26, ఫిబ్రవరి 2025, బుధవారం

ఎత్తైన ఈ శివలింగం

 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ శివలింగం గురించి మీకు తెలుసా?


మీరు ఎన్నో పురాతన శివాలయాలను చూసి ఉంటారు. కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగాన్ని ఎప్పుడైనా చూసారా? లేకపోతే జీరో వ్యాలీలోని ఈ శివాలయం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.శివా పురాణం యొక్క 9వ సంపుటిలోని 17వ అధ్యాయంలో లింగాలయ అనే పేరుతో పిలవబడే ప్రాంతంలో అత్యంత ఎత్తైన శివలింగం దొరుకుతుందని పేర్కొనబడింది. ఆ లింగాలయ ప్రదేశాన్నే ఇప్పుడు అరుణాచల్ అని పిలుస్తున్నారు


ఈ పురాణ ప్రవచనాన్ని నిజం చేస్తూ అరుణాచల్ లోని జీరో వ్యాలీలో చాలా కాలం క్రితం ఒక చెట్లు నరికే వ్యక్తిచే ఈ పవిత్రమైన శివలింగం కనుగొనబడింది. ఇది సుమారు 25 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో పాటు మరో నాలుగు అడుగులు లింగం భూమి క్రింద ఉంటుంది.

ఈ శివలింగానికి దగ్గరగా పార్వతీ దేవి, పక్కనే కార్తికేయ స్వామిల విగ్రహాలు కుడి వైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తాయి. శివలింగం ఎడమ వైపున గణేశుడు, శివుని వాహనమైన నంది చిత్రాలు ఒక రాయిపై చెక్కబడి ఉంటాయి. ఈ లింగం 1970ల చివరలో అరుణాచల్ ప్రదేశ్ లో చేసిన సరికొత్త పురావస్తు ఆవిష్కరణగా చెబుతారు

కామెంట్‌లు లేవు: