26, ఫిబ్రవరి 2025, బుధవారం

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (62)*


*త్రిసామా సామగః సామ*

*నిర్వాణం భేషజం భిషక్ ।*


*సంన్యాసకృచ్ఛమః శాంతో* 

*నిష్ఠా శాంతిః పరాయణం।*


*ప్రతి పదార్థం:~*


*578) త్రిసామా - మూడు విధములైన సామగానమలచే స్తుతింపబడు వాడు;*


*579) సామగః : - సామమును గానము చేయువాడు;  సామ గానము ద్వారా స్తుతింపబడు వాడు*


*580) సామః  - సామవేద స్వరూపమైన వాడు. మృదు మధుర స్వభావము కలవాడు*


*581) నిర్వాణమ్ - భక్తులకు పరమానందమును ప్రసాదించువాడు; పరమానంద స్వరూపుడు*


*582) భేషజం :- సంసారమనెడి మొండి రోగానికి దివ్య ఔషధం అయినవాడు*


*583) భిషక్ - వైద్యుడు; భక్తుల సంసార బంధనములకు సరియైన చికిత్స చేసేవాడు*


*584) సంన్యాసకృత్ - మోక్షమునకు మార్గమైన సన్యాసాశ్రమమును ఏర్పరచినవాడు*


*585) శమః : - తన మనస్సును పూర్తిగా నిగ్రహించినవాడు. ప్రశాంత మూర్తి .*


*586) శాంతః : - సదా ప్రశాంతమైన మనస్సు కలవాడు; శాంతి స్వరూపుడు.*


*587) నిష్ఠాః  - ఏకాగ్ర జ్ఞానమునకు స్థిరమైన కేంద్రము, లక్ష్యము; ప్రళయ కాలమున సర్వజీవులకు స్థిర నివాస స్థానము;.*


*588) శాంతిః : - సమాధి స్థితిలో సమస్తమును మరపించి పరమానందము ఒసగువాడు; శాంతి స్వరూపుడు.*


*589) పరాయణమ్ - సర్వోత్తమ గమ్యము, ఆశ్రయము, నిలయము, గతి*


*తాత్పర్యము:~*


*మూడువిధములగు సామవేద మంత్రగానములచేత తృప్తి పొందువాడును, సామవేదమును గానము చేయువాడును, వేదములలో సామవేదమైనవాడును, మోక్షస్వరూపుడును,  భయంకరమగు భవరోగమునకు ఔషధమైనవాడును, మహావైద్యుడును, మోక్షమునకు మార్గమైన సన్యాసాశ్రమమును, మనోనిగ్రహము గలవాడును, మనస్సునందు వికారములు లేకుండా పరమశాంతముగా నుండువాడును, సకల భూతములను ప్రళయకాలమందు తనలో విలీనము చేసుకొనువాడు ను, పరిపూర్ణమగు అజ్ఞాన నివృత్తిచేయువాడును,సర్వోత్తమ గమ్యమైనవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం భవతు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌        *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*విశాఖ నక్షత్రం 2వ పాదం జాతకులు పై 62వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

కామెంట్‌లు లేవు: