8, డిసెంబర్ 2020, మంగళవారం

ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదు

 ఏ దేవాలయంలో నుండి అయినా ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదు. దేవాలయంలో పెట్టిన ప్రసాదం అక్కడే స్వీకరించి రావాలి. అసలు ప్రసాదమంటేనే కొద్దిగా పెట్టబడుతుంది. దోసిళ్ళనిండా ఇంతింత పెట్టేది ప్రసాదం అనబడదు. కుటుంబపోషణకు ధనసంచయనం చేసినట్లుగా...  దేవాలయం నుండి తనవారికోసమంటూ ప్రసాదాన్ని (సంచయనం) సేకరించుకొని ఇంటికి తెచ్చుకోవటం కూడదు. 


దీని వెనుక ఒక సూచన ఉన్నది. 

ఎంత తన భార్యాబిడ్డలైనా, ఎంతటి దగ్గరి వ్యక్తులైనా కూడా వారి వారి ఆధ్యాత్మిక ప్రయాణం వారివారి కర్మప్రారబ్దాన్ని బట్టే ఉంటుంది కానీ ఎవరూ కూడా మరొకరికి జన్మాంతరంలో మోక్షాన్ని ఇప్పించలేరు. ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి ప్రయాణం వారిదే. ఆధ్యాత్మికత కలిగేలా ప్రబోధించగలం కానీ తత్పర్యవసానమైన మోక్షం కలిగేలా చేయలేము. *గుఱ్ఱాన్ని నీటివరకూ తీసుకువెళ్ళగలం కానీ అది నీరు త్రాగేలా చేయలేము.* అది నీరు త్రాగాలనుకుంటేనే త్రాగుతుంది. *ఈ ఆధ్యాత్మికత కూడా అంతే*


ఈ విషయాన్ని సూచిస్తూ ఎవరికివారు దేవాలయానికి వెళ్ళి వారి వంతు ప్రసాదాన్ని పొందాలని మన పెద్దలచేత చెప్పబడింది.


*ప్రతి ఒక్కరినీ ఆధ్యాత్మికతవైపు మళ్ళించటానికే మనవారు ప్రసాదాన్ని ఇంటికి తెచ్చూకోకూడదని చెప్పారు.*

కామెంట్‌లు లేవు: