8, డిసెంబర్ 2020, మంగళవారం

మ్రుత్తికాతిలకం

 🎈🍁🎈🍁🎈🍁🎈🍁🎈మ్రుత్తికాతిలకం🎈🍁🎈

శాస్త్రాలలో మ్రుత్తికా తిలకానికి

ప్రాధాన్యత ఇవ్వబడింది. తిలకానికి(బొట్టుకు) తీర్థ స్థలాలోని మ్రుత్తిక మహిమాన్విత మైనదిగా పరిగణించబడింది. మ్రుత్తిక ఆవిధంగా లాభదాయకం అయినది. పూలు, పళ్ళలో వనస్పతులలో ఉండే గుణాలు మూలతహ మట్టిలోనే దాగి ఉంటాయి. శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు కూడా, ఫలాలు, పుష్పాలు, వ్రుక్చాలు, మొక్కలు లాగానే ప్రుథ్వినుండి కూడా నిరంతరం గా బాష్పం (ఆవిరి) బయటకు వస్తూ ఉంటుంది. అది శరీరానికి ఉపయోగపడే పోషకతత్వాలతో(ధాతువులు తో) నిండి ఉంటుంది.

         అందువల్ల నే ఆరోగ్య నియమాలలో ప్రుథ్వీసామీప్యం కూడా ఒక విశిష్ట నియమంగా ఉన్నది. మట్టి విషనాశకం. దీని ద్వారా అనేక విషాలు విరుగుడు అవుతాయి. వ్రణాలు, తామర, గజ్జి, దురదలు వంటి చర్మరోగాలు దూరమవుతాయి. ఇంకా జీర్ణకోశం లో అల్సర్లు, కడుపు నొప్పి, మలబద్ధకం, ప్రేగులలో నొప్పి, అతిసారం, మూలశంక, మూత్రాశయ వ్యాధులు, కాలేయ  సంబంధమైన వాపులు, గుండె దడ, గర్భాశయ వ్యాధులు మట్టి ద్వారా మాయమవుతాయి. అన్ని విధాలైన జ్వరాలు, ఉబ్బసం, సన్నిపాతం, పిచ్చి, నేత్రాలు, దంతాలు, చెవులకు సంబంధించిన వ్యాధులు లోను స్వప్న దోషాలు, వీర్యగతమైన వ్యాధులు, ప్రదరం వంటి స్త్రీల వ్యాధులకు మట్టి ఉత్తమైన ఔషధిగా భావించబడుతుంది. మట్టి కేశవ్రుద్ధికి అత్యంత ఉపయోగకరమైనది. పోషకమైన పదార్ధము కూడా. వైజ్ఞానికంగాను వ్యాధుల నివారణకు ఉపయోగ కరంగానూ ఉన్న మట్టి ముఖ్యంగా తీర్థాలలోని మట్టిలో సాత్వికతను పెంచే గుణం ఉండబట్టి అన్నివిధాలా ఉపయోగపడుతుంది.

🍁🎈🍁🎈🍁🎈🍁🎈



🌳🌷🌳🌷🌳🌷🌳🌷🌳కుంకుమ తిలకం🌷🌳🌷

పసుపు గుండకి నిమ్మరసాన్ని చేర్చి కుంకుమను తయారు చేస్తారు. ఈ కలయికలో పచ్చటి పసుపు ఎరుపు రంగుగా మారి కుంకుమ తయారవుతుంది. ఆయుర్వేదంలో పసుపు కు సంయోజక గుణాధిక్యతను గుర్తించారు. తెగిన గాయాలకు పసుపు బాగా పనిచేస్తుంది. కాయగూరలు లో కూడా కేవలం రంగుకోసమే కాకుండా దీనికి గల సంయోజక గుణవిశేషం చేతనే పసుపు ను వాడుతున్నారు. ఇది చర్మశుద్ధికి విశేష లాభదాయకం ఉంటుంది. కుంకుమ తిలకంలో ఈ రెండు లాభాలు చేరటంవల్లనే కుంకుమ వాడకం అత్యంత ఆవశ్యకం.

🌷🌳🌷🌳🌷🌳🌷🌳

కామెంట్‌లు లేవు: