్ను పుష్పాలతో పూజించే శక్తి వుంటుంది.*


*ఈశ్వరా ! నీకు గంధం అర్పిద్దామంటే , ఆ శక్తి సర్వ గంధాలనూ మోసుకొని పోయే వాయుదేవునికి మాత్రమే వుంటుంది.  వాయువు వలె విలక్షణ సుగంధములను పొందించే శక్తి నాకు లేదు.*


*అన్నం వండి నైవేద్యం పెడదామంటే , అగ్ని మొదలయిన దిక్పాలకులకు నాయకుడైన దేవేంద్రుడు కావాలి. సర్వ దిక్పాలకులతో కూడిన దేవేంద్రుడంతటి వాడే నీకు నివేదన చేసే శక్తి కలవాడు. ఆపని నేను చేయలేను.*


*అలాగే పాత్రతో అర్ఘ్యం సమర్పించాలంటే, హిరణ్యగర్భుడైన బ్రహ్మయే కావాలి.*


*ఈశ్వరునికి  ఉపచారాలు చేయడం, తనవల్ల కాదని శంకరులే చెప్పారు గదాయని , మనం శివపూజ చేయడం మానరాదు. యథాశక్తిగా పూజించాలి. శివుడు ఎంతో గొప్ప వాడు అని చెప్పడానికే ఈ శ్లోకంలో ఈ ఉదాహరణలు చెప్పారు.  అంతేగాని మనం శివపూజకు అర్హులంకాము కాము అని అర్థంకాదు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(62వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

             *తారశశాంకం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఇష్టాయిష్టాలు, అభిమానాలు, ప్రేమలు, వయసులు గుర్తెరిగి మరీ వివాహాలు జరిపించాలి. వయస్సుల్లో మితిమీరిన ఎక్కువ తక్కువలు ఉండడం దాంపత్యానికి సరికాదు. యౌవనవతి భార్య, ముసలి భర్తల కాపురం నిలువదు. ఈ విషయాన్ని వ్యాసుడు భాగవతంలో చాలా చక్కగా చిత్రించాడు.*


*దేవతల గురువు బృహస్పతి వృద్ధుడు. గొప్ప మేధావి. బ్రహ్మజ్ఞాని. తపస్వి. జపతపాదులే అతని దినచర్య. దేవపురోహితుడు కావడంతో యజ్ఞయాగాదుల్లో క్షణం తీరిక లేకుండా గడపడం తప్పనిసరి అతనికి.*


*అందాల యువతి తారను వివాహం చేసుకున్నాడతను. వివాహం చేసుకున్న దగ్గర నుంచీ భర్తకు సేవలు చేయడమే తప్ప, శారీరకంగా తార ఎలాంటి సుఖానికీ నోచుకోలేదు. మనసు పరిపరి విధాల పోతున్నా, అణచుకుంటూ జీవించసాగిందామె. కోరికలను అదుముకోసాగింది.*


*బృహస్పతికి అనేకమంది శిష్యులు ఉండేవారు. వారంతా విద్య నేర్చుకునేందుకు ఆశ్రమాన్ని అంటిపెట్టికుని ఉండేవారు.*


*వారిలో చంద్రుడు ఒకడు. అతను అత్రి-అనసూయల పుత్రుడు. బ్రహ్మదేవుని అంశ. గొప్ప అందగాడు. అతన్ని చూసింది తార . మైమరచింది. మిసమిసలాడే యవ్వనంతో ఉన్నాడు, తగిన ఈడూజోడు అనుకున్నది. మోహించిందతన్ని. వృద్ధుడు బృహస్పతితో తీరని కోరికలన్నీ తీర్చుకునేందుకు తప్పుదోవ పట్టిందామె.*


*భర్త ఇంట లేని వేళ చంద్రునితో సుఖించసాగింది. కొన్నాళ్ళకు గర్భవతి అయింది. ఆమె గర్భంలో ఉన్నది తన ప్రతిరూపం, ఆ రూపాన్ని జాగ్రతగా చూసుకోవాలనుకున్నాడు చంద్రుడు. తారను బృహస్పతికి దూరం చేశాడు.*


*తీసుకునిపోయాడామెను. తన భార్య తనకు కావాలన్నాడు బృహస్పతి. ఇవ్వనన్నాడు చంద్రుడు. ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. చంద్ర బృహస్పతుల యుద్ధం దేవదానవ సంగ్రామంగా మారింది. దేవగురువు బృహస్పతి మీద ఉండే ఈర్ష్యాసూయల కారణంగా చంద్రుణ్ణి సమర్థించాడు రాక్షసగురువు శుక్రాచార్యుడు. అదే అదనుగా రాక్షసులంతా చంద్రుని పక్షం వహించారు. రుద్రుడూ, ఇంద్రాది దేవతలూ బృహస్పతి పక్షం వహించారు. ఫలితంగా దేవదానవయుద్ధం చెలరేగింది. బ్రహ్మ జోక్యం చేసుకున్నా యుద్ధాన్ని విరమించలేదెవరూ. ఒక స్త్రీ కోసం ఇంతటి యుద్ధం తగదన్నా వినిపించుకోలేదు. ఆఖరికి చంద్రునికి నచ్చజెప్పి, తారను బృహస్పతికి ఇప్పించాడు బ్రహ్మ. భార్యను వెంటపెట్టుకుని వెళ్ళిపోయాడు బృహస్పతి.*


*కొన్నాళ్ళకు తార ప్రసవించింది. చక్కని కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడు నా వాడంటే నా వాడంటూ అప్పుడు చంద్ర బృహస్పతులిద్దరూ మళ్ళీ తగవు పడ్డారు. తగవు ఎంతటికీ తేలకపోవడంతో ఈసారి కూడా బ్రహ్మే జోక్యం చేసుకున్నాడు. తారను అడిగాడిలా.*


*‘‘ఈ బిడ్డకు తండ్రి ఎవరు?’’*


*‘‘చంద్రుడు’’ నిజం చెప్పింది తార.*


*ఈసారి బృహస్పతికి నచ్చజెప్పి, బిడ్డణ్ణి చంద్రునికి ఇప్పించాడు బ్రహ్మ. అతని పేరే బుధుడు. చక్కదనంలో చంద్రునికీ, బుద్ధిలో బృహస్పతికీ సరయినవాడు బుధుడు. నిత్య యవ్వనుడు. నవగ్రహాలలో ఒకడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

తప్పదు

 *🌹🌹🌹🌹  శుభోదయం  🌹🌹🌹🌹*


           *స్వప్నం ఎంత అందంగా ఉన్నా నిద్ర లేవక తప్పదు*


         *బాధ ఎంత పెద్దది అయినా దాటుకుని వెళ్ళక తప్పదు.*


            *భగవంతుడు మనకు ఏమి ఇవ్వలేదో వాటిని గురించి తలచుకొని బాధపడవద్దు.*


             *దేవుడు మనకు ఏమి ఇచ్చాడో వాటిని ఉపయోగించుకొని జీవితాన్ని ఆనందమయంగా గడపాలి.*


*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

సంగీతం రోగాలను

 సంగీతం రోగాలను ఎందుకు నయం చేయగలదు? 


సైన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి వివరిస్తున్న అద్భుతమైన కథనం


భారతీయ సంగీతంలో ఏడు స్వరాలు లేదా స్వరాలు / వైబ్‌లు ఉన్నాయి; షడ్జమం, ఋషభం, గాంధారం, మధ్యమం,

పంచమం, ధివతం మరియు నిషాదం (స, రే, గ, మ, ప, ద మరియు నే).


రాగం అనేది కొన్ని మార్గాల్లో దాని స్వంత సంగీత వ్యక్తిత్వంతో ఒక రకమైన ఆధ్యాత్మిక వ్యక్తీకరణ. సంగీతం అనేది లయ, రాగం, స్వరాలు, శ్రుతి, హమ్మింగ్ వంటి అందమైన రూపాలలో ఆలోచనలు మరియు భావోద్వేగాలను వ్యక్తీకరించే ఒక కళ. ఇంకా, సంగీతకారుడు మొత్తం నాలుగు పాత్రలను పోషిస్తే, పాటల రచయిత, స్వరకర్త, గాయకుడు మరియు వాయిద్యకారుడు.


సంగీతం ఒక అనుభూతి లేదా భావోద్వేగం. కుడిచేతి వాటం ఉన్న వ్యక్తికి, మెదడు యొక్క ఎడమ వైపు అందుకుంటుంది మరియు

సాహిత్యాన్ని ప్రాసెస్ చేస్తుంది మరియు కుడి వైపు శ్రావ్యతతో పాల్గొంటుంది. రిథమ్ అవగాహన మరియు ప్రాసెసింగ్

కుడి మెదడు యొక్క విధులు కూడా. కాబట్టి, ఏదైనా శాస్త్రీయ సంగీతంలో వాయిద్యాలు మాత్రమే ఉంటాయి

గాలి లేదా తీగలు, పెర్కుషన్లతో పాటు, సంగీత అనుభవం కుడి మెదడును సక్రియం చేస్తుంది. అలా అయితే

స్వర శాస్త్రీయ సంగీతంలో కొన్ని సాహిత్యం ఉండవచ్చు, ముఖ్యంగా థుమ్రిస్ మరియు గజల్స

ఋణ_విమోచన_స్తోత్రాలు

 ఋణ_విమోచన_స్తోత్రాలు🙏🙏

ఆర్దిక ఋణాలతో, అప్పులతో, డబ్బు సరియైన సమయానికి రాక, అనేక  బాధలు, ఇబ్బందులు పడే వారి కోసం ఈ ఋణ విమోచన స్తోత్రాలు:-✍️


ఈ కలికాలంలొ మానవులు ఆర్దిక ఋణాలతో, అప్పులతో, డబ్బు సరియైన సమయానికి రాక, అనేక బాధలు, ఇబ్బందులు పడుతూ వుంటారు.

 ఇలాంటి వారికోసమే మన మహర్షులు-

గౌతమ, అగస్త్య, వ్యాస మహర్షీ లాంటివారు  ముందుగానే గ్రహించి,  

కొన్ని శక్తివంతమైన స్తోత్రాలు చెప్పారు. 


వీటిని రోజూ మూడుపూటలా పఠిస్తే...

మీ ఋణబాధలు తొలుగుతాయి, 

డబ్బు సరియైన సమయంలొ మీ చేతికి అందుతుంది. కనీసం రోజుకు ఒక్కసారి అయిన చదవాలి.


1. ఋణ విమోచన గణేశ స్తోత్రం:-✍️

ధ్యానం

సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం

బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం||

స్తోత్రం

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే| సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే|| ౧ ||

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః| సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||

హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః| సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః| సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః| సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే| సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః| సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||

పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః| సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం| ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్| పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్| ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం| సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్| అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్| భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే| ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||


2. ఋణ విమోచన అంగారక స్తోత్రం:-✍️


స్కంద ఉవాచ 

ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్|

బ్రహ్మోవాచ 

వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం|

అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య|  గౌతమ ఋషిః| అనుష్టుప్ ఛందః| అంగారకో దేవతా| మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః||

ధ్యానమ్ 

రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః|చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || ౧ ||

మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః| స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || ౨ ||

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః| ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || ౩ ||

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః|సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ౪ ||

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్| ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం || ౫ 

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః|నమోఽస్తు తే మమాఽశేష ఋణమాశు వినాశయ || ౬ ||

రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదకైః|మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా || ౭ ||

ఏకవింశతి నామాని పఠిత్వా తు తదండకే|ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || ౮ ||

తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశత్|

మూలమంత్రః 

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల|నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్| మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా||

అర్ఘ్యం 

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల|నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః| ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తుతే౧౨

3. శ్రీనరసింహ ఋణమోచన స్తోత్రం:-✍️

ఓం దేవానాం కార్యసిధ్యర్థం సభాస్తమ్భసముద్భవమ్। శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౧॥

లక్ష్మ్యాలిఙ్గితవామాఙ్గం భక్తానామభయప్రదమ్। శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౨॥

ప్రహ్లాదవరదం శ్రీశం దైతేశ్వరవిదారణమ్। శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౩॥

స్మరణాత్సర్వపాపఘ్నం కద్రుజం విషనాశనమ్। శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౪॥

అన్త్రమాలాధరం శఙ్ఖచక్రాబ్జాయుధధారిణమ్। శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౫॥

సింహనాదేన మహతా దిగ్దన్తిభయదాయకమ్। శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౬॥

కోటిసూర్యప్రతీకాశమభిచారికనాశనమ్। శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౭॥

వేదాన్తవేద్యం యజ్ఞేశం బ్రహ్మరుద్రాదిసంస్తుతమ్। శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ఓం  ౮॥

ఇదం యో పఠతే నిత్యం ఋణమోచకసంజ్ఞకమ్। అనృణీజాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ॥ ౯॥


॥ ఇతి శ్రీనృసింహపురాణే ఋణమోచనస్తోత్రం సంపూర్ణం.

4. దారిద్ర్య దహన  శివ స్తోత్రం:-✍️

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ

కర్ణామృతాయ శశిశేఖరధారణాయ| కర్పూరకాంతిధవళాయ జటాధరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౧ ||

గౌరీప్రియాయ రజనీశకళాధరాయ

కాలాంతకాయ భుజగాధిపకంకణాయ| గంగాధరాయ గజరాజవిమర్దనాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౨ ||

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ

ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ| జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౩ ||

చర్మంబరాయ శవభస్మవిలేపనాయ

భాలేక్షణాయ మణికుండలమండితాయ| మంజీరపాదయుగళాయ జటాధరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౪ ||

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ

హేమాంశుకాయ భువనత్రయమండితాయ| ఆనందభూమివరదాయ తమోహరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౫ ||

భానుప్రియాయ దురితార్ణవతారణాయ

కాలాంతకాయ కమలాసనపూజితాయ| నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౬ ||

రామప్రియాయ రఘునాథవరప్రదాయ

నాగప్రియాయ నరకార్ణవతారణాయ| పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౭ ||

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ

గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ| మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౮ ||

ఇతి శ్రీ దారిద్య్రదహన శివ స్తోత్రం సంపూర్ణం..!!


 చర్మవ్యాధి నివారణ :-

గజ్జి, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల నివారణకు సోమవారం నాడు చందనం, అగరబత్తితో శివలింగానికి పూజచేసి, క్రింది మంత్రంతో అభిమంత్రించిబాధాస్థానంలో ఉంచాలి. పరమ శివుని కృపవల్ల వ్యాధి నయమవుతుంది

మంత్రం :-

ఓం భం యూం ఓం  ఈ మంత్రం పఠించాలి.

దేవాలయం

 మణికుమార్ ✡️🕉️🔯


      *ఎండాకాలంలో చల్లగా చలికాలంలో వేడిగా ఉండే దేవాలయం* 


ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లజిల్లా బాపట్లలోని శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం అత్యంత పురాతనమైనది. 


దాదాపు 1,500 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయం ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ దేవాలయంలో చలికాలంలో వెచ్చగా, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది.


*నమో భావదేవాయ* 


ఇక ఈ దేవాలయంలో విగ్రహం మునికాళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. ఇటువంటి విగ్రహం భారత దేశంలో ఇది ఒక్కటే అని చెబుతారు.


 ఇక ఇక్కడ ఉన్న మరో మూలవిరాట్టు ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం శాంతకేశవ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇక మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయం పూర్తి వివరాలు మీ కోసం...


 *అత్యంత ప్రాచీన దేవాలయం*


భావనారాయణ స్వామి దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారత దేశంలోనే అత్యంత ప్రాచీన దేవాలయాలు. వీటి నిర్మాణం దాదాపు 1500 ఏళ్లకు పూర్వం జరిగిందని తెలుస్తోంది.


 *పంచ భావన్నారాయణ దేవాలయాలు*


భావనారాయణ స్వామి దేవాలయాలు మొత్తం ఐదు. అందువల్లే వీటిని పంచ భావన్నారాయ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ ఐదు క్షేత్రాలు వరుసగా బాపట్ల, పొన్నూరు, భావరేవరపల్లి, సర్పవరం, పట్టిసీమ.


 *భావన్నారాయణుడి వల్ల భావపురి*


మరికొంతమంది ఇందులో  జిల్లాలోని పెద గజాం కూడా ఉందని చెబుతారు. వీటిలో ముఖ్యమైనది బాపట్ల. ఇక్కడ నెలకొన్న భావనారాయణ స్వామి వల్ల ఈ ఊరిని మొదట భావపురి అని పిలిచేవారు.


అటు పై భావపురి కాలక్రమంలో బాపట్లగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడితో పాటు పరివార దేవతలైన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవారు, ఆళ్వారులు ఉన్నారు.


*కాలి వేళ్ల పై నిలబడి*


ఇక్కడ భావన్నారాయణ స్వామి కాలి వేళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుందిం. ఇలా ఓ దేవతా మూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారత దేశంలో మరెక్కడా కనిపించవు.


 *చలికాలంలో వెచ్చగా*


ఈ ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉంటుంది. ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఆ ఆలయానికి రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు గజపాద (ఏనుగు కాలు) ఆకారంలో ఉండటం విశేషం.


 *చేప ఆకారంలో*


ఆలయ గర్భగుడి వెనుక పై కప్పు మత్స్యం అంటే చేప ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 594లో భావనారాయణుడి సూచనమేరకు చోళ రాజైన క్రిమికంఠ చోళుడు నిర్మించినట్లు చెబుతారు.


*దేవరాయులు*


ఇతని తర్వాత చోళ భూపాల దేవుడు, వీర ప్రతాప శూర భల్లయ చోళ మహారాజు, కుళోత్తుంగ చోళదేవరాజు, గజపతులు, దేవరాయులు అటుపై అచ్చుత దేవరాయులు, సదాశివరాయులు ఈ ఆలయం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.


*జ్వాలా నరసింహుడు*


ఇదిలాఉండగా భావనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం జరిగే సమయంలో పునాదుల కోసం తవ్వుతుండగ అక్కడి వారికి జ్వాలా నరసింహ స్వామి విగ్రహం దొరికింది. దీంతో ఆ విగ్రహన్ని స్వామివారి విగ్రహం పక్కనే పెట్టి పూజించేవారు.


అయితే ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు అనే గ్రామం తరుచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి. ఈ విషయమై క్రిమకంఠ చోళుడు అక్కడి పురోహితులను సంప్రదించి పరిష్కారం చూపమని అడిగారు. 


దీంతో పురోహితులు జ్వాలా నరసింహుడి ఉగ్ర రూపం వల్ల ఇక్కడ తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఆయన్ను శాంతింప చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం స్వామివారి ఆలయానికి ఎదురుగా శాంత కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.


అప్పటి నుంచి ఆ కారంచేడు గ్రామంలో అగ్నిప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు. ఇక జ్వాలా నరసింహుడి విగ్రహం ఆసీన రీతిలో ఉంటుంది.


 నాలుగు చేతులు ఉంటాయి. పై రెండు చేతులతో శంఖం, చక్రం ఉండగా కింది కుడి చేయి అభయ హస్తం. ఎడమ చేయి తొడపై ఉంటుంది.

తిరుపతి పుట్టిన రోజు*

 *నేడు తిరుపతి పుట్టిన రోజు*


పుట్టిన రోజులు మ‌నుషుల‌కే కాదు, ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తికి ఉంది. 


తిరుపతి నగరం క్రీ.శ.1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీ వైష్ణవ సంప్ర‌దాయాల్ని ఆచ‌రించే భగవద్ శ్రీ‌రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. నాడు తిరుప‌తి న‌గ‌రానికి రామానుజాచార్యుల చేతుల మీదుగా పునాది వేయ‌డం, అనంత‌ర కాలంలో దిన‌దినాభివృద్ధి చెందుతూ వ‌చ్చింది.


సౌమ్య నామ సంవత్సరం ఉత్తరా నక్షత్రం ఫాల్గుణ పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించి, నిత్య కైంకర్యాలు చేసేశారు. నాలుగు మాడ వీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. మొద‌ట రామానుజ‌పురంగా, ఆ త‌ర్వాత గోవింద‌రాజ ప‌ట్ట‌ణంగా పిలుచుకునేవారు. 


13వ శ‌తాబ్దం నుంచి తిరుప‌తిగా పిల‌వ‌డం మొద‌లైన‌ట్టు శాస‌నాలు చెప్తున్నాయి. స‌మ‌తా ధ‌ర్మాన్ని ప్ర‌బోధించిన రామానుజాచార్యులు సంక‌ల్పించ‌క‌పోతే, నేడు హిందువుల ఆధ్మాత్మిక రాజ‌ధానిగా ఎంతో గొప్ప‌గా భావించే తిరుప‌తి న‌గ‌రం లేనేలేదు.


తిరుప‌తి పుట్టిన రోజును జ‌రుపుకోవ‌డం అంటే, మ‌న ఆధ్యాత్మిక న‌గ‌రం విశిష్ట‌త‌ను ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డం. అలాగే భావిత‌రాల‌కు మ‌న న‌గ‌రం చ‌రిత్ర గురించి తెలియ‌జేయ‌డం. . 


 తిరుప‌తి అంటేనే సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆధ్యాత్మిక చింత‌న‌, ఓంకార నాధం.

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(61వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *భగీరథుడు-గంగావతరణం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *శంకరుని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడు భగీరథుడు. అతని తపస్సును మెచ్చుకున్నాడు శంకరుడు. ప్రత్యక్షమయ్యాడు. భగీరథుని అభీష్టాన్ని నెరవేర్చేందుకు సిద్ధమయ్యాడు.*


*స్వర్గం నుంచి మహావేగంతో దూకుతూ వచ్చింది గంగ. శంకరుని శిరస్సున పడింది. భరించాడు శంకరుడు, తన జటాఝూటాన ధరించాడామెను. నాటి నుంచే శంకరుణ్ణి ‘గంగాధరుడు’ అని వ్యవహరించసాగారంతా.*


*శంకరుని శిరస్సు నుంచి జారి ప్రవహించసాగింది గంగ. రథాన్ని అధిరోహించి భగీరథుడు ముందు పరుగుదీస్తోంటే అతన్ని అనుసరించింది గంగ.* 


*హిమవత్పర్వతం నుంచి మహావాహినిగా భూలోకానికి వచ్చింది. భూలోకానికి వస్తూ వస్తూ జహ్నుముని యజ్ఞవాటికను ముంచి వేసింది గంగ. కోపం వచ్చింది మునికి.*


*గంగను పుక్కిటపట్టాడు. వదలనని పట్టుబట్టాడు. అతన్ని ఎన్నో విధాల ప్రార్థించాడు భగీరథుడు. కరుణించమని కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు తన చెవిలోనుంచి గంగను వదలిపెట్టాడు జహ్నువు. జహ్నువు చెవి నుండి వెలువడిన కారణంగా గంగకు ‘జాహ్నవి’ అని పేరు వచ్చింది.*


*గంగను రసాతలానికి తీసుకుని వెళ్ళాడు భగీరథుడు. అక్కడ భస్మరాశులుగా పడి ఉన్న పితరులయిన సగరపుత్రుల దగ్గర ఆగాడు. గ్రహించింది గంగ. సగరపుత్రులను స్పృశించింది. అంతే! అరవై వేలమంది సగరపుత్రుల పాపాలన్నీ పటాపంచలయి, వారంతా సద్గతి పొందారు.*


*భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకుని వచ్చిన కారణంగా ఆమెను ‘భాగరథి’ అన్నారు. గొప్ప ప్రయత్నం చేసి భగీరథుడు ఇంతటి మహత్కార్యాన్ని సాధించిన కారణంగా ఎవరయినా గొప్ప ప్రయత్నానికి పూనుకుంటే దానిని ‘భగీరథీ ప్రయత్నం’ అంటున్నారు.*


*ఈ వంశంలోనే ఋతుపర్ణుడు జన్మించాడు. అయోధ్య పట్టణాన్ని ఏలిన ప్రముఖుల్లో అతను కూడా ఒకడు. అక్ష హృదయం విద్యలో ఋతుపర్ణుణ్ణి మించిన వారు లేరు. బాహుకుడు అనే పేరుతో నలమహారాజు ఇతని వద్దనే వంటలవాడుగా చేరాడు. నలుని నుంచి అశ్వహృదయం విద్య నేర్చుకుని, తనకు తెలిసిన అక్షహృదయం విద్యను నలునికి నేర్పిన ఘనత కూడా ఋతుపర్ణునిదే!*


*ఇదే సూర్యవంశంలో ఖట్వాంగుడు జన్మించాడు. విష్ణుభక్తునిగా ఉత్తమపదం అందుకున్నాడు. ఖట్వాంగునికి దీర్ఘబాహువు, దీర్ఘబాహువుకి రఘువు జన్మించారు. రఘువుతోనే రఘువంశం ఏర్పడింది. ఈ వంశంలోనే శ్రీరామచంద్రుడు అవతరించాడు. రఘువు కుమారుడు అజమహారాజు. అజమహారాజు పుత్రుడే దశరథుడు. దశరథునికే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముని కుమారుడే కుశుడు. కుశసంతతి సుమిత్రునితో కలియుగంలో ఇక్ష్వాకువంశం అంతరించిందని వ్యాసుడు పేర్కొన్నాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

జగద్గురు ఆదిశంకరాచార్యులు* *విరచిత* *”శివానందలహరి”*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురువులైన శంకరులు, ఈ శ్లోకంలో తమపై కరుణా కటాక్షాన్ని ప్రసరింప జేయుమనీ, తమకు గురువుగా నిల్చి, బ్రహ్మోపదేశాన్ని చేయుమనీ ఈశ్వరుని ప్రార్థించారు.*


*శ్లోకం: 29*


*త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం*

           

*త్వా మీశం శరణం వ్రజామి వచసా త్వామేవ  యాచే ప్రభో ! (విభో)*

           

*వీక్షాం(దీక్షాం) మే దిశ  చాక్షుషీం సకరుణాం  దివ్యైశ్చిరం   ప్రార్థితాం*

           

*శంభో !   లోకగురో  !   మదీయ  మనసః    సౌఖ్యోపదేశం   కురు. !!*


*పదవిభాగం:~*


*త్వత్పాదాంబుజమ్ _ అర్చయామి _  పరమం _  త్వాం _ చింతయామి - అన్వహం _ త్వామ్ _ ఈశం _  శరణం _ వ్రజామి _ వచసా _ త్వామ్ _ ఏవ _యచే _ ప్రభో _ (విభో)  _  వీక్షాం _ (దీక్షాం)  _ మే _ దిశ _ చాక్షుషీం _ సకరుణాం _ దివ్యైః _ చిరం _ ప్రార్థితాం _ శంభో _ లోకగురో _ మదీయ మనసః _ సౌఖ్యోపదేశం _ కురు.*


*తాత్పర్యం :~*


*శంకరా !  జగద్గురూ ! ప్రభూ  నేను నీ పాదపద్మములను ఆరాధిస్తున్నాను. ప్రతిదినమూ  పరమ పురుషుడవైన నిన్ను ధ్యానిస్తున్నాను. ఈశ్వరుడవైన నిన్ను  శరణు పొందు తున్నాను.  వాక్కుచే నిన్నే యాచిస్తున్నాను. దేవతలచే చిరకాలంగా ప్రార్థింపబడిన, కరుణతో కూడిన నీ దృగ్దీక్షను (కరుణా కటాక్ష ప్రసారాన్ని) నా పై ప్రసరింప జేయుము. తరువాత సౌఖ్యంగానూ, ప్రశాంతంగానూ ఉండేటట్లు  , నా మనస్సునకు బ్రహ్మోపదేశాన్ని చెయ్యి.*


*వివరణ:~*


*మనోవాక్కాయముల ద్వారా భగవంతుని సేవచేయాలనే విషయం ఈ శ్లోకంలో ప్రకటింపబడింది.*


*ఇందులో పూజ అన్నది కాయికం. ధ్యానం అనేది మానసికం.*


*"త్వమేవ శరణం మమ"  అని శరణు కోరడం వేడుకోవడం _ అన్నది వాచికం. ఈ విధంగా త్రికరణాలతో చేసే దైవ సేవ వల్ల మన ఏ పని ఫలవంతం కావాలన్నా, ఆ పనికి చేసే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా వుండాలి.*


*మనస్సు, వాక్కు, శరీరం (కాయం) అనే మూడింటినీ, "త్రికరణాలు " అని అంటారు. మనోవాక్కాయములతో పరిశుద్ధిగా చేసేదానినే త్రికరణ శుద్ధి అంటారు. అంటే  చేసేది, చెప్పేది, ఆలోచించేది ఒకటే అయి ఉండాలి.   భగవంతుని సేవ త్రికరణ శుద్ధిగా చేయాలి.*


*శంకరులు ఈ శ్లోకంలో భగవద్దర్శనానికై పరితపించారు.  శంకరా ! నిన్ను శరణు కోరు తున్నాను. దయాదృష్టితో చూడు అని ప్రార్థించారు. తన మనస్సుకు సుఖంగా ఉండేటట్లు ఉపదేశం చెయ్యి ప్రభూ ! అని కోరారు.*


*ఉత్తమ భక్తుని పరిస్థితి ఇలాగే  వుంటుంది. చెరువులోనుండి గట్టుపై పడిన చేపలా, భగవద్దర్శనానికీ, భగవంతునితో మాట్లాడడానికీ, ఆ భక్తుడు పరితపిస్తాడు.*


*అప్పుడు భగవంతునికి ఆ భక్తునిపై జాలి కల్గుతుంది. ఆకలితో ఉన్న పిల్ల వాడికి తల్లి అన్నం పెట్టకుండా ఉండలేదు కదా ! దేవుడికికూడా ,అప్పుడు భక్తుణ్ణి చూసి , భక్తుణ్ణి చేతితో స్పృశించి మాట్లాడాలనే ఇచ్ఛ కలుగుతుంది. అప్పుడు భగవంతుడు గురువు రూపంలో భక్తుని వద్దకు వచ్చి ఉపదేశం చేస్తాడు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️