26, ఫిబ్రవరి 2025, బుధవారం

జగద్గురు ఆదిశంకరాచార్యులు* *విరచిత* *”శివానందలహరి”*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురువులైన శంకరులు, ఈ శ్లోకంలో తమపై కరుణా కటాక్షాన్ని ప్రసరింప జేయుమనీ, తమకు గురువుగా నిల్చి, బ్రహ్మోపదేశాన్ని చేయుమనీ ఈశ్వరుని ప్రార్థించారు.*


*శ్లోకం: 29*


*త్వత్పాదాంబుజ మర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం*

           

*త్వా మీశం శరణం వ్రజామి వచసా త్వామేవ  యాచే ప్రభో ! (విభో)*

           

*వీక్షాం(దీక్షాం) మే దిశ  చాక్షుషీం సకరుణాం  దివ్యైశ్చిరం   ప్రార్థితాం*

           

*శంభో !   లోకగురో  !   మదీయ  మనసః    సౌఖ్యోపదేశం   కురు. !!*


*పదవిభాగం:~*


*త్వత్పాదాంబుజమ్ _ అర్చయామి _  పరమం _  త్వాం _ చింతయామి - అన్వహం _ త్వామ్ _ ఈశం _  శరణం _ వ్రజామి _ వచసా _ త్వామ్ _ ఏవ _యచే _ ప్రభో _ (విభో)  _  వీక్షాం _ (దీక్షాం)  _ మే _ దిశ _ చాక్షుషీం _ సకరుణాం _ దివ్యైః _ చిరం _ ప్రార్థితాం _ శంభో _ లోకగురో _ మదీయ మనసః _ సౌఖ్యోపదేశం _ కురు.*


*తాత్పర్యం :~*


*శంకరా !  జగద్గురూ ! ప్రభూ  నేను నీ పాదపద్మములను ఆరాధిస్తున్నాను. ప్రతిదినమూ  పరమ పురుషుడవైన నిన్ను ధ్యానిస్తున్నాను. ఈశ్వరుడవైన నిన్ను  శరణు పొందు తున్నాను.  వాక్కుచే నిన్నే యాచిస్తున్నాను. దేవతలచే చిరకాలంగా ప్రార్థింపబడిన, కరుణతో కూడిన నీ దృగ్దీక్షను (కరుణా కటాక్ష ప్రసారాన్ని) నా పై ప్రసరింప జేయుము. తరువాత సౌఖ్యంగానూ, ప్రశాంతంగానూ ఉండేటట్లు  , నా మనస్సునకు బ్రహ్మోపదేశాన్ని చెయ్యి.*


*వివరణ:~*


*మనోవాక్కాయముల ద్వారా భగవంతుని సేవచేయాలనే విషయం ఈ శ్లోకంలో ప్రకటింపబడింది.*


*ఇందులో పూజ అన్నది కాయికం. ధ్యానం అనేది మానసికం.*


*"త్వమేవ శరణం మమ"  అని శరణు కోరడం వేడుకోవడం _ అన్నది వాచికం. ఈ విధంగా త్రికరణాలతో చేసే దైవ సేవ వల్ల మన ఏ పని ఫలవంతం కావాలన్నా, ఆ పనికి చేసే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా వుండాలి.*


*మనస్సు, వాక్కు, శరీరం (కాయం) అనే మూడింటినీ, "త్రికరణాలు " అని అంటారు. మనోవాక్కాయములతో పరిశుద్ధిగా చేసేదానినే త్రికరణ శుద్ధి అంటారు. అంటే  చేసేది, చెప్పేది, ఆలోచించేది ఒకటే అయి ఉండాలి.   భగవంతుని సేవ త్రికరణ శుద్ధిగా చేయాలి.*


*శంకరులు ఈ శ్లోకంలో భగవద్దర్శనానికై పరితపించారు.  శంకరా ! నిన్ను శరణు కోరు తున్నాను. దయాదృష్టితో చూడు అని ప్రార్థించారు. తన మనస్సుకు సుఖంగా ఉండేటట్లు ఉపదేశం చెయ్యి ప్రభూ ! అని కోరారు.*


*ఉత్తమ భక్తుని పరిస్థితి ఇలాగే  వుంటుంది. చెరువులోనుండి గట్టుపై పడిన చేపలా, భగవద్దర్శనానికీ, భగవంతునితో మాట్లాడడానికీ, ఆ భక్తుడు పరితపిస్తాడు.*


*అప్పుడు భగవంతునికి ఆ భక్తునిపై జాలి కల్గుతుంది. ఆకలితో ఉన్న పిల్ల వాడికి తల్లి అన్నం పెట్టకుండా ఉండలేదు కదా ! దేవుడికికూడా ,అప్పుడు భక్తుణ్ణి చూసి , భక్తుణ్ణి చేతితో స్పృశించి మాట్లాడాలనే ఇచ్ఛ కలుగుతుంది. అప్పుడు భగవంతుడు గురువు రూపంలో భక్తుని వద్దకు వచ్చి ఉపదేశం చేస్తాడు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: