8, డిసెంబర్ 2020, మంగళవారం

*కార్తీక పురాణం*_🚩 🚩 _*24 వ అధ్యాయము

 🚩 _*కార్తీక పురాణం*_🚩

🚩 _*24 వ అధ్యాయము*_🚩


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*అంబరీషుని ద్వాదశి వ్రతము*


🕉️☘☘☘☘☘☘🕉️


అత్రి మహాముని మరల అగస్త్యునితో *"ఓ కుంభసంభవా ! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ , యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.*


*"గంగా , గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందువలనను , సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.*


*కార్తీక శుద్ధదశమి రోజున , పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావధానుడవై అలకింపుము"* అని ఇట్లు చెప్పుచున్నాడు.


పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి , ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన , తొందరగా స్నానమున కేగిరమ్మనమని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. *"ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీ ఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల , హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు , భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక , ఈ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు."* అని అలోచించి *"బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగట్టగలరు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"* దని , సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.


*"ఓ పండిత శ్రేష్టులారా ! నిన్నటి దినమున ఏకాదశి యగుటం జేసి నేను కటిక ఉపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి ఇంతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా ? లేక , వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా ? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన"* దని కోరెను. అంతట ఆ ధర్మజ్ఞులైన పండితులు , ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని , దీర్ఘముగా అలోచించి *"మహా రాజా ! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము , నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు , దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు , ఇంటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును , మహతపశ్శాలియు , సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను"* అని విశదపరచిరి.



*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.*


🚩🌹🌷🕉️🕉️🌷🌹🚩

శ్రీశివాష్టోత్తరశత పంచచామరావళి . (శివ శతకము

 శ్రీశివాష్టోత్తరశత పంచచామరావళి . (శివ శతకము)


1. శివా! భవా! నమో೭స్తుతే! విశేష భక్త వత్సలా!   -  భవాని వామ భాగమందు భవ్యయై వసింపగా


నవీన దివ్య తేజసంబు నాట్యమాడు నీ దరిన్.  -  నివాసముండుమా మదిన్. వినీల కంధరా! శివా!


2. నమో೭స్తు తే. సదా శివా! సనాతనా! నమో೭స్తు తే.  -  నిమేషమందె నీల కంఠ! నీ కృపా కటాక్షముల్


ప్రమోదమందఁ జేయుఁగా, ప్రభావపూర్ణ తేజమై,  -  నమస్కరింతునయ్య నీకు. నన్నుఁ గాంచుమా! శివా!


3. శశాంక శేఖరా! హరా! విశాల నేత్ర! సుందరా!  -  ప్రశాంత చిద్విరాజమాన భవ్య  భక్త వత్సలా!


నిశీధిలో విశేష కాంతి నింపి లింగమూర్తిగా  -  నశేష భవ్య భక్త కోటి యార్తిఁ బాపితే! శివా!


4. ఉపాసనా ప్రభావ మెన్న నో హరా! పొసంగునే? -  కృపా నిధీ! ఉపాసకుల్ నిరీక్షణన్ నినున్ గనన్


ప్రపూజ్యమాన దివ్య తేజ భద్ర లింగ దర్శనం  -  బపూర్వమై, యమేయమైన హాయి గొల్పుఁగా! శివా!


5. సమస్త దోష హారి వంచు జాగరంబుఁ  జేసి, నిన్  -  ప్రమోద మందఁ జేయఁ బూను భక్త కోటిఁ గాంచితే?


క్షమింపుమా దురాత్ములన్, విశాల నేత్ర! శంకరా!  -  నమామి భక్త వత్సలా! ప్రణామమందుమా! శివా!


భక్తజన విధేయుఁడు

చింతా రామకృష్ణారావు.🙏

భగవద్గీత ఎందుకు చదవాలి.

 భగవత్గీత ఎందుకు చదవాలి. 

ఇప్పుడు మనం ఒక అంధకారమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నాము అని అనటానికి నేను చాలా బాధ పడుతున్నాను. పూర్వము మన దేశంలో పెద్దలు, గురువులు, మహర్షులు చెప్పిన విధి విధానాన్ని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా తూచా తప్పకుండా ఆచరించారు వారు ఎంతో ప్రశాంతమైన, ఆరోగ్యమైన జీవితాన్ని కలిగి వుండే వారు. 

ఇప్పుడు రోజు రోజుకి మన సమాజంలో తల్లిదండ్రుల మీద భక్తి, గౌరవములు సన్నగిల్లి తల్లిదండ్రులను ప్రశ్నించటం, పెద్దలను గౌరవించక పోవటం, నాకే అన్ని తెలుసు అనే భావన కలిగి ఎదుటి వారిని ఎంతవారైనా కూడా  విమర్శించటం, చులకనగా చూడటము, మన ఆచార వ్యవహారాలను అవహేళన చేయటం మొదలైన విపరీత భావనలు పెరిగి పోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మన సనాతన ధర్మా వ్యవస్థకు  గ్లాని కలిగే ప్రమాదం లేకపోలేదు. అందుకే మన జాతిని సరైన మార్గంలో ఉంచటానికి ప్రతి మనిషి మనస్సు ప్రశాంతతతో ఉండటానికి మనకు వున్న ఒకే ఒక మార్గం భగవద్గీత పఠనము. పూర్వము మన ఇళ్లల్లో భగవద్గీత పారాయణం చేసే వారు అని మనం వినే వాళ్ళము. మనం పారాయణం చేయలేక పోయినా కనీసం ఇతర పుస్తకాల వలె  పఠనం అయినా చేసిన మనం పతనము కాకుండా ఉండగలం. . 

భగవద్గీత ఏమి చెప్పుతుంది. భగవద్గీత ఒక మతగ్రంధము అని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు. మిత్రులారా భగవద్గీత మతగ్రంధము కాదు అది ప్రతి మానవుడు, వయస్సు, లింగ భేదం లేకుండా చదవ వలసిన ఒక అపూర్వ గ్రంధము. నీవు భగవద్గీత చదివితే నీ జీవితము ఒక చక్కటి క్రమశిక్షణతో, ఒక మంచి ఆదర్శంతో, ప్రశాంతతతో, సాత్వికతతో సాగటం తథ్యం.  

మనం ఏదైనా సామాను అంటే ఒక కారు, ఒక మోటారు సైకిలు ఒక కుట్టుమిషను కొన్నామనుకోండి అప్పుడు మనకు సదరు కంపెనీవారు ఆ సామానుతోపాటు ఒక చిన్న పుస్తకాన్ని మనకు అందచేస్తాడు, దానిని యూసర్ మనువల్ అని మనం అంటాము.  ఆ సమానుని ఉపయోగించే ముందు మనం క్షుణంగా ఆ పుస్తకాన్ని చదివి సదరు సామానుని వాడటం చేస్తాము. దానివల్ల మనకు సులువుగా ఆ సామాను వాడటం తెలుస్తుంది. 

ప్రతి మనిషి చూడలేనిది ఒకటి అందరిలో వున్నది దానిని మనం మనస్సు అని అంటాము. నన్ను విసికించకు నా మనస్సు బాగోలేదు. అబ్బా నా మనస్సు ఇప్పుడు ఎంతో హాయిగా వుంది. అనే మాటలు మనం తరచుగా అంటుంటాము, వింటుంటాము. నిజానికి ఆ మనస్సు అంటే ఏమిటి అది ఎక్కడ వున్నది అని అడిగితె మనం ఎవ్వరం చెప్పలేము. డాక్టర్లు మీరు ఉద్రేకతకు లోను కాకండి లేకపోతె మీకు బీపీ పెరుగుతుంది, అది హార్ట్ అట్టాక్ కి దారితీయ వచ్చు, లేదా పెరాలిసిస్ రావచ్చు అందుకే మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి అని అంటారు. కానీ అది ఎట్లాగో మాత్రం ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు కొత్తగా మీరు యోగ చేయండి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నరు. అందుకే చాలామంది యోగ కేంద్రాలకు, యోగ గురువుల దగ్గరికి వెళతారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ డాక్టర్లకు ఆ యోగ అనేది భగవద్గీత నుండి ఉద్భవించిందని  మీరు భగవద్గీత చదవండి అందులో కృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఆచరించండి అని మాత్రము చెప్పరు. నిజానికి ప్రజలంతా భగవద్గీత ప్రతి రోజు చదువుతూ గీతాచార్యుడిని పూర్తిగా అనుసరిస్తే ప్రపంచంలో చాలా మటుకు బీపీలు, గుండె జబ్బులు, పక్ష వాటాలు తగ్గుతాయి.  అంతే కాదు మన సమాజంలో ఒకరికి ఇంకొకరికి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా చక్కటి ప్రేమభావం కలుగుతుంది.  అందుకు ఏమాత్రం సందేహం లేదు. 

మనిషి మనస్సుని ఎలా నియంత్రించుకోవాలి అని చెప్పే యూసర్ మాన్యువలె ఈశ్రీమద్ భగవద్గీత . 

భగవద్గీత గూర్చిన విషయాలు. 

మన పురాణ ఇతిహాసాలు దుఃఖానికి, శోకానికి ఒక ప్రత్యేక గుర్తింపు వుంది. ఒక మహర్షి శోకం నుండి ఉద్బవించినది శ్లోకం, ఆ శ్లోకం శ్రీమద్రామాయణంగా రూపుదిద్దుకున్నట్లు ఆ వాల్మీకి మనకు ఆది కవిగా ప్రసిద్ధి చెందినట్లు మనకు తెలుసు. 

ఇక అర్జనుని విషాదము శ్రీ కృష్ణ భగవానుని నుంచి భగవత్గీత అనే అపూర్వ బోధ ఈ ప్రపంచానికి అందింది. అర్జనునిలోని నిరాశ, నిస్పృహ, వైరాగ్యానికి శ్రీ కృష్ణ భగవానుడు చేసిన బోధ అర్జనుని కార్యోన్ముఖుని చేసింది. అదే సామాన్యులమైన మనందరిలో నిరాశ, నిస్పృహలు, జీవితం మీద కలిగే విరక్తిని పూర్తిగా నివారించి అందరిని ఒక మంచి దారిలో నడిపేది శ్రీమద్ భగవద్గీత 

భగవద్గీత గూర్చి కొన్ని విషయాలు. 

గీతలో 18 అధ్యయాలు వున్నాయి. . ఇందులోని ప్రతి అధ్యాయానికి యోగం అనే పదంతో కూడిన పేరు ఉంటుంది. శ్రీ కృష్ణ భగవానులు తనని నమ్ముకున్న వారి యోగ క్షేమాలు చూస్తానన్నారు. మనం యోగం, క్షేమం అంటే ఏమిటో తెలుసుకుందాము. 

యోగము అంటే మనకు లేనిది మనకు కలవటం. ఉదా. నీవు ఒక క్రొత్త కారు కొనుక్కున్నావనుకో అది వాహన యోగం. అంటే నీకు ఇంతకు ముందు లేని వాహనం ఇప్పుడు నీకు లభించింది. నీకు వివాహమైనదనుకో దానిని కళత్ర యోగం అంటారు. అంటే ఇంతకు ముందు నీ జీవితంలో లేని భార్య నీకు లభించింది అని అర్ధం. నీవు ఒక క్రొత్త ఇల్లు కొనుక్కొన్నావనుకో దానిని గృహ యోగం అని అంటారు. ఈ విధంగా నీకు లేనిది నీకు లభించటం అన్న మాట. 

క్షేమం అంటే నీకు లభించినది నీ తోటే ఉండటం. అంటే నీవు కొన్న ఇల్లు నీ తోటే ఉండటం. అదే విధంగా నీకు యోగించిన అన్ని నీతోటే ఉండటాన్ని క్షేమం అని అంటారు. నీవు ఆరోగ్యంగా వున్నా వనుకో అంటే నీవు క్షేమంగా వున్నావన్నమాట. 

మన జీవితంలో మనకు కలిగే అన్ని యోగాలకు, వాటికి కావలసిన క్షేమాన్ని మనకు ఇస్తానని శ్రీ కృష్ణ భగవానులు మనకు చెప్పారు.  కాబట్టి నిష్కల్మషమైనా భక్తితో ఎల్లప్పుడూ మనం భగవంతుడిని శరణు చొచ్చాలి. 

భగవద్గీత  ఎవరు, ఎప్పుడు, ఎలా చదవాలి. 

గీతను ప్రతి మానవుడు చదవ వచ్చు. కావలసినది ఒక్కటే శ్రీ కృష్ణ భగవానుని మీద అచంచలమైన భక్తి, భగవత్ గీత మీద అనంతమైన శ్రార్ధ. ఈ రెండు ముందుగా అలవరచుకొని పరిశుద్ధ మనస్కులై భగవద్గీత చదవటానికి ఉద్యుక్తులు కండి. 

గీతలో 18 అధ్యాయాలు వున్నాయి అని మనం తెలుసుకున్నాము. మొట్టమొదటి అధ్యాయానికి " అర్జున విషాద యోగం" అని పేరు. ఈ అధ్యాయంలో అర్జనుల వారికి కలిగిన విషాదాన్ని గూర్చి తెలియచేస్తుంది. నేను మొట్ట మొదటిగా గీతను చదవ దలుచుకున్న వారికి ముందుగా మొదటి అధ్యాయం నుంచి కాకుండా మీరు  14వ  అధ్యాయానికివెళ్ళమని చెపుతాను. దానికి కారణము ఈ  అధ్యాయం పేరు "గుణ త్రయ విభాగ యోగము" అని అంటారు. అంటే మనుషులు తమ తమ మానసిక స్థితులను పట్టి మూడు రకాలుగా వుంటారాని  అవి. 1. సత్వ, 2 రాజో, 3 తమో గుణములు. అవి శ్రీ కృష్ణ భగవానులు తెలియచేసారు. ఈ అధ్యయానిని చదివిన తరువాత చదివిన మీరు ఈ మూడు గుణములలో ఏ గుణానికి చెందుతారో మీకు తెలుస్తుంది.   అప్పుడు మీరు వున్నా స్థితి మీకు అర్ధం అవుతుందికాబట్టి మీరు వున్న స్థితి కన్నా ఇంకా మెరుగైన స్థితికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. అప్పుడు తమో గుణ వంతుడు ముందుగా రజోగుణ వంతుడిగా తరువాత ఉత్తమ గుణమైన సత్వ గుణానికి మారుతాడు. ఎప్పుడైతే మనిషి సత్వ గుణ వంతుడు అవుతాడో అప్పుడు గీత పూర్తిగా చదివే శక్తి తరువాత శ్రార్ధ వస్తాయి. అప్పుడు మొదటినుండి అంటే అర్జున విషాద యోగం నుండి చదువ గలుగుతారు.  భగవద్గీత ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నా కొద్దీ చదువరుడు తానూ ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తాడు. తన మానసిక స్థయిర్యం కలుగుతుంది. తత్వారా పరి పూర్ణమైన ఉత్తమ మైన మనిషిగా తన్ను తాను తీర్చుకో గలుగుతాడు.  గీతను చదివి అర్ధం చేసుకొని ఆకళించుకొని తన జీవితానికి ఆపాదించుకున్న ప్రతి మనిషికి శాంత స్వభావం, పరిస్థితులను అర్ధం చేసుకునే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించగల శక్తి. ఇతరులను నొప్పించకుండా తన పని తాను చేసుకునే విధంగా తయారు అవుతారు. కాబట్టి మిత్రులారా మీరంతా నేను సూచించిన విధంగా గీత పఠనం చేయండి మీ జీవితాలను బాగు పరుచుకోండి. 

గమనిక: ఈ వ్యాసం ఒక్కరి మనస్సు నయినా మార్చిన ఈ వ్యాస రచన సార్ధకమైనట్లే. 

మీ 

సి. భార్గవ శర్మ 

జై శ్రీకృష్ణ 

ఓం శాంతి శాంతి శాంతిహి 

సర్వే జన సుఖినోభవంతు. 



ధార్మికగీత - 80*

 *ధార్మికగీత - 80*

                                     

     *శ్లో:-  సూపం వినా భోజన మప్రశస్తం ౹*

             *యూపం వినా యాజన మప్రశస్తం ౹*

             *ధూపం వినా పూజన మప్రశస్తం ౹*

             *దీపం వినా మైధున మప్రశస్తమ్ ౹౹*


సూపము లేని భోజనము 

            చూడ  జగమ్మున నప్రశస్తమౌ 

యూపము లేని జన్నమిల

            యొప్పక శ్రేష్ఠత నప్రశస్తమౌ 

ధూపము లేని యర్చనము 

            దూష్యముయౌనుగ నప్రశస్తమై 

దీపము లేని మైథునము

            తీరుగ నుండదు యప్రశస్తమై

ధార్మికగీత - 103*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 103*

                                   *****

         *శ్లో:- సత్యం జన విరోధాయ ౹*

                *అసత్యం జనరంజనం  ౹*

                *సురా విక్రీయతే స్థానం  ౹*

                *దధి క్షీరం  గృహే గృహే ౹౹*

                                   *****

*భా :- సత్యమే దైవము. దైవమే సత్యము. సత్యమే ధర్మానికి ఆధారము. జగత్తు సత్యమూలకము. సత్యమే పరమపదము. సత్యము లేని పూజలు, నోములు ,జపాలు,   తపాలు వ్యర్థం. ఇంతటి మహత్తర శక్తి గల సత్యము నేటి ఆధునిక ,సాంకేతిక యుగంలో జనానికి అప్రియమై పోతున్నది. సత్యాన్ని నమ్ముకుంటే పుట్టగతులు లేవని ప్రజల ప్రగాఢ విశ్వాసము.వృత్తి ప్రవృత్తులు అసత్యమయమై జనరంజకమౌతున్నాయి. ప్రతి రంగంలోను అసత్యము, అధర్మము, అవినీతి రాజ్యమేలుతున్నాయి. సత్యాన్ని, సత్యవ్రతులను అవహేళనకు, అపహాస్యానికి గురి చేస్తున్నాయి. సత్యధర్మనిరతులైన రాముడు అడవులపాలు, హరిశ్చంద్రుడు అష్టకష్టాలపాలైన విషయం మనకు తెలిసిందే.  సమాజంలో మనిషిని,మానవత్వాన్ని మంటగలిపే సారా విక్రయకేంద్రాలు ఉరికి దూరంగా స్థిరమైన ప్రదేశాల్లో నెలకొల్పబడుతున్నాయి. అయినా దానికోసం జనం తమంతట తామే ఉరుకులు, పరుగులు తీస్తారు. అసత్యం అంత ప్రియంగా ఉంటున్నదన్నమాట. ఇక  చక్కని ఆరోగ్యదాయకమైన పాలు, పెరుగు ఇంటింటికీ తిరిగి దైన్యంగా అమ్మకాలు జరుపబడుతున్నాయి. అనగా సత్యం తన మనుగడకోసం గడపగడపా ఎక్కి,దిగ వలసిన దౌర్భాగ్యం,దయనీయ స్థితి దాపురించిందన్నమాట. నేటి లోకంతీరుకు అద్దం పెట్టే యీ భావనలను ప్రతివారు మనసుపెట్టి ఆలోచించాలని, అప్రమత్తంగా ఉండాలని సారాంశము.*

                               *****

                *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

Mini


 

Country


 

Pravachanam






 

ఉపనిషత్తులు

 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



*ప్రశ్న:* *ఉపనిషత్తులు అంటే ఏమిటి?*




*జవాబు:* హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరి భాగములే ఉపనిషత్తులు. ఒకప్పుడు మహా ఋషులు , ఋషి పుత్రులు ఒకచోట చేరి ... ఆత్మ అంటే ఏమిటి? అనాత్మ అంటే ఏమిటి? జీవుడు ఎవరు ? జీవుల ఈస్వరుల నడుమ సంబంధం ఎటువంటిది ? చివరికి ఎక్కకడికి పోతాం ? అన్న ప్రశ్నల గురించి చేర్చాలు జరుపగా వచ్చిన జవాబులే ఉపనిషత్తులు.


పూర్వము పోలీసు , న్యాయవవస్థ లేవుకాబట్టి , నీతి , నియమము , మంచి ,చెడు , ధర్మము , అధర్మము , పాపము , పుణ్యము అనే అంశాల పైన న్యాయ తీర్పులన్నీ ఉండేవి ... వాటిని తెలియజేసేవే వేదాలు ... ఉపనిషత్తులు . 


ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. 


1. సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు


2. బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.


3. అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.


4. ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి.


నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు. 


10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి.:

1. ఈశావాస్యోపనిషత్తు

2. కేనోపనిషత్తు

3. కఠోపనిషత్తు

4. ప్రశ్నోపనిషత్తు

5. ముండకోపనిషత్తు

6. మాండూక్యోపనిషత్తు

7. తైత్తిరీయోపనిషత్తు

8. ఐతరేయోపనిషత్తు

9. ఛాందోగ్యోపనిషత్తు

10. బృహదారణ్యకోపనిషత్తు


108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి : 

1. ఈశావాస్యోపనిషత్

2. కేసోపనిషత్ 

3. కఠోపనిషత్

4. ప్రశ్నోపనిషత్

5. ముండకోపనిషత్

6. మాండూక్యోపనిషత్

7. తైత్తిరీయోపనిషత్

8. ఐతరేయోపనిషత్

9. ఛాందోగ్యోపనిషత్

10. బౄహదారణ్య కోపనిషత్

11. బ్రహ్మోపనిషత్

12. కైవల్యోపనిషత్

13. జాబాలోపనిషత్

14. శ్వేతాశ్వతరోపనిషత్

15. హంసోపనిషత్

16. అరుణికోపనిషత్

17. గర్భోపనిషత్

18. నారాయణోపనిషత్

19. పరమహంసోపనిషత్

20. అమౄతబిందూపనిషత్

21. అమౄతబిందూపనిషత్

22. అథర్వనాదోపనిషత్

23. అథర్వఖోపనిషత్

24. మైత్రాయణ్యుపనిషత్

25. కౌషితకీబ్రాహ్మణోపనిషత్

26. బౄహజ్జాబాలోపనిషత్

27. నౄసిమ్హతాపిన్యుపనిషత్ (పూర్వతాపిని, ఉత్తరతాపిని)

28. కాలాగ్నిరుద్రోపనిషత్

29. మైత్రేయోపనిషత్

30. సుబాలోపనిషత్

31. క్షురికోపనిషత్

32. మంత్రికోపనిషత్

33. సర్వసారోపనిషత్

34. నిరాలంబోపనిషత్

35. శుకరహస్యోపనిషత్

36. వజ్రసూచ్యుపనిషత్

37. తేజోబిందూపనిషత్

38. నాదబిందూపనిషత్

39. ధ్యానబిందూపనిషత్

40. బ్రహ్మవిద్యోపనిషత్

41. యోగతత్వోపనిషత్

42. ఆత్మబోధోపనిషత్

43. నారదపరివ్రాజకోపనిషత్

44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్

45. సీతోపనిషత్

46. యోగచూడామణ్యు పనిషత్

47. నిర్వాణోపనిషత్

48. మండల బ్రాహ్మణోపనిషత్

49. దక్షిణామూర్త్యుపనిషత్

50. శరభోపనిషత్

51. స్కందోపనిషత్

52. మహానారాయణోపనిషత్

53. అద్వయతారకోపనిషత్

54. రామరహస్యోపనిషత్

55. రామతాపిన్యుపనిషత్ (పూర్వతాపిన్యుపనిషత్ , ఉత్తరతాపిన్యుపనిషత్)

56. వాసుదేవోపనిషత్

57. ముద్గలోపనిషత్

58. శాండిల్యోపనిషత్

59. పైంగలోపనిషత్

60. భిక్షుకోపనిషత్

61. మహోపనిషత్

62. శారీరకోపనిషత్

63. యోగశిఖోపనిషత్

64. తురీయాతీతోపనిషత్

65. సన్న్యాసోపనిషత్

66. పరమహంస పరివ్రాజకోపనిషత్

67. అక్షమాలికోపనిషత్

68. అవ్యక్తోపనిషత్

69. ఏకాక్షరోపనిషత్ 70. అన్నపూర్ణోపనిషత్

71. సూర్యోపనిషత్

72. అక్ష్యుపనిషత్

73. అధ్యాత్మోపనిషత్

74. కుండికోపనిషత్

75. సావిత్ర్యుపనిషత్

76. ఆత్మోపనిషత్

77. పాశుపతబ్రహ్మోపనిషత్

78. పరబ్రహ్మోపనిషత్

79. అవధూతో పనిషత్

80. త్రిపురతాపిన్యుపనిషత్

81. శ్రీదేవ్యుపనిషత్

82. త్రిపురోఒపనిషత్

83. కఠరుద్రోపనిషత్

84. భావనోపనిషత్

85. రుద్రహౄదయోపనిషత్

86. యోగకుండల్యుపనిషత్

87. భస్మజాబాలోపనిషత్

88. రుద్రాక్షజాబాలోపనిషత్

89. గణపత్యుపనిషత్

90. దర్శనోపనిషత్

91. తారసారోపనిషత్

92. మహావాక్యోపనిషత్

93. పంచబ్రహ్మోపనిషత్

94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్

95. గోపాలతాపిన్యుపనిషత్

96. కౄష్ణోపనిషత్

97. యాజ్ణ్జవల్క్యోపనిషత్

98. వరాహోపనిషత్

99. శాట్యాయనీయొపనిషత్

100. హయగ్రీవోపనిషత్

101. దత్తత్రేయోపనిషత్

102. గారుడోపనిషత్

103. కలిసంతారణోపనిషత్

104. బాల్యుపనిషత్

105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్

106. సరస్వతీ రహస్యోపనిషత్

107. బహ్వౄచోపనిషత్

108. ముక్తికోపనిషత్ 


⚜️⚜️⚜️⚜️⚜️⚜️

వ్యవసాయ చట్టాలపై

 👇👇🙏👇👇వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత .... అసలు చట్టంలో ఏముంది?


ముందుగా బిల్లుకి చట్టానికి to తేడా తెలుసుకోవాలి. పార్లమెంటులో ఆమోదం పొందేవరకు, రాష్ట్రపతి సంతకం అయ్యి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేవరకు అది బిల్. నోటిఫికేషన్ వచ్చాక చట్టం. 


ఈ చట్టం పేరు 


The Farmers (Enpowerment And Protection) Agreement on Price Assurance And Farm Services Act 2020. Act 20 of 2020


ఈ బిల్లుని లోక్ సభలో సెప్టెంబరు 14న, రాజ్యసభలో సెప్టెంబరు 20న ప్రవేశపెట్టడం జరిగింది. చర్చలు లోక్ సభలో 17వ తేదీన, రాజ్యసభలో 20వ తేదీన జరిగాయి. అవి ఆమోదించబడి రాష్ట్రపతి ఆమోదం పొంది 24వ తేదీన గజెట్ నోటిఫికేషన్ విడుదల అవడం ద్వారా చట్ట రూపం పొందింది.


అదే విధంగా The Farmers Produce Trade and Commerce (Promotion and Facilitation) Act 2020 కూడా. Act 21 of 2020.


ఈ చట్టాలు ఏం చెబుతున్నాయి?


మొదటగా 20 of 2020 తీసుకుందాం.


ఇది retrospective effect తో అంటే 05-06-2020 నుండి అమలులోకి వస్తుంది. ఆ రోజున ఆర్డినెన్స్ విడుదల చేసింది కేంద్రం.


ముందుగా Farm Services అంటే ఏమేమి వస్తాయి?


విత్తనాల సరఫరా, ఫీడ్, దాణా, ఆగ్రో కెమికల్స్, ఆగ్రో మెషినరీ & టెక్నాలజీ, సలహాలు, నాన్ కెమికల్ ఆగ్రో ఇన్ పుట్స్ మరియు ఇతరములైన వ్యవసాయ సంబంధిత ఇన్ పుట్స్ ....


రైతు అంటే ఎవరు?


స్వయంగా కానీ, కూలీలతో చేయించేవారు కానీ, కౌలు ద్వారా చేయించే వారు, Farmer Producer Organizations.


అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ అందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు.


స్పాన్సర్ అంటే ఎవరు?


ఒక వ్యక్తి లేదా కంపెనీ లేదా భాగస్వామ్యం లేదా Farm Production Organization లేదా లిమిటెడ్ లయబిలిటీ భాగస్వామ్యం లేదా కోఆపరేటివ్ సొసైటీ లేదా సొసైటీ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ప్రత్యేకంగా ఇందుకోసం ఏర్పడిన అసొసియేషన్ ....


Farming Agreement అంటే వ్రాతపూర్వకంగా రైతుకి, స్పాన్సర్ మధ్య లేదా రైతుకి, స్పాన్సర్ కి, మూడవ పార్టీకి మధ్య జరిగే ఒప్పందం. ఈ ఎగ్రిమెంటు నాట్లు వెయ్యడానికి ముందు లేదా rearing of farming produce (In case of Live Stock) కు ముందు చేసుకోవాలి. ఈ ఒప్పందంలో నిర్ణీతమైన నాణ్యతను ముందుగానే రాసుకోవాలి. ఆ ప్రకారం ఒప్పందం మేరకు స్పాన్సర్ రైతు దగ్గర కొని తీరాలి. ఈ ధర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు తగ్గకుండా ఉండాలి. అలాగే ఫామ్ సర్వీసెస్ కూడా అందించే క్లాజులను కూడా చేర్చుకోవచ్చు. S.2(g)


ఈ Farming Agreement మూడు రకాలుగా విభజించారు 


Proviso i - Trade and commerce agreement. ఇందులో ప్రొడక్షన్ అంతా రైతు చేతిలోనే ఉంటుంది. ముందుగా కుదుర్చుకున్న రేటుకి స్పాన్సర్ కు అమ్మవలసి ఉంటుంది.


Proviso ii - Production Agreement. ఇందులో స్పాన్సర్ అన్ని రకాల లేదా కొన్ని రకాల సేవలు రైతుకి అందిస్తాడు. దీనికి రైతు కొంత రుసుము చెల్లించవలసి ఉంటుంది.


Proviso iii - పై రెండు రకాలు కాకుండా ఏ ఇతరమైన ఎగ్రిమెంట్లు లేదా పై రెండు కలిపి కానీ రైతు, స్పాన్సర్ ల మధ్య కుదర్చుకోవచ్చు.


ఉదాహరణకు సాయిల్ టెస్టింగ్, విత్తన సరఫరా, ఎరువులు, పురుగు మందు, సస్య రక్షణ, సస్యరక్షణకు తగిన సలహాలు ఇవ్వడం వంటివి ఉంటాయి.


Farming Produce - నూనెలు, నూనె గింజల ఉత్పత్తి, వరి, గోధుమ, పప్పు దినుసులు, కూరలు, పండ్లు, గింజలు (వేరుశనగ వంటివి), మసాలా దినుసులు, చెఱకు, పౌల్ట్రీ ఉత్పత్తులు, పందుల పెంపకం, మేకలు, గొఱ్ఱెలు! చేపల పెంపకం, డెయిరీ .... నేచురల్ లేక ప్రాసెస్డ్ రూపంలో కాని.


ఇంకా పశు దాణా, కాటన్, ginned or unginned, కాటన్ సీడ్స్, జౌళి ఉత్పత్తులు.


ఈ ఎగ్రిమెంటు కనీస కాల వ్యవధి ఒక పంట కాలం, గరిష్ట వ్యవధి ఐదు సంవత్సరాలు. పంట కాలం ఐదేళ్ళకన్నా ఎక్కువ ఉంటే రైతు, స్పాన్సర్ పరస్పర అంగీకారంతో ఎగ్రిమెంటు వ్యవధిని పెంచుకోవచ్చు.


అందరికీ ఉపయోగపడే విధంగా కేంద్రం ఒక నమూనా ఎగ్రిమెంటుని తయారు చేసి విడుదల చేస్తుంది.


ఎగ్రిమెంట్ ధర మార్కెట్ ధరకన్నా తక్కువ ఉంటే ఏం చెయ్యాలన్న విషయం కూడా ఎగ్రిమెంట్ లోనే పొందుపరుస్తారు.


స్పాన్సర్ పంటను రైతు వద్దనే తీసుకునేట్లయితే ఎగ్రిమెంటులో ముందుగా నిర్ణయించుకున్న సమయంలోగా రైతు వద్దకే వచ్చి తీసుకోవాలి S.6(1)(a)


ఒక వేళ రైతే పంటను స్పాన్సర్ వద్దకు చేర్చేట్లుగా ఒప్పందం అయితే స్పాన్సర్ ఆ పంటను రైతు తీసుకురాగానే accept చెయ్యాలి. ఆ తరువాత పంట తాలూకు బాధ్యత అంతా స్పాన్సర్ దే.S.6(1)(b).


పంట సొమ్ము రైతుకి ఎప్పుడు చెల్లించాలి?


S.6(3)(a)


Seed Production agreement అయితే 66% డెలివరీ సమయంలోనూ, మిగతా సొమ్ము Seed Certification అయిన తరువాత చెల్లించాలి. అయితే ఈ వ్యవధి 30 రోజులకు మించరాదు. 


S.6(3)(b) మిగతా పంటలు లేదా లైవ్ స్టాక్ విషయంలో డెలివరీ సమయంలోనే మొత్తం చెల్లించాలి.


ఈ చెల్లించిన మొత్తాలకు రసీదులు ఇవ్వాలి.


సొమ్ము ఏ విధంగా చెల్లించాలి అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.


ఎగ్రిమెంటు అమలు విషయంలో తగాయిదాలు వస్తే పరిష్కరించడానికి కన్సీలియేషన్ బోర్డు ఉంటుంది. ఇందులో రైతులకు, స్పాన్సర్లకు సమన్యాయం జరిగేలా ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ బోర్డు తన నిర్ణయాన్ని 30 రోజులలో తీర్మానించాలి. ఈ బోర్డు నిర్ణయం నచ్చని పక్షంలో ఏ పార్టీ అయినా అపీల్ చేసుకోడానికి Sub Divisional Magistrate (RDO) కు వెళ్తుంది. సదరు RDO అప్పిలేట్ బోర్డును నియమిస్తారు. ఇక్కడ కూడా 30 రోజుల వ్యవధిలోనే తీర్మానం చెయ్యవలసి ఉంటుంది.


ఈ తీర్మానం ఇరు పార్టీలను బైండ్ చేస్తుంది.


ఎగ్రిమెంట్ లో Conciliation board ప్రస్థావన లేకపోతే RDO బోర్డును ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డు నిర్ణయం ఫైనల్. ఈ విషయంలో కోర్టుల జోక్యం ఉండదు. కానీ బోర్డుకు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి.


బోర్డు తీర్మానం ప్రకారం స్పాన్సర్ చెల్లించకపోతే ఎగ్రిమెంట్ ఎమౌంటుకు ఒకటిన్నర రెట్లు వసూలు చేసి రైతుకి ఇచ్చే అధికారం బోర్డుకి ఉన్నది.


ఒకవేళ రైతు చెల్లించవలసి వస్తే మాత్రం actual cost మాత్రమే చెల్లించాలి.


ఇక్కడ మనకు వచ్చే సందేహం .... force majere అంటే మన చేతుల్లో లేని పరిస్థితుల వల్ల నష్టం ఏర్పడితే ఏమిటి పరిస్థిత.?


రైతుకు జరిమానా విధించేందుకు ఎవరికీ ఎటువంటి అధికారం లేదు.


ఒకవేళ రైతు నష్ట పరిహారం చెల్లించవలసి వస్తే అతడి భూములను స్వాధీనం చేసుకునే అధికారం ఎవరికీ లేదు.


ఈ చట్టంలోని S.3(4) ప్రకారం పంట నాణ్యతను, లైవ్ స్టాక్ నాణ్యతను పరిశీలించి ధృవీకరణ చెయ్యడానికి ఇరువురి ఒప్పందం మేరకు వ్యవసాయంలో నిష్ణాతులు అయిన వారిని నియమించుకోవచ్చు. (Qualified Assayers)S.4(4).


కానీ కొన్ని నిత్యావసరాలను Essential Commodities Act నుండి తొలగించారు.


ఎందుకు?


పంట బాగా పండిన చోట ధర తక్కువ ఉంటుంది. డిమాండ్ ఉన్నచోట పంట దొరకదు. అక్కడ రేటు విపరీతంగా ఉంటుంది. ఉదాహరణకు ఉల్లిపాయలు, టొమాటోలు, బంగాళ దుంపలు. వీటి ధరవరలు మనం సంవత్సరంలో ఒకసారైనా చూస్తూనే ఉంటాం. టొమాటో రైతులు పంట గిట్టుబాటు కాక రోడ్ల మీద పారబోసిన సందర్భాలు మనకు ప్రతి సంవత్సరం కనపడుతూనే ఉంటాయి. బుట్ట టొమాటోలు వంద రూపాయలు కూడా పలకని స్థితి. కానీ వినియోగదారులమైన మనకు మాత్రం కిలో నలభై, యాభై కు అమ్ముతారు. ఆక్కడ బాగుపడుతోంది ఎవరు? దళారీలు.


మరి స్పాన్సర్లు hoarding చెయ్యరా? అనే అనుమానం రావచ్చు.


పెట్టుబడి పెట్టి లాభం కోసం చూసేవాడు డిమాండ్ ఉన్నచోట అమ్ముకుంటాడు. మరి రైతే డిమాండ్ ఉన్నచోట అమ్ముకోవచ్చు కదా?


మన దేశంలో చిన్న, మధ్య తరగతి రైతులకు అంత శక్తి ఉండదు. Storage capacity ఉండదు. అలాగే holding capacity ఉండదు. అందువల్లనే అయినకాడికి అమ్ముకుంటున్నారు.


దేశంలోని అన్ని మార్కెట్లను అనుసంధానం చేసి సింగిల్ ప్లాట్ ఫామ్ ఏర్పరిచే బాధ్యత కేంద్రం తీసుకుంది. ఎక్కడ తమ పంటకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుస్తుంది.


అలా తెలియడం వల్ల రైతుకి లాభం ఏమిటి? ఎగ్రిమెంట్ ప్రకారం రైతుకి చెల్లించవలసిన సొమ్ము చెల్లించిన తరువాత ఆ పంటతో రైతుకు సంబంధం లేదు.


కానీ ఎగ్రిమెంట్ లోనే ఈ విషయంపై ఒక క్లాజు ఉంటుంది. (పైన పేర్కొన్నాను).


రేటులో మరీ ఎక్కువ వ్యత్యాసం ఉంటే రైతుకు బోనస్ లేదా ప్రీమియమ్ చెల్లించాల్సి ఉంటుంది.S.5(b)


ఇప్పుడు ఆలోచించండి వ్యవసాయ చట్టం 20 of 2020 రైతుకు మేలు చేస్తుందా? చెఱుపు చేస్తుందా?


అంబేద్కర్ చెప్పిన విషయం గుర్తు చేసుకోండి.


Knowledge, Unite and Struggle


ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయ చట్టాల వ్యతిరేక ర్యాలీలలో పాల్గొనే వారిలో ఈ విషయంపై నాలెడ్జ్ ఎంతమందికి ఉంది?


పంట చేతికి వచ్చే దశలో రేటు బాగుంటుంది. కానీ మార్కెట్ యార్డుకి వచ్చే రోజుకి పడిపోతుంది.


రైతులు తమ ఉత్పత్తులను బళ్ళ మీద వేసుకుని మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి ఎండల్లో, వానల్లో, రాత్రనక, పగలనక తమ సరుకు ఎప్పుడు కొంటారో, ఎంతకు కొంటారో తెలియక అయిన కాడికి అమ్ముకునే పరిస్థితినుండి రైతుని రక్షించేందుకు ఈ చట్టం చేయబడింది. 


గుంటూరు మిర్చి యార్డులో ఇలాంటి పరిస్థితి నా కళ్ళారా చూసాను. అలా ఆ మిరప కాయల బస్తాల మీద తుండు వేసుకుని పడుకునే రైతులు అనేకమంది. పైగా అలాంటి వారికి ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసామని గొప్పలు. రైతుకి మనం పెట్టేవాళ్ళమా? 


ఈ చట్టం వచ్చిన తరువాత రైతులకు ఆ సమస్య ఉండదు. 


ఇకపోతే కార్పొరేట్ సంస్థలు రైతుని దోచేస్తాయని గోల చేసేవారికి ఒక విషయం గుర్తు చేయదలచుకున్నాను, 


మనం రోజూ వాడే వస్తువులలో నూటికి తొంభై శాతం ఆ కార్పొరేట్ సంస్థలు తయారు చేసినవే. 


ప్రభుత్వాలు ఏ చట్టం చేసిన అంబానీ కోసం అంటారు. 


అంబానీ ఇచ్చిన ఉచిత జియో ఫోను ఆఫర్ వాడుకోలేదా? ఉచితంగా వస్తే వాడుకోడానికి లేని అభ్యంతరం వ్యాపారస్థుడైన అంబానీ ప్రతి అవకాశాన్ని దొరకబుచ్చుకుని పైకి ఎదుగుతుంటే బాధ పడటం ఎందుకు? అదే హిపోక్రసీ. వాడి తమ్మడు చతికిల పడ్డాడు. మరి కేంద్రం ఇద్దరికీ సయోధ్య కుదర్చలేదే?


KG Basin విషయంలో ముఖేష్ అంబానీపై 72,000 వేల కోట్లు పెనాల్టీ విధించింది Directorate of Hydro Carbons. దాన్ని రద్దు చేయించలేదే?


ఏదైనా సమస్య మీద స్పందించాలంటే దాన్ని అధ్యయనం చెయ్యాలి. అర్ధం చేసుకోవాలి. లేకుంటే మౌనంగా ఉండాలి.


ఈ చట్టం వల్ల వేల కోట్లు నష్టపోతోంది కమీషన్ ఏజెంట్లు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర వంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలలోనే ఆది ఎక్కువగా ఉంది. అకాలీ దళ్ కు చెందిన కేంద్ర మంత్రి సిమ్రాన్ జిత్ మాన్ కౌర్ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసారు. ఎందుకంటే వారి స్వయానా బావ గారి ఆదాయం సంవత్సరానికి 2500 కోట్లు. కేవలం కమీషన్ల మీదే. అలాగే కనిమొళి. వ్యవసాయ భూములు లేకపోయినా వ్యవసాయ ఆదాయం కింద ఎంత చూపించిందో తెలిస్తే ముక్కున వేలేసుకోవడమే కాదు, మన ముక్కు కూడా ఊడిపోతుంది. అక్షరాలా పది వేల కోట్లు.


Act 21 of 2020 గురించి వేరే పోస్టులో రాస్తాను.


మరింత సమాచారం కావాలంటే loksabha.nic.in website లోకి వెళ్ళి Legislations అనే పాపప్ లో Agriculture ను select చేసుకుంటే ఈ రెండు చట్టాలు ఉంటాయి. ఓపిక ఉన్న వారు చదువుకోవచ్చు.

మ్రుత్తికాతిలకం

 🎈🍁🎈🍁🎈🍁🎈🍁🎈మ్రుత్తికాతిలకం🎈🍁🎈

శాస్త్రాలలో మ్రుత్తికా తిలకానికి

ప్రాధాన్యత ఇవ్వబడింది. తిలకానికి(బొట్టుకు) తీర్థ స్థలాలోని మ్రుత్తిక మహిమాన్విత మైనదిగా పరిగణించబడింది. మ్రుత్తిక ఆవిధంగా లాభదాయకం అయినది. పూలు, పళ్ళలో వనస్పతులలో ఉండే గుణాలు మూలతహ మట్టిలోనే దాగి ఉంటాయి. శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు కూడా, ఫలాలు, పుష్పాలు, వ్రుక్చాలు, మొక్కలు లాగానే ప్రుథ్వినుండి కూడా నిరంతరం గా బాష్పం (ఆవిరి) బయటకు వస్తూ ఉంటుంది. అది శరీరానికి ఉపయోగపడే పోషకతత్వాలతో(ధాతువులు తో) నిండి ఉంటుంది.

         అందువల్ల నే ఆరోగ్య నియమాలలో ప్రుథ్వీసామీప్యం కూడా ఒక విశిష్ట నియమంగా ఉన్నది. మట్టి విషనాశకం. దీని ద్వారా అనేక విషాలు విరుగుడు అవుతాయి. వ్రణాలు, తామర, గజ్జి, దురదలు వంటి చర్మరోగాలు దూరమవుతాయి. ఇంకా జీర్ణకోశం లో అల్సర్లు, కడుపు నొప్పి, మలబద్ధకం, ప్రేగులలో నొప్పి, అతిసారం, మూలశంక, మూత్రాశయ వ్యాధులు, కాలేయ  సంబంధమైన వాపులు, గుండె దడ, గర్భాశయ వ్యాధులు మట్టి ద్వారా మాయమవుతాయి. అన్ని విధాలైన జ్వరాలు, ఉబ్బసం, సన్నిపాతం, పిచ్చి, నేత్రాలు, దంతాలు, చెవులకు సంబంధించిన వ్యాధులు లోను స్వప్న దోషాలు, వీర్యగతమైన వ్యాధులు, ప్రదరం వంటి స్త్రీల వ్యాధులకు మట్టి ఉత్తమైన ఔషధిగా భావించబడుతుంది. మట్టి కేశవ్రుద్ధికి అత్యంత ఉపయోగకరమైనది. పోషకమైన పదార్ధము కూడా. వైజ్ఞానికంగాను వ్యాధుల నివారణకు ఉపయోగ కరంగానూ ఉన్న మట్టి ముఖ్యంగా తీర్థాలలోని మట్టిలో సాత్వికతను పెంచే గుణం ఉండబట్టి అన్నివిధాలా ఉపయోగపడుతుంది.

🍁🎈🍁🎈🍁🎈🍁🎈



🌳🌷🌳🌷🌳🌷🌳🌷🌳కుంకుమ తిలకం🌷🌳🌷

పసుపు గుండకి నిమ్మరసాన్ని చేర్చి కుంకుమను తయారు చేస్తారు. ఈ కలయికలో పచ్చటి పసుపు ఎరుపు రంగుగా మారి కుంకుమ తయారవుతుంది. ఆయుర్వేదంలో పసుపు కు సంయోజక గుణాధిక్యతను గుర్తించారు. తెగిన గాయాలకు పసుపు బాగా పనిచేస్తుంది. కాయగూరలు లో కూడా కేవలం రంగుకోసమే కాకుండా దీనికి గల సంయోజక గుణవిశేషం చేతనే పసుపు ను వాడుతున్నారు. ఇది చర్మశుద్ధికి విశేష లాభదాయకం ఉంటుంది. కుంకుమ తిలకంలో ఈ రెండు లాభాలు చేరటంవల్లనే కుంకుమ వాడకం అత్యంత ఆవశ్యకం.

🌷🌳🌷🌳🌷🌳🌷🌳

Your BANK Account could be Emptied

 Public Attention!!!!! 


Your BANK Account could be Emptied without an Alert

!

Dear All, Please let's be very careful.. There is a new HIGH TECH FRAUD in town called the SIM SWAP FRAUD, and hundreds of persons are already VICTIMS.


How does it work?

1 A new fraud called SIM SWAP has started.  Your phone network will momentarily go blind / zero (No Signal / Zero Bars) and after a while a call will come through. 


2 The Person on the other end of the call will tell you that he is calling from (your cell phone company) depending on your network and that there is a problem in your mobile network.  


3 He will instruct you to Please press 1 on your phone to get the network back.  


- Please at this stage don't Press anything, Just cut or END the call.


If you press 1, the network will appear suddenly and almost immediately go blind again (Zero Bars) and by that action, your phone is #HACKED.  


Within a second they will empty your bank account, and you won't receive any alert.


What you will experience.

It will appear as though your line is without Network, meanwhile your SIM has been SWAPPED.

The danger here is that, you will not get any alert of any transactions, so please those of us doing USSD Banking and Mobile Banking BEWARE.  Let's be very careful.


Please, forward to your contacts, loved ones and friends. The fraud is increasing day by day. 


Received from a #CybersecurityGroup


Don't forget to share this post...... I repeat don't forget to share this post. Many people's  Account as been emptied!

తిలకధారణము

 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀తిలకధారణము🍀🍀🍀

యఙ్ఞోపవీతధారణము, శిఖాబంధనంహవలెనే తిలకధారణము కూడా మిక్కిలి ప్రధానమైనది. ఇది బ్రాహ్మణులు కే పరిమితమైనదిగా భావించడం పొరపాటు. క్షత్రియులు కూడా తిలకధారణము చేయడం మనం గమనిస్తూనే ఉన్నాంగదా! రాజులకు రాజ్యాభిషేక వేళలో రాజతిలకం దిద్ది మహోత్సవం జరిపేవారు. అందుకే దానిని రాజతిలకం అనేవారు. రాజతిలకం లేకుండా పీఠము ను అధిరోహించే అధికారం లేదని భావించేవారు. అక్కడ అధికారం తిలకం ద్వారానే గుర్తింపబడినది. ఈ తిలకధారణము ఈనాటిది కాదు. ప్రాచీనకాలం నుంచి ఉంది. శ్రీరామచంద్రమూర్తి కూడా ముఖానికి చందనతిలకం ధరించినట్లు వాల్మీకిమహర్షి వర్ణించాడు.

        ఏ దేవాలయానికి వెళ్లిన పూజారి మన ముఖానికి బొట్టుపెట్టి ఆశీర్వచనము చేయడం నేటికీ మనకు తెలిసిందే కదా! హోమాది వైదిక ప్రక్రియలలో బొట్టుపెట్టుకోవడం ఆవశ్యకమైన విధి. ఇంతకీ సారాంశం ఏమిటంటే శూన్యలలాటంతో దైవసంబంధమైన కార్యక్రమాలు ఏవైనా నిషిద్ధ మే!

వినాభస్మ త్రిపుండ్రేన వినా రుద్రాక్ఘమాలయా!

పూజితో పి మహాదేవీ నస్యాత్ తస్య ఫలప్రదహ!!


తిలకం(బొట్టు) అనేక విధాలుగా ఉంటుంది. మ్రుత్తిక, భస్మం, చందనం, కుంకుమ, సింధూరం, మొదలైనవి.

సంధ్యా తర్పణాదులకు పూర్వమే తిలకధారణము చేయడం పరమావశ్యకమైన విధిగా భావించబడింది. నొసటన తిలకం ధరించకుండా చేసే స్నానం, దానం, తపం, యఙ్ఞం, దేవ పితృ కర్మలు సర్వదా నిష్ఫలమవుతాయి. నుదుట బొట్టు పెట్టుకున్నాకనే బ్రాహ్మణులు సంధ్యా తర్పణములు నిర్వర్తించాలి. ఏ తిలకాన్ని ఏవిధంగా ధరించాలి అన్నది విశేషం గా పేర్కొనబడింది. ఊర్ధ్వపుండ్రాన్ని మ్రుత్తిక లో ధరించాలి. త్రిపుండ్రం ను భస్మము తో ధరించాలి. చందనం తోటి రెండు విధాలైన తిలకాన్ని అభ్యంగ, ఉత్సవరాత్రులలో ధరించాలి.

     ఆనామికలో చేసే తిలకధారణము వలన శాంతి, మధ్య వ్రేలు తో ఆయుః వ్రుద్ధి, అంగుష్టంతో పుష్టి, తర్జనితో మోక్ష ప్రాప్తి కలుగుతాయని పేర్కొన్నారు. సేకరణ 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ముగ్గురు మహిళలు..

 *ముగ్గురు మహిళలు..*


"అయ్యా! మా అమ్మాయి, కొన్ని చిత్రాలు పెన్సిల్ తో వేసింది, మీరు చూడండి" అంటూ మా పోస్టుమాన్ (క్షమించాలి, గబుక్కున తెలుగు పదం గుర్తు రాలేదు!) ఒక పుస్తకం ఇచ్చాడు..


చక్కటి బొమ్మలు గీసింది, శివ పార్వతులు, లక్ష్మీ నారాయణులు, రాధాకృష్ణులు, కృష్ణ లీలలు, ఇలా దేవీ దేవతల చిత్రాలు, రంగవల్లులు వేసే స్త్రీల చిత్రాలు, ఒకటేమిటి అన్ని రకాల చిత్రాలు వేసింది..అన్నింటికన్నా ఎక్కువగా మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చిత్రాన్ని ఎక్కువ సార్లు వేసింది..అలాగే త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడి చిత్రాన్ని కూడా వేసి ఉన్నది..ఏదో ఆషామాషీగా ఆ బొమ్మలను వేయలేదు..చాలా శ్రద్ధగా వేసింది..


సంతోషం తో నేనూ, మా ఆవిడా చెప్పాము, "అమ్మా! చాలా బాగున్నాయి" అని..ఆ పిల్లా సంతోష పడింది.."మన స్వామివారి ప్రేరణ తోనే ఈ చిత్రాలన్నీ వేయగలిగాను.." అన్నది..మా ఇద్దరికీ ఒక్కక్షణం ఆ మాట అర్ధం కాలేదు.."ప్రేరణ ఏ విధంగా పొందావు..?" అన్నాను..నిరంతరం స్వామివారి గురించే ఆలోచించేదానిని..అందుకని ముందుగా నా బొమ్మలు స్వామివారి చిత్రం తోనే మొదలుపెట్టాను.." అన్నది..ఎంత ఆరాధన అని అనిపించింది..


ఆ అమ్మాయి పేరు..షేక్ రంజాన్ బీ, వాళ్ళ నాన్న షేక్ మౌలాలీ....ముస్లిములు..


"అయ్యగారూ..నేను దత్తదీక్ష తీసుకుందామని అనుకుంటున్నాను..తీసుకోవచ్చా..?" 

ఈ మాట పోయిన దత్తదీక్షా సమయం లో నన్ను అడిగింది ఓ యువతి..ఆ యువతీ..ఆమె భర్తా ఇద్దరూ శ్రీ స్వామివారి ని అత్యంత భక్తిగా కొలుస్తారు..ఆ సంగతి మాకందరికీ బాగా తెలుసు..ఈ దంపతుల గురించి సంవత్సరం క్రితం వ్రాసి, సోషల్ మీడియా లో పోస్ట్ చేసివున్నాను..


"సరే! " అన్నాను..ప్రక్కరోజుకే దీక్షావస్త్రాలు తీసుకొచ్చుకున్నది..శ్రీ స్వామివారి సమాధి వద్ద ఉంచిన దీక్షా మాలలు మెడలో ధరించింది..అత్యంత నిష్ఠతో దీక్ష కొనసాగించింది..చివరగా అందరు భక్తులతో పాటు అగ్నిగుండం లోంచి నడచి వచ్చి..శ్రీ స్వామివారి సమక్షం లో దీక్ష విరమించింది..


ఆ యువతి పేరు కరిష్మా..ఆవిడకూడా ముస్లిమే..


"ప్రసాద్ గారేనా..స్వామీ నేను స్వామివారి సమాధి మీద పరచుకోవడానికి వస్త్రాన్ని ఇద్దామనుకుంటున్నాను..మీరు తీసుకుంటారా..?" అని ఒకావిడ ఓ సంవత్సరం క్రితం ఫోన్ చేసింది..


"అమ్మా..మీరు భక్తితో సమర్పించేది వస్త్రమైనా పర్లేదు..తీసుకుంటాము.." అన్నాను..


"చాలా సంతోషం స్వామీ..మీకు అనేక కృతజ్ఞతలు.." అన్నది..


ఆ ప్రక్కరోజు ఉదయమే స్వామివారి మందిరానికి వచ్చి, తాను తెచ్చిన వస్త్రాన్ని అర్చకస్వామి చేతికిచ్చి..స్వామివారి విగ్రహం దగ్గర నిలబడి..శాస్త్రోక్తంగా అర్చన చేయించుకున్నది..వెళ్లేముందు నా దగ్గరకు వచ్చి..అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో కనుక్కుని..తన వీలు చూసుకొని..ఇక్కడ అన్నదానం చేస్తానని చెప్పి..ఆరోజు తన తరఫున అన్నదానం లో ఒక స్వీట్ చేయించమని అడిగి..అందుకయ్యే ఖర్చును..మేము వద్దని వారిస్తున్నా వినకుండా నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది..


ఆ తరువాత చాలా సందర్భాలలో స్వామివారికి పూలమాలలు పంపడమో..లేదా...అన్నదానం కోసం విరాళం ఇవ్వడమో చేస్తూనే ఉన్నది..


ఈ యువతి పేరు అష్రాఫ్ జాన్..ముస్లిమే..


ఈ ముగ్గురిలోనూ సారూప్యత ఏమిటంటే..వీళ్లకు శ్రీ స్వామివారంటే అత్యంత భక్తి..విశ్వాసం..శ్రీ స్వామివారు కోరుకునేది కూడా ఆ రెండే..మతాన్ని కాదు.


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

శివాలయంలో ప్రసాదం

 ప్ర: శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకు రారాదని అంటారు. ఎందుకు????


జ:'ప్రసాదం' అంటే అనుగ్రహం. శివదర్శనంతో, అర్చనతో అనుగ్రహం సంప్రాప్తమవుతుంది. అయితే వస్తురూపేణ ఉండే నిర్మాల్యం మాత్రం తీసుకురారాదు. కానీ అన్నిచోట్లా ఈ నియమమే వర్తించదు...


మహాశివభక్తుడైన 'చండే(డ్రే)శ్వరుడు' అనే ఒక దేవత తన తపస్సుకి ఫలంగా 'శివనిర్మాల్యం' పై అధికారాన్ని వరంగా సంపాదించుకున్నాడు. అందుకే ఆ నిర్మాల్యం అతడికే చెందాలి. ఆ కారణంచేతనే మనం ఇంటికి తీసుకురారాదు...


శివలింగం పై నుండి వచ్చే తీర్థాన్ని మనం సేవించవచ్చు, కానీ గర్భగుడి ప్రాకారం బైట 'నాళం' (తూము) ద్వారా జారే తీర్థాన్ని మాత్రం సేవించరాదు. దానిపై కూడా చండేశ్వరునిదే అధికారం. అది అతడి సొత్తు. అయితే జ్యోతిర్లింగాలు (కాశి, శ్రీశైలం మొదలైనవి) ఉన్నచోట్ల మాత్రం శివ నిర్మాల్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు....


 స్ఫటిక, బాణలింగాలున్న చోట కూడా తీసుకోవచ్చు. చండేశ్వర ప్రతిష్ట లేని ఆలయాల లోనూ గ్రహించవచ్చు...


 ఇంకా స్వయంభూ (అరుణాచలం, కాళహస్తి - వంటివి) లింగములు వద్ద, సిద్ధ ప్రతిష్టిత లింగముల వద్ద నిర్మాల్యాన్ని స్వీకరించవచ్చు.

కొన్ని శైవాగమాల ప్రకారం నివేదనల్లో 'చండభాగం' అని ఉంటుంది. అలా ఉన్న ఆలయాల్లో శివప్రసాదాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు...

ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదు

 ఏ దేవాలయంలో నుండి అయినా ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదు. దేవాలయంలో పెట్టిన ప్రసాదం అక్కడే స్వీకరించి రావాలి. అసలు ప్రసాదమంటేనే కొద్దిగా పెట్టబడుతుంది. దోసిళ్ళనిండా ఇంతింత పెట్టేది ప్రసాదం అనబడదు. కుటుంబపోషణకు ధనసంచయనం చేసినట్లుగా...  దేవాలయం నుండి తనవారికోసమంటూ ప్రసాదాన్ని (సంచయనం) సేకరించుకొని ఇంటికి తెచ్చుకోవటం కూడదు. 


దీని వెనుక ఒక సూచన ఉన్నది. 

ఎంత తన భార్యాబిడ్డలైనా, ఎంతటి దగ్గరి వ్యక్తులైనా కూడా వారి వారి ఆధ్యాత్మిక ప్రయాణం వారివారి కర్మప్రారబ్దాన్ని బట్టే ఉంటుంది కానీ ఎవరూ కూడా మరొకరికి జన్మాంతరంలో మోక్షాన్ని ఇప్పించలేరు. ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి ప్రయాణం వారిదే. ఆధ్యాత్మికత కలిగేలా ప్రబోధించగలం కానీ తత్పర్యవసానమైన మోక్షం కలిగేలా చేయలేము. *గుఱ్ఱాన్ని నీటివరకూ తీసుకువెళ్ళగలం కానీ అది నీరు త్రాగేలా చేయలేము.* అది నీరు త్రాగాలనుకుంటేనే త్రాగుతుంది. *ఈ ఆధ్యాత్మికత కూడా అంతే*


ఈ విషయాన్ని సూచిస్తూ ఎవరికివారు దేవాలయానికి వెళ్ళి వారి వంతు ప్రసాదాన్ని పొందాలని మన పెద్దలచేత చెప్పబడింది.


*ప్రతి ఒక్కరినీ ఆధ్యాత్మికతవైపు మళ్ళించటానికే మనవారు ప్రసాదాన్ని ఇంటికి తెచ్చూకోకూడదని చెప్పారు.*

. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 31

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 31  / Sri Devi Mahatyam - Durga Saptasati - 31 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 9*

*🌻. నిశుంభ వధ - 1 🌻*


1-2. రాజు (సురథుడు) పలికెను: మహాత్మా! రక్తబీజవధ విషయంలో దేవి చేసిన మహాకార్యాన్ని గూరించి మీరు ఇప్పుడు నాకు తెలిపింది విచిత్రమైనది.


3. రక్తబీజుడు కూల్పబడిన పిదప మిక్కిలి కుపితులైన శుంభ నిశుంభులు ఏమి చేసారో ఇంకా వినగోరుతున్నాను.

 

4-5. ఋషి పలికెను : రక్తబీజుడు కూల్పబడుటను, యుద్ధంలో ఇతరులు కూడా హతులవడాన్నీ, విని శుంభాసురుడు నిశుంభుడు అపారమైన కోపం పొందారు.


6-7. ఆ మహాసైన్యం తెగటార్చబడడం చూసి రోషపూరితుడై అసుర సేనలలో ముఖ్యులతో నిశుంభుడు వేగంగా యుద్ధానికి వెళ్ళాడు. అతని ముందూ, వెనుక, ప్రక్కల మహాసురులు కోపంతో పెదవులను కొరుకుతూ దేవిని చంపడానికి నడిచారు.


8-9. మాతృకలతో యుద్ధం చేసి, పిదప కోపంతో చండికను వధించడానికి, మహావీర్య సంపన్నుడైన శుంభుడు స్వసైన్యపరివేష్టితుడై బయలుదేరాడు. అంతట దేవికి, శుంభ నిశుంభులకూ మహాయుద్ధం ప్రారంభమయ్యింది. వారు మేఘాల వలే అత్యుగ్రమైన శరవర్షాన్ని ఆమెపై కురిపించారు.


10. చండిక వారుప్రయోగించిన బాణాలను తన బాణ సమూహాన్ని త్వరితంగా త్రుంచివేసి, ఆ అసురేశ్వరుల అంగాలను తన శస్త్ర సమూహంతో కొట్టింది.


11. నిశుంభుడు ఒక పదను గల ఖడ్గాన్ని, మెరుస్తున్న డాలును తీసుకుని దేవి యొక్క ఉత్తమవాహనమైన సింహాన్ని తలపై కొట్టాడు.


12. వాహనాన్ని కొట్టడంతోనే దేవి నిశుంభుని ఆ ఉత్తమ ఖడ్గాన్ని ఒక వాడి బాణంతో త్రుంచివేసి, అతని డాలును, ఎనిమిది చంద్రబింబాలు గల దానిని, కూడా త్రుంచివేసింది.


13. డాలును ఖడ్గాన్ని ఛేదింపబడడంతోనే ఆ అసురుడు బల్లెమొకటి ప్రయోగించాడు. తన మీదికి వస్తున్న ఆ బల్లెమును ఆమె తన చక్రంతో రెండుగా ఖండించింది.


14. పొంగిపొరలుతున్న కినుకతో నిశుంభాసురుడు అంతట ఒక శూలాన్ని తీసుకున్నాడు. అది వస్తుండగా దానిని కూడా దేవి పిడికిడి పోటుతో చూర్ణంచేసింది.


15. అంతట అతడు గదను ఆడిస్తూ చండికపై దానిని విసిరింది. దానిని ఆమె త్రిశూలంతో ముక్కలు చేయగా అది బూడిదైపోయింది.


16. ఆ దానవశ్రేష్ఠుడు అంతట గండ్ర గొడ్డలితో తనమీదికి వస్తుండగా దేవి బాణసమూహాన్ని ప్రయోగించి అతన్ని భూమిపై పడజేసింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

శివ ప్రసాదం

 🌹🌸🌺🥀🌾🌷💐


*శివ ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదా?*


*తెచ్చుకోవచ్చు. అయితే శివునికి నివేదన చేసిన సమస్తం చండీశ్వరునికి చెందుతుంది.*


*వీటిలో ఆలయం లోపల స్వీకరించే తీర్థప్రసాదాలపైనా నిషేధం లేదు. నిరభ్యంతరంగా తీసుకోవచ్చు*


*ఇంటికి తెచ్చుకోవాలనుకున్నప్పుడుమాత్రం చేతితో చప్పట్లు చరచాలి. అది చండీశ్వరుని అనుజ్జ కోరడానికి సంకేతం.*


*అప్పుడు శివప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. తినేందుకు ఇచ్చిన ప్రసాదం అయితే కళ్లకద్దుకుని భుజించి తీరాలి.*


*శివప్రసాదం మనకు ఇహపరాలు రెంటినీ ఇస్తుంది. అసలు శివునికి నైవేద్యం పెట్టకుండా ఆహారం తీసుకుంటే అది శవభక్షణతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.*


                  భక్తి

              M.s.s.k